Dictionary

Searchable glossary of Vedāntic terminology from traditional sources.

అధ్యక్ష अध्यक्ष (adhyakṣa)

Formed from the roots अधि (adhi—above) + अक्ष (akṣa—eye/seeing). Literally, it means "one who sees from above," or a Supervisor. Philosophically, it implies a Spectator or Witness—an entity that remains present as an observer without becoming entangled or "joining hands" with the action. This refers to nothing other than the unconditioned Supreme Soul (निरुपाधिक परमात्मा, nirupādhika paramātmā). It is neither the Doer (कर्ता, kartā) nor the Enjoyer (भोक्ता, bhoktā); it is solely the Witness (साक्षी, sākṣī). Reference: मयाध्यक्षेण प्रकृतिः (mayādhyakṣeṇa prakṛtiḥ — "Under My supervision, Nature functions...").

Telugu original

అధ్యక్ష : అధి+అక్ష - పై నుంచి చూచేవాడే Supervisor అని అక్షరార్ధం. దేనితో చేయి కలపకుండా సాక్షిభూతంగా ఉన్నదని Spectator witness అర్థం. ఏదోగాదది నిరుపాధికమైన పరమాత్మ. అది కర్తగాదు భోక్తగాదు సాక్షి. మయాధ్వక్షేణ ప్రకృతి:

Vedānta Paribhāṣā Vivaraṇa
అధ్యవసాన / అధ్యవసాయ ()
Telugu original

అధ్యవసాన / అధ్యవసాయ : నిశ్చయాత్మకమైన జ్ఞానం. ఆత్మజ్ఞాన నిష్ఠ. A strong conviction regarding the supreme self. వ్యవసాయమని కూడా దీనికే నామాంతరం. వ్యవసాయాత్మికా బుద్ధిః. ఇది శ్రవణ మననాల తరువాత కలిగే మూడవ దశ. జ్ఞాన నిష్ఠ.

Vedānta Paribhāṣā Vivaraṇa
అధ్యాహార ()
Telugu original

అధ్యాహార : వాక్యంలో శబ్దమొకటి లోపిస్తే దానివల్ల వాక్యార్థం బాగా బోధపడకుంటే సమకూర్చుకొనే మరొక శబ్దానికి Supply అధ్యాహారమని పేరు. పదాకాంక్షా నివర్తకః అధ్యాహారః

Vedānta Paribhāṣā Vivaraṇa
అధ్యాస / అధ్యారోపః ()
Telugu original

అధ్యాస / అధ్యారోపః : Super imposition. ఒక పదార్ధం మీద మరొక పదార్ధాన్ని తెచ్చి పడవేయటం. అందులో మొదటిది వస్తువు. Substance. రెండవది వస్తువుకాదు. దాని ఆభాస. Appearance. జలంమీద తరంగ బుద్బుదాదులు - సూర్యప్రకాశంమీద జలమూ (Mirage) ఇలాంటిదే. ప్రస్తుత మీ అనాత్మ ప్రపంచ మంతా ఆత్మచైతన్యం మీద అధ్యారోపమయిన దంటారు అద్వైతులు. ఆత్మ అధిష్ఠానమైతే Basis అనాత్మ అధ్యారోపితం. అనాత్మ ఆత్మమీదనే గాదు. మొదట ఆత్మ అనాత్మమీద అయింది. దాని కహంకారమని పేరు. దేహాత్మాభిమానమంటేఇదే. తరువాత మరలా అనాత్మ ఆత్మమీద అయింది. మమకారమని పేరు దీనికి. ఇదంతా వాస్తవంగా Actual జరగలేదు మరలా. మన భావనే Notional అంటారు అద్వైతులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అధ్యాత్మ/అధిభూత/అధిదైవ ()
Telugu original

అధ్యాత్మ/అధిభూత/అధిదైవ : మనస్సుకూ శరీరానికీ సంబంధించినది అధ్యాత్మ. బాహ్యంగా కనిపించే భౌతిక పదార్థాలకు చెందినది అధిభూత. మనకతీతమైన ప్రకృతి శక్తులకు చెందినది అధిదైవ.

Vedānta Paribhāṣā Vivaraṇa
అధ్యాత్మ విద్యా ()
Telugu original

అధ్యాత్మ విద్యా : కేవల చిద్రూపమైన ఆత్మకు సంబంధించినదని కూడా దీనికర్థం. విద్యా అధ్యాత్మ విద్య అంటే ఆత్మజ్ఞానం Philosophy knowledge regarding the self or ultimate reality.

Vedānta Paribhāṣā Vivaraṇa
అధికార/అధికృత/అధికారీ ()
Telugu original

అధికార/అధికృత/అధికారీ : ఒక విషయాన్ని చర్చిస్తున్న ఘట్టం. Topic. ఒక విషయాన్ని అర్ధం చేసుకోటానికి లేదా సాధించటానికి కావలసిన యోగ్యత Competancy. అది రెండు భాగాలు. ఒకటి సామర్థ్యం-మరొకటి అర్థిత్వం-The equipment and inquisitiveness. మొదటిది మానవుడి శరీర నిర్మాణం. రెండవది దాని నాలంబనం చేసుకొని సాధించే ఇచ్ఛ - ప్రయత్నం. రెండూ ఒనగూడినప్పుడే ఫలసిద్ధి. ఇవి రెండూ ఉన్నవాడధికారి. competent person వాడే అధికృతుడు Admitted of the study.

Vedānta Paribhāṣā Vivaraṇa
అధికరణ ()
Telugu original

అధికరణ : ఒక విషయాన్ని చర్చించే సందర్భం Discours. ఇందులో ఐదు అంశాలు తప్పక ఉండాలి. విషయం, విశయం, సంగతి, ఆక్షేపం, సమాధానం. అధిష్ఠాన : ఆధారం, ఆస్పదం. Basis. దేనిమీద ఆరోపణ జరుగుతుందో అది. అధిష్ఠానమెప్పుడూ వస్తువే. అంటే సత్యమే. ఆరోపితమే ఆభాస. అదికూడా వస్తువుకు అన్యం కాదు. వస్తువే మరో రూపంలో భాసిస్తే దానికాభాస అని పేరు. వస్తువుగా అది సత్యం - ఆభాసగా అసత్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
()
Telugu original

అ : వర్ణ సమామ్నాయంలో ఇది మొట్టమొదటి వర్ణం. ఒక శబ్దానికి ముందు చేరితే ఇది దాని వ్యతిరేకార్థాన్ని చెబుతుంది. అది లేకపోవటమైనా కావచ్చు. కాకపోవటమైనా కావచ్చు. అవివేకమంటే వివేకం లేకపోవటం, అవిచారమంటే విచారం లేకపోవటం. అలాగే అకాయ మవ్రణమంటే కాయం కానిదని, వ్రణం కానిదని అర్థం. అంటే స్థూలసూక్ష్మశరీరాలు రెండూ కాని ఆత్మచైతన్యం. అ అనేది ఓంకారంలో మొదటి అక్షరం కూడా. అక్కడ అది స్థూల శరీరానికీ, జాగ్రదవస్థకూ, విశ్వుడనే జీవుడికీ సంకేతం. త్రిమూర్తులలో బ్రహ్మకు కూడా ఇది సంకేతమే. పోతే ప్రత్యభిజ్ఞా దర్శనంలో అకారం ప్రకాశ రూపమైన శివ తత్త్వానికైతే హకారం విమర్శరూపమైన శక్తితత్త్వానికి ప్రతీక. రెండూ బిందువు ద్వారా ఏకమైతే అహమ్‌ అనే జీవభావమేర్పడిందని వారి మాట. × అక : కమ్మంటే సుఖం. దానికి ముందు అ చేరింది కాబట్టి అకమంటే సుఖం కానిది, దుఃఖమని అర్థం. న+అక. అకం కూడా కానిది నాకమంటే. మరలా దుఃఖం కానిది సుఖమనే భావం. అది ధర్మపురుషార్థంలో స్వర్గమైతే బ్రహ్మ పురుషార్థంలో మోక్షం. × అకల : కల కళ అంటే భాగం అంశ Part అని అర్థం. ప్రాణం దగ్గరినుంచి నామం వరకు పదహారు కళలను వర్ణించాయి ఉపనిషత్తులు. వీటికే షోడశకళలని పేరు. పూర్ణమైన ఆత్మచైతన్యం వస్తుతః నిరవయవ Indivisible మైనా ఈ షోడశ కళలతో అది సావయవంగా Divisible భాసిస్తున్నది. అప్పుడది సకలం. అదే మనకు జ్ఞానోదయమై ఇవి ఆ పురుష చైతన్యంలో కలిసిపోతే దానికప్పుడు అకలమని పేరు. ఏ కళలూ అవయవాలూ Parts లేని శుద్ధమైన నిరాకారమైన చైతన్యమని తాత్పర్యం. × అకర్మ : లౌకిక శాస్త్రీయ కర్మలేవీ లేకపోవటం. ఏ పనీ పెట్టుకోకపోవటం. నిష్కర్మ అని కూడా అనవచ్చు. కర్మ అంటే చలనం. సర్వవ్యాపకమూ నిరాకారమైన ఆత్మచైతన్యం చలించదు గనుక అకర్మ అంటే చైతన్యమని, జ్ఞానమని కూడా అర్థమే. అనాత్మ అంతా కర్మ అయితే దానికి భిన్నమైన జ్ఞాన మకర్మ. కర్మణ్య కర్మ యః పశ్యేత్‌. × అకామ : కామమంటే ఒకటి పొందాలనే వాంఛ-కోరిక. అది నాకు విజాతీయ మొకటి ఉందని భావించినప్పుడే ఏర్పడుతుంది. అంతా ఆత్మస్వరూపమే నని గుర్తించి నప్పుడు కామ్యమైన పదార్థమే లేదు గనుక అకామమే. ఆత్మకు అకామమని పేరు. నిష్కామమన్నా అదే అర్థం. × అకాల : కాలం గాని కాలం. అనుచితమైన కాలమని అర్థం. కాలాని కతీతమైనది కూడా అకాలమే. × అకార్య : కార్యం కానిది. తయారైనది కాదు. స్వతస్సిద్ధమైనదని భావం. అది జ్ఞానస్వరూపమైన ఆత్మ తప్ప మరేదీ కాదు. × అకాయ : కాయమంటే శరీరం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో ఏదైనా కావచ్చు. కాని ఈశావాస్యంలో అకాయమవ్రణమనే చోట అకాయమంటే సూక్ష్మ శరీరమని అర్థం చెప్పారు కాయ శబ్దానికి. ఇంతకూ అకాయమంటే లింగ శరీర వర్జితమైన ఆత్మ అని అర్థం. × అకుతోభయ : దేనివల్లనూ భయం లేకుండా బ్రతకటం. తనకు భిన్నమైనది ఎదురైతేనే భయం. ఆత్మ తప్ప అనాత్మే లేదని సిద్ధాంతం కాబట్టి ఆత్మజ్ఞాని అకుతోభయుడు. × అకృత : కృతమంటే తయారైనది. జ్ఞేయమైన పదార్థాలన్నీ లోకంలో తయారయ్యేవే. పోతే వాటికి సాక్షి అయిన చైతన్యమలా తయారయ్యే పదార్థం కాదు. కాబట్టి దాని కకృతమని పేరు. నిత్యసిద్ధం - స్వతస్సిద్ధమని భావం. × అకృతాభ్యాగమ : మనమొక కర్మ అది సుకృతం కానీ దుష్కృతం కానీ ఎప్పుడూ చేయకపోయినా దాని ఫలితం వచ్చి నెత్తిన పడితే దానికి అకృతాభ్యాగమ మని పేరు. కారణం లేకుండా కార్యమేర్పడటమని భావం. అది అశాస్త్రీయం. హేతువాదానికి నిలవదు. కనుకనే సుఖమో, దుఃఖమో ఇప్పుడు జీవుడు అనుభవిస్తున్నాడంటే పూర్వమెప్పుడో దానికి దోహదమైన కర్మ వాడు చేసి ఉంటాడని వేదాంత సిద్ధాంతం. × అకృతకర్తృ : అసిద్ధమైన దానిని సిద్ధం చేసేది. అంతకుముందు లేనిదానిని సాధించేది శాస్త్రం. అంతకుముందే ఉంటే సాధించనక్కరలేదు. అప్పుడు శాస్త్ర మనువాద (ఉన్న దానిని చెప్పేది) మవుతుందేగాని విధానం (క్రొత్తగా విధించేది) కాదు. కాకుంటే ప్రామాణ్యం Authority లేదు దానికి. × అక్రతు : క్రతువు లేనిది. క్రతువంటే యాగం కాదిక్కడ. సంకల్పం అధ్యవసాయం లేదా నిశ్చయమని అర్థం. క్రతుమయః పురుషః మానవుడంటే వాడి నిశ్చయమే Conviction. అది లేని పక్షంలో అక్రతు. క్రతువంటే కామం, కోరిక అని కూడా ఒక అర్థం. తమ క్రతుః పశ్యతి. ఏ కామమూ లేని నిష్కామమైన మానవుడి బుద్ధికే గోచరిస్తుంది ఆత్మ స్వరూపమని భావం. × అక్రమ : ప్రపంచ సృష్టి విషయంలో ఆకాశం నుంచి మొదలయిందా, తేజస్సు నుంచి మొదలయిందా అని క్రమం పాటించనక్కరలేదు. అసలు సృష్టే జరగలేదు. ఆభాస అని సిద్ధాంతమయినప్పుడు ఒక క్రమమేముంది? అక్రమమైనా క్రమమే నన్నారు అద్వైతులు. × అఖండ : ఖండం కానిది. ఖండమంటే శకలం. తునక. విభాగం. అలాటి విభాగం లేని అవిభక్తమైన పూర్ణమైన పదార్ధం. అది నిరాకారమూ వ్యాపకమైన ఆత్మతత్త్వమొక్కటే. అది ఎలా ఉందో అలాగే మనసులో వృత్తి లేదా ఆలోచన ఏర్పడితే దానికి అఖండాకార వృత్తి అని పేరు. × అఖ్యాతి : ఖ్యాతి అంటే బయటపడి కనిపించటం. అలా బయట పడకుంటే అఖ్యాతి. ఒక దానిమీద మన భ్రాంతి మూలంగా మరొకటి అధ్యాస అయినప్పుడు ఆ మొదటిది బయట పడకపోతే అలాంటి దానికి అఖ్యాతి Unapparehension అని సంజ్ఞ. మీమాంసకులది అఖ్యాతి వాదం. × అఖిల : ఖిలమన్నా ఖిల్యమన్నా ఒక కరడుగట్టిన ముద్ద. పిండం. ఒక శకలం. అది కానిది అఖిలం. అవిభక్తం, పరిపూర్ణమని భావం. అకలమంటే ఏమిటో అదే అఖిలమన్నా Indivisible whole. × అగతి : అనన్యప్రోక్తే గతి రత్ర నాస్తి. గతి అంటే ఇక్కడ జ్ఞానం. ఆత్మజ్ఞానం. అపరోక్షంగా బ్రహ్మతత్త్వాన్ని అనుభవించే ఆచార్యుడు బోధ చేస్తే అగతి లేదు. అంటే ఆత్మజ్ఞానం కలగకుండా పోదని తాత్పర్యం. × అగతిక : గతి అంటే ఇక్కడ మార్గం. మరొక మార్గం లేదు. గత్యంతరం Alternative లేదని భావం. × అగమ్య : గమ్యం కానిది. గమ్యమంటే చేరగలిగినది. పొందగలిగినది. పొంద లేనిది అగమ్యం. ఆత్మచైతన్యం. అది మన స్వరూపమే గనుక మనకు గమ్యంకాదు. × అగ్ర : కొస-చివఱ. అంతేకాదు. కర్మఫలమని అర్థం చెప్పారు భాష్యకారులు. సమగ్రం ప్రవిలీయతే-అగ్రంతో సహా అంటే ఫలంతో సహా లయమవుతుందట కర్మ. కర్మకు చివరి దశ ఫలానుభవమే గదా. కనుక అగ్రమంటే ఫలమని చెప్పారు. × అగ్య్ర : అగ్రమంటే మొన - బాగా మొనదేరినది Sharpened అని భావం. దృశ్యతే త్వగ్య్రయా బుద్ధ్యా - ఆత్మతత్వమెంత అగోచరమైనా బాగా పదునెక్కిన బుద్ధితో దర్శించవచ్చునట. అగ్య్రమంటే పదునైన అని అక్కడ అర్థం. × అగ్రహణ : గ్రహణమంటే పట్టుకోవటం. పట్టుకోలేకపోతే అగ్రహణం. సుషుప్తిలో ఉన్నది అగ్రహణం. మన స్వరూపమక్కడ గుర్తులేదు. × అగ్రాహ్య : గ్రాహ్యం కానిది. అనగా ఏ ఇంద్రియంతోనూ పట్టుకోరానిది. Incomprehensible ఆత్మతత్వం. యత్త దద్రేశ్య మగ్రాహ్యమ్‌. × అగోచర : గోచరం కానిది. గో అంటే ఇంద్రియం లేదా జ్ఞానం. దాని పరిధిలో ఉంటే అది గోచరం Object to Impurity. అలా కాకుంటే అగోచరం. ఇంద్రియాతీత మని భావం. × అగోత్ర : గోత్రం లేనిది ఆత్మతత్త్వం. గోత్రమంటే ఇక్కడ అన్వయమన్నారు. అన్వయమంటే మరి ఒక పదార్థంతో సంబంధం. ఆత్మకన్నా భిన్నమైన పదార్థమే లేదన్నప్పుడిక సంబంధమనే ప్రశ్నేముంది. ఎప్పుడూ అది అనన్వయమే. అగోత్రమే. × అఘ : పాపమని ఒక అర్థం. దోషం, కళంకమని ఒక అర్థం. మాలిన్యమని, లోపమని మరి ఒక అర్థం. sin defect Impurity. అవిద్యా కామకర్మలే పాపాలు. అవే అఘం. 'తే త్వఘం భుంజతే పాపాః' అవి వదలకుండా భుజిస్తే ఆ భుజించేది వారు అన్నం కాదు. పాపమేనట. × అఘాయు : అఘాయు రింద్రియారామః, పాప జీవనం, పాపపు బ్రతుకు బ్రతికే మానవుడని అర్థం. × అఘోర : ఘోరమంటే దారుణం. కర్కశం. కర్కశం కానిది అఘాెరం మృదువైనది. పంచభూతాలలో పృథివి కఠినమైతే జలం మృదువైనది. కనుక అఘాెరమనే మాట పంచ భూతాలలో జలానికి సంకేతం. ఈశ్వరుడు పంచముఖుడు. ఆ ముఖాలేవో కావు. పంచభూతాలే. అందులో తత్పురుషమాకాశం. ఈశానం వాయువు. వామదేవం తేజుస్సు. అఘాెరం జలం, సద్యోజాతం పృథివి. ఆకాశాది భూతపంచకమే ఈశ్వరుని ముఖపంచకం. తన్ముఖంగా చరాచర సృష్టి చేస్తున్నాడని అంతరార్థం. × అఘటిత ఘటనా : ఒకటి కుదరకపోయినా కుదర్చటం. చెల్లకున్నా చెల్లేలాగా చేయటం. × అజ్ఞ అజ్ఞాన : జ్ఞానం లేనివాడజ్ఞుడు. Ignorant. జ్ఞానమంటే ఆత్మజ్ఞానమే. అనాత్మ జ్ఞానం జ్ఞానం కాదు. అజ్ఞానమే నంటారు వేదాంతులు. ఎందుకంటే అది విశేష జ్ఞానం. Knowledge of particulars. అందులో పరిపూర్ణత లేదు. పరిష్కారం లేదు. కనుక ఆయా విషయాలకు చెందిన మానవుడి జ్ఞానమంతా అజ్ఞానమే. ఇలాంటి అజ్ఞానమున్నంతవరకూ వాడజ్ఞుడే. × అజ్ఞేయ : జ్ఞేయం కానిది. జ్ఞానానికి గోచరించనిది ఆత్మ. అది అనాత్మలాగా గోచరం కాదు జ్ఞానానికి. కారణం అది జ్ఞాన స్వరూపమే. × అజ్ఞాత జ్ఞాపక : తెలియని విషయాన్ని తెలిపేది.గుర్తు చేసేది. శాస్త్ర ప్రమాణం. ప్రత్యక్షానుమానాలకు గోచరం కాని బ్రహ్మతత్త్వాన్ని మనకు గుర్తు చేసేది అధ్యాత్మ శాస్త్రమే. × అజ్ఞాత చర్యా : ఎవరికీ అంతు పట్టకుండా తిరుగుతూ ఉండటం. ఆత్మజ్ఞాని ఎప్పుడూ అలాగే జీవిస్తాడు. లోకులతో వ్యవహరిస్తున్నా అతని బాహ్యమైన చేష్టలే గాని వాటినన్నింటినీ వ్యాపించి ఉన్న అతని స్వరూప జ్ఞానమెవరికీ ఇదమిత్ధమని గుర్తు చిక్కదు. అలా గూఢంగా చరించినప్పుడే వాడు జ్ఞాని. నేను జ్ఞానినని ప్రకటించు కొన్నప్పుడు కాదు. × అచర : చరం కానిది. చరమంటే చరించేది. కదిలేది. కదలనిదేదో అది అచరం. Static. స్థావరమని అర్థం. × అచల : చలించనిది. కదలనిది. స్థిరమైనది. ఆత్మతత్త్వం. అచలోయం సనాతనః × అచింత్య : చింతించటానికి లేదా మనసుతో ఊహించటానికి శక్యమైతే చింత్యం. ఊహ కతీతమైతే అచింత్యం. Unthinkable. × అచిత్‌ : చిత్‌ అంటే చైతన్యం. Consciousness. అది లేకున్నా కాకున్నా దాని కచిత్తని Insenscient or Unconscious అని పేరు. జడమని అర్థం. × అచీర్ణవ్రత : చీర్ణమంటే చరించిన ఆచరించిన. అచీర్ణ అలా ఆచరించని వ్రతం కలవాడు. వ్రతం పాటించనివాడు శ్రవణానికర్హుడు కాడు. × అచ్యుత : చ్యుతమంటే జాఱిపడినది. జాఱి పడకుంటే అది అచ్యుతం Unfallen ఆత్మ. అది తన స్వరూపస్థితి నుంచి ఎప్పుడూ చలించదు. పడదు. అది కూటస్థం Immovable. × అచేతన : చేతనమంటే జ్ఞానమున్న పదార్థం. జ్ఞానంలేని దచేతనం. Insenscient. జడమని అర్థం. × అచోద్య : చోద్యమంటే ప్రశ్నించదగినది. Questionable. అలా కానిది అచోద్యం. ప్రశ్నించే అవకాశం లేనిది. చోద్యమంటే ఒక పనికి పురమాయించటం కూడా. అలా పురమాయించరానిదేదో అది కూడా అచోద్యమే. × అజ : జ. జన్మించేది - అజ జన్మించలేనిది. Unborn. ఆత్మ. కారణముంటే దేనికైనా జన్మ. ఆత్మకు కారణం లేదు. అదే అన్నిటికీ కారణం. కనుక అది అజం. × అజరామర : జరా మరణములు లేనిది. జరామరణాలు స్థూల శరీర లక్షణాలు. అవి లేవంటే ఆత్మ స్థూల శరీరం కాదు. అశరీరం. అస్థూల మనణ్వహ్రస్వమని శాస్త్రవాక్యం. × అజగర వృత్తి : కదలకుండా పడిఉండే కొండచిలువ కజగరమని పేరు. అది నోరు తెఱచుకొని ఏది దగ్గరకు వస్తే దాన్ని తిని కడుపు నింపుకొంటుంది. అలా అప్రయత్నంగా లభించిన దానితో జీవనం గడుపుకొనే జ్ఞానికూడా అజగర వృత్తే - యదృచ్ఛాలాభ సంతుష్టుడని అర్థం. × అజహల్లక్షణ : ఒక మాటకు ముఖ్యార్థం చెల్లకపోతే లక్షణావృత్తిలో అర్థం చెప్పవలసి ఉంటుంది. Secondary sense. అది రెండు విధాలు. ఒకటి జహత్‌ అంటే ముఖ్యార్థాన్ని పూర్తిగా వదులుకోవటం-ఊరంతా పగలబడి నవ్వింది. ఇక్కడ ఊరికి బదులు ఊరిలో ఉన్న జనులని అర్థం చెప్పాలి. అలాకాక ఆ తెల్లది పరుగెడుతున్నదన్నప్పుడు తెల్లని గుఱ్ఱమది. అందులో తెలుపును వదిలేయకూడదు. దానితో సహా గుఱ్ఱమని అర్థం. ఇందులో మొదటిది జహత్తయితే రెండవది అజహత్తు. × అజా : జన్మలేనిది. అజ పుల్లింగమైతే ఇది స్త్రీ లింగం. ప్రకృతి అని అర్థం. ఈశ్వరుడెలా అజుడో ఈశ్వర ప్రకృతి కూడా అజమే. చైతన్యాన్ని ఆశ్రయించిన శక్తే గదా ప్రకృతి. కనుక శక్తి శక్తిమత్తత్త్వాలు రెండూ అజమే. నిత్యసిద్ధమే. అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం. ఈ శక్తి త్రిగుణాత్మకం. రజస్సత్త్వ తమస్సులే త్రిగుణాలు. అవి వరసగా ఎఱుపు తెలుపు నలుపు వర్ణాలు. అద్వైతులీ మూడూ వర్ణాలని గాక అలాంటి వర్ణాలుగల తేజో-బన్నభూత సూక్ష్మాలని వర్ణిస్తారు. గుణాలని భావించరు. మొత్తంమీద ప్రకృతి, మాయ, శక్తి అని సారాంశం. × అజాతవాద : ఏదీ జన్మించలేదనే సిద్ధాంతం. దీనినిబట్టి జీవ జగదీశ్వరులు ముగ్గురూ లేరు. లేకుంటే అవి ఎలా భాసిస్తున్నాయని అడిగితే అది వస్తువుకాదు. కేవల మాభాసే Appearance నంటారు వేదాంతులు. వస్తువే అలా భాసిస్తున్నది గనుక ఆభాసకు జన్మలేదు. వస్తువు స్వతస్సిద్ధం గనుక దానికీ జన్మలేదు. కాబట్టి ఆత్మానాత్మలు రెండూ అజాతమే. ఈ అజాత వాదానికి ప్రవర్తకుడు గౌడపాదులు. అద్వైత వాదానికిది మారు పేరు. × అజాయమాన : అజాయమానో బహుధా విజాయతే - జన్మించకుండానే అని అర్థం. జన్మించకుండానే అనేక రూపాలలో భాసిస్తున్నది అదే ఆత్మతత్త్వం. × అజావిపాల : అజ-మేక అని, గొఱ్ఱె అని అర్థం. మేకలను, గొఱ్ఱెలను కాచే వాడి కజావిపాలుడని పేరు. ఇది ఈ శబ్దానికి వాచ్యార్థమైతే కేవలం పామరుడు తెలివి తక్కువవాడని లక్ష్యార్థం. అసలైన ఆత్మ ఏదో గుర్తించక మహాపండితులమని భావించే వారందరూ అజావిపాలురతో సమానులని భావం. × అజాండ : అజ అంటే ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ. అండమంటే కోడిగ్రుడ్డు లాంటిది. బ్రహ్మాండమని అర్థం. The Cosmos. × అజాతి : జాతి అంటే జన్మ. జన్మలేనిది అజాతి. ఆత్మతత్త్వం. జాతి అంటే తార్కికులు చెప్పే సామాన్యం Genus. గోజాతి. అశ్వజాతి ఇలాంటిది. వ్యక్తులనేక మున్నప్పుడే జాతి చెప్పాలి. ఆత్మకు భిన్నమైన మరొక వ్యక్తే లేనప్పుడిక జాతేముంది. కనుక అది అజాతి. × అణు : సూక్ష్మమైన పంచభూతాంశం. పరమాణువని కూడా నామాంతరం. Atom. తన్మాత్రలని కూడా అంటారు వేదాంతులు. భూతమాత్రలే. Elements గాక అతిసూక్ష్మమైన పదార్థమేదైనా అణువే. Smallest Particle. అన్నిటికన్నా సూక్ష్మమైనది నిరాకారమైన ఆత్మచైతన్యం గనుక దాన్ని కూడా వేదాంతులణువని పేర్కొంటారు. ఏ షోణురాత్మా. × అణోరణీయాన్‌ : అణువుకంటే అణువైనది ఆత్మస్వరూపం. The subtlest. నిరాకారం గనుక అణువుతో కూడా పోల్చకూడదు. అణువు ఎంత సూక్ష్మమైనా నిరాకారమైనా అది మన జ్ఞానానికి విషయం Object. ఆత్మ విషయం కాదు. విషయి Subject. అందుకే దానికన్నా సూక్ష్మమని చెప్పటం. × అణువాద : పరమాణువే ప్రపంచ సృష్టికి కారణం. ఈశ్వరుడు కాదనే సిద్ధాంతం Atomic Theory. దీనికి మూలపురుషుడు కణాదుడు. వైశేషిక మతమని పేర్కొంటారు ఈ వాదాన్ని. వైశేషికులది ఆరంభవాదం. కార్యమంతకు ముందు లేదు. అది అప్పుడసత్తు. అదే కారక వ్యాపారానంతరం కార్యరూపంగా ఆరంభమయింది అని వీరి మతం. దీనినే అణువాదమనీ అసత్కార్యవాదమనీ ఆరంభ వాదమనీ అనేక సంజ్ఞలతో వ్యవహరిస్తారు. × అణిమా : అణుభావం-అణువయిపోవటం. అష్టసిద్ధులలో ఇది ఒక సిద్ధి కూడా. The power of becoming very subtle. పోతే ఆత్మచైతన్యమని కూడా అర్థమే. య ఏషో -ణిమా అని శాస్త్రం. మేము వర్ణించిన అణిమ ఏదున్నదో అదే సద్రూపమైన ఆత్మచైతన్యం. × అతః : అథ అతః బ్రహ్మజిజ్ఞాసా. అతః అంటే హేత్వర్థం. ఇహపరాలు రెండూ నశించేవి గనుక అని హేతువును చెబుతుందీ శబ్దం. Because of the fuility of all matter. × అత్తా : అత్తృ అనే దాని ప్రథమైక వచనాంత రూపం. Eater తినేవాడని అక్షరార్థం. Literal meaning. అత్తాచరాచర గ్రహణాత్‌. చరాచర ప్రపంచాన్ని భక్షించేవాడు గనుక పరమాత్మకు అత్త అని పేరు. భక్షించటమంటే సంహరించటం. తన లోపలికి తీసుకొని తన స్వరూపంగా చేసుకోవటమని అర్థం. జీవుడికి కూడా అత్త అనే పేరు. పిప్పలం స్వాద్వత్తి - వీడుకూడా తాను చేసిన కర్మఫలాన్ని తాను భక్షిస్తాడు అంటే అనుభవిస్తాడు. × అతర్క్య : తర్కించరానిది. ఊహించరానిది. ఆత్మతత్త్వం. అతర్క్య మణు ప్రమాణమని శాస్త్రం. × అతంత్ర : తంత్రమంటే ఇక్కడ ఆవశ్యకమైనది Essential. అతంత్రమంటే అనావశ్యకం, అవసరం లేనిదని భావం. × అతద్గుణ సంవిజ్ఞాన : ఏది మొదట చెప్పారో అది వదిలేయకుండా దాని గుణంతో కూడా పట్టుకొంటే తద్గుణ సంవిజ్ఞానం. లంబకర్ణ అన్నప్పుడు కర్ణద్వయంతో సహా పట్టుకోవాలి మేకను. చిత్రగు అన్నప్పుడు రంగు రంగుల ఆవులను వదిలేసి వాటిని కాచే ఆలకాపరిని గ్రహించాలి. దీనికి అతద్గుణమని పేరు. ఇందులో మొదటిది విశిష్టాద్వైతానికైతే, రెండవది అద్వైతానికి సరిపోతుంది. నిర్గుణంగా గుర్తించాలి పరమాత్మనని అద్వైతుల సిద్ధాంతం. × అత్యయ : దాటిపోవటం. కడచి పోవటం. Passing. × అతీత : కడచిపోయినది. Past. × అత్యంత : అంతమంటే చివర-హద్దు. అది లేనిది అత్యంతం. Limit less End less. అపరిమితమని కూడా చెప్పవచ్చు. శాశ్వతమనీ అర్థమే. × అత్యాంతాభావ : ఒక పదార్థముండటానికి భావమని Presence లేకపోవటాని కభావమని Absence పేరు. అభావమనేది నాలుగు విధాలు. అందులో ఇది నాలుగవది. ఒక వస్తువు మూడు కాలాలలోనూ లేకుంటే దాని కత్యంతాభావమని పేరు. కుందేటి కొమ్ము, గొడ్రాలి బిడ్డ ఇలాంటివన్నీ ఉదాహరణలు. × అతీంద్రియ : ఇంద్రియాలకు గోచరం కానిది Incomprehensible ఆత్మ స్వరూపం. × అతిగ్రహ : గ్రహమూ, అతిగ్రహమని ఇవి జంటపదాలు. గ్రహించే ఇంద్రియం గ్రహమైతే దానిచేత గ్రహించబడే విషయ మతిగ్రహం. ఉదాహరణకు చక్షుస్సు గ్రహం. దానికి గోచరించే రూపమతిగ్రహం. × అతిచార : హద్దుమీరటం. Transgression. × అతిచ్ఛంద : ఛందమంటే కామం, కోరిక. అది దాటిపోయినది అతి చ్ఛందం. నిష్కామమైన ఆత్మస్వరూపం. × అతిదేశ : ఒక దానికి చెప్పిన లక్షణం మరి ఒకదానికి కూడా వర్తిస్తుందని సూచిస్తే దాని కతిదేశమని Attribution, ఆకాశమెలా సృష్టి అయిందో అలాగే వాయువు కూడా నంటారు బాదరాయణులు. ఇలాంటి దాని కతిదేశమని పరిభాష. × అతిపాత : ఒక లక్షణం దాని పరిధి దాటి ప్రసరించటం × అతిప్రసంగ/అతిప్రసక్తి : అతిపాతం వంటిదే. వివక్షితమైన విషయాన్నేగాక విషయాంతరాన్ని కూడా అనవసరంగా చెబుతూ బోతే దాని కతిప్రసంగమని పేరు. × అతిప్రశ్న : ప్రశ్నించే విషయం కాకున్నా చాపల్యం కొద్దీ ప్రశ్నించటం. అనుచితమైన అసందర్భమైన ప్రశ్న-గార్గి యాజ్ఞవల్క్యుణ్ణి అలాగే ప్రశ్నించిందట. × అతిరేక/అతిరిక్త : మించిపోవటం. అదనంగా ఉండటం. అలా ఎక్కువగా అధికంగా ఉన్న భావం Additional. కారణ సత్తాకు అతిరిక్తంగా కార్యసత్తా లేదు. కనుక సచ్చిద్రూపమైన ఆత్మకన్నా అతిరిక్తంగా అనాత్మ జగత్తులేదు. × అతివర్ణాశ్రమీ : వర్ణాశ్రమాలు దాటిపోయినవాడు. వాటితో సంగంలేని సన్న్యాసి. అవధూత. × అతివాహనమ్‌ : మరణించిన తరువాత కర్మిష్ఠుని గాని ఉపాసకునిగాని ఒక లోకం నుంచి మరొక లోకానికి తీసుకుపోవటం. అలా తీసుకుపోయే దేవదూతకు అతివాహికుడని పేరు. × అతివ్యాప్తి : ఒక పదార్థానికి చెప్పిన లక్షణం దానికేగాక మరొక దానికి కూడా వర్తించటం. కొమ్ములున్న జంతువు వృషభమని చెప్పామనుకోండి. అది గేదెకు కూడా వర్తిస్తుంది. × అతివాద : అతీత్య వదనమ్‌ : ఒకదాన్ని మించి మాటాడటం. ప్రాణం వరకు చెప్పి ఆగిపోతే అది వాదం. దాన్నికూడా దాటి ఆత్మతత్త్వం దగ్గరికి వచ్చి వర్ణిస్తే అది అతివాదం. × అతిశయ : అధికము-ఎక్కువ. అదనంగా ఉండటం. కారణం కన్నా కార్యం అన్యం కాకపోయినా కార్యమనిపించుకోటానికందులో ఏదో ఒక అంశంలో అతిశయం ఉండాలంటారు. ఘటమనేది మృత్తికే అయినా గుండ్రని ఆ రూపం మృత్తికకన్నా అతిశయం. × అథ : ఇకమీదట. అథ యోగానుశాసనమ్‌. అనంతరం. అథాతోబ్రహ్మ జిజ్ఞాసా సాధన చతుష్టయ సంపాదనానంతరమే బ్రహ్మజిజ్ఞాస చేయాలని అర్థం. × అదత్క : అ+దత్క-పండ్లు లేనిది. అదత్‌+క - నమిలి వేసేది -పండ్లు లేకున్నా నమలి మ్రింగేది స్త్రీ గోప్యాంగం. అదత్కం లిందు మాభిగామ్‌ - అని ఉపనిషత్తు. × అద్వయ/అద్వైత : ద్వయం కానిది. ద్వైతం కానిది. అంటే రెండన్నదంటూ లేనిది. ఆత్మచైతన్యం. దానికంటే అదనంగా జీవుడు లేడు-జగత్తు లేదు. ఈశ్వరుడులేడు. × అద్వితీయ : అది ఏకమేవా ద్వితీయమ్‌ - ద్వితీయమైన తత్త్వమేలేదు దానికి. సజాతీయం లేదు. విజాతీయం లేదు. స్వగత భేదం కూడా లేదు చివరకు. ఇదే అద్వైతుల సిద్ధాంతం. × అదితి : కశ్యపుని భార్యలలో ఒకతి అనేది సామాన్యంగా చెప్పుకునే అర్థం. పోతే వేదాంతంలో దీనికి రెండర్థాలున్నాయి. ఒకటి దితి కానిది. దితి అంటే ఖండం. ఖండం కాక అఖండమైన భావం అదితి. బాహ్యమైన ఆకాశమైనా కావచ్చు లేదా ఆధ్యాత్మికమైన బ్రహ్మచైతన్యమైనా కావచ్చునది. పోతే అదనం చేసేది అదితి. అంటే అన్నింటినీ కబళించేది తన లోపల ఇముడ్చుకొనేదని అర్థం. ఆ అర్థంలో అదితి అంటే మాయాశక్తి. అదితి అంటే పరమాత్మ. అత్తా చరాచర గ్రహణాత్‌ - అదితి ర్దేవతా మయీ అని శాస్త్రం. × అద్రేశ్య : అదృశ్యమని అర్థం. కళ్ళకు కనపడనిది. పరమాత్మ తత్త్వం. × అదృష్ట : దృష్టం కానిది. కనపడనిది మనం చేసుకొన్న కర్మఫలం. అది మరణం వరకూ ఫలితమివ్వదు. కనపడకుండా మరణానంతరం మనతోపాటు లోకాంతరాలకు జన్మాంతరాలకు వచ్చి అక్కడ దృష్టమై మనకు ఫలితమిస్తుంది. దీనినే అపూర్వమని పేర్కొంటారు మీమాంసకులు. ఆత్మచైతన్యానికి కూడా అదృష్టమని పేరు. అదృష్టమ్‌ నహి దృశ్యతే. × అద్రోహ : ద్రోహం Harm చేయకపోవటం. దైవగుణాలలో ఇది ఒకటి. × అదోష : No fault. No problem. అదేమంత పెద్ద దోషం కాదు. ఆక్షేపించవలసిన విషయం కాదని భావం. × అధర్మ : ధర్మం కానిది. శాస్త్రం నిషేధించిన కర్మ. ధర్మానికి విరుద్ధం. దీనివల్ల ప్రత్యవాయ దోషం లేదా అధఃపతన మేర్పడుతుంది మానవుడికి. × అధరారణి : అగ్నిని తయారుచేసే నెల్లికొయ్యకు అరణి అని పేరు. అందులో పైదాని కుత్తరారణి క్రింది దాని కధరారణి అని సంజ్ఞ. రెండింటినీ కలిపి ఒరపిడి పెడితే అగ్ని ఉదయిస్తుంది. అధర అంటే క్రిందిదని పేరు. × అధః : అధస్తాత్‌ - క్రింద - Below, స ఏవాధస్తాత్‌.

Vedānta Paribhāṣā Vivaraṇa
అధ్రువ ()
Telugu original

అధ్రువ : ధ్రువమంటే ఎప్పటికీ ఉండేది ఆత్మస్వరూపం. అది కానిదంతా ఇక అధ్రువమే. Transcient.

Vedānta Paribhāṣā Vivaraṇa
అధోగతి ()
Telugu original

అధోగతి : పాపాత్ములు పోయే మార్గం. రౌరవాది నరకలోకాలు - పశుపక్ష్యాది జన్మలు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అన ()
Telugu original

అన : కదలటం - జీవించటం. Animo. వాయువు. ప్రాణాపానాదులు ఐదూ దాని విశేషాలు. × అనన్య : అన్యం కానిది. వేరు కానిది. కారణంకంటే అనన్యం కార్యం. మృత్తికకు వేరుగా ఘట శరావాదులు లేవు. దాని కనన్యం Not different. అలాగే ఆత్మకనన్యం అనాత్మ.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనన్యభక్తి ()
Telugu original

అనన్యభక్తి : అలాంటి దృష్టికే అనన్య భక్తి అని పేరు. ఇది మామూలు భక్తి కాదు. భక్తి అని పేరేగాని ఇది వాస్తవంలో జ్ఞానమే. ఇందులో సాధకుడు ఈశ్వరుణ్ణి తనకు అన్యంగా భావించడు. ఆత్మ స్వరూపంగానే భజిస్తాడు. కనుక దీనికి అనన్యభక్తి అని పేరు వచ్చింది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనంత ()
Telugu original

అనంత : అంతం లేనిది. అంతమంటే హద్దు - విజాతీయభావ మెక్కడ ఎదురవుతుందో అక్కడ అంతమేర్పడుతుంది. పృథివికి జలం విజాతీయం. అక్కడికది అంతం. ఇలాగే అనాత్మ ప్రపంచంలో ఒక విశేషానికి మరో విశేషం విజాతీయం. కనుక అన్నీ ఒకదానికొకటి అంతమే. అన్నీ సాంతమే. Finite. అనంత Infinite మేదీలేదు. పోతే ఎక్కడికక్కడ తెగిపోక అన్ని విశేషాలను వ్యాపించినదేదో అది అనంతం. దానికే సామాన్యమని Universal పేరు. బంగారమాభరణాలలో లాగా అది అన్నింటిలోనూ వ్యాపించి ఉంటుంది. అది ఏదోగాదు. అహమహమనే ఆత్మచైతన్యం. అస్తి భాతి అనే వ్యాప్తిలేని విశేషమే Particular లేదు. కనుక పరమాత్మ అనంతం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనంతర ()
Telugu original

అనంతర : అంతరమంటే ఎడం. Distance. అంతరం లేనిది అనంతరం. ఎడబాయకుండా అంటిపట్టుకున్నది. తరువాత అని కూడా అర్థమే. అంతేకాదు. అంతరమంటే లోపలి భాగం. లోపల మాత్రమే లేనిది అనంతరం. అనంతరమంటే ఇంతకుముందుగానే జరిగిపోయినదని కూడా అర్థమే. Immediately before.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనఘ ()
Telugu original

అనఘ : అఘం లేనిది. లోపం లేనిది. నిర్దోషం. బ్రహ్మతత్వం. నిర్దోషం హి సమం బ్రహ్మ.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనల ()
Telugu original

అనల : అలమంటే పర్యాప్తమని Enough అర్థం. ఇక చాలునని భావం. అది లేనిది అనలం. దుష్పూరేణ అనలేన చ మానవుడి కామం అలాంటిది. దానికెంత ఆహుతి పడ్డా తృప్తిలేదు. అనలమది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనర్థ ()
Telugu original

అనర్థ : అర్థమంటే మనం కోరేది. అలా కోరకుండా వచ్చి నెత్తిన పడేది అనర్థం Undersirable. దుఃఖం. తాపత్రయం. దానికి కారణం అవిద్యా కామకర్మలు. కనుక అసలైన అనర్థమవి మూడే. సంసారబంధాన్ని తెచ్చిపెట్టినవవే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అన్యధా ఖ్యాతి ()
Telugu original

అన్యధా ఖ్యాతి : ఒక వస్తువు మీద మరొక రూప మారోపితమై అది ఆ రూపంలో కనబడటం. శుక్తిక రజతంలాగా కనిపిస్తే దాని కన్యధా ఖ్యాతి అని పేరు. నైయాయికులు, వైశేషికులు పేర్కొనే అధ్యాస ఇది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అన్యధాగ్రహణ ()
Telugu original

అన్యధాగ్రహణ : వస్తువును వస్తువుగా కాక దానినే మరొక విధంగా దర్శించటం. వస్తువు ఆత్మస్వరూపం. అది జాగ్రత్‌స్వప్నాలలో దానికి భిన్నమైన అనాత్మ ప్రపంచంగా భాసిస్తున్నది. దీనికే అన్యధాగ్రహణమని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అన్వయ / అనన్వయ ()
Telugu original

అన్వయ/అనన్వయ : ఒకటి వేరొకదానితో కలిసి ఉండట మన్వయమైతే దేనితోనూ కలవకపోవట Aloofness మనన్వయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అన్వయ / వ్యతిరేక ()
Telugu original

అన్వయ / వ్యతిరేక : అన్వయమంటే ఇక్కడ కారణం దాని కార్యాలన్నిటిలో కలిసి రావటమని అర్థం. అదే మరొక దాని కార్యంలో కలిసి రాదు. అలాంటప్పుడది వ్యతిరేకం. మృత్తిక ఘటంలో అన్వయిస్తుంది. పటంలో వ్యతిరేకిస్తుంది. పోతే ఆత్మచైతన్యానికి ప్రపంచమంతా కార్యజాతమే కాబట్టి అన్ని పదార్థాలలో సచ్చిద్రూపంగా అది అన్వయిస్తూనే Continue పోతుంది. ప్రతి ఒక్కటి అస్తి భాతి ఉన్నది స్ఫురిస్తున్నదనే పేర్కొంటాము. ఇదే దాని అన్వయం. పోతే కార్యపదార్థాలు మాత్రం కారణ రూపమైన సచ్చిత్తులలాగ అన్వయించలేవు. ఎక్కడికక్కడ వేరయిపోతాయి. ఘటం శరావం కాదు. శరావం కపాలం కాదు. కాని మృత్తిక ఘటాదుల నెలా వ్యాపిస్తుందో అలాగే చరాచర పదార్థాలొక దానికొకటి వ్యతిరిక్తమైనా సచ్చిత్తులన్నింటిలో అన్వితమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనపాయోపజన ()
Telugu original

అనపాయోపజన : అపాయం లేనిది. ఉపజనం లేనిది. అపాయమంటే తొలగి పోవటం. ఉపజనమంటే క్రొత్తగా ఏర్పడటం. ఇవి రెండూ లేవంటే రాకపోకలు లేవని, ఎప్పుడూ ఉండేదని అర్థం. ఏదో గాదది. ఆత్మ స్వరూపం. అది ఒకప్పుడు రాదు. ఒకప్పుడు పోదు. నిత్య సిద్ధం. × అనపేక్షా : అపేక్ష అంటే ఒకదాని అవసరం. ఆకాంక్ష. Need. అది లేకుంటే అనపేక్ష. తనపాటికి తానుండగల స్వభావం. Selfreliance.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనభ్యుపగమ ()
Telugu original

అనభ్యుపగమ : అభ్యుపగమ మంటే ఒప్పుదల. Consent. సమ్మతి. అలా కాకుంటే అనభ్యుపగమం. అనంగీకారం. Disagreement.

Vedānta Paribhāṣā Vivaraṇa
అననుమత ()
Telugu original

అననుమత : అనుమతం కానిది. సమ్మతం కానిది. Not approved word.

Vedānta Paribhāṣā Vivaraṇa
అన్న ()
Telugu original

అన్న : తినబడేది. Food. అనాత్మ ప్రపంచమని లక్షణార్థం. ఇది జ్ఞానానికి గోచరిస్తుంది గనుక జ్ఞానం దాన్ని లోనికి తీసుకుంటుంది. జ్ఞేయ ప్రపంచమంతా అన్నమే. Matter. పృథివి అని కూడా అర్థం. Earth.

Vedānta Paribhāṣā Vivaraṇa
అన్నమయ కోశ ()
Telugu original

అన్నమయ కోశ : అన్నం తాలూకు సూక్ష్మమైన రూపం మనస్సు. దానికి సంబంధించిన కోశం అన్నమయ కోశం. ఇది శరీరంలో ఉన్న పంచకోశాలలో మొదటిది. పృథివీ తత్వం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అన్నాద ()
Telugu original

అన్నాద : తినేవాడు. అనాత్మ జగత్తును గ్రహించే జీవుడు లేదా ఈశ్వరుడు. ఇద్దరూ అన్నాదులే. Eaters.

Vedānta Paribhāṣā Vivaraṇa
అన్యోన్యాభావ ()
Telugu original

అన్యోన్యాభావ : ఒక విశేషంలో మరొక విశేషం లేకపోవటం. Mutually exclusive ఘటం పటం కాదు. పటం కుడ్యం కాదని చెప్పినప్పుడు ఒక దాని స్వరూపం మరొకదానిలో లేదనిగదా అర్థం. నాలుగు అభావాలలో Absence ఇది ఒక అభావం. అనాత్మ ప్రపంచమంతా మిథ్య, మాయ అని నిరూపించటానికి ఈ అభావ మొక్కటే చాలు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అన్యోన్యాశ్రయ దోష ()
Telugu original

అన్యోన్యాశ్రయ దోష : ఒకదానిమీద ఒకటి ఆధారపడటం. Inter dependence. అలాంటప్పుడేది ముందు, ఏది వెనుక అని చెప్పలేము. చెట్టు విత్తు సంబంధం లాంటిదిది. రెండూ సాపేక్ష Relative మయినప్పుడేదీ స్వతస్సిద్ధం కాదు. ఆభాస. మరి వస్తువేది. రెండూ కలిసి దేనిమీద ఆధారపడతాయో అది. అది స్వతస్సిద్ధమైన ఆత్మే మరేదీగాదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనన్వాగత ()
Telugu original

అనన్వాగత : Unaccompanied. ఏదీ వెంట రానిది. అంటుకొని రానిది. ఆత్మ స్వరూపం. అనన్వాగతః పుణ్యేన, అనన్వాగతః పాపేన. పుణ్యంగాని పాపంగాని ఏదీ దాని నంటి పట్టుకోదు సుషుప్తిలో. కనుక సుషుప్తిలోనే తెలుస్తుంది అసలైన మన ఆత్మస్వరూపం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనవద్య ()
Telugu original

అనవద్య : అవద్యమంటే దోషం. లోపం. కొరత. ఏ కొరతా లేని నిర్దోషమైన దాత్మతత్త్వం. కనుక అది అనవద్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనధికార ()
Telugu original

అనధికార : అయోగ్యత, అనర్హత.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనధికారీ ()
Telugu original

అనధికారీ : అయోగ్యుడు, అనర్హుడు Incompetent, not eligible.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనవగమ ()
Telugu original

అనవగమ : జ్ఞానంగాని, అనుభవంగాని లేకపోవటం. Incompetent, not eligible.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనవస్థా/అనవస్థిత ()
Telugu original

అనవస్థా/అనవస్థిత : నిలకడ లేకపోవటం. Instability. దానికేమిటి దానికేమిటని అడుగుతూ పోతే మందల లేకపోవటం Infinite regress. అలా నిలకడ లేనిది అనవస్థితం. అనవస్థ అనేది ఒక పెద్ద దోషం. ఇది ద్వైతంలోనే అద్వైతంలో ప్రాప్తించదు. అక్కడ రెండవది లేదు గదా. ఇక దీనికేమిటని ప్రశ్న ఏముంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనవధాన ()
Telugu original

అనవధాన : అవధానమంటే తదేక దృష్టి. Attention. అది లేకుంటే అనవధానం. పరధ్యానం. పరాకు. Absent mindedness.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనాత్మా ()
Telugu original

అనాత్మా : ఆత్మకానిది. మన జ్ఞానమాత్మ అయితే దానికి గోచరించే సమస్తమూ అనాత్మే. Objective world. జీవ జగదీశ్వరులు మూడూ అనాత్మ క్రిందికే వస్తాయి.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనాగత ()
Telugu original

అనాగత : ఇంతవరకు అనుభవానికి రానిది. ఇకమీదట చేయబడే కర్మ. ఆగామి అని కూడా అనవచ్చు. భవిష్యత్‌కాలమని కూడా అర్థమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనావరణ/అనావృత ()
Telugu original

అనావరణ/అనావృత : ఆవరణమంటే కప్పటం. మరుగు పుచ్చటం. దేనిచేతా కప్పబడక నిరాఘాటంగా వ్యాపిస్తే అనావరణం. ఆత్మ ఎప్పుడూ అనావృతమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనారబ్ధ ()
Telugu original

అనారబ్ధ : ఆరంభం కానిది. జారీకాని కర్మఫలం. జారీ అయి అనుభవానికి వస్తే అప్పుడది ఆరబ్ధమవుతుంది. అంతవరకూ అనారబ్ధమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనాశక ()
Telugu original

అనాశక : నాశనము చేయనిది అని శబ్దార్థం. కాని అన్‌+ఆశక అని విరిచి అర్థం చెప్పుకోవలసి ఉంటుంది. ఆశకమంటే తినేది. అనాశకం తిననిది. లోపలికి తీసుకోనిదేదో అది. 'తపసా అనాశకేన' అని ఉపనిషత్తులో ప్రయోగం. తపస్సంటే భోజనం చేయకపోవటం కాదు. కామ అనశన. ఏ కోరికలూ లోపలికి తీసుకోక నిష్కామంగా ధ్యానం చేయటమని అర్థం చెప్పారు భగవత్పాదులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనాహత ()
Telugu original

అనాహత : ఆహతమంటే రాపిడి చెంది బయటపడడం. అలా బయటపడని శబ్దానికి అనాహత శబ్దమని In audible పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనాకుల ()
Telugu original

అనాకుల : ఆకులం కానిది. ఆకులమంటే చలించటం. అస్తిమితం. అస్థిరం. అలాటి అస్థిరత్వం లేకుంటే అది అనాకులం. కలగాపులగానికి confusion కూడా ఆకులమని పేరు. అది లేకుండా ఎక్కడికక్కడ విశదంగా ఉంటే అదికూడా అనాకులమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనాగమ ()
Telugu original

అనాగమ : ఆగమమంటే క్రొత్తగా రావటం. అలా రాక ఎప్పుడూ ఉంటే అనాగమం. పోకుంటే అనపాయం. బ్రహ్మమనాగమం. అనపాయం వచ్చేది పోయేది కాదు. ఆగమమంటే గురుశిష్య సంప్రదాయం tradition కూడా. గురూపదేశం వల్ల శిష్యుడికి బ్రహ్మానుభవం సంక్రమిస్తే దానికి ఆగమ జ్ఞానమని పేరు. అనుభవమే ఇక్కడ ఆగమం. ఇది కేవల శాస్త్ర జ్ఞానం కాదు. అనుభవ జ్ఞానం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనాగమజ్ఞ ()
Telugu original

అనాగమజ్ఞ : ఆగమ జ్ఞానం లేని ఆచార్యుడు. శిష్యుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనాదర ()
Telugu original

అనాదర : ఆదరమంటే శ్రద్ధ కలిగి ఉండటం. అనాదరమంటే అశ్రద్ధ. నిర్లక్ష్యం. ఆదరమంటే మరొక అర్థం కూడా చెప్పవచ్చు. నొక్కి వక్కాణించడానికి ఆదరమని పేరు. Emphasis. అలా చెప్పకపోతే అది అనాదరం. అంత ముఖ్యంకాదని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనాది ()
Telugu original

అనాది : ఆది లేనిది. ఆది అంటే కారణం. దేనికి కారణం లేదో అది అనాది. కారణం లేకుంటే కార్యం కూడా కాదు. కార్య కారణాలు రెండూ లేనిది పరమాత్మ అని అర్థం. ఆయనను ఆశ్రయించి ఉన్న మాయాశక్తి కూడా అనాదే. ఆయన అంశమైన జీవుడూ అనాదే. ఆ మాటకు వస్తే ఆయన చైతన్యమే ఇలా భాసిస్తున్నది. గనుక సృష్టి అనాదే. అంతా అనాదే. అనంతమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనామక మరూపకం ()
Telugu original

అనామక మరూపకం : నామం లేనిది. రూపం లేనిది. నామమంటే మనస్సులో కలిగే వృత్తి లేదా ఆలోచన. Idea. రూపమంటే దానికి విషయమైన బాహ్యపదార్థం. Thing. ఇవి రెండూ కానిది ఆత్మచైతన్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనాశ్వాస ()
Telugu original

అనాశ్వాస : ఆశ్వాసమంటే విశ్వాసం లేదా నమ్మకం. అది లేకుంటే అనాశ్వాసం. అశ్రద్ధ అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనిత్య ()
Telugu original

అనిత్య : నిత్యం కానిది. Impermanent, Transitary. అనాత్మ ప్రపంచం. అనిత్య మసుఖం లోకమని గీత. × అనిశ్చిత : ఫలానా అని తేల్చుకోలేనిది. Undetermined.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనిర్వచనీయ / అనిర్వాచ్య ()
Telugu original

అనిర్వచనీయ/అనిర్వాచ్య : ఇదమిత్ధమని వర్ణించ నలవికానిది అనాత్మ ప్రపంచం. ఇది ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము. కనిపిస్తుంది కాబట్టి ఉంది. విచారిస్తే ఆత్మచైతన్యమే అలా భాసిస్తున్నది గనుక లేదు. ఇలాంటి సదసద్రూపానికే అనిర్వచనీయమని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనిరుక్త ()
Telugu original

అనిరుక్త : నిరుక్తం కానిది. నిరుక్తమంటే నిష్కర్ష జేసి చెప్పటం. అలా కాని పదార్థం అనిరుక్తం. అమూర్తమని Unmanifest అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనిరూప్య ()
Telugu original

అనిరూప్య : నిరూపించ శక్యం గానిది. నిరూపణమనగా ఒక ప్రమాణంచేత ఖచ్చితం చేసి చెప్పటం. అలాంటిది కాకుంటే అనిరూప్యం Indescribable.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనిరుద్ధ ()
Telugu original

అనిరుద్ధ : నిరుద్ధం కానిది. అడ్డం లేకుండా ప్రసరించ గలిగినది. పాంచరాత్రుల మతంలో పరమాత్మకు నాలుగు వ్యూహాలు చెప్పారు. అందులో ఇది ఒక వ్యూహం. అనిరుద్ధమనగా నిరాఘాటంగా ప్రసరించే మానవుడి మనస్సని సంకేతార్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనిలయన ()
Telugu original

అనిలయన : నిలయనమంటే ఒక పోగైన పదార్థం. ఆశ్రయం. సంహతమని అర్థం. Formed. సంహతం కాకుంటే అది అనిలయనం. Unformed.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనిర్జ్ఞాత ()
Telugu original

అనిర్జ్ఞాత : తెలియవలసినంత బాగా తెలియనిది. Not completely known.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనిమిత్త ()
Telugu original

అనిమిత్త : నిమిత్తం లేనిది. ఒకదానివల్ల ఒకటి ఏర్పడితే అది దానికి నిమిత్తం. గొడుగు నీడకు నిమిత్తం. గొడుగు ముడిస్తే నీడ తొలగిపోతుంది. అప్పుడది అనిమిత్తం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనియమ/అనియత ()
Telugu original

అనియమ/అనియత : ఒక పద్ధతి అంటూ లేకపోతే అనియమం. ఒకటి ఉంటే గాని మరొకటి కుదరదనే వ్యవహారం లేకుంటే అనిమయం. Option. Nocompulsion. నియమం లేని పదార్థం అనియతం Unfixed.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనిష్ట ()
Telugu original

అనిష్ట : ఇష్టం కానిది. దుఃఖం. ప్రతికూలం. Undesirable element. వెతకబడేది ఇష్టం అయితే మనం వెతకనిది అనిష్టం. Unsought. ఇంతేగాక శాస్త్రంలో ఇది ఒక విశిష్టమైన అర్థంలో వాడబడుతున్నది. ఇది మాకు సమ్మతం కాదని బొత్తగా సరిపడేది కాదని అర్థం. Contrary.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనికేత ()
Telugu original

అనికేత : నికేతమంటే స్థానం. నిలకడ. అది లేనివాడు అనికేతుడు. Wanderer. పరివ్రాజకుడని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనీశ / అనీశ్వర ()
Telugu original

అనీశ/అనీశ్వర : ఈశ్వరుడు కాడు. అస్వతంత్రుడని అర్థం. జీవుడు అలాంటి అస్వతంత్రుడు. వీడికి తన ఉపాథులమీద గాని, బాహ్యజగత్తు మీద గాని అధికారం లేదు. అవే వీడిమీద అధికారం చెలాయిస్తున్నవి.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనుగమ ()
Telugu original

అనుగమ : అన్వయం. సంబంధం. కారణం దాని కార్యపదార్థాలన్నింటిలో కలిసి రావటం. వ్యాపించటం. ఎడతెగకుండా సాగిపోవటం Continuity.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనుగత ()
Telugu original

అనుగత : అలా వ్యాపించేది. ఆత్మతత్వం. అనాత్మ జగత్తునంతా వ్యాపించి ఉన్నదది. × అనుత్తమ : దేనికంటే ఉత్తమం లేదో గొప్పది లేదో మించిపోదో అది అనుత్తమం. Unsurpassed. The supreme పరమాత్మ స్వరూపం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనుత్తర ()
Telugu original

అనుత్తర : మించిపోనిది. దాటి పోనిది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనుదాహరణ ()
Telugu original

అనుదాహరణ : ప్రస్తుతాంశానికి సరిపడని దాన్ని పేర్కొనటం. ఒక భావాన్ని వర్ణించినపుడు దాన్ని మన విషయంలో అన్వయించుకోకపోవటం Lack of application. పరోక్షంగా మాత్రమే చూచి అపరోక్షంగా తన కన్వయించుకోకపోతే అది అనుదాహరణం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనుకర్ష ()
Telugu original

అనుకర్ష : ఒక విషయం సంపూర్ణంగా మనకర్థం కావాలంటే పై వాక్యం నుంచి ఒక పదాన్ని క్రిందికి లాగుకోవలసి ఉంటుంది. కర్షణమంటే లాగటమనే శబ్దార్ధం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనుక్రమ ()
Telugu original

అనుక్రమ : ఒక క్రమాన్ని Order అనుసరించటం. ఏ క్రమంలో చెప్పాలో ఆ క్రమంలోనే చెప్పటం. పూర్వాపరాలు పాటిస్తూ పోవటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనువృత్తి ()
Telugu original

అనువృత్తి : అనుసరించి వర్తించటం. కారణ స్వరూపం దానివల్ల ఏర్పడే కార్య పదార్థాలన్నిటిలో కొనసాగటం. కలిసి రావటం Continuation. అనుగమ అనుగతి అని కూడా దీనికే పర్యాయపదాలు. × అనుసంధాన : తెగితే ముడి పెట్టుకుంటూ రావటం. కలుపుకుంటూ రావటం. అవిచ్ఛిన్నంగా పరతత్వాన్ని భావన చేయటం. Reflection without brake.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనుగ్రహ ()
Telugu original

అనుగ్రహ : ప్రసాదం Grace, సాహాయ్యం, తోడ్పాటు. 'శ్రుత్యనుగృహీతః తర్కః' శ్రుతి చెప్పిన విషయానికి తోడ్పడే తర్కం. × అనుశయ : మరణించిన జీవి లోకాంతరాలలో కర్మఫలమంతా అనుభవించదు. కొంతవరకే అది అనుభవానికి వస్తుంది. కాగా కర్మఫల శేషమింకా కావలసినంత మిగిలిపోతుంది. ఆ మిగిలిన కర్మఫలమే అనుశయం. అది మరలా జన్మాంతరంలో అనుభవించవలసి వస్తుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనుశాసన ()
Telugu original

అనుశాసన : శాసించటమనే అర్థం. Instruction. అంటే ధర్మం కాని, జ్ఞానం కాని ఆచార్యుడైనవాడు తన శిష్యులకిలా నడచుకోవాలని గాని, తెలుసుకోవాలని గాని బోధించటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనుష్ఠాన ()
Telugu original

అనుష్ఠాన : ఆచరించటం, అమలు పరచటం. Practice. Implementation ఇది ధర్మ పురుషార్థంలోనే గాని మోక్షపురుషార్థానికి లేదు సరిగదా పనికి రాదంటారు అద్వైతులు. బ్రహ్మమనేది అహేయ మనుపాదేయం గనుక తయారుచేసేది కాదు. పొందేది కాదు. మహా అయితే ఉన్న దానినే మరచిపోయాము. అంచేత గుర్తు చేసుకుంటే చాలు. అనుభవానికి వస్తుంది. అది జ్ఞానమే. కర్మకాదు. కాబట్టి జ్ఞానానంతరం దాన్ని అమలుపరిచే అనుష్ఠాన మక్కరలేదు. పనికి రాదు కూడా. కారణం చేస్తే ఆత్మ అనాత్మగా మారిపోతుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనుభవ / అనుభూతి ()
Telugu original

అనుభవ/అనుభూతి : అనుసరించి ఉండటం. Co-existence. నీవేది కోరావో దాని నంటి పట్టుకుని కూచోవటం. అది నీవై పోవటం. Total Identity of the objectwith the subject. Experience. ఆత్మానుభవమంటే అనాత్మనంతా ఆత్మ స్వరూపమని గుర్తించటం. ఇదే అనుభవం. ఇదే అనుభూతి.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనుదర్శన ()
Telugu original

అనుదర్శన : ఒక విషయాన్ని మరల మరల దర్శిస్తూ పోవటం. సిద్ధాంతీకరిస్తే సరిపోదు. ఆ తరువాత దాన్ని దర్శించగలిగి ఉండాలి. అలాటి దానికే అనుదర్శనమని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనుసంధాన ()
Telugu original

అనుసంధాన : ఒక విషయం భావిస్తూ ఉన్నప్పుడు మధ్యలో విజాతీయ భావం రాకుండా దానినే సజాతీయంగా భావిస్తూ పోవటం. విజాతీయం వల్ల తెగిపోతే మరల ముడిపెట్టుకోవటమే అనుసంధానం. × అనుసార : అనుసరించటమని బాహ్యార్థం. సారమంటే ప్రమాణమని మరియొక అర్థం. ఆత్మదర్శనానికి ఆత్మభావనే ప్రమాణం. దానితోనే దాన్ని అనుసరించి పట్టుకోవాలి. ఆత్మప్రత్యయ సారమని మాండూక్యంలో మాట. ఆత్మ భావనే సారమనగా ఆత్మానుభవానికి ప్రమాణమట. × అనుపలబ్ధి/అనుపలంభ : ఉపలబ్ధి అంటే ప్రత్యక్షం కావటం. సాక్షాత్కరించటం. ప్రత్యక్షంగా కనపడకపోతే అది అనుపలబ్ధి. Lack of apprehension. అద్వైతులు చెప్పే ఆరు ప్రమాణాలలో ఇది అయిదవది. ఇది అభావం కాదు. అభావమంటే Absence అసలు పదార్థమే లేకపోవటం. పదార్థమున్నా కనపడకపోవటం అనుపలబ్ధి. అనుపలంభమన్నా ఇదే. Non-avilability. × అనుపపత్తి : ఉపపత్తి అంటే హేతువు. యుక్తి. Reason. అది లేకుంటే అనుపపత్తి. హేతువుకు నిలవకపోవటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనుపపన్న ()
Telugu original

అనుపపన్న : హేతుబద్ధం కాని వాదం. అది ఎప్పటికీ కుదరదు. చెల్లదు. ఎందుకంటే దానికి హేతువు లేదు. Un supported by reason.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనుపాదేయ ()
Telugu original

అనుపాదేయ : ఉపాదేయం అంటే దగ్గరికి తీసుకోవటం. అంతకుముందు దగ్గర లేనిదైతే తీసుకోవచ్చు. ఎప్పుడూ మనదగ్గరే ఉన్న దాత్మ. అది మన స్వరూపమే. అలాంటిది ఉపాదేయమెలా అవుతుంది. కనుక ఎప్పుడూ అనుపాదేయమే Ungraspable or Unobtainable అది. ఇంతకూ అనుపాదేయమంటే ఆత్మస్వరూపమని అర్థం. × అనుబంధ చతుష్టయ : ప్రతి శాస్త్రాన్ని ఆరంభించే ముందు దానికి నాలుగు షరతులున్నాయి. 1. విషయమేమిటి? 2. అది సాధించవలసిన అధికారి ఎవడు? 3. వాడు దానినెలా సాధించాలి? దానికీ వాడికీ ఏమి సంబంధం? 4. సాధిస్తే కలిగే ప్రయోజనమేమిటి? అధికారి విషయ సంబంధ ప్రయోజనాలనే ఈ నాలుగింటికి అనుబంధ చతుష్టయమని పేరు. దీనికి జవాబు చెబితేనే అది శాస్త్రం. వేదంతానికి విషయం బ్రహ్మతత్త్వం. అది కావలసిన అధికారి జిజ్ఞాసా ముముక్షా ఉన్న మానవుడు. సంబంధం శ్రవణ మననాదులు. ప్రయోజనం మోక్షమనే ఫలానుభవం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనుషంగ ()
Telugu original

అనుషంగ : సంగమంటే ఒకదానిలో లగ్నం కావడం. తగులుకోవటం. అది బాగా ఏర్పడితే అనుషంగం. Indulgence. అంటుకోవటం కూడా. ఆత్మచైతన్యానికి ప్రపంచ వాసనలు అంటుకోవటం అలాంటిది. × అనుస్యూత : కుట్టిన దానికి స్యూతమని పేరు. ఐలిగీదీ అనుస్యూతంటే కుట్టివేసి నట్టొకదాని తర్వాత ఒకటి ఎడతెగకుండా కలసి రావటం continued.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనుమత/అననుమత ()
Telugu original

అనుమత/అననుమత : ఒక వాదాన్ని సరేనని ఒప్పుకుంటే అది అను మతం. Agreed. కాదని త్రోసిపుచ్చితే అననుమతం. Refuted.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనుమాన/అనుమితి ()
Telugu original

అనుమాన/అనుమితి : Inference. ప్రత్యక్షంగా కనిపించే విషయాన్ని బట్టి ప్రత్యక్షం కాని దాన్ని ఊహించటం. ధూమం కనిపిస్తుంటే అగ్ని కనిపించకపోయినా ఉందని భావిస్తే అది అనుమానం. ఇది వేదాంతులు చెప్పే రెండవ ప్రమాణం. ప్రపంచమనే కార్యాన్ని బట్టి దానికి మూలకారణం పరమాత్మ అని భావించవచ్చు. కాని అది తటస్థ లక్షణమే. స్వరూప లక్షణం కాదు. కనుక కేవల అనుమానం సరిపోదు. స్వరూపానుభవం మహర్షులది. వారి మాటలే మనకు ప్రమాణం. అదే ఉపనిషత్తు. కనుక దాని కనుగుణంగా అనుమానించి పరతత్వాన్ని నిర్ధారణ చేయాలని అద్వైతుల మాట.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనుమేయ ()
Telugu original

అనుమేయ : అలా భావించే పదార్థం Inferred. అనుమాన ప్రమాణంతో గ్రహించి అనుభవానికి తెచ్చుకోవలసినదేదో అది అనుమేయం. Inferrable.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనులోమ ()
Telugu original

అనులోమ : అనుకూలమైనది. Positive. దీనికి వ్యతిరేకి ప్రతిలోమం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనురోధ ()
Telugu original

అనురోధ : అనుసరించటం. దీనికి వ్యతిరేకి ప్రతిరోధ Negative. అనురోధానికి అనుగుణమని, అనురూపమని కూడా పర్యాయపదాలు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనువాద ()
Telugu original

అనువాద : Repetition. ఒక ప్రమాణం చేత సిద్ధమయిన విషయాన్నే మరొక ప్రమాణంతో చెప్పటం. మామూలుగా చెబితే అది దోషం. ఒక ప్రయోజనం కోసమైతే దోషంకాదు. గుణం. ఆ ప్రయోజనమేదో కాదు. అపవాదం. మనమంతా ఈ అనాత్మ ప్రపంచముందని చూస్తుంటే మన దృష్టి ననుసరించి ఇది సృష్టి అయిందని చెబుతుంది మొదట ఉపనిషత్తు. తరువాత కార్యం కారణం కన్నా వేరుగా లేదని చెప్పి ప్రపంచాన్ని అపవాదం చేస్తుంది. Refutation.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనుదితానస్తమిత ()
Telugu original

అనుదితానస్తమిత : ఉదితమూ కానిది అస్తమితమూ కానిది. ఉదయాస్త మయాలు లేనిదని అర్థం. జనన మరణాలు లేని పదార్థమే అలాంటిదై ఉంటుంది. జ్ఞేయ ప్రపంచంలో అలాంటిదొకటి కూడా కానరాదు. ప్రతిదానికీ రాకపోకలు ఉండి తీరవలసిందే. పోతే అలాంటి దోషాలు రెండూ లేనిది ఒకే ఒక పదార్థముంది. అదే ఆత్మ చైతన్యం. అది నిరాకారం. స్వతస్సిద్ధం. సర్వవ్యాపకం. కాబట్టి అది ఎప్పుడూ అనుదిత అనస్తమితమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అన్వాహార్యపచన ()
Telugu original

అన్వాహార్యపచన : శరీరంలో కూడా త్రేతాగ్నులున్నాయి. గార్హపత్యం జఠరాగ్ని ఆహవనీయం ముఖంలో ఉన్న ఉష్ణగుణం. పోతే హృదయంలోని దక్షిణ ద్వారం నుంచి వ్యానమనే వాయువు బయటికి వచ్చి రక్తంలో కలిసిన అన్నరసాన్ని సర్వశరీరమూ వ్యాపింపజేస్తుంది. అది శక్తి రూపంగా సర్వత్రా ప్రసరిస్తుంది. ఆహారం పచనమైన తరువాత జరిగే వ్యవహారం గనుక దీనికీ పేరు వచ్చింది. దక్షిణాగ్ని అని దీనినే పేర్కొంటారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అన్యూనానతిరిక్త ()
Telugu original

అన్యూనానతిరిక్త : తక్కువా కాదు. ఎక్కువా కాదని అర్థం. హెచ్చు తగ్గులు లౌకిక పదార్థాలకేగాని ఆత్మకు లేవు. నిరాకారం గనుక దానికి న్యూనాధిక లక్షణాలు ఉండబోవు. శాస్త్రంలో కూడా ఏదైనా ఒక సిద్ధాంతం చేస్తే అది అలాగే ఉండాలి. కనుక నిష్కర్షగా చెప్పిన మాటకు కూడా అన్యూనానతిరిక్తమని పేరు వర్తిస్తుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనురాగ/అనురక్త ()
Telugu original

అనురాగ/అనురక్త : రాగమంటే రంగని శబ్దార్థం. రంగు అద్దినట్టు మనసుమీద ఒక విషయం ముద్రితమైతే అలాంటి తాదాత్మ్య గుణానికి Identity with the object అనురాగమని పేరు. వల్లమాలిన అభిమానమని అర్థం. ఇట్టి అభిమానం ఉన్న మనస్తత్వం కలవాడెవడో వాడనురక్తుడు. Affected or attached. ప్రపంచ వాసనలు బాగా మనసుకు పట్టినవాడని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనుప్రవేశ ()
Telugu original

అనుప్రవేశ : ఒకటి ప్రవేశించిన తరువాత మరొకటి ప్రవేశిస్తే దాని కను ప్రవేశమని పేరు. మొదట ప్రపంచ సృష్టి అయిన తరువాత బ్రహ్మాండ శరీరంలో ప్రజాపతి రూపంగా పరమాత్మ ప్రవేశిస్తాడు. ఆ తరువాత పిండాండంలో జీవరూపంగా ప్రవేశం జరిగింది. 'అనేన జీవేన ఆత్మనా అనుప్రవిశ్య' అని ఉపనిషత్తు జీవుని ప్రవేశాన్ని పేర్కొన్నది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనవబోధ ()
Telugu original

అనవబోధ : అవబోధమంటే జ్ఞానం కావచ్చు. అనుభవం కావచ్చు. ఇలాటి ఆత్మానుభవం కలగకపోతే దాని కనవబోధమని పేరు. అజ్ఞానమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనవసాద ()
Telugu original

అనవసాద : అవసాదమంటే కుంగిపోవటం, దిగబడి పోవటం Depression, ధైర్యం కోల్పోవటం. అలాంటిది లేకుండా ధైర్యం అవలంబించి ఉండగలిగితే అది అనవసాదం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనవసరం ()
Telugu original

అనవసరం : అవసరమంటే ఇక్కడ Necessity అని కాదు. సందర్భమని అర్థం. Opportune moment or context. అలాంటి సందర్భమేర్పడకపోతే శాస్త్రంలో అనవసరమని పేర్కొంటారు. అప్రసక్తి అని కూడా అనవచ్చు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అధిష్ఠాన ()
Telugu original

అధిష్ఠాన : ఆధారం, ఆస్పదం. Basis. దేనిమీద ఆరోపణ జరుగుతుందో అది. అధిష్ఠానమెప్పుడూ వస్తువే. అంటే సత్యమే. ఆరోపితమే ఆభాస. అదికూడా వస్తువుకు అన్యం కాదు. వస్తువే మరో రూపంలో భాసిస్తే దానికాభాస అని పేరు. వస్తువుగా అది సత్యం - ఆభాసగా అసత్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనధిగమ ()
Telugu original

అనధిగమ : ఒక గమ్యాన్ని పొందటం అధిగమమైతే పొందక పోవటం అనధిగమం Unattainment.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనామయ ()
Telugu original

అనామయ : ఆమయమంటే రుగ్మత. మాలిన్యం. దోషం. Defect. ఎలాంటి దోషమూ లేకుంటే అనామయం. నిర్దోషమైన పదార్థం ఒక్క బ్రహ్మతత్వమే. కనుక అసలైన అనామయ మదే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనాశ్రిత ()
Telugu original

అనాశ్రిత : దేనినీ ఆశ్రయించక అంటిపట్టక తనపాటికి తాను బ్రతకటం. 'అనాశ్రితః కర్మఫలం' అని గీత. కర్మఫలాన్ని కోరనివాడు అనాశ్రితుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనుప్రశ్న ()
Telugu original

అనుప్రశ్న : ఒక ప్రశ్నతో నిలవక దానికి అనుబంధంగా రెండు మూడు ప్రశ్నలు వేస్తూ పోతే అది అను ప్రశ్న. అనుప్రశ్నేన సేవయా అని గీత. గురువును శిష్యుడైనవాడు అన్ని కోణాలలో ప్రశ్నించి ఆత్మజ్ఞానాన్ని గడించాలని శాస్త్రం చెప్పేమాట.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనుయాయి ()
Telugu original

అనుయాయి : అనుసరించి వెళ్ళేవాడు. Follower. పెద్దలు ఒక సిద్ధాంతం చేస్తే దానిని నమ్మి ఆ మార్గంలోనే పయనించేవారు అందరూ దాని అనుయాయులే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనువిధాన/అనువిధాయి ()
Telugu original

అనువిధాన/అనువిధాయి : ఒక విషయం ఒక మార్గంలో నడుస్తుంటే దాని అడుగుజాడలలో దాని ననుసరించి పోయే మరొక విషయానికి అనువిధాయి అని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనిర్వేద/అనిర్విణ్ణ ()
Telugu original

అనిర్వేద/అనిర్విణ్ణ : నిర్వేదమంటే విసుగు చెందటం. మోక్షమార్గంలో అది ఒక పెద్ద అంతరాయం. దానివల్ల ఫలితం సిద్ధించదు. కనుక అభ్యాసి అయినవాడు నిర్వేదం చెందక సహనంతోనే ముందుకు సాగిపోవాలి. ఈ సహనానికే అనిర్వేదమని పేరు. అలాంటివాడికే అనిర్విణ్ణుడని పేరు. అనిర్విణ్ణేన చేతసా అని గీతా వచనం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనిర్దేశ్య ()
Telugu original

అనిర్దేశ్య : నిర్దేశించటమనగా పేర్కొనటం Mention. పేర్కొనటానికి ఏ మాత్రమూ వీలు లేనిది అనిర్దేశ్యం. Unmentionable. అది మన స్వరూపమే. మరేదీ కాదు. నామరూపాలు లేవు గనుక దానిని ఇదమిత్థమని పేర్కొనలేము.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనింగన ()
Telugu original

అనింగన : ఇంగనమనగా కదలిక. చలనం. ఏ మాత్రమూ చలనంలేనిపదార్థం అనింగనం. అది బాహ్యమైన ఆకాశమైతే ఆంతరంలో చిదాకాశమైన ఆత్మతత్త్వం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనాభాస ()
Telugu original

అనాభాస : ఇలాగలాగని ఏ రూపంలోనూ భాసించని పదార్థం అనాభాసం. Non apparant. విషయ రూపం కాని ఆత్మతత్వం ఎప్పుడూ అనాభాసమే. ఆభాసం దానికి విషయమైన ప్రపంచమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనిర్మోక్ష ()
Telugu original

అనిర్మోక్ష : నిర్మోక్షమంటే బయటపడడం. Release. తప్పించుకోవడం. అలాంటి భాగ్యం లేకుంటే దాని కనిర్మోక్షమని పేరు. సంసారబంధ Bondage మని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనుపదిష్ట ()
Telugu original

అనుపదిష్ట : గురూపదేశం లేకుండానే ఉత్తమాధికారికి పూర్వజన్మ సుకృతం కొద్దీ బ్రహ్మానుభవం కలిగితే అలాటిదానికి అనుపదిష్టమని పేరు. ఇది ప్రహ్లాదాదుల విషయంలో మనకు కనిపిస్తుంది. 'మనుష్యాణాం సహస్రేషు' అన్నట్టు కోటికొక్కడికి పట్టే అదృష్టమది. బాహ్యప్రకృతిని చూస్తూ తద్ద్వారానే వాడు బ్రహ్మానుభవం పొందగలడు. శాస్త్రాచార్య ప్రమేయం అలాంటివాడికి అక్కరలేదు. దీనికే Intuition అని పెద్దలమాట.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనుపహిత ()
Telugu original

అనుపహిత : ఉపాధులలో చిక్కుబడిపోయిన జ్ఞానానికి ఉపహితమని పేరు. Confined to a medium. ఉపాధుల ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా వ్యాపించే చైతన్యానికి అనుపహితమని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనృత ()
Telugu original

అనృత : ఋతం కానిది. ఋతమంటే సత్యం. సత్యం కానిది అనృతం. False. Unreal అనాత్మ ప్రపంచమంతా సత్యంకాదు. సత్యమైన ఆత్మ తాలూకు ఆభాస. Appearance. కనుక దీనిపాటికిది అనృతం. ఆత్మరూపేణా సత్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనృతాభిసంధి/సంధ ()
Telugu original

అనృతాభిసంధి/సంధ : అనృతమైన మీదనే అభిసంధి లేదా ఉద్దేశం Intention పెట్టుకుని ఆ భావనతోనే మరణించిన జీవి అనృతాభిసంధి. వీడికి ప్రపంచ వాసనలున్నాయి కాబట్టి పునరావృత్తి తప్పదు. దీనికి భిన్నంగా సత్యాభి సంధియై పోతే వాడు విదేహముక్తుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనేజత్‌ ()
Telugu original

అనేజత్‌ : ఏజత్‌ అంటే కదిలేది. చలించేది. అనేజత్‌ అంటే చలనం లేనిది. అచలమైన ఆత్మస్వరూపం. 'అనేజదేకం మనసో జవీయః' అని ఉపనిషత్తు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనైకాంతిక ()
Telugu original

అనైకాంతిక : ఐకాంతికం కానిది. ఒకే ఒక రూపంలో ఉంటే అది ఐకాంతికం. Uniform or Consistent. అలాకాక ఎప్పటికప్పుడు మారుతూ పోయేది అనైకాంతికం. Inconsistent. చరాచర ప్రపంచమంతా పరిణామశీలమే. Ever changing కనుక అనైకాంతికం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అగ్నీషోమ ()
Telugu original

అగ్నీషోమ : అగ్నిహోత్రుడు చంద్రుడు అని వాచ్యార్థం. కాని అగ్ని అంటే ప్రాణం. చంద్రుడంటే మనస్సు అని అంతరార్థం. మనస్సు అన్న వికారం. అన్నం ప్రాణంలో ఆహుతి అవుతుంది. అలాగే మనస్సు నిద్రావస్థలో ప్రాణంలో తలదాచు కుంటుంది. ప్రాణం మనోరూపమైన అన్నాన్ని ఆహుతి చేసుకుంటుంది కాబట్టి మనస్సు అన్నమైతే ప్రాణమన్నాదుడు అని ఉపనిషత్తులు వర్ణించాయి. పౌరాణిక వాఙ్మయంలో దీనినే శివకేశవ తత్వాలుగా కల్పించి కథలల్లుతూ వచ్చారు. విష్ణువు స్థితికర్త గనుక అన్నాత్మకమైన తత్వమైతే రుద్రుడు లయ స్వరూపుడు గనుక అన్నాదుడని మహర్షుల కల్పన. మొత్తానికి జ్ఞేయప్రపంచమే అన్నం. దాన్నిగ్రహించే ఆత్మజ్ఞానమే అన్నాదుడు. ఈ రెండింటి అంతరార్థం చెబుతూ ఉన్న సాంకేతికభాషే అగ్నీషోమం. దీని ఆంతర్యం గ్రహించి జ్ఞేయాన్నంతా ఎప్పటికప్పుడు తన జ్ఞానంలో హోమం చేసుకొని అంతా జ్ఞానస్వరూపంగా దర్శించే జీవన్ముక్తుడు చేసే యాగం అగ్నీషోమ యాగం. అంటే జీవన్ముక్తుడి జీవితమే అని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్‌ ()
Telugu original

అప్‌ : జలమని అర్థం. పంచభూతాలలో పైనుంచి నాలుగవది. క్రింది నుంచి రెండవది. ఆపః అని దీని బహువచనం. ఇది ద్రవం. శుక్లస్యందన స్వభావం. కేవలం జలమనేగాక ఆపః అనేది పంచభూతాలకు కూడా ఉపలక్షణంగా Indicator చెప్పుకోవచ్చు. 'ఆపః పురుష వచసో భవంతి' అని శాస్త్రం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపకర్ష ()
Telugu original

అపకర్ష : ఉత్కర్షకు వ్యతిరేకి Opposite. తగ్గిపోవటం Diminution. క్రిందికి దించటమని అక్షరార్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపచయ/అపక్షయ ()
Telugu original

అపచయ/అపక్షయ : తగ్గిపోవటం. కృశించటం Decrease. Decay. షడ్భావ వికారాలలో ఇది ఐదవది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపచార ()
Telugu original

అపచార : ఉపచారం కానిది. అపరాధం. మార్గం తప్పటం అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపదేశ ()
Telugu original

అపదేశ : ఒక నెపం. ఒకమిష. Pretext. మాట సామెత. మభ్యపెట్టి చెప్పటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపహతపాప్మా ()
Telugu original

అపహతపాప్మా : పాపాలన్నీ పటాపంచలైనది. అవిద్యా కామకర్మలే పాపాలు. అవి పూర్తిగా తొలగిపోయి పరిశుద్ధమైనది ఆత్మతత్వం. కనుక అపహతపాప్మా అంటే ఆత్మస్వరూపమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపమృత్యు ()
Telugu original

అపమృత్యు : అకాలంగా మరణించటం. మరణానికి అకాలమంటూ లేదు. ఏదో ఒక కాలంలో జరగవలసిందే అది. అయినా అనుచిత కాలంలో జరిగితే దాని కపమృత్యువని వాడుక వచ్చింది. Inauspicious moment.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపరస్పర ()
Telugu original

అపరస్పర : పరస్పరమనే అర్థం. Mutual. ఒకదానికొకటి కార్యకారణాలు అవుతూ దానివల్లనే ప్రపంచసృష్టి జరిగిందని నాస్తికుల సిద్ధాంతం. ప్రపంచం అపరస్పర సంభూతమని వారనేమాటను భగవద్గీత పేర్కొన్నది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపరోక్ష ()
Telugu original

అపరోక్ష : పరోక్షమంటే కనపడనిది. ఇంద్రియ గోచరం కానిది. పరోక్షం కానిది అపరోక్షం. ప్రత్యక్షమని అర్థం. Direct experience. ఆత్మ ఎప్పుడూ మనకు పరోక్షం కాదు. అపరోక్షమే. 'యత్‌ సాక్షాదపరోక్షా దాత్మా' అని ఉపనిషత్తు. నేననే భావం నాకెప్పుడూ ప్రత్యక్షమే గదా. దానికి మరొకదాని వ్యవధానం లేదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపలాప ()
Telugu original

అపలాప : కప్పిపుచ్చటం. సత్యాన్ని సత్యంగా కాక మరొక విధంగా భావించి ఆ రూపంలో బయటపెట్టటం. Concealling the fact.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపవర్గ ()
Telugu original

అపవర్గ : వర్గానికి చెందనిది. వర్గమంటే ధర్మార్థకామాలు. వీటికి త్రివర్గమని పేరు. ఇవి మూడూ కలిసి ఒక ముఠా. త్రిగుణాలను దాటిపోలేనిది కనుక ఒక వర్గం పోతే ఇలాటి వర్గంలో చేరనిది, దాన్ని దాటిపోయినది ఏదో అది అపవర్గం Uncombined. అంటే మోక్షమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపవాద ()
Telugu original

అపవాద : అధ్యారోప అపవాద న్యాయమని ఉంది అద్వైతంలో. మొదట ఒక వస్తువుమీద మరొక వస్తువును తెచ్చిపెడితే అది అధ్యారోపం Imposition. మరలా ఆ తెచ్చిపెట్టిన దాన్ని త్రోసిపుచ్చితే అపవాదం refutation. వస్తువే అయినప్పుడు త్రోసివేయట మెలా సాధ్యం. అందుకే ఆ తెచ్చిపెట్టినది వస్తువు కాదు. ఆభాస అన్నారద్వైతులు. ఆభాస అంటే ఏదోగాదు. వస్తువే మరొక రూపంలో కనపడటం. రజ్జువు సర్పాకారంగా భాసిస్తున్నదంటే రజ్జువే అలా కన్పిస్తున్నది. అది కన్పిస్తున్నంతవరకు రజ్జువు దృగ్గోచరం కాదు. ఆరోపితం అధిష్ఠానాన్ని కప్పి పుచ్చుతుంది. కనుక దీన్ని అపవాదం చేస్తేగాని అసలైన అధిష్ఠానాన్ని చూడలేము. అపవదించటమంటే ఎక్కడికో తోసివేయటమని భావించరాదు మరలా. ఇది అదేనని తద్రూపంగానే భావించడం. దీనికే ప్రవిలాపమని Merging in the substance మరొక పేరు. పరమాత్మలో ఈ ప్రపంచమంతా అలా ప్రవిలాపనం చేయటమే అసలైన అపవాదం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపహ్నవ ()
Telugu original

అపహ్నవ : అపలాపమనే మాటకిది పర్యాయం Synonymn. రెండింటికీ అర్థం ఒకటే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపహార ()
Telugu original

అపహార : ప్రక్కకు తీసుకెళ్ళటం. దూరం చేయటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపహృత ()
Telugu original

అపహృత : తొలగింపబడినది. మరుగు పడినది. 'అజ్ఞానేన అపహృతం జ్ఞానం' అని గీతా వచనం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపరిహార్య ()
Telugu original

అపరిహార్య : పరిహరించుటకు వీలులేనిది. అనివార్యమైనది. తప్పనిసరి Unavoidable. 'తస్మా దపరిహార్యే అర్థే' తాపత్రయాన్ని ఆత్మ జ్ఞానం లేకుండా పోగొట్టుకోలేడు మానవుడు. అంతవరకు అది అపరిహార్యమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపరిచ్ఛిన్న ()
Telugu original

అపరిచ్ఛిన్న : పరిచ్ఛిన్నమంటే పరిమితమైనది. Limited. అలాటి హద్దులేవీ లేక ఆకాశంలాగా వ్యాపించినదైతే అపరిచ్ఛిన్నం. Unlimited.Endless. పరిపూర్ణమని అర్థం. ఆత్మతత్వమొక్కటే అపరిచ్ఛిన్నమైనది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్యయ/అపీతి ()
Telugu original

అప్యయ/అపీతి : లయమని అర్థం. కలిసిపోవటం. ఏకం కావటం. సుషుప్తిలో జీవుడు బ్రహ్మతత్వంలో చేరి ఏకమై పోతాడు. కనుకనే స్వపితి నిద్రిస్తున్నాడని పేరు వచ్చిందట. స్వం - తనలో తానే, అప్యేతి -చేరిపోతున్నాడు. కనుక స్వపితి Sleeps అని సంజ్ఞ ఏర్పడిందని వ్యాఖ్యానించారు అద్వైతులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపిధాన/అపిహిత ()
Telugu original

అపిధాన/అపిహిత : పిధానమన్నా, అపిధానమన్నా మూత Lid. or Cover అని అర్థం. అలాంటి మూతబడిన పదార్థానికి అపహితం లేదా పిహితమని పేరు. 'హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం' అని ఈశావాస్యం వర్ణించింది. సూర్యమండలానికి దాని తేజస్సే అపిధానమై ఉపాసకునికి మార్గం స్ఫురించటం లేదట. అది తొలగించమని ఉపాసకుడు సూర్యుని ప్రార్థించటమిది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపర్యాప్త ()
Telugu original

అపర్యాప్త : తగినంత, చాలినంత అయితే పర్యాప్తం Enough or Sufficient. అలా కానిదైతే అపర్యాప్తం. Insufficient.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపాదాన ()
Telugu original

అపాదాన : ఒక పదార్థంలో నుంచి మరొక పదార్థం బయటికి వస్తున్నప్పుడు ఆ మొదటి పదార్థం దాని కపాదానం. The thing which some other thing emanates.Source. ఇంట్లో నుంచి మనం బయటకు వచ్చామంటే ఇల్లు మనకు అపాదానం. మాయాశక్తి ప్రపంచానికి ఇలాంటి అపాదానమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపాన ()
Telugu original

అపాన : శరీరంలోని ఐదు విధములైన వాయువులలో రెండవది. మొదటిది ప్రాణం. 'ప్రాగ్గమనవాన్‌ ప్రాణః' బయటికి వచ్చే నిశ్వాసం Exhalation. 'అర్వాగ్గమనవాన్‌ అపానః' లోపలికి వెళ్ళే ఉచ్ఛ్వాసం. Inhalation. ఇది శరీరం పైకి తేలిపోకుండా క్రిందికి అదిమిపట్టి నిలుపుతుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపాయ ()
Telugu original

అపాయ : విడిపోవటం. వేరయిపోవటం Separation. తొలగిపోవటమని కూడా అర్థమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపేక్షా ()
Telugu original

అపేక్షా : ఒకదాని అక్కర. అవసరం. Need. ప్రతికార్యానికీ దాని కారణంతో అపేక్ష ఉంటుంది. కారణం లేకుండా కార్యమేర్పడదు. రెండూ ఒకదానికొకటి సాపేక్షం. Inter dependent.Relative. అలా కాకుంటే నిరపేక్షం. Absolute. చరాచర పదార్థాలన్నీ సాపేక్షమే. ఒక్క ఆత్మతత్వమే నిరపేక్షం. దీనికేమిటి దీనికేమిటని అడిగేందుకు అవకాశమివ్వటం కూడా అపేక్షే. అది ఉన్నంతవరకూ అనవస్థాదోషం తప్పదంటారు వేదాంతులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపృథగ్భావ ()
Telugu original

అపృథగ్భావ : పృథగ్భావమంటే వేరయిపోవటం. Separation. అలాకాక కలిసి మెలిసి ఉంటే అపృథగ్భావం. Union. కార్యకారణాలకు ఇలాంటి అవినాభావమే ఉంటుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపృథగ్దర్శీ ()
Telugu original

అపృథగ్దర్శీ : తన స్వరూపానికి అన్యంగా వేరుగా దేనినీ చూడని ఆత్మజ్ఞాని. అలాంటి వాడికెపుడూ అనాత్మ కనిపించదు. అంతా ఆత్మ స్వరూపంగా ఏకంగా దర్శనమిస్తుంది. దీనికే అపృథగ్దర్శనమని పేరు. అలా దర్శిస్తూ శిష్యులకు బోధించాలట ఆచార్యుడు. అలాంటి ఆచార్యుడి దర్శనానికే ఆగమమని పేరు. ఇది శాస్త్రజ్ఞానం మాత్రమే కాదు. జ్ఞానం అనుభవానికి వచ్చినప్పుడు అది ఆగమమవుతుంది. అపృథగ్ధర్శనమన్నా, ఆగమమన్నా ఒక్కటే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపార ()
Telugu original

అపార : పారంలేనిది. అంతం లేనిది. Endless. ఆత్మజ్ఞానమలాంటిది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపూర్వ ()
Telugu original

అపూర్వ : పూర్వం కానిది. మొదట లేనిది. మొదలు లేనిదని కూడా అర్థమే. బ్రహ్మమని తాత్పర్యం. 'అపూర్వ మనపరం' అని బ్రహ్మాన్ని వర్ణించింది శాస్త్రం. అపూర్వమంటే మరొక అర్థం కూడా కద్దు. ఇప్పుడు చేసిన కర్మకు వెంటనే ఫలిత మనుభవానికి రాదు. అది లోకాంతరాలకు వెళ్ళిన తరువాతగాని అనుభవించలేడు మానవుడు. అంతవరకు నిలవ ఉంటే అలాంటి కర్మఫలానికి అపూర్వమని పేరు. లోకుల వాడుకలో ఉన్న అదృష్టమనే మాటకు కూడా ఇదే అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపోహ ()
Telugu original

అపోహ : త్రోసి పుచ్చటం. ఊహ కానిది. ఊహ అంటే ప్రోగవటం. Gather. ప్రోగవకుండా ఎక్కడికక్కడ విడిపోతే అపోహ. Scatter.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపర ()
Telugu original

అపర : పూర్వం కానిది. వెనుక. Next Latter.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపరబ్రహ్మ ()
Telugu original

అపరబ్రహ్మ : బ్రహ్మం నిర్గుణమైతే, పరం సగుణమైతే అపరం కార్యబ్రహ్మమని శబల బ్రహ్మమని కూడా పేర్కొంటారు. దీనికే ఈశ్వరుడని God వ్యవహారం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపరాంతకాల ()
Telugu original

అపరాంతకాల : సంసారియైన జీవుడు మరణిస్తే అది అపరాంత కాలం. జీవన్ముక్తుడు పోతే అది పరాంత కాలం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపౌరుషేయ ()
Telugu original

అపౌరుషేయ : పౌరుషేయమంటే పురుషుడు కల్పించినది. పురుషుడు తయారు చేయనిదైతే అపౌరుషేయం. Super human మానవ బుద్ధికి అతీతమైనదని Beyond mind అర్థం. వేదవాఙ్మయమంతా ఇలాంటి అపౌరుషేయమే నంటారు మన పెద్దలు. కానీ అది మానవ సృష్టి కాకపోయినా పరమాత్మ సృష్టి అని చెబుతారు వేదాంతులు. అది కూడా కాదంటారు మీమాంసకులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపార్థ ()
Telugu original

అపార్థ : అసలైన అర్థం కాక దానికి విరుద్ధమైన అర్థం స్ఫురిస్తే దానికి అపార్థమని పేరు. ఇలాంటి విరుద్ధమైన అర్థం చెప్పుకోకూడదు. అలా చెప్పుకునే అవకాశం రచయిత ఇవ్వకూడదు. శాస్త్రంలో ఇది ఒక దోషం. పోతే అర్థమంటే ప్రయోజనమని కూడా అర్థమే. అప్పటికి అపార్థమంటే ప్రయోజనం లేని విషయం అని కూడా చెప్పవచ్చు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపద ()
Telugu original

అపద : పదం కానిది. పదమంటే స్థానం. గుర్తు. 'అపదస్య పదైషణః' అని గౌడకారిక. జీవన్ముక్తుడు సిద్ధి పొందితే అతని జాడ మనకెక్కడా గోచరం కాదు. ఆకాశంలో ఎగిరిపోయే పక్షి కాలి గుర్తులాంటిది. చూచినప్పుడే గాని తర్వాత తెలియదు. అలాంటిదే ముక్తపురుషుడి వ్యవహారం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపాద ()
Telugu original

అపాద : ఓంకారంలో మూడు మాత్రలకు ఆత్మ తాలూకు మూడు పాదాలు అర్థమని చెప్పారు. పోతే నాలుగవ మాత్ర మాత్రకాని మాత్ర. అమాత్ర అని పేర్కొన్నారు. అది సూచించే నాలుగవ పాదం ఆత్మలో కూడా అపాదమే. మొదటి మూడు పాదాలు చేర్చే సాధనాలయితే ఇది చేరే స్థానం. చేరిన తరువాత ఇక వ్యవహారం లేదు కనుక అపాదమని పేర్కొన్నారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపరమార్థ ()
Telugu original

అపరమార్థ : పరమార్థమంటే వాస్తవం. వాస్తవం కానిది అపరమార్థం. అపారమార్థికమన్నా ఇదే అర్థం. వ్యావహారికంగానే చలామణి అయ్యే విషయం. పరమార్థ జ్ఞానం కలిగేవరకూ ఈ జగత్తు అపారమార్థికమే. కలిగితే ఈ వ్యవహార మంతా పరమార్థంగానే మారి అనుభవానికి వస్తుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపరిముషిత స్మృతి ()
Telugu original

అపరిముషిత స్మృతి : జీవన్ముక్తులు రెండు జాతులు. ఒకరు ప్రారబ్ధం తీరి విదేహ ముక్తులయ్యేవారు. ఇంకొకకరు అలా వెంటనే కాక కొంతకాలం నిలిచి ఉండేవారు. పరమాత్మ వారికొక అధికారం అప్పగిస్తాడు.అది తీరేవరకువారు కొన్ని జన్మలైనా ఉండవలసిందే లేదా ఒక జన్మలోనే కొన్ని దేహాలైనా ధరిస్తూ పోవలసిందే. అలా ధరిస్తూ పోయినప్పుడు అంతకు ముందున్న వారి బ్రహ్మానుభవ స్మృతి పరిముషితంకాదు. అంటే దెబ్బ తినదు. లోపించకుండా అలాగే అపరిముషితంగా నిలిచి ఉంటుంది. దీనికే అపరిముషిత స్మృతి Un affected divine knowledge అని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపంచీకృత ()
Telugu original

అపంచీకృత : పంచీకృతమంటే ఆకాశాది పృథివ్యంతం అయిదు భూతాలూ ఆయా పాళ్ళలో ఒకదానిలో ఒకటి చేరి స్థూల ప్రపంచంగా ఏర్పడటం. అలా ఏర్పడక పూర్వం అవన్నీ అతిసూక్ష్మంగా ఉండిపోతాయి. అపంచీకృతమంటే అలాంటి భూత సూక్ష్మాలు. దీనికే సూక్ష్మప్రపంచమని పేరు. దీని కధిష్ఠాత అయిన సమష్టి జీవుడు హిరణ్యగర్భుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపక్వ సమాధి ()
Telugu original

అపక్వ సమాధి : సమాధి దశ ఇంకా పాకానికి రాకపోతే అలాంటి యోగికి అపక్వ సమాధి అని పేరు. జ్ఞానంలో కూడా కర్మవాసనలు పక్వం కాకపోవచ్చు. అలాంటప్పుడు సమాధి సిద్ధించటం చాలా కష్టసాధ్యం. అభ్యాసం కొద్దీ కర్మ పక్వమై సమాధి ఏర్పడుతుంది. అంతవరకూ ఈ దశ తప్పదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపక్వాశయ ()
Telugu original

అపక్వాశయ : ఆశయమంటే కర్మాశయం. కర్మ సమూహం. ఇది మనసులో పేరుకొని ఉంటుంది. అది ప్రారబ్ధమైతే అనుభవానికి వస్తుంది. అప్పుడది పక్వం. అలాకాక ఇంకా సంచితరూపంగా నిలిచేది చాలా ఉంటుంది. అది పక్వమైతేగాని సాధకుడి ప్రయత్నం పూర్తిగా ఫలించదు. అసలు జ్ఞానంకూడా ఉదయించదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపరిమేయ ()
Telugu original

అపరిమేయ : పరిమాణం కలది పరిమేయం. Measurable. అలాంటిది కాకుంటే అపరిమేయం. Beyond measurement. పరమాత్మ తత్త్వం సర్వవ్యాపకం గనుక అది ఎప్పుడూ అపరిమేయమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపాత్రదాన ()
Telugu original

అపాత్రదాన : పాత్రుడు కానివాడికి చేసే దానం. పాత్రుడంటే యోగ్యుడు. యోగ్యుడు కానివాడు అపాత్రుడు. అలాంటివాడికి జ్ఞానంగాని, ధనంగాని ఏది దానం చేసినా అది ఫలితమివ్వదు. ఇవ్వకపోగా దుష్ఫలిత మిచ్చినా ఆశ్చర్యంలేదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపాకరణ ()
Telugu original

అపాకరణ : తొలగించుకోవటం. పోగొట్టుకోవటం. తీర్చుకోవటం. ఋణత్రయాన్ని తీర్చుకోటానికి ఋణాపాకరణమని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపాణిపాద ()
Telugu original

అపాణిపాద : పాణిపాదములు రెండూ లేనివాడని అర్థం. పాణి పాదాలంటే చేతులు, కాళ్ళు ఇలాంటి అవయవాలు సాకారమైన జీవుడికి తప్ప నిరాకారమైన పరమాత్మకు లేవు. కనుక అది అపాణిపాదమని పేర్కొన్నారు. నిరవయవమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపాపవిద్ధ ()
Telugu original

అపాపవిద్ధ : పాపాలంటే అవిద్యా కామకర్మలు. అవి జీవుడికి తప్ప ఈశ్వరుడికి లేవు. అతడు పాపవిద్ధుడు కాడు. అంటే ఈ మూడు పాపములచేత దెబ్బతినడు అని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపూర్వవిధి ()
Telugu original

అపూర్వవిధి : శాస్త్రంలో ఒక కార్యం విధించేటప్పుడు అది అంతకుపూర్వం ఎక్కడా విధించబడినది కాగూడదు. క్రొత్తగా విధించవలసి ఉంటుంది. అప్పుడే దానికి ప్రామాణ్యం. అలాగ విధించబడిన కార్యానికి అపూర్వ విధి అని పేరు. ఆత్మ జ్ఞానమనేది ఇలాటి అపూర్వ విధి కాదు. ఆత్మస్వరూపం పూర్వమే సిద్ధమై ఉన్నది. క్రొత్తగా తయారుచేయనక్కరలేదు. తయారు చేయవలసినది పూర్వమీమాంస చెప్పే కర్మకాండ. ఇది దానికి కేవలం భిన్నమైన విషయం. కనుక క్రొత్తగా విధించనక్కర లేదు కానీ అలాటి ఆత్మతత్వం మానవుడు గుర్తించలేదు గనుక దానిని మరలా గుర్తు చేసుకోమని చెప్పటమే శాస్త్రం విధించవలసిన విషయం. కనుక దీనికి నియమవిధి అని వేదాంతులు పేరుపెట్టారు. కొంత సిద్ధమై, మరికొంత సాధించవలసి వస్తే అది నియమ విధి. పూర్తిగా సాధించవలసినదైతే అపూర్వవిధి. ఇందులో రెండవది మీమాంసకుల దర్శనమైతే, మొదటిది వేదాంతుల దృక్పథం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రకృత/అప్రస్తుత ()
Telugu original

అప్రకృత/అప్రస్తుత : ప్రకృతం, ప్రస్తుతమంటే అప్పటికప్పుడు ప్రారంభించినది ప్రస్తావించినది అని అర్థం. అలా కాకుంటే అప్రకృతం లేదా అప్రస్తుతం. ఇంతవరకూ ప్రస్తావన చేయని విషయం. అలాంటిది శాస్త్రంలో తటస్థపడితే అది అప్రకృతం. ఒక విషయం వర్ణిస్తూ ఉన్నప్పుడు అదే ప్రకృతంగాని దానికి అన్యమైన మరొక విషయానికి అక్కడ స్థానం లేదు. లేకున్నా పేర్కొంటే దానికి అప్రకృతమని పేరు వస్తుంది Out of context.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రాకరణిక ()
Telugu original

అప్రాకరణిక : ప్రకరణం అంటే సందర్భం. context. అసందర్భంగా మాటాడితే అది అప్రాకరణికం. సందర్భ శుద్ధి లేనిదని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రతిగ్రహ ()
Telugu original

అప్రతిగ్రహ : ప్రతిగ్రహమంటే దానం తీసుకోవటం. Receving a gift. అలాంటిదేదీ ఒక దాత దగ్గర తీసుకోకపోతే అది అప్రతిగ్రహం. ఇంద్రియ నిగ్రహానికి ఇది చాలా ముఖ్యమైన గుణం. సాధకుడైనవాడు దీనిని అలవరచుకోవటం మంచిదని యోగశాస్త్రంలో మాట. జ్ఞానికి కూడా ఇది అవసరమే. వస్తువులమీద చాపల్యం లేకపోవటం సాధనకు ఎంతో అవసరంగదా. కనుక అప్రతిగ్రహం యోగికి, జ్ఞానికి కావలసిన లక్షణమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రజ్ఞ ()
Telugu original

అప్రజ్ఞ : ప్రజ్ఞ లేనివాడు. ప్రజ్ఞ అంటే స్ఫురణ. Awareness. సుషుప్తిలో జీవుడికి ప్రపంచం తాలూకు స్పృహ లేదు. గనుక సుషుప్తిలోని జీవుడికి అప్రజ్ఞుడని పేరు. కాని తన స్వరూపం తాలూకు స్మృతి అతనికి ఉంటుందని అద్వైతుల మాట. అది పైకి కనపడక పోవచ్చు. కాని ఉండి తీరాలి. లేకుంటే మెలకువ వచ్చిన తరువాత సుఖంగా నిద్రపోయానని, ఏదీ తెలియలేదని తన అనుభవాన్ని నలుగురికీ చెప్పలేడు. కనుక 'నా ప్రజ్ఞం' అని కూడా వర్ణించింది మాండూక్యం. అంటే ప్రజ్ఞ లేకుండా పోలేదని అర్థం. ఏ ప్రజ్ఞా! ప్రపంచ ప్రజ్ఞ కాదు. ఆత్మ ప్రజ్ఞ. ఆత్మ నిత్యసిద్ధం గనుక దాని తాలూకు ప్రజ్ఞకూడా నిత్యసిద్ధమే అయి తీరాలి. ఇది ఇందులో భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రచ్యుత ()
Telugu original

అప్రచ్యుత : ప్రచ్యుత అంటే జారిపడడం. ఆత్మనిష్ఠలో ఉన్న జ్ఞాని నిరంతరమూ జారిపడకుండా జాగ్రత్త వహించాలి. ఎప్పటికప్పుడు ఆత్మానుసంధానం చేసుకుంటూ పోవాలి. విజాతీయ భావాలు దండెత్తే అవకాశముంది కాబట్టి 'తత్వాదప్రచ్యుతో భవేత్‌' అని గౌడపాదులు సెలవిచ్చారు. తత్త్వజ్ఞానం నుంచి ఎప్పుడూ అప్రచ్యుతుడు అనగా జారిపడకుండా నిష్ఠతో ఉండాలని ఆయన ఉపదేశం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రత్యయ ()
Telugu original

అప్రత్యయ : ప్రత్యయమంటే జ్ఞానం. నమ్మకం. ఆత్మతాలూకు భావన. The idea of the supreme self. అలాటి విశ్వాసం లేకున్నా జ్ఞానం లేకున్నా దానికి అప్రత్యయమని పేరు. Lack of belief on knowledge.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రతిష్ఠిత ()
Telugu original

అప్రతిష్ఠిత : ప్రతిష్ఠ లేనిది. ఒకచోట స్థిరంగా నిలిచి ఉండనిది. అస్థిరం. ఆత్మచైతన్యం ఎక్కడ ఉందని ప్రశ్న వచ్చింది ఛాందోగ్యంలో. అది ఎక్కడా లేదు. అప్రతిష్ఠిత మన్నాడు సనత్కుమారుడు. కారణం అది ఎక్కడైనా ఉండాలంటే అది ఒక ప్రదేశమై ఉండాలి. ఒక స్థానమై ఉండాలి. ఆత్మ సర్వవ్యాపకం. నిరాకారం. దానికి దేశ కాలాలు ఆధారం Base కావటానికి వీలులేదు. కనుక అది ఎప్పుడూ అప్రతిష్ఠితమే. అంటే మరి ఒకదానిమీద ఆధారపడదని అర్థం. పోతే అసలు లేనిదికాదు. తనమీదనే తాను ఆధారపడుతూ తనపాటికి తానున్నది. కనుక స్వప్రతిష్ఠితం. Self Existent. Self contained.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రతిఘ/అప్రతిహత ()
Telugu original

అప్రతిఘ/అప్రతిహత : Unobstructed. ఎదురులేని, అడ్డగించబడని, నిరాఘాటంగా ప్రసరించేదని అర్థం. జ్ఞాన మప్రతిఘం. సిద్ధపురుషుల జ్ఞానమెప్పుడూ అలాంటిదే. సిద్ధి చతుష్టయంలో ఇది ఒకటి.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రతిపత్తి ()
Telugu original

అప్రతిపత్తి : ప్రతిపత్తి లేకపోవటం. Inapprehension. స్ఫురించకపోవటం. ఏదీ స్ఫురించకపోవటం. అసలు విషయాన్ని గుర్తించలేక మౌనం వహించటం. ఆత్మ విషయంలో ఫలానా అని గుర్తించటం అసంభవం. గుర్తిస్తే అది మనకు విషయమయ్యే ప్రమాదముంది. అప్రతిపత్తే దాని ప్రతిపత్తి.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రతిపక్ష ()
Telugu original

అప్రతిపక్ష : విరుద్ధమైన పక్షం ప్రతిపక్షం. Opposition. అలాంటి ప్రతిపక్షం లేకపోతే అప్రతిపక్షం A tenet without opposition.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రతిరోధ ()
Telugu original

అప్రతిరోధ : ప్రతిరోధమంటే ప్రతిబంధం. ప్రతిబంధం లేనిది అప్రతిరోధం. Without any obstruction.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రతిబంధ ()
Telugu original

అప్రతిబంధ : ప్రతిబంధం లేకపోవటం. అడ్డు లేకపోవటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రతిషేధ ()
Telugu original

అప్రతిషేధ : ఒకదానిని కాదని నిషేధించటం. Negation. నిషేధించబడిన విషయం కాకుంటే అది అప్రతిషేధం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రతియోగి ()
Telugu original

అప్రతియోగి : ప్రతియోగి కానిది. అనుయోగి అని అర్థం. అంటే ఒక విషయాన్ని తనదిగా భావించేది. అభావ ప్రతియోగి అంటే దేనికి మనం అభావం చెబుతున్నామో అలాంటి అభావం కలిగిన పదార్థం అని భావం. A thing to which belongs the absence. అభావాన్ని కలిగినది అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రమాణ ()
Telugu original

అప్రమాణ : ప్రమాణం అంటే Proof. ప్రమాణం లేని పదార్థం అప్రమాణం. Unproved thing. ఏ ప్రమాణానికీ గోచరించకపోతే అది వాస్తవమని చెప్పలేము. ఏదో ఒక ప్రమాణానికి ఈ ప్రపంచమంతా గోచరించి తీరవలసిందే. చివరకు ప్రత్యక్షానుమానాలు కూడా శ్రుతిప్రమాణం దగ్గర వీగిపోతాయి. కాబట్టి తాత్కాలికంగా ప్రపంచం ప్రమాణ సిద్ధమైనా పరమార్థంలో అప్రమాణమే. పోతే ఆత్మ ప్రమాణానికి విషయం కాకపోయినా ప్రమాణాదులన్నీ దానిలోనుంచే ప్రసరిస్తున్నాయి. అది వీటికి పూర్వమే అహం అనే రూపంలో సిద్ధమై ఉన్నది. కనుక అప్రమాణమైనా అదే ప్రమాణమన్నిటికీ.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రమేయ ()
Telugu original

అప్రమేయ : ప్రమాణానికి విషయమైతే అది ప్రమేయం. To be known. ఆత్మ విషయం కాదు. విషయి. కనుక అది అప్రమేయం. Beyond all instruments of knowledge. జ్ఞానంచేత కొలిచేది కాదది. కొలత కతీతమైన జ్ఞాన స్వరూపమే అది. కనుక ఎప్పుడూ అది అప్రమేయమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రమాద / అప్రమత్త ()
Telugu original

అప్రమాద / అప్రమత్త : ప్రమాదమంటే పరాకు. Lack of attention. వాస్తవాన్ని గుర్తించకపోవటం. ఆత్మ ఒక్కటే వాస్తవమైన తత్వం. దానిని ఉన్నదున్నట్టు గుర్తించక పోవటమే ప్రమాదం. అలాంటి ప్రమాదానికి గురియైనవాడు ప్రమత్తుడు. ఇలాంటి ప్రమాదం లేకపోవటం అప్రమాదం. అంటే ఆత్మ విషయంలో జాగరూకత, సరియైన అవగాహన. అలాంటి అవగాహన నిత్యమూ ఉన్నవాడెవడో వాడు అప్రమత్తుడు. అనగా తన స్వరూపాన్ని తాను నిరంతరమూ గుర్తిస్తూ పోయే జ్ఞాని.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రమిత ()
Telugu original

అప్రమిత : ప్రమాణానికి గురియైనది ప్రమితం. Cognised. ప్రమితం కాకపోతే అప్రమితం. Not known. Not cognised. అలాంటి పదార్థం ఉన్నదనిగాని, లేదని గాని చెప్పలేము. ఏదో ఒక విషయం ప్రమితమైనప్పుడే మరొకదాన్ని అప్రమితమని కొట్టివేయవచ్చు. ప్రమితమైనది లేకుండా ప్రతి ఒక్కటీ అప్రమితమని చెప్పరాదు. ప్రమితమనేది ఎప్పుడూ మన స్వరూపమే. కనుక దానిని ఆలంబనం చేసుకుని మిగతా ప్రపంచం తాత్కాలికంగా ప్రమితమైనా అది అవాస్తవమే అని సిద్ధాంతం చేస్తారు అద్వైతులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రతిబోధ ()
Telugu original

అప్రతిబోధ : ప్రతిబోధం లేకపోవటం. ప్రతిబోధమంటే స్ఫురణ. జ్ఞానోదయం. ఇది ఒక మెరపులాగ సాధకుడి మనస్సులో తళుక్కుమని మెరవవలసి ఉంది. అది కలగనంత వరకు శ్రవణ, మననాదులకు సార్థక్యం లేదు. మనస్సులో కలిగే ప్రతి ఆలోచనకూ ప్రతిబోధమని పేరు. ప్రతి ఆలోచనా ఒక విశేషమే. అది నిర్వికల్పమైన మన జ్ఞానంలోనుంచే ఉదయిస్తుంది. దానిని ఆధారం చేసుకొని దాని మూలస్థానాన్ని అన్వేషించి పట్టుకోవటం సులభమన్నారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రతిబోధ విదితం ()
Telugu original

ప్రతిబోధ విదితం : అలాగ ప్రతి బుద్ధి ప్రత్యయాన్ని ఆధారం చేసుకొని సాధకుడైనవాడు దాని అధిష్ఠానమైన తన స్వరూపాన్ని పట్టుకోగలిగితే అది వాడికి విదితమవుతుంది. ఇదే ప్రతిబోధ విదితమనే మాటకర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రకాశ ()
Telugu original

అప్రకాశ : ప్రకాశించడమంటే స్ఫురించడం. వెలుతురని గాదు అర్థం. బయట పడి కనిపించడం. ప్రతి ఒక్కటీ లోకంలో మన ఇంద్రియాలకు అలాగే కనిపిస్తున్నది. స్ఫురిస్తున్నది. అలా స్ఫురింపజేసే వెలుగు గాని వెలుగొకటి మన లోపలే ఉంది. అదే ఆత్మచైతన్య ప్రకాశం. దానిని ప్రకాశింపజేసే పదార్థం మరొకటి లేదు. కనుక అది గుప్తంగానే ఉండిపోయింది. గుప్తమైనా తనలో తాను ప్రకాశిస్తూనే ఉంటుంది. కనుక బాహ్యపదార్థాలలాగ మరొక ప్రకాశం మీద ఆధారపడకపోవటం మూలాన అప్రకాశమైనా తనపాటికి తాను స్వయంప్రకాశం గనుక ప్రకాశమే. అది కాని ప్రపంచమే అప్రకాశం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రాకృత ()
Telugu original

అప్రాకృత : ప్రకృతి సంబంధమైనది ప్రాకృతం. త్రిగుణాత్మకమైన ప్రపంచమంతా ప్రాకృతమే. భౌతికమే. పోతే అభౌతికమైన పదార్థం ఆత్మతత్వం. అది త్రిగుణాలకు అతీతం గనుక ప్రాకృతం కాదు. అప్రాకృతం. Not Physical but meta Physical.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రాప్త / ప్రతిషేధ ()
Telugu original

అప్రాప్త/ప్రతిషేధ : తటస్థ పడ్డది ప్రాప్తం. పడకుంటే అప్రాప్తం. శాస్త్రంలో ఒక సందర్భం తటస్థపడి దాన్ని కాదని చెప్పవలసి వస్తే ప్రాప్త ప్రతిషేధమని దానికి పేరు. అలా తటస్థపడకపోయినా దాన్ని నిషేధించటం పనికిరాదు. నిషేధించటానికి అక్కడ విషయం లేదు. అది అప్రాప్తమే గాని ప్రాప్తం కాదు కదా. అలాంటప్పుడు నిషేధించే అవకాశమెక్కడిది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రాణ ()
Telugu original

అప్రాణ : 'అప్రాణః అమనాః' అని పరమాత్మను వర్ణించింది ఉపనిషత్తు. ప్రాణమంటే క్రియాశక్తి. మనస్సంటే విశేష జ్ఞానం. ఇవి రెండూ పరమాత్మకు లేవు. అది చలనాత్మకం కాదు గనుక అప్రాణం. విశేష జ్ఞానం కాదు గనుక అమనస్కం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రత్యాఖ్యేయ ()
Telugu original

అప్రత్యాఖ్యేయ : ప్రత్యాఖ్యేయం కానిది. ప్రత్యాఖ్యేయమంటే త్రోసివేయవలసినది. ఆత్మ అనాత్మలాగ త్రోసివేసే పదార్థం కాదు. నేను నేననే భావమే కదా ఆత్మ. మరి దేనినైనా త్రోసివేయవచ్చునేగాని నేననే భావాన్ని త్రోసిపుచ్చటం సాధ్యంకాదు. త్రోసివేసే వ్యక్తి ఆ నేనే. కనుక అది ఎప్పుడూ అప్రత్యాఖ్యేయమే. అంటే అహేయమే. Irrefutable.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రత్యక్ష ()
Telugu original

అప్రత్యక్ష : ఇంద్రియాలకు గోచరిస్తే ప్రత్యక్షం. ఇంద్రియాలతోపాటు మనస్సుకు కూడా అతీతమైతే అది అప్రత్యక్షం. Unperceivable. Inconceivable. పరోక్షమని అర్థం. Absent. ఆత్మ ఏ ప్రమాణానికీ గోచరంకాదు. ఆత్మప్రమాణానికే గోచరించ వలసి వుంటుంది. కనుక మిగతా పదార్థాలలాగా ప్రత్యక్షమయ్యేది కాదని దీనిభావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రతీకార ()
Telugu original

అప్రతీకార : ఒకరు చేసిన దానికి బదులు చేయలేకపోవటం Without reaction or retaliation.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రదేశ ()
Telugu original

అప్రదేశ : ఒక ప్రదేశమంటూ లేనిది. ఏ ప్రదేశంలోనూ ఇమడనిది. Nonspacial Beyond space. ఆత్మ సర్వవ్యాపకం గనుక అది ఒకానొక ప్రదేశంలో ఉందని చెప్పటం హాస్యాస్పదం. అది ఎప్పుడూ దేశానికీ, కాలానికీ అతీతమైన తత్వం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రవిభక్త దేశకాల ()
Telugu original

అప్రవిభక్త దేశకాల : దేశకాలాలు రెండూ ప్రవిభక్తం కాని అనగా వేరుగాలేని పదార్థాలేవో అవి అప్రవిభక్త దేశకాలాలు. ఆ పదార్థాలు ఒకటి ఆత్మచైతన్యం మరొకటి అనాత్మ ప్రపంచం. ప్రపంచంలో చరాచర పదార్థాలు ఏవి చూసినా ప్రతి ఒక్కదానిలో అస్తీ భాతీ అనే ఆత్మ స్వరూపమూ నామారూపాలనే అనాత్మ స్వరూపమూ రెండూ కలిసి ఉన్నాయి. ఒకటి లేని మరొకటి కానరాదు. సత్‌ చిత్‌లున్న చోటనే నామ రూపాలున్నవి. అవి ఉన్న కాలంలోనే ఇవీ ఉన్నవి. ఒక దానిని విడిచి మరొకటి విభక్తంగా లేవు. కనుక దీనిని బట్టే నామరూపాత్మకమైన ప్రపంచం సచ్చిదాత్మకమైన చైతన్యం కంటే వేరుగా లేదని చెప్పవచ్చు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రసక్త ()
Telugu original

అప్రసక్త : ప్రస్తకం కానిది. ఒకదాని సాంగత్యం లేనిది. ఆత్మచైతన్యం. అంతేకాదు, ఏ విషయంలోనూ లగ్నంకాని మనస్సయితే అలాంటి మనస్సు కూడా అప్రసక్తమే. సందర్భానికి సరిపడనిది కూడా అప్రసక్తమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రాసంగిక ()
Telugu original

అప్రాసంగిక : ఒక ప్రధాన విషయం చెబుతూ ఉన్నప్పుడు మధ్యలో ప్రసంగవశాత్తు మరొక విషయం చెప్పవలసి వస్తే అది ప్రాసంగికం. అలా కానిది అప్రాసంగికం. అంటే మనం చెప్పుకునే ప్రధాన విషయమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రవృత్త ()
Telugu original

అప్రవృత్త : Un commenced. Un proceeded. ఇంకా ప్రవృత్తం కానిది. ఆరంభం కానిది. ఏ పనీ పెట్టుకొననిది. అన్ని కర్మల నుంచి వైదొలగినదని కూడా అర్థమే. ఒక విషయంలో ఇంకా ప్రవేశించకపోతే చెప్పవలసినదింకా పేర్కొనకపోతే ఆ శాస్త్రం అప్రవృత్తం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అనభిభవ/అనభిభూత ()
Telugu original

అనభిభవ/అనభిభూత : అభిభవమంటే ఎదిరించటం. అడ్డగించటం. దాడి చేయటం. అలాంటి ప్రతిబంధం లేకుంటే అనభిభవం. అభిభవం లేని పదార్థం అనభిభూతం. Unattacked. Free.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రధాన ()
Telugu original

అప్రధాన : ప్రధానం కానిది. ప్రధానమంటే Main ముఖ్యమైనది. అంత ముఖ్యం కాకపోతే అది అప్రధానం. Subsidiary. అంగమని శేషమని గూడా దీనికి పేరు. Accessory.

Vedānta Paribhāṣā Vivaraṇa
అప్రబోధ ()
Telugu original

అప్రబోధ : ప్రబోధం లేకపోవటం. అజ్ఞానం. ఆత్మజ్ఞాన రాహిత్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అఫల ()
Telugu original

అఫల : ఫలమంటే ప్రయోజనం. ఏ ప్రయోజనమూ లేని దానికి అఫలమని పేరు. 'ఫలవత్‌సన్నిధౌ అఫలం తదంగం' అని ఒక న్యాయమున్నది. తనపాటికి తనకు ఏ ప్రయోజనం లేకపోయినా ప్రయోజనం ఉన్న ఒక విషయం చెప్పినప్పుడు దాని సన్నిధిలో ఇది కూడా చేర్చి చెబితే దాని ప్రయోజనమే దీనికీ సిద్ధిస్తుందని, అప్పుడిది అఫలం కాదు సఫలమేనని పెద్దల మాట.

Vedānta Paribhāṣā Vivaraṇa
అఫలాకాంక్షీ ()
Telugu original

అఫలాకాంక్షీ : కర్మ చేసేటప్పుడు ముఖ్యంగా శాస్త్ర విహితమైన కర్మలు ఆచరించేటప్పుడు దాని ఫలితం మీద కాంక్ష లేదా కోరిక లేకుండా తనకది విధియని నిష్కామంగా ఆచరించటం. × అభయ : 'అభయం సత్వసంశుద్ధిః' దైవగుణాలలో ఇది మొదటిది. సాధన మార్గంలో భయమనేది పనికిరాదు. నిస్సంకోచంగా ముందుకు ధైర్యంతో సాగిపోవాలి. అప్పుడే అది గమ్యం చేరుస్తుంది. అభయమంటే బ్రహ్మతత్వం కూడా. ద్వితీయమైన పదార్థమే లేనిది గనుక అది ఎప్పుడూ అభయమే. భయరహితమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అభవ ()
Telugu original

అభవ : భవమంటే సంసారం. భవమంటే జన్మ. దీని ఊసు లేనిదేదో అది అభవం. జన్మరాహిత్యం అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపునరావృత్తి ()
Telugu original

అపునరావృత్తి : పునరావృత్తి అంటే మరలా జన్మించటం. Re-birth. అది లేని దశ అపునరావృత్తి. బ్రహ్మ సాయుజ్యం లేదా మోక్షమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అబాధ/అబాధిత ()
Telugu original

అబాధ/అబాధిత : బాధ అంటే వేదాంతంలో Contradiction కొట్టివేయటం అని అర్థం. ఒక సిద్ధాంతం చేసినప్పుడు దానికి ఇలాటి ప్రతిబంధకమేదీ ఉండకూడదు. ఉంటే అది బాధితమవుతుంది. Contradicted. సత్యమెపుడూ అబాధితమై ఉండాలి. ఆత్మచైతన్యమొక్కటే సత్యం. దానికి అనాత్మ ప్రపంచంవల్ల బాధలేదు. అనగా అనాత్మ ఆత్మను కాదని కానీ, లేదని కానీ కొట్టివేయలేదు. మీదు మిక్కిలి ఆత్మజ్ఞానంవల్లనే సమస్త ప్రపంచమూ కొట్టుపడుతున్నది. కనుక ప్రపంచమే బాధితం. సత్యస్వరూపమైన ఆత్మ ఎప్పుడూ అబాధితమే. బాధ అనేది తర్కశాస్త్రంలో చెప్పిన అయిదు హేత్వాభాసలలో ఒకటి కూడా. హేత్వాభాస అంటే ఓబిజిజిబిబీగి. చెప్పిన లక్షణానికి దెబ్బ తగలకూడదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అబోధ/అబుద్ధ ()
Telugu original

అబోధ/అబుద్ధ : బోధ అంటే జ్ఞానం. ముఖ్యంగా ఆత్మజ్ఞానం. అది లేకుంటే అబోధ. అజ్ఞానమని అర్థం. అలాంటి అజ్ఞానికి అబుద్ధుడని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అభాన ()
Telugu original

అభాన : భానమంటే ప్రకాశించటం. కనపడడం. ఉన్నట్టు స్ఫురించటం. అలాంటి స్ఫురణ లేకుంటే అది అభానం. ప్రపంచమంతా భాతి. స్ఫురిస్తున్నది మనకు. ఇందులో స్ఫురించే పదార్థం స్ఫురణ లేకుంటే నిలవలేదు. అప్పుడది అభానమై పోతుంది. దానికి స్ఫురణను సమకూరుస్తున్నది ఆత్మచైతన్యమే. అది ఎప్పుడూ భానమే కానీ అభానం కాదు. × అభావ : భావమంటే ఉండటం. ఉనికి. స్థితి. దానికి వ్యతిరేకి అభావం. Negation or absence. పదార్థాలు భావ పదార్థాలని Present, అభావ పదార్థాలని రెండు విధాలు. భావపదార్థాలు ఆరయితే అభావ పదార్థాలు నాలుగని పేర్కొన్నారు తార్కికులు. ఈ అభావం మరలా నాలుగు విధాలు. ఒకటి ప్రాగభావం. రెండు ప్రధ్వంసాభావం. మూడు అన్యోన్యాభావం. నాలుగు అత్యంతా భావం. ఇవి నాలుగూ లేనిది ఒక్క ఆత్మతత్వమే. మిగతా అనాత్మ ప్రపంచమంతా ఈ నాలుగింటికి గురికావలసిందే. కనుక భావాభావాలు రెండూ చివరకు అభావమే. × అభ్యాగమ : ప్రాప్తించటం. వచ్చి పడటం. ఎదురుకావటం. చేయనిది వచ్చి పడితే అది అకృతాభ్యాగమం. ఇది హేతువాదానికి నిలవదు. కనుక ప్రతి కార్యానికీ అంతకుముందు కారణమనేది ఉండి తీరాలంటారు. × అభావనా : భావించకపోవటం. ముఖ్యంగా ఆత్మతత్వాన్ని గ్రహించలేకపోవటం. Not idea about the reality. ఇందులో శ్రవణం వల్ల ఈ అభావనా అనే దోషాన్ని పోగొట్టుకోవాలి సాధకుడు. శ్రవణం ఆత్మ స్వరూపాన్ని మనస్సుకు తెస్తుంది గనుక అభావన భావనగా మారే అవకాశం ఉంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అభ్యాస ()
Telugu original

అభ్యాస : సాధనమార్గంలో రెండే ఉన్నాయి సూత్రాలు. మొదటిది అభ్యాసం రెండవది వైరాగ్యం. ''అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే'' అని గీత. పదే పదే శ్రవణ మననాదులు సాగిస్తూ పోవటమే అభ్యాస అనే మాట కర్థం. Repetition of the idea of the supreme self or spiritual practice. మాటిమాటికీ అభ్యసిస్తూ పోవటంవల్ల ఆత్మజ్ఞానం బలపడే అవకాశం ఎంతైనా ఉంటుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అభ్యుపగమవాద ()
Telugu original

అభ్యుపగమవాద : అంగీకరించటం. సమ్మతించటం. To concede. ఒక సిద్ధాంతం తనకు ఇష్టమై దానిని అనుమతించినా అభ్యుపగమమే లేక పూర్తిగా తనకు విరుద్ధమైనా ఎదుటి వానిని కాదనలేక తాత్కాలికంగా సమ్మతించినా అభ్యుపగమమే. అలా సమ్మతించి చివరకు తగిన హేతువులు చూపి దానిని ఖండిస్తాడు సిద్ధాంతి. దీనికి అభ్యుపగమ వాదమని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అభిమాన / అభిమత ()
Telugu original

అభిమాన/అభిమత : తాదాత్మ్య బుద్ధి. Total Identity. ఒక పదార్థంతో పూర్తిగా మమేకమై పోవటం. శరీరంతో ప్రతి మానవుడూ అలాగే ఏకమై పోయాడు. అది మన జ్ఞానానికి గోచరించే విషయమైనా తన స్వరూపంగానే భావించి దానితో వ్యవహరిస్తున్నాడు. దీనికి దేహాత్మాభిమానమని పేరు. Identifying ourselves with our bodies. ఇలా మనం దేనిని అభిమానిస్తామో దానికి అభిమతమని పేరు. శరీరం మన అభిమానానికి విషయం గాబట్టి ఇది అభిమతం మనకు. × అభిజ్ఞాన : గుర్తించటం. మరుగుపడిన తన ఆత్మతత్వాన్ని మరలా మానవుడు శ్రవణ మననాదులతో గుర్తించగలగడం. అలా గుర్తు చేసుకున్నవాడు అభిజ్ఞుడు. × అభివ్యంజన : అభివ్యక్తం చేయటం. బయట పెట్టడం. స్పష్టం చేయటం. × అభివ్యక్త : అలా వ్యక్తం చేయబడ్డ ప్రపంచం. సూక్ష్మంగా ఉన్న అనాత్మ ప్రపంచాన్ని పరమాత్మ తనలోనుంచే స్థూలరూపంగా సృష్టించాడు గనుక స్థూలమైన ఈ ప్రపంచమంతా అభివ్యక్తమైందని చెబుతారు శాస్త్రజ్ఞులు. Manifest. ఇది వాస్తవంగా వ్యక్తమైనది కాదు. అవ్యక్తమే మరొక రూపంలో వ్యక్తమైనది గనుక దానికిది అన్యంకాదు. దాని ఆభాసే నంటారు అద్వైతులు. × అభివ్యాప్తి/అభివ్యాపక : సర్వత్రా వ్యాపించడం. దేశ కాలాలన్నీ వ్యాపించిన పదార్థం ఒక పరమాత్మే. కనుక దానికి అభివ్యాపకమని పేరు. ఇది ప్రతిపదార్థం లోపలా, వెలపలా, మధ్యలోనూ జరిగిన వ్యాప్తి గనుక అభివ్యాప్తి అయింది. అంతర్‌వ్యాప్తి, బహిర్‌వ్యాప్తి, స్వరూప వ్యాప్తి. ఈ మూడు విధాలుగా ఎప్పుడు వ్యాపించాడో అప్పుడు అభివ్యాపకమైన పరమాత్మ తప్ప అభివ్యాప్తమైన ప్రపంచమే అసత్కల్పమని సిద్ధాంతం చేయవలసి వస్తున్నది. ఇదే అద్వైత సిద్ధాంతం. × అభినివేశ : ఒక విషయంలో బాగా ప్రవేశించటం. నిమగ్నమై పోవటం. Indulgence. యోగశాస్త్రంలో చెప్పిన ఐదు క్లేశాలలో ఇది ఆఖరి క్లేశం. అవిద్యతో ప్రారంభమై అభినివేశంతో ముగిసింది మన సంసార యాత్ర. అవిద్య ఆత్మను గుర్తు చేయక అనాత్మను చూపితే ఆ అనాత్మనే ఆత్మగా భావించి తన్నిమిత్తంగా సంసార క్లేశాలన్నీ అనుభవానికి తెస్తున్నది ఈ అభినివేశం. కనుక అన్నిటికన్నా ప్రమాదకరమైనదిది. ఇది పోవాలంటే మొదట అవిద్యకు జవాబు చెప్పాలి. దానికి జవాబు బ్రహ్మవిద్య తప్ప మరొకటి లేదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అభిధాన / అభిధేయ ()
Telugu original

అభిధాన/అభిధేయ : ఒక అర్థాన్ని చెప్పే శబ్దం అభిధానం. పేర్కొనటమని అర్థం. Connotation. శబ్దాలన్నీ అభిధానమైతే వాటి అర్థాలు అభిధేయం. సాధారణంగా అభిధానం ముఖ్యార్థాన్నే చెబుతుంది. ఘటమన్నప్పుడు కుండ అనే అర్థమే స్ఫురిస్తుంది. అలా కాక శరీరమని అర్థం చెప్పామనుకోండి. అది అభిధావృత్తి Primary Sense గాదు. లక్షణావృత్తి Secondary Sense అని పేర్కొంటారు శాస్త్రజ్ఞులు. ఆత్మ అభిధేయం కాదు. ఆత్మ అనే శబ్దం కూడా దాన్ని చెప్పటం లేదు. చెబితే శబ్దం వాచకం, అర్థం వాచ్యమవుతుంది. ఆత్మ దేనికీ విషయం కాదు గనుక అవాచ్యం అనభిధేయం Not to be mentioned. కనుక దాన్ని లక్ష్యార్థంగానే భావన చేయాలి. అంటే శబ్దాకార అర్థాకార వృత్తిని Verbal వదిలేసి ఆత్మాకారంగానే దర్శించాలని తాత్పర్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అభిధ్యాన ()
Telugu original

అభిధ్యాన : ఒక విషయాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఏకధారగా దానిమీద మనస్సు నిలపటం (meditation). ధ్యానమన్నా ఇదే. 'ప్రత్యయైక తానతా ధ్యానం' అన్నాడు పతంజలి. × అభిప్రాయ : ఒక విషయాన్ని ఉద్దేశించడం Intention aim. × అభిప్రేత : దేన్ని ఉద్దేశిస్తామో ఆ విషయం Intended. × అభిభవ : ఉద్భవ అనే మాటకు జత మాట. ఉద్భవమంటే పైకి రావటం. అభిభవమంటే అణగద్రొక్కటం, ఎదిరించటం Overwhelm dominate. × అభిసంధి/అభిసంధా : ఒక లక్ష్యంమీద దృష్టి పెట్టటం. ఒక విషయాన్ని మనస్సులో ఉంచుకొని దానినే నిత్యమూ భావిస్తూ పోవటం. అది సత్యమైతే సత్యాభి సంధి. అనృతమైతే అనృతాభి సంధి. మరణ కాలంలో బ్రహ్మతత్వం మీద మనస్సు పెట్టుకొని వెళితే బ్రహ్మసాయుజ్యమే లభిస్తుందని అనృతమైన సంసార విషయాలమీద పెట్టుకొనిపోతే మరలా సంసార బంధం తప్పదని ఛాందోగ్యంలో సెలవిచ్చినమాట. × అభియోగ : ఒకరిమీద ఉన్నది, లేనిది కల్పించి చాడి చెప్పటం, అభాండం వేయటం. అది నిరూపించుకొనే బాధ్యత అభియుక్తుడికి తప్పదు. alleged. × అభ్యధిక : అధికమనే అర్థం. అదనంగా చెప్పుకోవలసినది additional point ఉన్న దానికి తోడు అది కూడా కలిస్తే దానికి బలమెక్కువ. అసలు విషయం కాక మరొక అప్రస్తుత విషయం చెప్పినా దానికి అభ్యధికమనే పేరు. × అభ్యంతర : అంతరమంటే లోపల. అభ్యంతరమన్నా లోపలి భాగమనే అర్థం. Inside internal. × అభ్యుపాయ : ఉపాయమనే అర్థంలోనే వస్తుంది. means. సాధనమని అర్థం. × అభ్యుచ్చయ : ఉచ్చయమన్నా ఇదే అర్థం. ఒకదానికి మరొకదాని అవసరం ఏర్పడ్డప్పుడు రెండూ కలిపి చెప్పడం. జ్ఞానానికి కర్మతో అవసరం ఉంటే దానికి ఉచ్చయమని, సముచ్చయమని కూడ పేరు. అభ్యుచ్చయమంటే అదనంగా ప్రస్తుతాంశానికి చేర్చి చెప్పుకొనే విషయం. × అభ్యుదయ : ఉదయించటం, పైకి రావటం, ఇంతేగాక ధర్మపురుషార్థం చక్కగా పాటిస్తే మరణానంతరం ఆయా లోకాలకు పోయి అక్కడగాని తరువాత జన్మ ఎత్తి ఆ జన్మలలో గాని అనుభవించే భోగభాగ్యాలు, సుఖశాంతులు వీటికి అభ్యుదయమని పేరు. prosperity. ధర్మపురుషార్థానికి ఫలితం ఇంతకన్నా మరేదీ లేదు. × అభ్యుత్థాన : ఎదురువెళ్ళడం, ఎదుర్కొనటం. సగౌరవంగా పెద్దలను ఆహ్వానించి వారి యోగక్షేమాలు విచారించటం. × అభ్యర్హిత : పూజితమైనది Respectable, ప్రధానమైనది Important, అభ్యర్హితం ప్రథమం అని శాస్త్రజ్ఞుల మాట. రెండు విషయాలలో ఏది ప్రధానమో, ప్రశస్తమో దాన్నే మొదట వర్ణించి చెప్పాలట. Preference. × అభ్యుపగమ : అంగీకరించడం. సమ్మతించటం, మనఃపూర్వకంగా కాదు. తాత్కాలికంగా ప్రతివాది వాదం ఒకవేళ మేము ఒప్పుకున్నా అది చెల్లదనే సందర్భంలో వస్తుందీమాట. Suppose we expect your position it is only hypotheitical. × అభ్యుపపత్తి : పొందటం. అందుకోవటం. ప్రాప్తి. Approach. × అభూత : అసలే లేనిది. అంతవరకు పుట్టనిది, తయారు కానిది Unborn nonexistent. × అభూతార్థ : లేని విషయాన్ని కల్పించి చెప్పటం. అభూత కల్పన అన్నా ఇదే. అసత్యమని అర్థం. ఎప్పుడూ జరగనిది. Fact కాదు. Fiction or false.

Vedānta Paribhāṣā Vivaraṇa
అభౌతిక ()
Telugu original

అభౌతిక : భౌతికం కానిది. beyond matter metaphysical. ప్రకృతికి అతీతమైన తత్త్వం. spiritual fact. × అభౌమ : భూమితో సంబంధంలేనిది. ప్రాపంచికంగా కానిది. ప్రపంచాతీతమైన విషయం. దివ్యమైనదని divine అర్థం. × అభూతపూర్వ : ఇంతకుపూర్వ మెప్పుడూ లేనిది, జరగనిది. Unpresidented. × అభేద : భేదం లేనిది. భేదమనేది Difference or Division మూడు విధాలు. 1. సజాతీయం - ఒక వృక్షానికి మిగతా వృక్షజాతి. 2. విజాతీయం - వృక్షజాతికి మిగతా లోకంలో ఉండే పదార్థాలన్ని 3. స్వగతం - ఆ వృక్షంలోనే కొమ్మలు, రెమ్మలు, ఆకులు, కాయలు లాంటివి ఈ మూడు భేదాలు చరచర పదార్థాలన్నింటికీ సహజంగా ఉండి తీరుతాయి. ఒక బ్రహ్మత్వానికి మాత్రమే ఇలాంటి భేదాలనేవి కానరావు. చైతన్యరూపేణా దానికి, జీవుడికి భేదంలేదు. అస్తిత్త్వ రూపేణా జగత్తుతో భేదంలేదు. నిరాకారం కనుక తనలో తనకు భేదంలేదు. కనుక మూడు భేదాలకు అతీతమైన పరమాత్మ కేవలం అభేద స్వరూపం. × అభేదవాదం : ఇలాంటి అభేదాన్ని పరమార్థంగా బోధించే సిద్ధాంతం. అద్వైత వాదమన్నా ఇదే. జీవజగదీశ్వర భేదాలు ఏవీ చెప్పదు అద్వైతం. × అమత : మతమంటే మనస్సుతో ఆలోచించేది. thought మనస్సుకు గోచరించేదంతా మతమే. ఆలోచనకు అతీతమైనదేదో అది అమతం. నామరూపాలు ఉన్న పదార్థం మాత్రమే ఆలోచనకు వస్తుంది. మనస్సుకు గోచరిస్తుంది. దానికి అతీతమైనది పరమాత్మ తత్త్వం. మనస్సుకు వచ్చే ప్రసక్తిలేదు. కనుక అమతమంటే అసలైన అర్థం ఆత్మచైతన్యం. × అమనాః : మనస్సు కానిది. మనస్సుకు అతీతమైనది beyond mind పరమాత్మ. × అమనస్కయోగ : మనస్సుకు అతీతమైన దశనందుకొనే మార్గం. జ్ఞానయోగమనే అర్థం. ఇందులో ప్రాపంచికమైన మనోవృత్తులు లయమై వాటి స్థానంలో కేవలం ఆత్మాకార వృత్తి మాత్రమే మిగిలిపోతుంది. × అమల : మలమంటే మాలిన్యం. Impurity నామరూపాద్యుపాధులే మాలిన్యం. దాని స్పర్శ లేకుంటే అమలం. అది ఆత్మస్వరూపం. × అమృత : మృతమంటే నశించినది. నాశమనేదే లేకుంటే అది అమృతం. మరణం లేనిదని అర్థం. ప్రపంచమంతా ఎప్పటికప్పుడు మారిపోతున్నది కనుక మృతమైతే ఇలాంటి మార్పు నిరాకారమైన ఆత్మకులేదు. కనుక ఆత్మే అమృతం. × అమృతత్వ : మృతత్వం కానిది. మృతత్వం సంసార బంధమైతే అది కాని అమృతత్వం కేవలం మోక్షమే Immortality. ''పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి'' అని పురుషసూక్తం. మూడు వంతులు అమృతం ఒక వంతు మృతమని అర్థం వస్తున్నది. పరమాత్మలో మృతమైన భాగం ఉందనే భ్రాంతి ఏర్పడవచ్చు. ఇక్కడ మృతమనేది ఆ అమృతం తాలూకు ఆభాసేగాని Appearance వాస్తవం కాదు గనుక మృతత్వదోషం దానికి ప్రాప్తించదు. × అమర్త్య : మర్త్యమంటే మరణించేది. మార్పు చెందేది. మర్త్యం కానిది అమర్త్య. Immortal ఎప్పటికీ ఒకే రూపంలో ఉండే కూటస్థ సత్యం. Immutable. × అమర : మరమటే మరణం. మరణం లేనిది అమరం. అవినాశి. Imperishable. ఆత్మ చైతన్యమని అర్థం. × అమిత : మితం కానిది. మితమంటే ఒక పరిమాణానికి గురి అయినది. Measurable. పరిమాణానికి అతీతమైనది అమితం. Immesurable. అనంతమైనది ఆత్మచైతన్యం. కనుక ఆత్మే అమితం. × అమృదిత కషాయ : కషాయమంటే దుష్కర్మ వల్ల ఏర్పడ్డ మనోమాలిన్యం. అది జ్ఞానోదయమైతే కాని మృదితం కాదు. అంటే మర్ధించబడదు. ప్రక్షాళనమై పోదు. ఆత్మజ్ఞానానికి నోచుకోనంతవరకు అది అమృదితమే. నారద మహర్షి ఎన్నో విద్యలలో ఆరితేరాడు. అవన్నీ ఆయనకు మనశ్శాంతి నీయలేదు. చివరకు సనత్కుమారుడి వల్ల బ్రహ్మోపదేశమయిన తరువాతనే ఆయన కషాయం మృదితమై నిర్మలమైన జ్ఞానం ఆయనకు ఉదయించినది. అని ఉపనిషద్‌వాక్యం. × అముత్ర : ఇహం కానిది. పరం ఈ లోకానికి సంబంధించినది. ఐహికమైతే పరలోకానికి చెందినది. అముత్ర లేదా అముష్మికం. × ఇహాముత్ర ఫలభోగ : ఇహానికి పరానికి సంబంధించిన కర్మఫలాన్ని అనుభవించటం. కర్మ చేసుకొనే కొద్దీ ఫలానుభవం ఇహపరాలలో తప్పనిసరి. ఆధ్యాత్మిక సాధనలో ఇది వాంఛనీయం కాదు. కనుక దీనిఎడల సాధకుడైన వాడు విరక్తి చెందవలసి ఉంది. ఇలాంటి విరాగం సాధన చతుష్టయంలో ఒకానొకటి. × అమూల : మూలమంటే ప్రమాణం. Authority Source. అలాంటిదేది లేని గ్రంథానికి గాని శాస్త్రజ్ఞుడి మాటకు గాని ప్రామాణ్యం ఏర్పడదు. × అమూర్త : మూర్తం అంటే ఒక ఆకారం ధరించినది Formed. అలాంటి ఆకారం ఏదీ లేక నిరాకారమైన తత్త్వమైతే అమూర్తం. Unformed Intangible. ఇంద్రియ విషయం కానిది అమూర్తం. చైతన్యమెప్పుడూ నిరాకారం కనుక అది అమూర్తమే. మన స్వరూపమే కనుక అమూర్తమైనా మనకది స్వానుభవమే. మరొక అర్థమేమనగా ప్రకృతి కమూర్తమని, దాని పరిణామమైన ప్రపంచానికి మూర్తమని వ్యవహారం. ప్రాణం మనస్సు కమూర్తమైతే ఇంద్రియ అవయవ ఆత్మకమైన స్థూలశరీరం మూర్తం కిందికి వస్తుంది. × అమేయ : మేయమంటే ఒకప్రమాణంచేత కొలవబడేది Measured. దానికి వ్యతిరిక్తమైనది అమేయం. కొలతకు అందనిది. అప్రమేయమని కూడా దీనిని పేర్కొంటారు. × అమోహ : మోహమంటే అజ్ఞానం. దానికి భిన్నమైన ఆత్మజ్ఞానం అమోహం. Without illusion. ఆత్మచైతన్యమని అర్థం. × అమోఘ : మోఘమంటే వ్యర్థం Futile. అలాకానిది అమోఘం. సార్థకమని అర్థం. Fruitful ప్రయోజనకరమైనది. × అమాత్ర : మాత్ర అంటే కొలత Measurement. కొలత లేనిది అమాత్ర. ఓంకారంలోని నాలుగు మాత్రలలో ఇది నాల్గవది. ఇది అమాత్ర అయినప్పుడు ఇది సూచించే ఆత్మతత్వంలో కూడా నాల్గవ పాదం అపాదమే అవుతుంది. ఇది మాత్ర కాదు, అది పాదం కాదు. కనుక చెప్పేది, చెప్పబడేది రెండూ ఏకమై అదే మన స్వరూపంగా అనుభవానికి వస్తుందని మాండూక్యం మనకు చేసే బోధ. × అమానవ : మరణానంతరం ఉపాసకుడు సూక్ష్మశరీరంలో కూర్చుని లోకాంతరాలకు ప్రయాణం చేయవలసి ఉంటుంది. కర్మవశాత్తూ చేసే ప్రయాణం కనుక అక్కడ బుద్ధి పనిచేయదు. కనుక మానవుడు కాని మానవాతీతమైన ఒక దేవతామూర్తి అతనిని చేయి పట్టుకొని ఆయా మజిలీలు దాటించి తీసుకుపోతాడని శాస్త్రవచనం. అమానవుడంటే అలాంటి దేవదూత Divine body. × అమానిత్వ : అభిమానం కలవాడు మాని. దేహాదులమీదకాని, వస్తువాహనాల మీదగాని అలాంటి అభిమానం తొలగించుకోగలిగితే ఆ గుణానికి అమానిత్వమని పేరు. అంతేకాక నా అంతవాడు లేడని అహంకరించటం కూడా మానిత్వమే. Self complacency. అలాంటి దోషం కూడ తొలగిపోతే అమానిత్వం. ఇది జ్ఞానికి ఉండవలసిన దైవగుణాలలో మొదటిది. 'అమానిత్వ మదంభిత్వ'మని గీతా వచనం. × అమూఢ : మూఢుడు కానివాడు. ఆత్మజ్ఞాని Realised soul. × అయుతసిద్ధ : ద్రవ్యగుణాదుల కున్న అవినాభావ Inseperable సంబంధం. ఒకటి నశించేవరకు మరొకటి దాన్ని అంటిపట్టుకొని ఉంటే అది అయుతసిద్ధ మన్నారు. ద్రవ్యమున్నంతవరకు దాని గుణం దాని క్రియ దానితోనే అవినాభూతంగా Inseperable ఉంటుంది. దీనినే సమవాయ సంబంధమంటారు తార్కికులు. తాదాత్మ్య సంబంధమంటారు Total Identity వేదాంతులు. × అయుక్త : యుక్తం కానిది. హేతువుకు నిలవనిది Unresonable. యుక్తి యుక్తం కానిదని అర్థం. మితిమీరినది ఏకాగ్రత లేనిదని కూడా అర్థమే. × అయోగ్య : యోగ్యమంటే అర్హం. ఉచితం. అన్ని విధాల తగినది. అలాంటిది కాకపోతే అయోగ్యం. చెల్లనిదని అర్థం. × అయుగపత్‌: యుగపత్‌అంటే ఒకేమారు Simultaneous. అలా కాక క్రమంగా చెప్పవలసి వస్తే అది అయుగపత్‌ Sequent. × అయౌగపద్య : క్రమంగా ఏర్పడటం Sequency. × అయాచిత : కోరబడినది యాచితం. కోరకుండా దానిపాటికది లభిస్తే అయాచితం. ఇలాంటి అన్నపానాదులతోనే జీవయాత్ర సాగించాలి సాధకుడు. × అయత్నసిద్ధ : ఏ ప్రయత్నం లేకుండా ఏర్పడినది. అద్వైత సాధన అలాంటిది. అనులోమంగా సాధించవలసినదేదీ లేదు. కేవలం గుర్తు చేసుకోవటమే. క్రియారూపం కాదది. భావనారూపం. × అరా ఇవ : ఒక చక్రంలో ఇరుసునుంచి పరిధి వరకు ప్రసరించే ఆకులకు అర అని పేరు. అవి ఎంత దూరం వెళ్ళినా ఇరుసులోనే చేరి ఉంటాయి. అదే వాటికి ఆధారం. మూలస్థానం. అలాగే శరీర వ్యాపారాలన్నీ ప్రాణశక్తిలోనే ఇమిడి ఉంటాయి. ప్రాణమే వాటికి ఆధారం. ఆ ప్రాణానికి మరలా ఆధారం ఆహమనే స్ఫురణతో కూడిన ఆత్మస్వరూపమే. × అరతి : రతి అంటే ఆసక్తి. అభిలాష. అలాంటి ఆసక్తి లేకపోవడం అరతి. వైరాగ్యమని అర్థం. Dischthment. × అరస : రసమనేది పంచభూతాలలో జలానికున్న గుణం. ఆత్మచైతన్యం అభౌతికం గనుక శబ్దస్పర్శాదులైన గుణాలేవీ దానిని అంటవు. అది అశబ్దం. అస్పర్శం. అరూపం. అరసం. × అరణి : నిప్పు చేసే పరికరాలు. ఒకటి ఉత్తరారణి. చకిముకి రాళ్ళలో పైరాయి మరొకటి అధరారణి క్రింది రాయి. ఈ రెండూ వరపిడి పెడితే నిప్పు పుడుతుంది. × అర్ణ : వర్ణం, అక్షరం Letter Syllable అని అర్థం. నవార్ణ మంత్రమని ఒక మంత్రముంది. దానిలో తొమ్మిది అక్షరాలు ఉంటాయి. కనుక నవార్ణమని పేరు వచ్చింది దానికి. × అర్థ : శబ్దార్థాలలో రెండవది. చెప్పేది శబ్దం. చెప్పబడేది అర్థం. ఒక పదమొక అర్థాన్ని చెబితే అది పదార్థం. thing and the sound వీటికి పదపదార్థాలని పేరు. మార్జాలమనే మాట శబ్దమైతే Sound అది పేర్కొనే జంతువు అర్థం. Sense or Meaning. అర్ధించబడేదేదో అది అర్థం. ఒక శబ్దం ద్వారా ఏది అర్ధిస్తామో కోరుతామో అది. ఇంతే గాక మానవుడు తన జీవితానికి గమ్యంగా ఏది కోరుకుంటాడో అది కూడా అర్థమే. దీనినే పురుషార్థమని The aim of human life పేర్కొంటారు. ధర్మార్ధకామ మోక్షాలనే నాలుగూ పురుషార్థాలే. అర్థమంటే ప్రయోజనమని కూడా ఒక అర్థం utility. అది ఉంటే ఏ విషయమైనా సార్థకం Purposfull. లేకుంటే నిరర్ధకం Meaningless useless. × అర్థవాద : 'విధిశేషః అర్ధవాదః' ఒక విషయాన్ని శాస్త్రం విధిస్తూ దానిమీద ప్రరోచన కలిగించటానికి ఒక మాట చెబుతుంది. అది స్తుతి కావచ్చు, నిందకావచ్చు. పరకృతి కావచ్చు. పురాకల్పం కావచ్చు. అంటే దాని గుణాలు ప్రశంసించటం ఒకటి. ఛీ అది మంచిది కాదని త్రోసిపుచ్చటం ఒకటి. పదిమంది ఇది చేసి బాగుపడ్డారని కథ చెప్పటం ఒకటి. ఎప్పటి నుంచో ఉన్నదే అని కల్పించటం ఒకటి. వీటివల్ల అది తప్పకుండా చేసి ఫలితం పొందాలనే ధృఢమైన సంకల్పమేర్పడుతుంది. సాధకుడికి అన్ని విధాలుగా చెప్పటంలో అదే తాత్పర్యం. అంచేత అర్థవాదమంతా నిజం కాదు. నిజాన్ని బయటపెట్టే ఒక పెద్ద సంకేతం. Symbal, Symbolism or Allegorical Statement. అది సత్యం కాదు కల్పన. కల్పన అయినా అకల్పితమైన సత్యాన్ని బయటపెట్టి మన దృష్టిని దానివైపు త్రిప్పటానికెంతో తోడ్పడుతుంది. కనుక వాంఛనీయం. మన వాఙ్మయమంతా ఇలాంటి అర్థవాదమే. అసలు భౌతిక ప్రపంచమే ఒక అర్థవాదమంటారు అద్వైతులు. × అర్థక్రియాకారి : అర్థమంటే ఇక్కడ ప్రయోజనం. Purpose utility. దానికోసం ఏర్పడిన క్రియ అర్థక్రియ. అది సాధించేవాడు క్రియాకారి. అంటే ఏదో ఒక ఫలితాన్ని సాధించటానికి తోడ్పడాలి. ఏది చెప్పినా దానికేదో ఒక ప్రయోజనముండాలి. అలా కాకపోతే నిష్ప్రయోజన మౌతుందది. అలాంటి దానికి అస్తిత్వం లేదు. ప్రామాణ్యం Authority లేదు. × అర్థాపత్తి : ఒక విషయం పైకి చెబుతున్నప్పుడు మరొక విషయం లోపలి నుంచి తొంగి చూడటం అర్థాపత్తి. ఆపత్తి అంటే ప్రాప్తించటం. 'దేవదత్తః పీవరః దివానభుంక్తే', దేవదత్తుడు బలంగా ఉన్నాడు కాని పగలు మాత్రం భోజనం చేయడట. భోజనం చేయకపోతే అంత బలంగా ఎలా ఉండగలిగాడు. తప్పక చేయాలి. ఎప్పుడు? పగలు కాదంటున్నాడు. కాబట్టి రాత్రి కాలం చేస్తూ ఉండాలి వాడు. అయితే ఆ మాట లేదక్కడ. లేకున్నా బలంగా ఉండటమనే విషయం సమర్థించటం కోసమా అర్థం అపన్నం కాక తప్పదు. దీనికే అర్థాపత్తి Implication అని పేరు. ఇది ఆరు ప్రమాణాలలో ఒకటి. విశేషరూపంగా మన జ్ఞానమూ, మనం చూచే జ్ఞేయమూ పని చేస్తున్నాయిప్పుడు. ఇది ఉంటే గాని అది లేదు. అది ఉంటే గాని ఇది లేదు. మరెలాగ? వీటి రెంటికీ విలక్షణమైన చైతన్యమనే అధిష్ఠానమొకటి ఉండాలని దీన్నిబట్టే అర్థమౌతుంది. ఇదే అద్వైతుల అర్థాపత్తి అనుకోవచ్చు. × అరిషడ్వర్గ : షడ్వర్గమంటే ఆరింటి సమూహం. ఈ ఆరూ ఒకదానికొకటి అనుకూలమైనా మానవుడికి ప్రతికూలం నుక అరులు అంటే శత్రువులే. ఆరుగురు శత్రువులున్నారు మన శరీరంలో. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలనే ఈ ఆరు భావాలే మన శరీరంలో దాగిఉన్న అంతశ్శత్రువులు. శరీరమంటే స్థూలం కాదు. సూక్ష్మశరీరమైన మనస్సు అని అర్థం. ఈ అరిషడ్వర్గం మనస్సుకు పట్టిన వ్యాధి. దీన్ని జ్ఞానమనే ఖడ్గంతో ఖండించినవాడే గొప్ప సాధకుడు. × అరిష్ట : రిష్టమంటే భగ్నం. అరిష్టమంటే భగ్నం కానిది. చెక్కుచెదరనిది Broken. శుభమని అర్థం. రిష్టమంటే అశుభమని కూడా అర్థమున్నది. అశుభంకానిది అరిష్టం. అంటే శుభమని మరలా అర్థం వస్తున్నది. × అరిష్టనేమి : నేమి అంటే చక్రం. భగ్నం కాకుండా దెబ్బ తినకుండా చక్కగా తిరిగే చక్రం. లాక్షణికమైన అర్థంలో ప్రాణశక్తి. చక్రాకారంగా అది సంచరిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ విచ్ఛిన్నంకాదు, అందుకే ఉచ్ఛ్వాసనిశ్శ్వాస రూపంగా నడుస్తున్న ప్రాణవాయువే. అరిష్టనేమి. 'స్వస్తినః స్తార్ష్యః అరిష్టనేమిః' అనే శాంతి వాక్యంలో తార్యుడంటే గరుత్మంతుడు. రెండు రెక్కలున్నవాడు. ఉచ్వాస నిశ్వాసాలే ఆ రెక్కలు అవి కల ప్రాణవాయువే గరుత్మంతుడని అంతరార్థం. × అరూప : రూపంలేనిది Without form నిరాకారమైన ఆత్మతత్త్వమని అర్థం. × అర్ధజరతీయ : అర్ధమంటే సగం జరతీ అంటే ముసలితనం కలిగిన వ్యక్తి. సగం తలనరసి సగం నరవని వ్యక్తి ఎవడో అలాంటి వాడికి అర్థజరతీయుడనిపేరు. ఇది వాచ్యార్థమైతే దీనికి లక్ష్యార్థం వేరే ఉంది. కొంత అటు కొంత ఇటు వాదిస్తే అది పూర్తిగా దేన్నీ సాధించదు. అలాంటి వాదానికి అర్థజరతీయమని పేరు పెట్టారు. × అర్థార్థిభావ : అనుకూలమైనది అర్థం. దాన్ని కోరే వ్యక్తి అర్థి. ఇరువురికీ ఉన్న సంబంధం అర్థార్థిభావం. మోక్షమర్థమైతే ముముక్షువైనవాడు అర్థి. సాధనచేసి పొందగలిగితే అదే జీవిత పరమార్థం. × అర్థానర్థౌ : అనుకూల ప్రతికూలాలైన భావాలు. వీటికే ద్వంద్వాలని పేరు. సంసారమంతా ద్వంద్వమయమే. దీనిని తప్పించుకొని బయట పడడమే మానవుడి కర్తవ్యం. × అర్థాంతర : ప్రస్తుత విషయం కాక దీనికన్యమైన విషయం. ఒక శబ్దానికి ఒక అర్థం మాత్రమేగాక దానికి మరొక అర్థం కూడా చెప్పగలిగితే అర్థాంతరం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అపృష్ట ()
Telugu original

అపృష్ట : పృష్టం కానిది. Unquestioned. ఇంకా ప్రశ్నించబడనిది. 'నాపృష్టః కస్యచిత్‌బ్రూయాత్‌.' ప్రశ్న వేయకుండా ఎవరికీ ఏదీ చెప్పకూడదన్నారు. ముఖ్యంగా పరమార్థ విషయంలో ఈ సూత్రం పాటించవలసి ఉంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవక్రచేతాః ()
Telugu original

అవక్రచేతాః : వక్రంగాని జ్ఞానం. సంపూర్ణమైన జ్ఞానమని అర్థం. అది ఏదో కాదు. పరమాత్మ స్వరూపం. అది సర్వవ్యాపకం. పరిపూర్ణం గనుక పరిమితత్వమనే దోషం లేదు దానికి.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవకాశ ()
Telugu original

అవకాశ : ఒక సిద్ధాంతం ప్రవర్తించటానికి ఒక మాట చెప్పటానికి వీలుపడటం Scope. అలాగే ఆకాశానికి కూడా అవకాశమని పేరు. ఖాళీ అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవగమ / అవగతి ()
Telugu original

అవగమ/అవగతి : గ్రహించటం. తెలుసుకోవటం. జ్ఞానం. జ్ఞానమేగాక అనుభవమని కూడా Realisation అర్థముంది. ప్రత్యక్షావగమమని గీతా ప్రయోగం. బ్రహ్మావగతి అంటే బ్రహ్మానుభవం. ఇది ఆత్మస్వరూపమే గనుక సాక్షాత్తుగానే అనుభవానికి వస్తుందని పెద్దల హామీ.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవచ్ఛేద ()
Telugu original

అవచ్ఛేద : ఒకచోటికి తెగిపోవటం. పరిచ్ఛిన్నం లేదా పరిమితం కావటం Limitation. ఇది ఇంత అని పరిగణించటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవతార ()
Telugu original

అవతార : క్రిందికి దిగిరావటమని అర్థం. అవరోహణమని కూడా అనవచ్చు. Descent. భగవత్‌చైతన్యం ఆయా రూపాలలో అప్పుడప్పుడు వచ్చి సాక్షాత్కరించటం అని భావం. అంతేగాక ఒకవిషయంలో ప్రవేశించటం కూడా అవతారం లేదా అవతారిక Introduction.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవధాన ()
Telugu original

అవధాన : Attention. Concentration. ఒకదానిమీద దృష్టి పెట్టటం. జాగ్రత్త వహించటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవధారణ ()
Telugu original

అవధారణ : Only. అదేకాని మరొకటి కాదని నిర్థారణ చేయటం. Determination. ఈ అర్థంలో ప్రయోగించేదే ఏవ అనే శబ్దం. 'ఆత్మైవనాన్యత్‌.' ఆత్మే మరేదీ లేదు. ఇది ఇలాగే, ఇంతే అని నిష్కర్ష చేసే మాట ఇది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవధి ()
Telugu original

అవధి : పర్యంతం. Boundary. Limit. కొస, చివర, మరణావధి. మరణం వరకు 'ఆ బ్రహ్మ భవనాత్‌' అన్నప్పుడు ఆ అనే మాట అవధిని చూపుతుంది. బ్రహ్మలోకం వరకూ అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవదాత ()
Telugu original

అవదాత : తెల్లనిది. స్వచ్ఛమైనది. అంతేకాదు. నిర్దుష్టమని కూడా అర్థమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవదాన ()
Telugu original

అవదాన : యజ్ఞంలో మేధ్యమైన పశువును చంపి దాని శరీరంలోని భాగాలను ఒకక్రమంలో బయట పెట్టటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవరోధ ()
Telugu original

అవరోధ : ప్రతిబంధం Obstruction. ప్రతిరోధమని కూడా దీనికి పర్యాయమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవభాస ()
Telugu original

అవభాస : వస్తువు మరొక రూపంలో కనపడటం. Appearance. రజ్జు సర్ప దృష్టాంతంలో రజ్జువే సర్పరూపంలో భాసిస్తున్నది. సర్పమక్కడ అవభాస. లేదా ఆభాస. పరమాత్మ ప్రపంచంగా కనపడటం కూడా ఇలాంటివే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవశేష / అవశిష్ట ()
Telugu original

అవశేష/అవశిష్ట : మిగిలిపోవటం. అన్నీ బాధితమైపోగా చివరకేది మిగిలి ఉంటుందో Residue. అది అవశిష్టం. అబాధితమైన ఆత్మస్వరూపమే అది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవయవ ()
Telugu original

అవయవ : శరీరంలో భాగం. కరచరణాదులు Limbs.. కేవలం భాగమని కూడా Part అర్థమే. సమష్టిలో Whole దాని వ్యష్టి Part కి అవయవమని పేరు. తర్కంలో పంచావయవ వాక్యమని ఉంది. Sylogism అని పాశ్చాత్య తర్కంలోమాట. ఇందులో ఐదు అవయవాలు లేదా భాగాలు ఉంటాయి. 1. ప్రతిజ్ఞ 2. హేతువు 3. దృష్టాంతం 4. ఉపనయం 5. నిగమనం. హేతువాదమంతా ఈ రూపంగానే సాగిపోవాలని తార్కికుల ఆదేశం. Argumentation.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవలంబ / అవష్టంభ ()
Telugu original

అవలంబ / అవష్టంభ : ఒక ఆధారం. Prop. Support. Base.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవసర ()
Telugu original

అవసర : అవకాశం Occasion. తగిన సమయం. సందర్భం context అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవసాన ()
Telugu original

అవసాన : చివరి దశ. అంతం. ఒకచోట ఆగిపోవటం. జీవితంలో వార్థక్యం తరువాత వచ్చే ఆఖరి దశ.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవస్థా/అవస్థాన ()
Telugu original

అవస్థా/అవస్థాన : నిలిచిపోవటం. నిలకడ చెందటం. Settlement. కదలకుండా ఉండటం స్థిరత్వమని కూడా అర్థమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవస్థాత్రయ ()
Telugu original

అవస్థాత్రయ : ప్రతిదినమూ మన మనుభవించే జాగ్రత్‌స్వప్న సుషుప్తులు మూడూ అవస్థలే. దశలే. దీనికే అవస్థాత్రయమని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవాంతర వాక్య ()
Telugu original

అవాంతర వాక్య : ఒక పెద్ద వాక్యంలో చేరిపోయినది. మధ్యలో వచ్చే చిన్న వాక్యం. Subsidiary. ఉపనిషత్తులో ఉపదేశించే వాక్యాలు రెండు విధాలు. 1. మహావాక్యం. తత్వమసి మొదలైనవి. జీవబ్రహ్మ ఐక్యాన్ని చెప్పే వాక్యాలన్నీ మహావాక్యాలు. పోతే అలాంటి వాక్యార్థాన్ని ఒక్కసారిగా గుర్తించలేని మధ్యమ మందాధికారులకు తత్‌, త్వమ్, అసి అనే పదార్థాల జ్ఞానం ముందుగా ఏర్పడవలసిన అవసరముంది. ఖండరూపమైన ఈ పదార్థ జ్ఞానమే అఖండ రూపమైన మహా వాక్యార్థానికి దారి తీస్తుంది. సృష్టి స్థితి లయాది వర్ణన జీవుని ప్రవేశ వర్ణన ఇలాంటి పదార్థ బోధే. ఇది సవికల్పమైన Analysis అర్థాన్ని చెబితే వాక్యార్థం నిర్వికల్పమైన Synthesis అర్థాన్ని మనకు బోధిస్తుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవాఙ్మానసగోచర ()
Telugu original

అవాఙ్మానసగోచర : వాక్కుకు, మనసుకు కూడా గోచరించనిది. అందరానిది. నిరాకారమైన సర్వవ్యాపకమైన ఆత్మతత్వం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవాచ్య ()
Telugu original

అవాచ్య : వాచ్యంకానిది. చెప్పటానికి శక్యం కానిది. ఆత్మతత్వం. అది సాక్షాత్తుగా ఫలానా అని చెప్పలేము. పరోక్షంగా సూచించవలసిందే. అనగా లక్ష్యమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవాక్యార్థ ()
Telugu original

అవాక్యార్థ : పదార్థ వాక్యార్థాల జ్ఞానం కేవలం పరోక్షమే. అపరోక్షం కాదు. అందులో శబ్దాకార వృత్తి ఇంకా మిగిలి ఉంటుంది. అది కూడా దాటి బ్రహ్మాకార వృత్తి మాత్రమే ఉండిపోవాలి. అప్పుడే దానికి పరోక్షత్వం తొలగిపోయి అపరోక్ష మవుతుంది. అదే అనుభవం. ఇందులో శబ్ధార్థాల తాలూకు ఆలోచన ఉండదు. కేవలం ఆత్మ జ్ఞానమే అది. దీనికే అవాక్యార్థమని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవిషయ ()
Telugu original

అవిషయ : జ్ఞానానికి విషయం కానిది. గోచరం కానిది. విషయం కాకపోతే దానికి విషయి అని పేరు. అది ఒక్క ఆత్మచైతన్యమే. అది ఎప్పుడూ జ్ఞానస్వరూపమే కనుక విషయియే కాని విషయం కాదు. అవిషయమే Subject.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవిగీత ()
Telugu original

అవిగీత : విగీతం కానిది. విగీతమంటే పరస్పర విరుద్ధం. అలాకాక అవిరుద్ధమైతే అవిగీతం. Metaphorical.

Vedānta Paribhāṣā Vivaraṇa
అశనాయా ()
Telugu original

అశనాయా : ఆహారానికి అశనమని పేరు. అది జీర్ణమైన తరువాత ద్రవంగా మార్చి రక్తంలో చేరుస్తుంది. ప్రాణశక్తి. అశనాన్ని నయనం చేస్తుంది కనుక అశనాయ అని పేరు వచ్చింది. నయమైన తరువాత మరలా ఆకలి ఏర్పడుతుంది కనుక అశనాయా అంటే ఆకలి అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవాచ్యార్థ ()
Telugu original

అవాచ్యార్థ : వాచ్యార్థం కానిది. సూటిగా గాక చాటుమాటుగా సూచించ వలసినది. లక్ష్యార్థమని Metaphorical భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవ్యయ ()
Telugu original

అవ్యయ : వ్యయమంటే ఖర్చు. మార్పు. మార్పులేని పదార్థమేదో అది అవ్యయం. భగవత్‌తత్త్వం నామరూపాత్మకం కాదు కనుక దానికెలాంటి మార్పులేదు. కూటస్థ సత్యం. Eternal truth.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవ్యభిచార ()
Telugu original

అవ్యభిచార : వ్యభిచారమనగా తప్పిపోవటం, చలించటం, మారటం. ప్రాపంచికమైన ప్రతి పదార్థమూ చలిస్తూ పోయేదే. Mutable. అచలమైన దేదీ లేదు. అది ఒక ఆత్మతత్త్వమే. కనుక అది ఒక్కటే అవ్యభిచారి. ఏకరూపంగా ఎప్పుడూ స్థిరంగా ఉండేదని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవికార/అవికృత ()
Telugu original

అవికార/అవికృత : వికారమంటే మార్పు. వికారంలేని ఆత్మచైతన్యమే సరాసరి వచ్చి మానవ హృదయంలో ప్రవేశించిందని శాస్త్రం చెబుతున్నది. కాబట్టి జీవసృష్టి వికృతం కాదు. అవికృతం. పోతే ప్రపంచ సృష్టి మాత్రం వికృతమే. అంటే చైతన్యం గుప్తమై నామరూపాలుగా మారి కనిపిస్తున్నది అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవితథ ()
Telugu original

అవితథ : వితథమంటే వ్యర్థం. వ్యర్థం కానిది అవితథం. సార్థకమని భావం. Purposeful అనృతానికి కూడా వితథమని పేరు. పోతే వితథం కానిది సత్యం గనుక సత్య మవితథం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవిద్యా ()
Telugu original

అవిద్యా : విద్య కానిది. విద్య అంటే జ్ఞానం. ముఖ్యంగా బ్రహ్మజ్ఞానం. లేదా ఆత్మజ్ఞానం. అది కాదంటే అర్థం అజ్ఞానమని. మనకున్న జ్ఞానమంతా విశేష జ్ఞానమే. ఇది సమస్యకు పరిష్కారం కాదు. కనుక దీనికి విద్య అని, జ్ఞానమని పేరు పెట్టలేదు వేదాంతులు. వారు దీనిని అవిద్య అనే పేర్కొన్నారు. వేదవాఙ్మయం మొదలు ఇప్పటి భౌతిక విద్యలవరకు అంతా అవిద్యే. Nescience. 'విద్యతే అస్తి.' ఏది ఉందో అది 'న విద్యతే నాస్తి' ఏది లేదో అది. అప్పటికి అవిద్య అంటే అభావం Absence. దేని అభావం ఉన్నట్టు ఏది కనిపిస్తున్నదో దాని అభావం. అదే ఈ ప్రపంచం. ఇది ప్రతీతి సిద్ధమేగానీ వస్తు సిద్ధం కాదంటారు అద్వైతులు. ఆత్మజ్ఞానం ఎప్పుడూ ఉంది. అయినా మనకది లేనట్టు తోస్తున్నది. ఇదే అవిద్య. పరమాత్మ కిది విద్య. జీవాత్మకు అవిద్య.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవిద్యాకామకర్మ ()
Telugu original

అవిద్యాకామకర్మ : అవిద్య అంటే ఆత్మజ్ఞానం లేకపోవటం. దానివల్ల అనాత్మ ప్రపంచమొకటి కనిపిస్తూ ఉండటంచేత మానవుడికి ఈ ప్రపంచంమీద కామమేర్పడుతుంది. కామ్యమైన వస్తువును పొందడానికి కర్మ చేయవలసి వస్తుంది. కర్మ ఫలాన్ని అందిస్తుంది. ఇదే సంసార బంధం. కనుక బంధానికి కారణభూతమైన అనర్థాలివి మూడు. వీటికే వేదాంతులు పాపాలని, పాతకాలని పేరు పెట్టారు. 'సర్వపాపేభ్యో మోక్షయిష్యామి' అని గీతావచనం. పాపమంటే పడగొట్టేదని అర్థం. ఇందులో అవిద్యే కారణ శరీరం. కామం సూక్ష్మశరీరం. కర్మ స్థూల శరీరం. శరీర త్రయం కూడా వీటివల్లనే సంక్రమించింది. ఇవి మూడూ తొలగిపోతే కాని మోక్షప్రాప్తి లేదు మానవుడికి.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవినాభావ ()
Telugu original

అవినాభావ : వినాభావమంటే వేరుగా ఉండటం. separation. వేరుగా కాక రెండు భావాలు ఒకదానితో ఒకటి అంటిపెట్టుకుని ఉంటే అవినాభావం Inseparability. కార్యకారణాలకు ఉండే సంబంధం ఇలాంటిదే. మృత్తికా ఘటాదులన్నీ దీనికి ఉదాహరణలే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవిభక్త ()
Telugu original

అవిభక్త : విభక్తం కానిది. Undividedt. నామరూపాలకూ, పరమాత్మకూ రెండింటికీ విభాగం లేదు. రెండూ అవిభక్త దేశకాలాలంటారు భగవత్పాదులు. సర్వత్రా సచ్చిత్తులు వ్యాపించే ఉన్నాయి. ప్రతి నామమూ, రూపమూ సచ్చిన్మయమే. ఒకదానికొకటి దూరంగా లేవు. దూరమైతే నామరూపాల కస్తిత్వం లేదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవిరోధ ()
Telugu original

అవిరోధ : విరోధం లేకపోవటం. Disagreement. తేడాగాని, పేచీగాని లేకుండా రెండూ సమన్వయమైతే అది అవిరోధం. శుద్ధచైతన్యానికి ఈ ప్రపంచంతో గానీ, జీవులతోగానీ వైరుధ్యం ఏ మాత్రమూ లేదు. అధిష్ఠాన రూపంగా అది సర్వత్రా వ్యాపించి ఉన్నప్పుడు విరోధానికి అవకాశమేముంది? బ్రహ్మసూత్రాలలో అవిరోధ పాదమని ఒక అధ్యాయముంది. అద్వైతానికి మిగతా మతాలేవీ విరుద్ధం కావు. అవి నదులైతే ఇది సముద్రం. అన్నీ ఇందులో సమసి పోవలసిందే అని బాదరాయణుల మాట. అంతేగాక కార్యరూపంగా కనపడే సృష్టి అంతా మూలకారణమైన పరమాత్మకంటే విరుద్ధం కాదు. అవిరుద్ధమే అని నిరూపించారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవివేక / అవివిక్త ()
Telugu original

అవివేక / అవివిక్త : రెండు పదార్థాలు ఒకదానితో ఒకటి పెనవేసుకోవటం. వేరుగా ఉన్నప్పటికీ ఏకరూపంగా కలిసిపోవటం. పాలలో నీరు కలిసి ఉన్నా అవి రెండూ పరస్పర భిన్నమైన పదార్థాలే. అయినా అభిన్నంగా కనబడుతుంటాయి. వేరు గావనే భావం మన కేర్పడుతుంటుంది. ఇదే అవివేకం. ఇలాగే పరమాత్మ, ప్రపంచం రెండూ ఏకమైపోయి ఏది సచ్చిద్రూపమైన భగవత్తత్వమో ఈ నామ రూపాలలో నుంచి వేరు చేయలేక భ్రమపడుతున్నాము. ఇదే మానవుడి అవివేకం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవిశేష / అవిశిష్ట ()
Telugu original

అవిశేష / అవిశిష్ట : విశేషమంటే తేడా. Difference. తేడా చూడకపోతే అవిశేషం. ఒక్కటేనని అర్థం. విశేషమంటే గుణం కూడా. Quality Attribute. గుణమేదీ లేకపోతే అవిశేషం. Substance without property. విశేషమంటే ఫలానా అని వ్యష్టిగా Particular చూడటం. అలాకాక సమష్టిగా General చూస్తే అది అవిశేషం. సామాన్యం. విశేషమంటే విభాగం. వేరనే భావం. అలా కాకుంటే అవిశేషం. ఏకత్వం అని అర్థం. అలాంటి పదార్థం ఏదో అది అవిశిష్టం. సామాన్య రూపమైన ఆత్మతత్వం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవేక్షణ ()
Telugu original

అవేక్షణ : క్రిందికి చూడటమని శబ్దార్థం. బాగా లోతుకు దిగి చూడటమని భావార్థం. జ్ఞానం సమ్యగవేక్షణం అని పెద్దల మాట. Knowledge is right vision.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవ్యక్త / అవ్యాకృత ()
Telugu original

అవ్యక్త / అవ్యాకృత : వ్యక్తం కానిది. బయటపడి కనపడనిది. Unformed. Abstract. వ్యాకృతం కానిది. విస్తరించబడనిది. ప్రపంచానికీ పరమాత్మకూ నడుమనున్న ప్రకృతి లేదా మాయాశక్తి. ఇది పరమాత్మ శక్తే గనుక నిరాకారం. స్వతహాగా వ్యక్తం కాదు. అవ్యక్తం. వ్యాకృతం కాదు. అవ్యాకృతం. Unformed. Abstract. అదే పరమాత్మ ఇచ్ఛను బట్టి నామరూపాత్మకంగా పరిణమిస్తే ఈ ప్రపంచం. పరమాత్మను ప్రపంచంగా చూపేది ఈ అవ్యక్తమైన మూలప్రకృతే. Premordial matter. Cosmic Power. సాంఖ్యులు దీనికి ప్రధానమని పేరు పెట్టారు. వారు ఇదే స్వతంత్రమైన పదార్థమంటారు. కానీ అద్వైతులిది అంగీకరించరు. ఇది స్వతంత్రం కాదు. ఈశ్వర ప్రకృతే. ఆయన నాశ్రయించిన శక్తేనని సిద్ధాంతం చేశారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవ్యవహిత ()
Telugu original

అవ్యవహిత : వ్యవహితమంటే ఒక పదార్థానికి దూరమైపోవటం. మధ్యలో ఏదైనా అడ్డు తగిలినప్పుడే అది జరుగుతుంది. దానికే ఉపాధి అని పేరు. Medium లోకంలోని పదార్థాలన్నీ ఒకదానికొకటి అడ్డు తగిలేవే. వ్యవహితమే. కాని పరమాత్మ సర్వవ్యాపకం గనుక అది ఎప్పుడూ అవ్యవహితం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవ్యవస్థిత ()
Telugu original

అవ్యవస్థిత : వ్యవస్థితమంటే వ్యభిచరించకుండా స్థిరంగా ఉన్నది. Stable అలా స్థిరంగా లేక ఎప్పటికప్పుడు చలిస్తూ పోతే అవ్యవస్థితం. నిలకడ లేనిది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవ్యాజ ()
Telugu original

అవ్యాజ : వ్యాజమంటే నెపం. ఒక నిమిత్తం. అది లేకుంటే అవ్యాజం. సహజమని అర్థం. Natural.

Vedānta Paribhāṣā Vivaraṇa
అవ్యాప్తి ()
Telugu original

అవ్యాప్తి : తర్కంలో ఇది ఒక దోషం. చెప్పిన లక్షణం అన్నిచోట్లా వర్తించక కొన్నిచోట్ల మాత్రమే వర్తించటం. వేదాంతంలో అవ్యాప్తి అంటే సర్వత్రా వ్యాపించక ఎక్కడికక్కడ ఆగిపోవటం. సత్‌చిత్తులు అన్ని వస్తువులలో వ్యాపించి ఉన్నాయి. కానీ నామరూపాలు ఎక్కడికక్కడే తెగిపోతుంటాయి. కనుక వాటికి వ్యాప్తి లేదు. వ్యాప్యమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అశబ్ద ()
Telugu original

అశబ్ద : శబ్దం కానిది. శబ్దాని కతీతమైనది. అంటే మాటల కందనిది. పరమాత్మ స్వరూపం. శబ్దమంటే శబ్ద ప్రమాణం. శాస్త్రం. అశబ్దమంటే శాస్త్ర ప్రమాణానికి విరుద్ధమైన సిద్ధాంతం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అశ్వత్థ ()
Telugu original

అశ్వత్థ : రావిచెట్టు. లాక్షణికంగా సంసారం. శ్వః అంటే రేపు. స్థ అంటే ఉండటం. రేపటికి కూడా ఉండనిది. అంత క్షణభంగురమీ సంసారమని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అశివ ()
Telugu original

అశివ : శివమంటే సత్యమైనది. హితమైనది. ఆత్మస్వరూపం. దానికి భిన్నంగా చూచేదంతా అశివమే. అంటే అనర్థదాయకం. అదే ఈ సంసారం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అశరీర ()
Telugu original

అశరీర : శరీరం లేనిది. ఉన్నా దానితో సంసర్గం లేనిది. శరీరమే నేననే అభిమానం లేనిది. ఆత్మచైతన్యం. అది అశరీరం. మోక్షమని అర్థం. జీవన్ముక్తుడు కూడా శరీరాన్ని తానుగా భావించడు. గనుక వాడూ అశరీరుడే. ముక్తుడే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అశుద్ధ ()
Telugu original

అశుద్ధ : శుద్ధం కానిది. మలినమైనదని అర్థం. ఉపాధులే అశుద్ధి. గుణాలే అశుద్ధి. ఇలాటి ఉపాధులు లేని నిర్గుణమాత్మతత్త్వం. అదే శుద్ధం. గుణాత్మకమైన ఈ ప్రపంచమంతా అశుద్ధమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అశాంత ()
Telugu original

అశాంత : ఏ వికల్పాలు ఉన్నా ఆ మనస్సు శాంతమైనది కాదు. ఆయా వృత్తులు లేనప్పుడే శాంతం. వృత్తులు పోయినా వాసనలుంటాయి సుషుప్తిలో. అవికూడా పోనంతవరకూ సాధకుడి మనస్సు అశాంతమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అశోచ్య ()
Telugu original

అశోచ్య : ఆత్మరూపంగా చూస్తే ప్రపంచంలో ఏదీ శోచ్యంకాదు. అంటే శోకించవలసిన పనిలేదు. అంతా అశోచ్యమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అష్టమూర్తి ()
Telugu original

అష్టమూర్తి : ఎనిమిది మూర్తులు లేదా రూపాలు ధరించిన వాడని అర్థం. దక్షిణామూర్తి అయిన పరమాత్మ కష్టమూర్తి అని పేరు. ఆ ఎనిమిదీ పృథివీ, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం. ప్రపంచమంతా అష్టమూర్త్త్యాత్మకమే. ఈ మూర్తులు ప్రపంచానివి కావు. పరమాత్మవి. అమూర్తమైన పరతత్త్వమే మూర్తమై ప్రపంచంగా భాసిస్తున్నదని గదా సిద్ధాంతం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అష్టాంగయోగ ()
Telugu original

అష్టాంగయోగ : ఎనిమిది అంగములతో, భూమికలతో కూడిన సమాధి యోగం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణా, ధ్యాన, సమాధులు. ఈ ఎనిమిదింటికీ అష్టాంగములని పేరు. ఇందులో మొదటి ఐదు బహిరంగ యోగం. మిగతా మూడు అంతరంగ యోగమని పతంజలి చెప్పినమాట.

Vedānta Paribhāṣā Vivaraṇa
అసంశయ ()
Telugu original

అసంశయ : సందేహం లేనిది. నిశ్చయం. శ్రవణానంతరం ఆత్మవిషయంలో దానికీ ప్రపంచానికీ సంబంధమేమిటని ఎన్నో సందేహాలు ఏర్పడవచ్చు. మననంతో అవి నివృత్తి కావలసి ఉంది. తరువాతనే నిశ్చయాత్మకమైన జ్ఞానం కలుగుతుంది. Conviction. అప్పటికీ మరణ సమయంలో తరువాత ఏమై పోతామో అనే సందేహం ఏర్పడవచ్చు. అదికూడా అక్కర లేదన్నాడు గీతాచార్యుడు. మరుజన్మలో ఈ కృషి తప్పక ఫలిస్తుందని హామీ ఇచ్చారు. కనుక సాధన మార్గంలో సంశయం గర్భశత్రువు. అది ఆత్మజ్ఞానంతోనే సమసిపోవాలి. 'ఛిద్యంతే సర్వసంశయాః' అన్ని సంశయాలూ అసంశయమైన జ్ఞానంగా అనుభవానికి వస్తాయి.

Vedānta Paribhāṣā Vivaraṇa
అసంసారి ()
Telugu original

అసంసారి : త్రిగుణాత్మకమైన సంసారంతో సంబంధంలేని సిద్ధపురుషుడు లేదా జీవన్ముక్తుడు. పరమాత్మ నిత్య ముక్తుడు కనుక ఎప్పుడూ సంసారం లేదాయనకు. అసంసారియే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అసక్త ()
Telugu original

అసక్త : సంసార బంధంలో సక్తుడు గానివాడు. చిక్కుపడని వాడు Tached person Liberated soul.

Vedānta Paribhāṣā Vivaraṇa
అసంగత ()
Telugu original

అసంగత : సంగతం కానిది. సంబంధం లేనిది. Unconnected. హేతువుకు నిలవనిది. Incoherent.

Vedānta Paribhāṣā Vivaraṇa
అసంహత ()
Telugu original

అసంహత : సంహతం గానిది. సంహతమంటే పోగైన పదార్థం. పోగైతే దానికి నామరూపాలేర్పడతాయి. పోగు కాకపోతే అది నిరాకారం. Unconstituted. కేవల చైతన్య స్వరూపం. అదే ఆత్మ. పోతే అది కాని అనాత్మ ప్రపంచమంతా సంహతమే. Formed సంహతమెప్పుడూ అసంహతం కోసమే Unformed ఉంటుంది. దానినే మనకు సూచిస్తుంటుంది.Indicator. అందుకే అన్మాత ద్వారా ఆత్మను పట్టుకోవాలని చెప్పటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అసత్ ‌/ అసత్య ()
Telugu original

అసత్‌/అసత్య : సత్‌అంటే ఉన్నది. అసత్‌అంటే లేనిది. అసత్యమన్నా ఇదే అర్థం. ఆత్మ సత్యమైన పదార్థం. Real. ఎందుకంటే అది స్వతః ప్రమాణం. మిగతా ప్రపంచమంతా, తద్రూపమంతా తద్రూపంగా చూస్తే సత్యం. చూడకపోతే అసత్యం. Unreal.

Vedānta Paribhāṣā Vivaraṇa
అసంభవ ()
Telugu original

అసంభవ : ఏది ప్రమాణానికి నిలుస్తుందో అది సంభవం. Possible. ఏది నిలవదో అది అసంభవం. Impossible. Untenable.

Vedānta Paribhāṣā Vivaraṇa
అసంభావనా ()
Telugu original

అసంభావనా : సంభవం కాదేమోనని సందేహించటం. అభావనా, అసంభావనా, విపరీతభావనా అని మూడున్నాయి భావనలు. అందులో రెండవది. అసలు గుర్తించకపోవటం మొదటిది. గుర్తించినా నిలుస్తుందా లేదా అని సందేహించటం రెండవది. అది ఒకలాగా ఉంటే మరొకలాగా చూడటం మూడవది. ఆత్మ విషయంలో ఇవి మూడూ కలుగుతాయి మానవుడికి. మూడింటికీ శ్రవణ, మనన, నిది, ధ్యాసలనేవి క్రమంగా పరిష్కారాలు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అసాధారణ ()
Telugu original

అసాధారణ : ఒకే లక్షణం రెండింటికీ వర్తిస్తే అది సాధారణం. Common అలా వర్తించక దేనిపాటికది అయితే అసాధారణం. చైతన్య మాత్మకు అసాధారణం. Unique అది అనాత్మకు లేదు. అనాత్మకు నామరూపాలు అసాధారణం. అవి చైతన్యానికి లేవు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అసిద్ధ ()
Telugu original

అసిద్ధ : ఏదో ఒక ప్రమాణానికి విషయమైతే అది సిద్ధం. ఏ ప్రమాణానికీ గోచరించకపోతే అసిద్ధం Untenable.

Vedānta Paribhāṣā Vivaraṇa
అస్తి ()
Telugu original

అస్తి : ఉన్నది అని అర్థం. అస్తి భాతి అనేవి రెండూ ఆత్మ లక్షణాలు. అది ఉన్నది ఉన్నట్టు స్ఫురిస్తున్నదని అర్థం. ప్రతి ఒక్కటీ లోకంలో ఉందంటాము. ఉందని భావిస్తాము. అంచేత అస్తి భాతి అవి రెండూ సర్వవ్యాపకాలు. అవే ఆత్మస్వరూపం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అస్తిత్వ ()
Telugu original

అస్తిత్వ : ఉనికి. ఉండటం. Existance. Presence.

Vedānta Paribhāṣā Vivaraṇa
అస్థాన ()
Telugu original

అస్థాన : స్థానం కానిది. Out of place. సందర్భం లేనిది Out of context.

Vedānta Paribhāṣā Vivaraṇa
అస్పర్శయోగ ()
Telugu original

అస్పర్శయోగ : దేనితోనూ స్పర్శ అనగా సంబంధం లేనిది. ఆత్మస్వరూపం. దాన్ని గూర్చిన అనుసంధానం అస్పర్శయోగం. మామూలు పాతంజల యోగం లాంటిది కాదిది. ఇందులో ధ్యాత ధ్యేయం ధ్యానమనే త్రిపుటి లేదు. మూడూ కలిసి ఆత్మ స్వరూపమే. కనుక ఏదీ దానినంటదు. అది అస్పర్శమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అస్మితా ()
Telugu original

అస్మితా : దేహాదులను నేను అని ఉపాధులతో తాదాత్మ్యం చెందటం. పతంజలి చెప్పిన ఐదు క్లేశాలలో ఇది రెండవది. అవిద్యా, అస్మితా, రాగ, ద్వేష, అభినివేశాలని అవి ఐదు. ఒకదానికొకటి హేతు హేతుమద్భావం చెంది ఇవి ఐదూ మానవుణ్ణి కట్టివేసే పాశాలై కూచున్నాయి.

Vedānta Paribhāṣā Vivaraṇa
అస్మత్‌ప్రత్యయ ()
Telugu original

అస్మత్‌ప్రత్యయ : నేను అనే ప్రజ్ఞ. భావన. చిత్తవృత్తి Idea of myself. ఆత్మ ఎప్పుడూ ఇలాంటి ప్రత్యయానికే గోచరిస్తుంది. ఆత్మాకార వృత్తియని దీనికి నామాంతరం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అస్వస్థ ()
Telugu original

అస్వస్థ : 'స్వస్మిన్‌తిష్ఠతి ఇతి స్వస్థః' తనలో తాను నిలకడగా ఉంటే స్వస్థ. Self contained. అలా కాకుంటే అస్వస్థ. మనం మన ఆత్మస్వరూపంలోనే లేమిప్పుడు. అనాత్మ జగత్తులో తొంగిచూచి అదే నేనని ఎక్కడికక్కడ తాదాత్మ్యం Identity చెందుతున్నాము కనుక అందరమూ అస్వస్థులమే. మనకున్న ఈ అభిమానమే అస్వస్థత.

Vedānta Paribhāṣā Vivaraṇa
అసుర సంపత్‌ ()
Telugu original

అసుర సంపత్‌: సాధకునికి పనికిరాని గుణాలివి. సాధన మార్గంలో అసుర సంపద మనకడ్డు తగులుతుంది. అనాత్మ తాలూకు గుణాలే అసుర గుణాలు. అవి ఎంత పోగైనా మర్గానికి అంతరాయమే. దీనికి బదులు దైవ సంపద పోగు చేసుకుంటే ముందుకు సాగిపోగలం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అసుర్య ()
Telugu original

అసుర్య : అసురలకు సంబంధించిన అంధకార బంధురమైన లోకాలు ఇవి. ఆత్మ జ్ఞానం లేని కర్మిష్ఠులు, పామరులు చివరకు పోయి చేరే స్థానాలని ఈశావాస్యం చెప్పిన మాట.

Vedānta Paribhāṣā Vivaraṇa
అహమ్ ‌/ అహంకార ()
Telugu original

అహమ్‌/అహంకార : అహమంటే నేను అని శబ్దార్థం. అలా భావించటమే అహంకారం. నావి అనే దేహాది ఉపాధులతో కలవకుండా భావించగలిగితే ఇది ఆత్మస్వరూపమే. అలాకాక సోపాధికమైతే ఇదే అనాత్మలాగా మారిపోతుంది. కర్తృరూపమైనది అహంకారమైతే సాక్షిరూపమైన చైతన్యమాత్మ. అహంకారానికే కర్తాత్మ అని పేరుపెట్టారు వేదాంతులు. ఇది చిదాభాసుడే గాని కేవల చిద్రూపం కాదు. అంటే జీవుడని అర్థం. ఇలాంటి జీవుడే అసలైన ఆత్మ అని భ్రమించారు పూర్వమీమాంసకులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అహంబ్రహ్మాస్మి ()
Telugu original

అహంబ్రహ్మాస్మి : ఇది నాలుగు మహావాక్యాలలో చివరిది. తత్త్వమసి ఉపదేశ వాక్యమైతే ఇది అనుభవ వాక్యం. ఈ జీవుడే బ్రహ్మమని దీని అర్థం. జీవుడు బ్రహ్మమైతే బ్రహ్మానికున్న పరిపూర్ణత వీడి కేర్పడుతుంది. అలాగే మరలా బ్రహ్మ అహమస్మి అని అర్థం చెప్పుకోవలసి ఉంది. దీనికి వ్యతిహారమని పేరు. అలా చెప్పుకుంటే జీవునికున్న అపరోక్షత్వం బ్రహ్మానికి సంక్రమిస్తుంది. అప్పుడు పరిపూర్ణ అపరోక్ష బ్రహ్మాత్మానుభవం ఏర్పడుతుంది సాధకుడికి.

Vedānta Paribhāṣā Vivaraṇa
అహంగ్రహోపాసన ()
Telugu original

అహంగ్రహోపాసన : గ్రహమంటే పట్టుకోవటం. బ్రహ్మస్వరూపాన్ని సత్యజ్ఞాన ఆనందాలనే గుణాలతో చేర్చి అదే నేనని ధ్యానిస్తూ పోవటానికే అహంగ్రహోపాసన అని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అహినిర్ల్వయనీ ()
Telugu original

అహినిర్ల్వయనీ : అహి అంటే సర్పం. నిర్ల్వయనీ అంటే కుబుసం. పాము కుబుసం విడిచిన తరువాత అది తానుగా భావించదు. అలాగే కుబుసం లాంటి శరీరమనే ఉపాధిని దూరం చేసుకొని దాన్ని తన స్వరూపంగా భావించడు జీవన్ముక్తుడు. కనిపిస్తున్నా అది తన ఆభాసే గాని తన స్వరూపం కాదతనికి. ఇది దీని అంతరార్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అహేయ ()
Telugu original

అహేయ : హేయం కానిది. వదలుకో లేనిది. ఆత్మతత్త్వం. అది మన స్వరూపమే కనుక వదలుకున్నా వదలిపోయే ప్రశ్నలేదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అహైతుక ()
Telugu original

అహైతుక : ఏ హేతువూ లేనిది. ప్రపంచానికి పరమాత్మగానీ మరొకటిగానీ కారణం గాదని వాదిస్తారు నాస్తికులు. వారి దృష్టిలో కనిపించే కార్యం తప్ప మూలకారణం లేదు. కనుకనే వారి వాదానికి అహైతుకమని పేరు వచ్చింది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అక్ష ()
Telugu original

అక్ష : ఇంద్రియం. Organs. చక్షురాదులైన జ్ఞానేంద్రియాలైనా కావచ్చు పాణిపాదాదులైన కర్మేంద్రియాలైనా కావచ్చు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అక్షజ ()
Telugu original

అక్షజ : ఇంద్రియ జన్యమైన జ్ఞానం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అక్షర ()
Telugu original

అక్షర : క్షరం కానిది. నశించనిది. శాశ్వతమైన Eternal. పరమాత్మ, మాయాశక్తి కూడా అక్షరమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అక్షయ ()
Telugu original

అక్షయ : క్షీణించనిది. జ్ఞానోదయమయ్యేవరకూ కర్మ అక్షయమే. అయిన తరువాత జ్ఞానం కూడా అక్షయమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అక్షమ ()
Telugu original

అక్షమ : క్షమ అంటే సమర్థం. Capable. Efficient. అక్షమమంటే అసమర్థం. అశక్తం. Incapable.

Vedānta Paribhāṣā Vivaraṇa
అక్షిపురుష విద్యా ()
Telugu original

అక్షిపురుష విద్యా : విద్య అంటే ఇక్కడ ఉపాసన. ఉపనిషత్తులలో ఇలాంటి విద్యలు ఎన్నో వస్తాయి. అందులో ఇది ఒకటి. మానవుడి దక్షిణాక్షిలో పరమాత్మ చైతన్యం బాగా అభివ్యక్తమై కనిపిస్తుందట. ఆ ఉపాధిలో తన స్వరూపాన్ని దర్శిస్తూ తదాకారమైన చిత్తవృత్తితో ధ్యానిస్తూ పోతే తదనుగుణమైన ఫలితం సాధకుడికి లభిస్తుంది. దీనికి అక్షిపురుష విద్య అని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అంక ()
Telugu original

అంక : గుర్తు. చిహ్నం. ముద్ర. ప్రాపంచికమైన వాసనలన్నీ అంకములే. సుషుప్తిలో కూడా ఇలాంటి వాసనాంకితమైన మనస్సుతోనే జీవుడు పరమాత్మతో ఏకమవుతున్నాడు. కనుకనే మరలా ఆ వాసనలతోనే తిరిగి వస్తున్నాడు. సుషుప్తిలో ఎలాగో రేపు మరణంలో కూడా ఈ వాసనాంకితమైన మనసు తొలగిపోదు. ఆత్మజ్ఞాన ముదయించినప్పుడే దాని నివృత్తి.

Vedānta Paribhāṣā Vivaraṇa
అంగ ()
Telugu original

అంగ : శరీరం. అవయవం. సమష్టిలో ఒక భాగం. వ్యష్టి Part.

Vedānta Paribhāṣā Vivaraṇa
అంగిరస్‌ ()
Telugu original

అంగిరస్‌: అంగములన్నింటి తాలూకు రసం. సారభూతమైనది. ప్రాణశక్తి అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అంగాంగిభావ ()
Telugu original

అంగాంగిభావ : సమష్టికి వ్యష్టికి ఉన్న పరస్పర సంబంధం Inter relation between whole and its parts. ప్రధాన మంగి అయితే అప్రధానం దానికంగం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అంజన ()
Telugu original

అంజన : అంటటం. ఏదీ అంటనిదైతే అది నిరంజన. ఆత్మ స్వరూపమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అండ ()
Telugu original

అండ : గ్రుడ్డు. Oval shape. గ్రుడ్డులాంటివి మూడున్నాయి. ఒకటి పిండాండం. ఈ శరీరం. రెండు అండాండం. దీనిచుట్టూ ఉన్న భూగోళం లాంటిది. మూడు బ్రహ్మాండం Macro cosm. ఆకాశం అని అర్థం. ఇవి మూడే చైతన్యానికి ఉపాధులు. Covers. వీటికి లోబడ్డవాడు జీవుడు. పైబడ్డవాడు ఈశ్వరుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అండజ ()
Telugu original

అండజ : గ్రుడ్డు నుంచి జన్మించేవి - పక్షులు, సరీసృపాలు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అంత ()
Telugu original

అంత : కొస, హద్దు Limit. End. విజాతీయ భావమెక్కడ ఏర్పడుతుందో అది సజాతీయాని కంతం. సజాతీయ విజాతీయాలు రెండూ లేని దాత్మతత్త్వం. కనుక అది ఎప్పుడూ అనంతమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అంతర/అంతరా ()
Telugu original

అంతర/అంతరా : లోపల అని అర్థం. Interior. ఎడమని కూడా అర్థమే. 'తే యదంతరా తద్బ్రహ్మ.' × అంతరాళ : రెండు పదార్థాలకు మధ్యనున్న ఖాళీ ప్రదేశం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అంతఃకరణ/అంతరింద్రియ ()
Telugu original

అంతఃకరణ/అంతరింద్రియ : Inner organ. మనస్సు. అంతరంగమన్నా మనస్సే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అంతరంగ ()
Telugu original

అంతరంగ : మనస్సని ఒక అర్థం. మనలోపల మాత్రమే చేసే సాధన కూడా అంతరంగమే. దీనికి బాహ్యంగా జరిగేది బహిరంగ సాధన.

Vedānta Paribhāṣā Vivaraṇa
అంతరిత ()
Telugu original

అంతరిత : ఒక భావానికి మరొకటి అడ్డు తగిలితే అది మరుగు పడటం. విజాతీయ వృత్తులు మనసులో ప్రవేశిస్తే సజాతీయమైన బ్రహ్మాకార వృత్తి దానిచేత అంతరితమవుతుంది. Eclipsed.

Vedānta Paribhāṣā Vivaraṇa
అంతర్యామి ()
Telugu original

అంతర్యామి : పిండాండంలోనూ, బ్రహ్మాండంలోనూ సర్వత్రా ప్రవేశించి లోపల చోటు చేసుకుని వాటిని అన్నింటిని తన అదుపులో పెట్టుకునే ఈశ్వర చైతన్యం. 'యః పృథివ్యాం తిష్ఠన్‌' అని ఇలా ఎంతో దూరం వర్ణించింది బృహదారణ్యకం. దానికి అంతర్యామి బ్రాహ్మణమని పేరు. The inner controller of all the material world including our bodies and minds. ఈశ్వరుడే అంతర్యామి అంటే.

Vedānta Paribhāṣā Vivaraṇa
అంత్యం ప్రమాణం ()
Telugu original

అంత్యం ప్రమాణం : చివరి ప్రమాణం. Final Proof. బ్రహ్మాకార వృత్తి. దానికి బాధకమైన వృత్తి మరొకటి లేదు గనుక అది అంత్యమైనది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అంతకాల ()
Telugu original

అంతకాల : అవసాన సమయం. ఆ లోపలే మానవుడు జ్ఞానసాధనకు ఉపక్రమించాలి. ఆ సమయంలో కృషి చేసే అవకాశం లేదు. అంతకు ముందు నుంచి చేసిన సాధన అప్పుడే పరిపాకానికి వస్తుంది. 'అంతకాలేపి మామేవ స్మరన్‌' అని గీతా వచనం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అంతేవాసి ()
Telugu original

అంతేవాసి : దగ్గర కూర్చునే వాడని అర్థం. శిష్యులు పూర్వం అరణ్యాలలో ఆచార్యుల దగ్గరగా కూర్చుని బ్రహ్మవిద్యను అభ్యసించేవారట. ఉపనిషత్తనే మాట అలాగే ఏర్పడింది. అతిరహస్యం గనుక దగ్గర కూర్చుని గ్రహించవలసిన కర్తవ్యముంది. అంతేవాసి అంటే అలాంటి రహస్యోపదేశం అందుకునే శిష్య పరమాణువు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అంధం తమః ()
Telugu original

అంధం తమః : కటిక చీకటి అని అర్థం. అలాంటి రౌరవాది నరక లోకాలకు అంధం తమః అని నామకరణం. అజ్ఞానమే నరకమని లక్ష్యార్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అంధ పరంపరాన్యాయ ()
Telugu original

అంధ పరంపరాన్యాయ : ఒక గ్రుడ్డివాడిని పట్టుకుని మరొక గ్రుడ్డివాడు ప్రయాణం చేయటం. అలాచేస్తే ఎవడికీ దారి కనపడక ఇద్దరూ నూతిలోనో, గోతిలోనో పడతారు గాని గమ్యం చేరలేరు. కనుక జీవిత గమ్యం చేర్చలేని వితండ వాదాల కన్నిటికీ ఈ సామెత వర్తిస్తుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
అంధగజ దృష్టాంత ()
Telugu original

అంధగజ దృష్టాంత : గ్రుడ్డివాళ్ళు ఏనుగును చూచి వచ్చిన వ్యవహారం. ఎక్కడికక్కడే చూచి అది గజమని భావించినట్టే పరమాత్మను నామరూపాల పరిధికి దించి ఎక్కడికక్కడే పరిమితం చేసి చూచే దృష్టి ఇలాంటిదని, అది సమగ్రం కాదని అద్వైతుల వేళాకోళం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అంశ ()
Telugu original

అంశ : భాగం. తునక అని అర్థం. 'మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః' అని గీత. పరమాత్మ అంశమే జీవాత్మ. ఇది వాస్తవమైన భాగమని ద్వైతులు. వాస్తవం కాదు ఆభాస అని అద్వైతులు అంటారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
అంశాంశిభావ ()
Telugu original

అంశాంశిభావ : అంశానికి అంశికి ఉన్న సంబంధం. జీవజగత్తులు అంశమని ఈశ్వరుడు అంశి అని వైష్ణవుల సిద్ధాంతం. ఇది మాయామయమని అద్వైతుల రాద్ధాంతం.

Vedānta Paribhāṣā Vivaraṇa
అలాతశాంతి ()
Telugu original

అలాతశాంతి : అలాతమంటే కొరవి. అది త్రిప్పుతూపోతే మండలాకారంగా తిరుగుతుంది. నిలువుగా ఆడిస్తే రేఖాకారం. సగం తిప్పితే అర్ధచంద్రాకారం. ఇప్పుడీ ఆకారాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? కొరవిలోనుంచే. ఏమైపోతాయి చివరకు? కొరవిలోనే. అలాగే పరస్పర విరుద్ధ మతాలన్నీ అద్వైతంలోనుంచే వచ్చి అద్వైతంలోనే సమసిపోతాయి. దానికేదీ విరుద్ధంకాదు. అవి తమలో తాము విరుద్ధమైనా దాని కవిరుద్ధమే. అక్కడ అన్నీ శాంతించవలసిందే అని తాత్పర్యం. గౌడపాదులవారి మాండూక్యకారికా గ్రంథంలో ఇది నాల్గవ ప్రకరణం. ఇలాటి సమన్వయమే మనమక్కడ చూడగలం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆకస్మిక ()
Telugu original

ఆకస్మిక : దేనివలన కలిగిందో చెప్పలేకపోతే అది ఆకస్మాత్తు. అలా ఆకస్మాత్తుగా జరిగే దానికి ఆకస్మికమని పేరు. Accidental నిర్ణిమిత్తమని, ఉన్నట్టుండి జరిగేదని అర్థం. ప్రపంచ సృష్టి అలాగే జరిగిందంటారు భౌతికవాదులు. అలాకాదు అభౌతికమైన ఆత్మ స్వరూపంవల్లనే జరిగిందంటారు వేదాంతులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆకాంక్షా ()
Telugu original

ఆకాంక్షా : దీనికేమిటి కారణం. దీనికేమిటని అడుగుతూ పోవటం Enquiry జిజ్ఞాస. తెలుసుకోవాలనే కోరిక. అన్వేషించటం. లోకంలో పదార్థాలన్నింటికీ ఒక దానితో ఒకదానికి ఇలాంటి ఆకాంక్ష తప్పదు. ప్రతిదీ సాకాంక్షమే. Relative నిరాకాంక్షం Absolute ఒక ఆత్మతత్త్వమే. ఆకాంక్ష నివృత్తి అయితే జ్ఞానమక్కడికి సమాప్తమవుతుంది. అదే పరిపూర్ణ జ్ఞానం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆకార / ఆకృతి ()
Telugu original

ఆకార/ఆకృతి : రూపం. మూర్తి Form. Shape. నామరూపాల్లో రెండవదానికి పర్యాయం. లోపలిది నామమైతే, దానికనుగుణంగా బాహ్యమైన పదార్థం రూపం. ఫలానా విధమని కూడా అర్థమే 'ఏవమాకారా వృత్తిః' ఈ విధమైన ఆలోచన. ఒక విషయానికి సంబంధించినదని కూడా అర్థమే. గృహాకార. సుఖాకారా. గృహాదులకు సంబంధించిన ఆలోచన అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆకాశ ()
Telugu original

ఆకాశ : పంచభూతాలలో ఒకటి. సృష్టిక్రమంలో మొదటిది. లయ క్రమంలో కడపటిది. అవకాశమిచ్చే స్వభావం కలది space. దీని గుణం శబ్దం sound అది వినపడేదే కానక్కరలేదు. కేవలం స్పందరూపంగా vibration ఉన్నదీ శబ్దమే. నీ, నా మధ్య ఆకాశమే లేకుంటే శబ్దం ప్రసరించదు. వాయువువల్ల కదా అంటావు. వాయువుకేది ఆధారం. ఆకాశమే. ఆకాశమంటే లాక్షణికార్థంలో Secondary Sence పరమాత్మ అని అర్థం. ఆ పరమాత్మ తాలూకు మాయాశక్తి కూడా ఆకాశమే. 'ఆ సమంతాత్‌' అంతటా 'కాశతే ప్రకాశతే' వ్యాపించినదేదో అది ఆకాశం. సర్వవ్యాపకత్వం నిరాకారత్వం సూక్ష్మత్వం వరకు ఆకాశానికి ఉన్న గుణాలే చైతన్యానికి చెప్పవచ్చు. కాని వీటికి అదనంగా నేననే స్ఫురణ Self awareness మాత్ర మాకాశానికి లేదు. అది చిదాకాశమైతే ఇది జడాకాశం. కనుకనే చిద్రూపమైన ఆత్మ ఈ జడమైన ఆకాశానికి కూడా కారణమయింది. × ఆకులత్వ : గందరగోళం Confustion అని అర్థం. శాస్త్రంలో ఇది ఒక పెద్ద దోషం. పూర్వాపరాలకు ఎక్కడా అందిక పొందిక లేకపోతే అది ఆకులం. దానివల్ల విషయం తాలూకు అవగాహన స్పష్టంగా ఏర్పడదు. సమర్థుడైనవాడు ఎక్కడికక్కడ సమన్వయించి వ్యాఖ్యానించినప్పుడే ఆకులత్వం తొలగిపోయి విషయం చక్కగా మనస్సుకు వస్తుంది. భాష్యకారులు చేసిన పని అదే. ఆకూత : అభిప్రాయం. మనస్సులో ఉన్న ఆంతర్యం Intention aim or Implication అని అర్థం. కవి హృదయమని మామూలుగా అనే మాట.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆంతర / ఆంతర్య ()
Telugu original

ఆంతర/ఆంతర్య : బాహ్యమైన అర్థంతో తృప్తిపడక దీనిలోని దాగి ఉన్న శాస్త్ర హృదయం ఏమిటని తాపత్రయ పడితే దానికి తోచే భావమే ఆంతర్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆండజ ()
Telugu original

ఆండజ : అండజమనే దాని అర్థమేదో అదే. అండము నుండి జన్మించిన పక్షి సరీసృపాది ప్రాణిజాతం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆఖ్యాన / ఆఖ్యాయికా ()
Telugu original

ఆఖ్యాన/ఆఖ్యాయికా : వర్ణించటం. చెప్పటం అని అర్థం. అలా భావన చేస్తూ చెప్పిన కథలకు, గాథలకు ఆఖ్యాయికలని పేరు Tale fable, Story.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆగంతుక ()
Telugu original

ఆగంతుక : మధ్యలో వచ్చినది. క్రొత్తగా వచ్చి చేరినది. సహజం కానిది. కృత్రిమం, అనిత్యం. విషయ ప్రపంచమంతా ప్రమాణానికి గోచరించిన తరువాతనే ఏర్పడుతున్నది. కనుక ఇది ఆగంతుకమే. ప్రమాణాలకు ముందే సిద్ధించిన ఆత్మ ఇలా ఆగంతుకం కాదు సహజం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆగమ ()
Telugu original

ఆగమ : అంతకుముందు లేక క్రొత్తగా రావటం. ఏది వచ్చినదో అది మరలా పోక తప్పదు. ఆ పోవటానికి అపాయమని పేరు. ఆగమపాయాలు ప్రతి పదార్థానికి స్వభావికం. ఆగమమంటే శాస్త్రమని కూడా అర్థమే. ముఖ్యంగా వేదవాఙ్మయం. దానిని చూచి మరలా కొందరు ప్రజ్ఞావంతులు అలాంటి అనుభవాన్ని అందించే తంత్ర గ్రంథాలు కూడా సృష్టించారు. ఇలాంటి తంత్ర గ్రంథాలకు కూడా ఆగమమని పేరు వచ్చింది. వేదాంతుల అభిప్రాయంలో ఆగమమంటే పరోక్షజ్ఞానమిచ్చే ఉపనిషత్తుల లాంటి శాస్త్రాలు కాక అనుభవజ్ఞాన మందించే గురూపదేశమని అర్థం. Intution, or Experience.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆగ్రహ / ఆగామి ()
Telugu original

ఆగ్రహ : పట్టుదల అని అర్థం. సత్యాగ్రహమంటే సత్యం మీద. మిథ్యాగ్రహ మంటే అసత్యం మీద. ఏదైనా ఆగ్రహమే. ,br> ఆగామి : త్రివిధమైన కర్మలలో ఇది ఒకటి. మొదటిది సంచితం. గతానికి సంబంధించినది. రెండవది ప్రారబ్ధం. గతంలో చేసిన దానికి ఫలితంగా వర్తమానంలో అనుభవించేది. మూడవది ఆగామి. వర్తమానంలో చేస్తూ ఉన్నది. భవిష్యత్తులో అనుభవించ బోయేది. × ఆచార/ఆచార్య : ఒక కర్మ ఆచరించటం. అమలు పరచటం. Conduct, practice అలాంటి కర్మగాని, జ్ఞానంగాని తాను ఆచరిస్తూ మరి ఒకరిచేత ఆచరింప చేసేవాడు ఆచార్యుడు. గురువు. ముఖ్యంగా బ్రహ్మజ్ఞానమూ, జ్ఞాననిష్ఠా రెండూ కలవాడు. 'ఆచార్యవాన్‌పురుషో వేద' అలాంటి ఆచార్యుల సహాయంతోనే బ్రహ్మజ్ఞానం అందుకోవాలని పెద్దల సలహా. × ఆజవంజవ : సంసారమని అర్థం. జీవుని వదలకుండా అంటిపట్టుకొని కర్మ ఫలాన్ని అతనిచేత అనుభవింపచేసేది అని శబ్దార్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆజానదేవతా ()
Telugu original

ఆజానదేవతా : జాన అంటే జన్మ. జన్మతోనే సహజంగా దివ్యత్వం పొందిన జీవులు. వారు స్వర్గ నివాసులు. కర్మభూమిలో సత్కర్మ లాచరించి తత్ఫలితంగా స్వర్గం చేరినవారు కారు. సహజంగానే దేవతాజన్మ ఎత్తినవారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆజీవ ()
Telugu original

ఆజీవ : ఒకదానిమీద ఆధారపడి జీవించేది. To live upon రూపాజీవా. రూపాన్ని ఆధారం చేసుకొని బ్రతికే వ్యక్తి అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆతాన / ఆతత ()
Telugu original

ఆతాన/ఆతత : అన్ని వైపులా వ్యాపించటం. ఎడతెగక సాగిపోయేది. Incesant pervasive. × ఆత్మా : నేను అనే భావం. స్ఫురణ consciousness. అదే స్వరూపమీ అనాత్మ ప్రపంచానికంతటికీ. కనుక ఆత్మ అంటే స్వరూపం. Self or substance సత్తు ఉండటం. చిత్తు ఉన్నట్టు స్ఫురించటం. ఇవి రెండే దీని లక్షణాలు. ఇవి ఆత్మకే కాక దానికి గోచరించే అనాత్మకు కూడా కన్పిస్తున్నాయి. కాబట్టి ఆత్మానాత్మలుగా భాసించే రెండూ నిజాని కాత్మేనని అద్వైత సిద్ధాంతం. దీనికే ఏకాత్మ, సర్వాత్మ అని పేరు. 'ఆ సమంతాత్‌తనోతీతి ఆత్మా.' సర్వవ్యాపకమని నిర్వచనం. 'యదాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయనిహ యచ్చాస్య సంతతోభావః తదాత్మేతి ప్రకీర్త్యతే.' ఏది వ్యాపిస్తుందో, వ్యాపించి ఏది గ్రహిస్తుందో, గ్రహించి ఏది కబళించి తనలో కలుపుకుంటుందో, కలుపుకొని ఏది అవిచ్ఛిన్నంగా నిలిచిపోతుందో అది ఆత్మ అని ఆత్మశబ్దానికి పెద్దలు మరొక నిర్వచనం చెప్పారు. అది నేననే జ్ఞానమే. నావరకే అయితే అది స్వరూపం. సర్వత్రా వ్యాపిస్తే విభూతి Self and its expanstion. ఇది అద్వైతుల సిద్ధాంతం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆత్మానాత్మ వివేక ()
Telugu original

ఆత్మానాత్మ వివేక : ఆత్మ ఏదో అనాత్మ ఏదో రెండింటిని విభజించి తెలుసుకోవటం. దేహేంద్రియాదుల దగ్గర నుంచీ బాహ్యప్రపంచం వరకూ ఈ అనాత్మతో ఏకమై పోయింది అసలైన ఆత్మ. కనుక దానిని దీనినుండి వేరు చేయాలి. ఈ వేరు చేయటానికే సాంఖ్య యోగమని పేరు భగవద్గీతలో. సాక్షిగా భావిస్తే ఆత్మ. సాక్ష్యమైతే అనాత్మ. ఇది రెండింటికీ ఉన్న విభాగం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆత్మజ్ఞాన ()
Telugu original

ఆత్మజ్ఞాన : ఆత్మ తాలూకు జ్ఞానం. ఆత్మాకార వృత్తి అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆత్మక ()
Telugu original

ఆత్మక : స్వరూపంగా కలది. చిదాత్మక అంటే చైతన్యమే తన స్వరూపంగా కలిగినదని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆత్మీయ ()
Telugu original

ఆత్మీయ : ఆత్మ అంటే నేను. ఆత్మీయమంటే నాది. ఆహం, మమలని వీటికే మారుపేర్లు. అఖండమైన ఆత్మచైతన్యంలో ఏర్పడిన విభాగమిది. స్వతహాగా అది అఖండమైనా మన అవిద్య మూలంగా ఖండమై కనిపిస్తున్నది. మొదటిది చిదాభాసుడైన జీవుడైతే రెండవది సదాభాసమైన జగత్తు. మరలా విద్య ఉదయిస్తే ఆభాసలు రెండూ లయమై సచ్చిత్సామాన్యమైన అఖండాత్మగా దర్శనమిస్తుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆతివాహక ()
Telugu original

ఆతివాహక : మరణానంతరం ఉపాసుని ఆయా భూమికల ద్వారా లోకాంతరాలకు తీసుకువెళ్ళే దేవదూత. Divine Conductor.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆత్మాకారవృత్తి ()
Telugu original

ఆత్మాకారవృత్తి : ఆత్మ ఎలా ఉందో అలాగే సాధకుడి మనస్సులో కలిగే ఆలోచన. తాను భావించిన వస్తువు తాలూకు ముద్ర మనఃఫలకం మీద ఎప్పటికప్పుడు ఏర్పడటం మనస్సుకున్న ఒక గొప్ప లక్షణం. ఇది అనాత్మ తాలూకు వృత్తి అయితే సంసారం వైపు తీసుకెళ్లుతుంది. ఆత్మాకారమైతే ఆత్మ తత్త్వానుభవానికి తెస్తుంది. ఆత్మదర్శనానికి ఇదే ప్రమాణం. ఇదే సాధన. బాహ్యంగా మరేదీ లేదు. × ఆత్మసాక్షాత్కార : అద్వైతంలో ఈశ్వర సాక్షాత్కారమనే మాటకు అర్థంలేదు. ఆత్మచైతన్యానికి భిన్నంగా జగత్తు ఎలా లేదో అలాగే ఈశ్వరుడు కూడా లేడు. ఈశ్వరుడంటే అఖండ చైతన్యమే కనుక అది ఆత్మగానే అనుభవానికి రావాలి. అప్పటికి ఆత్మసాక్షాత్కారమంటే సమస్తమూ సత్య, జ్ఞాన, ఆత్మకంగా దర్శన మివ్వటమే. × ఆత్మహా : ఆత్మను చంపుకొన్నవాడు. దాని జ్ఞానం లేని వాడని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆత్మాశ్రయ ()
Telugu original

ఆత్మాశ్రయ : ఇది ఒక దోషం. తానే జ్ఞాత. తానే జ్ఞేయమని భావించటం. అలా ఎప్పటికీ జరగదు. రెంటికీ తేడా ఉండి తీరాలి.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆత్యంతిక ()
Telugu original

ఆత్యంతిక : అత్యంతమైన పదార్థం ఆత్యంతికం. అంతాన్ని దాటిపోయినది అనంతం. దేశకాల వస్తువులే అంతం. హద్దు. ఇలాంటి హద్దులేవీ లేక ఎప్పటికీ నిలిచి ఉండేది ఆత్యంతికం Constant.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆత్యంతికప్రళయ ()
Telugu original

ఆత్యంతికప్రళయ : ప్రపంచ లయం దానిపాటికది జరిగితే ప్రాకృతం. అది మనకు పరిష్కారం కాదు. మరలా సంసారబంధం తెచ్చి పెడుతుంది. అలాకాక సాధకుడు బ్రహ్మాకార వృత్తితో బుద్ధిపూర్వకంగా లయం చేసుకోగలిగితే దానికి ఆత్యంతికమని పేరు. ఇది కలిగిన తరువాత ఇక సంసార బంధమనేది ఉండదు. సాయుజ్యమే సిద్ధిస్తుంది. × ఆదర : ఒకదానికి ప్రాధాన్యమివ్వటం, నొక్కి చెప్పటం Emphasis, అదే ముఖ్యమని చూపటం. అలాంటప్పుడే ఆ విషయం పదేపదే వర్ణిస్తుంది శాస్త్రం. ఇందులో పునరుక్తి దోషం లేదు. మీదుమిక్కిలి సాధకుడి దృష్టి ప్రధానమైన అంశం మీదనే పడుతుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆదర్శ ()
Telugu original

ఆదర్శ : అద్దమని Mirror బాహ్యార్థం. అంతటా స్పష్టంగా కనిపించేదని వ్యుత్పత్తి. లక్షణికంగా వేదాంతంలో మనస్సని, జ్ఞానమని కూడా చెప్పవచ్చు. × ఆదాన : చేతికి తీసుకోవటం. పట్టుకోవటం. గ్రహించటం. దీనికి వ్యతిరేకం ప్రదానం ఇవ్వటమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆది ()
Telugu original

ఆది : మొదలు. ఆరంభం. సృష్టి. ఆది లేనిది ఈ సంసారం. ఆదిలేనిది ఆత్మతత్త్వం. రెండూ అనాదే. కాని ఒకటి జ్ఞానముదయిస్తే అంతమవుతుంది. మరొకటి జ్ఞానముదయిస్తే అనాదే కాక అనంతమని కూడా బోధపడుతుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆదేశ ()
Telugu original

ఆదేశ : ఆజ్ఞ Command. ఈ చెప్పిన విషయానికి ఇంక తిరుగులేదని చెప్పటం కూడా ఆదేశమే. Conclusion, 'ఏష ఆదేశః' అంతేకాక ఒక గొప్ప రహస్యాన్ని అపురూపంగా బయటపెట్టే మాట. ఒక ఉపమానం ద్వారా దాన్ని బోధించటం. 'ఉత తమాదేశ మప్రాక్ష్యః' నీవా ఆదేశ మడిగి తెలుసుకొన్నావా? అని అడుగుతాడు ఛాందోగ్యంలో ఉద్దాలకుడు శ్వేతకేతువును. అన్నింటికన్నా రహస్యమైన విషయం వారు నీకు చెప్పారా? అని దీని తాత్పర్యం. ఆదేశమంటే అప్పటికి అన్నింటికన్నా విలువైనది, అపూర్వమైనది Secret knowledge అని అర్థం. × ఆధాన : ఉంచటం. Placing. లేనిదాన్ని ఆపాదించటం. కలిగించటమని కూడా అర్థమే. గుణాధానమంటే అంతకుముందు లేని గుణాన్ని తెచ్చిపెట్టటం. సమాధానమంటే అక్కడా ఇక్కడా చెదిరిపోకుండా దృష్టిని ఒకచోట చక్కగా నిలపటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆధార ()
Telugu original

ఆధార : ఆశ్రయం. నిలయం. అధిష్ఠానమని Basis అర్థం. దేనిమీద మరొకటి ఆరోపితమౌతుందో ఆది ఆధారం. నేతికి పాత్ర ఆధారం. ఆద్వైతంలో ఆధారమే వస్తువు. మిగతాదంతా వస్తువు కాదు ఆభాస.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆధేయ ()
Telugu original

ఆధేయ : ఆధారంమీద ఆరోపితమైన పదార్థం. Imposed content. ఆధారం వస్తువైతే ఆధేయమంతా ఆభాసే అద్వైతంలో. వస్తువే మరో రూపంలో భాసిస్తే అది ఆభాస. వస్తువుమీద ఆరోపితమయ్యేది వస్తువే నన్నమాట. జలమే తరంగ రూపంగా జలంమీద ఆరోపిత మౌతున్నది. అప్పటికి ఆధార ఆధేయాలు రెండూ ఒకే ఒక తత్త్వం. × ఆధి : మనస్సుకు సంబంధించిన రుగ్మత Mental disease. × ఆధ్యాత్మిక/ఆధిభౌతిక/ఆధిదైవిక : మొదటిది శరీరానికి, రెండవది శరీరం చుట్టూ ఉన్న ప్రపంచానికి, మూడవది రెంటికీ ఆధారమైన బ్రహ్మాండానికి సంబంధించిన సమస్యలు. వీటికే తాపములని పేరు. మూడింటవల్లా మనకు ఎక్కడలేని ఆందోళన ఏర్పడుతున్నది. తాపత్రయమంటే ఇదే. మొత్తం సంసారం తాపత్రాయాత్మకమే. దీని నివారణకోసమే శాంతి పాఠంలో మూడుమార్లు శాంతిని ఉచ్చరిస్తారు పెద్దలు. × ఆధ్యాన : నిరంతరమూ తైలధారగా ఒకే ఒక్క లక్ష్యం మీద దృష్టి పెట్టి కూర్చోవటం Meditation, Reflection. ద్వైతంలో అయితే ధ్యేయం ధ్యానించే ధ్యాతకు వేరుగా ఉంటుంది. ఆద్వైతంలో అది తన స్వరూపమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆధికారికపురుష ()
Telugu original

ఆధికారికపురుష : అధికారమంటే Deputation. అది ఉన్న వ్యక్తి ఆధికారిక పురుషుడు. అంటే ఒక పని చేయమని పరమాత్మ జీవన్ముక్తుడికి అప్పగిస్తే దానికి అధికారమని పేరు. జీవన్ముక్తులు రెండు విధాలు. ఆత్మారాముడొకడు. ఆధికారిక పురుషుడొకడు. దేనితోనూ సంబంధం పెట్టుకోక తనలో తాను రమించేవాడు ఆత్మారాముడు. తనపాటికి తాను నిష్ఠలో ఉంటాడు. రెండోవాడు లోకానుగ్రహార్థం నలుగురికీ జ్ఞానబోధ చేస్తూ తిరుగుతుంటాడు. అదే అతని అధికారం. Duty. ప్రారబ్ధం తీరేవరకు అది సాగించి తరువాత విదేహముక్తుడై పోతాడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆత్మారామ ()
Telugu original

ఆత్మారామ : ఇంతకుముందు చెప్పినట్టుగా జీవన్ముక్తులలో ఇతడు మొదటి వర్గానికి చెందినవాడు. ఆత్మజ్ఞాన నిష్ఠ తప్ప అనాత్మ ప్రపంచంతో ఏ మాత్రమూ సంబంధం లేక దూరప్రాంతాలలో ఒంటరిగా మసలుతూ తనలో తాను రమిస్తూ కాలం గడిపేవాడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆనంత్య ()
Telugu original

ఆనంత్య : అనంతభావం. ఎప్పటికీ అంతం లేకుండా నిలిచి ఉండటం. 'సచ ఆనంత్యాయ కల్పతే.' జీవుడు కూడా ఈశ్వరుడిలాగే చిన్మాత్రుడు గనుక తన స్వరూపాన్ని తాను గుర్తిస్తే అనంతత్వానికే నోచుకోగలడని శాస్త్రవచనం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆనంద ()
Telugu original

ఆనంద : నందమన్నా ఆనందమన్నా సుఖమని అర్థం. ఇది విషయ జన్యం కాదు. విషయి రూపమైన ఆత్మజన్యం. తైత్తిరీయంలో ఆనందాన్ని గూర్చిన మీమాంస ఎక్కువగా వస్తుంది. మనుష్యుడి స్థాయినుంచి పరబ్రహ్మ స్థాయివరకు ఎన్నో ఆనంద భూమికలు వర్ణించారు. అన్నింటికీ కడపటిది బ్రహ్మానందమే. పంచకోశాలలో ఆనందమయకోశ మొకటున్నది. దానిలో కలిగే ఆనందం కాదిది. 'బ్రహ్మపుచ్ఛం ప్రతిష్ఠా.' అనే మాటను బట్టి బ్రహ్మానందమే అసలైన ఆనందం అని పరిష్కారం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆనందమయకోశ ()
Telugu original

ఆనందమయకోశ : పంచకోశాలలో అన్నమయ దగ్గరినుంచి ఆనందమయం వరకు ఆత్మచైతన్యం ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయవలసి ఉంది. అది కూడా దాటిపోతే బ్రహ్మసాయుజ్యం లభిస్తుందని శాస్త్రం. ఆనందమయ కోశంలో ఉన్న ఆనందం సుషుప్తిలో కలిగే విషయ సుఖమేకాని నిత్యసుఖం కాదు. ఇది జడమైతే బ్రహ్మానందం దాని కతీతమైన చేతనానందం. కనుక దీనికి దానికి తేడా ఉన్నది. కనుకనే ఇది కోశమైనది. అది కోశాతీతమైనది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆనుపూర్వి ()
Telugu original

ఆనుపూర్వి : పరిపాటి క్రమం. అనుక్రమం. order. ఒకదాని తరువాత ఒకటి రావటం. వరుస. మాములుగా మొదట పెద్దది తరువాత చిన్నది. ఈ వరుస పాటించవలసి ఉంటే దానికి ఆనుపూర్వి అని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆనృశంస్య ()
Telugu original

ఆనృశంస్య : నృశంసుడంటే నరఘాతకుడు. హింసాపరుడు. అలాంటి ఘాతుక కృత్యాలు, జీవహింస తలపెట్టని సత్పురుషుడు అనృశంసుడు. వాడికుండే స్వభావం ఆనృశంస్యం Unharmful nature. దైవగుణాలలో ఇది ఒక ప్రధాన గుణం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆపత్తి ()
Telugu original

ఆపత్తి : ఏర్పడటం. వచ్చిపడటం. ఆపన్నం కావడం. అద్వైతంలో సంపత్తి, ఆపత్తి అని రెండు మాటలు వస్తాయి. సంపత్తి అంటే బ్రహ్మం తాను కాకపోయినా అయ్యానని భావించటం. పోతే ఆపత్తి అంటే అలా కానిదాన్ని భావించటం కాదు. బ్రహ్మమే అయికూడా కానేమోనని మరచినవాడు మరలా నేనా బ్రహ్మమే కదా అని గుర్తించి బ్రహ్మభావం పొందితే అది ఆపత్తి. ఇది సంపత్తిలాగ కానిదాన్ని పొందటం కాదు. అయిన దాన్ని జ్ఞాపకం చేసుకోవటం. సంపత్తి ఉపాసనమార్గమైతే Reflection, ఆపత్తి జ్ఞానమార్గం Realisation.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆపః ()
Telugu original

ఆపః : పంచభూతాలలో క్రింది నుంచి రెండవది పైనుంచి నాల్గవది. జలమని అర్థం. ఒక్కొక్కప్పుడు కేవల జలానికే కాక అన్ని భూతాలకు కూడా దీన్ని ఉపలక్షణంగా తీసుకుంటారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆపోమయ ()
Telugu original

ఆపోమయ : శరీరంలో మనస్సు అన్నమయమైతే ప్రాణం ఆపోమయమని సిద్ధాంతం. అంటే జలం తాలూకు అతిసూక్ష్మమైన అంశమే ప్రాణం. కనుకనే నీరు త్రాగకపోతే వెంటనే ప్రాణం పోయే ప్రమాదముంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆపాత ()
Telugu original

ఆపాత : పైపైన Superficial ఒక విషయాన్ని లోతుగా దిగి చూడక పైపైన చూచి చెప్పేమాట. అంతేకాక పైకి చూడగానే అప్పటికప్పుడు స్ఫురించటమని కూడా అర్థమే. ఆ పాత రమణీయం. పైకి చూడగానే రమ్యమనిపించవచ్చు. లోతుకు దిగితే దానికి విరుద్ధంగా తేలిపోవచ్చు. ప్రపంచ వ్యవహారం ఇలాంటిదే. ఇది అవిచారిత రమణీయమని అంటారు ఆద్వైతులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆప్తి ()
Telugu original

ఆప్తి : నాలుగు విధములైన కర్మలలో ఇది రెండవది. కర్మ అంటే ఇక్కడ శాస్త్రోక్తం కాదు, మామూలుగా జరిగే క్రియ. నాల్గింటిలో మొదటిది ఉత్పత్తి రెండవది ఆప్తి, మూడవది సంస్కృతి, నాల్గవది వికృతి. ఒక ఘటం క్రొత్తగా తయారయితే అది ఉత్పత్తి. అది కొని ఇంటికి తెస్తే ఆప్తి. దాన్ని తుడిచి శుభ్రం చేస్తే సంస్కృతి. కొన్నాళ్ళకది ఓడుమోసి పగిలిపోతే వికృతి. ఇందులో మొదటిది సృష్టి, రెండు, మూడు స్థితి. నాలుగు లయం. క్రియాకలాపమతా ఈ నాల్గింటిలో సమసి పోవలసిందే. ఇప్పుడీ నాలుగు ఉన్న దనాత్మ అయితే ఇందులో ఏదీ లేనిదాత్మ. కనుకనే కర్మసాధనం కాదు ఆత్మానుభవానికి. ఇంతకూ ఆప్తి అంటే నాలుగు క్రియలలో రెండవది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆప్త ()
Telugu original

ఆప్త : ఆప్తి కలవాడు. ఆప్తి అంటే పొందటం. సాక్షాత్కారం. అనుభవం. అది కలిగినవాడు ఆప్తుడు. అలాంటి వాడి మాట ఎప్పుడూ ప్రమాణమే. కారణం అనుభవం కనుక. వేదవాఙ్మయం ఆప్తులైన మహర్షుల వాక్యాలే కాబట్టి అది అన్నిటికన్నా ప్రబలమైన ప్రమాణమని ప్రసిద్ధికి వచ్చింది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆభాస ()
Telugu original

ఆభాస : వస్తువే మరోరూపంలో భాసించటం లేదా కన్పించటం Appearance. రజ్జువు వస్తువైతే Substance సర్పం దాని ఆభాస. ఆభాస దానిపాటికది అబద్ధం. వస్తువుగా అదే సత్యం. ప్రపంచ మలాంటిది. ఇది నామరూపాత్మకంగా అసత్యం. సచ్చిదాత్మకంగా సత్యం. కనుకనే అనిర్వచనీయ మన్నారు దీన్ని వేదాంతులు. సత్తుగాదిది అసత్తుగాదు. స్వతహాగా అసత్తు. వస్తురూపంగా సత్తు. ఇదీ ఆభాస అనే దాని లక్షణం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆభ్యంతర ()
Telugu original

ఆభ్యంతర : లోపలి భాగమని అర్థం. లోపల ఉన్నదేదో అది అభ్యంతరం. Internal. అంతరమని కూడా అనవచ్చు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆమర్శ ()
Telugu original

ఆమర్శ : విమర్శ అనే అర్థం. Scruitiny. Reference. శివాద్వైతుల మతంలో ప్రకాశ ఆమర్శలని రెండే పదార్ధాలు. ప్రకాశం శివస్వరూపం. ఆమర్శ లేదా విమర్శ అనేది శక్తిస్వరూపం. రెండింటికీ అవినాభావ సంబంధం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆముష్మిక ()
Telugu original

ఆముష్మిక : ఐహికానికి వ్యతిరేకం. ఇహానికి చెందిన దైహికమైతే పరానికి చెందినది ఆముష్మికం. Related to the other world. అర్థకామాలు ఐహికం. ధర్మమోక్షాలు ఆముష్మికం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆముష్యాయణ ()
Telugu original

ఆముష్యాయణ : గొప్ప వంశంలో జన్మించినవాడు. ప్రసిద్ధి కెక్కినవాడు. అలాంటి వాడే అధికారి విద్యకు. ఆచార్యుడు శిష్యుడు ఇద్దరూ జన్మతః పరిశుద్ధులై ఉండాలి అని అంతరార్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆమయ ()
Telugu original

ఆమయ : వ్యాధి, దోషం, లోపం. అలాంటిది లేకుంటే అనామయ లేదా నిరామయ Pure defectless. × ఆమ్నాయ/ఆమ్నాన : ఆమ్నానమంటే ఒక విషయాన్ని పేర్కొనటం Mention. అలా ఒక గొప్ప రహస్యాన్ని పేర్కొనేది ఆమ్నాయం. వేదవాఙ్మయమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆయతన ()
Telugu original

ఆయతన : ఆశ్రయం. ఆధారం Abode. Base. 'చంద్రమావా అపా మాయతనం' చంద్రుడు జలానికి ఆయతనమట. ఒకదాని మూలకారణం లేదా మూలస్థానమని భావం. అలాంటిదాన్ని వెతికి పట్టుకొంటే వాడు ఆయతనవాన్‌అవుతాడు. అన్నిటి ఆయతనం బ్రహ్మచైతన్యం. అది పొందగలిగితే జీవుడు నిజమైన ఆయతనవాన్‌.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆయత్త ()
Telugu original

ఆయత్త : ఒకదానికి అధీనమైనదని అర్థం Dependent. లోబడినది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆరణ్యక ()
Telugu original

ఆరణ్యక : వేదంలో ఒక భాగం. అరణ్యాలలో కూర్చొని ఏకాంతంగా శిష్యులకు బ్రహ్మవిద్యను బోధించిన సందర్భం. బృహదారణ్యకం ఇలాంటిదే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆర్త ()
Telugu original

ఆర్త : చతుర్విధ భక్తులలో ఆర్తుడొకడు. 'ఆర్తో జిజ్ఞాసు రర్ధార్థీ' అని గీతావచనం. ఆర్తుడంటే ఏదో ఆపద సంభవించినపుడే భగవంతుని స్మరించే భక్తుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆర్జవ ()
Telugu original

ఆర్జవ : ఋజుత్వం అని అర్థం. Uprightness. దైవగుణాలలో ఇదికూడా చాలా ముఖ్యమైన గుణం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆరబ్ధ ()
Telugu original

ఆరబ్ధ : ఆరంభింపబడినదని అక్షరార్థం. గతంలో చేసిన కర్మ ఈ జన్మలో పక్వమై అనుభవానికి వస్తే దానికి ఆరబ్ధమని పేరు. ప్రారబ్ధమని కూడా పేర్కొనవచ్చు. ఆరంభింపబడిన ఏ పనికైనా ఈ మాట సర్వసామాన్యంగా వర్తిస్తుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆరంభవాద ()
Telugu original

ఆరంభవాద : The theory of creation. తార్కికుల వాదమిది. ఒక పదార్థం అంతకుముందు లేదు. కారక సామగ్రిచేత అది క్రొత్తగా తయారవుతుంది. అంతకుముందు లేనిది ఆరంభమౌతుంది కనుక దీనికి ఆరంభవాదమని పేరు. అసత్‌కార్యవాదమని కూడా దీనికి నామాంతరముంది. కార్యం అంతకుముందు లేకుండా క్రొత్తగా సృష్టి అయిందని చెబుతారు కనుక ఈ పేరు వచ్చింది. ఈ దృష్టిలో కారణమూ సత్యమే. కార్యమూ సత్యమే. రెండూ రెండు సత్యాలు. వేదాంతులలో ద్వైతమతస్థులు ఈ వాదాన్నే అంగీకరిస్తారు. × ఆరాత్‌: దూరంగా సూటిగా గాక చాటుగా Indirect. ఒకదాన్ని వర్ణించేటప్పుడు సాక్షాత్తుగా వర్ణించవచ్చు లేక దేనిమీదనో నెపంపెట్టి దూరంగా సూచించవచ్చు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆరాగ్ర ()
Telugu original

ఆరాగ్ర : ఆరెకు సంస్కృతంలో ఆరా అని పేరు. చెప్పులు కుట్టేవాడికుండే ఒకానొక పనిముట్టు. అలాంటి దాని అగ్రం అంటే మొన. మొనదేరి ఉన్నది ఆరాగ్రం. అలాంటిదే జీవచైతన్యం. అంత సూక్ష్మమైనది, నిరాకారమైనది అని భావం. 'ఆరాగ్ర మాత్రో హ్యవరో-పి దృష్టః' ఆరాగ్రంతో పోల్చి చెప్పిన మాత్రాన భౌతికమైన తత్త్వమని భ్రమపడరాదు. అతి సూక్ష్మమని అర్థం చేసుకోవలసి ఉంటుంది. అంత మాత్రమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆరామ ()
Telugu original

ఆరామ : అందులోనే రమించటం. విశ్రమించటం. ఆత్మలోనే రమిస్తే వాడు ఆత్మారాముడు. 'తత్త్వీభూతః తదారామః' అని గౌడపాద శ్లోకం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆరూఢ ()
Telugu original

ఆరూఢ : ఆరోహించిన వాడు. చివరి భూమిక ఎక్కికూర్చున్నవాడు. చేరవలసిన గమ్యం చేరినవాడు. మ్తుపురుషుడని అర్థం. Accomplished.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆరురుక్షు ()
Telugu original

ఆరురుక్షు : అలా చేరక ఆరోహణ మార్గంలోనే ఆయా దశలలో పయనిస్తున్న వాడు ఆరురుక్షుడు. Asperent.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆరోప ()
Telugu original

ఆరోప : ఆరోపించటం. ఒకదాని మీద మరొక దానిని ఉంచటం. అధ్యారోప మని కూడా వ్యవహరించవచ్చు. Imposition. వస్తువుమీద ఆ వస్తువును తెచ్చిపెట్టట మని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆర్ష ()
Telugu original

ఆర్ష : ఋషిప్రోక్తమైనది. ఋషులకు సంబంధించినది. ఆర్షదర్శనం రెండు విధాలు. ఒకటి బ్రహ్మదర్శనం. రెండు ధర్మదర్శనం. మొదటిది వేదాంతమైతే రెండవది కేవలం వేదమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆలంబన ()
Telugu original

ఆలంబన : ఒక నిమిత్తం. ఆధారం. ఆశ్రయం. Support or Aid. బ్రహ్మతత్త్వం నిర్గుణం కాబట్టి దానిని అలాగే పట్టుకొనలేక గుణాలు కల్పించి దానిని ధ్యానం చేస్తాడు మధ్యమాధికారి. ఆ గుణాలే అతనికి ఆలంబనం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆలంభ ()
Telugu original

ఆలంభ : పశుయజ్ఞంలో పశువును యూపస్తంభానికి కట్టి వధించటం. Animal sacrifice.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆలస్య ()
Telugu original

ఆలస్య : అలసత్వం. సోమరితనం. Lethargy indolence. సాధన మార్గంలో ఇది గొప్ప అంతరాయం. సాధనకే అసలు ఉపక్రమించలేడు. యోగమార్గంలో కలిగే అంతరాయాలలో ఇది ఒక పెద్ద అంతరాయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆలయ విజ్ఞానం ()
Telugu original

ఆలయ విజ్ఞానం : అన్ని వృత్తులకు ఆశ్రయమైన మనస్సు ఆలయం. ఆశయమని కూడా దీనికే నామాంతరం. ఇందులో గత జన్మల తాలూకు వాసనలు ఎన్నో అసంఖ్యాకంగా పేరుకొని ఉంటాయి. అవే ఎప్పటికప్పుడు వృత్తులుగా మారుతుంటాయి. ఈ విజ్ఞాన పరంపరకే ఆలయ విజ్ఞానమని పేరు పెట్టారు బౌద్ధులు String of ideas or thoughts. ఇదే వైజ్ఞానికుల విజ్ఞానవాదం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆలోక ()
Telugu original

ఆలోక : కాంతి అని, దృష్టి అని అర్థం. కాంతి లేనిదే దృష్టికి దృశ్యం కనిపించదు. ప్రకాశముంటేనే చూపు. చూపుకూడా ప్రకాశమే. అదే ప్రకాశింపజేస్తున్నది రూపాన్ని. దానికి ప్రకాశకం మనస్సు. దానికి కూడా ప్రకాశ మాత్మచైతన్యం కనుక ఆలోకమన్నా, ప్రకాశమన్నా ఆత్మే. మరేదీ కాదు. అది స్వయంప్రకాశం. ప్రకాశమంటే సూర్యాలోకం లాంటిదని కాదు. కేవలం స్ఫురణ. స్ఫూర్తి Awareness అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆవరణ ()
Telugu original

ఆవరణ : వరణమంటే కప్పటం. చుట్టివేయటం. అన్ని వైపుల నుంచీ కమ్ముకుంటే అది ఆవరణం. మాయాశక్తి కున్న రెండు ముఖాలలో ఇది మొదటిది. సుషుప్తిలో కనిపిస్తుంటుంది. ఆత్మచైతన్యాన్ని అక్కడ బొత్తిగా కనపడకుండా కప్పివేసింది మాయ. ఇది అనాది. అవిద్య వాసనా శరీరమని కారణ శరీరమని దీనికే పేరు. ఆవరణ ఆత్మజ్ఞానాన్ని లేకుండా చేస్తే దీనికి భిన్నంగా విక్షేపమనేది అనాత్మ జగత్తును బయటపెడుతుంది. మొదటిది Contraction. రెండవది Distraction. జీవభావాని కొకటి జగద్భావాని కొకటి దారి తీస్తాయి.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆవర్త / ఆవృత్తి ()
Telugu original

ఆవర్త/ఆవృత్తి : వృత్తి అంటే తిరగటం. ఆవృత్తి అంటే మళ్ళీ మళ్ళీ తిరగటం లేదా త్రిప్పుతూ పోవటం ఒక మంత్రాన్ని జపించేటప్పుడు అది పదేపదే భావిస్తాము. లేదా ఉచ్చరిస్తాము. Rotation. ఇదే ఆవృత్తి. ఆత్మజ్ఞానం కూడా ఇలాంటిదే నన్నారు. అదీ వృత్తిరూపమే. ఆత్మాకార వృత్తి. దాన్నికూడా వడ్ల దంపకంలాగా వృత్తి చేస్తూ పోవాలి. అప్పుడే సాక్షాత్కారమని అద్వైతుల మాట. ఆవృత్తి అంటే పునరావృత్తి అని కూడా అర్థమే. అంటే మరణించిన వ్యక్తి మరలా కర్మభూమిలో వచ్చి జన్మించట మని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆవసథ ()
Telugu original

ఆవసథ : నివాసస్థానం. నివసించే చోటు. అవస్థ State or Stage త్రయః స్వప్నాః త్రయ అవసథాః మనకు మూడున్నాయి నివాస స్థానాలు. ఒకటి జాగ్రత్‌, రెండు స్వప్నం. మూడు సుషుప్తి. మూడూ మనకు కలిగే మూడు అవసథాలుఅంటే నివాస స్థానాలు. వీటి మూడింటిలోనే ఒకటి మార్చి ఒకటి తిరుగుతుంటాడుజీవుడు. × ఆవాప : ఆశ్రయం. ఆస్పదం location అని అర్థం. ఉంచటమని కూడా. ఆవాపోద్వాపాలు అంటారు శాస్త్రంలో. అంటే ఒకటి పెట్టడం. మరొకటి అక్కడి నుంచి ఎత్తివేయటం అని భావం. × ఆవిర్భావ : ప్రాదుర్భావమని కూడా అనవచ్చు. బయటపడటం, కనిపించటం, Exposition అని అర్థం. మరుగుపడిన సత్యం బయటపడితే అది ఆవిర్భావం లేదా సాక్షాత్కారం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆవీత ()
Telugu original

ఆవీత : ప్రతిషేధముఖంగా Negative ఒక సత్యాన్ని బోధించటం. Negative approach. అనాత్మను కొట్టివేస్తూ తద్ద్వారా ఆత్మను చూపటం. అన్వయ వ్యతిరేకాలలో వ్యతిరేక విధానమిది. శాస్త్రంలో మిగతా వాదాలన్నీ ఒకదానితో ఒకటి పేచీపడి అన్నీ తేలిపోతే చివరకు మిగిలేది తమ వాదమేనని సిద్ధాంతీకరించారు అద్వైతులు. ఇది విధి ముఖంగా చెప్పకుండానే ఫలించిన సత్యం కనుక దీనిని ఆవీతన్యాయమని వారు వర్ణిస్తారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆవేశ ()
Telugu original

ఆవేశ : అన్ని వైపులా ప్రవేశించి నిండిపోవటం. శివతత్త్వాన్ని జీవుడు తనలో అలా భావిస్తే శివావిష్టుడౌతాడు. శివావేశం పొందినవాడని అర్థం. ఇలాగే ప్రతి కదలికలో బ్రహ్మమే తన స్వరూపమని ఆభావంతో నిండిపోతే అది బ్రహ్మావేశం. శంకరులవారు అది ఒక గ్రహంలాగ మానవుడి బుద్ధిని పట్టుకొని ఉండాలని, అదే అనన్యమైన భక్తి అని అసలైన ఆత్మజ్ఞానమని సెలవిచ్చారు. × ఆశయ : నిలయమని, స్థానమని Abode అర్థం. అన్ని ఆలోచనలకూ నిలయం మానవుడి మనస్సు. దానికే వేదాంతులు ఆశయమని పేరుపెట్టారు. 'సర్వభూతాశయ స్థితః' అని పరమాత్మను వర్ణించారు, సకల భూతాల ఆశయంలోనూ ఈశ్వరుడే చోటు చేసుకొని ఉన్నాడని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆశంక ()
Telugu original

ఆశంక : శంక అన్నా ఆశంక అన్నా సందేహమని అర్థం. Doubt. ఒకరి వల్ల సమాధానం రాబట్టడానికి కల్పించుకొనే ప్రశ్నకూడా ఆశంకే. 'అత్రేయ మాశంకా.' ఇక్కడ ఒక చిన్న సందేహం. దీనికేమిటి జవాబు అని శాస్త్రంలో నడిచే వ్యవహారం. ఆశంకా సమాధానాలన్నా, ప్రశ్నోత్తరాలన్నా రెండూ ఒకటే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆశ్రయ ()
Telugu original

ఆశ్రయ : ఆధారం. ఆస్పదం Base అని అర్థం. ఒకదాన్ని మరొకటి అంటి పెట్టుకోవడం. గుణానికి ద్రవ్యం ఆశ్రయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆశ్రమ ()
Telugu original

ఆశ్రమ : నివసించే స్థానం Station. జీవితంలో ఈలాంటి దశలు నాలుగున్నాయి. వాటికే ఆశ్రమాలని పేరు. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం. సన్యాసం అని ఈ నాలుగూ ఆశ్రమాలు. ఇవి కాక ఒక చోట ఒక మఠమో ఏదో కట్టుకొని నివసిస్తే అదీ ఆశ్రమమే. గౌడపాదులు ఇవి ఏవీ చెప్పలేదు. మానవుడి దృష్టికే ఆశ్రమమని ఆయన పేరు పెట్టారు. ఉత్తమ మధ్యమ మంద అధికారుల దృష్టులే ఆశ్రమాలని ఆయన మతం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆశ్వాస ()
Telugu original

ఆశ్వాస : ఊరడింపు, ఓదార్పు, తృప్తి, విరామమని కూడా చెప్పవచ్చు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆశ్యాన ()
Telugu original

ఆశ్యాన : కరుడు గట్టినదని ఘనీభవించినదని అర్థం. శివాద్వైతు లీ ప్రపంచమంతా శివచైతన్య రసమే ఘనీభవించి ఇలా జ్ఞేయరూపంగా మన జ్ఞానానికి భాసిస్తున్నదని వర్ణిస్తారు. ఆశ్యానమనేది వారి పరిభాష. × ఆస్తిక : 'అస్తి పరలోకః' ఇహమేగాక పరంకూడా ఒకటి ఉన్నదని నమ్మేవాడు. Theist. వేదమే ప్రమాణమని భావించేవాడు. అంతేగాక జీవజగత్తులకు విలక్షణంగా ఈశ్వరుడొకడున్నాడని విశ్వసించేవాడు. × ఆస్థా : తీవ్రమైన ఆసక్తి, కాంక్ష, కోరిక. ఇంకో అర్థం కూడా ఉంది. ఒక విషయంలో గట్టిగా నిలబడటం కూడా ఆస్థే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆస్థిత ()
Telugu original

ఆస్థిత : అలా ఒక భావాన్ని పట్టుకొని అందులో గట్టిగా నిలిచేవాడు. వాడు కర్మిష్ఠుడు కావచ్చు. భక్తుడు కావచ్చు. యోగి కావచ్చు. కడకు జ్ఞాని కూడా కావచ్చు. అప్పుడే వాంఛితమైన ఫలితాన్ని చవిచూడగలడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆహవనీయ ()
Telugu original

ఆస్పద : ఆధారం, ఆధిష్ఠానమని Basis అర్థం. సర్పానికి రజ్జువే ఆస్పదం. ప్రతినామ రూపాలకూ సచ్చిద్రూపమైన పరమాత్మే చివరకు ఆస్పదమవుతున్నాడు. ఇదే అద్వైతుల దర్శనం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆహుతి ()
Telugu original

ఆసుర : ఆసుర గుణాలకు Devilish సంబంధించిన సృష్టి లేదా ప్రవృత్తి.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఆక్షేప ()
Telugu original

ఆహార : లోపలికి తీసుకోవటమని అక్షరార్థం literal sense. శారీరకంగా అయితే భోజనం. మానసికంగా చెబితే విషయ ప్రపంచం. Food to mind దాని తాలూకు వృత్తులెప్పుడూ మనస్సులో ప్రవేశిస్తుంటాయి. కనుక ప్రపంచమే మనకు ఆహారం. ఇది అన్నమని, మనకన్నాదుడని ఇందుకే పేరు వచ్చింది. ఇది మన జీవితగమ్యాన్ని చేరకుండా అడ్డగిస్తున్నది. కనుకనే 'విషయా వినివర్తతంతే నిరాహారస్య' అని గీత మనలను హెచ్చరిస్తున్నది.

Vedānta Paribhāṣā Vivaraṇa
()
Telugu original

ఆ : ఆది మొదలుకొని లేదా అంతవరకని దీనికి రెండర్థాలు ఉన్నాయి. ఆగర్భ అన్నప్పుడు పుట్టుక మొదలుకొని అని అర్థం. ఆబ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మవరకు అని అర్థం. 'ఆసుప్తేః ఆమృతేః కాలం నయేత్‌వేదాంత చింతయా.' నిద్రపోయేవరకూ మరణించేవరకూ వేదాంత చింతనతో కాలం గడపాలట. ఆ అంటే అన్నివైపుల అనీ అర్థమే. ఆపూర్యమాణం అన్నివైపులా నిండి ఉన్నదని అర్థం. ఆ అనే మాటకు వ్యతిరేకార్థం కూడా కనిపిస్తుంది. మోచనమంటే వదలుకోవటం. ఆమోచనమంటే ధరించటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఇతి ()
Telugu original

ఇతి : ఇలాగ. ఇంతే. అని ఈ మూడూ దీనికర్థాలే. ఇత్యేవం అంటే ఇది ఇలాగ అని అర్థం. ఇతీవ అంటే ఇలా ఉన్నట్టు కనిపిస్తున్నదని భావం. ఇతి అనేది శాస్త్రంలో ఒక విషయం సమాప్తం కావటాన్ని తెలుపుతుంది. అథ ఆరంభాన్ని సూచిస్తూ ఇతి దాని ముగింపును సూచిస్తుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఇతిహాస ()
Telugu original

ఇతిహాస : ఇతి ఈ విధంగా హ పూర్వం ఆస ఉండెను. ఇలా జరిగింది పూర్వమని అక్షరార్థం. కథలూ ఆఖ్యానాలూ ఇతివృత్తాలూ అన్నీ దీనికి పర్యాయాలే. Historical Event. Story. Tradition.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఇత్థమ్‌ ()
Telugu original

ఇత్థమ్‌: ఇలాగా. ఈ ప్రకారంగా

Vedānta Paribhāṣā Vivaraṇa
ఇదమిత్థం ()
Telugu original

ఇదమిత్థం : ఇది ఇలాగ. ఇది ఫలానా అని గ్రహించే సందర్భంలో వచ్చే మాట.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఇదం ()
Telugu original

ఇదం : ఇది అని వాచ్యార్థం. ఎదుట కనిపించేదంతా ఇది అనే అంటాము. కాబట్టి ఇదమంటే ఈ ప్రపంచమంతా అని అర్థం వచ్చింది. అంతేకాదు. మనసులో కలిగే ఆలోచనలూ మన జ్ఞానానికి విషయమే. కనుక జ్ఞానానికి విషయమైన జ్ఞేయ ప్రపంచమంతా The objective world. అహం The self కానిదేదో అది ఇదం. Non-self. Known as opposed to the knower.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఇదంతా ()
Telugu original

ఇదంతా : ఇదం తాలూకు భావం This ness. దీనికి వ్యతిరేకిపదం అహంతా. The I ness.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఇంద్ర ()
Telugu original

ఇంద్ర : ఇదంద్ర అంటే దీనిని. ద్ర అంటే చూచేవాడు. ఈ ప్రపంచాన్ని తనకు విషయంగా చూచేవాడెవడో వాడు ఇదంద్రుడు. ఇదంద్రుడే ఇంద్రుడు. ఉపనిషత్తు ఇంద్ర శబ్దానికి చాలా చమత్కారంగా చెప్పిన వ్యుత్పత్త్యర్థం. ఇంతకూ ఇంద్రుడంటే దేవేంద్రుడు కాడు. జీవుడు. జీవుడే గదా చూస్తున్నాడీ జగత్తును ఇదమిదమని. కనుక జీవుడికి అద్వైతులు చేసిన నామకరణమిది. ఇంద్ర అంటే పరమాత్మ అని కూడా ఒక అర్థముంది. వాస్తవంలో పరమాత్మే కదా జీవరూపంగా శరీరంలో భాసిస్తున్నాడు. అతడు కూడా ఈ ప్రపంచాన్ని అజ్ఞానంతో కాకపోయినా జ్ఞానంతో తన స్వరూపంగానే చూస్తుంటాడు. కనుక ఇంద్రుడనే మాట పరమాత్మకు కూడా వర్తిస్తుంది. ఇంద్రో మాయాభిః పురురూప ఈయతే అని ఉపనిషద్వచనం. తన మాయాశక్తితో అనేక రూపాలు ధరించి ఈశ్వరుడే నటిస్తున్నాడట.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఇంద్రియ ()
Telugu original

ఇంద్రియ : ఇంద్రుడైన జీవుడికి సంబంధించినదేదో అది ఇంద్రియం. అంటే జీవుడీ ప్రపంచాన్ని గ్రహించటంలో తోడ్పడే పరికరం లేదా సాధనం. జ్ఞాన సాధనం. దీనికే ప్రమాణమని Instrument of knowledge నామాంతరం. ఇది రెండు జాతులు. ఒకటి ప్రత్యక్షం. మరొకటి అనుమానం. ప్రత్యక్షం చక్షురాది ఇంద్రియాలు. అనుమానం మనస్సనే అంతరింద్రియం. మొదటిది Perceptual. రెండవది Ceptual. ప్రత్యక్షంలో మరలా జ్ఞానేంద్రియా లున్నాయి. కర్మేంద్రియాలున్నాయి. చక్షురాదులు జ్ఞానేంద్రియాలు. వాగాదులు కర్మేంద్రియాలు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఇంద్రయాతీత ()
Telugu original

ఇంద్రయాతీత : ప్రపంచమంతా ఇంద్రియ గోచరమైతే దీనిని దర్శించే ఆత్మచైతన్యం మాత్రం ఏ ఇంద్రియానికీ గోచరించదు. అది వీటి కతీతం. కారణం అది వీటికి సాక్షియే గాని సాక్ష్యం కాదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఇంధ ()
Telugu original

ఇంధ : ఇంధ అనే మాటకు కూడా ఇంద్రుడైన జీవుడనే అర్థం. అయితే జీవచైతన్యం శరీరమంతా వ్యాపించినా దక్షిణమైన నేత్రంలో అది చాలా ప్రబలంగా వ్యక్తమై కనిపిస్తుందట. ఇది లోకుల వాడుకలో కూడ కొంత కద్దు. కాని అంత స్పష్టంగా తెలియదు లౌకికుడికి. అక్షి అంటే దక్షిణాక్షి. అందులో ప్రకటమైన ఆత్మచైతన్యాన్ని స్పష్టంగా దర్శించగలుగుతాడట ఉపాసకుడు. అతడు పాసించే ఈ విద్యకు అక్షిపురుష విద్య అని పేరు వచ్చింది. ఇంధ అంటే దేదీప్యమానంగా వెలిగేదని అర్థం. చైతన్యం అలాంటి ఒక అభౌతికమైన వెలుగు. దానిని అక్షిలో దర్శిస్తారు కనుక ఇంధ అంటే అక్షి పురుషుడైన జీవుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఇష్ట ()
Telugu original

ఇష్ట : కోరబడే విషయం. వెతకబడేది కూడా. ఏది కోరుతాడో మానవుడు దానినే వెతుకుతూ పోతాడు. కనుక రెండూ దీని కర్థాలే. అంతేకాదు. యజింపబడేది కూడా Worshipped ఇష్టమే. యజ్ఞయాగాదులని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఇష్టదేవతా ()
Telugu original

ఇష్టదేవతా : తాను ఏ దేవతను అభిమానించి ఉపాసిస్తాడో ఆ దేవతకు పేరు. చివరకు మరణానంతరం ఉపాసకుడికి ఇష్టదేవతా సాయుజ్యమే లభిస్తుందని శాస్త్రమిచ్చే హామీ.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఇష్టి ()
Telugu original

ఇష్టి : యజ్ఞమని అర్థం. పుత్త్రకామేష్టి మొదలైన మాటలలో చూడవచ్చు. అంత్యేష్టి అని ఒక మాట ఉన్నది. చివరిసారిగా మానవుడికి చేసే ఉత్తరక్రియలు అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఇషిత ()
Telugu original

ఇషిత : ఇష్టమనే అర్థం. 'కేనేషితం పతతి ప్రేషితం మనః' అని ఉపనిషత్తు దేనిని కోరి మనస్సు ఒక పదార్థంమీద పోయి వాలుతున్నదో దానిని ఏ మహాశక్తి వెనకాల జేరి నడుపుతున్నదో అని అక్కడ భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఇష్టాపత్తి ()
Telugu original

ఇష్టాపత్తి : ఒక వాదనలో ప్రతివాది చేసే వికల్పానికి జవాబు చెప్పేటప్పుడు ఒక పక్షం కాదని చెప్పినా మరొక పక్షం తమకు సమ్మతమేనని ఒప్పుకోవటం. Acceptance. తమకిష్టమైనది ఎదటివాడు చెప్పినప్పుడు సరే అని ఆపన్నమయితే అది ఇష్టాపత్తి. ఉదాహరణకు జీవన్ముక్తుడికి వేదచోదితమైన కర్మలు వర్తించవు గనుక వేదానికి ప్రామాణ్యం అతని విషయంలో చెల్లదుగదా అని ఆక్షేపిస్తే అంతవరకు మాకు ఇష్టమేనని అద్వైతులు సమాధానమిస్తారు. అజ్ఞానికి కర్మలు వర్తిస్తాయి. అక్కడ శాస్త్రానికి ప్రామాణ్యం చెల్లుతుంది. జ్ఞాని విషయంలో చెల్లదు. ఇది మాకిష్టాపత్తే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఇష్టాపూర్త ()
Telugu original

ఇష్టాపూర్త : ఇష్టమంటే యజ్ఞం. పూర్తమంటే వాపీకూప తటాకాదులు. రెండూ కలిసి ఇష్టాపూర్తం. ఇది ఒక ధర్మకార్యం. అభ్యుదయమనే Prosperity ఫలితమిస్తుంది ఇది. ఇందులో ఇష్టం శ్రౌత కర్మ. పూర్తంస్మార్త కర్మ.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఇహాముత్ర ()
Telugu original

ఇహాముత్ర : ఇహమంటే మనమున్న ఈ లోకం. అముత్ర అంటే మనం చేరబోయే పరలోకం. ఒకటి పుట్టుక నుంచి గిట్టేవరకు అనుభవానికి వచ్చేది. మరొకటి గిట్టినప్పటి నుండి మరలా పుట్టేవరకు అనుభవానికి రాబోయేది. రెండూ మొత్తానికి అనాత్మ క్రిందికే వస్తుంది కాబట్టి మనకు సంసార బంధాన్ని తెచ్చిపెట్టేవే. కాబట్టి వీటిమీద మమకారం వదలుకోమని వేదాంతుల హెచ్చరిక.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఇషీకా ()
Telugu original

ఇషీకా : ఒక ఆకు నడుమ చారికలాగా కనిపించే ఈనెపుల్ల. Mid rib of a leaf. గడ్డిపోచకూడ కావచ్చు. ఆకు మడచి దానిలో గుప్తంగా ఉన్న ఈనెను లాగినట్టు మన ఆత్మచైతన్యాన్ని శరీరాదుల నుంచి బయటికి లాగుకోవాలని అద్వైతుల బోధ.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఇచ్ఛా ()
Telugu original

ఇచ్ఛా : కోరిక. జ్ఞాతుమిచ్ఛా జిజ్ఞాసా. Desire to know. తెలుసుకోవాలనే కోరిక. అర్థిత్వమని కూడా అంటారు దీన్ని. జ్ఞానమున్నందుకు ఇచ్ఛ ఉండాలి. ఇచ్ఛ ఉంటేనేగాని క్రియ చేయలేవు. క్రియ చేస్తేనే గాని ఫలం లేదు. జ్ఞానశక్తి శివస్వరూపమైతే ఇచ్ఛాశక్తి దేవీ స్వరూపం. ఈశ్వరునికి కలిగిన సంకల్పమే ఈ ప్రపంచసృష్టికి కారణం. ఇదే ఈశ్వరేచ్ఛ. జ్ఞానంతో మరలా ఈ ప్రపంచాన్ని లయం చేసుకోవాలని కోరితే అది మానవేచ్ఛ. అప్పుడు మానవుడు ఈశ్వరుడే అవుతాడు కాబట్టి మానవేచ్ఛ ఈశ్వరేచ్ఛగానే మారగలదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఈక్షా / ఈక్షణ ()
Telugu original

ఈక్షా/ఈక్షణ : చూపు, దృష్టి అని అర్థం. ఇచ్ఛ అని కూడా అర్థమే. పరమాత్మ ఈక్షణమే క్రియారూపంగా సాగి ప్రపంచంగా అవతరించింది. తదైక్షత బహుస్యాం అని ఉపనిషత్తు. ఈక్షణమన్నా, ఇచ్ఛ అన్నా, సంకల్పమన్నా, దృష్టి అన్నా అన్నిటికీ ఒకే అర్థం. The vision or the will of God which intends to create the world by multiplying itself.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఈప్సా ()
Telugu original

ఈప్సా : ఆప్తుమిచ్ఛా. ఒకటి పొందాలనే కోరిక. కోరబడిన పదార్థం ఈప్సితం. The desire thing. ఇది ప్రాపంచికంగా కాక పారమార్థికంగా సాగితే మానవుడు ధన్యుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఈట్ ‌/ ఈశ / ఈశ్వర ()
Telugu original

ఈట్‌/ఈశ/ఈశ్వర : అన్నిటికీ అర్థమొకటే. ఈశన అంటే ఒక విషయాన్ని అదుపులో ఉంచుకోవటం. పెత్తనం చలాయించటం. To command. To control. అనాత్మ జగత్తుకు బాహ్యంగా, ఆంతర్యంగా చేరి దాన్ని తన వశంలో ఉంచుకొని నడుపుతున్నది ఈశ్వరుడే. అంతర్యామి అని కూడా ఆయనకే నామధేయం. 'ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే' అని గీతా వచనం. తన మాయాశక్తిని అధీనంలో ఉంచుకుని సృష్టి స్థితి లయాదులు చేస్తున్న వాడెవడో వాడు ఈశ్వరుడు. ఈశావాస్య మిదం. ఇదంతా ఈశ్వరుని చేతనే వాసితం అయి ఉన్నది. కనుక మనం దీనిని ఈశ్వర భావనతోనే చూడాలంటున్నది ఉపనిషత్తు. పరమాత్మ వేరు. ఈశ్వరుడు వేరు. నిర్గుణమైన తత్వమైతే అది పరమాత్మ లేదా బ్రహ్మం. అది సగుణమై జగన్నాటకం నిర్వహిస్తే ఈశ్వరుడు. మాయాశక్తి నిర్గుణంలో గుప్తమై ఉంటుంది. ఈశ్వరుడిలో ప్రకటమై అతనికి అధీనమై సృష్ట్యాదులు సాగిస్తుంది. ఇదీ మనం గ్రహించవలసిన రహస్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఈడ్య ()
Telugu original

ఈడ్య : పూజింపదగినవాడు ఈశ్వరుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఈశావాస్యం ()
Telugu original

ఈశావాస్యం : పది ఉపనిషత్తులలో ఇది మొదటిది. ఈశోపనిషత్తు అని కూడా పేర్కొంటారు. ఈశావాస్యమని ఈట్‌శబ్దంతో ప్రారంభమౌతుందిది. కనుక దీనికీ పేరు వచ్చింది. సర్వమూ ఈశ్వరాత్మకమే వాస్తవంలో. కానీ మానవుడది మరచిపోయాడు. కనుక గురూపదేశంతో మరలా దానిని గుర్తించి ఈశ్వరాత్మకంగానే జగత్తును దర్శిస్తే ముక్తుడౌతాడని సంగ్రహంగా ఇందులోని విషయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఈశాన ()
Telugu original

ఈశాన : ఈశ్వరుడనే అర్థం. అంతేగాక ఈశాన్య దిక్కుకు అధిపతి అయిన దేవత కూడా ఈశానుడే. పోతే పంచముఖుడైన రుద్రుని అయిదు ముఖాలలో ఈశానమని ఒక ముఖానికి పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఈశిత్వ ()
Telugu original

ఈశిత్వ : అష్టసిద్ధులలో ఇది ఒక సిద్ధి. ఈశిత్వమనగా అండ పిండ బ్రహ్మాండాదుల అన్నింటిమీదా అధికారం చెలాయించటం. Weilding power over all the energy and matter. యోగసిద్ధి పొందిన వారికి ఇది వశమవుతుంది. జ్ఞానులు కోరకపోయినా వారికీ అప్రయత్నంగా సిద్ధులన్నీ లభిస్తాయి.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఈహా ()
Telugu original

ఈహా : వాంఛ. కోరిక.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఈషా ()
Telugu original

ఈషా : ఈశనం చేయటం. అదుపుచేయటం. మనస్సును అదుపుచేస్తే మనీషా. అలాంటి మనీషా కలవాడు మనీషి. ఇది సాధన మార్గంలో ముఖ్యంగా అవలంభించ వలసిన గొప్ప సూత్రం. మనస్సు వశమైతేగాని ఏకాగ్రత సిద్ధించదు. అప్పుడే లక్ష్యాన్ని భేదించి పట్టుకోగలం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఇంగిత ()
Telugu original

ఇంగిత : ఇంగనమంటే చలించటం. పైకి లేవటం. పొంగటం. మనసులో కలిగే పొంగుకే ఇంగితమని పేరు. ఇంగిత జ్ఞానం ఏ మాత్రమూ లేదని లోకంలో వాడుక. అంటే ఎదుటివాడి మనస్సులో ఏ భావ మేర్పడుతున్నదో తెలియకపోవటమని భావం. జ్యోతిరింగణమంటే మిణుగురు పురుగు. ఒక జ్యోతితో ఎప్పుడూ కదులుతూ పోతుంది. అందుకే ఆ పేరు దానికి వచ్చింది. మనసులో దాగి ఉన్న అభిప్రాయమే ఇంతకూ ఇంగితమనే మాటకర్థం. The intent.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉచిత ()
Telugu original

ఉచిత : యుక్తమైనది. తగినది. Proper. Befitting. శాస్త్రోచితమంటే శాస్త్రానికి అనుగుణమైనదని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉచ్చయ ()
Telugu original

ఉచ్చయ : పోగుకావటం. పోగు. సమూహం. రాశి Heap. అధికమవటం అని కూడా అర్థమే. సముచ్చయమనే మాటలో తెలుస్తుంది ఈ విషయం. జ్ఞాన కర్మ సముచ్చయ. జ్ఞానమూ కర్మ రెడూ కలిపి పట్టుకోవటమని భావం. అభ్యుచ్చయమని కూడా ఒక మాట ఉంది. బాగా కలుపుకుంటూ రావటం Gather అని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉచ్చావచ ()
Telugu original

ఉచ్చావచ : ఉచ్చమంటే మేలు. అవచమంటే కీడు. హెచ్చు తగ్గులని శబ్దార్థం. అన్ని భావాల కలగాపులగమని గౌణార్థం. Secondary sense.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉచ్ఛిత్తి / ఉచ్ఛేద ()
Telugu original

ఉచ్ఛిత్తి / ఉచ్ఛేద : తెగిపోవటం. విచ్ఛిన్నం కావటం. వినాశం. Break. Destruction. ఉదాహరణకు నిద్రలో ఆత్మజ్ఞానం అనుభవానికి రాకపోతే అది అక్కడికి ఉచ్ఛిన్నమైందని భావించడం సహజం. కాని వాస్తవంలో అది అక్కడ ఉంది. వస్తుసిద్ధమైనా బుద్ధి సిద్ధం కాలేదు గనుక దానికి ఉచ్ఛేదమని భ్రాంతి చెందుతున్నాము.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉచ్ఛ్వాస ()
Telugu original

ఉచ్ఛ్వాస : లోపలికి పీల్చే గాలి. దీనికే అపానమని నామాంతరం. దీనికి భిన్నంగా బయటికి వదిలేగాలి నిశ్వాసం. ప్రాణమని దానికి మరొకపేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉత్కర్ష ()
Telugu original

ఉత్కర్ష : పైకి లాగటం. ఆధిక్యం. ఎక్కువ. ప్రాధాన్యం అని అనేకార్థాలు ఉన్నాయి. దీనికి వ్యతిరేక పదం నికర్ష లేదా అపకర్ష.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉత్క్రమ ()
Telugu original

ఉత్క్రమ : పైకి పోవటం. దాటిపోవటం. ప్రాణోత్క్రమమంటే ప్రాణ వాయువు శరీరాన్ని విడిచి నిష్క్రమణ చెందటం. అది కపాలరంధ్రం ద్వారా జరిగితే ఉత్తమ లోకాలు లభిస్తాయని, మిగతా శరీర రంధ్రాల ద్వారా అయితే అధో లోకాలు ప్రాప్తిస్తాయని శాస్త్రవచనం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉత్సర్గ ()
Telugu original

ఉత్సర్గ : వదిలేయటం. సృష్టిచేయటం. Creation. సామాన్య సూత్రమని General rule కూడా ఒక అర్థముంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉత్తర ()
Telugu original

ఉత్తర : దాటిపోవటం. To pass by. To Transcand. ఉత్తరణమని కూడా దీనికే మరొకపేరు. రెండు పదార్థాలలో మేలైన దానికి కూడా ఉత్తరమని పేరు Better between the two.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉత్తీర్ణ ()
Telugu original

ఉత్తీర్ణ : దాటిపోయినవాడని ముఖ్యార్థం. లక్షణార్థంలో సంసార సాగరాన్ని దాటిపోయిన సిద్ధపురుషుడని భావం. తీర్ణుడని కూడా పేర్కొనవచ్చు. 'స్వయం తీర్ణః పరాన్‌తారయతి' అని ఒక న్యాయముంది. తాను తరించి మరొకరిని తరింపచేయాలట. అలాంటి సిద్ధపురుషుడికి తీర్థంకరుడని కూడా పేరు పెట్టారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉత్తమ ()
Telugu original

ఉత్తమ : అన్నింటిని దాటిపోయినది. శ్రేష్ఠమైనది. Supreme. మంద మధ్యమ అధికారుల కంటే పైస్థాయి నందుకొన్న సాధకుడు. Aspirant.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉత్థాన ()
Telugu original

ఉత్థాన : పైకి లేవటం. బయట పడటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉత్థిత ()
Telugu original

ఉత్థిత : అలా పైకి లేచినవాడు The person who has risen above సంసారంలో పడకుండా బయట పడ్డవాడని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉత్పత్తి ()
Telugu original

ఉత్పత్తి : పుట్టుక, జన్మ, సృష్టి, ఉత్పత్తి వినాశాలంటే జనన మరణాలు. చతుర్విధ క్రియలలో మొదటి దశ.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉత్ప్రేక్ష ()
Telugu original

ఉత్ప్రేక్ష : ఊహ. భావన. Imagination. Inference. పరమాత్మ తత్త్వాన్ని సాధనచేసి స్వయంగా దర్శించాలేగాని చేయకుండా కేవలం ఇలాగలాగని ఊహించేది కాదు. ఉత్ప్రేక్షకు అవకాశం లేదక్కడ. తుదకు ప్రపంచ వ్యవహారమే మనమూహించి తెలుసుకునేది కాదు. కనుకనే అనిర్వచనీయ మన్నారు దీన్ని. ఉన్నదున్నట్టు గ్రహించాలంటే ఉత్ప్రేక్షకాదు. ఉపదేశం కావాలి మానవుడికి.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉత్సూత్ర ()
Telugu original

ఉత్సూత్ర : ఒక సూత్రాన్ని అనుసరించక దాని పరిధిని మించి అర్థం చెప్పటం. సూత్రకారుని హృదయాన్ని బట్టి భాష్యకారుడప్పుడప్పుడు సూత్రంలోని శబ్దాలను వదిలేసి శాస్త్రానుసారంగా దాని అర్థాన్ని వివరించి మనకు చెబుతుంటారు. దీనికి ఉత్సూత్ర భాష్యమని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉదయ ()
Telugu original

ఉదయ : ఉదయించటం. పైకి రావటం. To rise. కలగటం. జన్మించటమని కూడా అర్థం చెప్పవచ్చు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉదర ()
Telugu original

ఉదర : కడుపు. కుక్షి అని ముఖ్యార్థం. లోపలి భాగమని లాక్షణికార్థం. ఇవి రెండూగాక ఉత్‌+అర = ఉదర. అరమంటే కొంచెం. ఉత్‌అంటే ఏ కొంచెమో అని అర్థం చెప్పారు ఉపనిషత్తులో. బృహదారణ్యకంలో 'ఉదరమంతరం కురుతే' అని ఒక మాట ఉంది. బ్రహ్మస్వరూపంలో ఉదరం అంటే ఏ కొంచెమైనా అంతరం తేడా చూస్తే అది మనకు భయోత్పాదకమేనట.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉదాన ()
Telugu original

ఉదాన : పంచవాయువులలో నాలుగవది. శరీరంలోనుంచి జీవుణ్ణి అవసానంలో పైకి తీసుకుపోయేది. అంతేగాక బ్రతికివున్న కాలంలో ఎక్కిళ్ళు మొదలైనవి సృష్టించేది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉదాసీన ()
Telugu original

ఉదాసీన : ఊరక ఉండిపోవటం. పైన కూచుని చూస్తూ ఉండటం. Supervision అధ్యక్ష అనే మాటకిది పర్యాయపదం. 'ఉదాసీనవ దాసీనః' అని పరమాత్మను వర్ణిస్తుంది గీత. ఉదాసీనుడిలాగ కూచునేవాడే పరమాత్మ అట. అంటే ఏ పనీచేయక ఏ ఫలమూ అనుభవించక సాక్షిగా ఉన్నవాడని భావం. మానవుడు కూడా తన కర్తృత్వ భోక్తృత్వాలను వదలుకొని ఈశ్వరుడిలాగా ఉదాసీనుడై ఉంటేనే మోక్షం ప్రాప్తిస్తుందని ఇందులో దాగి ఉన్న భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉదాహరణ ()
Telugu original

ఉదాహరణ : ప్రస్తుత విషయం బాగా బోధపడకపోతే దానిని చక్కగా వివరించటానికి తీసుకువచ్చే మరొక విషయం. ఉత్‌ఆ హరణ మరొక చోటునుంచి తేవటమని అక్షరార్థం. దృష్టాంతం Illustration. తార్కాణమని భావం. Example పేర్కొనటమని కూడా ఒక అర్థముంది. Mention. జగదీశ్వరులకున్న సంబంధం రజ్జు సర్పాలకున్న సంబంధం లాంటిదే. ఇలాంటి ఉదాహరణల ద్వారా ఈశ్వరుని సత్యత్వం, ప్రపంచ మిథ్యాత్వం మనకు చక్కగా తెలిసిపోతుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉద్గీథ ()
Telugu original

ఉద్గీథ : గొంతు పైకెత్తి గానం చేయటం. ఉద్గీతే ఉద్గీథ. వైదికమైన ప్రయోగమిది. ఉద్గానం చేయబడినది ఉద్గీతం. ఓంకారానికి ఉద్గీథమని పేరు. దీనికి సంబంధించిన విద్య ఉద్గీథ విద్య. ప్రణవోపాసన అని నామాంతరం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉద్దేశ ()
Telugu original

ఉద్దేశ : నిర్దేశించడం. పేర్కొనడం Mention. ఉద్దేశమూ, లక్షణమూ, పరీక్షా అని న్యాయశాస్త్రంలో న్యాయానికి నిర్వచనం చెప్పారు. ఒక విషయాన్ని ముందు ఉదాహరించి తరువాత దానికి నిర్వచనం చేసి ఆ తర్వాత ఆ నిర్వచనం చెల్లుతుందో లేదోనని నిరూపించవలసి ఉంటుందట. అప్పుడే శాస్త్రానికి పరిపూర్ణత అని నైయాయికుల మాట. ఉద్దేశమంటే అభిప్రాయం Aim అని కూడా అర్థమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉద్దేశ్య ()
Telugu original

ఉద్దేశ్య : ఏది ఉద్దేశిస్తామో అది. The intended. వాక్యంలో ఉద్దేశ్యమని, విధేయమని రెండు భాగాలుంటాయి. బంగారం పచ్చగా ఉంటుందనే వాక్యంలో బంగారమనేది ఉద్దేశ్యం. అంటే దానిని గూర్చి ఏదో మనం చెప్పదలచాము. ఏమిటా చెప్పదలచినది. పచ్చగా ఉండటం. దీనికి విధేయమని పేరు. అంటే ఆ గుణం దానికి విధించి చెబుతున్నాము. వీటినే ఆంగ్లభాషలో Subject అని Predicate అనీ పేర్కొంటారు. మహావాక్యాలకు అర్థం చెప్పటంలో ఈ విభాగం ఎంతో మనకు తోడ్పడుతుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉద్ధార ()
Telugu original

ఉద్ధార : ఒక చోటినుంచి తీసి ప్రక్కన పెట్టడం. పైకెత్తడం. ఆఖరుకు పలకకుండా మౌనం వహించటం కూడా అని అర్థం చెప్పవచ్చు. 'ఉద్ధారః కృతః' అంటే ఒక పుస్తకంలో నుంచి తెచ్చి ఉదాహరించబడినది అని గాని కేవలం మౌనం వహించ బడిందని గాని అర్థం చెప్పవచ్చు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉద్భావన ()
Telugu original

ఉద్భావన : పైకి తేవటం. ఊహించటం To think aloud. To bring out.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉద్భిజ్జ ()
Telugu original

ఉద్భిజ్జ : నేల చీల్చుకుని పైకి వచ్చినది. లతా వృక్ష గుల్మాదులు. నాలుగు భూతరాసులలో ఇది ఒకరాశి. మొదటిది జరాయుజం. రెండవది అండజం. మూడవది స్వేదజం. నాలుగవది ఉద్భిజం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉద్భవ / ఉద్భూత ()
Telugu original

ఉద్భవ/ఉద్భూత : పైకి వచ్చి కనపడేది Formed manifest. జన్మించినది Born. ప్రకటమైనది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉద్యోగ / ఉద్యమ ()
Telugu original

ఉద్యోగ/ఉద్యమ : ప్రయత్నం Effort. పైకి రావటం. To come up. మోక్షమార్గంలో ఉద్యోగమనేది చాలా ప్రధానమైన విషయం. అది లేకుంటే కృషి చేయలేడు. గమ్యం చేరలేడు మానవుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉన్నయ / ఉన్నీత ()
Telugu original

ఉన్నయ/ఉన్నీత : పైకి తెచ్చుకోవటం. ఊహించటం. భావించటం. అలా ఊహించబడ్డ విషయానికి Inferred ఉన్నీతమని పేరు. ముందు శరీరంలో ఒక చైతన్యకళ ఉందని గుర్తించి సాధకుడైనవాడు ఆ తత్త్వాన్నే ప్రపంచమంతటా వ్యాపింప జేసుకుని చూడాలట. ప్రతిచోటా దాగివున్న సత్యాన్ని ఉన్నయం చేయాలి. అంటే పైకి తెచ్చుకొని దర్శించాలి అని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉన్మనస్‌ ()
Telugu original

ఉన్మనస్‌: మనస్సుకు అతీతమైనది. దాటిపోయినది. Beyond mind. ఇది ఒక యోగ భూమిక. అమనస్కమని కూడా అంటారు. వేదాంతులు చెప్పే ఆత్మ చైతన్యమిదే. Supramental consciousness. అది కూడా మనోభూమికకు అతీతమైన తత్వమే. యోగులది వృత్తి రూపమైతే జ్ఞానులది సాక్షిరూపం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపకార ()
Telugu original

ఉపకార : తోడ్పడటం. Help. contribute.లోకమంతా ఉపకార్యోపకారక సంబంధంతోనే జీవిస్తున్నదని బృహదారణ్యకం చాటుతున్నది. మధు బ్రాహ్మణమనే ఘట్టమంతా ఇదే. పరస్పరం తోడ్పడటం మూలాన జీవయాత్ర సాగుతున్నది. సాపేక్షమేగాని Relative నిరపేక్షమైనదేదీ లేదు లోకంలో. నిరపేక్షమైన దొక పరమాత్మ తత్త్వమే. అలాంటి తత్త్వమున్నదని మనకు ఈ సాపేక్ష ప్రపంచమే సూచిస్తున్నదంటారు మహర్షులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపక్రమోప సంహార ()
Telugu original

ఉపక్రమోప సంహార : ఉపక్రమమంటే ఆరంభం. ఉపసంహారమంటే అంతం. Beginning and End. శాస్త్రంలో ఒక విషయాన్ని ఇదమిత్థమని నిరూపణ చేయాలంటే ఆరు విధాలైన ఆధారాలుండాలి మనకు. వీటికే తాత్పర్య లింగమని పేరు. అందులో మొదటిది ఉపక్రమోప సంహారాలు. లింగమంటే ఒక విషయం ఫలానా అర్థమే చెబుతుందనే సూచన. అందులో ఇది ఒకటి. ఉపక్రమంలో ఏది ప్రస్తావిస్తామో అదే ఉపసంహారంలో కూడా కనపడాలి మనకు. లేకుంటే రెండింటికి అందిక పొందిక లేకపోతుంది. రెంటికీ సమన్వయ మున్నప్పుడే ఆ విషయం శాస్త్రజ్ఞుడు ఉద్దేశించి నదేనని నిర్థారణ చేయవచ్చు. తత్త్వమసి మహావాక్యంలో మొదట ప్రపంచమంతా సద్రూపమేనని, జీవరూపంగా ఈశ్వరుడే ప్రవేశించాడని వర్ణించబడింది. ఇది ఉపక్రమం. మరలా చివరకు 'ఐతదాత్మ్య మిదం సర్వం స ఆత్మా' అని వర్ణించబడింది. ఇది ఉపసంహారం. దీన్నిబట్టి జగత్తూ, జీవుడూ ఇద్దరూ ఈశ్వర స్వరూపమే అనే అద్వైత సిద్ధాంతానికి బలమేర్పడున్నది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపకోసల విద్య ()
Telugu original

ఉపకోసల విద్య : ఛాందోగ్యంలో ఎన్నో ఉపాసనలు చెప్పబడ్డాయి. వాటికి విద్యలని పేరు. ఆ విద్యలలో ఇది ఒకటి. దీని వివరణ ఛాందోగ్యంలో చూడవచ్చు. కామలాయనుడనేవాడు జాబాల వద్ద నేర్చుకొన్నదిది. కమ్‌బ్రహ్మ-ఖమ్‌బ్రహ్మ కేవల సుఖం కాదు. కేవల ఆకాశం కాదు. ఆకాశంలాగా అంతటా విస్తరించిన ఆనందమే బ్రహ్మమని భావించాలట.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపగమ ()
Telugu original

ఉపగమ : Approach. అందుకోవటం. చేరటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపచార ()
Telugu original

ఉపచార : లక్షణ Secondary sense. గౌణమని కూడా అంటారు. ముఖ్యార్థం కాకుండా లక్ష్యార్థం చెప్పుకోవటం. అలా చెబితే దానికి ఔపచారికమని పేరు. 'సింహోమాణవకః.' ఈ బ్రహ్మచారి సింహమే అని అన్నప్పుడు అతడు వాస్తవంగా సింహం కాదు. కాని సింహ గుణాలైన పట్టుదల, ప్రతాపమూ ఉన్నవాడని అర్థం చెప్పుకోవచ్చు. ఇదే ఉపచారమంటే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపచయ ()
Telugu original

ఉపచయ : అపచయానికి వ్యతిరేకి. ఎక్కువ. అధికం అని అర్థం. పోగు కావటమని కూడా అర్థమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపజన ()
Telugu original

ఉపజన : రహస్యంగా, ఏకాంతంగా. In privacy.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపదేశ ()
Telugu original

ఉపదేశ : దగ్గరగా కూర్చుని చూపటం. సూచించటం. To Direct or Instruct in solitude. రహస్యంగా ఒక సత్యాన్ని అందజేయడం. బ్రహ్మోపదేశం అంటే బ్రహ్మతత్త్వం చాలా విలువైనది గనుక బాహాటంగా కాక అధికారియైన వాడికి దాని జ్ఞానాన్ని రహస్యంగానే బోధించవలసి ఉంటుంది. ఇక్కడ జ్ఞానమంటే అనుభవం కూడా. కనుక Transmission of secret knowledge రహస్య విజ్ఞానాన్ని శిష్యుని అనుభవానికి తెచ్చే విధానమని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపధాన / ఉపాధి ()
Telugu original

ఉపధాన/ఉపాధి : ఒక దానిలో మరొకదాన్ని ఉంచటం. ఇవి రెండూ వస్తువులే నంటారు లోకులు, మిగతా శాస్త్రజ్ఞులు. బల్లమీద పుస్తకం ఉంచామంటే బల్లా వాస్తవమే. పుస్తకమూ వాస్తవమే. ఇక్కడ బల్ల ఆధారమైతే దానిమీద పెట్టిన పుస్తకం ఉపాధి. కాని అద్వైతులు దీని నంగీకరించరు. వారి మతంలో ఆధారమే వస్తువు. దానిమీద తెచ్చిపెట్టిన ఉపాధి మరొక వస్తువుగాదు. దాని తాలూకు ఆభాసే Form. ఉదాహరణకు జలంమీద తరంగం కనిపిస్తున్నదంటే తరంగం జలానికి వేరుగా స్వతంత్రమైన పదార్థం కాదు. జలమే తరంగంగా భాసిస్తున్నది. కనుక జలంమీద ఉపాధిగా ఆరోపితమైనది జలమేనని చెప్పవలసి ఉంటుంది. జలం ద్రవ్యమైతే Substance తరంగం దాని రూపం Form. రూపం ద్రవ్యానికెప్పుడూ వేరుకాదని వారి సిద్ధాంతం. కనుక ఉపాధి అంటే ఆభాస అని అర్థం చేసుకోవలసి ఉంది. ఉపాధి అనే మాటకు ద్వారమని, Medium ప్రణాళిక అని కూడా అర్థమే. నామరూపాలు చైతన్యానికి ఉపాధులు. దేహేంద్రియాదులు ఆత్మకు ఉపాధులు అని అంటే అర్థం లోపలి చైతన్యం వీటిద్వారా ప్రసరిస్తున్నదని. వస్తువు ప్రసరించే సాధనమే ఉపాధి అనే మాట కర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపనయన ()
Telugu original

ఉపనయన : దగ్గరకు తీసుకుపోవటం. చేర్చటం. గురువు దగ్గరకు వటువును తీసుకెళ్ళి సంస్కారం చేయించటం. దీనికే గురూపసదనమని కూడా పేరు. సంస్కారం పొందితే వాడు ఉపనీతుడౌతాడు. Baptised. Invested with the holy thread. ఇంతేగాక తర్కశాస్త్రంలో పంచావయవ వాక్య ప్రయోగమని ఒకటి ఉంది. అందులో నాలుగవ అవయవానికి ఉపనయమని పేరు. Application. అంటే ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని హేతువు ఉదాహరణతో బలపరిచి మరలా దాని నసలు విషయానికి ముడిపెట్టి చెప్పటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపనిషద్‌ ()
Telugu original

ఉపనిషద్‌: ఉప-దగ్గరగా, నిషద్‌కూర్చోవటం అని అర్థం. అరణ్యాలలో శిష్యులు గురువు దగ్గర కూర్చుని రహస్యంగా బ్రహ్మవిద్య నభ్యసించేవారట. కనుక బ్రహ్మవిద్యకు ఉపనిషద్‌అని పేరు వచ్చింది. రహస్య విజ్ఞానమని కూడా ఒక అర్థం చెప్పారు Secret doctrine భాష్యకారులు. వేదంలో ఇది చివరి భాగం. కనుక వేదాంతమని కూడా దీనికి పేరు వచ్చింది. వేదం కర్మకాండ అయితే వేదాంతం జ్ఞానకాండ.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపన్యాస ()
Telugu original

ఉపన్యాస : ముందు పెట్టటం. To place before. ఉదాహరించటం. ప్రస్తావించటమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపపత్తి ()
Telugu original

ఉపపత్తి : హేతువు Argument. Reason. ఒక విషయం ఇదమిత్థమని నిర్ణయించటానికి తగిన కారణం చూపటం. ఉపపత్తి ఉంటే అది ఉపపన్నమవుతుంది. చెల్లుతుందని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపపద ()
Telugu original

ఉపపద : ఒక పదానికి దగ్గర ఉన్న మరొక పదం. ఈ పదానికి అర్థం నిష్కర్షగా చెప్పాలంటే ఆ పదం తోడ్పాటు ఉండాలి. అలా తోడ్పడే పదం ఉపపదం. బిరుదమని కూడా Title అర్థమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపభోగ ()
Telugu original

ఉపభోగ : కర్మఫలాన్ని అనుభవించటం. అంతేగాక జ్ఞానఫలాన్ని అనుభవించినా అది ఉపభోగమే. మొదటిది సంసారంలోనైతే రెండవది సాయుజ్యంలో.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపబృంహణ ()
Telugu original

ఉపబృంహణ : బలపరచటం. గట్టి చేయటం. ఇతిహాస పురాణాలతో వేదార్థాన్ని బలపరిస్తే దానికి వేదోపబృంహణమని పేరు. అలాగే ఇముడ్చుకోవటమని కూడా ఒక అర్థముంది ఈ శబ్దానికి. బ్రహ్మతత్త్వం అన్నిటికంటే పెద్దదనే గాక అన్నింటిని తనలో బృంహణం అంటే ఇముడ్చుకోగలిగేది గనుక బ్రహ్మమని పేరు వచ్చిందట.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపమర్ద ()
Telugu original

ఉపమర్ద : బాగా నలగగొట్టటమని అర్థం. ఆత్మజ్ఞానంతో కర్మకు ఉపమర్ద మేర్పడుతుందని అద్వైతుల సిద్ధాంతం. అంటే కర్మ నిష్కర్మగా మారిపోతుందని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపమాన ()
Telugu original

ఉపమాన : ప్రస్తుతాంశం బాగా తెలియకపోతే అలాంటిదే మరొక అంశాన్ని తెచ్చి దానితో పోల్చి చెప్పటం. Analogy. అద్వైతులు చెప్పే ప్రమాణాలలో ఇది ఒక ప్రమాణం. 'గో సదృశో గవయః' గవయమంటే ఏమిటో చాలామందికి తెలియక పోవచ్చు. అది గోవులాగే ఉండే ఒక జంతువు. గోవుతో పోల్చి చెబితే అర్థమవుతుంది మనకు. ఇప్పుడీ గోవు ఉపమేయమైతే గవయమనేది దానికి ఉపమానం. తెలిసినది ఉపమేయం. తెలియనిది ఉపమానం. తెలియనిదాన్ని తెలుసుకోవాలంటే తెలిసిన దానితో పోల్చి చెప్పటమే సరియైన మార్గం కనుక ప్రత్యక్షాదుల లాగే ఉపమానం కూడా ఒకగొప్ప ప్రమాణమైంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపయోగ ()
Telugu original

ఉపయోగ : వినియోగం Utility అని అర్థం. వాడటమని కూడా Use అర్థమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపరాగ ()
Telugu original

ఉపరాగ : సూర్యచంద్రులకు పట్టే గ్రహణం. Eclipse. ఒకదాని గుణం మరొకదానికి బాగా పట్టటం కూడా. తాదాత్మ్యం Identity.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపరక్త ()
Telugu original

ఉపరక్త : అలా మమేకం చెందిన పదార్థానికి పేరు Tinged. Coloured. Totally overpowered.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపలక్షణ ()
Telugu original

ఉపలక్షణ : లక్షణమంటే నిర్వచనం. Definition. ఒక భావాన్ని సూచించేది. అందులో ఒకదాన్ని మాత్ర ముదాహరించి మిగతా ఆ జాతివన్నీ అలాగే ఉంటాయని సూచన చేస్తే Indicate అది ఉపలక్షణం. ఒక అప్‌అంటే జలాన్ని చెబితే చాలు. మిగతా నాలుగు భూతాలకూ అది ఉపలక్షణ మవుతుంది Representative. Inclusive.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపలంభ / ఉపలబ్ధి ()
Telugu original

ఉపలంభ/ఉపలబ్ధి : ఒక విషయాన్ని తెలుసుకోవటం. గుర్తించటం. అది మనకు పట్టుబడటం. ఒక విషయం మనకు లభించటం లేదా దొరకటం. Availability. అలా కాకుంటే అనుపలబ్ది Non-availability. Absence.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపశమ ()
Telugu original

ఉపశమ : ఉపశమించటం. తగ్గిపోవటం. విరమించటం. ఆగిపోవటం. ప్రపంచోపశమమని పరమాత్మను వర్ణించింది శాస్త్రం. ప్రపంచమనే భావం ఎక్కడ పూర్తిగా తొలగిపోతుందో అదట పరమాత్మ స్వరూపం. తాపత్రయం జీవుడికి తొలగిపోవటం కూడా ఉపశమమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపసదన / ఉపసత్తి ()
Telugu original

ఉపసదన/ఉపసత్తి : దగ్గరకు వెళ్ళడం Approach. సమీపించటం. ముఖ్యంగా శిష్యుడు గురువుగారిని సమీపించి వారి దర్శనం చేసుకోవటం. దీనినే గురూపసదన మంటారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపసర్జన ()
Telugu original

ఉపసర్జన : ప్రధానమైన అంశంకాక Main దానికి తోడ్పడే అప్రధానమైన అంశం. Subsidiary. Accessary.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపస్కార ()
Telugu original

ఉపస్కార : అసలు విషయానికి ఉపకరించేది. తోడ్పడేది. దానికి అలంకార ప్రాయమైనది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపస్థ ()
Telugu original

ఉపస్థ : గోప్యేంద్రియం. స్త్రీ పురుషులకు ఇద్దరికీ సంబంధించినది. కర్మేంద్రియాలలో ఐదవది. దీని గుణం ఆనందమన్నారు శాస్త్రంలో.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపస్థాన / ఉపస్థిత ()
Telugu original

ఉపస్థాన/ఉపస్థిత : దగ్గరకు వెళ్ళి ఉండటం. సామీప్యం. సన్నిధి Presence. అలాంటి సన్నిహితుడైనవాడు ఉపస్థితుడు Present. ఉపస్థానమంటే ఉపాసన. ఉపస్థితుడంటే ఉపాసకుడు అని కూడా అర్థమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపహిత ()
Telugu original

ఉపహిత : ఒక ఉపాధిలో Medium చేరి ఆ మేరకే ఆగిపోయినది. పరిమితమైనది. మనస్సులో చేరి అక్కడికే పరిమితమైన జీవచైతన్యం. దీనికి ఉపహిత చైతన్యమని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపాధి ()
Telugu original

ఉపాధి : ఆవరించినది. కప్పివేసినది. నామరూపాలు చైతన్యాన్ని కప్పి తగ్గించి చూపుతున్నాయి. చైతన్యం వాటిద్వారా ప్రసరిస్తుంటుంది. ఈ ఆవరణమూ ద్వారమే ఉపాధి. శరీరాదులిలాంటివే. వస్తువు కాభాస ఉపాధి. అదే దాన్ని కప్పుతుంది. అదే దాన్ని విప్పిచూపుతుంది. కప్పితే ఆవరణం. విప్పితే ద్వారం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపాయ ()
Telugu original

ఉపాయ : కలవటం. కలిపేది. మార్గం. సాధనం. Helper. Means. దీనికి భిన్నమైనది అపాయం. విడిపోవడమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపేయ ()
Telugu original

ఉపేయ : ఉపాయం సాధనమైతే ఉపేయం గమ్యం. End. చేర్చేది ఉపాయమైతే చేరేది ఉపేయం. జ్ఞానముపాయం. జ్ఞేయమైన బ్రహ్మతత్త్త్వం ఉపేయం సాధకుడికి.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపాంగ ()
Telugu original

ఉపాంగ : అంగమంటే ప్రధానమైన అంగికి తోడ్పడేది. దానికి మరలా తోడ్పడేది ఉపాంగం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉచ్ఛూన ()
Telugu original

ఉచ్ఛూన : పైకి ఉబ్బినది. ఈ ప్రపంచమంతా శివతత్త్వం నుంచి ఇలా పైకి ఉబ్బి కనిపిస్తున్న పదార్థమే. దీనిని మరలా శివస్వరూపంగా భావించాలి మనం. అప్పుడిది చదునై శివాత్మకంగా మారుతుంది. అదే శివసాయుజ్య మంటారు శివాద్వైతులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉన్మజ్జన ()
Telugu original

ఉన్మజ్జన : శివతత్త్వం దేహంలో ప్రవేశించి ఇక్కడ నిమజ్జన Merge మయి కూచుంది. మరలా దీన్ని శివభావనతో చూస్తే సంసార సాగరంలో నుంచి మరల ఉన్మజ్జన Emerge మయి శివాత్మకంగా మారగలడీ జీవుడని తాంత్రికుల సిద్ధాంతం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపాంశు ()
Telugu original

ఉపాంశు : బిగ్గరగా కాకుండా పక్కవాడికి మాత్రమే తెలిసేలాగా ఉచ్చరించటం. రహస్యంగా ఒకరికొకరు మాటాడుకోవటం. Between two only. The preceptor and the disciple. నాలుగు విధాలైన యజ్ఞాలలో జపయజ్ఞం తరువాతిది ఉపాంశు యజ్ఞం. మంత్రోపదేశాలన్నీ ఇలాంటి విధానంలోనే జరుగుతుంటాయి.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపాదాన ()
Telugu original

ఉపాదాన : దగ్గరకు తీసుకోవటం. దీనికి వ్యతిరేకి అపాదానం. మూడు విధాలైన కారణాలలో ఇది ఒక కారణం. Cause. ప్రకృతి అని కూడా పేర్కొంటారు దీన్ని అద్వైతులు Material cause. ఒక కార్యం ఏ మూలపదార్థం నుంచి ఏర్పడుతుందో అది. కుండ అనే కార్యం మట్టిలోనుంచి వస్తున్నది. మట్టి కుండకు ఉపాదానం. అద్వైతుల దృష్టిలో కార్యం దాని ఉపాదానం కంటే వేరుకాదు. మట్టే కుండగా రూపుదిద్దుకొని కనిపిస్తున్నది. నుక ఉపాదానమూ దాని ఉపాదేయమూ రెండూ అభిన్నమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపాసన ()
Telugu original

ఉపాసన : ఉప దగ్గరగా, ఆసన కూచోటం. ఏ దేవతను మనసా స్మరిస్తామో దాని మూర్తికి మనసు దగ్గర పడితే దాని కుపాసన అని పేరు. Meditation or worship. ఇది సగుణం, నిర్గుణమని రెండు విధాలు. మొదటిది ధ్యానమార్గమైతే రెండవది జ్ఞానమార్గం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపేక్షా ()
Telugu original

ఉపేక్షా : అపేక్షకు వ్యతిరేకి. అక్కరలేదని ఉదాసీనంగా చూడటం. తీసుకుంటే ఉపాదానం. వదిలేస్తే హానం. రెండూ కాని మధ్య స్థితి ఉపేక్ష. హానోపాదానాదులు Selection and Rejection రెండూ లేని ఉదాసీనత. ఇదే అద్వైత సాధనలో చేయవలసిన గొప్ప కృషి.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉపోద్బలక / ఉర్వారుక మివ ()
Telugu original

ఉపోద్బలక : ఒకదాన్ని సహేతుకంగా నిలబెట్టడానికి ఇంకా అవీ ఇవీ చెప్పి బాగా బలపరచటం. To strengthen. దోహదం చేయటం. To support. ఉర్వారుక మివ : దోసకాయ పండిపోతే దాని తొడిమ దానిపాటికదే ఊడిపోతుంది. ఉర్వారుకమంటే దోసపండని అర్థం. దోసపండు తొడిమలాగే జీవన్ముక్తుడి శరీరం కూడా వాడి స్వరూపం నుంచి పక్కకు తొలగిపోతుంది. ప్రారబ్ధం కొద్దీ అంటి పట్టుకున్నా వాడి దృష్టిలో దేహాత్మాభిమానం లేదు గనుక తొలగిపోయినట్టే భావిస్తాడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉల్లేఖన / ఉల్లింగన ()
Telugu original

ఉల్లేఖన/ఉల్లింగన : ఫలానా అని గుర్తించటం, ఉదాహరించటం, ఎత్తిచూపటం, వాగ్రూపంగానే కాక మనసా భావించటం. అనుభవానికి తెచ్చుకోవటం. చేసిన సిద్ధాంతాన్ని తన కన్వయించుకోవటం. తాంత్రికుల భాషలో దీనికి ఉల్లేఖనమనే గాక ఉదాహరణమని కూడా పేరున్నది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఊహ ()
Telugu original

ఊహ : ఊహించటం. Imagination. Inference. తర్కంలో ఒక నిమిత్తాన్ని బట్టి నైమిత్తికాన్ని అర్థం చేసుకోవటం. Determining the fact with the help of some token or symbol.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఊర్జస్‌ ()
Telugu original

ఊర్జస్‌: బలం. వీర్యం. Strength. ఆహారమూ దానివల్ల కలిగే సామర్థ్యమూ రెండింటికీ వర్తిస్తుంది ఇది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఊర్ణనాభి ()
Telugu original

ఊర్ణనాభి : తంతుకీటమని, సాలెపురుగని అర్థం. అది తన నోటిలోని లాలాజలాన్నే ఒక దారంగా పేని దాని ఆధారంతోనే క్రిందికి దిగి వస్తుంది. మరలా దాన్ని లోపలికి తీసుకుంటూ పైకి వెళ్లి పోతుంది. అలాగే పరమాత్మ తనలోని నామరూపాల బలంతోనే ప్రపంచాన్ని సృష్టిస్తూ క్రిందికి దిగివచ్చాడు. మరల దీన్ని తనలోకే చేర్చుకుంటూ అద్వితీయంగా నిలిచి పోతాడని అద్వైతులు వర్ణించే ఉపమానమిది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఊర్ధ్వమూల ()
Telugu original

ఊర్ధ్వమూల : ఊర్ధ్వమూల మధశ్శాఖమని గీతా శ్లోకం. సంసారమనే అశ్వత్థ వృక్షానికి మూలం ఊర్థ్వదిశగా ఉందట. అది ఏదోగాదు మాయాశక్తితో కూడిన పరమాత్మ చైతన్యమేనని భాష్యం చెప్పారు భగవత్పాదులు. కనుక అసంగ శస్త్రంతో దీనిని ఛేదించి సాధకుడు ఊర్ధ్వముఖంగా ప్రయాణంచేసి ఆ తత్వాన్నే చేరవలసి ఉంటుంది అని దీని ఆంతర్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఊర్ధ్వోచ్ఛ్వాస ()
Telugu original

ఊర్ధ్వోచ్ఛ్వాస : ఎగశ్వాస అని అర్థం. ఉదానవాయువు ఆగకుండా అవసాన కాలంలో పైపైకి వెళుతూ చివరకు శరీరాన్ని వదిలేసి పోతుంది. దీనికే వాడుకలో ఎగశ్వాస అని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఊర్ధ్వగతి ()
Telugu original

ఊర్ధ్వగతి : అథోగతికి వ్యతిరిక్తం. సత్కర్మలు, ఉపాసనలు ఆచరించినవారు పితృయానం, దేవయానం చేసి పరలోకాలకు వెళ్ళే మార్గం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఊర్ధ్వలోక ()
Telugu original

ఊర్ధ్వలోక : కర్మిష్ఠులు, ఉపాసకులు అంతకంతకూ ఉత్తమ లోకాలు చేరి అక్కడ ఉత్తమ భోగాలు అనుభవిస్తారు. అలాంటి లోకాలకు ఊర్ధ్వలోకాలు అని పేరు. స్వర్గాదులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఊర్మి ()
Telugu original

ఊర్మి : అల. తరంగం. షడూర్ములని వేదాంతుల పరిభాష ఒకటి ఉంది. తరంగాలలాగా వస్తూ పోతూ ఉండేవి అని అర్థం. అవి ఆరు. అందులో జరామరణాలు రెండు స్థూలదేహానికి చెందినవి. క్షుత్పిపాసలు రెండూ సూక్ష్మదేహానికి పోతే మోహశోకాలు రెండూ కారణ దేహానికి సంబంధించిన దోషాలు. ఇవే షడూర్ములు. వీటిని నిశ్చలమైన సాగరంలాంటి మన చైతన్య సాగరంలో అదిమి వేయగలిగితే అంతా ఆత్మాకారంగా అనుభవానికి రాగలదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఉక్తి / ఉక్త ()
Telugu original

ఉక్తి / ఉక్త : ఉక్తి అంటే చెప్పటం. మాటాడటం. ఉక్తమంటే చెప్పబడిన విషయం. అది మంచి మాట అయితే సూక్తి. లేదా సూక్తం. Wellsaid statement. Great utterance.కాకపోతే దురుక్తం Ill పనికిరాని మాట. 'ఉక్తానుక్త దురుక్త చింతనం వార్తికం' అని వార్తికానికి నిర్వచనం చేశారు పెద్దలు. అక్కడ దురుక్త మంటే చెడ్డమాట అని కాదు అర్థం. కొరతపెట్టి చెప్పినమాట అని.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఋషి ()
Telugu original

ఋషి : ఋ అంటే దర్శించటమని కదా చెప్పాం. అలా దర్శించగలవాడే ఋషి. ద్రష్ట. Seer. దర్శించటమంటే కళ్లతోనని కాదు మనోనేత్రంతో. మనస్సనేది దైవమైన చక్షుస్సు అని పేర్కొన్నది ఉపనిషత్తు. సన్నిహితమైనవే కాక దూరమూ పరోక్షమూ విప్రకృష్టమూ అయిన సృష్టి రహస్యాలను కూడా ఆకళించుకోవటమే ఇక్కడ దర్శనం. Transandental vision. కనుకనే 'క్రాంత దర్శీ ఋషిః' దేశకాల వస్తువులనన్నింటినీ అతిక్రమించి చూడగలవాడే ఋషి అని ఋషి శబ్దానికి లక్షణం చెప్పారు శాస్త్రజ్ఞులు. అలాంటి మహర్షుల మాటలే శబ్ద ప్రమాణమైన వేదంగా అవతరించింది లోకంలో. నుక అది అన్నింటికన్నా ప్రబలమైన ప్రమాణం మనకని అద్వైతుల సిద్ధాంతం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఋద్ధి ()
Telugu original

ఋద్ధి : అధికము. పరిపూర్ణము. పుష్కలమని Abundance అర్థం. దీనికి సమ్‌అనే ఉపసర్గ Prefix ముందు చేరితే సమృద్ధి అని రూపమేర్పడుతుంది. దానికీ ఇదే అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఋణ ()
Telugu original

ఋణ : ఒక వ్యక్తికి మరొక వ్యక్తి బాకీ పడటం. Debt. అప్పు. శాస్త్రంలో ఇది మూడు విధాలు. పితౄణం. ఋషి ఋణం. దైవ ఋణం. దీనినే ఋణత్రయమని వర్ణిస్తారు. పుత్రులను కని మొదటిది, వేదాధ్యయనంతో రెండవది, యజ్ఞయాగాదులతో మూడవది తీర్చుకోవాలని అంటారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఋతంభరా ()
Telugu original

ఋతంభరా : ఋతమంటే తాను చూసిన సత్యం. మహర్షులు సమాధిలో దర్శించిన సత్యమని అర్థం. అప్పుడు వారి మనస్సంతా దానితోనే నిండి ఉంటుంది. ఋతాన్ని భరించిన ప్రజ్ఞ గనుక దానికి ఋతంభరా ప్రజ్ఞ అని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఋజు ()
Telugu original

ఋజు : సరిగా. చక్కగా. Straight. right. అలాంటి భావానికి ఋజుత్వం లేదా ఆర్జవం అని పేరు. righteousness. నిజాయితీ. దైవగుణాలలో ఇలాంటి ఆర్జవం ఉండి తీరాలి.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఏకాత్మ ()
Telugu original

ఏకాత్మ : ఆత్మానాత్మలు రెండూ కలిసి ఒకే ఒక ఆత్మ స్వరూపమైతే అది ఏకాత్మ. The subjective unity. ఆ మాటకు వస్తే జీవేశ్వరులు ఇద్దరూ చైతన్యస్వరూపులే. కనుక అనేకం కాదు. రెండూ కలిసి ఏకాత్మే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఏకాత్మభావ ()
Telugu original

ఏకాత్మభావ : జీవజగదీశ్వరులు అనే త్రిపుటి సంపుటీకృతమై అంతా ఒకే ఒక చైతన్య స్వరూపంగా అనుభవానికి వస్తే అది ఏకాత్మభావం. నేను తప్ప మరేదీ నాకు భిన్నంగా లేదనే అనుభవం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఏకాంత ()
Telugu original

ఏకాంత : నిర్జన ప్రదేశం. వివిక్తమైన చోటు. అంతేగాక ఒకే ఒక రూపంతో ఎప్పుడూ ఒకేవిధంగా ఉండటం అని కూడా అర్థమే. Uniform. Consistent.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఏకధా ()
Telugu original

ఏకధా : ఒకే విధంగా. 'ఏకధా బహుధా చైవ దృశ్యతే జలచంద్రవత్‌.' పరమాత్మ స్వరూపతః ఒకటిగానే ఉన్నప్పటికీ విభూతితః బహుధా అంటే అనేక విధాలుగా జలంలో చంద్రబింబం ఎలా భాసిస్తుందో అలా భాసిస్తుంటాడని శాస్త్రం చెబుతున్నది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఏకదేశ ()
Telugu original

ఏకదేశ : ఒక విషయంలో రెండు మూడు పక్షాలు వస్తే అందులో ఒక్కొక్క పక్షానికి ఏకదేశం A part. Aspect అని పేరు. యోగసిద్ధాంతాన్ని అద్వైతులు ఏకదేశంలో సమ్మతిస్తారు. ఏకదేశంలో సమ్మతించరు. అంటే కొన్ని విషయాలు కావలసినవీ. కొన్ని అక్కరలేనివనీ భావం. ఇలాంటి సందర్భంలోనే ఈ శబ్దాన్ని ప్రయోగిస్తారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఏకైక ()
Telugu original

ఏకైక : ఏక+ఏక. ఒకే ఒకటి. రెండవది లేదని అర్థం. బ్రహ్మతత్త్వం అలాంటిదే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఏకీయమతం ()
Telugu original

ఏకీయమతం : ఒక విషయం చర్చకు వస్తే అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెబుతూ పోతారు. ఎవరి అభిప్రాయం వారిది. కొంతమంది ఇలా చెబుతారు అనేటపుడు దానిని ఏకీయమతం అని వ్యవహరిస్తారు. ఏకే అని ప్రారంభిస్తారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఏకస్థ ()
Telugu original

ఏకస్థ : ఒకే ఒక చోట కనిపించటం. ప్రపంచమంతా విశ్వరూపంలో ఒకే ఒక విశ్వేశ్వరుడి మూర్తిలో గోచరించింది అర్జునుడికి. 'ఇహై కస్థం జగత్‌కృత్స్నమ్‌' అని కృష్ణపరమాత్మే తనలో సమస్తమూ ఉంది చూడమని చెబుతాడు అర్జునుడికి.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఏజన ()
Telugu original

ఏజన : కదలటం. చలించటం. స్థానం తప్పటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఏజతి ()
Telugu original

ఏజతి : కదులుతున్నది. 'తదేజతి తన్నైజతి' అని ఉపనిషత్తు. కదిలేదీ పరమాత్మే కదలకుండా నిలిచి ఉన్నదీ పరమాత్మే. రెండు విరుద్ధభావాలూ పరతత్వంలోనే సమన్వయమవుతాయి.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఏవం ()
Telugu original

ఏవం : ఈ ప్రకారంగా In this way.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఏవ ()
Telugu original

ఏవ : అవధారణార్థంలో వస్తుందీ మాట. అదే మరేదీ కాదు అని అర్థం. ఏకమేవ అద్వితీయం అన్నప్పుడు ఆత్మ ఒక్కటే మరేదీ లేదని అర్థం చేసుకోవలసిఉంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఏకవాక్యతా ()
Telugu original

ఏకవాక్యతా

Vedānta Paribhāṣā Vivaraṇa
ఏకాగ్ర ()
Telugu original

ఏకాగ్ర : ఒకే అగ్రం మీద లేదా లక్ష్యంమీద మనస్సు పెట్టడం. చెదరని దృష్టి Concentration. ధ్యానంలో మనసు ఇలా ఏకాగ్రమై ఉండాలి. అప్పుడే ఫలసిద్ధి.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఏకరూప ()
Telugu original

ఏకరూప : ఒకేరూపం. రూపం మారకుండా ఒకే విధంగా ఉండటం. మార్పు లేని లక్షణం. Persistent.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఏషణా ()
Telugu original

ఏషణా : ఈషణ అని కూడా దీనికి ఒక రూపాంతరం ఉంది. కోరటమని ఒక దానికోసం ఏకరటం లేదా ప్రాకులాడటమని అర్థం. Eager to possess. ఇది మూడు విధాలు. దారేషణ - కళత్రం కోసం ప్రాకులాట. పుత్రేషణ - బిడ్డ పాపలకోసం తాపత్రయం. విత్తైషణ - వారిద్దరినీ పోషించే ధన సంపాదన కోసం ప్రాకులాట. ఏషణాత్రాయ మంటే ఇదే. ఇదే సంసారమంతా.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఏకసూత్రతా ()
Telugu original

ఏకసూత్రతా : ఒకే ఒక సూత్రాన్ని కొనా మొదలు పట్టుకొని దానిమీదనే విషయాన్ని నడుపుతూ పోవటం. ముందు వెనుకలకు తేడా రాకుండా ఒకే విధంగా విషయం సాగిపోతే దానికి ఏకసూత్రత అని పేరు. ఏక వాక్యత అనే మాట దీనికి పర్యాయమే. Consistency.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఏక ()
Telugu original

ఏక : సంఖ్యానంలో Enumeration ఇది మొదటి సంఖ్య. ఒకటి అని అర్థం. అద్వితీయమని కూడా. ఏకోనారాయణ. అంటే మరొకరు లేరని. రెండవది లేదని అర్థం. Only. Alone. ఒకదానితో ఒకటి కలిసి పోవటానికి కూడా ఏకమనే పేరు Union. Merger.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఐకాత్మ్య ()
Telugu original

ఐకాత్మ్య : ఏకాత్మ భావం. ఒకే ఒక ఆత్మ లేదా స్వరూపం. విజాతీయ గంధం కూడా లేక అంతా సజాతీయంగా ఏకమైన వస్తుస్వరూపం. జీవేశ్వరులకున్న అవినాభావ సంబంధం. రెండూ రెండు ఆత్మలు కావు. రెండూ కలిసి ఒకే ఆత్మ అని సిద్ధాంతం. అద్వైతుల సిద్ధాంతమిదే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఐక్య ()
Telugu original

ఐక్య : ఏకం యొక్క భావం. ఏకమై పోవటం. Merger. జీవబ్రహ్మైక్యం ఇలాంటిదే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఐతదాత్మ్య ()
Telugu original

ఐతదాత్మ్య : ఏతదాత్మ భావం. ఇదే ఆత్మ తన స్వరూపమనే భావం. 'ఐతదాత్మ్య మిదగ్‌ం సర్వం.' ఆ సచ్చిద్రూపమైన తత్త్వమే ఈ ప్రపంచానికంతా స్వరూపం. దీనికంటూ వేరుగా ఒక స్వతంత్ర రూపం లేదని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఐతిహ్య ()
Telugu original

ఐతిహ్య : ఇతిహాసం. ఇతివృత్తం. కరిరీశిళిజీగి. History. Tradition. ఇది ఇలాగ ఇంతకు ముందు జరిగిందని చెప్పే మాట. కథ. చరిత్ర. వృత్తాంతం. జరిగిన సందర్భమని Past events భావం. ఇది కూడా కొందరు శాస్త్రజ్ఞులు ఒక ప్రమాణంగా స్వీకరిస్తారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఐదంపర్య ()
Telugu original

ఐదంపర్య : ఇదం పర భావం. దీనికి చెందినదనే అర్థం Belonging to this.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఐశ్వర్య ()
Telugu original

ఐశ్వర్య : ఈశ్వర భావం. ఈశ్వరత్వం. Mastery. Commanding Nature. అన్నింటినీ లొంగ దీసుకోవడం. ఆధిపత్యం. భగవంతుని షడ్గుణాలలో రెండవది. జ్ఞానం మొదటిది. ఇది దాని తరువాతది. ఈ రెండే చాలు. మిగతా రెండూ కలిసి వస్తాయి. ఇందులో జ్ఞానం Planning ప్రణాళిక. అన్నిటినీ గ్రహించే శక్తి ఐశ్వర్యం Execution అమలుపరచడం. గ్రహించిన ప్రతి ఒక్కటీ అమలుపరిచే శక్తి. ఒకటి జ్ఞానశక్తి. మరొకటి క్రియాశక్తి Omni science and omni potence.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఐంద్రజాలిక ()
Telugu original

ఐంద్రజాలిక : ఇంద్రజాల విద్య ప్రదర్శించేవాడు, గారడీ వాడు Magician, Occultist, ఆకాశంలో గంధర్వ నగరాన్ని సృష్టిస్తాడు వాడు. అది వాస్తవం కాదు. కల్పన. మాయామయం. అలాంటిదే మన జీవితం. ప్రపంచం. ఇది ఒక పెద్ద ఇంద్రజాలమే. దీని కైంద్రజాలి కూడా పరమాత్మే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఐహిక ()
Telugu original

ఐహిక : ఇహానికి చెందినది. ఇహమంటే ఈ కనిపించే లోకం. దీనివల్ల కలిగే సుఖదుఃఖానుభవాలన్నీ ఐహికం. దీనికి భిన్నమైనది ఆముష్మికం. అంటే Other world పరలోకమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఐకరూప్య ()
Telugu original

ఐకరూప్య : ఏకరూపమనే దాని భావం Uniformity.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఐతరేయ ()
Telugu original

ఐతరేయ : ఇతరానికి సంబంధించినది అని అక్షరార్థం. ఉపనిషత్తులలో ఇది ఒకటి. యాజ్ఞవల్క్యుడు క్రక్కితే తిత్తిరి పక్షుల రూపంలో శిష్యులు బయటపెట్టినది తైత్తిరీయం. దానికి ఇతరంగా సూర్యోపాసన చేసి మరలా యాజ్ఞవల్క్యుడు సాధించినది ఐతరేయం. ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం ఇందులోనే కనిపిస్తుంది మనకు. ఋగ్వేదానికి సంబంధించిన ఉపనిషత్తు ఇది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఐకమత్య ()
Telugu original

ఐకమత్య : ఏకమతం తాలూకు భావం. ఒకే మతం అంటే ఆలోచన కలిగి ఉండటం. Agreement among many minds.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఓతప్రోత ()
Telugu original

ఓతప్రోత : పడుగు పేకలని అర్థం. అలాగే ఒకదానితో ఒకటి పెనవేసుకుని అల్లుకుపోతే దానికి పేరు. దేహంతో జీవచైతన్యం అలాగే ఓతప్రోతమై కూచుంది. కనుక దీనిని మరలా ఆత్మజ్ఞానంతో విభజించి రెండూ కలిపి ఏకాత్మ తత్త్వంగా గుర్తించటమే మానవుడు చేయవలసిన యత్నం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఓకస్‌ ()
Telugu original

ఓకస్‌: స్థానమని అర్థం. Abode. దివౌకస అంటే దేవతలు. దేవలోకమే ఓకస్సుగా కలవారని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఓకోవిద ()
Telugu original

ఓకోవిద : అసలైన స్థానమేదో గుర్తించినవాడు. మర్మజ్ఞుడు. ఓకోవిద అనే మాటలోనే ఓ అనే అక్షరం లోపించి కోవిద అనే రూపమేర్పడింది. రెండింటికీ అర్థమొకటే. అర్థంలో మార్పులేదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఔచిత్య ()
Telugu original

ఔచిత్య : ఉచితం తాలూకు భావం. Property యుక్తియుక్తంగా ఉండడం. సందర్భోచితమైన వ్యవహారం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఔత్పత్తిక ()
Telugu original

ఔత్పత్తిక : ఉత్పత్తి కలిగినది. తయారైనది. సహజం కానిది. Created.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఔపచారిక ()
Telugu original

ఔపచారిక : ఉపచారంవల్ల గ్రహించేది. ఉపచారమంటే గౌణార్థం. ondary Sence లక్షణ. లాక్షణికంగా ప్రయోగించిన విషయానికి ఔపచారికమని పేరు. 'సింహోదేవదత్తః' దేవదత్తుడు సింహమే. సింహగుణాలు కలగినవాడని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఔపనిషద ()
Telugu original

ఔపనిషద : ఉపనిషత్తులకు సంబంధించినది. 'ఔపనిషదః పురుషః' ఉపనిషత్తులలో చెప్పిన పురుషుడు. అంటే పూర్ణ స్వరూపమైన ఆత్మ చైతన్యం అని అర్థం. అది ఉపనిషత్‌ప్రమాణం వల్లనే గ్రహించాలిగాని, వేదంలోని పూర్వభాగమైన కర్మకాండ ద్వారా కాదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఔపదేశిక ()
Telugu original

ఔపదేశిక : ఉపదేశమంటే Intuition తమ అనుభవాన్ని ఇతరుల కందివ్వటం. దానికి సంబంధించిన జ్ఞానం ఔపదేశికం. Secret knowledge. బ్రహ్మానుభవానికి కేవలం ప్రవచనం చేస్తే సరిపోదు. ప్రవచన అనంతరం ఉపదేశించాలి సద్గురువైన వాడు. అప్పుడే జ్ఞానానికి పరిపూర్ణత. పూర్ణానుభవం అదే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఔపాధిక ()
Telugu original

ఔపాధిక : ఉపాధివల్ల ఏర్పడినది. నైమిత్తికమని కూడా పేర్కొంటారు. సహజం కానిది. ఒక విశేషం ద్వారా సంక్రమించినది. Accidental నిమిత్తముంటే ఉంటుంది. లేకుంటే తొలగిపోతుంది. కనుకనే ఇది నిత్యం కాదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఔత్సర్గిక ()
Telugu original

ఔత్సర్గిక : ఉత్సర్గమంటే సామాన్య సూత్రం. General rule. దానికి చెందినది ఔత్సర్గికం. ఉత్సర్గమంటే సృష్టికి కూడా వాచకమే. దానికి చెందినది లేదా సృష్టియైనది అని కూడా అర్థం చెప్పవచ్చు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఔదాసీన్య ()
Telugu original

ఔదాసీన్య : ఉదాసీన భావం. ఎటూ మొగ్గు చూపకుండా మధ్యస్థంగా ఉండి పోవటం. ఉపేక్ష.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఔర్ధ్వదైహిక ()
Telugu original

ఔర్ధ్వదైహిక : 'దేహపాతాత్‌ఊర్ధ్వం యత్‌క్రియతే కర్మ.' దేహపాతమైన తరువాత ఆచరించే క్రియాకలాపం obsequies. అంత్యక్రియలు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఓంకార ()
Telugu original

ఓంకార : సోహం అనే మాటలో సకార హకారాలు లోపిస్తే అవి ఓం అయిందంటారు. సః అహం సోహం. వాడే నేను అంటే ఆ ఈశ్వరుడే నేను. నాకూ వాడికీ తేడా లేదని భావం. ఇది అనుభవానికి తెచ్చుకోవటానికి దీన్ని మూడు వర్ణాలుగా విభజించారు. అ+ఉ+మ. అ అనేది జాగ్రదవస్థకూ అందులో ఉన్న విశ్వుడనే జీవుడికీ సంకేతం. ఉ అనేది స్వప్నానికీ తైజసుడికీ సంకేతం. మ అనేది సుషుప్తికీ అందులోని ప్రాజ్ఞుడికీ సంకేతం. సంకేతాన్ని ఉచ్ఛరించేటపుడీ అవస్థాత్రయాన్ని అందులో బందీ అయిన జీవుణ్ణి భావనచేసి కడపట మకారమనే నాదమెక్కడ ఆగిపోతుందో దాన్ని తురీయావస్థగా గుర్తించగలిగితే అప్పుడీ జీవభావమంతా ఎగిరిపోయి జీవుడీశ్వరుడే అనే ఏకాత్మ భావం అనుభవానికి రాగలదు. కనుకనే 'ఓమిత్యేకాక్షరం బ్రహ్మవ్యాహరన్‌మా మనుస్మరన్‌' అని గీత బోధించింది. ఓం అనేది దానికి కేవలమొక ఆలంబనం లేదా ప్రతీక symbol.

Vedānta Paribhāṣā Vivaraṇa
కఠ ()
Telugu original

కఠ : కృష్ణయజుర్వేదంలో ఒక శాఖ. కఠోపనిషత్తు ఈ శాఖకు చెందినదే. కఠవల్లి అని కూడా పేరు దానికి. యముడికి, నచికేతుడికీ జరిగిన సంవాదం. మృత్యు విషయమంతా దీనిలో చక్కగా చర్చించబడింది.

Vedānta Paribhāṣā Vivaraṇa
కంఠోక్త ()
Telugu original

కంఠోక్త : ఎవరో చెబితే విని చెప్పినది గాక తనపాటికి తాను తన నోటితో పలికిన మాట. స్వయంగా బుద్ధిపూర్వకంగా చెప్పినది బహిర్గతం చేసినది కనుక దీనికి ప్రామాణ్యం వేరుగా వెతకనక్కరలేదు అని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
కణ ()
Telugu original

కణ : కణము, అణువు Atom. అల్పం, లేశం అని కూడా అర్థమే. Smallest Particle.

Vedānta Paribhāṣā Vivaraṇa
కణాద ()
Telugu original

కణాద : షడ్దర్శన కారులలో ఒకడు. అతడు ప్రతిపాదించిన సిద్ధాంతం వైశేషికం. పంచభూతాల తాలూకు మొట్టమొదటి రూపం విశేషం. అంటే వాటివాటికి ప్రత్యేకించి ఉన్న గుణం. ఆ విశేషాలే ద్వ్యణుకాది క్రమంలో స్థూలంగా మారి పృథివ్యాది భూతాలేర్పడ్డాయంటారు. విశేషాలకే పరమాణువులని పేరు. కనుకనే ఈ దర్శనానికి వైశేషికమని, పరమాణు సిద్ధాంతమని, అణువాదమని పేరు వచ్చింది. ఇది స్థాపించిన వాడు కణాదుడు. కణములంటే అణువులు. అద అంటే భక్షించేవాడు. కణాలే సృష్టికి మూలకారణమని, దానినే నెమరు వేసుకునే వాడని పరిహాసం చేస్తూ ఇతరులు ఆయనకు పెట్టిన మారు పేరిది. ఇతని వైశేషికానికి జతగా ఏర్పడింది గౌతముని న్యాయ దర్శనం. రెండూ కలిపి తర్కశాస్త్రం. Indian logic అని పేర్కొంటారు భగవత్పాదుల లాంటి శాస్త్రజ్ఞులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
కపిల ()
Telugu original

కపిల : కపిల మహర్షి. భాగవతంలో వచ్చే కపిలుడు కాడు. ఆయన విష్ణ్వంశ సంభూతుడు. సగర పుత్రులను దహించిన వాడు. దేవభూతికి యోగ ముపదేశించిన కర్దముని పుత్రుడు కూడా కాడు. మరెవడు? సాంఖ్యదర్శనకారుడు. మహాభూతాల దగ్గరినుంచి శబ్ద స్పర్శాదుల వరకు తత్త్వాలు ఇరవైనాలుగేనని లెక్కపెట్టి చెప్పాడు. ఇరవై ఐదవవాడు పురుషుడని కూడా పేర్కొంటాడీయన. ఇలా పంచ వింశతి తత్వాల సంఖ్య నిర్ణయించి చెప్పాడు కనుక సాంఖ్యమని అతని సిద్ధాంతానికి పేరు వచ్చింది. దీనికి నిరీశ్వర సాంఖ్యమని కూడా పేరు. కపిలుడు ఈశ్వరుణ్ణి అంగీకరించడు. ప్రధానం లేదా ప్రకృతివల్లనే Premordial matter ప్రపంచమంతా పరిణమించింది, అదే కర్త అని వాదిస్తాడు. కనుక దీనికి ప్రధాన కారణవాదమని, పరిణామవాదమని కూడా Theory of Evolution నామాంతరం. నిరీశ్వరుడైన కపిలుడు సత్కార్యవాది. కణాదుడిలాగా అసత్కార్య వాది కాడు. అంటే కార్యమేర్పడక పూర్వముందని చెబుతాడేగాని లేదని చెప్పడు. కారణంలో అవ్యక్తమై ఉంటుంది దాని కార్యం. అదే తరువాత పరిణమించి కార్యమవుతుందని ఇతని ప్రతిపాదన.

Vedānta Paribhāṣā Vivaraṇa
కర్తా/కరణ/కర్మ/క్రియా ()
Telugu original

కర్తా/కరణ/కర్మ/క్రియా : కర్త అంటే ఒక పని చేసేవాడు. జీవుడు. కరణమంటే వాడా పని చేయటానికి తోడ్పడే సాధనం. Instrument. లేదా పనిముట్టు. కర్మ. దాని ద్వారా వాడు చేసే పని. అదే క్రియ అన్నా అర్థం. The agent. The implement. The work. దానివల్ల ఏర్పడే ఫలితాన్ని అనుభవించేవాడు మరలా ఈ కర్తే కనుక జీవుడికి కర్త భోక్త అని పేరు వచ్చింది. చేసేటపుడు కర్త. అనుభవించేటప్పుడు భోక్త. కరణానికే ఇంద్రియమని పేరు. అది బాహ్యమైతే చక్షురాదులు, వాగాదులు. అభ్యంతరమైతే ప్రాణం, మనస్సు, మనోవాక్కాయాలు మూడింటికీ త్రికరణాలని పేరు. వీటివల్ల సాగించే కర్మ మూడు విధాలు. ప్రారబ్ధం ఆగామి సంచితం. వర్తమానంలో అనుభవించేది ప్రారబ్ధం. భవిష్యత్తులో అనుభవించబోయేది ఆగామి. అనుభవానికింకా రాక భూతకాలానికి సంబంధించి పోగయిన కర్మ సంచితం. ఇంతేగాక కర్మ అనేది మరోవిధంగా చూస్తే రెండు వర్గాలుగా మనం దాన్ని విభజించవచ్చు. శాస్త్రం విధించిన కర్మ ఒకటి. లౌకికంగా మనం ప్రతిదినమూ మన ఇష్టానుసారంగా చేస్తూ పోయే కర్మ ఒకటి. ఇది లౌకిక కర్మ అయితే అది శాస్త్రీయ కర్మ. లౌకిక కర్మ ప్రియమే గానీ మనకు హితం కాకపోవచ్చు. అదే శాస్త్రీయంగా ఆచరిస్తే ప్రియమూ, హితమూ రెండూ అవుతుంది. శాస్త్రీయ కర్మలు విధులు కావచ్చు, నిషేధాలు కావచ్చు. ఇందులో నిషేధాలను నిర్మొహమాటంగా వదిలేయాలి. విధులలో నిత్యనైమిత్తికాలను విధిగా ఆచరించాలి. కామ్యాలను కోరికలుంటే ఆచరించటం లేకుంటే మానేసినా ప్రమాదం లేదు. నిత్యనైమిత్తికాలను మానేస్తే ప్రత్యవాయమనే దోషం వచ్చిపడుతుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
కృతి ()
Telugu original

కృతి : పని అని అర్థం. కర్మ క్రియ కృతి అనే మూడు ఒకే అర్థాన్ని బోధిస్తాయి. ఇది సుకృతి కావచ్చు. దుష్కృతి కావచ్చు. రెండవ జాతిని విడిచి మొదటి జాతి కృతులనే ఆచరించాలి సాధకుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
కం ()
Telugu original

కం : సుఖమని అర్థం. కంబ్రహ్మ ఖంబ్రహ్మ అని ఉపనిషత్తు బ్రహ్మతత్త్వాన్ని వర్ణించింది. కం అంటే సుఖం. ఖం అంటే ఆకాశం. కేవల సుఖం లౌకికం. కేవలం ఆకాశం జడం. రెండూ కలిపి పట్టుకుంటే ఆకాశంలాగా విస్తరించిన బ్రహ్మానందం.

Vedānta Paribhāṣā Vivaraṇa
కలా ()
Telugu original

కలా : ఒక శకలం. ఒక భాగం. ఒక ముక్క. ప్రాణం మొదలు నామంవరకూ పదహారు ఇవి. మొత్తం అనాత్మ. ప్రపంచమంతా ఈ పదహారే. షోడశ కళలని పేరు వీటికి. వీటితో కలిపి పట్టుకుంటే ఆత్మసకలం. వాటిని లయం చేసి పట్టుకుంటే నిష్కలం లేదా అకలం. Indivisible. కళాప్రళయ మార్గమేదో గురూపదేశంవల్ల గ్రహించాలని ప్రశ్నోపనిషత్తులో భాష్యకారుల ఉపదేశం.

Vedānta Paribhāṣā Vivaraṇa
కలిల/కల్క ()
Telugu original

కలిల/కల్క : కల్మషం, పాపం, కళంకం. Sigment, Impurity, Mark త్రిగుణాత్మకమైన సంసారమంతా కలిలమేనని శాస్త్రజ్ఞుల మాట.

Vedānta Paribhāṣā Vivaraṇa
కల్పనా ()
Telugu original

కల్పనా : సహజంకానిది తయారుచేయటం. క్రొత్తగా సృష్టించటం. ఆభాస Appearence. రజ్జువులో సర్పాన్ని చూడడం లాంటిది.

Vedānta Paribhāṣā Vivaraṇa
కళ్యాణ ()
Telugu original

కళ్యాణ : శుభం. మంచి. 'పుణ్యం కళ్యాణకృత్‌' అంటే పుణ్యాత్ముడని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
కళ్యాణచరణ ()
Telugu original

కళ్యాణచరణ : మంచి పని చేసినవాడు పుణ్యాత్ముడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
కపూయచరణ ()
Telugu original

కపూయచరణ : కపూయమంటే పాపం. పాపకర్మ చేసినవాడు పాపాత్ముడని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
కవి ()
Telugu original

కవి : 'కవతే కవయతి పశ్యతి వర్ణయతీతి కవిః.' ఎవడు దర్శిస్తాడో, దర్శించిన సత్యాన్ని మరలా వర్ణించి చెప్పగలడో వాడు కవి. ద్రష్ట. seer స్రష్ట creater. 'క్రాంత దర్శీ కవిః' అన్నారు. దేశకాల అవధులను దాటి చూడగలవాడు. వాడే ఋషి కూడ. మొట్టమొదటి కవి పరమాత్మ. 'కవిర్మనీషీ పరిభూః స్వయంభూః' అని శాస్త్రవచనం. మొదటి కవి ఈశ్వరుడైతే తరువాత కవి జీవన్ముక్తుడైన మానవుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
కలి/కలుష/కల్మష ()
Telugu original

కలి/కలుష/కల్మష : పాపం, కళంకం, మచ్చ. మరొకదానితో కలిసి అంటుపడటం. నామరూపాలే శుద్ధమైన చైతన్యానికి కాలుష్యం. దానిని వదలుకొంటే అది నిష్కల్మషం.

Vedānta Paribhāṣā Vivaraṇa
కాకు ()
Telugu original

కాకు : వక్రంగా మాటాడటం. అన్యాపదేశంగా చెప్పటం. లోపల ఉన్న భావాన్ని మరోవిధంగా బయటపెట్టటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
కాఠక ()
Telugu original

కాఠక : కఠోపనిషత్తు అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
కాండ ()
Telugu original

కాండ : కొమ్మ కాడ వేదశాఖ. విధికాండ ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని వేదంలో మూడు భాగాలు.

Vedānta Paribhāṣā Vivaraṇa
కామ ()
Telugu original

కామ : కోరిక. కోరబడ్డ పదార్థంకూడా. అవిద్యా కామకర్మలనే మూడు పాతకాలలో ఇది రెండవది. సూక్ష్మశరీర లక్షణమిది. జీవుడి స్వరూపమిదే అసలు. చతుర్విధ పురుషార్థాలలో రెండవది కూడా. అక్కడ కామమంటే స్త్రీ పురుష విషయం. మామూలుగా అయితే కేవలం కర్మఫలంమీద ఆసక్తి మాత్రమే Ambition. నిష్కామకర్మ అంటే అలాటి ఆసక్తి లేని కర్మ.

Vedānta Paribhāṣā Vivaraṇa
కామ్యకర్మ ()
Telugu original

కామ్యకర్మ : శాస్త్రం విధించిన కర్మలలో మొదటిది నిత్యం, రెండవది నైమిత్తికం, మూడవది కామ్యం. కామ్య అంటే ఒక కోరిక పెట్టుకొని చేసుకొనే కర్మ. ఇది చేసి తీరాలనే నిర్బంధం లేదు. చేస్తే చేయవచ్చు, కోరిక లేకుంటే మానేయవచ్చు. జ్ఞాని మాత్రం తప్పకుండా దీనిని మానివేయవలసి ఉంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
కాయ ()
Telugu original

కాయ : శరీరం. ఒకచోట పోగైనది Constituted అని అర్థం. పంచీకృతమైనది ఈ శరీరం. సాధారణంగా స్థూలశరీరం. నికాయమని కూడా Compilation కొన్ని మతాలవారు పేర్కొంటారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
కారణ ()
Telugu original

కారణ : ఒక కార్యమేర్పడటానికి ముందున్న పదార్థం Cause. ఉపాదానమని, నిమిత్తమని, సహకారి అని మూడు విధాలు ఇది. మట్టిలాగా అచేతనమైన దుపాదానం Material cause. కుమ్మరిలాగా చేతనమైనది నిమిత్తం. senceient. సారెలాగా తోడ్పడేది సహకారి. మూడూ కలిస్తేగాని కార్యమనేది ఏర్పడదు. ఇవి మూడూ ద్వైతులకు వేరువేరు. మూడూ కలిసి ఒక్కటే అద్వైతులకు. పరమాత్మే ప్రపంచమనే కార్యానికి ఉపాదానం. ఆయనే నిమిత్తం. ఆయనే సహకారి. జ్ఞానంద్వారా నిమిత్తం శక్తిద్వారా ఉపాదానం. సంకల్పంద్వారా సహకారి. అవిద్యా రూపమైన కారణ శరీరమని కూడా అర్థమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
కార్య ()
Telugu original

కార్య : కారణం ద్వారా ఏర్పడే ఫలం. Effect. కారణం పూర్వమైతే కార్యం ఉత్తరం. లేదా అపరం. Subsequent కార్యకారణ సంబంధమే సృష్టి అంతా. హేతుఫలాలని కూడా వర్ణిస్తారు వీటిని. వీటి సంబంధం అవినాభావి Inseperable. కారణం లేని కార్యం లేదు. కార్యంలేని కారణం లేదు. రెండూ అన్యమని చూస్తే సంసారం. ఏకమని చూస్తే సాయుజ్యం. ఏకమంటే కారణాన్ని కార్యంగా కాదు. కార్యాన్ని కారణంగా. ఇదే అద్వైత భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
కారక ()
Telugu original

కారక : కారణం కార్యంగా మారటానికి తోడ్పడే సామగ్రి కర్తృకారకం మొదలుకొని అధికరణ కారకం వరకు చాలా ఉన్నాయి ఇవి. ఒక ఫలితం లేదా కార్యం ఏర్పడాలంటే కర్త కరణ క్రియ మూడూ అవసరం. ఇందులో కరణమనే దాన్ని కారకమని పేర్కొంటారు. క్రియకు కావలసిన సామగ్రి అని చెప్పవచ్చు.

Vedānta Paribhāṣā Vivaraṇa
కారికా ()
Telugu original

కారికా : అర్థసంగ్రహ కారిక కారిక. ఒక విషయాన్ని విస్తరంగా కాక సంగ్రహంగా ఒక శ్లోకరూపంలో వర్ణించి చెబితే దానికి కారిక అని పేరు. ఇది ఒక రకమైన వ్యాఖ్యానం. మాండూక్య కారిక లిలాంటివే. ఆ ఉపనిషత్తు తాత్పర్యాన్ని సంగ్రహంగా బోధించే శ్లోకాలు. అద్వైత విజ్ఞానమంతా మూటకట్టి మనకందించిన రత్న శలాకాలు.

Vedānta Paribhāṣā Vivaraṇa
కాల ()
Telugu original

కాల : కాలం Time. యముడు, మృత్యువని కూడా అర్థమే. 'కలయతీతి కాలః' ఏది గణిస్తుందో లెక్కిస్తుందో, ఏది తనలో కలుపుకుంటుందో అది కాలం. పరమాత్మ అయినా కావచ్చు. 'అత్తా చరాచర గ్రహణాత్‌' కాలస్వరూపుడై చరాచర సృష్టినంతటినీ తనలో లయం చేసుకొంటాడాయన. 'కాలోస్మి లోక క్షయ కృత్‌' అని ఆయనే కంఠోక్తిగా చాటాడు గీతలో.

Vedānta Paribhāṣā Vivaraṇa
కాలీ ()
Telugu original

కాలీ : అలా లయం చేసుకొనే ఆయన. మాయాశక్తి. క్రియాశక్తి అని కూడా దీనికి పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
కాష్ఠ ()
Telugu original

కాష్ఠ : అవస్థ State. దిశ Direction. అవధి Culmination. 'సాకాష్ఠా సా పరాగతిః' అని కఠోపనిషత్తు మాట. ఇక్కడ కాష్ఠ అంటే చివరి దశ, చివరి స్థితి.

Vedānta Paribhāṣā Vivaraṇa
కులాయ ()
Telugu original

కులాయ : పక్షి గూడు Nest. శరీరమని కూడా అర్థమే. ఇదీ గూడు లాంటిదే. దీనిలో కాపురమున్న చిలక జీవుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
కుల ()
Telugu original

కుల : గుంపు. సమూహం. గృహం. మాతృకులం, శ్వశురకులం, దేవకులం అని వ్యవహారం. దేవకుల మంటే దేవుడున్న గృహం. శరీరమని కూడా ఒక అర్థం ఉంది. కులాంతస్థా అని దేవీ నామం. నామరూపాత్మకమైన ప్రపంచం కూడా కులం. అకులమంటే అశరీరం. నిష్ప్రపంచమైన ఆత్మతత్త్వం మాత్రమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
కుశల ()
Telugu original

కుశల : క్షేమం, సమర్థం, శుభం, శ్రేయస్సు, మోక్షం, నేర్పుకలవాడని Skilful కూడా అర్థమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
కుశాగ్ర ()
Telugu original

కుశాగ్ర : కుశమంటే దర్భపోచ. అగ్రమంటే మొన. దర్భమొనలాగా పదునైన బుద్ధి.

Vedānta Paribhāṣā Vivaraṇa
కుహక/కుహనా ()
Telugu original

కుహక/కుహనా : కపటం, వంచన, అసత్యం False, మోసం, కృత్రిమం.

Vedānta Paribhāṣā Vivaraṇa
కూట/కూటస్థ ()
Telugu original

కూట/కూటస్థ : సమూహం. మోసం. అసత్యం, మిథ్య. మాయ. అలాంటి మాయను అధిష్ఠించిన పరమాత్మ ప్రత్యగాత్మ కూటస్థుడు. సాక్షి రూపమైన ఆత్మచైతన్యమని అర్థం. అచలమైన తత్వం. కూటస్థ మచలం ధ్రువం.

Vedānta Paribhāṣā Vivaraṇa
కృత ()
Telugu original

కృత : తయారైనది. కృత్రిమం. నామరూపాదులన్నీ కృతమే. 'నాస్తి అకృతః కృతేన. కృతమైన పదార్థంతో అకృతాన్ని పట్టుకోలేము. కృతమంటే ఇక్కడ అనిత్యమైన సంసార భావాలు. అకృతమంటే త్రిగుణాతీతమైన నిత్య వస్తువు ఆత్మ.

Vedānta Paribhāṣā Vivaraṇa
కృతాకృత ()
Telugu original

కృతాకృత : చేసినది చేయనిది అని అర్థం. కర్మ చేస్తే కృతం. చేయకుంటే అకృతం.

Vedānta Paribhāṣā Vivaraṇa
కృతకృత్య / కృతార్థ ()
Telugu original

కృతకృత్య/కృతార్థ : చేయవలసినది చేసినవాడు Accomplished. కృతార్థుడన్నా ఇదే అర్థం. 'ఏతత్‌కృత్వా బుద్ధిమాన్‌స్యాత్‌కృతకృత్యశ్చ భారత.' ఈ సాధన చేస్తే కృతకృత్యుడు. ఇక చేయవలసినది ఏదీ లేని వాడవుతాడు అని చాటుతున్నది శాస్త్రం.

Vedānta Paribhāṣā Vivaraṇa
కృతక ()
Telugu original

కృతక : కృత్రిమం. అసత్యమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
కృతి ()
Telugu original

కృతి : కార్యం. పని చేయటమని, సృష్టించటమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
కృత్స్న ()
Telugu original

కృత్స్న : సమస్తం. అన్ని. అంతా. 'కృత్స్న కర్మ కృత్‌' అన్ని పనులు చేసిన వాడని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
కృత్‌ ()
Telugu original

కృత్‌ : ఒక పని చేసేవాడు Doer. Worker. కర్త అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
కృతాంత ()
Telugu original

కృతాంత : యముడని ఒక అర్థం. పని ముగిసిపోవటమని మరొక అర్థం. శాస్త్రమని ఇంకొక అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
కృపణ ()
Telugu original

కృపణ : కృశపణ అనే మాటలో శవర్ణం లోపించి కృపణ అనే రూపమేర్పడింది. తక్కువ ధనమున్న వాడని అర్థం. అలాంటివాడు ఎప్పుడు జాలిపడవలసిన వాడే. కనుక కృపణుడంటే శోచనీయుడని Pitiable శాస్త్రంలో లాక్షణికంగా ఒక అర్థం ఏర్పడింది. 'ఏతదవిదిత్వా యః ప్రైతి స కృపణః' ఈ విషయం తెలియకుండా ఎవడు మరణిస్తాడో వాడు కృపణుడు, శోచనీయుడని ఉపనిషత్తు చాటిన విషయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
కార్పణ్య ()
Telugu original

కార్పణ్య : కృపణుడి భావమే కార్పణ్యం. Pitiability. 'కార్పణ్య దోషోప హత స్వభావః' అని గీతా వచనం.

Vedānta Paribhāṣā Vivaraṇa
కేవల/కైవల్య ()
Telugu original

కేవల/కైవల్య : మరొకటి ఏదీ లేకుండా తనపాటికి తానే ఉన్నది. ఆత్మ. సజాతీయ విజాతీయ స్వగతభేద రహితమైన తత్త్వం. దాని భావం కైవల్యం. కేవలత్వం. ఏకత్వం అద్వైతం మోక్షం శివః కేవలోహం.

Vedānta Paribhāṣā Vivaraṇa
కేనోపనిషద్‌ ()
Telugu original

కేనోపనిషద్‌: ఉపనిషత్తులలో ఇది రెండవది శరీరాదులుగాని చరాచర పదార్థాలుగాని ఇలా నడుస్తున్నాయంటే ఏది వెనకాల చేరి వీటిని నడుపుతున్నది అని ప్రశ్న వేసి దానికి సమాధానం ఇచ్చిన ఉపనిషత్తు ఇది. దీనికి పదభాష్యమని వాక్యభాష్యమని రెండుగా భాష్యం రచించారు భగవత్పాదులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
కైతవ ()
Telugu original

కైతవ : కితవుని భావం. కితవుడంటే మోసగాడు. అప్పటికి కైతవమంటే మోసం. నెపం. కపటం. కల్తీ. 'ధర్మః ప్రోజ్ఘిత కైతవః' కల్తీ లేని ధర్మం. అనన్యభక్తి. భాగవతం చెప్పే ధర్మమిదే.

Vedānta Paribhāṣā Vivaraṇa
కోశ ()
Telugu original

కోశ : కత్తి పెట్టే ఒక Sheath. ఒక వస్తువును కప్పి ఉంచేది బీళిఖీలిజీ. శరీరంలో ఉండే పంచకోశాలు. అన్నమయం నుంచి ఆనందమయం వరకు ఇవి అయిదు. వీటి అయిదింటిలో ఆత్మచైతన్యం మరుగుపడింది. ఇవి దానికి ఉపాధులు. వీటిని దానిలో క్రమంగా లయం చేసుకొని చూస్తే పరిశుద్ధమైన పరిపూర్ణమైన ఆత్మ సాక్షాత్కరిస్తుంది. వీటిమూలంగానే అది పరిచ్ఛిన్నమై భాసిస్తున్నది. ఇదే సంసారం.

Vedānta Paribhāṣā Vivaraṇa
కోవిద ()
Telugu original

కోవిద : ఓ కోవిదలో ఓకారం లోపించగా ఏర్పడిన రూపమిది. అసలైన స్వరూపాన్ని గుర్తించిన ప్రజ్ఞాశాలి. అభిజ్ఞుడు అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
కోష్ఠ ()
Telugu original

కోష్ఠ : లోపలి భాగం, కుక్షి The innter portion, జఠరగోళం.

Vedānta Paribhāṣā Vivaraṇa
కౌశల ()
Telugu original

కౌశల : కుశలశ్య భావః - నేర్పని అర్థం. Skill 'కర్మసు కౌశలం' ఆత్మభావనతో చూస్తూ కర్మలు చేస్తున్నా అవి మనలను బంధించవు. అదే కౌశలం.

Vedānta Paribhāṣā Vivaraṇa
క్రతు ()
Telugu original

క్రతు : యజ్ఞం, భావం, నిశ్చయం, సంకల్పం. 'త మక్రతుః పశ్యతి' సంకల్పం లేనివాడే ఆత్మను ఉన్నదున్నట్టు చూడగలడు. 'యధాక్రతుః తధాకర్మ కరోతి' ఏ భావనతో ఉంటే ఆ పని చేస్తాడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
క్రమ ()
Telugu original

క్రమ : అడుగువేయటం, నడవటం, సాగటం, ఒక పద్ధతి, ఒక వరస Order.

Vedānta Paribhāṣā Vivaraṇa
క్రాంత ()
Telugu original

క్రాంత : క్రము అనే ధాతువుకు భూతకాలిక ధాతుజ విశేషణం Past participle. దాటిపోయిన, గడచిపోయిన అని అర్థం. Passed.

Vedānta Paribhāṣā Vivaraṇa
క్రాంత దర్శి ()
Telugu original

క్రాంత దర్శి : దేశకాల అవధులను దాటిపోయి సృష్టి రహస్యాన్ని దర్శించే మహనీయుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
క్రియాశక్తి ()
Telugu original

క్రియాశక్తి : ప్రకృతి, పరమాత్మ జ్ఞానస్వరూపుడైతే ఆయన ప్రకృతి, ఆ జ్ఞానాన్ని చలింపచేసే క్రియాశక్తి. దీనివల్లనే సంసార బంధమేర్పడింది జీవుడికి.

Vedānta Paribhāṣā Vivaraṇa
క్రియా/కారక/ఫల ()
Telugu original

క్రియా/కారక/ఫల : ఒక పని, దానికి కావలసిన సామగ్రి, అది చేస్తే కలిగే ఫలితం. సంసారమంతా ఇదే. దీన్ని చేసేవాడు కర్త అయితే ఫలితమనుభవించే టపుడు వాడే భోక్త అవుతున్నాడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
క్లేశ ()
Telugu original

క్లేశ : పీడ, బాధ, వేదన. ఇవి వేదాంతంలో మూడు విధాలు. అవే ఆధ్యాత్మికాది తాపత్రయం. యోగశాస్త్రంలో అయిదు విధాలు. అవిద్య, ఆస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు. వీటినే పాశాలని కూడా వర్ణిస్తారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
()
Telugu original

ఖ : ఆకాశం. ఇంద్రియం. పరాంచి ఖాని వ్యతృణత్‌అని కఠోపనిషత్తు. ఖాని అంటే అక్కడ ఇంద్రియాలు అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఖగోళ ()
Telugu original

ఖగోళ : ఆకాశ గోళం. గ్రహసంచారానికి నిలయమైనది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఖసూచి ()
Telugu original

ఖసూచి : సాహిత్య గంధం లేక కేవలం వ్యాకరణ పఠనంతోనే తృప్తిపడ్డ వైయాకరణుడు. Grammarian. ఏదైనా ప్రయోగమడిగితే అతడు ఆకాశాన్ని చూపుతాడట. కనుక ఖసూచి అని పేరు వచ్చింది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఖేచరీ ()
Telugu original

ఖేచరీ : యోగులు చెప్పే ముద్రలలో ఇది ఒకటి. దృష్టిని ఆకాశంమీద పెట్టటం. అప్పుడది ఆకాశంలోనే చరిస్తుంటుంది. మరి ఏ భావాలూ మనస్సుకు రావు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఖండ ()
Telugu original

ఖండ : ఒక శకలం. భాగం. ముక్క. పరిమితమైన పదార్థమని అర్థం. Part.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఖండన ()
Telugu original

ఖండన : వాదంలో ఒకరి మాటనొకరు కాదని త్రోసిపుచ్చటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఖ్యాన ()
Telugu original

ఖ్యాన : ఆఖ్యానమని అర్థం. చెప్పటం, వర్ణించటం. Narration. విస్తరించి చెప్పటం. అదే కథ. దీనికి ఉప ముందు చేరిస్తే ఉపాఖ్యాన. కథలో కథ అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఖిల ()
Telugu original

ఖిల : అల్పం. అనుబంధం. Supplement. ఖిలపురాణం అంటే మహా పురాణానికి అనుబంధంగా వచ్చే ఉప పురాణం. ఖిలములన్నీ కలిస్తే అఖిలం. నిఖిలం. సంపూర్ణమని Whole అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఖిల్య ()
Telugu original

ఖిల్య : సమష్టిలో ఒక ముక్క. ఒక శకలం. ఖిలమే ఖిల్యం. మన శరీరమంతా ఒక ఖిల్యమట. అమూర్తమైన ఆత్మచైతన్యం మూర్తీభవించి లేదా ఘనీభవించి ఇది ఏర్పడిందని బృహదారణ్యకం వర్ణించింది. ఒక ఉప్పుముద్ద లాంటిదిది. సముద్రజలమే కరడుగట్టి లవణపిండమైనట్టు ఈశ్వర చైతన్యమే ఘనీభవించి శరీరంగా మారిందని మరలా ఇది ఆ చైతన్య సాగరంలోనే ప్రవిలాపనం Melting చేస్తే తద్రూపంగానే దర్శనమిస్తుందని అక్కడ వర్ణించిన విషయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఖేద/ఖిన్న ()
Telugu original

ఖేద/ఖిన్న : బాధపడటం. తాపం పొందటం. సంసారంవల్ల కలిగే వేదన. అది అనుభవించే జీవుడు ఖిన్నుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
కకుదం ()
Telugu original

కకుదం : చిహ్నం. సంకేతం. Sign. Token. గుర్తు.

Vedānta Paribhāṣā Vivaraṇa
గత ()
Telugu original

గత : గడచిపోయిన కాలం. విషయం. Past.

Vedānta Paribhāṣā Vivaraṇa
గతాగత ()
Telugu original

గతాగత : గడచిపోయినది. గడవబోయేది. Past and Future. అవేవో గావు జనన మరణాలు. దీనివల్లనే సంసారయాత్ర నిరంతరం సాగిపోతుంటుంది. అంతేగాక ఎప్పుడూ రాకపోకలు సాగించటం కూడా గతాగతమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
గతానుగత ()
Telugu original

గతానుగత : ఒకడు పోయిన మార్గంలోనే మరొకడు వెళుతూ ఉండడం. 'గతానుగతికో లోకః.' లోకమంతా గొర్రెదాటుగా ముందుగా సాగిపోతూ ఉంటుందని ఒక లోకోక్తి. ఎవరికీ విచారణ లేకుండా గ్రుడ్డిగా వెళ్ళిపోతున్నారని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
గత్యంతర ()
Telugu original

గత్యంతర : ప్రస్తుతం మనకున్న మార్గంతప్ప మరొక మార్గమేదైనా ఉంటే అది గత్యంతరం. Another way.

Vedānta Paribhāṣā Vivaraṇa
గంతా/గంతవ్య/గమ్య ()
Telugu original

గంతా/గంతవ్య/గమ్య : ఒక గమ్యంవైపు ప్రయాణం చేసేవాడు లేదా సాధకుడు గంత. అతడు ప్రయాణించి అందుకొనే స్థానం గమ్యం లేదా గంతవ్యం. Destination. ఆధ్యాత్మ మార్గంలో సాధకుడని సాధనమని వాడికి లభించే సిద్ధి అని అర్థం చేసుకోవలసి ఉంటుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
గమ/గమనం ()
Telugu original

గమ/గమనం

Vedānta Paribhāṣā Vivaraṇa
గమక ()
Telugu original

గమక

Vedānta Paribhāṣā Vivaraṇa
గంధ ()
Telugu original

గంధ

Vedānta Paribhāṣā Vivaraṇa
గర్భ ()
Telugu original

గర్భ : ఉదరం. లోపలి భాగం. హిరణ్యగర్భ. హిరణ్యమంటే స్వయం ప్రకాశమైన ఆత్మచైతన్యం. అది తనలో గుప్తంగా ఉన్నవాడు హిరణ్యగర్భుడు. జీవుడు. సమష్టి జీవుడు. బ్రహ్మదేవుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
గర్వ ()
Telugu original

గర్వ : మనోబుద్ధి చిత్తాహంకారాలు. ఈ నాలుగింటికీ అంతఃకరణ చతుష్టయమని పేరు. ఇందులో సంకల్ప వికల్పాలు మనస్సుకు. నిశ్చయం బుద్ధికి. సంవేదనం చిత్తానికి. గర్వం అహంకారానికి లక్షణాలట. గర్వమంటే నేను అని తన స్థితిని తాను బలపరుచుకుంటూ చెప్పే వ్యవహారం selfdom.

Vedānta Paribhāṣā Vivaraṇa
గహన ()
Telugu original

గహన : విషమం. అర్థం కానిది. అంతుపట్టనిది. సంసారమని లాక్షణికార్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
గహ్వర ()
Telugu original

గహ్వర : బాగా లోతైనది. Deep. Unfathomable. గంభీరమైనది. మానవ హృదయం. సంసారం.

Vedānta Paribhāṣā Vivaraṇa
గాఢ ()
Telugu original

గాఢ : మునిగిపోయినది అని అక్షరార్థం. బాగా లోతుకుదిగి తీవ్రంగా కృషిచేసి పట్టుకొన్నది కూడా. సంసారంతో గాఢమైన బంధం ఏర్పడిందంటే అలాగ స్థిరపడిన బంధమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
గాత్ర ()
Telugu original

గాత్ర : శరీరం. Body.

Vedānta Paribhāṣā Vivaraṇa
గాణపత్య ()
Telugu original

గాణపత్య : గణపతిని దేవతగా ఆరాధించే మతం. షణ్మతాలలో ఇది ఒక మతం. భగవంతుడి షాడ్గుణ్యంలో బలమనే గుణాన్ని ప్రధానంగా తీసుకుని ఆవిర్భవించిన మతమిది. వీరు గణపతి ఉపాసకులు. గాణపత్యమని కూడా ఈ మతానికి మరొకపేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
గాథా ()
Telugu original

గాథా : గానం చేయబడినది. శ్లోకమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
గాయత్రీ ()
Telugu original

గాయత్రీ : 'గాయంతం త్రాయతే ఇతి.' గానం చేసే వాడిని కాపాడేది గాయత్రీ మంత్రం. ఇది ఒక ఛందస్సు. Metre. ఆ ఛందస్సులో బంధించిన మంత్రమిది. కనుక మంత్రానికి ఆ పేరు వచ్చింది. 24 అక్షరాల మంత్రమిది. విశ్వామిత్రుడు దీనికి ద్రష్ట. బ్రహ్మవిద్యకిది ఆలంబనం. పరమాత్మ దీనికి స్వరూపం. సాయుజ్యంలోనే దీనికి వినియోగం. సవిత నుపాసిస్తున్నట్టు పైకి కనిపించినా ఆ సవిత ఎవరో కాదు స్వప్రకాశ శీలుడైన పరమాత్మే.

Vedānta Paribhāṣā Vivaraṇa
గార్హపత్య ()
Telugu original

గార్హపత్య : గృహపతి అంటే గృహస్థుడు. యజమానుడు. House holder. వాడికి సంబంధించినది గార్హపత్యం. గృహస్థాశ్రమమని అర్థం. నాలుగు ఆశ్రమాలలో ఇది రెండవది.

Vedānta Paribhāṣā Vivaraṇa
గార్హపత్యాగ్ని ()
Telugu original

గార్హపత్యాగ్ని : ఇక్కడ గృహమంటే శరీరం. దీనిని పాతి కాపాడేది గృహపతి. శరీరంలో ఉన్న జఠరాగ్ని. అదే మన ఆరోగ్యాన్ని చక్కగా నిలబెడుతున్నది. ఆకలి లేకుంటే ఆహారం రుచించదు. ఆహారం లేకుంటే బ్రతుకులేదు. ఈ గృహపతికే గార్హపత్యమని పేరు. ఇది ఉష్ణగుణంతో కూడినది గనుక అగ్నిలాంటిది. Appetite.

Vedānta Paribhāṣā Vivaraṇa
గార్హస్థ్య ()
Telugu original

గార్హస్థ్య : గృహస్థాశ్రమం. గృహంలో అంటే శరీరంలో, స్థ అంటే ఉన్నవాడు జీవుడు. వీడి భావం గార్హస్థ్యం అని లాక్షణికమైన అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
గార్గీ ()
Telugu original

గార్గీ : బృహదారణ్యకంలో వస్తుందీ పాత్ర. ఈవిడ గర్గ గోత్రంలో జన్మించినది గనుక ఈ పేరు వచ్చింది. ఒక గొప్ప బ్రహ్మవాదిని. యాజ్ఞవల్క్యునితో చాలాదూరం వాదించిన వ్యక్తి. ఆయన మహత్వాన్ని తాను అర్థం చేసుకొని పదిమందికీ చాటిన మహనీయురాలు.

Vedānta Paribhāṣā Vivaraṇa
గీతా ()
Telugu original

గీతా : గానం చేయబడినది. భగవద్గీత అని కూడా అర్థమే. భగవంతుడైన కృష్ణపరమాత్మచే గానం చేయబడినది గనుక దానికా పేరు సార్థకమైనది.

Vedānta Paribhāṣā Vivaraṇa
గీతి ()
Telugu original

గీతి : ఋగ్వేదం మంత్ర ప్రధానమైతే, యజుర్వేదం వచన రూపమైతే, సామం గీతి ప్రధానమైనది. గీతి అంటే గానం. సామగానమనే మాట ప్రసిద్ధమే గదా. అదే సంగీతానికంతటికీ మూలమంటారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
గుణ ()
Telugu original

గుణ : ద్రవ్యం తాలూకు ధర్మం. Quality. Property of a substance. పృథివికి గంధమనేది గుణం. సత్వ రజ స్తమస్సులనే ప్రకృతి గుణాలు కూడా కావచ్చు. నామరూప క్రియలు కూడా ఆ మాటకు వస్తే గుణాలే. వీటితో కలిసినదైతే ఆత్మ సగుణం. కలవనిదైతే నిర్గుణం. ఇందులో నిర్గుణం స్వరూపమైతే సగుణం విభూతి. గుణమంటే అప్రధానమైనదని కూడా Secondary ఒక అర్థముంది. ప్రధానమైతే ముఖ్యమని అప్రధానమైతే గుణమని పేర్కొంటారు శాస్త్రంలో.

Vedānta Paribhāṣā Vivaraṇa
గుప్త ()
Telugu original

గుప్త : దాచబడినది. గోప్యమైనది. రహస్యం Secret. ఆత్మస్వరూపం ఇలాంటిదే. దాన్ని ప్రకటన చేసుకోవలసిన బాధ్యత ప్రతి మానవుడికీ ఉంది. అప్పుడే జీవిత సమస్యకు పరిష్కారం చేసుకోగలడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
గురు ()
Telugu original

గురు : బరువైనది. పెద్దది. ఆచార్యుడని కూడా అర్థం. వేదం వేదాంతం రెండూ శిష్యులకు బోధించేవాడెవడో వాడు. Teacher. Preceptor.

Vedānta Paribhāṣā Vivaraṇa
గురూపదేశ ()
Telugu original

గురూపదేశ : యోగ్యుడైన గురువు యోగ్యుడైన శిష్యుడికి చేసే బోధ. ముఖ్యంగా అన్నిటికన్నా రహస్యమైన బ్రహ్మతత్వాన్ని శిష్యుడి అనుభవానికి తెచ్చే ప్రబోధం. దీనికే సంప్రదాయమని, ఆగమమని పేరు Intuition.

Vedānta Paribhāṣā Vivaraṇa
గురుపరంపర ()
Telugu original

గురుపరంపర : ఒక గురువు నుండి శిష్యుడు అతని నుండి ప్రశిష్యుడు ఇలాగ బ్రహ్మోపదేశం అందుకుంటూ వచ్చే మార్గానికి పరంపర అని పేరు. గురు వంశమని కూడా పేర్కొంటారు దీనిని Tradition. గురుశిష్య సంప్రదాయమని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
గరిమా ()
Telugu original

గరిమా : గురుత్వం. గురుభావం. అణిమాది అష్టసిద్ధులలో ఒకటి. ఉన్నట్టుండి బరువెక్కిపోవటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
గుహా ()
Telugu original

గుహా : కొండ గుహ.Cave.. వస్తువును మరుగు పుచ్చేది. బుద్ధి. మానవుడి బుద్ధిలోనే పరమాత్మ మరుగుపడి ఉన్నాడు. గుహాహీతం. గుహలాంటి బుద్ధిలో గుప్తమై ఉన్నాడు అని ఉపనిషద్వచనం. అక్కడేగాని మరెక్కడా లేడని కాదు. సర్వత్రా ఉన్నా అద్దంలాంటి బుద్ధిలోనే ప్రకాశిస్తున్నదా తత్వం. దాన్ని పట్టుకోవటానికిది తోడ్పడే సాధనమనే దృష్టితో బుద్ధిలో ఆత్మతత్వముందని చెప్పవలసి వచ్చింది. బుద్ధే దాని కుపలబ్ధి ద్వారమని Medium. Gateway భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
గుహ్య ()
Telugu original

గుహ్య : గుహలో ఉన్నది. గోప్యమైనది. రహస్యం. అన్నిటికన్నా రహస్యమైనది ఆత్మవిజ్ఞానం. 'గుహ్యం బ్రహ్మ సనాతనం' అని మాట. రాజవిద్యా రాజగుహ్యం అని గీతావచనం. The top secret అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
గృథ్‌/గర్థి ()
Telugu original

గృథ్‌/గర్థి : ఆశపడటం. ఆశ. కాంక్ష. ప్రాపంచిక వాంఛ. 'మాగృధః కస్య స్విత్‌ధనం.' నేవీదీ కోరనక్కరలేదు. కారణమేమంటే ఇదంతా నీ ధనమే. నీది నీవు కోరటమనేది అర్థం లేని మాట. ఆత్మకానిదేదీ లేదు గదా. అలాంటి భావనతో నీవీ ప్రపంచాన్ని చూస్తే నిత్యతృప్తుడవై జీవించగలవు అని ఈశావాస్యం లోకానికంతా చాటి చెప్పిన సత్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
గోచర ()
Telugu original

గోచర : గో శబ్దానికి చాలా ఉన్నాయి అర్థాలు. వేదాంతానికి కావలసినవి ఒకటి ఇంద్రియం. గోచరమంటే ఇంద్రియాలకు స్ఫురించే శబ్దస్పర్శాదులు. జ్ఞానమని ఇంకొక అర్థం. గోచర అంటే జ్ఞానానికి విషయమయ్యేదంతా. అలా విషయం కాదు గనుకనే ఆత్మ అగోచరం.

Vedānta Paribhāṣā Vivaraṇa
గోచార ()
Telugu original

గోచార : గో అంటే ఇక్కడ గ్రహమని అర్థం. గ్రహాలన్నింటి సంచారానికి గోచారమని సంజ్ఞ. ఇది జ్యోతిశ్శాస్త్ర విషయం. అదే మానవుడి జీవితాన్ని నడుపుతున్నదని వారి అభిప్రాయం. అజ్ఞానికైతే ఇది వాస్తవమే. జ్ఞాని విషయంలో ఏ గ్రహమూ పనిచేయదు. మీదు మిక్కిలి అతని మార్గానికి అది ఇంకా దోహదం చేస్తుందని శాస్త్రంలో ఉన్న విషయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
గోపన/గోపాయన/గోప ()
Telugu original

గోపన/గోపాయన/గోప : కప్పి పుచ్చటం. దాచుకోవటం. నీవేదైనా అన్యంగా చూచినప్పుడే దానివల్ల నీవు భయపడవచ్చు. భయమేస్తేనే దాని నుంచి నిన్ను నీవు దాచుకోవాలని చూస్తావు. కాబట్టి జీవులందరూ గోపులు, గోపకులు. గోపాలురు. ఈశ్వరుణ్ణి వేరుగా పరోక్షంగా దర్శించి భయపడే స్వభావమున్నవారని భావం. కనుకనే ఈశ్వర భావానికి దూరమై పోతున్నారు మానవులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
గౌణ ()
Telugu original

గౌణ : గుణాన్ని బట్టి వచ్చిందీమాట. సింహ గుణమైన క్రౌర్య శౌర్యాదులెవరిలో నైనా చూస్తే వాణ్ణి సింహమని పేర్కొంటాము. వాస్తవంలో వాడు సింహం కాడు. గుణసామ్యాన్ని బట్టి సింహత్వ మారోపించాము. ఇలా ముఖ్యార్థంలో కాక గౌణార్థంలో చెబితే అది గౌణం. Secondary. Metaphorical. బాహ్యమైన చరాచర పదార్థా లిలాంటివే మనకిప్పుడు. వీరు నావాళ్ళు, ఇవి నావని పేర్కొంటాము. నేననే ఆత్మకు వాటిని ముడిపెట్టి చూస్తున్నాము. దీనికే గౌణాత్మ అని పేరు వేదాంతంలో. మమకార మని దీనికి మారుపేరు. దీనికి భిన్నంగా శరీరమే నేనని భావిస్తే దానికి మిథ్యాత్మ అని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
గౌతమ ()
Telugu original

గౌతమ : గో అంటే జ్ఞానం తమ అంటే జ్ఞానంలో నిష్ణాతుడని అర్థం. ఇలాంటి ఉత్తమ జ్ఞాని ఎవరో కాదు. న్యాయశాస్త్ర ప్రణేత అయిన ఆచార్యుడు. గౌతముని న్యాయదర్శనం షడ్దర్శనాలలో ప్రసిద్ధమైనది. ఇదే పూర్వమీమాంస ఉత్తరమీమాంస దర్శనాల కన్నింటికీ పునాది రాయి. న్యాయవిద్యా గంధం లేకపోతే ఎవరూ ఏ సిద్ధాంతమూ చేయలేరు. దానిని చక్కగా ప్రతిపాదించలేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
గౌరవ ()
Telugu original

గౌరవ : గురుభావం. గురుత్వం. Reverence to elders. బరువు Weight. అంతేగాదు తేలికగా చెప్పవలసిన విషయం డొంక తిరుగుడుగా బయటపెడితే దానికి కూడా ఇది వర్తిస్తుంది. ప్రక్రియా గౌరవం అని పేరు పెట్టారు శాస్త్రంలో.

Vedānta Paribhāṣā Vivaraṇa
గ్రంథి / గ్రంథ ()
Telugu original

గ్రంథి/గ్రంథ : గ్రథనమంటే కూర్చటం. Compilation. అలా కూర్చినదేదో అది గ్రంథం. ముడిపెట్టటమని కూడా అర్థమే. గ్రంథి అంటే ముడి. Knot. లాక్షణికంగా చెబితే హృదయంలో కలిగే సంశయ విపర్యయాది వాసనలు. జన్మజన్మలనుంచి పేరుకొని ఉన్న ఈ సంస్కారాలకే Impressions. Instincts. గ్రంథులని పేరు. 'భిద్యతే హృదయ గ్రంథిః.' అలాటివన్నీ సమూలంగా తొలగిపోతేనే కారణ శరీరం భంగమవుతుంది అంటే అజ్ఞానం నిర్మూలనమవుతుంది. అజ్ఞానం తొలగితేనే జ్ఞానప్రాప్తి.

Vedānta Paribhāṣā Vivaraṇa
గృహ/గృహపతి ()
Telugu original

గృహ/గృహపతి : గృహమంటే ఇల్లు. శరీరమే గృహమని వేదాంతుల మాట. గృహ్ణాతి ఇతి గృహం. ఏది మనలను పట్టుకొని కట్టిపడేస్తుందో అది. దీనిలో బందీ అయి జీవించేవాడే గృహపతి. వాడే జీవుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
గ్రసిష్ణు ()
Telugu original

గ్రసిష్ణు : గ్రసించటమంటే మ్రింగటం. లయం చేసుకోవటం. గ్రసిష్ణు ప్రభవిష్ణు చ అని గీతావచనం.

Vedānta Paribhāṣā Vivaraṇa
గ్రస్త ()
Telugu original

గ్రస్త : గ్రసనమంటే మ్రింగటమని చెప్పాము. ఏది మ్రింగబడుతుందో అది గ్రస్తం. అభిమాన గ్రస్తం అంటే అభిమానం చేత కబళించబడ్డ వాడని అర్థం. ఎవడో కాడు ఈ జీవుడే.

Vedānta Paribhāṣā Vivaraṇa
గ్రహ/అతిగ్రహ ()
Telugu original

గ్రహ/అతిగ్రహ : పట్టుకునేదని అర్థం. మన ఇంద్రియాలు గ్రహాలు. పోతే అవి పట్టుకునే శబ్ద స్పర్శాదులు అతిగ్రహాలు. రెండింటికున్న ఈ పరస్పర వ్యవహారం వల్లనే సంసార బంధం ఈ జీవుడికి.

Vedānta Paribhāṣā Vivaraṇa
గ్రాహక/గ్రాహ్య/గ్రహణ ()
Telugu original

గ్రాహక/గ్రాహ్య/గ్రహణ : గ్రహించేవాడు, గ్రహించబడేది, గ్రహించడం. ఇది ఒక త్రిపుటి. ఇందులో గ్రాహకుడంటే ప్రమాత. The knower. గ్రాహ్యమంటే ప్రమేయం. The known. గ్రహణమంటే ప్రమాణం. The act of knowing. జ్ఞాతృ జ్ఞేయ జ్ఞానాలని కూడా వీటికి మారుపేర్లు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఘట ()
Telugu original

ఘట : కుండ. బాన.pot.ఘటించబడినది ఘటం. కూర్చబడినది. Composed అని అర్థం. లాక్షణికార్థంలో శరీరం కూడా ఘటమే. ఇదికూడా పంచభూతాలు పంచీకృతమై ఏర్పడినదే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఘటాకాశ ()
Telugu original

ఘటాకాశ : ఒక కుండలో ఉండే ఖాళీ. అది వాస్తవంలో మహాకాశమే. అయినా కుండ తయారయ్యేసరికి దానిలోనే పరిమితమై ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే చిదాకాశంలో ఈ శరీరం ఎప్పుడు సృష్టి అయిందో అప్పటినుంచి చైతన్యం ఈమేరకు ఉన్నట్టు భాసిస్తున్నది. ఇది చిదాభాసుడైన జీవుడు. దీనిని మించి సర్వత్రా వ్యాపించిన మహాకాశం లాంటివాడు ఈశ్వరుడు. రెండింటికీ తేడాలేదు. లేదని గుర్తించినప్పుడే ఈ జీవుడు ఆ ఈశ్వర భావం అందుకోగలడు. క్రొత్తగా అందుకొనే వ్యవహారం కూడా కాదు. అందుకో లేదనే అజ్ఞానాన్ని జ్ఞానంతో పోగొట్టుకొని ఆ రూపంగా నిలిచి ఉండడమే అందుకోటమనే మాటకు అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఘటనా/ఘటన ()
Telugu original

ఘటనా/ఘటన : ఒకటి కుదర్చటం. కుదరకుండా చేయటం. రెండింటికీ సామర్థ్యముంటే అది ఘటనా ఘటన సామర్థ్యం. మాయాశక్తిని వశంలో ఉంచుకున్న ఈశ్వరుడే ఘటనా ఘటన సమర్థుడు. సృష్టించగలడు. సంహరించగలడు అని తాత్పర్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఘన ()
Telugu original

ఘన : గొప్పది. పెద్దది. Big.దట్టమైనది. Dense. విజాతీయమైన అంశం ఏ మాత్రమూ లేక సజాతీయ భావంతోనే నిండిపోయిన పదార్థం. సువర్ణ ఘన. బంగారు కడ్డీ. అయోఘన ఇనుప కడ్డీ. అన్నప్పుడు వాటిలో బంగారం ఇనుము తప్ప మరొక లోహం లేనేలేదని అర్థం. అలాగే ఆత్మకు ప్రజ్ఞాన ఘనమని పేరు ఉన్నది. ప్రజ్ఞానం తప్ప ప్రజ్ఞేయమైన ప్రపంచ వాసనకు దేనికీ అందులో చోటులేదని కేవల చైతన్య స్వరూపమేనని తాత్పర్యం. Pure Consciousness.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఘృణా ()
Telugu original

ఘృణా : కరుణ. జాలి. జుగుప్స. అలాటి కారుణ్య మేమాత్రమూ లేకుంటే దానికి నిర్ఘృణ అని పేరు. దాని భావమే నైర్ఘృణ్యం. ప్రపంచాన్ని ఇంత విషమంగా సృష్టించాడా ఈశ్వరుడంటే ఆయనకు నైర్ఘృణ్య దోషమంటదా అని ప్రశ్న వచ్చింది వేదాంత శాస్త్రంలో. ఇది కేవలం మానవుడి దృష్టిదోషం వల్లనే కనపడుతూ ఉంది కాని అసలు సృష్టి అనేది ఈశ్వరుడు చేయనే లేదని వేదాంతులు దీనికి పరిహారం చెప్పారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
గణ ()
Telugu original

గణ : గుంపు. సమూహం. నామరూపాలు. సంసారం. దీనికి పతి గణపతి. జీవుడని అర్థం. ప్రమథ గణాలంటే వీడిచుట్టూ ఉన్న పాంచభౌతిక పదార్థాలు. నామరూపాలే అవి. మానవుణ్ణి బాగా మథించేవి లేదా వేధించేవని భావం. ప్రకృతి గుణాలే గణాలు. సత్వరజ స్తమస్సులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
చక్షుస్‌ ()
Telugu original

చక్షుస్‌: చూచేది. కన్ను. మనస్సు కూడా. జ్ఞానం కూడా కావచ్చు. జ్ఞానచక్షుస్సు అనే వర్ణిస్తారు పెద్దలు. 'జ్ఞాన దీర్ఘేణ చక్షుషా' అని మాట.

Vedānta Paribhāṣā Vivaraṇa
చతుర్థ ()
Telugu original

చతుర్థ : నాలుగవది. The fourth. తురీయావస్థ. సమాధి. 'చతుర్థం శివమద్వైతం మన్యంతే' అని మాండుక్యవచనం. పరమాత్మ స్వరూపమే అది.

Vedānta Paribhāṣā Vivaraṇa
చరాచర ()
Telugu original

చరాచర : చరించేది. కదిలేది. జంగమం. దీనికి భిన్నమైనది అచరం. కదలనిది. స్థావరం. ప్రపంచమంతా చరాచరాత్మకమే State and dynamic.

Vedānta Paribhāṣā Vivaraṇa
చరణ ()
Telugu original

చరణ : చరించడం. ఆచరించడం. చేయటమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
చరిత / చరిత్ర ()
Telugu original

చరిత/చరిత్ర : ఆచరించబడినది. నడవబడినది. ధర్మం కావచ్చు. అధర్మం కావచ్చు. Conduct good and bad.

Vedānta Paribhāṣā Vivaraṇa
చరమ ()
Telugu original

చరమ : అన్నిటికన్నా చివరిది. పురుషార్థాలలో చరమమైన పురుషార్థం మోక్షమే. అదే పరమమైనది కూడా. కారణం జీవిత సమస్యకు పరిష్కార మక్కడే లభిస్తుంది మానవుడికి. అవసానం కూడా చరమమనే మాటకు అర్థమే. చివరి దశ అని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
చర్చా ()
Telugu original

చర్చా : చర్చించటం. మీమాంస. విచారణ. Discussion. Discourse.

Vedānta Paribhāṣā Vivaraṇa
చర్య ()
Telugu original

చర్య : పని. కర్మ. ఆచారం. అనుష్ఠానం. అమలు పరచటం. Implementation.

Vedānta Paribhāṣā Vivaraṇa
చయన ()
Telugu original

చయన : పోగుచేయటం. Collection. యజ్ఞమని కూడా అర్థమే. అక్కడా యాజకుడు యజ్ఞ ద్రవ్యాలన్నీ ప్రోగు చేయవలసి ఉంటుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
చలాచల ()
Telugu original

చలాచల : కదులుతూ ఆడుతూ ఉండే లక్షణం. మనస్సెప్పుడూ ఇలాంటిదే. సంకల్ప వికల్పాత్మకంగా ఎప్పుడూ ఇది చలిస్తూనే ఉంటుంది. సాధకుడైనవాడు దీనిని అదుపులో పెట్టుకోవాలి. యోగులైతే నిరోధించమని సలహా ఇస్తారు. జ్ఞానులు నిరోధం ఒప్పుకోరు. దానికి మారుగా సజాతీయమైన బ్రహ్మాకార వృత్తిని అనులోమంగా చూస్తూ పొమ్మంటారు. ఎప్పుడెప్పుడు మనస్సు చలిస్తుందో అప్పుడది ప్రారబ్ధమని భావించి మరలా తమ బ్రహ్మనిష్టలో తాము ఉండడమే జ్ఞాని చేయవలసిన పరిశ్రమ. గౌడపాదులవారు జీవన్ముక్తుడు కూడా చలాచల నికేతుడే కనుక చలించి నంత మాత్రాన బెదరిపోరాదు, అది ప్రారబ్ధ లక్షణమని భావించి మరలా అచలమైన ఆత్మను దర్శిస్తూ కూర్చోమని, అదే సాధన అని సలహా ఇచ్చారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
చాతర్వర్ణ్య ()
Telugu original

చాతర్వర్ణ్య : నాలుగు వర్ణాలు. బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులు. త్రిగుణాల కలగాపులగం వల్ల స్వాధ్యాయాది కర్మలవల్ల ఇవి ఏర్పడ్డాయని చెబుతారు. 'గుణకర్మ విభాగశః' అని గీతావచనం. సత్వం ప్రబలమై రజస్సు తగ్గితే బ్రాహ్మణుడు. రజస్సు అధికమై సత్వం తక్కువైతే క్షత్రియుడు. రజస్సు ప్రబలమై తమస్సు బలహీనమైతే వైశ్యుడు. తమస్సు ప్రబలమై రజస్సు తగ్గిపోతే శూద్రుడు. కాగా ఆధ్యాత్మికంగా దీనికి మరొకలాగ అర్థం చెప్పుకోవచ్చు. మన శరీరంలో మనస్సే బ్రాహ్మణుడు. ప్రాణం క్షత్రియుడు. ఇంద్రియాలు వైశ్యుడు. శరీరం శూద్రుడు. దీనిని బట్టి క్రింది నుంచి మీదికి ప్రయాణం చేస్తూ పోతే శరీర దృష్టిని ఇంద్రియ దృష్టిలో, ఇంద్రియ దృష్టిని ప్రాణదృష్టిలో, ప్రాణదృష్టిని మనోదృష్టిలో లయం చేసుకుని చివరకు మనస్సుకు కూడా అతీతమైన ఆత్మదృష్టిని అలవరచుకోవటమే ఇందులో ఇమిడి ఉన్న అంతరార్థమని మనం గ్రహించవలసి ఉంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
చాతురాశ్రమ్య ()
Telugu original

చాతురాశ్రమ్య : నాలుగు ఆశ్రమాలని అర్థం. బ్రహ్మచర్యం. గార్హస్థ్యం. వానప్రస్థం. సన్యాసం. ఇవి కూడా ఆధ్యాత్మికంగా చూస్తే బాల్య యౌవన వార్థక్య అవసానాలేనని మనకు స్ఫురిస్తుంది. ఇదంతా అంతకంతకూ మన అద్వైత సాధనకు తోడ్పడే వ్యవహారం.

Vedānta Paribhāṣā Vivaraṇa
చాతుర్మాస్య ()
Telugu original

చాతుర్మాస్య : ఆషాఢం నుంచి ఆశ్వయుజం వరకు శ్రీమన్నారాయణుడు క్షీర సాగరంలో యోగనిద్ర పోయే సమయం. ఈ నాలుగు మాసాలు గురుపరంపరలో ఆదిగురువైన నారాయణుడికి విశ్రాంతి సమయం గనుక లోకంలో సన్యాసాశ్రమం స్వీకరించిన గురువులందరూ సంచారం చేయకుండా ఒకచోట స్థిరంగా ఉండి బ్రహ్మవిచారం సాగించవలసి ఉంటుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
చాంద్రాయణవ్రత ()
Telugu original

చాంద్రాయణవ్రత : చంద్రుని గమనాన్నిబట్టి భోజన నియమం కలిగి ఉండడం. శుక్లపక్షంలో పాడ్యమి నుండి పూర్ణిమ వరకు ఒక్కొక్క ముద్ద ఎక్కిస్తూ మరల కృష్ణపక్షంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకూ తగ్గిస్తూ పోవటం. పోతే ఆధ్యాత్మికంగా తగ్గించవలసినది పదిహేను కళలు. ఎక్కించవలసినది వాటికి అనులోమంగా మానసిక శక్తులు. మనస్సులో ప్రాపంచికమైన భావాలు ప్రతిలోమమైతే పారమార్థికమైనవి అనులోమం. ఈ పదిహేనూ అంతకంతకూ వదులుకుంటూ వీటి బదులు ఆ పదిహేనింటినీ అలవరచుకోవలసి ఉందని దీని అంతరార్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
చార్వాక ()
Telugu original

చార్వాక : ఇది ఒక నాస్తిక దర్శనం. Atheism. Materialism. లోకాయత దర్శనమని దీని అసలు పేరు. బృహస్పతి దీనికి మూలపురుషుడు. కనుక దీనిని బార్హస్పతమని కూడా పేర్కొంటారు. వీరికి దేహమే ఆత్మ. అంతకుమించి ఆత్మలేదు. సుఖమే స్వర్గం. దుఃఖమే నరకం. మరణమే మోక్షం. జీవుడు లేదు. జన్మాంతరాలు లేవు. లోకమంతా వ్యాపించింది గనుక ఇది లోకాయత మతమైంది. చారువాక అందరికీ ఆకర్షకమైన మాటలు కాబట్టి చార్వాక దర్శనమయింది. పాశ్చాత్య దేశంలో Epicurus అనేవాడు ఈ చార్వాకుడికి సహాధ్యాయుడే. అతని మతం కూడా ఇలాంటి నాస్తిక మతమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
చికీర్షా/చికీర్షిత ()
Telugu original

చికీర్షా/చికీర్షిత : చేయగోరటం. చేయగోరిన విషయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
చిత్‌/చితిః ()
Telugu original

చిత్‌/చితిః : చైతన్యం Consciousness. Self awareness. స్ఫురణ. నేనున్నాననే భావం. ఇదే ఆత్మ. చైతన్యమే దాని స్వరూపం. ఆత్మచైతన్యమని పేర్కొనటం కొయ్యబొమ్మ అనటం లాంటిది. రెండూ ఒకటే వాస్తవంలో. అయినా వ్యావహారికంగా వచ్చిందీ మాట.

Vedānta Paribhāṣā Vivaraṇa
చిత్త ()
Telugu original

చిత్త : అంతఃకరణ చతుష్టయంలో మూడవది. సంవేదనాత్మకం చిత్తం. Feeling centre. ప్రత్యేకించి చెప్పకపోతే సామాన్యంగా మనస్సనే అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
చేతస్‌ ()
Telugu original

చేతస్‌: చేతన కలిగినది. మనస్సని అర్థం. జ్ఞానమని కూడా అర్థమే. 'సుచేతాః' అంటే మంచి జ్ఞానం కలవాడని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
చేతనా చేతన ()
Telugu original

చేతనా చేతన : ఇక్కడ చేతనమంటే ప్రాణమూ కావచ్చు. జ్ఞానమూ కావచ్చు. వేదాంతులు చేతనమంటే జ్ఞానమున్నదే అని పేర్కొంటారు. చేతనా చేతనములంటే జ్ఞానమున్నదీ లేనిదీ అని అర్థం చెప్పాలి Sencient and insencient.

Vedānta Paribhāṣā Vivaraṇa
చింతా ()
Telugu original

చింతా : ఆలోచన. ప్రస్తావన. విచారణ. Discussion. ధ్యానం Reflexion. Meditation.

Vedānta Paribhāṣā Vivaraṇa
చింత్య ()
Telugu original

చింత్య : మనస్సుతో ఆలోచించగలిగినది. Thinkable. ప్రపంచమంతా నామరూపాత్మకం గనుక చింత్యమే. నామరూప రహితమైనది గనుక ఆత్మ. ఇలా చింత్యం కాదు. అచింత్యమని వేదాంతుల మాట.

Vedānta Paribhāṣā Vivaraṇa
చీర్ణ ()
Telugu original

చీర్ణ : ఆచరించబడినది. చరితమని అర్థం. చేయబడినది. చీర్ణవ్రత అనగా వ్రతమును ఆచరించినవాడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
చైతన్య ()
Telugu original

చైతన్య : Consciousness. స్ఫూర్తి. స్ఫురణ. జ్ఞానం. అద్వైతుల మతంలో చైతన్యమంటే ప్రాణం కాదు. జ్ఞానం Awareness.

Vedānta Paribhāṣā Vivaraṇa
చితి/చేత్య ()
Telugu original

చితి/చేత్య : చితి అంటే చైతన్యం లేదా జ్ఞానం. ప్రకాశమని మరొకపేరు. ఆ ప్రకాశంలో ఏది ప్రకాశిస్తుందో అది చేత్యం. Object.

Vedānta Paribhāṣā Vivaraṇa
చోదనా ()
Telugu original

చోదనా : ప్రేరణ. పురమాయించటం. Goad. విధించటం. Enjoining. అలా చేయకు ఇలాగే చేయమని శాసించి చెప్పటం. విధి అని దీనికి పర్యాయపదం. 'చోదనా లక్షణః అర్థః ధర్మః' అని ధర్మ శబ్దానికి లక్షణం చెప్పారు. చోదన ప్రధానమైన దేదో అది ధర్మమట.

Vedānta Paribhāṣā Vivaraṇa
చోద్య ()
Telugu original

చోద్య : శాసించబడిన, విధించబడిన విషయం. ప్రశ్నించవలసినదని కూడా అర్థమే. To be questioned.

Vedānta Paribhāṣā Vivaraṇa
చ్యుత ()
Telugu original

చ్యుత : జారిపడినది. స్వరూప స్థితి నుంచి తొలగినది. ఇదే జీవభావం. తొలగలేదని గ్రహిస్తే అచ్యుత Unfallen. ఇదే ఈశ్వర భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఛత్రిన్యాయ ()
Telugu original

ఛత్రిన్యాయ : పదిమంది ఛత్రాలు ధరించి వెళుతుంటే అందులో ఒకడికి ఛత్రం లేకపోయినా అందరినీ కలిపి ఛత్రి అని పేర్కొటారు. అలాగే జీవేశ్వరులిద్దరూ శరీరంలో ఉండి కర్మఫలం అనుభవిస్తున్నారని చెప్పినా జీవుడేకాని ఈశ్వరుడు అనుభవించడం లేదు. లేకున్నా 'ఋతం పిబంతౌ సుకృతస్య లోకే.' ఇద్దరూ కర్మఫలం అనుభవిస్తున్నారని శాస్త్రంలో ఉన్నమాట. ఇది ఛత్రిన్యాయంగా తీసుకోమన్నారు వ్యాఖ్యాతలు. అంటే ఛత్రం లేనివాడికి కూడా ఛత్రి అని పేరు వచ్చినట్టు కర్మఫల మంటకపోయినా ఈశ్వరుణ్ణి కూడా జీవుడితో జతచేసి వర్ణించారని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఛత్రచ్ఛాయా ()
Telugu original

ఛత్రచ్ఛాయా : ఛత్రం తెరిచి పట్టుకుంటే దానిక్రింద ఛాయ కనపడుతుంది. అదే ముడిస్తే కనపడదు. అలాగే ఒక నిమిత్తముంటేనే దానివల్ల ఏర్పడుతుందొక నైమిత్తికం. నిమిత్తం లేకపోతే నైమిత్తికం లేదు. ఇప్పుడీ సంసారం అజ్ఞానమనే నిమిత్తం వల్లనే వచ్చి పడింది. అది తొలగిపోతే ఇది కూడా చెప్పకుండా శెలవు తీసుకుంటుంది అంటారు వేదాంతులు. దీనికోసం చెప్పిన ఉదాహరణమే ఛత్రచ్ఛాయ.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఛద్మన్‌ ()
Telugu original

ఛద్మన్‌: నెపం. మిష. మోసం. Pretext. Deceit.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఛందస్‌ ()
Telugu original

ఛందస్‌: వేదం. రహస్యాల నెన్నింటినో ఛాదనం చేసింది గనుక ఛందస్సు అని పేరు వచ్చిందట. మరలా అంతర్‌దృష్టితో చూచి మానవుడు దాన్ని గ్రహించవలసి ఉంటుంది. అనధికారులకు అందకుండా చేయటానికే ఇలా ఛాదనం చేయవలసి వచ్చింది మహర్షులు. ఛందో జ్ఞానం కలవాడెవడో వాడికి ఛాందసుడని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఛంద ()
Telugu original

ఛంద : కోరిక. స్వచ్ఛంద. తన ఇచ్ఛానుసారం అని అర్థం. Will.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఛల ()
Telugu original

ఛల : మోసం. కపటం. మరుగు. నెపం. Conceit guise.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఛాందోగ్య ()
Telugu original

ఛాందోగ్య : ఇది పది ఉపనిషత్తులలో తొమ్మిదవది. అష్టాధ్యాయీ అని దీనికి మరొక నామధేయం. ఇందులో ఎనిమిది అధ్యాయాలున్నాయి. మొదటి ఐదూ ఆయా విద్యలు లేదా ఉపాసనలను వర్ణిస్తాయి. ఆరు ఏడు ఎనిమిది మూడధ్యాయాలు పరవిద్య అయిన జ్ఞానాన్ని ప్రస్తావిస్తాయి. ఛందస్సును ఇలా గానం చేస్తూ పోయిన మహర్షులకు ఛందోగులని పేరు. వారి ప్రవచనం గనుక దీనికి ఛాందోగ్యమని పేరు సార్థకంగా ఏర్పడింది. తత్త్వమసి మహావాక్యం ఇందులోని ఆరవ అధ్యాయంలో వస్తుంది. తొమ్మిదిమార్లు ప్రశ్న వేశాడు శ్వేతకేతువు. తొమ్మిదింటికి తొమ్మిది సమాధానాలు చెప్పి అతనికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు ఉద్దాలకుడు. తత్త్వమసి మహావాక్యం తొమ్మిదిమార్లు వినిపిస్తుంది ఈ ఉపనిషత్తులో. బృహదారణ్యకం తరువాత పరిమాణంలో గుణంలో రెండింటిలో ఇది చాలా గొప్ప ఉపనిషత్తు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఛాయా ()
Telugu original

ఛాయా : నీడ. ఆభాస. కల్పన అని అర్థం. ప్రతిబింబమని కూడా అర్థమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఛాయాత్మా ()
Telugu original

ఛాయాత్మా : అసలైన ఆత్మకాక మానవుడి మనస్సులో ప్రతిఫలించిన దాని ఆభాస. దీనికే చిదాభాసుడని మరొకపేరు. ఆకాశంలో ఎగిరిపోయే పక్షి నీడ నేలమీద పడుతుంది. దానికున్నట్టే దీనికీ నామరూపక్రియలు కనిపిస్తుంటాయి. ఇది అది కాదు. అది వస్తువైతే ఇది ఆభాస. ఇది ఆభాస అయినా వస్తువును చూడటానికి తోడ్పడుతుంది. ఇదే మన నేత్రంలో ఉన్న పాప. దానినే చూచి అసలైన ఆత్మగా భావించాడు విరోచనుడు. ఇంద్రుడు మొదట అలా బ్రాంతిపడి కూడా తరువాత తరువాత ప్రజాపతి బోధనందుకుని ఇది ఛాయాత్మేనని గ్రహించి తద్ద్వారా అసలైన ఆత్మ దర్శనం చేయగలిగాడట.

Vedānta Paribhāṣā Vivaraṇa
()
Telugu original

చ : మరియు And. Also. అదేకాక ఇంకొకటి కూడా. 'జ్ఞానం విజ్ఞానం చ' అంటే జ్ఞానమే కాక విజ్ఞానం కూడా అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
జగత్‌ ()
Telugu original

జగత్‌: 'జాయతే ఇతి జం గచ్ఛతి ఇతి గం.' రెండూ కలిస్తే జగత్‌పుట్టేది పోయేది ఇలాంటి స్వభావం కలది. ప్రపంచమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
జఘన/జఘన్య ()
Telugu original

జఘన/జఘన్య : వెనుకభాగం. క్రిందిది. తగ్గురకమైనది. దిగువనున్నది. నికృష్టం. అధమం. 'జఘన్య గుణ వృత్తిస్థా అధో గచ్ఛంతి తామసాః' జఘన్య గుణం అంటే తమోగుణం కలిగినవారందరూ అథోలోకాలకు వెళ్లిపోతారని గీతా శ్లోకం.

Vedānta Paribhāṣā Vivaraṇa
జంగమ ()
Telugu original

జంగమ : స్థావరానికి వ్యతిరేక పదం. ఎప్పుడూ కదులుతూ పోయేదని శబ్దార్థం. Mobile.

Vedānta Paribhāṣā Vivaraṇa
జడ ()
Telugu original

జడ : చేతనం కానిది. ప్రాణం లేనిది. జ్ఞానం లేనిది. Inanimate. Insenscient.

Vedānta Paribhāṣā Vivaraṇa
జన్యజనక సంబంధ ()
Telugu original

జన్యజనక సంబంధ : పుట్టేది జన్యం. పుట్టించేది జనకం. ఈ రెండింటికీ ఉన్న సంబంధం. కార్యకారణ సంబంధమని మరొకమాట. The relation between cause and effect. ప్రపంచమంతా జన్యజనకాత్మకమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
జన/జనిమత్‌/జంతు ()
Telugu original

జన/జనిమత్‌/జంతు : మూడింటికీ అర్థమొకటే. జన్మించినది ప్రాణి. జీవం. The living being.

Vedānta Paribhāṣā Vivaraṇa
జన్మ/జని/జనుస్‌ ()
Telugu original

జన్మ/జని/జనుస్‌: జన్మ, పుట్టుక. Birth.

Vedānta Paribhāṣā Vivaraṇa
జరామరణ ()
Telugu original

జరామరణ : ముసలితనం. మరణం. ఇవి రెండూ స్థూల శరీర లక్షణాలు. Decay and Death. షడూర్ములలో ఇవి మొదటి రెండు.

Vedānta Paribhāṣā Vivaraṇa
జరాయుజ ()
Telugu original

జరాయుజ : జరాయువు అంటే గర్భకోశం. అందులోనుంచి జ పుట్టిన ప్రాణి. పశువులు మనుష్యులు ఇద్దరూ జరాయుజాల క్రిందికి వస్తారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
జప ()
Telugu original

జప : ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తూ పోవటం Chanting of a hymn.

Vedānta Paribhāṣā Vivaraṇa
జల్ప ()
Telugu original

జల్ప : ఏదో ఒకమాట గొణగటం. స్పష్టంగా వినపడకుండా మాటాడటం. వాగటమని కూడా అర్థమే. Chat.

Vedānta Paribhāṣā Vivaraṇa
జహద/జహ/ల్లక్షణ ()
Telugu original

జహద/జహ/ల్లక్షణ : ఒక అంశాన్ని వదిలేస్తూ మరొక అంశాన్ని పట్టుకునే లక్షణం. 'సోయం దేవదత్తః' అన్నప్పుడు వాడే ఈ దేవదత్తుడని వాక్యార్థం. ఇందులో అప్పుడు చూచిన వాడికి ఇప్పుడు చూచే దేవదత్తుడికి కాలక్రమంలో కొన్ని గుణాలు మారిపోయి కొన్ని అలాగే నిలిచి ఉంటాయి. మారినవాటిని మనం వదిలేయాలి. పోల్చుకోగల వాటిని పట్టుకోవాలి. అప్పుడిద్దరు కారు. దేవదత్తుడనేవాడు అప్పుడైనా ఇప్పుడైనా ఒకడేనని అనుభవానికి వస్తుంది. అలాగే తత్త్వమసి అన్నపుడు తత్‌పదార్థమైన పరమాత్మలో త్వం పదార్థమైన జీవాత్మలో పరిచ్ఛిన్నత్వం పరోక్షత్వం అనే విరుద్ధ ధర్మాలు మనస్సుకు తెచ్చుకోక చైతన్యమనే సామాన్య ధర్మాన్ని మాత్రమే పట్టుకుని ఇద్దరూ ఏకమనే జీవబ్రహ్మ ఐక్యాన్ని భావించటమే దీని ప్రయోజనం.

Vedānta Paribhāṣā Vivaraṇa
జాగ్రత్‌/జాగర/జాగరిత ()
Telugu original

జాగ్రత్‌/జాగర/జాగరిత : జాగ్రదవస్థ. మెలకువ. Wakeful state. అవస్థా త్రయంలో ఇది మొదటి దశ.

Vedānta Paribhāṣā Vivaraṇa
జాత ()
Telugu original

జాత : జన్మించినవాడు Born. సమూహమని కూడా ఒక అర్థముంది. వస్తుజాతమంటే వస్తు సమూహం.

Vedānta Paribhāṣā Vivaraṇa
జాతి ()
Telugu original

జాతి : జన్మ. Birth. పుట్టటం. వర్గం Class. మనుష్యజాతి. సామాన్యమని కూడా మరొక అర్థం. స్త్రలిదీతిరీ. జాతి వ్యక్తి అంటే సామాన్య విశేషాలు. గోత్వమనేది జాతి అయితే గోవనేది వ్యక్తి. ఒకటి Universal, మరొకటి Particular జీనస్‌ అండ్‌ స్పీసీస్‌ అని కూడా పేర్కొంటారు తార్కికులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
జామితా ()
Telugu original

జామితా : కలిసిపోవటం. మేళనం. జామి అంటే జత. జంట. దాని భావం జామితా. 'న మంత్రాణాం జామితా అస్తి.' మంత్రాలు దేనిపాటికవే ఒకే అర్థం చెబుతున్నా ఒకదానితో ఒకటి చేర్చి పట్టుకోరాదట. పునరుక్తి దోషం మంత్రాలకు లేదని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
జాయా ()
Telugu original

జాయా : భార్య. పురుషుడు మరలా రేతోరూపంగా స్త్రీ గర్భంలో ప్రవేశించి జన్మిస్తాడు గనుక అలాంటి జన్మకు హేతుభూతమైన భార్యకు జాయా అని పేరు వచ్చింది.

Vedānta Paribhāṣā Vivaraṇa
జాల ()
Telugu original

జాల : వల Net. కిటికీ Window సమూహం Group. అంతేగాక మోసం. కపటం. మాయ. Deceit అని కూడా అర్థమే. ఇంద్రజాలం. పరమాత్మ మాయాశక్తికి కూడా జాలమనే మాట వర్తిస్తుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
జ్యాయస్‌ ()
Telugu original

జ్యాయస్‌: రెండింటిలో పెద్దదైన దానికి జ్యాయస్‌అని పేరు. Bigger btween the two. 'జ్యాయాన్‌ఆకాశాత్‌.' ఆకాశం కంటే పెద్దది చిదాకాశం. అదే ఆత్మ స్వరూపం. ఇది జడమైతే అది చైతన్యగుణం కూడా అదనంగా ఉన్నది గనుక దీనికన్నా పెద్దదని తీర్మానం.

Vedānta Paribhāṣā Vivaraṇa
జ్యోతిస్‌ ()
Telugu original

జ్యోతిస్‌: వెలుగు. ప్రకాశం. జడ ప్రకాశమే కాదు. చైతన్యం కూడా. అదీ ప్రకాశమే. ప్రకాశమంటే ఇక్కడ అగ్నిలాగ సూర్యునిలాగ వెలుగుతూ పోవటం కాదు. స్ఫురించటం. ప్రతి ఒక్కటీ ఉందనే స్ఫురణ. The Awareness of oneself and the things around him. ఇది జడమైన జ్యోతికి లేదు. కనుకనే 'జ్యోతిషామపి తత్‌జ్యోతిః' అని చైతన్యాన్ని వర్ణించింది శాస్త్రం. అంతర్జ్యోతి అని కూడా The inner light దీనిని వర్ణిస్తారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
జిజ్ఞాసా ()
Telugu original

జిజ్ఞాసా : జ్ఞాతుమిచ్ఛా. తెలుసుకోవాలని కోరిక. బ్రహ్మ జిజ్ఞాసా. బ్రహ్మ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలనే తహతహ. Desire to explore the ultimate విచారణ అని కూడా పేర్కొనవచ్చు. Enquiry of the truth.

Vedānta Paribhāṣā Vivaraṇa
జిజ్ఞాసు ()
Telugu original

జిజ్ఞాసు : అలాంటి జిజ్ఞాస లేదా ఆసక్తి కల సాధకుడు. The aspirant. The enquirer.

Vedānta Paribhāṣā Vivaraṇa
జిన/జైన ()
Telugu original

జిన/జైన : జినుడంటే మహావీరుడు. అతడు స్థాపించిన మతం జైనం. దిగంబర దర్శనమని కూడా దీనికి నామాంతరం. ఈ మతంలోని తీర్థంకరులందరూ దిగంబరులే. సత్యం కేవలం నగ్నమైనదేననే భావాన్ని కలిగించటానికే ఈ వేషమని కొందరి వ్యాఖ్యానం.

Vedānta Paribhāṣā Vivaraṇa
జీవ/జీవాత్మ ()
Telugu original

జీవ/జీవాత్మ : ప్రాణం Life. ప్రాణమున్న పదార్థం కూడా. Living being. దేహం మేరకే పరిమితమై అదే నేనని తాదాత్మ్యం Identity చెందిన ఆత్మచైతన్యం. దీనికే జీవాత్మ అని పేరు. కర్తృత్వమూ భోక్తృత్వమూ దీని లక్షణాలు. చేసేవాడూ అనుభవించేవాడే జీవుడు. దీనికి విలక్షణమైన సాక్షి చైతన్యానికి పరమాత్మ అని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
జుగుప్పా ()
Telugu original

జుగుప్పా : గోప్తు మిచ్ఛా. దాచిపెట్టుకోవాలని కోరిక. ఒకటి నీకు అన్యమని అక్కర లేనిదని చూచినప్పుడే ఆ భావమేర్పడుతుంది. కనుక అసహ్యించుకోటమని కూడా ఈ మాటకు అర్థం వచ్చింది.

Vedānta Paribhāṣā Vivaraṇa
జీవన ()
Telugu original

జీవన : జీవుడు చేసే పని. జీవించటం. బ్రతకటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
జీవన్‌ముక్త ()
Telugu original

జీవన్‌ముక్త : శరీరమనే ఉపాధి ప్రారబ్ధం తీరేవరకు ఉండి తీరుతుంది. ఆ లోపుగా జ్ఞానోదయమైనవాడు జీవన్ముక్తుడు. అయినా ప్రారబ్ధం కొద్దీ శరీరమింకా వాడికి ఉంటుంది కనుక అది తీరేవరకూ వాడు జీవించవలసిందే. ఇలాగ ముక్తుడై కూడా జీవించేవాడికి జీవన్ముక్తుడని పేరు. అయినా శరీరాన్ని తనదిగా భావించ డతడు. పాము కుబుసంలాగ తనకు దూరంగా ఉన్నట్టే చూస్తుంటాడు. కనుక దేహమున్నా ముక్తుడే. ప్రారబ్ధం తీరితే ఈ జీవన్ముక్తేడే శరీర బంధం తొలగిపోయి విదేహ ముక్తుడౌతాడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
జైమిని ()
Telugu original

జైమిని : వ్యాసుని శిష్యులలో ఒకడు. ధర్మశాస్త్రకారుడు. పూర్వమీమాంసా ప్రవర్తకుడు. ధర్మమే పురుషార్థమని ఈయన వాదం. ఈశ్వరుడు లేడితనికి. దీనిని బట్టి చూస్తే ఇతడు వేదవ్యాసుని శిష్యుడు కాడు. చరిత్ర జ్ఞానం లేనివారు వీరిరువురికీ సంబంధం కలిపి ఉండవచ్చు. వాస్యునికి శిష్యుడైన జైమిని వేరు. ఈ జైమిని వేరు. ఇతడు మీమాంసా దర్శనకారుడైన ఒక శాస్త్రజ్ఞుడు మాత్రమే అని మనమర్థం చేసుకోవలసి ఉంది. దీనికి ఉపోద్బలకంగా ఒకమాట మనకు బ్రహ్మసూత్రాలలో కనిపిస్తుంది. జైమిని ఈ విధంగా చెప్పాడని తరచుగా బాదరాయణుడనే ఆచార్యుడు అతని పేరు ఉదాహరిస్తాడు. ఈ బాదరాయణుడు వ్యాసుడూ కాడు. అతడు ఉదాహరించిన జైమిని వ్యాస శిష్యుడైన జైమినీ కాడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
జ్ఞాతా ()
Telugu original

జ్ఞాతా : తెలుసుకొనేవాడు Knower.

Vedānta Paribhāṣā Vivaraṇa
జ్ఞాన ()
Telugu original

జ్ఞాన : తెలుసుకొనే సాధనం Instrument of Knowledge.

Vedānta Paribhāṣā Vivaraṇa
జ్ఞేయ ()
Telugu original

జ్ఞేయ : తెలుసుకోబడేది Known. Object of knowledge.

Vedānta Paribhāṣā Vivaraṇa
జ్ఞప్తి ()
Telugu original

జ్ఞప్తి : జ్ఞానంవల్ల కలిగే ఫలం. వీటినే ప్రమాతృ ప్రమేయ ప్రమాణ ప్రమితి అని కూడా పేర్కొంటారు. జ్ఞానమంటే ఇక్కడ లౌకిక జ్ఞానం Common Sense కాదు. శాస్త్రజ్ఞానం Scientific Sense కాదు. కళాజ్ఞానం Aesthetic sense కాదు. ధర్మ జ్ఞానమూ Religious sense కాదు. ఇవన్నీ విశేష జ్ఞానాలే. ఆయా నామరూపాలకు చెందిన జ్ఞానాలని అర్థం. పోతే వీటన్నింటిని వ్యాపించి తన స్వరూపంగా భావించే జ్ఞానమొకటి ఉన్నది. ఇవి విశేష జ్ఞానమైతే అది సామాన్య జ్ఞానం. ఇవి అనాత్మ జ్ఞానమైతే Objective అది ఆత్మజ్ఞానం. Subjective. ఇవి బంధానికి దారితీస్తే అది మోక్షాన్ని చేర్చే సాధనం. కనుక అలాంటి జ్ఞానమే ఇక్కడ జ్ఞానమని అర్థం చేసుకోవలసి ఉంది. దీనికి భిన్నమైన మన జ్ఞానాలన్నీ వాస్తవంలో జ్ఞానం కాదు. అజ్ఞానం క్రిందికే వస్తాయని ఉపనిషత్‌సిద్ధాంతం.

Vedānta Paribhāṣā Vivaraṇa
జ్ఞానీ ()
Telugu original

జ్ఞానీ : ఇలాంటి ఆత్మజ్ఞానం కలవాడు. బ్రహ్మజ్ఞానాన్ని సాధించిన వ్యక్తి.

Vedānta Paribhāṣā Vivaraṇa
()
Telugu original

జ : జన్మించినది. ఏర్పడినది. జగత్‌అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
త్వం ()
Telugu original

త్వం : నీవు అని అర్థం. అంటే అపరోక్షంగా మన అనుభవంలో ఉన్న జీవుడు లేదా జీవాత్మ.

Vedānta Paribhāṣā Vivaraṇa
తత్త్వమసి ()
Telugu original

తత్త్వమసి : తత్‌త్వం. అది నీవు. అసి ఒకటే అయి ఉన్నావు. Thou are that. జీవేశ్వరులనే పదార్థాలు రెండూ రెండు గావు. ఉపాధులలోనే తేడా. స్వరూపమైన చైతన్యంలో కాదని, ఉపాధులు కేవలమాభాసే గనుక ఆత్మజ్ఞానంతో వాటిని అందులో లయం చేసుకొని చూస్తే రెండూ కలిసి ఏకైకమైన తత్వమేనని వాక్యార్థం. ఇది ఛాందోగ్యోపనిషత్తులో వచ్చే ఒకానొక మహావాక్యం. ఉపదేశ వాక్యమంటారు దీనిని. శ్వేతకేతువనే తన కుమారుడికి తండ్రియైన ఉద్దాలకుడు చేసిన బోధ ఇది. జీవేశ్వరైక్యాన్ని స్పష్టంగా బోధిస్తుంది ఈ వాక్యం. దీని వాచ్యార్థం సృష్టి ప్రవేశాది వర్ణన అయితే లక్ష్యార్థం శుద్ధ చైతన్యరూపంగా ఇద్దరూ ఒకే ఒక అఖండ స్వరూపమని చెప్పటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
తత్త్వం ()
Telugu original

తత్త్వం : తస్యభావః తత్త్వం. ఆయా పదార్థాలకు ఎడబాయకుండా ఉన్న లక్షణం లేదా స్వభావమని అర్థం. జీవతత్త్వమంటే జీవుడి స్వభావం. ఈశ్వర తత్త్వ మంటే ఈశ్వరుడి స్వభావం. యాధాత్మ్యం. The real nature సతత్వమని కూడా దీనిని పేర్కొంటారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
తత్త్వజ్ఞాన ()
Telugu original

తత్త్వజ్ఞాన : మనం చూస్తూ ఉన్న ఈ ప్రపంచ స్వభావం ఏమిటో లోతుకు దిగి విచారణ చేస్తూ పోతే దాని ఫలితంగా ఏర్పడే యధార్థమైన జ్ఞానమేదో అది. ప్రపంచం ప్రస్తుతం మనకు నామరూపాత్మకంగా భాసిస్తున్నది. ఇది ఆపాతతః భాసించటమే గాని లోతుకుదిగి చూస్తే ఇది నామరూపాత్మకం కాదు. సచ్చిదాత్మకమైన పరమాత్మేనని, అదే మన అజ్ఞాన వశాత్తూ ఇలా రూపాంతరంలో భాసిస్తున్నదని తేలిపోతుంది. ఇలా తేల్చుకొనే జ్ఞానమే తత్త్వజ్ఞానం. ఇదే జీవిత పరమార్థానికి దారితీసే జ్ఞానం. దీనికి భిన్నమైనదంతా తత్త్వజ్ఞానం కాదు. మిథ్యా జ్ఞానమే False Notion.

Vedānta Paribhāṣā Vivaraṇa
తత్త్వశాస్త్ర ()
Telugu original

తత్త్వశాస్త్ర : అలాంటి తత్త్వాన్ని మనకు బోధించే ప్రమాణం ప్రత్యక్షం కాదు. అనుమానమూ కాదు. పోతే శాస్త్ర ప్రమాణమే ఇచ్చట మనకు ప్రమాణం. శాస్త్రమంటే సత్యమేదో దాన్ని శాసించి మనకు చెప్పేది. ఇది మానవుడు తన బుద్ధిబలంతో సృష్టించిన భౌతిక వైజ్ఞానిక శాస్త్రాలలాంటి శాస్త్రం కాదు. అవి కేవలం పౌరుషేయమైతే ఇది అపౌరుషేయం. Super human. ఒకానొకప్పుడు మహర్షులు సమాధి దశలో దర్శించిన సత్యమే శాస్త్రరూపంగా అవతరించింది. కనుక అదే మనకు మరలా అలాంటి అనుభవాన్ని ప్రసాదిస్తుంది. కనుక ఉపనిషత్తులే నిజమైన శాస్త్రం. తత్త్వాన్ని చెప్పేది గనుక తత్త్వశాస్త్రం. దీనికి ఆగమమని కూడా మరొక నామధేయం. The spiritual science. Meta Physics.

Vedānta Paribhāṣā Vivaraṇa
తత్త్వదర్శి ()
Telugu original

తత్త్వదర్శి : శాస్త్రం బోధించిన సద్గురువులు తన కుపదేశించిన అలాంటి తత్త్వాన్ని ఎవడు శ్రవణ మననాలతోనే గాక నిదిధ్యాసనా బలంతో అనుభవానికి తెచ్చుకోగలడో వాడికి తత్త్వదర్శి అని పేరు. తత్త్వాన్ని ముఖాముఖిగా దర్శించేవాడని అర్థం. దర్శించటమంటే తనకు వేరుగా ఒక దృశ్యాన్ని చూచినట్టు చూడటం కాదు. దాన్ని తన స్వరూపంగానే ఆకళించుకోటమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
తత్త్వాన్యత్వ ()
Telugu original

తత్త్వాన్యత్వ : తత్త్వమంటే అది. అన్యత్త్వమంటే అది కానిది. ప్రస్తుతం మనం చూచే ఈ ప్రపంచమంతా నామరూపాత్మకంగానే మనకు కనిపిస్తున్నది. ఇది కేవల మాభాసే. వాస్తవం కాదు. వాస్తవంలో ఇది సచ్చిద్రూపమే. అయినా అలా గోచరించటం లేదు. దాని దృష్ట్యా చూస్తే ఇది తత్త్వమే. అలాకాక ఇప్పుడున్నట్టుగా చూస్తే అన్యత్వమే. ఇంతకూ తత్త్వమా అన్యమా ఏదీ నిర్ణయించలేము. కనుక ఒక్కమాటలో చెబితే అనిర్వచనీయ Inexplicable మన్నారు దీన్ని. తత్త్వాన్యత్వాభ్యాం అనిర్వచనీయే నామరూపే అని భాష్యవచనం.

Vedānta Paribhāṣā Vivaraṇa
తద్జ్ఞ ()
Telugu original

తద్జ్ఞ : తత్‌అంటే అది. పరమార్థమని భావం. జ్ఞ అంటే గుర్తించిన వాడు పరమార్థం ఏమిటో దానిని చక్కగా గ్రహించినవాడని అర్థం. అంతేకాదు. ఏ విషయమైనా ఉన్నదున్నట్టు గ్రహిస్తే వాడికి తద్జ్ఞుడనే పేరు. దానివాడని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
తద్గుణ సంవిజ్ఞాన ()
Telugu original

తద్గుణ సంవిజ్ఞాన : దాని గుణాలతోసహా దాన్ని ఫలానా అని గుర్తించి పట్టుకోవటమని అర్థం. సృష్టి స్థితి లయాలనేవి ప్రపంచానికి గుణం. దీనిద్వారా ప్రపంచాన్నే గాక దీనికి మూలకారణమైన ఈశ్వరుణ్ణికూడా గుర్తించవచ్చు. దీన్ని ముఖ్యార్థంలో Primary అయితే దాన్ని లక్ష్యార్థంలో.

Vedānta Paribhāṣā Vivaraṇa
తద్గుణసార ()
Telugu original

తద్గుణసార : ఆత్మచైతన్యం వాస్తవంలో ఈ శరీరాది ఉపాధులమేరకే లేదు. దీనితో దాని కేలాటి సంబంధం లేదు. అయినా మానవుడి బుద్ధిలో వచ్చి ఆ చైతన్యం కర్మవశాత్తూ ప్రవేశించింది. అప్పటి నుండీ దీని గుణాలే దానికి సంక్రమించి కర్తృత్వ భోక్తృత్వాలకు లోనై కూచుంది. తద్గుణ అంటే బుద్ధి గుణాలు. అదే సారం. అంటే ఆత్మకు స్వభావమై పోయింది. కనుకనే తద్గుణ సారమని దాన్ని పేర్కొనటం. సారమంటే ప్రమాణమని కూడా ఒక అర్థం. మరల ఈ గుణాలనే ఆధారం చేసుకొని తన స్వస్వరూపమేదో దాన్ని వెతుక్కుంటూ పోవటానికి కూడా ఈ బుద్ధే దోహదం చేస్తుంది. కనుక అది ఒక విధంగా కీడైతే మరొకవిధంగా మేలని భావించవచ్చు.

Vedānta Paribhāṣā Vivaraṇa
తంత్ర ()
Telugu original

తంత్ర : శాస్త్రమని అర్థం. శైవ వైష్ణవాది ఆగమాలు కూడా. పూర్వ మీమాంస అని కూడా అర్థమే. క్రియారూపంగా సాగేదేదో అది తంత్రం. అంతేకాదు అధీనమని కూడా అర్థముంది. స్వతంత్ర - తనమీద తాను ఆధారపడడం. పరతంత్ర - ఇతరుల మీద ఆధారపడడం. ప్రధానమని కూడా అర్థమే. అతంత్రమంటే అప్రధానమని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
తదేకదృష్టి / తదేకధ్యాన ()
Telugu original

తదేకదృష్టి / తదేకధ్యాన : ఒక లక్ష్యంమీద మాత్రమే దృష్టి పెట్టుకుని మరి దేనినీ మనసుకు రానీయక కూచుంటే దానికి తదేకదృష్టి లేదా తదేక ధ్యానమని పేరు. యోగాభ్యాసం కాని జ్ఞానాభ్యాసం కాని చేసే ప్రతి సాధకుడికి ఇది చాలా ముఖ్యం. మనసుతోనే గదా ఏదైనా సాధించవలసింది. ఆ మనసు ఏకంగాక అనేక విధాలుగా పరిగెడితే లక్ష్యాన్ని సాధించలేడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
తప్యతాపకభావ ()
Telugu original

తప్యతాపకభావ : ఇది సాంఖ్యుల పరిభాష. తపింపబడేది తప్యం. దాన్ని తపింపజేసేది తాపకం. రజ స్తమో గుణాత్మకమైన భావాలన్నీ మనస్సును తపింప జేసేవే. పోతే దానివల్ల తాపమనుభవించేది సత్త్వగుణాత్మకమైన బుద్ధి. అదే తప్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
తపస్‌ ()
Telugu original

తపస్‌: తపించటం. Penance. ఒక లక్ష్యంమీద మనస్సు నిలిపి అలాగే కూచుని పోవటం. అద్వైతంలో ఇది క్రియారూపం కాదు. జ్ఞాన రూపం. 'యస్య జ్ఞానమయం తపః' పరమాత్మ సృష్టిని గూర్చి చేసే ఆలోచన. 'స తపో తప్యత. స తపః తప్త్వా ఇదం సర్వ మసృజత.' బ్రహ్మాండమైన ఆలోచనచేసి ఒక ప్రణాళిక వేసుకొని పరమాత్మ ఈ ప్రపంచాన్ని సృష్టించాడట. మరలా ఈ జీవుడు కూడా దానికి ప్రతిలోమంగా అలాంటి ఆలోచనే చేసి దీన్ని లయం చేసుకొని తన స్వరూప స్థితిని అందుకోవలసి ఉంది. మనం చేయవలసిన తపస్సు ఇదే.

Vedānta Paribhāṣā Vivaraṇa
తథ్య ()
Telugu original

తథ్య : వాస్తవం. యథార్థం. ఎలా ఉండాలో అలా ఉందని అక్షరార్థం. తథాత్త్వమే తథ్యం. దీనికి వ్యతిరేక పదం మిథ్య.

Vedānta Paribhāṣā Vivaraṇa
తన్మయ ()
Telugu original

తన్మయ : ఒకదానితో ఏకమై పోవటం. Identify. తాదాత్మ్యం చెందటం. లౌకికంగా అయితే అది బంధానికి పారలౌకికంగా మోక్షానికి దారితీసే లక్షణం.

Vedānta Paribhāṣā Vivaraṇa
తాపత్రయ ()
Telugu original

తాపత్రయ : మూడు తాపాలని అర్థం. ఆ మూడేవో గావు. ఆధ్యాత్మిక మొకటి. ఆధివ్యాధులు. ఆధిభౌతికమొకటి. చోర వ్యాఘ్రాదులు. ఆధి దైవిక మొకటి. అతివృష్టి అనావృష్టీ ఉత్పాతాదులూ. సంసారమంతా ఈ మూడింటితోనే నిండిపోయింది. తాపత్రాయాత్మకమే మానవ జీవితం. దీనికి విరుగుడు అధ్యాత్మ జ్ఞానమే. కనుకనే శాంతి పాఠంలో మూడుసార్లు శాంతి శబ్దాన్ని ఉచ్చరించటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
తమస్‌ ()
Telugu original

తమస్‌: సత్వరజస్తమో గుణాలలో మూడవది. మొద్దులాగ పడి ఉండే లక్షణం. జడత్వం. మనస్సు సత్వమైతే ప్రాణం రజస్సయితే శరీరం తమోగుణాత్మకం. చీకటి అని కూడా అర్థమే. అజ్ఞానమని లాక్షణికమైన అర్థం. 'తమసోమా జ్యోతిర్గమయ.' అజ్ఞాన దశ నుంచి జ్ఞాన జ్యోతివైపు తీసుకెళ్ళమని ప్రార్ధన.

Vedānta Paribhāṣā Vivaraṇa
త్యాగ ()
Telugu original

త్యాగ : త్యజించటం. వదలుకోవటమని అర్థం. ఏదైనా ఒక పాత్రుని చూచి మంచి వస్తువతనికి దానం చేస్తే అది త్యాగం. అంతేగాక కర్మఫలాన్ని తన కక్కరలేదని నిష్కామంగా కర్మ ఆచరిస్తూ ఫలంమీద దృష్టి లేకపోతే అది కూడా త్యాగమే. అంతేగాక ఈ సంసారాన్ని నామరూపాత్మకంగా వదిలేస్తూ ఈశ్వరాత్మకంగా దర్శిస్తూ పోతే అదే అసలైన త్యాగం. 'త్యజితైవ హి తత్‌జ్ఞేయం.' త్యజించేవాడే దాన్ని అందుకోగలడు అని శాస్త్రం మనకు బోధిస్తున్నది.

Vedānta Paribhāṣā Vivaraṇa
తిరోధాన ()
Telugu original

తిరోధాన : మాయమై పోవటం. అంతర్థానమై పోవటం అని అర్థం. ప్రస్తుతం మానవుడి దృష్టికి పరమాత్మ తత్త్వం తిరోధానమైంది. దీనికి కారణం అనాది నుండి అంటి పట్టుకుని వస్తున్న అతని అజ్ఞానమే. దీనినే తాంత్రికులు మహాశక్తి పంచకృత్యాలలో నాలుగవదని వర్ణిస్తారు. తిరోధానమనే ముఖంతో ఆవిడ మానవుడి బుద్ధిని కప్పివేస్తున్నదట. నిరంతర ధ్యానం కలిగి ఉంటే మరలా అనుగ్రహమనే ముఖంతో దాన్ని విప్పివేసి బ్రహ్మజ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుందట.

Vedānta Paribhāṣā Vivaraṇa
తిరస్కార ()
Telugu original

తిరస్కార : కప్పివేయటం. కనపడకుండా చేయటం. నిది ధ్యాసనలో కూచున్న అద్వైత సాధకుడికి సజాతీయమైన ఆత్మభావన ఏర్పడుతుంటే మంచిదే. కానీ తరచుగా విజాతీయమైన అనాత్మ వృత్తులు వచ్చి దానిమీద దాడిచేసి కనపడకుండా మరుగు పరుస్తాయి. అలాంటప్పుడు దానికి తిరస్కరణమని పేరు. ఎప్పటికప్పుడు ఆత్మభావన ఏమరకుండా చేస్తే అది మరలా తిరస్కృతమై ఆత్మ నిష్ఠలోనే కూచోగలడు. మొత్తంమీద విజాతీయ భావములచేత అతిరస్కృతమైన సజాతీయ భావననే సాగిస్తూ పోవాలని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
తిర్యక్‌ ()
Telugu original

తిర్యక్‌: అడ్డంగా ఉన్న వెన్నెముక కలిగినదని అర్థం. మానవుడికి వెన్నెముక నిటారుగా ఉంటుంది. వాడు సమ్యక్‌. పోతే పశువులకు మృగాలకు అలా ఉండదు. కొన్ని సరీసృపాలకు పక్షులకు కూడా ఉండదు. అక్కడ అది అడ్డంగానే సాగిపోతుంది. కనుక జంతు జాలానికి తిర్యక్కులని పేరు వచ్చింది.

Vedānta Paribhāṣā Vivaraṇa
తరణ ()
Telugu original

తరణ : దాటిపోవటం. సంసార సాగరాన్ని దాటి బయట పడటమని వేదాంతార్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
తీర్ణ ()
Telugu original

తీర్ణ : అలా దాటి బయటపడ్డ సిద్ధపురుషుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
తీర్థంకర ()
Telugu original

తీర్థంకర : తీర్థమంటే శాస్త్రమని అర్థమిక్కడ. అలా శాస్త్రాన్ని సృష్టించిన వాడు తీర్థంకరుడు. శాస్త్రకారుడని అర్థం Scientist. ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన దార్శనికుడు. A Prophet.

Vedānta Paribhāṣā Vivaraṇa
తర్క ()
Telugu original

తర్క : ఆలోచన. ఊహ. Inference. విచారణ Enquiry. హేతువాదం. Reasoning న్యాయవైశేషికాలు రెండూ కలిసి తర్కశాస్త్రం. Indian Logic అని ప్రసిద్ధి. ఇది తత్త్వజ్ఞానానికి ఉపకరణం Means కావాలిగాని అపహరణం కాగూడదని వేదాంతుల హెచ్చరిక.

Vedānta Paribhāṣā Vivaraṇa
తార్కిక ()
Telugu original

తార్కిక : హేతువాది Logician. Dilecticion.

Vedānta Paribhāṣā Vivaraṇa
తత్పర/తాత్పర్య ()
Telugu original

తత్పర/తాత్పర్య : ఒకదాని మీదనే దృష్టి ఉన్నవాడు అదే పరాయణంగా అదే లోకంగా బతికేవాడు తత్పరుడు. పోతే వాడికున్న అలాంటి దృష్టి తాత్పర్యం. దేన్ని గూర్చి చెబుతున్నామో దానిమీదనే నిలిపిన దృష్టి. అంతేగాక ఒక మాటలో దాగియున్న అభిప్రాయం కూడా తాత్పర్యమే. Import అంతరార్థమని భావం. మోక్షమార్గంలో జీవిత లక్ష్యమైన బ్రహ్మతత్త్వంమీద ఇలాంటి తాత్పర్యం ఉండాలి సాధకుడికి. 'తత్పరః సంయతేంద్రియః' అని గీతా వచనం.

Vedānta Paribhāṣā Vivaraṇa
తాత్పర్యలింగ ()
Telugu original

తాత్పర్యలింగ : పెద్దలు ప్రతిపాదించిన విషయం అన్నివిధాల సరియైనదే. ఏ మాత్రమూ దోషం లేదని నిరూపించటానికి ఆరు నిదర్శనలున్నాయి. వాటికే లింగమని పేరు. ఉపక్రమోప సంహారాలు ఒకటి. అభ్యాసము రెండు. అపూర్వత్వము మూడు. ఫలం నాలుగు. అర్ధవాదమైదు. ఉపపత్తి ఆరు. తత్త్వమసి లాంటి మహావాక్యార్థాన్ని జీవబ్రహ్మైక్య వరంగా నిర్ణయించేటపుడు ఈ ఆరింటిని అన్వయించి చూపుతారు శాస్త్రజ్ఞులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
తాత్త్విక ()
Telugu original

తాత్త్విక : తత్త్వమనేదేమిటో చక్కగా తెలిసినవాడు. The knower of the truth. అసలు విషయం గుర్తించినవాడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
తాదాత్మ్య ()
Telugu original

తాదాత్మ్య : 'తదాత్మనో భావః.' అదే తన స్వరూపమని భావించటం. దానితో మమేకమై పోవటం. Total Identity. కార్యకారణాలకు అద్వైతులు చెప్పే సంబంధమిదే. కారణం కంటే దాని కార్యం అన్యంగా లేదు. అదే మరోరూపంలో కనిపిస్తున్నదని చెప్పే సంబంధం. వస్తువుకు వస్తువుకు గాక వస్తువుకు దాని ఆభాసకూ ఉన్న సంబంధం. సంబంధంకాని సంబంధమిది. అంతేకాదు. ఆత్మచైతన్యం మానవశరీరంలో ప్రవేశించి దీనితో ఏకమై పోవటం కూడా తాదాత్మ్యమే. ఇదే సంసార బంధానికి మూల కారణం. మరలా పరమాత్మతో తాదాత్మ్యం చెందగలిగితే అది సాయుజ్యానికి తోడ్పడగలదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
తాదర్థ్య ()
Telugu original

తాదర్థ్య : తదర్థమంటే ఒక ప్రయోజనం కోసమేర్పడింది. దాని భావం తాదర్థ్యం. అదే ప్రయోజనంగా కలిగి ఉండటమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
తారతమ్య ()
Telugu original

తారతమ్య : తరతమ భావం. ఒకదానికన్నా ఒకటి అధికమనే భావం. పరంపర. పారంపర్యమని కూడా అనవచ్చు. ఉత్తరోత్తర ఉత్కర్ష. Gradation in quality or in position.

Vedānta Paribhāṣā Vivaraṇa
తీవ్రవేగ ()
Telugu original

తీవ్రవేగ : సాధన మార్గంలో బాగా పట్టుదల కలవాడు. తీవ్రవేగానాం ఆసన్న తమః అన్నాడు పతంజలి. మంద మధ్యమ తీవ్రములని వేగంలో మూడు భూమికలున్నాయి. వేగమంటే ఇక్కడ అభ్యాసంలో ఉన్న పట్టుదల. లేదా తీవ్రత. అది మందంగా సాగితే ఫలితమంత త్వరగా రాదు. మధ్యమంగా అయితే అంత ఎక్కువ విలంబం లేదు. తీవ్రమైతే మాత్రం వెంటనే ఫలితం లభించే అవకాశం ఉంది. ఆసన్నతమ అంటే దగ్గరికి రావటం. Nearest.

Vedānta Paribhāṣā Vivaraṇa
తుచ్ఛ ()
Telugu original

తుచ్ఛ : నీచమని ఒక అర్థం. శూన్యమని ఖాళీ అని కూడా అర్థమే. Empty or void జగత్తుచ్ఛమంటే నామరూపాత్మకంగా ఇది లేదని అసత్‌అని అర్థం. అంటే దానిపాటికది లేదని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
తుర్య/తురీయ ()
Telugu original

తుర్య/తురీయ : చతుర్య చతురీయ అనే మాటలలో మొదటి వర్ణమైన చ కారం లోపించి ఈ రెండు మాటలు ఏర్పడ్డాయంటారు భాషాకోవిదులు. నాలుగవదని అర్థం. జాగ్రత్‌స్వప్న సుషుప్తులు మూడూ దాటిపోయిన తర్వాత కలిగేది గనుక ఇది నాలుగవది. ఏదోకాదు సమాధి దశ. Fourth Dimension. ఇదంతా దృష్టితో కాక అహంతా దృష్టితో చూస్తే అవస్థాత్రయం కూడా వాస్తవంలో తురీయమే. ఆ మాటకు వస్తే తురీయమే అసలున్నదశ. అదే అజ్ఞానవశాత్తూ మనకు అవస్థాత్రయంగా భాసిస్తున్న దంటారు అద్వైతులు. జ్ఞానోదయమైతే అవస్థాత్రయమే మరలా తురీయంగా మన అనుభవానికి రాగలదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
తూష్ణీంభావ ()
Telugu original

తూష్ణీంభావ : Silence. ఊరక ఉండటం. మౌనం. నిర్విశేషమైన చితి. బ్రహ్మ భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
తూలావిద్యా ()
Telugu original

తూలావిద్యా : మూలంకానిది తూలం. కారణం మూలమైతే కార్యం తూలం. కారణరూపమైన అవిద్య మొదటిది. దానివల్ల ఏర్పడిన కార్య ప్రపంచం రెండవది. తూలాన్నిబట్టి మూలాన్ని అన్వేషించాలి మనం. అప్పుడది అన్వేషించేవాడి స్వరూపంగా మారిపోతుంది. కాబట్టి అవిద్యే కాదు. విద్యా స్వరూపమైన బ్రహ్మమే. ఆత్మచైతన్యమే. ఆవరణం మూలావిద్య అయితే విక్షేపం తూలావిద్య అని పరిభాష.

Vedānta Paribhāṣā Vivaraṇa
త్రయీ ()
Telugu original

త్రయీ : ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఈ మూడింటికీ త్రయీ Trio అని పేరు. అధర్వ వేదమిక్కడ కంఠోక్తిగా చెప్పలేదు. కారణం ఈ మూడు వేదాలలోని విషయమే క్రోడీకరించి మరోరూపంలో బయట పెడుతుంది ఆ వేదం. అందువల్ల దానికి ప్రత్యేకమైన స్థితి లేదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
త్రిక ()
Telugu original

త్రిక : మూడు పదార్థాల సమాహారం. పశు పాశ పశుపతి ఈ మూడింటి స్వరూప సంబంధాలు చెబుతుంది కాబట్టి శైవాగమానికి త్రికమని త్రికశాస్త్రమని పేరు వచ్చింది.

Vedānta Paribhāṣā Vivaraṇa
త్రికరణ ()
Telugu original

త్రికరణ : కరణమంటే ఇంద్రియం. పనిచేయటానికి సాధనం. Instrument of Action. ఇది మూడు విధాలు. ఒకటి మనస్సు. దీనికే అంతఃకరణమని పేరు. The inner organ. రెండు వాక్కు. Speech. మూడు కాయం. Body. ఈ మూడింటివల్లనే ప్రతి పనీ సాగిపోతున్నది. ఇందులో త్రికరణ శుద్ధిగా చేస్తే సత్ఫలిత మిస్తుంది కర్మ. కాకుంటే దుష్ఫలితానికి తయారై ఉండవలసిందే. మూడింటిలో ఏకైకమైన తత్త్వాన్నే మనసుతో ధ్యానిస్తూ అదే నోట ఉచ్చరిస్తూ ఆ దృష్టితోనే శరీర వ్యాపారం సాగిస్తూ పోవటమే అద్వైత సాధకుడు చేయవలసిన సాధన. అదే మోక్షమనే గమ్యాన్ని ఎప్పటికైనా చేర్చగలదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
త్రిదివ ()
Telugu original

త్రిదివ : మూడవదైన లోకం. త్రివిష్టపమని కూడా అనవచ్చు. మొదటిది పృథివి. రెండవది అంతరిక్షం. మూడవది ద్యులోకం. ద్యు దివు అంటే దీపించేది ప్రకాశించేది అని అర్థం. అంతరిక్షం పైన జ్యోతిర్మండలంచేత అక్కడి ప్రాంతమంతా ప్రకాశిస్తుంది కనుక త్రిదివమని దానికి పేరు వచ్చింది స్వర్గమని కూడా వ్యవహరిస్తారు దీన్ని.

Vedānta Paribhāṣā Vivaraṇa
త్రిపుర/త్రిపురసుందరి ()
Telugu original

త్రిపుర/త్రిపురసుందరి : మూడు పురాలు అవి త్రిగుణాలు కావచ్చు. అవస్థాత్రయం కావచ్చు. స్థూల సూక్ష్మ కారణాలనే మూడు శరీరాలు కావచ్చు. పృథివ్యాదులైన మూడు లోకాలు కావచ్చు. మొత్తానికి అన్నీ త్రిపురాలే. చిచ్ఛక్తితో పూర్తిగా నిండిపోయినవే. ఈ మూడింటిలో ఎదురులేకుండా విహరించే చిచ్ఛక్తి స్వరూపిణి అయిన దేవి త్రిపుర సుందరి.

Vedānta Paribhāṣā Vivaraṇa
త్రిదండ ()
Telugu original

త్రిదండ : మూడు మొనలున్న దండం. సన్యాసులు ధరించేది. అంతరార్థం చెబితే మనోవాక్కాయ వ్యాపారాలను మూడింటినీ దమించటం. అదుపులో పెట్టుకోవటం అని పేర్కొనవచ్చు. ఈ భావానికి బాహ్యమైన సంకేతమే ఈ త్రిదండం. దీనిలో పైన కనిపించే రెండు పాయలు రజ స్తమో గుణాలైతే వాటిని తనలో ఇముడ్చుకున్న సత్వగుణమే క్రింద నిలువుగా కనిపించే కర్ర.

Vedānta Paribhāṣā Vivaraṇa
త్రివర్ణ/త్రైవర్ణిక ()
Telugu original

త్రివర్ణ/త్రైవర్ణిక : మూడు వర్ణాలు. బ్రహ్మ క్షత్రియ వైశ్యులవరకు. పోతే వీరి ముగ్గురికీ సంబంధించిన కలాపమంతా త్రైవర్ణికం.

Vedānta Paribhāṣā Vivaraṇa
త్రికాల/త్రైకాలిక ()
Telugu original

త్రికాల/త్రైకాలిక : మూడు కాలాలు. భూత భవిష్యత్‌వర్తమానాలు. మూడు కాలాలలో ఏకరూపగా నిలిచి ఉండేది ఆత్మ. అదే త్రైకాలిక సత్యం. అలాకాక ఎప్పటికప్పుడు మారిపోయేది అనాత్మ ప్రపంచం. పరిణామ సత్యమంటారు దీన్ని. దీనికి విలక్షణంగా ముందు చెప్పినది కూటస్థ సత్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
త్య్రంబక ()
Telugu original

త్య్రంబక : పరమేశ్వరుడు మూడు అంబకములు అంటే నేత్రములు కలవాడు. త్రిలోచనుడు అని అర్థం. లాక్షణికంగా ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులే మూడు అంబకాలు. త్రిగుణాలే మూడు అంబకాలు. తద్ద్వారా నడుపుతున్నాడు ఈ ప్రపంచాన్ని పరమాత్మ. నేత్రమంటే నయనం చేసేదే గదా. నయనమంటే నడపటమే. సూర్యచంద్రాగ్నులు కూడా ఆయన అంబకాలే.

Vedānta Paribhāṣā Vivaraṇa
త్రేతాగ్ని ()
Telugu original

త్రేతాగ్ని : మూడగ్నులని అర్థం. గార్హపత్యం దక్షిణాగ్ని ఆహవనీయం ఈ మూడింటికి త్రేతాగ్నులని పేరు. గృహమంటే శరీరం. దాన్ని పాతి కాపాడేది గార్హపత్యం. జఠరాగ్ని. అది పనిచేసి అన్నం జీర్ణమైతే మరలా ఆకలవుతుంది. అప్పుడాహారం మరలా వచ్చి నోట్లో పడాలి. ఆహవనమంటే ఆహుతి పడడం. అది దేనిలో పడుతుందో అది ఆహవనీయం. ముఖంలో ఉండే ఉష్ణత్వం. ఇదే ఆహవనీయాగ్ని. అది జీర్ణమై రక్తంలో రసరూపంగా ప్రవేశించి ఆ రక్తం కలుషితమైనది గుండెకు వచ్చి పరిశుద్ధమై దాని దక్షిణ ద్వారంనుంచి ప్రసరించి శరీరమంతటా వ్యాపిస్తుంది. అలా వ్యాపింపచేసే అగ్ని దక్షిణాగ్ని. ఆధ్యాత్మికంగా చెబితే ఇది దీని అర్థం. ఆధి భౌతికంగా చెప్పుకునే త్రేతాగ్నులు వీటికి బాహ్యమైన సంకేతమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
తేజస్‌ ()
Telugu original

తేజస్‌: పంచభూతాలలో ఆకాశం తరువాత వాయువు. వాయువు తరువాత వచ్చేది తేజస్సు అనే భూతం. అగ్నితత్త్వమిది. దీని గుణం రూపం. దీనినుండి వచ్చినదే అప్‌ లేదా జలం.

Vedānta Paribhāṣā Vivaraṇa
తైజస ()
Telugu original

తైజస : తేజస్సు ప్రధానమైన జీవుడు. తేజస్సంటే ప్రకాశించే స్ఫురించే స్వభావం. అదే మనస్సు. మనస్సులోనే వచ్చి ప్రవేశించింది జీవచైతన్యం. జాగ్రదవస్థలో దీనికి విశ్వుడని పేరు. స్వప్నావస్థలో తైజసుడని పేరు. సుషుప్తిలో ప్రాజ్ఞుడని పేరు. స్వప్నావస్థలో ఉన్న తైజసుడే అసలైన జీవుడు. పంచేంద్రియా లక్కడ పనిచేయవు. సుషుప్తిలో మనసే లయమవుతుంది. పోతే ఇంద్రియ వ్యాపారాలాగిపోయినా మనో వ్యాపారంతో ఉన్నవాడే స్వప్నంలో ఉన్న ఈ తైజసుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
తైత్తిరీయ ()
Telugu original

తైత్తిరీయ : దశోపనిషత్తులలో ఒకటి. మూడు వల్లులున్నాయి ఇందులో. రెండవది ఆనంద వల్లి. జీవుని ఆరోహణావరోహణాలను అద్భుతంగా వివరించింది. పోతే మూడవది భృగువల్లి ఆరోహణ ప్రయోగాత్మకంగా నిరూపించింది.

Vedānta Paribhāṣā Vivaraṇa
తేజో-బన్న ()
Telugu original

తేజో-బన్న : తేజస్సు అప్‌అన్నం అంటే అగ్ని జలం పృథివి అనే భూతాలు. ఇవి సూక్ష్మరూపంగా అవ్యక్తంగా ఉన్న దశలో తేజో-బన్నాలు. అవే పంచీకృతమై స్థూలరూపం ధరిస్తే భౌతికమైన అగ్నిజలము పృథివిగా మారిపోతాయి. సృష్టి అంతా తేజో-బన్నాత్మకంగా మొదలైందని ఛాందోగ్యం చెబుతున్నది. తైత్తిరీయం అలాకాక ఆకాశ వాయు అనంతరమే ఈ మూడూ ఏర్పడ్డాయని చెబుతున్నది. రెండింటికీ వైరుధ్యం లేదు. మొదటి రెండు భూతాలు ఏర్పడ్డ తర్వాతనే ఇవి మూడూ వచ్చాయని సమన్వయించుకోవచ్చు. అది పంచీకరణమైతే ఇది త్రివృత్కరణం. ఛాందోగ్యం త్రివృత్కరణం చెబుతున్నది. గనుక తేజో-బన్నాలనే మూలభూతంగా పేర్కొన్నది. తేజస్సు ఎర్రని రంగు. అప్‌ తెలుపు. అన్నం నలుపు. ఈ మూడు రంగులూ వేదాంతులు భూతసూక్ష్మాలకు చెబితే సాంఖ్యులు సత్వరజరస్తమో గుణాలకు చెబుతూ వచ్చారు. ఇది కాదని త్రోసిపుచ్చారు అద్వైతులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
తటస్థ ()
Telugu original

తటస్థ : తటంమీద ఉన్నవాడు. తటమంటే తీరం. Bank of a river. మధ్యస్థుడు. ఉదాసీనుడు అని అర్థం. స్వరూపమని, తటస్థమని లక్షణం రెండు విధాలు. ఒక పదార్థాన్ని సాక్షాత్తుగా ఫలానా అని వర్ణిస్తే స్వరూప లక్షణం. అలాకాక దాని కార్యం ద్వారా సూచిస్తే తటస్థ లక్షణం. పరమాత్మకు ఇవి రెండూ వర్తిస్తాయి. సచ్చిద్రూపుడని చెబితే స్వరూపం. నామరూప క్రియలకు అధిష్ఠానమేదో అది అని చెబితే తటస్థం. సృష్టి ప్రవేశాదుల వర్ణన అంతా ఇదే.

Vedānta Paribhāṣā Vivaraṇa
దక్షిణామూర్తి ()
Telugu original

దక్షిణామూర్తి : అర్ధనారీశ్వర విగ్రహంలో దక్షిణ భాగంలో ఉన్న రూపం పరమేశ్వరుడు. జ్ఞానస్వరూపమైన పరమాత్మ. 'జ్ఞాన శక్త్యవతారాయ దక్షిణామూర్తయే నమః.' వటవృక్షం క్రింద దక్షిణాభిముఖంగా కూచుని మహర్షులకు ఉపదేశించాడు గనుక దక్షిణామూర్తి అని పేరు వచ్చిందని కూడా పేర్కొంటారు. దీనికి వ్యతిరిక్తమైనది వామ. ఆవిడ ఆయన అర్ధాంగి అయిన మాయాశక్తి. ఆయన జ్ఞానశక్తి అయితే ఆవిడ క్రియాశక్తి. రెండూ కలిస్తే సృష్టి. అమ్మవారికి కూడా దక్షిణామూర్తి అని ఒక నామముంది. అప్పుడు శివశక్తులు రెంటికీ భేదం లేదని మనం గ్రహించవలసి ఉంటుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
దత్తాత్రేయ ()
Telugu original

దత్తాత్రేయ : అత్రిమహర్షికి దత్తమైన వాడు. త్రిమూర్తులు ముగ్గురూ కలిసి అనసూయ కిచ్చిన మాటను బట్టి వారే అత్రికి దత్తమైనారట. కనుకనే దత్తాత్రేయునికి మూడు ముఖాలు కనిపిస్తాయి. ఆయన దగ్గరున్న నాలుగు శునకాలూ ఏవో కావు. నాలుగు వేదాలే. వెనకాల ఉన్న గోవు బ్రహ్మజ్ఞానమే. అవధూత సార్వభౌముడీ దత్తాత్రేయుడు. పరశురామునికి, కార్తవీర్యార్జునుడికీ ఇలాంటి యోగసాధకులందరికీ ఉపదేశమిచ్చిన మహనీయుడు. వైదిక తాంత్రిక విద్యా ప్రవర్తకుడు. చంద్రుడికి దుర్వాసుడికీ సహోదరుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
దండ/దండి ()
Telugu original

దండ/దండి : దండమంటే ఇంద్రియ మనోదమనం. Control over inner and outer organs. అది గలవాడు దండి. దండనం చేసేవాడని అర్ధం. సన్యాసి. త్రిదండి అని కూడా అతనికే నామధేయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
దమ/దమన/దమయంతీ ()
Telugu original

దమ/దమన/దమయంతీ : బాహ్యేంద్రియ నిగ్రహం. అంతరింద్రియ నిగ్రహమైతే అది శమం. శమదమాలంటే అంతర్బహిరింద్రియ నిగ్రహమని అర్థం. శమాది షట్కంలో దమమనేది రెండవది. అది చేస్తూ ఉండడం దమనం. అలాగే సృష్టినంతా దమనం చేసే ఒక మహాశక్తి ఉంది. ఆ మహాశక్తికే దమయంతి అనిపేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
దంభ ()
Telugu original

దంభ : మోసం. నెపం. మిష Deceit. లోపల ఒకవిధంగా ఉంటూ పైకి మరొక విధంగా కనిపించటం. లేనిపోని డచ్చాలు కొడుతూ పోవడం. అసుర గుణాలలో ఇది ఒకటి. ఆత్మజ్ఞానానికి ప్రతిబంధకం.

Vedānta Paribhāṣā Vivaraṇa
దర్శన ()
Telugu original

దర్శన : దృష్టి చూపు. మతం School of thought, శాస్త్రం Science, సాక్షాత్కారం Revelation, అనుభవం అని అర్థం. ఆత్మదర్శనమంటే ఆత్మానుభవమే. ఒక్కొక్క మతాచార్యుడు తన దృష్టి కనుగుణంగా ఒక్కొక్క శాస్త్రాన్ని ప్రవర్తింపజేశాడు. అవి ఆరు. వాటికే షడ్దర్శనాలని పేరు. న్యాయం. వైశేషికం. సాంఖ్యం. యోగం. పూర్వమీమాంస. ఉత్తర మీమాంస. శ్రవణమనన నిదిధ్యాసనలు అభ్యాసమైతే వాటి ఫలితంగా ఏర్పడేది దర్శనమన్నారు అద్వైతులు. అంటే తత్త్వసాక్షాత్కారమని అభిప్రాయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
దశా ()
Telugu original

దశా : జాగ్రదాదులైన అవస్థలు States భూమికలు Stages.

Vedānta Paribhāṣā Vivaraṇa
దశమ ()
Telugu original

దశమ : పదియవవాడు. పరమానందయ్య శిష్యులలో ఏరుదాటి పోయిన తరువాత ఒకడు కనపడలేదు. వాస్తవంలో పదిమందీ ఉన్నారు. కానీ తన్ను మరచిపోయి మిగతా వాళ్ళను లెక్కపెడుతూ పదవవాడు పోయాడని ఏడుస్తూ కూచున్నారు. అప్పుడెవరో దారిన పోతూ అక్కడికి వచ్చి విషయం తెలుసుకుని పదిమందినీ లెక్కించి చూపాడట. ఇప్పుడా పదవవాడు పోలేదు. కొత్తగా రాలేదు. అక్కడే ఉన్నా అజ్ఞానంవల్ల కనపడలేదు. జ్ఞానోదయమైతే కనిపించాడు. అలాగే ఆత్మస్వరూపం కూడా పరాపర ప్రకృతులు తొమ్మిదింటినీ చూస్తున్నంత వరకూ మనం దర్శించలేము. వాటిని కాదనుకుని పక్కకు త్రోసి చూచినప్పుడే గోచరిస్తుంది దశమమైన మన ఆత్మస్వరూపం. ఈ సత్యాన్ని గుర్తించటానికి ఇది ఒక చక్కని దృష్టాంతం. దశమ స్త్వమసి. తత్త్వమసి. నీవే పదియవ వాడవు. నీవే ఆత్మవని గుర్తుచేసే మహావాక్యమిది. దీనివల్ల పరోక్షంగా జూచిన పదవవాడిని అపరోక్షంగా తానేనని గుర్తించగలడు మానవుడు. అలాగే పరోక్షంగా ఎక్కడో ఉన్నదని భావించే ఆత్మను తన స్వరూపమే నని అపరోక్షంగా చూడగలడు సాధకుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
దహర/దభ్ర ()
Telugu original

దహర/దభ్ర : చిన్నది. అల్పమైనది. దహరాకాశం అంటే స్వల్పమైన ఖాళీ. Limited space. ఎక్కడ ఉందది. హృదయంలో. ఆ మేరకే పరిమితమై కనిపిస్తుంది మన జ్ఞానం కానీ అది ఆ మేరకే లేదు. ఆకాశంలాగా సర్వత్రా వ్యాపించి ఉంది. హృదయం కేవలం దానికొక ఉపాధి. Medium. ఈ ఉపాధిలో అది వ్యక్తమై Manifest కనిపిస్తుంది. దీనినిబట్టి దాని మహత్త్వాన్ని మనం గ్రహించవచ్చు. ఇది దహరాకాశ మయితే అది మహాకాశం లాంటిది. దహరానికి మరోపేరు దభ్రం. Small. Limited. Congested అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
దేహ ()
Telugu original

దేహ : శరీరమని అర్థం. 'దేగ్ధి లింపతి.' ఏదయితే పూసినట్టు కప్పినట్టు కనిపిస్తుందో అది దేహం. మన ఆత్మచైతన్యాన్ని చుట్టూ కప్పివేసి దాన్ని తన భౌతిక గుణాలతో పులిమి పుచ్చుతున్నది. కనుక దేహమనే పేరు దీనికి సార్థకంగా పెట్టారు. ఇదే మన చైతన్యానికి ఉపాధి Limit. స్థూలమని సూక్ష్మమని కారణమని ఇది మూడు రూపాలు. మూడింటినీ తానుగా భావించకపోతే వాడు సదేహ ముక్తుడు. అది కూడా ప్రారబ్ధం దీరి రాలిపోతే విదేహ ముక్తుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
దేశిక ()
Telugu original

దేశిక : 'దిశతీతి దేశికః.' దిశ్‌ అంటే To Direct మార్గం చూపటమని అర్థం. దేశికుడంటే అలా మార్గం చూపేవాడు. మార్గమంటే ఇక్కడ మోక్షమార్గం Demonstrator of the spiritual path.

Vedānta Paribhāṣā Vivaraṇa
దేశ ()
Telugu original

దేశ : Space. ఆకాశమని అర్థం. నామరూపాలు ఎక్కడ కాపురముంటాయో అది దేశం. వాటికి ఇది అధిష్ఠానం.

Vedānta Paribhāṣā Vivaraṇa
దేవ/దేవతా/దివ్య ()
Telugu original

దేవ/దేవతా/దివ్య : 'దీవ్యతీతి దేవః.' ఏది ఎక్కువగా ప్రకాశిస్తూ పోతుందో అది దేవ. Luminous Body. అదే దేవత కూడా. ప్రకృతి శక్తులని అర్థం. అమూర్తమైతే శక్తి. మూర్తమైతే వ్యక్తి. వ్యక్తమైన దానికి భూతమని పేరు. Formed. దానిలో చేరి అంతర్గతంగా ఉన్న శక్తికే దేవ లేదా దేవతా అని పేరు. భూతం Matter అయితే దేవత అనేది దానిని వ్యాపించిన శక్తే Energy. సూర్యమండలం భూతం. దానిలో ఉన్న ఉష్ణ శక్తి దేవత. దేవతకు చెందినదే దివ్యం. Divine. దేవ అంటే ప్రకాశించే లక్షణమున్నవి చక్షురాదులైన ఇంద్రియ వర్గమని కూడా అర్థమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
దీక్షా ()
Telugu original

దీక్షా : ఒక వ్రతం. నియమం Principle, పట్టుదల Perceivarance. సద్గురువైన వాడు యోగ్యుడైన శిష్యుడికి ప్రసాదించే అనుభవ జ్ఞానం. 'దీయతే క్షీయతే ఇతి దీక్షా.' ఏది గురువు ఇస్తాడో, దేనివల్ల శిష్యుడి కర్మ పక్వమై క్షీణిస్తుందో అది దీక్ష. Initiation అని దీనినే పేర్కొంటారు. ఇది అనుభవానికి తిన్నగా తీసుకువెళ్ళే విధానం. దృగ్దీక్షా, మంత్ర దీక్షా, సర్వాంగ దీక్షా అని ఇందులో చాలా భూమికలున్నాయి. శ్రీరాముడు హనుమంతుడికి ఈ మూడూ ప్రసాదించాడు. నుకనే అతడు జీవన్ముక్తుడై ఇప్పటికీ నిలిచి ఉన్నాడని ప్రతీతి.

Vedānta Paribhāṣā Vivaraṇa
దూషణ ()
Telugu original

దూషణ : పరమత ఖండనం. దానిలో ఉన్న దోషాలన్నీ బయటపెట్టి అది పనికిరాదని త్రోసిపుచ్చటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
దృక్‌/దృష్టి ()
Telugu original

దృక్‌/దృష్టి : చూపు. అది కంటి చూపైనా కావచ్చు. మనోదృష్టి అయినా కావచ్చు. మనోదృష్టి మరలా రెండు విధాలు. ప్రాపంచికం. పారమార్థికం. ప్రాపంచికం విశేష దృష్టి. పారమార్థికమైతే సామాన్య దృష్టి. సాక్షిభావం. ఆత్మచైతన్యమే దానికి లక్ష్యం. ఆత్మదృష్టి అంటే ఆత్మజ్ఞానమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
దృశ్య ()
Telugu original

దృశ్య : దానికి గోచరించే నామరూపాలన్నీ దృశ్యం. యద్దృశ్యం తన్నశ్యం అన్నారు పెద్దలు. మనం చూచేదంతా నశించేదే. నశించనిది దృశ్యం కాదు. అదృశ్యం ఆత్మ స్వరూపమెప్పుడూ అదృశ్యమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
దృగ్‌ద్దృశ్య వివేక ()
Telugu original

దృగ్‌ద్దృశ్య వివేక : ఇలాంటి దృశ్యం నుంచి అదృశ్యమైన దృక్‌ను వేరు చేసుకునే విధానమే వివేకమంటే. వివేచనకే Discrimination వివేకమని పేరు. దృశ్యలక్షణాలకు విలక్షణంగా దృగ్రూపమైన ఆత్మను వేరు చేసి పట్టుకోవటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
దేహళీదత్తదీప ()
Telugu original

దేహళీదత్తదీప : దేహళి అంటే కడప. కడప మీద పెట్టిన దీపమని అర్థం. అలాటిది మనస్సులోని బ్రహ్మాకార వృత్తి. ఆ దీపం లోపల వెలపల చీకటిని ఒకేమారు పోగొడుతుంది. ఈ వృత్తి కూడా ఆత్మను అనాత్మను రెండింటినీ ఆవరించిన చీకటిని అజ్ఞానాన్ని త్రోసిపుచ్చుతుంది. అప్పుడు సామాన్య రూపంగా రెండూ కలిసి ఒకే ఒక ఆత్మ అని గుర్తించగలం. విశేషంగానే తేడా. సామాన్యమైతే తేడా లేదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
దైవాసుర ()
Telugu original

దైవాసుర : దేవతలు రాక్షసులు. ఎక్కడో లేరు వీరు. మనలోనే మన మనస్సులో కలిగే శిష్టదుష్ట భావాలు. మొదటిది ఆత్మదర్శనానికైతే రెండవది అనాత్మ జగత్తుకు దారితీస్తుంది. మొదటిది సత్త్వగుణాత్మకమైతే రెండవది రజస్తమో గుణాత్మకం.

Vedānta Paribhāṣā Vivaraṇa
దోష ()
Telugu original

దోష : లోపం. Defect. తర్కంలో దోషమంటే హేత్వాభాస. Fallacy. సరియైన హేతువాదానికి నిలవని లక్షణం. ఇలాంటి దోషాలేవీ లేనిదే సత్యం. ఏ మాత్రమున్నా అది అనృతం. 'నిర్దోషం హి సమం బ్రహ్మ.' ఆత్మస్వరూపం నిర్దోషం. నామరూపాది కల్మషం ఏదీ లేదందులో. దానికి భిన్నంగా ప్రపంచమంతా దోషభూయిష్ఠమే. సత్వరజ స్తమో గుణాలు మూడూ దోషాలే. గుణాతీతమైనదే నిర్దోషం. అది ఆత్మచైతన్యమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ద్యౌః/దివి/దివం ()
Telugu original

ద్యౌః/దివి/దివం : పృథివీ అంతరిక్షం ద్యౌః ఇవి మూడూ భూమికలు. మొదటి భూమికలో మనమున్నాము. దీనిపైది అంతరిక్షం. దానిపై నున్నది ద్యౌః. అదే దివి. దివం. త్రిదివమని కూడా అంటారు దాన్ని. మూడింటిలో మూడవదని అర్థం. అదే ఆకాశం. సూర్యమండలానికి అతీతం. దానికే స్వర్గమని కూడా నామాంతరం. The celestial region.

Vedānta Paribhāṣā Vivaraṇa
ద్రవ్య ()
Telugu original

ద్రవ్య : తార్కికులు పేర్కొనే సప్త పదార్థాలలో మొదటిది. Substance. ఏడు పదార్థాలు లేవు. ద్రవ్యమొక్కటే పదార్థం. దానికి సంబంధించినవే గుణకర్మ సామాన్య విశేష సమవాయ అభావాలనే మిగతా ఆరూ అని సిద్ధాంతం చేశారద్వైతులు. ఆ ద్రవ్యం కూడా భౌతికమే. చైతన్యానికి విషయమే. Object to consciousness. అజ్ఞానంవల్ల దానికి వేరుగా భాసిస్తున్నది. దాని జ్ఞానమేర్పడితే అందులోనే ఇది కరిగిపోతుంది. అప్పుడంతా ఆత్మస్వరూపమే. అనాత్మ లేనేలేదు. అలా కరిగే స్వభావమున్నందు వల్లనే 'ద్రవతీతి ద్రవ్యం' అని పేరు వచ్చింది అంటారు వారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ద్వంద్వ ()
Telugu original

ద్వంద్వ : రెండు. జత. జంట. సప్రతిపక్షాలివి. Opposites to each other. సుఖదుఃఖాలు, జనన మరణాలు ఇలాంటివి. ఇవే సంసారమంతా. వీటిని దాటిపోతే నిర్ద్వంద్వం లేదా అద్వంద్వం. Absolute. అదే సాయుజ్యం. కైవల్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ద్వయ ()
Telugu original

ద్వయ : ద్వంద్వానికి పర్యాయం. రెండనే భావం. ద్వైతమన్నా ఇదే. ఇది కానిది. అద్వయం. అద్వైతమని అర్థం. అనాత్మ అంతా ద్వయమైతే ఆత్మ అద్వయం. అద్వయమైన ఆత్మే ద్వయమయి కనిపిస్తున్నదని వేదాంతుల మాట. అదే ఈ సంసారం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ద్వైత ()
Telugu original

ద్వైత : ద్వి+ఇత. ద్వీత. ద్వీతమే ద్వైతం. రెండుగా మారి కనిపిస్తున్నది అని అర్థం. అద్వైతం తప్ప మిగతా మతాలన్నీ ద్వైతమతాలే. Dualism. జీవ జగదీశ్వరులకు భేదం చెప్పేవే. మూడింటికీ ఆత్మ స్వరూపంగా అభేదం చెబుతుంది గనుక ఒక్క వేదాంతమే అద్వైత మతం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ద్వార ()
Telugu original

ద్వార : ప్రవేశ నిర్గమాల కవకాశమిచ్చేది Gateway for entrance and exit. వేదాంతంలో ప్రమాణమని, అవకాశమని, మార్గమని అర్థం. పట్టుకునే ఆధారం. ఆలంబనం. ఉపాయం. Support or Aid. అది లేకుంటే గమ్యాన్ని చేరే మార్గంలేదు. అనుభవానికి తెచ్చుకునే మార్గమే ద్వారం. ప్రమాణమని కూడా దీనికి నామాంతరం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ద్వైరూప్య ()
Telugu original

ద్వైరూప్య : ద్విరూపస్య భావః. రెండు రూపాలు కలిగి ఉండడం. Dualism.

Vedānta Paribhāṣā Vivaraṇa
ధనః ()
Telugu original

ధనః : 'దధాతీతి ధనం.' ఏది కలదో, ఏది ఉన్నట్టు తోస్తున్నదో, ఏది పట్టుకుని ఉంటుందో అది. ప్రపంచమంతా ఈ దృష్టితో చూస్తే ధనమే. 'కస్యస్విద్ధనం.' ఆత్మకు చెందిన ధనమిది. ఆత్మధన్య లేదా ధనవా. ఆత్మస్వరూపమైతే ఈ అనాత్మ ప్రపంచం దాని విభూతి. అదే దాని ధనం. ఆత్మజ్ఞాని ఈ ధనాన్ని కోరనక్కరలేదు. కారణం ఇది అతని ఐశ్వర్యమే. అంటే తన స్వరూపమే విస్తరించి కనపడుతున్నది. కనుక కోర నక్కరలేదు. స్వరూపంగా అను సంధానం చేసుకుంటే సరిపోతుందని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ధర్మ ()
Telugu original

ధర్మ : 'ధారయతి ధార్యతే. ఇతి ధర్మః' ఏది జీవుడు ధరిస్తాడో అంటే నాది అనుకొని ఆచరిస్తాడో, ఆచరిస్తే ఏది వాడిని అదృష్టరూపంగా ధరించి ఉంటుందో అది ధర్మం. దేహపాతానంతరం మాసిపోకుండా లోకాంతర జన్మాంతరాలకు తీసుకెళ్ళి ఫలానుభవం ఇస్తుంది ఇది. అనుకూలమైతే ధర్మం. ప్రతికూలమైతే అధర్మం. విధిచోదితమైన కర్మ ధర్మం. లౌకికంగా చేస్తే కర్మ. శాస్త్రోక్తంగా చేస్తే ధర్మం. Duty enjoined by the scripture. ధర్మమంటే ఆయా పదార్థాలకుండే గుణాలని కూడా Properties అర్థమే. 'సర్వధర్మాన్‌పరిత్యజ్య' అంటే శాస్త్రోక్తమైన ధర్మాలే కాదు. ప్రపంచ ధర్మాలైన నామరూపాలను కూడా అని అర్థం. త్రిగుణాలు కూడా ధర్మాలే. సర్వధర్మాన్‌అంటే గుణత్రయాన్ని కూడా కాదని త్రోసిపుచ్చి నిర్గుణమైన మామేకం అంటే ఏకైకమైన ఆత్మతత్త్వాన్నే శరణం వ్రజ ఆశ్రయించమని సాధకుడికి గీత ఇచ్చే సలహా.

Vedānta Paribhāṣā Vivaraṇa
ధాతు ()
Telugu original

ధాతు : ధరించి ఉన్నది ఏదో అది. That which holds. శరీర ఇంద్రియ మనః ప్రాణాదులు అన్నీ ధాతువులే. ముఖ్యంగా మనస్సే ధాతువు. ధాతు ప్రసాదమంటే మనః ప్రసాదం. చిత్తశుద్ధి అని అర్థం. దానివల్లనే జ్ఞానోదయం మానవుడికి.

Vedānta Paribhāṣā Vivaraṇa
ధారణా ()
Telugu original

ధారణా : ధరించటం. 'దేశ బంధః చిత్తస్య ధారణా.' అని పతంజలి అన్నాడు. మనసు నొకా నొక లక్ష్యంమీద నిలపటం. అష్టాంగ యోగంలో ఇది ఆరవ భూమిక. దీని తరువాత ధ్యాన సమాధులనేవి రెండు భూమికలున్నాయి. ధారణ ధ్యానానికి, ధ్యానం సమాధికి దారితీసి యోగసిద్ధిని ప్రసాదిస్తాయి అని యోగుల నమ్మకం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ధారా ()
Telugu original

ధారా : ప్రవాహం. అవిచ్ఛిన్నంగా సాగిపోవటం. Current. Continuity. తైలధారలాగా ధ్యానం సాగాలంటారు. విజాతీయ భావం రాకుండా సజాతీయభావం నిలిచి ఉండటం. ధారావాహికమని కూడా పేర్కొంటారు. కత్తివాదరకు The edge of a knife కూడా ధార అని పేరు. క్షురస్య ధారా. అంత సూక్ష్మమైనది పదునైనదట మోక్షమార్గం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ధీః ధీర ధీమత్‌ ()
Telugu original

ధీః ధీర ధీమత్‌: ధీః అంటే నిశ్చయాత్మకమైన బుద్ధి. ఆత్మాకార వృత్తి. అది కలవాడు ధీరుడు. ధీమంతుడు. జ్ఞాని అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ధృతి / ధైర్య ()
Telugu original

ధృతి/ధైర్య : అలాంటి ధీరుడికున్న పట్టుదల. Perseiverance. 'ముంజాదివ ఇషీకాం ధైర్యేణ.' ఆకు మడచి దాని ఈనెపుల్లను ఇవతలికి లాగినట్టు శరీరం నుంచి ఆత్మతత్త్వాన్ని వేరుచేసి పట్టుకోవాలట. దీనికి ధైర్యం కావాలంటుంది ఉపనిషత్తు. ఆత్మానాత్మ వివేక సామర్థ్యమే వేదాంతంలో ధైర్యమనే మాటకర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ధ్వంస ()
Telugu original

ధ్వంస : నశించిపోవటం. Extinction. అభావాలు నాలుగింటిలో రెండవది. ప్రధ్వంసా భావమని కూడా పేర్కొంటారు. అంతకు ముందున్న పదార్థం లేకుండా పోవడమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ధ్యాన ()
Telugu original

ధ్యాన : Meditation. ఏకతానత అని వర్ణించారు యోగశాస్త్రంలో. ప్రత్యయైకతానతా ధ్యానం అని పతంజలి. ఒక భావాన్ని అలాగే ధారా వాహికంగా సాగిస్తూ పోవటం. అదే ఏకతానత. అదే ధ్యానం. సజాతీయ భావ ప్రవాహం. సంతాన కరణం అని దీనికే పేరు పెట్టారు అద్వైతులు. జ్ఞానాన్ని సంతానమంటే పొడిగిస్తూ పోవటమని భావం. అంటే ఆత్మాకార వృత్తిని అలాగే నిలుపుకోవటం అన్నమాట.

Vedānta Paribhāṣā Vivaraṇa
ధ్యాతృ ధ్యేయ ధ్యాన ()
Telugu original

ధ్యాతృ ధ్యేయ ధ్యాన : ధ్యానించేవాడు ధ్యాత. Meditator. అతడు దేన్ని ధ్యానిస్తున్నాడో అది ధ్యేయం. The Target. ఇరువురికీ మధ్య నడిచే వ్యవహారం. రెండు కొసలనూ కలిపే వంతెన లాంటిది ధ్యానం. The process.

Vedānta Paribhāṣā Vivaraṇa
దక్ష/దక్షిణ ()
Telugu original

దక్ష/దక్షిణ : సమర్థమైన Efficient. కుడివైపు Right. దక్షిణ దిక్కు.

Vedānta Paribhāṣā Vivaraṇa
నయ ()
Telugu original

నయ : కొనిపోవటం. To take away. న్యాయం. పద్ధతి. విధానం. Reason. Method.

Vedānta Paribhāṣā Vivaraṇa
నర ()
Telugu original

నర : 'న రీయతే. లీయతే. ఇతి నరః.' ఎవడు నశించడో వాడు జీవుడని అర్థం. జీవుడెప్పటికీ చావడు. కర్మఫలమనుభవిస్తూ ఉండవలసిందే. ఈ కర్మ అనేది ఎప్పుడూ చేయక తప్పదు. దానికి కారణం కామం. దానికి అవిద్య. అవిద్య తొలగిపోతేనే నరత్వం పోయేది. అప్పుడు నరుడుకాడు. వాడు నారాయణుడే. అప్పు డసలే మరణం లేదు వాడికి. కనుక వ్యావహారికంగా నరుడు బ్రతికే ఉంటాడు. పారమార్థికంగా నారాయణుడై బ్రతికే ఉంటాడు. ఇంతకూ మరణమనేది ఎప్పుడూ లేదని వేదాంతుల సిద్ధాంతం. మరణం లేదు వాడికి. కనుక వ్యావహారికంగా నరుడు బ్రతికే ఉంటాడు. పారమార్థికంగా నారాయణుడై బ్రతికే ఉంటాడు. ఇంతకూ మరణమనేది ఎప్పుడూ లేదని వేదాంతుల సిద్ధాంతం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నహి ()
Telugu original

నహి : హేతువు చూపి కాదని త్రోసిపుచ్చటం. ఇందులో హి అనేది హేతువును చెప్పే మాట. న అనేది నిరాకరించటం. కాదు కదా అని అర్థం. 'నహి సగుణో నిర్గుణశ్చ ఏక ఏవ ఆత్మా భవితు మర్హతి.' సగుణం నిర్గుణం రెండూ ఒకే కాలంలో ఒకే ఆత్మకు ఉండే లక్షణాలు కావుకదా.

Vedānta Paribhāṣā Vivaraṇa
నాక ()
Telugu original

నాక : కం అంటే సుఖం. అకం అంటే దుఃఖం. న అకం అంటే దుఃఖం కాదు సుఖమని మరల అర్థం వస్తుంది. రెండు వ్యతిరేకపదాలు ఒక అవ్యతిరిక్తమైన అర్థాన్నే బోధిస్తాయి. ఇంతకూ నాకమంటే దుఃఖంతో ఏ మాత్రమూ సంసర్గం లేని స్వర్గాది సుఖాలని అర్థం. నాకమంటే స్వర్గమే అని మీమాంసకుల వాదం కాదు బ్రహ్మానంద రూపమైన మోక్షమని వేదాంతుల నిర్ణయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నాళ/నాళీ/నాడీ ()
Telugu original

నాళ/నాళీ/నాడీ : గొట్టమని అర్థం. pipe. లోపల బోలు లేదా ఖాళీగా ఉన్న పొడవైన పదార్థం. మన శరీరంలో నాడులన్నీ ఇలాంటివే. 72వేల నాడులున్నాయని శాస్త్రజ్ఞుల మాట. రక్తం ప్రవహిస్తుంది వాటిలో లోపల ఖాళీగా ఉండడం మూలాన్నే రక్తప్రసరణకు అవకాశమేర్పడింది. వీటిలో ముఖ్యమైన నాడి సుషుమ్న. ఇడ పింగళ అనే రెండింటి నడుమ ఉంటుందది. దానిద్వారా ప్రాణశక్తిని పైకి తెచ్చి కపాలభేదం చేసుకొని వెళ్ళిపోతారట యోగులు, ఉపాసకులు. జ్ఞానులు మాత్రం అలా భౌతికంగా ప్రయాణం చేయరు. అసలు ప్రయాణమే లేదు వారికి. శరీరమిక్కడే పడిపోతుంది. శరీరమంటే స్థూలమేగాదు. సూక్ష్మము కారణము కూడా. కారణమంటే అవిద్యే కదా. అది బ్రహ్మవిద్యా బలంతో నిర్మూలమైంది. కనుక ప్రయాణం చేయటానికి ఉపాధే లేదు. ఉపాధులన్నీ ఆభాసే గనుక ఇక్కడే వస్తురూపమైన వాడి ఆత్మ చైతన్యంలోనే ప్రవిలయమై స్వరూపంగానే నిలిచిపోతాడు జ్ఞాని.

Vedānta Paribhāṣā Vivaraṇa
నాథ ()
Telugu original

నాథ : న+అథ. అథ అంటే దానికంటే న దిక్కులేదని అర్థం. అంటే నీవే తప్ప మరి దిక్కులేదనిపించుకునే వాడు. శరణ్యమని Refuse అర్థం. అలాంటి శరణ్యమేదీ లేనివాడు అనాథ.

Vedānta Paribhāṣā Vivaraṇa
నవా ()
Telugu original

నవా : ఇదేకాదు. మరొక పక్షంకూడా కుదరదని అర్థం. 'న సుఖం నవా శాంతిః' అన్నప్పుడు సుఖమే కాదు శాంతికూడా లేదని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నాంతరీయక ()
Telugu original

నాంతరీయక : అప్రయత్నంగానని అర్థం. Automatic. ఒకటి జరిగితే దానితో పాటు మరొకటి అప్రయత్నంగానే కలిసిరావటం. అవస్థాత్రయం పోతే చాలు. తురీయం అయత్నంగానే సిద్ధిస్తుంది. వేరే ప్రయత్నమక్కరలేదు. అది నాంతరీయకం. ఆంతరీయకమంటే దూరంగా ఉన్నది. మధ్యలో రావలసినది అని శబ్దార్థం. అలాకాక స్వభావ సిద్ధమైతే నాంతరీయకమని పేర్కొన్నారు బహుశా.

Vedānta Paribhāṣā Vivaraṇa
నాభి ()
Telugu original

నాభి : అరా ఇవ రథ నాభౌ. నాభి అనగా ఒక చక్రానికి మధ్యనుండే ఇరుసు లాంటిది. The hub of a wheel. చక్రంలోని కేంద్రస్థానం. Centre. మానవుడి నాభికూడా. Navel. అది కూడా శరీరానికి కేంద్రమే కదా.

Vedānta Paribhāṣā Vivaraṇa
నామ ()
Telugu original

నామ : నామరూపాలనే ద్వంద్వాలలో మొదటిది. నామమంటే పేరని మాత్రమే కాదు. మనస్సులో కలిగే ఆలోచన లేదా వృత్తి. Idea. అది చెప్పేదైతే దానిచేత చెప్పబడే బాహ్యమైన పదార్థం రూపం. Thing. వాచకం వాచ్యం అని కూడా వీటిని పేర్కొనవచ్చు. శబ్దం అర్థమని చెప్పినా చెప్పవచ్చు. The expression and the expressed. ఒక విధంగా నామమే జీవభావం. రూపమే జగద్భావం. ఇవి రెండూ సూక్ష్మమైతే నామరూపాలు. స్థూలమైతే జీవజగత్తులు. సూక్ష్మావస్థలో ఇవి ఈశ్వరుని ఉపాధులు. వీటిద్వారా ఈశ్వరుడు సృష్టి స్థితి లయాదులు చేయగలుగుతున్నాడు. ఇవి ఆయన చైతన్యం కంటే భిన్నమైనవి కావు. వాస్తవంలో దాని ఆభాసలే. కాని జీవుడు అలా చూడలేక సతమతమవుతున్నాడు. అంతవరకూ బంధం తప్పదు. ఎప్పుడు వీటిని ఆచైతన్యరూపమేనని భావిస్తాడో అప్పుడే బంధ విముక్తుడౌతాడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
నామ ()
Telugu original

నామ : ఇది మరి ఒక శబ్దం. ముందు చెప్పినది నామవాచకమైతే ఇది అవ్యయం. Indeclinable. అనగా అంటే అని దీని అర్థం. 'ఆత్మా నామ స్వరూపం.' ఆత్మ అంటే స్వరూపం. అర్థాత్‌అని కూడా దీనికొక పర్యాయపదముంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
నార ()
Telugu original

నార : నారమంటే జలం. పంచభూతాలలో ఇది నాలుగవది. దీని తరువాత చెప్పుకునే పృథివి ఐదవది. జలమనేది ఐదింటిలో ఒకటి అయినా ఐదింటికీ ఉపలక్షణంగా కూడా శాస్త్రజ్ఞులు భావిస్తారు. 'ఆపో నారా ఇతి ప్రోక్తాః' ఆపస్‌అన్నా నారమన్నా జలమే. 'నారావై నరసూనవః.' నరుడంటే జీవుడు. జీవసృష్టికి కారణం పంచభూతాలే కదా. నారమంటే ఇక్కడ భూతపంచకమనే అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నారాయణ ()
Telugu original

నారాయణ : నారములే అయనం అంటే నిలయం అయిన వాడెవడో ఆయన నారాయణుడు. పరమాత్మ పంచభూతాలనే తనకు అధిష్ఠానంగా చేసుకొని ఉన్నాడట. వాస్తవంలో ఇవి ఆయనకు కాదు. ఆయనే ఈ భూత పంచకానికి అధిష్ఠానం. ఇవి కేవలం ఆయనకు ఉపాధి మాత్రమే. అంటే అవ్యక్తమైన ఆ చైతన్యాన్ని వ్యక్తంచేసి చూపే ద్వారం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నాశ ()
Telugu original

నాశ : కనపడకుండా పోవటం. అభావం కాదు. అనుపలబ్ది. Absence. ఒకటి ఉన్నప్పటికీ అది నిష్ప్రయోజనమైతే దానిని నాశమనే పేర్కొనవచ్చు. ఉండి కూడా ఉపయోగం లేదని భావం. గీతలో 'బుద్ధి నాశాత్‌ప్రణశ్యతి' అని ఒక వాక్యముంది. బుద్ధి నష్టమైతే మానవుడు నశించిపోతాడు అని అర్థం. నశించి పోతాడంటే సర్వనాశనమై పోతాడని కాదు. పురుషార్థానికి యోగ్యుడు కాడని అర్థం చెప్పారు భాష్యకారులు. 'అనాశినో -ప్రమేయస్య' అని మరొకచోట ఉంది. ఇక్కడ నాశమంటే ఎప్పటికీ లేకుండా పోవటం. అలాంటిది ఆత్మకు లేదు. కారణం అది ప్రమేయం కాదు. ప్రమేయం కాకపోతే ఏదీ నశించదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
నాస్తి/నాస్తిక ()
Telugu original

నాస్తి/నాస్తిక : న+అస్తి అంటే లేదని అర్థం. వేదానికి ప్రామాణ్యం లేదన్నవాడు నాస్తికుడని మీమాంసకులు అంటారు. అసలు ఈశ్వరుడే లేడని వాదించేవాడు నాస్తికుడని వేదాంతులు అంటారు. మీమాంసకులు వేద ప్రామాణ్యాన్ని అంగీకరించినా ఈశ్వర సద్భావాన్ని అంగీకరించరు. కనుక వేదాంతుల దృష్టిలో మీమాంసకులు కూడా నాస్తికులే. Atheists.

Vedānta Paribhāṣā Vivaraṇa
నికాయ ()
Telugu original

నికాయ : సమూహం. Collection. శాస్త్రమైనా కావచ్చు. శరీరమైనా కావచ్చు. బౌద్ధుల గ్రంథాలకు నికాయాలని పేరు అంటే వారు చెప్పిన సూత్రాలు సుభాషితాలు అన్నీ కలిపి గుదిగ్రుచ్చి చేర్చిన గ్రంథాలని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నికేత ()
Telugu original

నికేత : స్థానం. ఆశ్రయం. సన్యాసి అయినవాడు పరివ్రాజకుడై ఉండాలి. అంటే ఒకచోట అని నియమం లేక దేశమంతా తిరుగుతుండాలి. ఒకచోట ఉంటే దానిమీద భ్రాంతి ఏర్పడే ప్రమాదముంది. కనుక అనికేతుడై ఉండాలి. అంటే గృహనివాసం లేనివాడని అర్థం. బాహ్యంగా నివాసం లేకపోయినా అంతరంలో మనస్సు స్థిరంగా ఉండాలి. కనుకనే 'అనికేతః స్థిరమతిః' అని గీత హెచ్చరిస్తున్నది.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిగమ ()
Telugu original

నిగమ : నిశ్చయమైన జ్ఞానమిచ్చేది అని అర్థం. ఇది ఏదోకాదు. వేదవాఙ్మయం. ఆగమమని కూడా దీనికొక పేరు. గురుశిష్య పరంపరగా వస్తున్న విద్య అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిగమన ()
Telugu original

నిగమన : శాస్త్రరీత్యా నిష్కర్ష చేసి చెప్పటానికి నిగమనమని పేరు. Conclusion. Judgement. తర్కశాస్త్రం చెప్పే పంచావయవ వాక్యంలో Syllogism అయిదవ అంశం. 'తస్మాత్‌తత్‌తథా.' అంచేత పర్వతంమీద వహ్ని ఉండి తీరుతుంది. అని ప్రతిజ్ఞాతమైన విషయాన్ని మరలా చాటి చెప్పటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిగ్రహ ()
Telugu original

నిగ్రహ : అనుగ్రహానికి వ్యతిరేకపదం. శిక్ష. దండన Punishment. వాదంలో ఎదటివారిలో లోపం వెదకి పట్టుకుని వారివాదాన్ని దూషించటం. నిగ్రహ స్థానమని పేరు దీనికి. నిగ్రహమంటే మరొక అర్థం ఇంద్రియాల మీద, మనుసుమీద మనకుండవలసిన అదుపు. Control.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిశ్చయ/నిర్ణయ ()
Telugu original

నిశ్చయ/నిర్ణయ : సమౌ నిర్ణయ నిశ్చయౌ అని నిఘంటువు చెబుతున్నది. ఇది ఇంతేనని తేల్చుకోవటం. అధ్యవసాయమని వ్యవసాయమని కూడా దీనికి పర్యాయపదాలు. దీనికి వ్యతిరిక్తమైనది సంశయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిజ ()
Telugu original

నిజ : తెలుగులో నిజమంటే సత్యమని అర్థం. కాని ఇది తెలుగు పదం కాదు. సంస్కృత పదం. తనది, తన సొంతంగా సహజమైనది అని దీని అర్థం. నిజమంటే స్వాభావికం. Natural. Inherent. కృత్రిమానికి వ్యతిరిక్తమైన పదం. నిజస్వరూప మంటే అసలైన స్వరూపమని భావం. నిజ గుణములంటే తన గుణాలేనని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిత్య ()
Telugu original

నిత్య : ఎప్పటికీ నిలిచి ఉండేది. Eternal. మార్పులేనిది Immutable.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిదాన ()
Telugu original

నిదాన : నిదానం మూలకారణం అని నిఘంటువు మాట. అన్నిటికీ మూలమైనది. కారణభూతమైనది Source. Origin. వైద్యశాస్త్రంలో రోగనిదానమని ఒకమాట ఉంది. అక్కడ నిదానమంటే రోగానికి కారణమని అర్థం. Diagnosis. అలాగే తత్త్వశాస్త్రంలో ఈ భవరోగానికి నిదానమేమని ఆలోచిస్తే అది ఏదోగాదు అనాది కాల ప్రవృత్తమైన మన అవిద్యే నన్నారు పెద్దలు. సంసార బంధానికంతటికీ అదే నిదానం Source. Origin.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిదర్శన ()
Telugu original

నిదర్శన : బాగా చూపి చెప్పేది. Instance. Proof. తార్కాణమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిద్రా ()
Telugu original

నిద్రా : అవస్థాత్రయంలో మూడవది. స్వప్నం కాదిది. స్వప్నంలో ఒక ప్రపంచం కనిపిస్తుంది. నిద్రలో కనిపించదు. కనుక ఇది సుషుప్తి దశ. సుషుప్తి. అనగా మంచి నిద్ర. గాఢ నిద్ర అని అర్థం. ఇందులో ప్రపంచం లేకపోయినా తన స్వరూపం ఫలానా అని గుర్తించలేడు మానవుడు. అలా గుర్తించగలిగితే అది సమాధిగానే మారిపోగలదు. వాసనలనేవి అడ్డు తగులుతున్నాయి. చాలావరకు ఇది సమాధికి దగ్గరగా వచ్చే దశ. కనుకనే నిద్రలోని జీవుడికి ప్రాజ్ఞుడని ఒక బిరుదు తగిలించారు వేదాంతులు. ప్రజ్ఞ లేకపోయినా ప్రజ్ఞావంతుడేనట.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిధాన/నిధి ()
Telugu original

నిధాన/నిధి : నిక్షేపమని అర్థం. Treasure. మానవ హృదయంలోనే పరమాత్మ చైతన్యం నిహితమై ఉంది. కానీ గుర్తులేదు. ఇది ఎలాంటిదంటే ఒక హిరణ్య నిధి భూగర్భంలో ఉంది. కానీ అంజనం వేసుకుని చూచేవరకు దానిని గుర్తించలేము. అలాగే గురూపదేశమనే అంజనం కావలసి ఉంది ఇక్కడ. అలాంటిది లభిస్తే అజ్ఞానం అనే నిద్ర వదలిపోయి సమాధి అనే మెళకువ ఏర్పడగలదు. అప్పుడు హిరణ్యనిధి లాంటి తన ఆత్మస్వరూప నిధిని దర్శించగలడు. అనుభవించనూ గలడు. మన పాలిటికి నిధిగాని నిధి మనస్వరూపమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిధ్యాన ()
Telugu original

నిధ్యాన : 'నితరాం ధ్యానం.' నిఘా పెట్టి చూడటం Keen observation. తత్పరత్వమని తాత్పర్యమని కూడా పేర్కొనవచ్చు.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిదిధ్యాస ()
Telugu original

నిదిధ్యాస : అలా నిరీక్షించే దృష్టి. 'నిధ్యాతుం ఇచ్ఛా.' నిఘా పెట్టి చూడాలనే కోరిక. అద్వైత దర్శనాభ్యాసంలో శ్రవణ మననాల తర్వాత మూడవది. శ్రవణం అజ్ఞానాన్ని పోగొడితే మననం సంశయ నివృత్తి చేస్తే ఇది విపర్యయమనే దోషాన్ని తొలగిస్తుంది. విజాతీయ వృత్తులేవీ దాడి చేయకుండా సజాతీయమైన ఆత్మాకార వృత్తినే నిలబెట్టే అభ్యాసానికి నిదిధ్యాస అని పేరు. మొదటి రెండూ పరోక్ష సాధనాలైతే ఇది అపరోక్ష సాధనం ఆత్మసాక్షాత్కారానికి.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిబంధన ()
Telugu original

నిబంధన : ఒక దానికి చెందినది, అధీనమైనదని, సంబంధించినదని అర్థం. Pertaining to. దానితో ముడిపడినదని కూడా అర్థమే. Connected with.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిబర్హణ ()
Telugu original

నిబర్హణ : బర్హణమంటే కొట్టటం. మర్దించటం. నిబర్హణమనగా బాగా నలగగొట్టటం. చితక కొట్టటం. లయం చేసుకోవటమని అర్థం. బ్రహ్మ శబ్దానికి మూడర్థాలు చెప్పారు. బృహత్వమని ఒకటి. బృంహణత్వమని ఒకటి. బర్హణత్వమని ఒకటి. బ్రహ్మం ప్రపంచంకంటే పెద్దదే గాక దాన్ని తనలో ఇముడ్చేకునేదేగాక దాన్ని పూర్తిగా లయం చేసి తన స్వరూపంగా మార్చుకునేదని. ఈ మూడు అర్థాలు అంచెల వారీగా మనకు బ్రహ్మస్వరూపాన్ని చాటి చెబుతున్నాయి.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిబోధ ()
Telugu original

నిబోధ : బోధలాంటిదే. కాని బాగా బోధించటం. బోధించిన విషయాన్ని చక్కగా గ్రహించటం అనే అర్థంలో వస్తుందీమాట. Well understanding.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిమజ్జన ()
Telugu original

నిమజ్జన : పూర్తిగా మునిగి పోవటమని అర్థం. ముంచివేయటం కూడా. శివాద్వైత భాష ఇది. పశుభావాన్ని శివజ్ఞానంలో నిమజ్జనం చేస్తే పశుపతి భావం ఉన్మజ్జన మవుతుందని చెబుతారు వారు. నిమజ్జనం సంసార బంధానికి దారితీస్తే ఉన్మజ్జనం బంధ విమోచనానికి బాట చూపుతుంది. నిమజ్జనం నామరూపాలతో తాదాత్మ్యం. ఉన్మజ్జనం సచ్చిదాత్మకమైన తత్త్వంతో ఏకీభావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిమేషోన్మేష ()
Telugu original

నిమేషోన్మేష : కనులు మూయటం నిమేషం. కనులు తెరవటం ఉన్మేషం. నిమీలమని, ఉన్మీలనమని కూడా పేర్కొనవచ్చు. లాక్షణికంగా చెబితే ఒకటి ప్రళయమూ. మరొకటి సృష్టి. ఒకటి అజ్ఞానమూ. మరొకటి జ్ఞానోదయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిమిత్త ()
Telugu original

నిమిత్త : ఏదో ఒక నెపం. మిష Pretext. కారణమని కూడా అర్థమే. అందులో ఉపాదాన కారణం అచేతనమైతే, చేతనం నిమిత్త కారణం. Scncient cause. ఘటమనే కార్యానికి నిమిత్త కారణం కులాలుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
నియమ ()
Telugu original

నియమ : ఒక విషయానికి ట్టుపడటం. శాస్త్రం విధించిన విధులలో ఒకానొక విధి. నియమ విధి. 'నియమః పాక్షికే సతి.' ఒక కార్యం ఒక పక్షంలో కాకున్నా మరొక పక్షంలో తప్పక వర్తించటం. 'ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః.' ఆత్మను గుర్తించటానికి కాకున్నా గుర్తించిన భావాన్ని అలాగే నిలుపుకోమని చెప్పటమిది. యోగశాస్త్రంలోని అష్టాంగ మార్గంలో రెండవ మజిలీకి కూడా నియమమని పేరు. 'యమ నియమాసన.'

Vedānta Paribhāṣā Vivaraṇa
నియతి ()
Telugu original

నియతి : విధి. దైవం. Destiny. దైవశక్తి. Cosmic Law.

Vedānta Paribhāṣā Vivaraṇa
నియంత్రణ ()
Telugu original

నియంత్రణ : ఒక విషయానికి మాత్రమే పరిమితం చేయటం. Fixation. Restriction. నియమమని కూడా పేర్కొనవచ్చు.

Vedānta Paribhāṣā Vivaraṇa
నియోగ/నియుక్త ()
Telugu original

నియోగ/నియుక్త : ఒక పనికి ఆదేశించటం. విధించటం. Enjoin. అలా నియోగింపబడ్డవాడు నియుక్తుడు. కర్మకైతే కర్మాధికారి. జ్ఞానానికైతే జ్ఞానాధికారి. ఆశ్రమ ధర్మాలన్నీ నియోగం క్రిందికే వస్తాయి.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిరతి/నిరత ()
Telugu original

నిరతి/నిరత : ఒక విషయంలో ప్రవృత్తి నిరతి. ప్రవర్తించేవాడు నిరతుడు. తత్పరత్వం కలవాడని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిరాకరణ ()
Telugu original

నిరాకరణ : త్రోసిపుచ్చటం. సహేతుకంగా ఒక వాదాన్ని ఖండించటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిరీక్షణ ()
Telugu original

నిరీక్షణ : తదేక దృష్టితో చూడటం. Total attention.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిరుక్తి/నిర్వచన ()
Telugu original

నిరుక్తి/నిర్వచన : నిశ్శేషంగా చెప్పటమని శబ్దార్థం. ఒక పదార్థాన్ని నిర్వచించటం. అంటే దాని లక్షణం చెప్పి ఇది ఇంతేనని వర్ణించటం. Definition.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిరూపణ ()
Telugu original

నిరూపణ : ఋజువు చేయటం. ఇది ఇలాంటిదని బాగా పరీక్షించి చూడటం. Scrutiny.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిర్దేశ ()
Telugu original

నిర్దేశ : పేర్కొనటం. Mention.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిర్ధారణ ()
Telugu original

నిర్ధారణ : కొన్ని విషయాలలోనుంచి కావలసిన దాన్నిమాత్రం బయటకు లాగి ఫలానా అని తేల్చి చెప్పటం Distinction. Determination. నిష్కర్ష. బయటికి లాగి తేల్చి చెప్పటం. Extract. సారాంశమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిర్మోక/నిర్ముక్త ()
Telugu original

నిర్మోక/నిర్ముక్త : బాగా వదలిపోవటం. పాము కుబుసకు కూడా నిర్మోకమనే పేరు. నిర్మోకమంటే మోక్షమని గూడా అర్థమే. నిర్ముక్తుడంటే సంసార బంధంలోంచి బయటపడ్డవాడు. Liberated soul.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిర్యాణ ()
Telugu original

నిర్యాణ : బయటికి వెళ్ళడం. Exist. చనిపోవటం. శరీరాన్ని వదలి వెళ్ళటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిర్వాణ ()
Telugu original

నిర్వాణ : ఆరిపోవటమని శబ్దార్థం. బౌద్ధుల శూన్యవాదమిదే. జీవచైతన్యం తాత్కాలికంగా పనిచేసి చివరకు దీపంలాగా ఆరిపోయి శూన్యమవుతున్నదని అంటారు వారు. కానీ అద్వైతులిది ఒప్పుకోరు. నిర్వాణమంటే సర్వనాశనం కాదు. బ్రహ్మనిర్వాణమే నిర్వాణం. అంటే జీవచైతన్యం ఈశ్వర చైతన్యంగా నిలిచిపోతుందని అదే జీవిత గమ్యమని వీరి సిద్ధాంతం. 'లభంతే బ్రహ్మ నిర్వాణం' అని గీతా వచనం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిర్బాధ ()
Telugu original

నిర్బాధ : ఎలాంటి ఎదురుదెబ్బ లేనిది. Uncontradicted. ఆత్మతత్త్వమని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిర్భేద ()
Telugu original

నిర్భేద : భేదం లేనిది. సజాతీయ విజాతీయ స్వగత భేదాలే భేదాలు. అవి ఏవీ లేనిది నిర్భేదం. ఆత్మచైతన్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిర్లుఠన ()
Telugu original

నిర్లుఠన : బాగా తేలగొట్టడం. గాలించి చెప్పటం Quintessence.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిర్వర్తన/నిర్వృత్త ()
Telugu original

నిర్వర్తన/నిర్వృత్త : తయారు కావటం. నిష్పత్తి. అలా తయారైనది లేదా ఏర్పడ్డది. నిర్వృత్తం. నిష్పన్నమని అర్ధం. 'అధ్యవసాన నిర్వృత్తా హి బ్రహ్మావగతిః' అంటే నిశ్చయాత్మకమైన జ్ఞానంవల్లనే ఏర్పడుతుంది బ్రహ్మానుభవమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిర్వహణ ()
Telugu original

నిర్వహణ : బాగా మోసుకుపోవటం. నామరూపాలను మోస్తూ ఉన్నది ఏదో కాదు బ్రహ్మచైతన్యమే. 'తే యదంతరా తత్‌బ్రహ్మ.' తనలో ఉన్న నామరూపాలను తాను నిత్యమూ వహిస్తున్నది కనుక బ్రహ్మచైతన్యం నిర్వాహకం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిర్ల్వయన ()
Telugu original

నిర్ల్వయన : పాము కుబుసమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిర్వేద ()
Telugu original

నిర్వేద : విసుగు. విరక్తి. నిరుత్సాహం. ఆత్మ సాధన మార్గంలో ఇది పనికిరాదు. నిత్యమూ ఉత్సాహంతో అభ్యసిస్తూ పోవాలి సాధకుడు. అప్పుడే లక్ష్యసిద్ధి.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిర్విషయ ()
Telugu original

నిర్విషయ : విషయం కాకపోవటం. జ్ఞానానికి జ్ఞేయమే విషయం కాని జ్ఞానం మరి దేనికీ విషయం కాదు. అంటే గోచరించదని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిర్వృతి/నిరావరణ ()
Telugu original

నిర్వృతి/నిరావరణ : వృతి అన్నా ఆవరణమన్నా అడ్డం. కప్పు. నిరోధం అని అర్థం. అలాంటి అడ్డమేమీ లేనిది నిరావరణం. ఆత్మచైతన్యానికి అవధులంటూలేవు.

Vedānta Paribhāṣā Vivaraṇa
నివృత్తి ()
Telugu original

నివృత్తి : తొలగిపోవటం. ప్రవృత్తికి వ్యతిరిక్తం. కర్మలు ఆచరిస్తే అది ప్రవృత్తి ధర్మం. జ్ఞాని అయినవాడు ఆచరించక కేవలం జ్ఞానాభ్యాసం మాత్రమే సాగిస్తూపోతే అది నివృత్తి ధర్మం. వేదంలో కర్మకాండ మొదటిది. జ్ఞానకాండ రెండవది. నివృత్తి, నిర్వృత్తి, నిర్వృతి, ఈ మూడు మాటలూ దగ్గర దగ్గరగా ఉండటం మూలాన భ్రమ పడవచ్చు పాఠకుడు. వీటికున్న సూక్ష్మమైన తేడా శబ్దంలోనూ అర్ధంలోనూ చక్కగా గ్రహించవలసి ఉంటుంది. మొదటిది తొలగిపోవటమని, రెండవది ఏర్పడటమని, మూడవది ఆవరణ లేనిదని, వేర్వేరు అర్ధాలు చెప్పుకోవలసి ఉంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిలయన ()
Telugu original

నిలయన : ఆశ్రయం. ఆధారం. ఒక ఆలంబనం. Support. శరీరాది సంఘాతం. Constitution.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిర్గుణ ()
Telugu original

నిర్గుణ : గుణములు లేనిది. గుణమంటే ప్రకృతి గుణాలు. సత్వ రజ స్తమస్సులు. నామరూప క్రియలు కూడా గుణాలే. ఉపాధులని అర్ధం. చైతన్యాన్ని ఇవి కప్పిపుచ్చి పరిమితం చేసి చూపుతుంటాయి. వీటివల్లనే ఈశ్వర చైతన్యం జీవచైతన్యంగా మారి సగుణమైంది. ఇది కేవలం ఆభాసే. వస్తుతః చైతన్యం నిరాకారం గనుక ఆత్మ స్వరూపం గనుక సర్వవ్యాపకం. అది నిర్గుణమే. Unqualified. పరమాత్మ మాయాశక్తిని వశీకరించుకుని సగుణంగా కూడా అవతరించగలడు. అప్పుడు జీవుడిలాగ సోపాధికుడు కాడు. నిరుపాధికుడే.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిర్ఘృణ ()
Telugu original

నిర్ఘృణ : ఘృణ అంటే దయ. దాక్షిణ్యం. అలాంటిదేదీ లేనివాడు నిర్ఘృణుడు. ఈశ్వరుడు ఈ ప్రపంచాన్ని ఉచ్చ నీచ భేదంతో సృష్టించాడంటే అతడు ఇలాంటి నిర్దయ స్వభావుడు కాడా అని ప్రశ్న వచ్చింది. అతడు బుద్ధిపూర్వకంగా చేసినది కాదీ సృష్టి. మానవుడి అజ్ఞానం వల్ల ఈశ్వర చైతన్యమే జగద్రూపంగా భాసిస్తున్నది. కనుక నైర్ఘృణ్య దోషం ఈశ్వరుణ్ణి అంటదని అద్వైతులు సమర్ధించారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిశా ()
Telugu original

నిశా : రాత్రి అని బాహ్యార్థం. పరమాత్మ అని లక్ష్యార్థం. బుద్ధి కగోచరమైనది గనుక పరమాత్మ తత్త్వం నిశలాంటిదే నట. రాత్రి కాలంలో అక్కడే ఉన్నా ఒక వస్తువు గోచరం కాదు. అలాగే రాత్రి లాంటి అజ్ఞానంలో మానవుడికి పరమాత్మ గోచరించటం లేదు. గోచరించని దెప్పుడూ రాత్రివంటిదే కనుక పరమాత్మకు కూడా నిశ అనే మాట వర్తిస్తున్నది. 'యా నిశా సర్వభూతానాం' అని గీతా వచనం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిశమన ()
Telugu original

నిశమన : వినటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిశామన ()
Telugu original

నిశామన : చూడటం. ముందు ఆత్మస్వరూపాన్ని గూర్చిన బోధ గురువువల్ల విని తరువాత ఆత్మదర్శనం చేయవలసి ఉంటుందని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిషేధ ()
Telugu original

నిషేధ : విధి అని నిషేధమని కర్మ రెండు విధాలు. శాస్త్రం చేయమని విధించిన నిత్య నైమిత్తికాలు విధులు. వద్దని తోసిపుచ్చినవి నిషేధాలు. Dos and Donts.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిష్ఠా ()
Telugu original

నిష్ఠా : పర్యవసానం. Culmination. చివరి దశ. లయమయ్యే స్థానం. తాత్పర్యం. Aim. దీక్ష Deep Meditation. బ్రహ్మ నిష్ఠ అంటే బ్రహ్మము నందే నిలిచి ఉండడం. 'నిష్ఠా జ్ఞానస్య యా పరా' అని గీతలో మాట. అక్కడ నిష్ఠ అంటే చివరి దశ The End అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిష్పత్తి ()
Telugu original

నిష్పత్తి : తయారుకావటం. ఏర్పడటం. ఫలించటం. ఫలనిష్పత్తి అంటే ఫలితం చేతికి రావటమని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిష్క్రయ/నిష్కృతి ()
Telugu original

నిష్క్రయ/నిష్కృతి : అప్పు తీర్చటమని బయటపడటమని అర్ధం. ఒక సమస్యకు పరిష్కారం చేయగలగటం కూడా నిష్కృతే. Remedy.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిశ్శ్రేయస ()
Telugu original

నిశ్శ్రేయస : దేన్ని మించి ఇక మన మాశించవలసిన శ్రేయస్సు లేదో అది నిశ్శ్రేయసం. Summum Bonum. మోక్షం. Salvation అని అర్ధం. ధర్మ పురుషార్థానికి ఫలం అభ్యుదయమని Prosperity, మోక్ష పురుషార్థానికి నిశ్శ్రేయసమని శాస్త్రం నిర్ణయించింది. అభ్యుదయం ఎంత పొందినా చివరకు కర్మభూమికి మరలా తిరిగి రావలసిందే. కనుక అది శ్రేయస్సే గాని నిశ్శ్రేయసం కాదు. మోక్షమొక్కటే దాని కతీతమైన పురుషార్థం. అందులో తిరిగి రావటమంటూ లేదు. కనుక నిశ్శ్రేయసమని పేరు దానికి సార్ధకం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిసర్గ ()
Telugu original

నిసర్గ : స్వభావం Nature.

Vedānta Paribhāṣā Vivaraṇa
నైసర్గిక ()
Telugu original

నైసర్గిక : నిసర్గం వల్ల ఏర్పడినది. స్వాభావికం. Natural Inborn. ఆత్మకు చైతన్యమనేది నిసర్గ లక్షణం. నామరూపాలు ప్రపంచానికి నైసర్గికం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిస్తార ()
Telugu original

నిస్తార : బయటపడటం, నిష్కృతి, మోక్షం. Liberation.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిర్మోహ ()
Telugu original

నిర్మోహ : మోహమంటే అజ్ఞానం. అది లేకుంటే నిర్మోహం. జ్ఞానమని అర్ధం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిహ్నుతి/నిహ్నవ ()
Telugu original

నిహ్నుతి/నిహ్నవ: కప్పిపుచ్చటమని అర్ధం. Concealment. అపహ్నవమని కూడా పేర్కొనవచ్చు. నామరూపాలను అపహ్నవించటమంటే నిరాకరించటం. నేతి నేతి మహావాక్యం చేస్తున్నపని ఇదే. అక్కడ త్రోసిపుచ్చటమనగా ఎక్కడికోకాదు. చైతన్యం లోనికే. చైతన్యంగానే మార్చుకుని చూడమని చెప్పటమది.

Vedānta Paribhāṣā Vivaraṇa
నీతి ()
Telugu original

నీతి : నడపటం. పద్ధతి. మార్గం. The path or way of approach to the reality.

Vedānta Paribhāṣā Vivaraṇa
నీడ ()
Telugu original

నీడ : ఇది కూడా తెలుగుమాట కాదు. సంస్కృత శబ్దం. నిలయమని దీనికర్ధం. ముఖ్యంగా పక్షిగూడు. Nest. కాని ఆశ్రయమని Shelter లక్ష్యార్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నూనం ()
Telugu original

నూనం : ఇది ఒక అవ్యయం. Adverb. తప్పకుండా, అవశ్యంగా అనే అర్ధంలో వాడే మాట. 'నూనమయం జీవః ఈశ్వర ఏవ.' నిజంగా ఈ జీవుడు వాస్తవంలో ఈశ్వరుడే.

Vedānta Paribhāṣā Vivaraṇa
నిమిత్త నైమిత్తికభావ ()
Telugu original

నిమిత్త నైమిత్తికభావ : కారణానికి దాని కార్యానికి ఉండే సంబంధం. ఛత్రం తెరచినప్పుడు ఛాయ ఏర్పడుతుంది. ముడిచినప్పుడు తొలగిపోతుంది. ఒకదానికొకటి హేతు హేతుమత్‌భావం కలిగి ఉన్నాయి. ఇదే రెండింటికీ ఉన్న సంబంధం.

Vedānta Paribhāṣā Vivaraṇa
నీచైః/నీచ ()
Telugu original

నీచైః/నీచ : క్రింది భాగం. క్రిందుగా. తక్కువ. Inferior. నికృష్టం. Low. ఉఛ్చైః ఉచ్చ అనే మాటలు రెండింటికీ ఈ రెండు ప్రతిగా వాడే మాటలు.

Vedānta Paribhāṣā Vivaraṇa
న్యక్కార ()
Telugu original

న్యక్కార : తక్కువ చేయటం. కించపరచటం. తగ్గించటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
న్యస్త/నిహిత ()
Telugu original

న్యస్త/నిహిత : ఉంచబడిన, పెట్టబడిన Placed.

Vedānta Paribhāṣā Vivaraṇa
న్యాస ()
Telugu original

న్యాస : ఉంచటం. పెట్టటం To place. To keep.

Vedānta Paribhāṣā Vivaraṇa
న్యాయ ()
Telugu original

న్యాయ : తగిన. యుక్తియుక్తమైన మార్గం. యుక్తి Reason. హేతువాదం.

Vedānta Paribhāṣā Vivaraṇa
న్యాయ్య ()
Telugu original

న్యాయ్య : తగినది. యుక్తమైనది. Proper. Appropriate సహేతుకం. Reasonable.

Vedānta Paribhāṣā Vivaraṇa
న్యాయవిద్యా/న్యాయశాస్త్ర ()
Telugu original

న్యాయవిద్యా/న్యాయశాస్త్ర : న్యాయమని, వైశేషికమని ఇవి రెండూ తర్కం ఉళివీరిబీ క్రిందికి వస్తాయి. ఇందులో న్యాయశాస్త్రం రచించినవాడు గౌతముడు. పదార్థ వివేచన చేసి తద్వారా అపవర్గాన్ని పొందవచ్చునని ఇతని ఆశయం. పైగా మిగతా విద్యలన్నింటికీ ఇది ప్రదీపంలాంటిదని వర్ణించాడాయన. ఆ మాటకు వస్తే ఏ శాస్త్రానికైనా పునాది తర్కశాస్త్రమే. సందేహం లేదు. కానీ అదే గమ్యమని మాత్రం భావించరాదు. తత్త్వజ్ఞానానికి ఉపకరణంగానే దాన్ని తీసుకోవలసి ఉంటుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
న్యూనాధిక ()
Telugu original

న్యూనాధిక : న్యూనమంటే తగ్గు. అధికమంటే హెచ్చు. హెచ్చుతగ్గులని అర్ధం. అలా కాకుండా ప్రతిపాదిస్తేనే అది సరైన లక్షణమనిపించుకొంటుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
నను ()
Telugu original

నను : ఒక ఆశంక చేసే ముందు వచ్చేమాట. 'నన్వాత్మై వాస్తి నాన్యత్‌. తత్కథం అయ మనాత్మా ప్రతీయతే.' ఉన్నదొక ఆత్మే కదా. మరి ఈ అనాత్మ ఎక్కడిది. మరి, కదా, అనే సందర్భంలో ప్రయోగిస్తారీ పదం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పక్తి ()
Telugu original

పక్తి : పాకమని అర్ధం. 'కషాయ పక్తిః కర్మాణి. జ్ఞానంతు పరమాగతిః' కర్మలన్నీ పక్తి అంటే పాకానికి వస్తేగాని జ్ఞానమనేది ఉదయించదు. కర్మలు పాకానికి రావడమంటే కషాయం తొలగిపోవాలి. కషాయమంటే కర్మ వాసనలు, మాలిన్యం అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పక్ష ()
Telugu original

పక్ష : పక్షి రెక్క. Wing. పక్షములు కలది గనుకనే అది పక్షి అయింది. భాగమని కూడా అర్థమే. Part. Portion. శుక్లపక్ష. కృష్ణపక్ష. వాదంలో ఒకటి పక్షం. మరొకటి ప్రతిపక్షం. Positive. Negative.

Vedānta Paribhāṣā Vivaraṇa
పక్షపాత ()
Telugu original

పక్షపాత : ఒక పక్షంలో పడిపోవటం. Partiality. దాన్నే అభిమానించటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పంచత్వ ()
Telugu original

పంచత్వ : పంచభూతాలలో శరీరం కలిసిపోవటం. మరణమని అర్ధం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పంచీకరణ ()
Telugu original

పంచీకరణ : అయిదుగా తయారుచేయటం. పంచభూతాలను ఒక్కొక్కటి రెండు భాగాలు చేసి అందులో ఒక భాగం మరలా నాలుగు చేసి మిగతా నాలుగింటిలో ఒక్కొక్క అంశాన్ని కలుపుతూ పోవటం. అలా కలిపితే దాని అర్ధభాగం మిగతా నాలుగూ కలిసి ప్రతిఒక్క భూతమూ పంచభూతాత్మకమే అవుతుంది. ఇదే సృష్టి ప్రణాళిక. దీనివల్లనే అపంచీకృతమైన సూక్ష్మభూతాలు పంచీకృతమై స్థూల ప్రపంచంగా మారటం జరుగుతున్నది.

Vedānta Paribhāṣā Vivaraṇa
పంచభూత ()
Telugu original

పంచభూత : పృథివీ జలమూ తేజస్సూ వాయువూ ఆకాశమూ అనే ఈ ఐదింటికీ Five elements పంచభూతాలని పేరు. భూతమంటే అభూతమైన శక్తి మూర్తీభవించి కనిపించటమని Unmanifest being manifest అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పంచతన్మాత్ర ()
Telugu original

పంచతన్మాత్ర : పంచభూతాల సూక్ష్మమైన అంశలు. వాటి గుణాలు. శబ్ద స్పర్శ రూప రస గంధాలు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పండా/పండిత ()
Telugu original

పండా/పండిత : 'పండా ఆత్మ విషయా బుద్ధిః.' ఆత్మజ్ఞానమే పండా అనే మాటకర్థం. అది కలవాడు పండితుడు. ఆత్మజ్ఞాని. 'పండితాః సమదర్శినః.' సర్వమూ ఆత్మస్వరూపమేనని సమానంగా దర్శించేవాడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పతి ()
Telugu original

పతి : 'పాతీతి పతిః' కాపాడేవాడు. అధిపతి Owner. గృహపతి. House Holder. గణపతి, నామరూపాది ఉపాధుల మీద పెత్తనం చెలాయించేవాడు. పశుపతి. పశువులంటే జీవులు. ఈ పశుగణానికంతటికీ అధిపతియైన ఈశ్వరుడని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పద/పాద ()
Telugu original

పద/పాద : పాదం. కాలు Leg అని ఒక అర్ధం. 'పద్యతే ఇతి పాదః' పొందే సాధనం. అప్పుడిది ఉపకరణమవుతుంది. పొందబడే స్ధానం కూడా అని చెబితే గమ్యమవుతుంది. The means and also the end. ఒకటి గమకం. మరొకటి గమ్యం. నాలుగవ భాగమని కూడా Quarter అర్థమే. ఆత్మను చతుష్పాత్‌అని వర్ణించింది మాండూక్యం. నాలుగు పాదాలున్నాయట ఆత్మకు. జాగ్రత్‌ఒకటి. స్వప్నం రెండవది. సుషుప్తి మూడవది. పోతే తురీయమైన సమాధి నాలుగవది. మొదటి మూడూ గమకం. అంటే చేర్చే సాధనాలు. నాలుగవది గమ్యం. చేరబడే స్థానం. 'పాదోస్య సర్వాభూతాని.' నాలుగింటిలో ఒక భాగమీ వ్యక్తమైన ప్రపంచం ఆత్మకు. మిగతా మూడూ అవ్యక్తం. అమృతం. Unchanged. పదమంటే స్థానం Abode అని కూడా అర్థమే. పరమం పదం. The highest Abode.

Vedānta Paribhāṣā Vivaraṇa
పర ()
Telugu original

పర : అన్యమైనది. తనది కానిది. Another. ఇహం కానిది పరలోకం. రెండు విషయాలలో రెండవది. మొదటిది పూర్వం. రెండవది పరం. Second between the two. కార్యకారణాలలో కారణం పూర్వమైతే కార్యం పరం. Subsequent. అంతేకాదు. అన్నిటికన్నా అతీతమైనదని కూడా అర్ధమే. పరతఃపరః పరమాత్మ అని అర్థం. The supreme being. సమాసంలో ఉత్తర పదంగా ప్రయోగిస్తే అదే లోకమని కూడా అర్ధం వస్తుంది. తత్‌పర అంటే అదే ధ్యేయంగా కలవాడని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరమ ()
Telugu original

పరమ : అన్నిటికన్నా ఉత్తమమైనది. Superior. పరమం పదం. The topmost.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరమాత్మ ()
Telugu original

పరమాత్మ : పరమమమైన ఆత్మ. అంటే నిర్గుణమైన ఈశ్వర తత్వం. జీవుడు శరీరం మేరకే ఉన్నవాడు గనుక జీవాత్మ. The individual soul. శరీర బంధం లేనివాడు గనుక ఈశ్వరుడు పరమాత్మ. The Universal soul. పరమమంటే ఇక్కడ ఉపాధులను దాటిపోయిన తత్త్వమని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరావర ()
Telugu original

పరావర : ముందు వెనుకలు. మంచిచెడ్డలు. ఉచ్చనీచలు. అంతేకాదు, పైది క్రిందిది అని కూడా అర్థమే. నిర్గుణం సగుణం రెండు రూపాలు. ఆత్మ అనాత్మ రెండూ కలిసి పరావరం. తత్త్వమెప్పుడూ ఏకపక్షం కాదు. పరావరమది. అంటే స్వరూప విభూత్యాత్మకంగా అఖండమైన పదార్ధం. 'తస్మిన్‌దృష్టే పరావరే' అని కఠోపనిషత్తు చాటుతున్నది. పరమూ అవరమూ రెండూ ఆత్మస్వరూపమే నట. అప్పుడే అది అఖండమైన అద్వైత విజ్ఞానమవుతుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరాపర ()
Telugu original

పరాపర : పరమూ అపరమూ. పైది క్రిందిది. రెండూ కలిసి ఒక్కటే అని భావం. పరావరలాంటిదే ఇదికూడా.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరంపరా/పరంపరయా ()
Telugu original

పరంపరా/పరంపరయా : ఒక వరుస Series. ఒక దానికొకటి చేరి గొలుసుకట్టుగా సాగిపోవటం. Tradition. సంప్రదాయమని కూడా అర్ధమే. సాక్షాత్తుగా కాక చాటుమాటుగా దూరదూరంగా చెప్పదలచిన అంశాన్ని చెబితే పరంపరయా అని వర్ణిస్తారు శాస్త్రంలో. క్రమంగా By gradation అని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరాక్‌ ()
Telugu original

పరాక్‌: ప్రత్యక్‌అనే దానికి ఇది వ్యతిరిక్త పదం. వెలపలికి అని అర్ధం. External.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరాఙ్ముఖ ()
Telugu original

పరాఙ్ముఖ : బాహ్యమైన పదార్థాలవైపు చూచే దృష్టి. బాహ్యమైనవి. ఇంద్రియాలకు మనస్సుకు విషయమైన నామరూపాలు. వాటివైపే మన ఇంద్రియాలు మళ్ళీ ఉన్నాయి. కనుక వాటితోనే వీటికి లావాదేవీ ఏర్పడి వీటన్నిటికి అధిష్ఠానమైన సచ్చిత్తులను చూచే అవకాశం లేకపోయింది. బహిర్ముఖమన్నా ఇలాంటిదే. దీనివల్ల సంసార బంధమే తప్ప అందులో నుంచి మోక్షం లేదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరామర్శ ()
Telugu original

పరామర్శ : Reference. ఒక విషయాన్ని విమర్శించటం. తడవటం. ప్రస్తావించటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరాయణ ()
Telugu original

పరాయణ : ఒక విషయం మీదనే దృష్టి పెడితే అది వాడికి పరాయణ మవుతుంది. ఆయన మంటే స్థానం. పరమంటే ఉత్తమమైనది. అన్నిటికన్నా ఉత్తమమైన పదమని భావించి దానినే శరణువేడటం. ధర్మపరాయణ. ధర్మమే జీవిత లక్ష్యం అని భావించేవాడు. మోక్ష పరాయణ. మోక్షమే జీవిత గమ్యమని భావించేవాడు 'తన్నిష్ఠా స్తత్పరాయణాః' అని గీతావచనం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరావృత్తి ()
Telugu original

పరావృత్తి : వ్యావృత్తి అని కూడా దీనికి పర్యాయ పదం. ఒక విషయం నుంచి వెనుకకు మళ్ళటం. ప్రక్కకు తొలగటం. Withdraw. అనాత్మ నుంచి పరావృత్తి చెందితేనే ఆత్మమీద తత్పరత్వ మేర్పడుతుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరితః ()
Telugu original

పరితః : అంతటా. అన్ని వైపులా. In all directions. అభితః అని కూడా అనవచ్చు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరస్తాత్‌ ()
Telugu original

పరస్తాత్‌: అతిక్రమించిన Transcendant. 'తమసః పరస్తాత్‌' Beyond the Cosmic illusion. అవిద్యాక్షేత్రాన్ని దాటి పోవటమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరిగ్రహ ()
Telugu original

పరిగ్రహ : Belonging. మనకు చెందిన పదార్ధాలన్నీ పరిగ్రహాలే. Property. వస్తు వాహనాదులు. భార్య అని కూడా ఒక అర్ధం. ఒకరివల్ల దానం పుచ్చుకోవటానికి కూడా పరిగ్రహమని పేరు. అలా పుచ్చుకోకుంటే అపరిగ్రహం. ఇది దైవగుణాలలో చేరుతుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరిచ్ఛేద ()
Telugu original

పరిచ్ఛేద : ఒకచోటికి తెగిపోవటం. అంతమై పోవటం. అలా తెగిపోతే అది పరిచ్ఛిన్నం Limited. నామరూపాలు పరిచ్ఛిన్నం. అవి ఎక్కడికక్కడ వేరువేరై కనపడతాయి. పోతే వాటన్నింటిని వ్యాపించిన ఆత్మతత్వమే అపరిచ్ఛిన్నం. Unlimited.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరినిష్ఠిత ()
Telugu original

పరినిష్ఠిత : కదలకుండా ఆగిపోయినది. నిశ్చలమైనది. స్ధిరమైనది. గట్టిగా నిలబడినది. Stable. Established.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరినిష్పన్న ()
Telugu original

పరినిష్పన్న : బాగా తయారైన, ఫలించిన. Finished. Accomplished. మొదటి నుంచీ ఉన్న.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరిప్రశ్న ()
Telugu original

పరిప్రశ్న : అన్నివైపుల నుంచీ ప్రశ్నించటం. 'పరిప్రశ్నేన సేవయా.' ఆత్మ జ్ఞానం సాధించాలంటే అన్ని విషయాలూ అడిగి తెలుసుకోవాలి. లేకుంటే సందేహమనేది పూర్తిగా తొలగిపోదు. సందేహం నిర్మూలమైతే గాని నిశ్చయాత్మకమైన జ్ఞానం కలగదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరిభాషా ()
Telugu original

పరిభాషా : శాస్త్రాలలో ఒకానొక శాస్త్రానికి మాత్రమే ప్రత్యేకంగా సంబంధించిన శబ్దజాలం. Terminalogy, Belonging to a particular branch of knowledge.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరివర్తన ()
Telugu original

పరివర్తన : మారిపోవటం. ఒకదాని లక్షణ మొకదానికి సంక్రమించటం. Change or Exchange.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరివ్రజ్యా ()
Telugu original

పరివ్రజ్యా : సర్వత్రా సంచరించటం. సన్యాసం. Renunciation.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరిశేష ()
Telugu original

పరిశేష : చివరకు మిగిలిపోవటం. అన్ని పక్షాలూ కాదని చివరకేది మిగిలితే Residuam అది. అలాంటిదే ఆత్మతత్త్వం. అనాత్మ ప్రపంచమంతా కొట్టుబడి పోయిన తరువాత చివరకు మిగిలేది అదే గనుక ఆత్మకు పరిశిష్టమని, అవశిష్టమని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరిశేషన్యాయ ()
Telugu original

పరిశేషన్యాయ : అన్నింటినీ కాదని త్రోసిపుచ్చి చివరకు సత్యమైనదేదో దాన్ని నిర్ణయించటం. సూటిగాకాక వీటిని త్రోసిపుచ్చటం ద్వారా అది సత్యమేనని నిర్ధారణ చేసే విధానం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరీక్షా ()
Telugu original

పరీక్షా : అన్నివైపులా చూచి గ్రహించటం. Scrutinisation. బాగా పరిశీలించటం. 'పరీక్ష్య లోకాన్‌కర్మ చితాన్‌.' లోకాన్ని అన్ని ప్రమాణాలతో బాగా పరీక్షించి చూచి తరువాత ఇది అనిత్యమని నిర్ణయించి ఇక నిత్యమేది అని అన్వేషించాలట సాధకుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరిసంఖ్యా ()
Telugu original

పరిసంఖ్యా : అపూర్వ, నియమ, పరిసంఖ్యలని విధి మూడు విధాలు. అంతకు ముందు తెలియనిది తెలిపితే అపూర్వ విధి. రెండింటిలో అది ఒక పక్షంలోనే వర్తిస్తుందని చెబితే నియమవిధి. రెంటికన్నా ఎక్కువ విషయాలలో అన్నింటితోగాక ఏ ఒక్కదానితోనో కట్టుబడిందంటే అది పరిసంఖ్య. 'తదేవ బ్రహ్మ త్వం విద్ధి' అనే చోట అదేగాని బ్రహ్మం మరేదీ కాదని నియమం చెప్పినా చెప్పవచ్చు. బ్రహ్మమనేది ఎన్నో ఉన్నాయని భ్రమపడతావేమో అన్ని బ్రహ్మాలు లేవు. ఒక్కటే బ్రహ్మమని పరిసంఖ్య చెప్పినా చెప్పవచ్చు. కేనోపనిషద్‌భాష్యంలో భాష్యకారులు శెలవిచ్చిన విషయమిది.

Vedānta Paribhāṣā Vivaraṇa
పర్యనుయోగ ()
Telugu original

పర్యనుయోగ : అనుయోగమని కూడా పేర్కొనవచ్చు. పరిప్రశ్నమని అర్ధం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పర్యయ ()
Telugu original

పర్యయ : గడచిపోవటం. అతిక్రమించటం. Passage of Time. కాల పర్యయమంటారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పర్యాయ ()
Telugu original

పర్యాయ : పర్యాయం. ఒకమారు Once. పర్యాయ పదమంటే ఒక అర్ధమే చెప్పే మరొకమాట. Alternative.

Vedānta Paribhāṣā Vivaraṇa
పర్యవసాన ()
Telugu original

పర్యవసాన : అవసానమనే అర్ధం. చివర. అంతం. The End. Culmination.

Vedānta Paribhāṣā Vivaraṇa
పర్యాప్త ()
Telugu original

పర్యాప్త : బాగా పొందబడినది. Well obtained. చాలినంత. Sufficient Accomplished. పర్యాప్తకామ. అన్ని కోరికలు లభించినవాడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరాత్పర ()
Telugu original

పరాత్పర : పరంకన్నా పరమైన తత్త్వం పరమాత్మ. పరం అవ్యక్తమైన మాయాశక్తి అయితే దానికన్నా పరం మాయాతీతమైన పరమాత్మ. 'అవ్యక్తాత్‌పురుషః పరః.'

Vedānta Paribhāṣā Vivaraṇa
పరమార్థ ()
Telugu original

పరమార్థ : పరమమైన అన్నిటికన్నా గొప్పదైన అర్ధం. అంటే పదార్ధం. అదే పరమాత్మ. The Universal Reality. The Absolute. The Meaning of the World.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరావాక్కు/పరాశక్తి ()
Telugu original

పరావాక్కు/పరాశక్తి : పరమార్ధం అన్నింటికన్నా గొప్ప అర్ధమైతే పరావాక్కు అలాంటి అర్ధాన్ని బోధించే గొప్ప శబ్దం. మాయాశక్తి. పరమాత్మ నాశ్రయించి ఉంటే అది పర. తన్ను తాను పరామర్శించుకొంటే పశ్యంతి. క్రిందికి దిగి సృష్టికి అభిముఖమైతే మధ్యమ. సృష్టిగా మారిపోతే వైఖరి. పరాదశలో ఉన్న ఆ వాక్కు లేదా శబ్దం పరమమైన అర్థాన్నే చెబుతుంది. వాక్కు పరమం. అది చెప్పే అర్ధమూ పరమమే. ఇవే ప్రకాశ విమర్శలని పేర్కొంటారు శివాద్వైతులు. అర్ధాన్ని ఎంతెంత విమర్శిస్తూ పోతే అంతంత దాని ప్రకాశం బయట పడుతుంది. పూర్తిగా విమర్శిస్తే పూర్తిగా అనుభవానికి వస్తుంది. అదే బ్రహ్మానుభవం. ఇది శబ్దార్థ సహాయంతోనే సాధించాలి మానవుడు అని వారి అభిప్రాయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరాకాశ/పరమే వ్యోమన్‌ ()
Telugu original

పరాకాశ/పరమే వ్యోమన్‌: జడాకాశం కన్నా భిన్నమైన ఆకాశం. అదే చిదాకాశం. The conscious space. పరమార్ధం. దానికి ఉపలబ్ది స్థానమైన బుద్ధితత్వమైనా కావచ్చు. బుద్ధిలో ఉన్న వ్యోమమంటే ఆకాశం. అది జ్ఞానాకాశమే దాని ద్వారానే అసలైన ఆత్మతత్త్వాన్ని పట్టుకోవచ్చు. బుద్ధి వృత్తిగా అదే దిగివచ్చింది. మరలా బుద్ధి వృత్తితోనే దాన్ని గ్రహించవలసి ఉంటుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరాంతకాల ()
Telugu original

పరాంతకాల : సగుణ బ్రహ్మానికి దేవమానంలో ఆయుర్దాయం వంద సంవత్సరాలైతే అందులో పూర్వార్ధం పరార్ధమని రెండు భాగాలు. రెండవ భాగమంతమైతే చాలు బ్రహ్మకల్ప మక్కడికి సమాప్తం. అంతవరకూ ఆయనతోపాటు నిర్గుణాభ్యాసం చేస్తున్న సత్యలోక వాసులాయనతోపాటు అసలైన బ్రహ్మ సాయుజ్యం పొంది తరిస్తారు. దానికి పరాంతకాలమని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరార్ధం ()
Telugu original

పరార్ధం : బ్రహ్మదేవుని ఆయుర్దాయంలో ద్వితీయార్ధం. లేదా గొప్ప స్థానమని కూడా Supreme Abode అర్ధం చెప్పవచ్చు. 'పరమే పరార్ధే' అని ఉపనిషత్తులోమాట.

Vedānta Paribhāṣā Vivaraṇa
పదార్థ ()
Telugu original

పదార్థ : ఒక పదానికి Word అర్థం. Meaning. నామరూపాదికమైన వస్తుజాతమంతా పదార్థమే. ఏదో ఒక పదానికి గోచరించేదే ప్రతి ఒక్కటీ. తత్త్వమసిలో తత్‌ఒక పదం. త్వం ఒక పదం. వాటి అర్ధాలు పదార్ధాలు. త్వం పదార్థం జీవాత్మ అయితే తత్పదార్ధం పరమాత్మ.

Vedānta Paribhāṣā Vivaraṇa
పదార్ధ జ్ఞానం ()
Telugu original

పదార్ధ జ్ఞానం : వాటి తాలూకు జ్ఞానం. పదార్ధ జ్ఞానం. ఇవి రెండూ జ్ఞాన రూపంగా ఏకమని భావిస్తే అది వాక్యార్థ జ్ఞానం. ముందు పదార్థ జ్ఞానం సంపాదిస్తే తర్వాత అదే వాక్యార్థానికి దారి తీస్తుంది. దానితో అనుభవం సమాప్తమవుతుంది. పదార్థం Analysis. వాక్యార్థం Synthesis. మొదటిది వికల్పించటం. రెండవది నిర్వికల్పంగా భావించటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరకృతి ()
Telugu original

పరకృతి : నాలుగు విధములైన అర్థవాదాలలో ఇది ఒకటి. పరులు చేశారని చెప్పే మాటకు పరకృతి అని పేరు. Precedent. జనకుడు పూర్వం ఇలా ఆత్మజ్ఞాన నిష్ఠతోనే రాజ్యపరిపాలనం చేశాడని చెప్పటం లాంటిది. ఇది యధార్థమే కానక్కరలేదు. పురాణ ఇతిహాసాలన్నీ అర్థవాదాలనే Allegories పూర్వం పేర్కొని ఉన్నాం. అంచేత అలాంటి వ్యక్తి ఒకప్పుడు ఉన్నాడే అనుకోనక్కరలేదు. అందులోని భావం మాత్రమే మనం తీసుకోవలసింది. అలా తీసుకున్నప్పుడు మనం కూడా సాధనచేసి ఆ బలంతోనే జీవితయాత్ర సాగించవలసి ఉంటుందని బోధపడితే చాలు అదే దాని ప్రయోజనం. పరకృతి అని చెప్పటం ఇలాంటి భావన మనకు స్థిరంగా మనసులో ఏర్పడటం కోసమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరిహార ()
Telugu original

పరిహార : ఆక్షేపం, పరిహారమని ఇవి రెండు మాటలు. ఒక విషయాన్ని ఖండించినప్పుడు దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. లేకుంటే సిద్ధాంతం నిలవదు. సహేతుకంగా సదృష్టాంతంగా సిద్ధాంతాన్ని బలపరచటానికి పరిహారమనేది చెప్పుకోవలసి ఉంటుంది. పరిహారమంటే ఆక్షేపానికి సమాధానమే. మరేదీగాదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరస్పర ()
Telugu original

పరస్పర : Mutual. అన్యోన్య ఇతరేతర అనే మాటలు కూడా ఇలాంటివే. సాపేక్షమైన ప్రపంచమంతా ఒకదాని కొకటి ముడిబడి ఉన్నది. ఉపకార్య ఉపకారక సంబంధమంటారు దీన్ని. పరస్పరం ఇలాంటి సంబంధం ఉండటం మూలాన్నే దీని కతీతమైన తత్త్వమొకటి దీనికంతటికీ అధిష్ఠానమై ఉండాలని గ్రహించవచ్చు. పరస్పరం అపరస్పరానికి దారి తీస్తుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరేత ()
Telugu original

పరేత : శరీరాన్ని వదిలి వెళ్ళినవాడని అర్థం. ప్రేత అన్నా దీనికి పర్యాయమే. The departed soul. ఇక్కడి నుండి వెళ్ళాడనగానే అసలు లేనివాడని అర్థంకాదు. ఇహంలోగాక పరంలో ఎక్కడో ఒకచోట మరలా తానుచేసిన కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉండవలసిందే. అంతేగాక కర్మఫల శేషంతో మరలా జన్మించవలసిందే.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరాదాత్‌ ()
Telugu original

పరాదాత్‌: 'బ్రహ్మ తం పరాదాత్‌యః అన్యత్ర ఆత్మనః బ్రహ్మపశ్యేత్‌.' ఎవడైతే తన స్వరూపం కంటే అన్యంగా ఒక బ్రాహ్మణుడిని, ఒక క్షత్రియుడిని ఇలా ప్రతి ఒక్కదానిని చూస్తూ పోతాడో వాడు బ్రహ్మస్వరూపాన్ని అర్ధం చేసుకోలేడు. బ్రహ్మమును తన రూపంకాదని త్రోసివేస్తున్నాడు. పరాదాత్‌అంటే త్రోసి వేశాడని అర్ధం. ఇది ద్వైత దృష్టేగాని అద్వైత దృష్టి కాదని తాత్పర్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరోక్షజ్ఞాన ()
Telugu original

పరోక్షజ్ఞాన : బ్రహ్మజ్ఞానం రెండు విధాలు. ఒకటి పరోక్షం. మరొకటి అపరోక్షం లేదా ప్రత్యక్షం. పర అక్ష. అక్షం అంటే ఇంద్రియం. ఇంద్రియాలకు పరమైనది. దూరమైనది అని శబ్దార్థం. మనసుకు కూడా స్ఫురించకపోతే అది పరోక్షం. శ్రవణ మననాలవల్ల పరోక్ష జ్ఞానం సంపాదించవచ్చు. కానీ అది ఆత్మస్వరూపంగా గుర్తించినప్పుడే అపరోక్ష మవుతుంది. అంటే అనుభవానికి వస్తుంది. లేకుంటే సిద్ధాంత రూపంగానే నిలిచిపోతుంది. దీనికి పరోక్షమని పేరు. Indirect. కనుక ఎప్పటికైనా సాధకుడు దీనిని అపరోక్షంగా మార్చుకోవాలి. అందుకోసం మననానంతరం నిది ధ్యాస సాగిస్తూ పోవాలి. దానివల్లనే పరోక్ష మపరోక్షంగా మారగలదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరమాణువాద ()
Telugu original

పరమాణువాద : పరమాణువు అంటే Atom పృథివ్యాదుల అతిసూక్ష్మ రూపాలకు అణువులని పరమాణువులని పేరు. ఇవే వాటి విశేషాలు. ఇవి కాలక్రమేణా ప్రకటమై పంచభూతాలుగా ఏర్పడ్డాయని కణాదుని సిద్ధాంతం. దీనికే పరమాణు వాదమని పేరు. పరమాణువులే ప్రపంచ సృష్టికి మూలమనే సిద్ధాంతమిది. అంతకు ముందు లేని కార్యం కారణం నుంచి క్రొత్తగా ఆరంభమవుతుందని కూడా పేర్కొంటారు వీరు. కనుక వీరి వాదానికి ఆరంభవాదమని కూడా మరొకనామధేయం. కార్యం పుట్టకముందు లేదని చెబుతున్నారు కాబట్టి అసత్కార్య వాదమని కూడా దీనికే పేరు The Theory of Creation అని వ్యవహరిస్తారు దీనిని.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరమాత్మ ()
Telugu original

పరమాత్మ : అండ పిండాదులన్నిటికీ సాక్షియైన చైతన్యం. అన్ని ఉపాధులనూ వ్యాపించి అన్నిటినీ తనలో కలుపుకొన్న సామాన్య చైతన్యం. నిర్మలమైన తత్త్వం. బ్రహ్మం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పరిణామవాద ()
Telugu original

పరిణామవాద : ఇంతకుముందు చెప్పిన వాదానికి భిన్నమైన వాదమిది. వారు కార్యమంతకు ముందు అసత్‌అని ప్రతిపాదిస్తే వీరు అసత్తుగాదు సత్‌అని వాదిస్తారు. కనుక దీనికి సత్కార్యవాదమని పేరు. కారణంలో గుప్తంగా ఉన్న కార్యమే తరువాత పరిణమించి ప్రస్తుత రూపంలో మనకు కనపిస్తున్నది కాబట్టి దీనికి పరిణామ వాదమని పేరు వచ్చింది. ఎప్పుడూ కార్యముందంటారు గనుక సత్కార్యవాదం కూడా అయిందిది. The Theory of Evolution. దీనిని ప్రతిపాదించినవాడు కపిలుడు. ఇది అద్వైతానికి ఒక గీటు తక్కువ అయినా చాలావరకు ఉపయోగిస్తుంది. కారణమేమంటే కారణం లాగే కార్యం కూడా సద్రూపమని వీరి సిద్ధాంతం. అంతేగాక పరిణమించక పూర్వం కారణంతో అది ఏకమై కారణంగానే నిలిచి పోయిందని చెబుతున్నారు కాబట్టి ఒకవిధంగా అద్వైత వాదాన్ని వీరు అంగీకరించినట్టే. ఎటువచ్చీ పరిణమించిన తరువాత కార్య కారణాలకు భేదం చెప్పటం ఒకటి. మరలా కార్యం అభావమై పోతుందని చెప్పటమొకటి ఇందులో ఉన్న పొరబాట్లు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పర్యుదాస / పర్యంత ()
Telugu original

పర్యుదాస : ఒక వర్గంలోనుంచి ఒకానొక దాన్ని కేటాయించి దానికి మాత్రం ఆ సూత్రం వర్తించదని చెప్పటానికి పర్యుదాసమని పేరు Exemption. పర్యంత : ఒకదాని చివరి భాగం. అగ్రం. అంచు లేదా అంతవరకు అని కూడా అర్ధమే. బ్రహ్మపర్యంతం అంటే బ్రహ్మదేవుడి వరకు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పశు ()
Telugu original

పశు : 'పాశ్యతే బధ్యతే ఇతి పశుః.' కట్టివేయబడేది పశువు. 'పశ్యతీతి పశుః.' ఊరక అమాయకంగా చూచేదని కూడా అర్థమే. జంతువు. వాసనా జ్ఞానం తప్ప వివేక జ్ఞానం లేదు వాటికి. అది లేని మానవుడు కూడా పశుతుల్యుడే. అది ఉన్నా కూడా సంసారపాశంతో బద్ధుడయ్యాడు కాబట్టి నిజానికి మానవుడూ పశువే. ద్విపాత్‌పశువు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పశుపతి ()
Telugu original

పశుపతి : పాశబంధానికి అతీతుడు. పశువులైన జీవులకు అధిపతి ఈశ్వరుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పాశ ()
Telugu original

పాశ : బంధం. సంసార బంధం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పశ్యంతీ ()
Telugu original

పశ్యంతీ : పరమేశ్వరుని మాయాశక్తి సంకల్ప రూపమైనది. మొదటిది పరా. పరాస్య శక్తిః. పరమాత్మతో ఏకమై ఉన్నప్పుడు అది నిశ్చలం. సంకల్పిస్తే అది పశ్యంతి. Planning Power.

Vedānta Paribhāṣā Vivaraṇa
పండిత ()
Telugu original

పండిత : పండా అంటే ఆత్మవిషయమైన జ్ఞానం. అది ఉన్నవాడు పండితుడు. 'పండితా స్సమ దర్శినః.' అన్నిటిలో వాడు సమంగా పరుచుకొని ఉన్న బ్రహ్మతత్త్వాన్నే చూడగలడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పాక్షిక ()
Telugu original

పాక్షిక : ఏకదేశం. Partial. ఒక భాగానికి మాత్రం చెందినది. సార్వత్రికం General కానిది.

Vedānta Paribhāṣā Vivaraṇa
పాఠ ()
Telugu original

పాఠ : పఠించేది Reading. శాంతిపాఠమంటే శాంతిని చదువుతూ పోవటం. శాస్త్రంలో కొందరు ఒకవిధంగా చదివితే మరికొందరు మరొకవిధంగా చదువుతుంటారు. దీనికే పాఠభేదమని పేరు. Version. 'ఆత్మాన మాత్మని పశ్యతి' అని ఒక పాఠం. పశ్యేత్‌అని మరొక పాఠం. ఏదైనా అద్వైత వేదాంతంలో సమన్వయమై పోయేదే.

Vedānta Paribhāṣā Vivaraṇa
పాత ()
Telugu original

పాత : పడిపోవడం. పక్షపాతం మొదలైన శబ్దాలలో కనిపిస్తుంది. సంసార సాగరంలో పడటమే అసలైన పాతమని అద్వైతుల మాట.

Vedānta Paribhāṣā Vivaraṇa
పాత/పాప/పాప్మా ()
Telugu original

పాత/పాప/పాప్మా : పాతయతీతి. పడగొట్టేదేదో అది పాతకం. మూడింటిలోనూ ఆ లక్షణముంది. కనుక మూడూ ఒకదానికి ఒకటి పర్యాయాలే. సంసారంలో పడగొట్టే మొదటి పాతకం అవిద్య. Nescience. రెండవది కామం. మూడవది కర్మ. ఈ మూడింటికే పాపాలని వేదాంతుల పరిభాష. 'అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి.' అన్ని పాపల నుండి నిన్ను కాపాడతానని భగవానుడి హామీ. పాపాలంటే ఇక్కడ పైన చెప్పిన మూడే. అప్పుడే మోక్షానికి నోచుకోగలం. మనం ఏమైనా శుభకార్యాలు చేసేటప్పుడు పాపాత్మా పాపసంభవః అని చెప్పుకుంటూ ప్రదక్షిణం చేస్తాము. పాపంలోనుంచే జన్మించాను. పాపంతోనే నిండిపోయింది నా స్వరూపమని అర్థం. నిజానికి అలా జన్మించనూ లేదు. నిండనూ లేదు. అజ్ఞానంలో అనుకునే మాట ఇది. జ్ఞానోదయమైతే ఈ జీవుడు అపాప విద్ధుడే. అపహత పాప్ముడే అని శాస్త్రం హామీ ఇస్తున్నది.

Vedānta Paribhāṣā Vivaraṇa
పాండిత్య ()
Telugu original

పాండిత్య : పండితునికి ఉండవలసిన లక్షణం. ఆత్మజ్ఞానం. అనాత్మ ప్రత్యయ తిరస్కరణమే పాండిత్యమని అర్ధం చెప్పారు భగవత్పాదులు A spiritual enlightenment by which we can do away with the contact of the objective world.

Vedānta Paribhāṣā Vivaraṇa
పాద ()
Telugu original

పాద : పదమనే దానికేదో అదే దీనికీ అర్ధం. స్ధానం. గమ్యం. నాలుగవ భాగం. అవస్థ. State. కరణార్థంలో అయితే గమ్యాన్ని చేర్చే సాధనం. కర్మార్థంలో అయితే చేరే స్థానం లేదా సాధ్యం. Distination. ఆత్మకు చెప్పిన నాలుగు పాదాలలో మొదటి మూడు సాధనాలైతే, నాలుగవది వాటిచేత అందుకోవలసిన సాధ్యం. అదే తురీయావస్థ.

Vedānta Paribhāṣā Vivaraṇa
పార / పారగ/పారంగత/పారీణ ()
Telugu original

పార : అవారమంటే ఇద్దరి. పారమంటే అద్దరి. రెండూ కలిస్తే అవారపార. లేదా పారావార. మహా సముద్రమని అర్ధం. అది ఏదో కాదు. ఈ సంసారమే. పారగ/పారంగత/పారీణ : ఇలాటి సాగరాన్ని దాటిపోగలిగిన వాడు పారగుడు. పారంగతుడు. పారీణుడు కూడా వాడే. బ్రహ్మజ్ఞానం లేనిదే అలాంటి భాగ్యానికి నోచుకోలేడు ఎవడూ. కనుక పారంగతుడొక్క ఆత్మజ్ఞాని మాత్రమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
పారమార్ధిక ()
Telugu original

పారమార్ధిక : పరమార్ధానికి సంబంధించినది. Spiritual. అలౌకిక జీవితం. The absolute truth and life. అది కానిది వ్యావహారికం. The relative truth. లౌకిక జీవితం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పారంపర్య ()
Telugu original

పారంపర్య : పరంపరకు Series సంబంధించినది. గురుశిష్య క్రమం. Tradition. సంప్రదాయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పారిమాండల్య ()
Telugu original

పారిమాండల్య : పరిమండలమంటే అణువలయం. దానికి సంబంధించిన క్షేత్రానికి పారిమాండల్యమని పేరు. ఇది కణాద సిద్ధాంతమైన వైశేషిక దర్శనంలో వచ్చే పరిభాష.

Vedānta Paribhāṣā Vivaraṇa
పారలౌకిక ()
Telugu original

పారలౌకిక : పరలోకానికి చెందిన సమస్తం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పారాయణ ()
Telugu original

పారాయణ : పారాన్ని ఆయన అంటే చేరటం. నామపారాయణ మంటే నామావళికి ఏది గమ్యమో దాన్ని అందుకోవటం. నామకీర్తనం కేవలం ఒక ఆలంబనమే. అది గమకమే Means గాని గమ్యం End కాదు. గమ్యం ఆ నామానికి అర్ధమేదో అది. ఆ దేవత స్వరూపం. విష్ణునామాల ద్వారా విష్ణుతత్త్వాన్ని, దేవీ నామాల ద్వారా దేవీ తత్త్వాన్ని అర్ధం చేసుకోవాలి. అదీ నామపారాయణ మంటే. నామం శబ్దమైతే దాని పారమర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పాశుపత ()
Telugu original

పాశుపత : పశుపతే ఏకైక దైవతమని విశ్వసించే వారి మతం. శైవమతం. పశు, పాశ, పశుపతి అని మూడే దీనిలోని తత్త్వాలు Categories. పశువు జీవుడు. పాశం సంసారం. పశుపతి దీనికి అతీతమైన ఈశ్వరుడు. పాశుపత దీక్షతో పశుప్రాయుడైన జీవుడు పాశచ్ఛేదం చేసుకుని పశుపతి సాయుజ్యం పొందాలి.

Vedānta Paribhāṣā Vivaraṇa
పాశుపాల్యం ()
Telugu original

పాశుపాల్యం : పశుపాలన. పశు సంరక్షణ. కృషి, పాశుపాల్యం, వాణిజ్యం ఇవి మూడూ వైశ్యజాతికి శాస్త్రం విధించిన ధర్మాలు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పాషండ ()
Telugu original

పాషండ : వేదబాహ్యమైన మతం. ఇహాన్నే తప్ప పరాన్ని, దైవాన్ని నమ్మని మతం. ఒకవిధంగా నాస్తికవాదమని భావించవచ్చు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పింగళా ()
Telugu original

పింగళా : మేరుదండానికి ఎడమవైపు ప్రసరించే నాడి. కుడివైపు అయితే ఇడ. రెండింటి నడుమనైతే సుషుమ్న. గంగా యమునా సరస్వతులు ఈ మూడింటికీ బాహ్యమైన సంకేతాలు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పిండ/పిండాండ ()
Telugu original

పిండ/పిండాండ : పిండమంటే గ్రాసం. కబళం. శరీరమని కూడా లాక్షణికమైన అర్ధం. పిండాండ అంటే అండాకారంగా ఉన్న వ్యష్టి శరీరం. Micro cosm బ్రహ్మాండానికి ఇది ప్రతీక Replica. అందులో ఎన్ని భాగాలున్నవో అన్నింటికి అన్ని అతిసూక్ష్మ రూపంలో ఉన్నాయట మానవ శరీరంలో. కనుకనే అది Macro అయితే ఇది Micro అని పేర్కొంటారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పిపీలికా మార్గ ()
Telugu original

పిపీలికా మార్గ : చీమ పోయే మార్గం.మోక్షసాధనలో రెండున్నాయి మార్గాలు. ఒకటి విహంగమ మార్గం. మరొకటి పిపీలికా మార్గం. విహంగమ మంటే పక్షి. అది ఒక చెట్టుమీది నుంచి మరొక చెట్టుమీదికి తిన్నగా ఎగిరి పోగలదు. పిపీలిక అలా పోలేదు. క్రిందికి దిగి మరలా ఆ చెట్టుమీదికి ప్రాకిపోవలసిందే. ఇలా కర్మ భక్తి సమాధి - ఇలాంటి మజిలీలు దాటిపోతూ చివరకు జ్ఞానంతో తరించేవాడిది పిపీలికా మార్గం. మధ్యమాధికారి మందాధికరులకు సంబంధించిన సాధన ఇది. పోతే ఉత్తమాధికారులు విహంగమం లాగా సాక్షాత్తుగానే జ్ఞానం సంపాదించి తరించగలరు. అందరినీ కలుపుకుని చెప్పటం కోసం శాస్త్రం రెండు విధాలుగా సాధన మార్గాన్ని ఉపదేశించింది. మొత్తానికి భక్తిమార్గం మొదటిదైతే జ్ఞానమార్గం రెండవది అని చెప్పుకోవచ్చు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పిపీలికాది బ్రహ్మపర్యంతం ()
Telugu original

పిపీలికాది బ్రహ్మపర్యంతం : అత్యల్పమైన చీమ మొదలుకొని అత్యధికుడైన చతుర్ముఖ బ్రహ్మవరకు ప్రాణికోటి ఈ సంసార యాత్ర సాగిస్తూనే ఉన్నది. చిన్నా పెద్దా అని తేడా లేదు. అజ్ఞానంలో కొట్టుమిట్టాడే వరకు అందరూ ఏకమే. జ్ఞానోదయమైనప్పుడే విశిష్టత. జీవులందరూ ఈ ఒక్కమాటలో కలిసి వస్తున్నారు. జీవుని ఉపాధులే గాని ఇవి జీవ సంస్కారాన్ని చెప్పవు. సంస్కారమంటే అది జ్ఞానమే. అలాంటి జ్ఞాని ఏ ఉపాధిలో ఉన్నా ఉచ్చ నీచ భేదం లేదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పిప్పలం/పిప్పలాద ()
Telugu original

పిప్పలం/పిప్పలాద : పిప్పలమంటే అశ్వత్థం లేదా రావిచెట్టు. ఇక్కడ రావిచెట్టు సంసారమే. దీని పండ్లు సుఖదుఃఖానుభవాలే. అద అంటే భక్షించటం. సుఖ దుఃఖాలను అనుక్షణం అనుభవించటం. పిప్పలాదుడంటే జీవుడని బాహ్యార్ధం. కానీ మొత్తం ఈ సంసార వృక్షాన్ని పెకలించి దీని కతీతమైన పురుషోత్తమ ప్రాప్తినందుకొన్న మహర్షి ఒకడున్నాడు. ఆయనకూ పిప్పలాదుడని పేరు. ఆరుగురు మహర్షుల కాయన బ్రహ్మోపదేశం చేసి తరింపచేశాడని ప్రశ్నోపనిషత్తులోని వృత్తాంతం. బహుశః పిప్పలాన్నంతా భక్షించి జీర్ణించుకొని ఉంటాడాయన.

Vedānta Paribhāṣā Vivaraṇa
పుద్గల ()
Telugu original

పుద్గల : శరీరం. ఉపాధి. జైనమత పరిభాష ఇది.

Vedānta Paribhāṣā Vivaraṇa
పుర ()
Telugu original

పుర : పట్టణమని అర్థం. శరీరమని వేదాంతుల భాష. పూరించబడినదేదో అది పురం. ఆత్మచైతన్యం దీన్ని ఆపాదమస్తకమూ నిండి ఉన్నది. కనుక పురమని పేరు వచ్చింది. బ్రహ్మజ్ఞానానికి కూడా శరీరమే సాధనమని పెద్దలు చెప్పారు. శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం. కనుక పురమనే గాక దీనికి బ్రహ్మపురమనికూడా పేరుపెట్టారు. చైతన్యాన్ని బంధించిందీ ఇదే. దానికి విమోచనం కల్పించేది ఇదే.

Vedānta Paribhāṣā Vivaraṇa
పురుష ()
Telugu original

పురుష : మానవుడని మామూలుగా చెప్పుకునే అర్థం. కాని వేదాంతుల భాషలో దీనికి జీవుడని అర్థం. ఈశ్వర చైతన్యమే జీవరూపంగా వచ్చి ఈ శరీరంలో ప్రవేశించిది. పురంలో ప్రవేశించింది కనుక పురుషుడయింది. పురుష శబ్దానికి మూడర్థాలు చెప్పారు భాష్యకారులు. 'పురిశయనాత్‌' పురంలో శయనించాడు గనుక పురుషుడయ్యాడు. 'పూరణాత్‌.' శయనించి అక్కడికి ఆగక శరీరాన్ని విశ్వశరీరాన్ని రెండింటినీ పూరించాడు గనుక పురుషుడయ్యాడు. అలా పూరించి సర్వత్రా వ్యాపించి ఉన్నాడు గనుక 'పూర్ణత్త్వాత్‌' పురుషుడయ్యాడు. ఈ విధంగా మూడు భూమికలలో పురుష శబ్దాన్ని నిర్వచించారు. గీతలో క్షర పురుషుడని, అక్షర పురుషుడని, పురుషోత్తముడని ముగ్గురు పురుషులు దర్శనమిస్తారు. ఇందులో క్షర పురుషుడు ఈ కనిపించే సమస్త భూతాలు. అక్షర పురుషుడు కూటస్థమైన మాయాశక్తి. పురుషోత్తముడు ఈ రెండింటినీ అతిక్రమించి ఉన్న ఈశ్వరచైతన్యం అని భాష్యకారుల వ్యాఖ్యానం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పురుషకార ()
Telugu original

పురుషకార : పురుషుడు చేసే ప్రయత్నం. మానవ యత్నమని అర్థం. Human Effort.

Vedānta Paribhāṣā Vivaraṇa
పుర్యష్టక ()
Telugu original

పుర్యష్టక : ఎనిమిది భాగాలతో కూడిన శరీరమని అర్థం. ఇది స్థూల శరీరం కాదు. సూక్ష్మ శరీరం. Subtle Body. దీనికే లింగ శరీరమని మరొక పేరు. పంచతన్మాత్రలు ఒకటి. పంచప్రాణాలు రెండు. పంచ జ్ఞానేంద్రియాలు మూడు. పంచ కర్మేంద్రియాలు నాలుగు. మనస్సు ఐదు. బుద్ధి ఆరు. చిత్తం ఏడు. అహంకారం ఎనిమిది. ఇవే పుర్యష్టకం. జీవుడి ముఖ్యస్థానం. Head quarters.

Vedānta Paribhāṣā Vivaraṇa
పురాణ ()
Telugu original

పురుషార్థ : పురుషుడు కోరేది. మానవ జీవితానికి గమ్యమైనది. ఇవి నాలుగు. ధర్మ అర్ధ కామ మోక్షాలు. ఇందులో 2, 3 ఐహికమైతే 1, 4 ఆముష్మికం. ఐహికం వినాశి. ఆముష్మికం అవినాశి. అందులో కూడా ధర్మం చివరకు వినాశమై పోయేదే. ఎప్పటికీ నశించనిది మోక్షం. కనుక అది ఒక్కటే పరమ పురుషార్థ మన్నారు వేదాంతులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పూషా ()
Telugu original

పూషా : పోషించేవాడు. సూర్యుడు. తేజస్సు జలము రెండూ ప్రసాదిస్తూ ప్రాణుల జీవనానికి ఆధారమైన వాడు అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పిష్టపేషణ ()
Telugu original

పిష్టపేషణ : పిసికిన పిండినే మరలా పిసుకుతూ పోవడం. చర్విత చర్వణం లాంటిది. అంటే చెప్పిన మాటే చెప్పటం. క్రొత్తగా చెప్పేదేమీ లేదని భావం. ఇది శాస్త్రానికి పనికిరాదు. ఆ మాటకు వస్తే ఏ ప్రమాణమైనా మరొక ప్రమాణం చెప్పిన విషయాన్ని చెప్పకూడదు. ఒక క్రొత్త విషయాన్ని చెప్పినప్పుడే దానికి ప్రామాణ్యం Authority ఏర్పడుతుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
పౌనఃపున్య/పౌనరుక్త్య ()
Telugu original

పౌనఃపున్య/పౌనరుక్త్య : Repetition మరల మరల చేయటం. చెప్పటం. ఇది కూడా శాస్త్రంలో ఒక దోషమే. ఒక సత్యాన్ని ఒక్కమారు చెప్పినప్పుడే దానికి అందం చందం. అలాకాక మాటిమాటికీ చెబుతూ పోతే విసుగు జనించవచ్చు. కాని ఇది లోకవ్యవహారంలో దోషమైనా ఆధ్యాత్మిక రంగంలో పునరుక్తి దోషం గాదన్నారు భగవత్పాదులు. కారణం అది అర్థం చేసుకోవడానికి కష్టం గనుక మాటిమాటికీ బోధించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
పౌర్వాపర్య ()
Telugu original

పౌర్వాపర్య : పూర్వాపర భావం. Pros and cons ముందు వెనుకల క్రమం. శాస్త్రంలో ఒక విషయాన్ని ప్రతిపాదించేటప్పుడు ఇది తప్పకుండా పాటించవలసి ఉంటుంది. అప్పుడే సహేతుకంగా ప్రతిపాదించగలడు శాస్త్రజ్ఞుడు. అర్థం చేసుకోగలడు అధికారి.

Vedānta Paribhāṣā Vivaraṇa
పౌరుషేయ ()
Telugu original

పౌరుషేయ : పురుషుడికి సంబంధించినది. పురుషుడు తన బుద్ధిబలంతో ఆలోచించి చెప్పినది. వ్రాసినది. మనం సృష్టించిన వాఙ్మయమంతా ఇలాంటిదే. మానవుడి బుద్ధిలో తరతమ భావం ఉంటుంది. హెచ్చుతగ్గులుంటాయి. భ్రమ ప్రమాదాలుంటాయి. కనుక అతని సృష్టిలో కూడా పరిపూర్ణత ఆశించలేము. పరిపూర్ణం కాకుంటే అది సత్య మనిపించుకోదు. కనుక అసలైన సత్యం పౌరుషేయం కాదు. అపౌరుషేయం అన్నారు Beyond Human mind పెద్దలు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రకరణ ()
Telugu original

ప్రకరణ : సందర్భం Context. ఒక విషయం ప్రస్తావన చేయటం. ప్రస్తావించబడిన విషయానికి ప్రకృతమని Commenced వ్యపదేశం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రకాశ ()
Telugu original

ప్రకాశ : Public. Exposed. బయటపడి కనిపించటం. స్ఫురించటం. బ్రహ్మచైతన్యం ఎప్పుడూ సచ్చిద్రూపంగా సర్వత్రా ప్రకాశిస్తూనే ఉంది. నామరూపాల చేత వాస్తవంలో అది మరుగుపడలేదు. తద్ద్వారా కూడా అదే స్ఫురిస్తున్నది. అయితే వస్తుసిద్ధంగా భాసిస్తున్నా బుద్ధిసిద్ధం కానంతవరకూ అనుభవానికి రాదు. అంచేతప్రకాశానికి విమర్శ తోడు కావాలి. ప్రకాశ Awareness శివస్వరూపమైతే, విమర్శ శక్తి స్వరూపమని శివాద్వైతుల పరిభాష. దీనికి అద్వైతుల పరిభాషలో సచ్చిత్తులని వ్యవహారం. శివతత్త్వమీ చిత్తే. శక్తి తత్త్వమీ సత్తే అద్వైతులకు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రకృతి ()
Telugu original

ప్రకృతి : 'ప్రకర్షేణ కరోతీతి ప్రకృతిః' బాహుళ్యంగా చేస్తూ పోయేది. ఈశ్వరుని మాయాశక్తికి ప్రకృతి అని, మాయ అని, అవ్యాకృతమని, అక్షరమని పేరుపెట్టారు అద్వైతులు. ఇదే ఉపాదాన కారణం ప్రపంచానికి. ఇది ఈశ్వరుడికి ఎప్పుడూ అధీనమై ఉండాలిగాని స్వతంత్రంకాదు. కాగా సాంఖ్యులు దీని నంగీకరించరు. వారీ ప్రకృతిని ఈశ్వర శక్తి అని భావించరు. ఇది తనపాటికి తానే ప్రపంచసృష్టి చేస్తున్నదని వాదిస్తారు. దీనికి వారు ప్రధానమని పేరుపెట్టారు. కనుకనే వారికి ప్రధాన కారణవాదులని నామధేయం. ప్రకృతి అంటే మరొక అర్థముంది. పూర్వ జన్మలలో చేసుకొన్న కర్మ జ్ఞాన సంస్కారం వర్తమాన జన్మలో ప్రకటమై ఫలితానికి వస్తే దానికి కూడా ప్రకృతి అని పేరు. 'ప్రకృతిం యాంతి భూతాని' అని గీతా వచనం. ప్రకృతి అంటే అవిద్య అని కూడా అర్థమే. 'పురుషః ప్రకృతిస్థో హి' అని ప్రయోగం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రక్రమ ()
Telugu original

ప్రక్రమ : ఆరంభం. చక్కని క్రమమని కూడా అర్థమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రక్రియా ()
Telugu original

ప్రక్రియా : ఒక మార్గం. Method. Technique. విధానమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రక్షిప్త ()
Telugu original

ప్రక్షిప్త : వేయబడినది. కలిపినది. మధ్యలో చేర్చినది. Incorporated. Interpolated దూరంగా విసిరేసినది. త్రోసిపుచ్చినదని కూడా అర్థమే. Thrown out.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రచ్ఛన్న ()
Telugu original

ప్రచ్ఛన్న : మరుగుపడిన. Hidden. ప్రకాశానికి వ్యతిరిక్తమైనది. Private. ఆత్మచైతన్యం నామరూపాలచేత ప్రచ్ఛన్నమైనది కనుకనే దీనిని మరల ప్రకాశింపజేసుకోవలసిన అవసరం ఏర్పడింది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రతిభాన ()
Telugu original

ప్రతిభాన : ప్రతి ఒక్కటీ స్ఫురించటం. అలాంటి స్ఫురించే శక్తి Genious. ప్రతిభ అని కూడా పేర్కొంటారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రతిభాస ()
Telugu original

ప్రతిభాస : వస్తుతః లేకున్నా ఉన్నట్టు భాసించటం. False Appearance. స్వప్నం లాంటి అనుభవమిది. అలాంటి పదార్థానికి ప్రాతిభాసికమని పేరు. పారమార్థికానికి వ్యావహారికానికి మధ్యస్థమైన దశ.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రచ్యుత ()
Telugu original

ప్రచ్యుత : జారిపడినది. అదే జీవభావం. పడకపోతే అచ్యుత. అదే ఈశ్వర భావం. ఈ ప్రచ్యవనం కూడా మన భావనే. వాస్తవం కాదు అన్నారు గౌడపాదులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రజా ()
Telugu original

ప్రజా : ప్రకర్షేణ జాయతే ఇతి. ఏది తరచూ జన్మిస్తుందో అది జీవజాలం. అలా జన్మించటం ప్రజననం. ప్రజననేంద్రియం అంటే గోప్యేంద్రియం అని కూడా అర్థమే. Genital Organ.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రజ్ఞా/ప్రజ్ఞాన ()
Telugu original

ప్రజ్ఞా/ప్రజ్ఞాన : 'ప్రజ్ఞా త్రైకాలికీ మతా.' త్రికాలాలకు సంబంధించిన జ్ఞానం. విశేష జ్ఞానం కాక సామాన్యమైన జ్ఞానం. సమష్టి జ్ఞానం. పూర్ణజ్ఞానం. ఇలాంటి పరిపూర్ణ జ్ఞానమే బ్రహ్మస్వరూపం. 'ప్రజ్ఞానం బ్రహ్మ. తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః' ఆ బ్రహ్మతత్త్వాన్ని ముందు విజ్ఞానరూపంగా గ్రహించి తరువాత ప్రజ్ఞాన రూపంగా దానిలో స్థిరపడాలని ఉపనిషత్తు చెప్పిన మాట.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రజ్ఞానఘన ()
Telugu original

ప్రజ్ఞానఘన : బ్రహ్మస్వరూపం. ముందు చెప్పినట్టు ప్రజ్ఞేయమేమాత్రమూ లేని కేవల ప్రజ్ఞానమే అని అర్థం. ఘనమనే మాట సాంద్రమైన పదార్థాన్ని చెబుతుంది. అందులో ఆ పదార్థ లక్షణమే తప్ప దానికి విజాతీయమైన లక్షణం ఉండరాదు. ఉంటే అది ఘనం కాదు. ప్రస్తుతం బ్రహ్మతత్త్వంలో ప్రజ్ఞానమే తప్ప ప్రజ్ఞేయం లేదు గనుక అది ప్రజ్ఞాన ఘనమన్నారు Pure un adulterated consciousness.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రణవ ()
Telugu original

ప్రణవ : 'ప్రకర్షేణ నూయతే. స్తూయతే ఇతి.' ఎక్కువగా ఉచ్ఛరించబడేది. స్తుతించబడేది అని అక్షరార్థం. ప్రణవమంటే ఓంకారమే. అ ఉ మ ఈ మూడక్షరాల సంపుటీ కరణమే ఓం అనే మంత్రం. ఇది సకల వేదసారమని వేదాంతుల వచనం. పరాపర బ్రహ్మతత్త్వాలను పట్టుకోవటానికి ఇది సాధకులకు ఆలంబనం అని కూడా వారు పేర్కొంటారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
పక్వ ()
Telugu original

పక్వ : బాగా పండిపోయినది. పరిపాకానికి వచ్చినది Mature. Perfect. జ్ఞానం పరిపక్వమైతేనే మోక్షప్రాప్తికి దారితీస్తుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రణిధాన ()
Telugu original

ప్రణిధాన : Attention. అవధానమని అర్థం. తదేక దృష్టి. ఏకాగ్రత. ఒక లక్ష్యంమీద మనస్సు బాగా నిలపటం అని అక్షరార్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రతిజ్ఞా ()
Telugu original

ప్రతిజ్ఞా : Proposition. హేతువాదంలో వచ్చే ఐదు భాగాలలో మొదటి భాగం. ప్రతిజ్ఞా, హేతు, ఉదాహరణ, ఉపనయ, నిగమన అనే ఐదింటిలో మొదట ప్రతిజ్ఞతో ప్రారంభమవుతుంది వాదం. ప్రతిజ్ఞ అంటే ఒక విషయాన్ని మొదట ప్రతిపాదించటం. 'పర్వతో వహ్నిమాన్‌.' కొండమీద నిప్పున్నది అని చెప్పటం ప్రతిజ్ఞ.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రతిగ్రహ ()
Telugu original

ప్రతిగ్రహ : దానమనే దానికి వ్యతిరేకపదం. ఒకరి కివ్వటం దానమైతే ఒకరి దగ్గర పుచ్చుకోవటం ప్రతిగ్రహం. బ్రాహ్మణుడికి చెప్పే షట్కర్మలలో ఇది ఒకటి.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రతిపత్తి ()
Telugu original

ప్రతిపత్తి : గ్రహించటం. అర్థం చేసుకోవటం. అంగీకరించటం. జ్ఞానం. ఒక విధి నెరవేర్చిన తరువాత దానికి చెప్పే వినియోగం కూడా.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రతిపత్తి సౌకర్యం ()
Telugu original

ప్రతిపత్తి సౌకర్యం : ఒక గహనమైన భావాన్ని గ్రహించటంలో ఎలాంటి కష్టమూ లేకుండా సుకరంగా దాన్ని బోధ పరచటానికి అవలంబించే సాధనం. కథలు, అర్థవాదాలూ ఇలాంటివే. శాస్త్రార్థ బోధకు ఇలాంటి సామగ్రి ఉంటేగాని మంద, మధ్యమాధికారులందరికీ శాస్త్రార్థమందదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రతిబింబ ()
Telugu original

ప్రతిబింబ : బింబం తాలూకు ఆభాస. Reflexion. అద్దంలో ముఖంలాంటిది. జీవుడు ఈశ్వర చైతన్యానికి ఇలాంటి ప్రతిబింబమే కాని వాస్తవం కాదంటారు వేదాంతులు. ఛాయాత్మ అని కూడా దీనికొక పేరుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రతిబందీ ()
Telugu original

ప్రతిబందీ : ఎదటివాడి వాదాన్ని సవ్యంగా ఎదుర్కోక ప్రశ్నకు మరల ఎదురు ప్రశ్నవేసి వాడిని నిరుత్తరుణ్ణి చేసే విధానం. ప్రతిబందీ న్యాయమని పేర్కొంటారు దీన్ని.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రతిబోధ ()
Telugu original

ప్రతిబోధ : జ్ఞానం. ఆత్మజ్ఞానం. ప్రతి ఒక్క బుద్ధి వృత్తి అని కూడా అర్థమే. ప్రతిబోధ విదితం మతం. మన బుద్ధివృత్తులు ప్రతి ఒక్కదానిలో అధిష్ఠాన రూపంగా తొంగి చూస్తున్నది ఆత్మచైతన్యం. వృత్తి వ్యభిచరిస్తుంటే అది అవ్యభిచారిగా నిలిచి వాటి రాకపోకలు గమనిస్తుంటుంది. దాన్ని ఈ వృత్తులకు విలక్షణంగా మూల భూతంగా పట్టుకోగలగడమే ప్రతిబోధం. ఆత్మస్వరూపాన్ని పట్టుకునే సూక్ష్మమైన మార్గమిది అని కేనోపనిషత్తు లోకానికి చేసిన బోధ.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రతిమా ()
Telugu original

ప్రతిమా : Replica. Image. విగ్రహం.పోలిక. Similarity. ప్రతీక. Symbol. Semblance.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రతిపక్ష ()
Telugu original

ప్రతిపక్ష : పక్షం కానిది. ఎదటి పక్షం. Opposite Party. వాదంలో ప్రతివాది పక్షమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రతియోగ ()
Telugu original

ప్రతియోగ : ఒకదానికి జత అయిన మరి ఒకటి Counterpart. ప్రతికూలమైతే ప్రతియోగి. అనుకూలమైతే అనుయోగి.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రతిషేధ ()
Telugu original

ప్రతిషేధ : నిషేధమనే అర్థం. త్రోసిపుచ్చటం. విధికి వ్యతిరేక పదం. ఆత్మను స్వరూప లక్షణంతో సూటిగా పట్టుకుంటే అది విధి ముఖం. అలాకాక ఇది కాదని, అది కాదని ఉపాధులనన్నింటిని దానిలో లయం చేస్తూ పట్టుకుంటే అది ప్రతిషేధ ముఖం. ఇలాంటి ప్రతిషేధ లక్షణమే ఆత్మను సంపూర్ణంగా మనకు పట్టి ఇస్తుందని శాస్త్రజ్ఞుల సలహా.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రతిష్టంభ ()
Telugu original

ప్రతిష్టంభ : ఆగిపోవటం. అక్కడికి నిలిచిపోవటం. ఎదురుదెబ్బ తగలటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రతిష్ఠా ()
Telugu original

ప్రతిష్ఠా : గట్టిగా నిలబడటం. సమసి పోవటం. లయమై పోవటం. ప్రపంచానికి పరమాత్మ ప్రతిష్ఠ అంటే దీనికి మూలకారణమని అర్థమే. దీనికి లయస్థానమనీ అర్థమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రతిసర్గ ()
Telugu original

ప్రతిసర్గ : సర్గమంటే సృష్టి. దానికి వ్యతిరిక్తం ప్రతిసర్గ. అంటే ప్రళయమని అర్థం. Dissolution.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రతిఘాత ()
Telugu original

ప్రతిఘాత : ఎదురు తగలడం. తిప్పికొట్టటం. Reflex. యోగసిద్ధులలో అప్రతిఘాతమని ఒకటున్నది. సిద్ధుడైన వాడికి ఏ భౌతిక పదార్థమూ అడ్డురాదంటారు. చెట్టు చేమలలో కొండలలో నుంచి కూడా దూసుకుని పోయే శక్తి వాడికుంటుందట. ప్రతిఘాతం లేదు అతనికి అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రతీక ()
Telugu original

ప్రతీక : Symbol. ఒక చిహ్నం. విగ్రహం. నామరూపాలు రెండూ పరమాత్మకు ప్రతీకలే. అంటే సత్యాన్ని సూచించేవే. తనపాటికి తాను అసత్యమైనా ప్రతీకలన్నీ జాగ్రత్తగా పట్టుకొని సాగిపోతే మనలను సత్యం దగ్గరకే తీసుకెళుతాయి. అసతోమా సద్గమయ Means that leads us to the end.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రతీతిసిద్ధం ()
Telugu original

ప్రతీతిసిద్ధం : సత్యం కాకున్నా సత్యంలాగ భాసించటం ప్రతీతి. Appearance అలా భాసించటం మూలంగా సిద్ధించినదేదో అది ప్రతీతి సిద్ధం. మనకు చుట్టూ కనిపించే ఈ ప్రపంచం అలాంటిదే. ఇది వస్తు సిద్ధం కాదు. ప్రతీతి సిద్ధమంటారు అద్వైతులు. ప్రతీతికి ఆధారం ప్రతీతి కాదు. వస్తువే ప్రతీయమాన మవుతున్నది. ప్రతీయమానం ఒకటి ఏదో వాస్తవంగా ఉండి కాదు. రజ్జువు సర్పంగా ప్రతీత మవుతున్నదంటే సర్పంగాదు రజ్జువే అలా అవుతున్నదని మనం అర్థం చేసుకోవాలి.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రత్త ()
Telugu original

ప్రత్త : దత్త అని అర్థం. Given. Gift.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రత్యక్ష ()
Telugu original

ప్రత్యక్ష : అక్షం ప్రతి. అక్షం అంటే ఇంద్రియం. ప్రతి ఇంద్రియానికి గోచరించేది. షడ్విధ ప్రమాణాలలో ఇది మొదటిది. జ్ఞానేంద్రియ పంచకానికి గోచరించేదంతా ప్రత్యక్షమే. Perception. అపరోక్షమని కూడా దీనికి పర్యాయం. అనుభవమెప్పుడూ ప్రత్యక్షమే కావాలి. అంతవరకూ అది సిద్ధాంతమేగాని దృష్టాంతం కాదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రత్యక్‌/ప్రత్యగాత్మా ()
Telugu original

ప్రత్యక్‌/ప్రత్యగాత్మా : పరాక్‌కు వ్యతిరేకపదం. పరాక్‌అంటే బయటకు వెళ్ళేది. ప్రత్యక్‌అంటే వెనుకకు మళ్ళేది. Introvert అంతర్ముఖమని అర్థం. ఆత్మ ఎప్పుడూ ప్రత్యక్కే. అది అన్నింటినీ గమనించే చైతన్యం కాబట్టి వాటికి వెనకాలే ఉండి తీరాలి. అందుకే అది ప్రత్యగాత్మ అయింది. The inner most self. అంతరాత్మ అని కూడా పేర్కొంటారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రత్యభిజ్ఞా ()
Telugu original

ప్రత్యభిజ్ఞా : అభిజ్ఞ అంటే గుర్తించటం. Cognition. ప్రత్యభిజ్ఞ అంటే మరల గుర్తుపట్టటం Recognition. మరచిపోయిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవటం అని అర్థం. జీవుడు ఎంతో కాలమైంది తాను ఈశ్వరుడనే సత్యాన్ని మరచిపోయి. గురూపదేశం వల్ల అది ఎప్పటికైనా గుర్తించగలిగితే అదే ఈశ్వర సాయుజ్యం. కొత్తగా పొందేది కాదిది. ఉన్నదానినే గుర్తించటం. కంఠ చామీకర న్యాయంగా తన స్వరూపాన్ని తాను గుర్తు చేసుకోవలసి ఉంది. అద్వైతులు చెప్పే సాధన మార్గమిదే. మరేదీకాదు. యః ప్రత్యభిజ్ఞాయతే. రాత్రి కాలం గాఢ నిద్ర పోయేటప్పుడు అంతకు ముందున్న మన స్వరూపం మరచిపోతాం. మెళకువ వచ్చిన తరువాతనే మనం ఫలానాగదా అని గుర్తు చేసుకుంటాం. అప్పుడు ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒకే తత్త్వమని అనుభవానికి వస్తుంది. అలాగే ఎప్పుడో దూరమైన ఈశ్వర తత్త్వం వాస్తవంలో మన స్వరూపమే. మధ్యలో నిద్రలాంటి అవిద్యావస్థ మనలను ఆ తత్త్వానికి దూరం చేసింది. ఎప్పుడైతే గురూపదేశ బలంతో జ్ఞాపకం చేసుకున్నామో అప్పుడా ఈశ్వరుడు ఈ జీవుడినైన నేను ఒకే ఒక తత్త్వమని మరలా అనుభవానికి రాగలదు. అద్వైతుల ఈ మార్గాన్నే శివాద్వైతులు కూడా అనుకరించి చాలాదూరం వివరించి చెప్పారు. వారి దర్శనానికి ప్రత్యభిజ్ఞా దర్శనమనే పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రత్యయ ()
Telugu original

ప్రత్యయ : నమ్మకం. విశ్వాసం. పొందటం. మనస్సులో కలిగే ఆలోచన. వృత్తి. Idea. దీనికి ప్రతిగా వెలపల కనిపించేది విషయం. Thing. మొదటిది నామం. రెండవది రూపం. ఆత్మ ప్రత్యయమంటే ఆత్మాకార వృత్తి. విషయాకార వృత్తి విషయానుభవాన్ని అందించినట్టే, ఆత్మాకార వృత్తి The idea of the self. ఆత్మానుభవాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఆత్మ ప్రమేయమనుకుంటే, ఆత్మప్రత్యయం దానికి ప్రమాణం. Proof.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రత్యవస్థాన ()
Telugu original

ప్రత్యవస్థాన : ఎదురొడ్డి నిలవడం. Assault. ప్రతిఘటించటం. ప్రతివాదులు వాదిని నిలదీయటం. Opposition.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రత్యవాయ ()
Telugu original

ప్రత్యవాయ : శాస్త్రచోదితమైన నిత్య నైమిత్తికాది కర్మలు అనుష్ఠిస్తే ఏ దోషమూ లేదు. అలాకాక వాటిని యధావిధిగా ఆచరించక ఎగవేస్తే కలిగే దోషానికి ప్రత్యవాయమని పేరు. అథఃపతనమని, అనిష్ట ఫలదాయకమని అర్థం. Undesired Result. అనర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రత్యాఖ్యాన ()
Telugu original

ప్రత్యాఖ్యాన : నిరాకరించటం. చెల్లదు పొమ్మని తోసిపుచ్చటం. Refutation.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రత్యాదేశ ()
Telugu original

ప్రత్యాదేశ : అదే అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రత్యామ్నాయ ()
Telugu original

ప్రత్యామ్నాయ : Alternative. ఒకదాని స్థానంలో మరొకదాన్ని పెట్టి పని సవరించటం. Substitution. సువర్ణస్థానే అక్షతాన్‌సమర్పయామి. ఇలాంటి వ్యవహారం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రత్యాహార ()
Telugu original

ప్రత్యాహార : అష్టాంగ యోగంలో ఒక అంగం. ఇంద్రియ వృత్తులను వెనక్కు మళ్ళించే ప్రక్రియ. Withdrawal ఉపరతి అని అద్వైతుల పరిభాష.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రత్యుక్త ()
Telugu original

ప్రత్యుక్త : జవాబు చెప్పి తప్పించిన విషయం. Answered. Replied. ఇక మరలా క్రొత్తగా చెప్పవలసినది లేదని అర్థం. 'ఏతేన యోగః ప్రత్యుక్తః.' దీనితో యోగానికి జవాబు చెప్పాము అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రత్యవమర్శ ()
Telugu original

ప్రత్యవమర్శ : మరలా పరామర్శించటం. Recapitulation. ప్రత్యాకలనమన్నా ఇదే అర్థం. పూర్వం చెప్పిన విషయాలన్నింటిని మరలా సంగ్రహంగా నెమరు వేసుకోవటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రత్యుత ()
Telugu original

ప్రత్యుత : భాషలో ఇది ఒక అవ్యయం. Indeclinable. మీదు మిక్కిలి. పైగా Moreover అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రత్యుజ్జీవన ()
Telugu original

ప్రత్యుజ్జీవన : మరల బ్రతికించటం. To revive మేము హేతువాదంతో ప్రతివాదాన్ని పూర్తిగా ఖండించినా మరలా తృప్తిలేక అదే విషయాన్ని ఎదటివారు ప్రస్తావిస్తున్నారు. అనవసరంగా చచ్చిన పామును బ్రతికించటానికి ప్రయత్నిస్తున్నారని వేళాకోళం చేసే సందర్భంలో వచ్చే మాట ఇది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రత్యుత్పన్న ()
Telugu original

ప్రత్యుత్పన్న : అప్పటికప్పుడు ఏర్పడింది. క్రొత్తగా స్ఫురించేది. నవోదితం. Resourceful అని కూడా అర్థమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రదేశ/ప్రాదేశిక ()
Telugu original

ప్రదేశ/ప్రాదేశిక : ఒక స్థానం Spot. అంతవరకే పరిమితమైతే అది ప్రాదేశికం. Restricted to a point. సార్వత్రికానికి ఇది వ్యతిరిక్తం. జీవుడు హృదయంలో ఉన్నాడంటే అతని స్వరూపం ప్రాదేశికం మాత్రమే కాదు. ఉపాధివల్ల అలా భాసిస్తున్నా వస్తుతః అది సార్వత్రికమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రధాన ()
Telugu original

ప్రధాన : ముఖ్యమైనది. అంతేగాక సాంఖ్యులు చెప్పే మూలప్రకృతికి కూడా Premordial Matter. ప్రధానమనే పేరు. ఇది అచేతనం. పోతే వారు చెప్పే పురుషుడు చేతనుడు. ప్రధాన కారణవాదమని వారి వాదానికి పేరు. అచేతనమైన ప్రధానమే సృష్టి కర్త. పురుషుడు కేవలం భోక్త మాత్రమే. కర్త కాడు. ఇది వారిరువురికి ఉన్న సంబంధమని వర్ణిస్తారు సాంఖ్యులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రధ్వంస ()
Telugu original

ప్రధ్వంస : పూర్తిగా నశించటమని అర్థం. నాలుగు అభావాలలో Absence ఇది ఒకటి. ఒకటి పోయిన తరువాత ఏర్పడే అభావం. 'సాది అనంతం.' అని దీని లక్షణాన్ని వర్ణిస్తారు తార్కికులు. పోవటంతో మొదలై మరలా ఆ వస్తువిక ఎప్పటికీ కనపడదు. కాబట్టి అది ఉంది కాని అంతం లేనిదని అర్థం. ప్రధ్వంసా భావమని ధ్వంసమని దీనికే పర్యాయపదాలు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రపంచ ()
Telugu original

ప్రపంచ : విస్తరణమని, వివరణమని Explanation. Expansion అక్షరార్థం. సామాన్య రూపమైన ఆత్మచైతన్యం ఇలా నామరూపాత్మకంగా విస్తరించి కనిపిస్తూ ఉంది కనుక దీనికి ప్రపంచమని పేరు వచ్చింది. పంచ భూతాత్మకమిది. అంచేత కూడా దీనికి ప్రపంచమని పేరు వచ్చింది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రబోధ/ప్రబుద్ధ ()
Telugu original

ప్రబోధ/ప్రబుద్ధ : ప్రబోధమంటే మెలకువ. Wakefullness జ్ఞానం. Awareness. ముఖ్యంగా ఆత్మజ్ఞానం. అదీ ఒక మెళకువే. అనాది అవిద్యా రూపమైన నిద్ర నుంచి ఏర్పడే మెళకువ. అలా మేలుకొన్న జ్ఞాని ఎవడో వాడు ప్రబుద్ధుడు Awakened soul.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రభవ ()
Telugu original

ప్రభవ : Origin. మూలస్థానం. Source. ఆరంభం. Beginning. ఆది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రభు/ప్రభావ ()
Telugu original

ప్రభు/ప్రభావ : ప్రభవతీతి ప్రభుః ప్రభవతి అంటే ఈష్టే. అన్నింటిని శాసించేవాడని అర్థం. Commander అలాంటివాడే ప్రభువు. వాడికున్న సామర్ధ్యమే ప్రభావం. ఐశ్వర్యమని కూడా దీనికి పర్యాయపదం Mastery. Power.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రభేద ()
Telugu original

ప్రభేద : భేదమన్నా, ప్రభేదమన్నా ఒకటే. Devision. అంతేకాదు. ఒక సముదాయానికి చెందిన భాగాలకు కూడా Parts in a whole ప్రభేదమనే శబ్దం వర్తిస్తుంది. 'ద్రవ్య భేదాః ద్రవ్యస్య ప్రభేదాః' అంటే ద్రవ్యంలో ఉండే భాగాలని మాత్రమే అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రమ/ప్రమాతా/ప్రమాణ/ప్రమేయ/ప్రమితి ()
Telugu original

ప్రమ/ప్రమాతా/ప్రమాణ/ప్రమేయ/ప్రమితి : ప్రమ అంటే జ్ఞానం. ఆత్మజ్ఞాన మని ఇక్కడ అర్థం. అది కలవాడు ప్రమాత. దానికి సాధనం ప్రమాణం. దానిద్వారా అందుకొనే పదార్థం ప్రమేయం. దానివల్ల కలిగే ఫలం ప్రమితి. వీటినే రకరకాలుగా వ్యవహరిస్తారు వేదాంతంలో. జ్ఞానం, జ్ఞాతా, జ్ఞాన సాధనం, జ్ఞేయం జ్ఞప్తి అని కూడా వీటినే పేర్కొనవచ్చు. ఇది లోకంలోనూ శాస్త్రంలోనూ తప్పనిసరిగా ఉండవలసిన నియమం. ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే చేసుకునేవాడొకడు, చేసుకోబడేది ఒకటి, చేసుకునేందుకు తోడ్పడే సాధనమొకటి, చేసుకొంటే కలిగే ప్రయోజనమొకటి ఉండి తీరవలసిందే గదా. ఇది లోకంలో ఎలాగో వేదాంతంలో కూడా అలాగే ఆవశ్యకం. అక్కడ ప్రమాత జీవుడు. నీవూ నేనూ. ప్రమాణం మన ఇంద్రియాలు, మనస్సు. ప్రమేయం పరమాత్మ తత్త్వం. దాన్ని గ్రహిస్తే కలిగే అనుభవం ప్రమితి. వీటి పరస్పర సంబంధాన్ని చక్కగా భావన చేసి సాధన ఎడపడకుండా చేయగలిగితే తప్పకుండా సాధకుడు సిద్ధిని పొందగలడని శాస్త్రజ్ఞులు బోధిస్తారు. ఇందులో ఒక సూక్ష్మమేమంటే అద్వైతంలో ఈ నాలుగింటికీ భేదం లేదు. నాలుగూ కలిసి ఒకే ఒక ఆత్మతత్త్వమే. అదే వికల్పించి చూస్తే నాలుగు రూపాలలో భాసిస్తున్నది. విమర్శించి చూస్తే నాలుగూ ప్రమాత అయిన జీవుడి స్వరూపంగానే సాక్షాత్కరిస్తుంది. ఇదీ అద్వైత సిద్ధాంతం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రయత ()
Telugu original

ప్రయత : నియత అని అర్థం. Disciplined. Restrained.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రయత్న ()
Telugu original

ప్రయత్న : అభ్యాసం. Practice. Effort. ఆత్మజ్ఞానాన్ని పొందే ఉద్యమం. జిజ్ఞాస. విచారణ. ఇది అద్వైతంలో క్రియారూపం కాదు. భావనారూపం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రయాజ ()
Telugu original

ప్రయాజ : కర్మమీమాంసకు సంబంధించిన ఒక యాగానుష్ఠానం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రయోగ ()
Telugu original

ప్రయోగ : కేవల సిద్ధాంత జ్ఞానంకాక దానిని క్రియారూపంగా అమలు పరచటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రయోజన ()
Telugu original

ప్రయోజన : ఫలం Result. Purpose. Aim. ఉద్దేశించినది. శాస్త్రాధ్యయనానికి అనుబంధ చతుష్టయమని ఒక నియమం ఉంది. అందులో మొదటిది అధికారి. రెండవది విషయం. మూడవది సంబంధం. నాలుగవది ప్రయోజనం. అధికారికి విషయంతో ఉన్న సంబంధం వల్ల కలిగే ఫలితమని అర్థం. అద్వైతంలో ఈ ప్రయోజనమేదో గాదు బంధ విమోచనమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రరోచన ()
Telugu original

ప్రరోచన : అభిలాష కల్పించటం. Attraction. Temptation. సాధించవలసిన విషయంలో అభిరుచి కలిగించే విధానం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రలాప ()
Telugu original

ప్రలాప : హేతుబద్ధం కాని వాదం. వదరుబోతు తనం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రవచన ()
Telugu original

ప్రవచన : శాస్త్రార్థాన్ని చక్కగా వ్యాఖ్యానించి చెప్పటం. వేదాంత బోధ.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రవర్గ్య ()
Telugu original

ప్రవర్గ్య : పూర్వమీమాంసకు చెందిన అనుష్ఠాన విశేషం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రవిభక్త ()
Telugu original

ప్రవిభక్త : పరస్పరం, భిన్నమైన, విలక్షణమైన, వేర్వేఱు. Separate.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రవిలయ ()
Telugu original

ప్రవిలయ : కరగిపోవటం. అద్వైతుల సాధనమార్గమిదే. బ్రహ్మజ్ఞానంలో నామరూపాది జ్ఞేయ ప్రపంచమంతా లయమై ఆత్మగానే పరిణమించాలంటారు. లయమంటే కరగిపోవటమే. ప్రవిలయమనే మాట పూర్తిగా నిశ్శేషంగా కరగి పోవటమనే అర్థాన్ని చెబుతుంది. అంటే ప్రపంచ వాసన ఇక ఏ మాత్రమూ మిగలకూడదని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రవృత్తి ()
Telugu original

ప్రవృత్తి : ముందుకు పోవటం. ప్రాపంచికమైన మార్గం. కర్మ మార్గం. ధర్మ పురుషార్థం. దీనికి వ్యతిరిక్తమైనది నివృత్తి. మోక్షమార్గం. ఒకటి కర్మాచరణ ద్వారా సంసారానికి దారిచూపితే మరొకటి జ్ఞానాభ్యాసం ద్వారా సాయుజ్యానికి మార్గం చూపుతుంది. వేద వాఙ్మయం రెండు శాఖలే. మొదటిది ప్రవృత్తి ధర్మం బోధిస్తుంది. దీనికే ధర్మమని కూడా మరొకపేరు. రెండవది నివృత్తి ధర్మం బోధిస్తుంది. దీనికే మోక్షమని పేరు. మొదటిది వర్గమైతే రెండవది, అపవర్గమని పేర్కొంటారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రవేశ ()
Telugu original

ప్రవేశ : ఒక ఉపాధిలో వచ్చి చేరటం. జగత్తుకు సంబంధించింది సృష్టి, అయితే జీవుడికి చెందినది సృష్టికాదు. ప్రవేశం. వికృతి చెందితే సృష్టి. చెందకుండా అవికృతంగా Unchanged అలాగే వచ్చి చేరితే ప్రవేశం. విజాతీయంగా భాసిస్తే సృష్టి. సజాతీయంగా పరిచ్ఛిన్నమై కనిపిస్తే ప్రవేశం. ఒకటి మారటం. మరొకటి మారకుండా చేరటం. కనుకనే జగత్తుకు మరలా సాధనచేసి తరించే అవకాశం లేదు. అది కేవలం జీవుడికి మాత్రమే. కారణం చైతన్యం ఇక్కడ మారకుండా వచ్చి ప్రవేశించింది. మహా అయితే పరిమితమైంది. అంతమాత్రమే కనుక పరిమాణాన్ని అంతకంతకూ ఎక్కువ చేసుకోగలిగితే మూలస్థానాన్ని చేరటానికి ఎంతైనా అవకాశముంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రవ్రజ్యా/ప్రవ్రజన ()
Telugu original

ప్రవ్రజ్యా/ప్రవ్రజన : పారివ్రాజ్యం. పరివ్రాజక ధర్మం. సన్యాసం. సర్వత్రా సంచరించటం అని అర్థం. Mendicant.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రశంసా ()
Telugu original

ప్రశంసా : ఒక విషయం మంచిదని పొగడటం. స్తుతి. దానిపై మక్కువ పుట్టించి తద్వారా దానిని అనుష్ఠింపజేయటమే ప్రశంసించటంలోని తాత్పర్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రసంగ/ప్రసక్తి/ప్రసక్త ()
Telugu original

ప్రసంగ/ప్రసక్తి/ప్రసక్త : ఒక విషయానికి అవకాశమేర్పడడం. Occasion. సంబంధ మేర్పడడం. Concern. Necessity. అలాంటి అవసరమేర్పడితే అది ప్రసక్తం. లేకుంటే అప్రసక్తం. Unconcerned. ప్రసంగం ప్రసక్తి అంటే ఒకదానితో సంబంధం పెట్టుకుని అందులోనే పడిపోవటమని కూడా అర్థమే. కర్మ ననుష్ఠిస్తూ దాని ఫలం మీద ప్రసక్తి ఏ మాత్రమున్నా సంసార బంధానికి అది దారి తీస్తుంది. అందులోనుంచి బయట పడాలంటే మానవుడి దృష్టి అప్రసక్తమై ఉండాలి గాని ప్రసక్తి పనికి రాదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రసాద/ప్రసన్న ()
Telugu original

ప్రసాద/ప్రసన్న : నైర్మల్యం. స్వచ్ఛత. Cleanliness మనః ప్రసాదమంటే మనస్సు నిర్మలంగా స్వచ్ఛంగా ఉండటం. మనసేగదా ఆత్మజ్ఞానానికి ఏకైక సాధనం. అది ప్రాపంచిక వృత్తులతో వాసనలతో కలుషితమైతే పనికిరాదు. అవి పూర్తిగా తొలగిపోతే ప్రసన్నమై ఆత్మస్వరూపాన్ని చక్కగా భావించగలదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రమాద ()
Telugu original

ప్రమాద : పరాకు. పరాధ్యానం. ఉన్న విషయాన్ని మరచిపోవటమని అర్థం. Lack of Attention. Absent mindedness. ఆత్మానుభవంలో జరిగిన విషయమిదే. మన స్వరూపమే అయినా మనకది అనుభవానికి రాలేదంటే దానికి కారణం ప్రమాదమే నన్నారు మహర్షులు. అంటే దానిమీద దృష్టి లేకపోవటం. దానికి కారణం దానికి భిన్నమైన అనాత్మ జగత్తుమీద దృష్టి పెట్టటం. ఇది అనేకం కాబట్టి ఒకదానితో నిలవక ఒక దాని తరువాత ఒకటి ఎప్పుడూ ప్రాకులాడుతూనే పోతుంది మనస్సు. కనుకనే తన స్వరూపమే అయినా గుర్తించే అవకాశం లేకపోయింది. ఎప్పటికయినా దానివైపు మనసు మళ్ళితే ప్రమాదం తప్పిపోతుంది. దీనికే అవధానమని ప్రణిధానమని తత్పరత్వమని పేరుపెట్టారు వేదాంతులు. ఇది లేకుంటే మనకున్నది కేవలం అనవధానమే. ప్రమాదమే. తుదకు మృత్యువు కూడా ఒక ప్రమాదమే నన్నాడు సనత్సజాతుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రవిలాపన ()
Telugu original

ప్రవిలాపన : బాగా కరిగించి వేయటమని అర్థం. ద్రవాన్ని కాదు. ఘన పదార్ధాన్ని. ప్రస్తుతం ఈ ప్రపంచమంతా చైతన్యరసమే. ఘనీభవించి ఇలా నామరూపాత్మకంగా కనిపిస్తున్నది. కనుక దీనిని మరలా చైతన్యాత్మకంగా దర్శించటమే కరిగించటం. వస్తువునైతే కరిగించటం అసాధ్యం. ఆభాస అయితేనే మరలా వెనుకకు తీసుకోవటం సులభమవుతుంది. ఇది వస్తువు కాదు గనుకనే కరిగిస్తే కరిగిపోగలదు. కరిగించటమంటే భౌతికంగా కాదు. క్రియారూపంగా కాదు. భావరూపంగా ఆభాస ఎప్పుడూ భౌతికంగా జరగదు. రజ్జు సర్పంలో సర్పం భౌతికంగా రాలేదు కదా. అది కేవలం మన భావనే. అలాగే ఈ ప్రపంచం కూడా భౌతికంగా సృష్టి కాలేదు. భావన వల్లనే ఏర్పడింది. అంచేత మరలా చైతన్యరూపంగా దర్శిస్తే తప్పకుండా కరిగిపోతుంది. అంటే చైతన్యరూపంగా భాసిస్తుందని భావం. ఇదే అద్వైతులు చెప్పే ప్రవిలాపన మార్గం. ఇదే సాధన మార్గం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రసిద్ధ ()
Telugu original

ప్రసిద్ధ : ప్రఖ్యాతమైన Famous. Well known. అంతేకాదు. ఏదో ఒక ప్రమాణానికి గోచరమైనప్పుడే అది ప్రసిద్ధమని శాస్త్రజ్ఞుల మాట. ప్రమాణానికి గోచరించకపోతే ప్రసిద్ధం కాదు. అంటే దానికి అస్తిత్వం లేదని అర్థం. ఇంతకూ ప్రమాణ సిద్ధమైనదేదో అదే సత్‌. అలా కానిది అసత్‌. ప్రస్తుతం బ్రహ్మతత్త్వం ప్రసిద్ధమా కాదా అని అడిగితే అది ఏ ప్రమాణానికైనా గోచరిస్తున్నదా అని అడగడం. ప్రత్యక్ష అనుమానాలకు గోచరం కాదది. అలాంటప్పుడు దానికి అస్తిత్వమెలాగ. అందుకే శాస్త్ర ప్రమాణం ద్వారా దాన్ని సాధించారు పెద్దలు. అయితే శాస్త్ర ప్రమాణం మనకు పరోక్షం కదా. అది మన అనుభవమెలా అవుతుంది అని అడగవచ్చు. శాస్త్రమంటే ఇప్పుడు పరోక్షమైనా పూర్వం మహర్షులకు అది అపరోక్షమే. అంటే అనుభవ సిద్ధమే. ఎటువచ్చీ అది మరల మన అనుభవానికి రావాలి. కనుకనే బ్రహ్మం ఏదోకాదు మన ఆత్మస్వరూపమే అని చెప్పారు. ఆత్మ అంటే అస్మత్ప్రత్యయ గోచరమే గదా. అంటే నేననే భావానికి స్ఫురిస్తూనే ఉందికదా. కనుక ఈ రూపంగా బ్రహ్మానికి అస్తిత్వం చెప్పవలసి ఉంటుంది. కనుక అదీ ప్రసిద్ధమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రస్థాన ()
Telugu original

ప్రస్థాన : ప్రయాణం. ప్రతిష్ఠతే అనేన ఇతి ప్రస్థానం. దేనిమీద నడచిపోతామో అలాంటి మార్గమని అర్థం. ప్రకృష్టం స్థానం అని కూడా చెప్పవచ్చు. అంటే ఆయువు పట్టు అని కూడా అర్థం. Strong Hold.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రస్థానత్రయ ()
Telugu original

ప్రస్థానత్రయ : ఇలాంటి ఆయువు పట్లు వేదాంతంలో మూడే మూడున్నాయి. ఉపనిషత్తులు. బ్రహ్మసూత్రాలు. భగవద్గీత. వీటికి ప్రస్థానత్రయమని పేరు. ఇందులో మొదటిది శ్రుతి. రెండవది న్యాయం. మూడవది స్మృతి క్రిందికి వస్తాయి. అంతేకాదు. మొదటి దానివల్ల శ్రవణం, రెండవదాని మూలంగా మననం, మూడవదాని ద్వారా నిది ధ్యాస సాగిస్తూ పోతే తప్పకుండా బ్రహ్మజ్ఞానం కలిగి తీరుతుందన్నారు. కనుక ఈ ప్రస్థానత్రయం వేదాంత సాధన మార్గంలో ఎంతైనా ఉపకరించే ప్రమాణం. మూడూ మూడు మార్గాలని భ్రమ పడరాదు. కారణం మూడూ కలిసి ఒకే ఒక బ్రహ్మానుభవాన్ని మనకు అందిస్తున్నాయి. కనుక ప్రస్థానమంటే మూడు మార్గాలని గాక ఒకే ఒక మార్గంలో మూడు మజిలీలని చెప్పుకోవటం ఎంతైనా సమంజసం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రహాణ ()
Telugu original

ప్రహాణ : బాగా చితకకొట్టి పారేయటం. నలగగొట్టటం. నిర్మూలించటం. అవిద్యా ప్రహాణం అంటే అజ్ఞాన నిర్మూలనమని అర్థం. వదలుకోవటమని కూడా అర్థమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రహ్లాద ()
Telugu original

ప్రహ్లాద : అన్ని ఆనందాలకన్నా అతీతమైన ఆనందం. ఆహ్లాద, సంహ్లాద, అనుహ్లాద అని ఎన్నో ఉన్నాయి అంతస్తులు. అన్నిటికన్నా ప్రకృష్టమైనది కనుక దీనికీ పేరు సార్థకం. బ్రహ్మానందమని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రజ్ఞా/ప్రాజ్ఞ ()
Telugu original

ప్రజ్ఞా/ప్రాజ్ఞ : ప్రకృష్టమైన జ్ఞానం ప్రజ్ఞ. పూర్ణజ్ఞానం. ఇది కలవాడు ప్రాజ్ఞుడు. సుషుప్తిలోని జీవుడికి ప్రాజ్ఞుడని పేరు. అప్పుడతడు మూఢుడు కదా. ప్రాజ్ఞుడెలా అయ్యాడు. భూతవృత్తి లేదా భావి వృత్తి చెప్పుకోవాలన్నారు శాస్త్రకారులు. మొదట ఈశ్వరుడే వాడు. ముక్తుడైతే మరల ఈశ్వరుడే. కనుక ప్రాజ్ఞుడు. అదికూడా కాదు. సుషుప్తిలో ప్రజ్ఞేయమైన ప్రపంచం లేదు. అలాగని ఏదీ లేకపోలేదు. ప్రజ్ఞానముంది. జ్ఞేయం లేదు కాబట్టి అది పరిశుద్ధం. ప్రజ్ఞాన ఘనం. కనుక అప్పుడున్న జీవుడు ఈ దృష్టితో చూస్తే ప్రాజ్ఞుడే.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రపత్తి ()
Telugu original

ప్రపత్తి : పొందటం. చేరటం. భజించటం. శరణు వేడటం. Surrender. 'యే యధా మామ్‌ప్రపద్యంతే.' ఎవరు ఎలాగ నన్ను శరణువేడుతారో అని అర్థం. అలాగే 'జ్ఞానవాన్‌మాం ప్రపద్యతే.' జ్ఞాని నన్ను పొందుతాడు. నా స్వరూపంతోనే ఏకమవుతాడని ఇక్కడ అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రపన్న ()
Telugu original

ప్రపన్న : అలాంటి భక్తుడు జ్ఞాని He that embraces the divinity.

Vedānta Paribhāṣā Vivaraṇa
పంచాగ్నివిద్యా ()
Telugu original

పంచాగ్నివిద్యా : అయిదు అగ్నులలో జీవుడు ఆహుతి అవుతూ పోతాడని వర్ణించే విద్య. డ్యు, ప్రర్జన్య, పృథివీ, పురుష యోషిత్తులని ఇవి ఐదు అగ్నులు. అగ్నులు కాకున్నా వీటిలో క్రమంగా ఆహుతి అవుతూ వస్తాడు కాబట్టి లాక్షణికంగా Metaphorical అగ్నులన్నారు వీటిని. మరణం మొదలు జననం వరకు జీవుడు చేసే ప్రయాణం ఇలా వర్ణించారు గృహస్థులకే. సన్యాసులకు లేదీ ప్రయాణం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పంచత్వం ()
Telugu original

పంచత్వం : మరల పంచభూతాలలో కలిసిపోవటం. మరణమని అర్థం. మొదట పంచభూతాలు పంచీకృతమై శరీర మేర్పడింది. కనుకనే ప్రారబ్ధం తీరిన తరువాత మరలా పంచ భూతాత్మకంగానే మారిపోవాలిది.

Vedānta Paribhāṣā Vivaraṇa
పంచీకరణ ()
Telugu original

పంచీకరణ : పంచభూతాలనూ ఒక్కొక్కటీ రెండేసి భాగాలు చేసి అందులో ఒకదాన్ని మరలా నాలుగు చేసి ఒక్కొక్కదాన్ని మిగతా భూతాలలో కలిపితే అది పంచీకృతమవుతుంది. అప్పుడే స్థూల ప్రపంచ సృష్టికి ఆస్కారం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రకరణ ()
Telugu original

ప్రకరణ : Context. సందర్భం. ప్రస్తావించటం. Commencement.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రాకరణిక ()
Telugu original

ప్రాకరణిక : ప్రస్తావించబడ్డ విషయం. ఒక సందర్భానికి చెందినది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రాకృత ()
Telugu original

ప్రాకృత : ప్రకృతికి సంబంధించినది. స్వాభావికమైనది Natural. సంస్కారం లేనిదని కూడా అర్థమే. Uncultivated. చదువు సంధ్యలు లేక మామూలుగా బ్రతికేవాడని కూడా అర్థమే. Ordinary Person పామరుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రాణ ()
Telugu original

ప్రాణ : ప్ర+అన. జీవం Life. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలని ఇవి ఐదు విధాలు. వీటికే పంచ ప్రాణాలని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రాతిభాసిక ()
Telugu original

ప్రాతిభాసిక : ప్రతిభాసించేది. ఇది స్వప్నంలో అనుభవానికి వచ్చే ప్రపంచం. వ్యావహారికమైతే జాగ్రత్తులో, పారమార్థికమైతే సుషుప్తిలో. పోతే ప్రాతిభాసికం అనేది స్వప్నంలోనే దర్శనమిస్తుంది. జాగ్రత్తులోనే పుట్టలోని సర్పం పారమార్థికమైతే రజ్జువులోని సర్పం ప్రాతిభాసికం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రాతిస్విక ()
Telugu original

ప్రాతిస్విక : దేనిపాటికది. Individual. Particular. ప్రతి ఒక్కదానికీ చెందినదని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రాతీతిక ()
Telugu original

ప్రాతీతిక : ప్రతీతమయ్యే పదార్థం. Apparant. వాస్తవం కానిది. కేవల మాభాస.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రాదేశిక ()
Telugu original

ప్రాదేశిక : ఆయా ప్రదేశాలకు మాత్రమే చెందినది. Restricted to a Place. చాలా పరిమితమైనదని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రాప్తి ()
Telugu original

ప్రాప్తి : ఒక పదార్థానికి ఉత్పత్తి తరువాత చెప్పవలసిన క్రియ. ఆప్తి అని కూడా పేర్కొంటారు. ఘటం ఉత్పన్నమైన తరువాత దానిని ఇంటికి తెచ్చుకోవటం లాంటిది. అంతేగాక ఒక సిద్ధాంతం ఒక చోట ప్రాప్తిస్తున్నదా లేదా అని చెప్పటంలో కూడా ఈ మాట కనపడుతుంది. అంటే అన్వయించటమని అర్థం. Application. ఒకటి లభించటం కూడా ప్రాప్తి క్రిందికే వస్తుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రాప్త ()
Telugu original

ప్రాప్త : ఏది ప్రాప్తిస్తుందో అది. ప్రారబ్ధం కొద్దీ మానవుడి అనుభవానికి వచ్చే సుఖదుఃఖాదులు. లేదా యోగముంటే కలిగే అనుభవం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రాప్తప్రాప్తి ()
Telugu original

ప్రాప్తప్రాప్తి : అద్వైతంలో రెండే రెండున్నాయి రహస్యాలు. ప్రపంచం లేకున్నా ఉన్నట్టు కనిపిస్తున్నది. కనుక దీనిని మరలా లేదని భావించటమే దీనిని త్రోసిపుచ్చటం. దీనికి పరిహృత హరిహారమని పేరు. అలాగే బ్రహ్మం ఉన్నా మనం లేదని భావించి మరలా దాన్ని ఉన్నదని అనుభవానికి తెచ్చుకుంటున్నాము. దీనికి ప్రాప్తప్రాప్తి అని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రబల ()
Telugu original

ప్రబల : బలమైనది. సమర్ధమైనది. Efficient. ప్రమాణాలలో ఒకదానికంటే ఒకటి ప్రబలమైనప్పుడు అంతవరకూ సత్యమని నమ్మినది ప్రమాణాంతరం చేత ఆభాస అయిపోతుంది. ఏది ప్రబలమో అదే ప్రమాణంగా తీసుకోవలసి ఉంటుందని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రాబల్య ()
Telugu original

ప్రాబల్య : సామర్థ్యం. పైన చెప్పుకున్న ప్రమాణాలలో ప్రబలమైన దానికున్న లక్షణం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రామాణిక ()
Telugu original

ప్రామాణిక : ప్రమాణ సిద్ధమైనది. Authoritative. Authentic.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రాయ ()
Telugu original

ప్రాయ : తరచుగా. బాహుళ్యం. Frequency.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రాయిక ()
Telugu original

ప్రాయిక : బహుళమైనది. తరచుగా ప్రాప్తించేది. ఆనందమయ అన్నప్పుడు మయ అనే ప్రత్యయం తరచుగా ఆనందం అనుభవించే అర్థాన్ని మాత్రమే చెబుతుంది గాని పరిపూర్ణమైన అనుభవాన్ని కాదని సిద్ధాంతం చేశారు భాష్యకారులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రాయశ్చిత్త ()
Telugu original

ప్రాయశ్చిత్త : ఒక దోషంగాని, పాపంగాని చేసిన తరువాత పశ్చాత్తాపపడి దానికి తగిన పరిహారం చేసుకోవటానికి ప్రాయశ్చిత్తమని పేరు. దీనివల్ల పాపక్షయమవుతుందని నమ్మకం. పుణ్యకార్యాలు చాలావరకూ ఇలాంటి దృష్టితోనే సాగిస్తారు లోకులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రాయణ ()
Telugu original

ప్రాయణ : ప్ర+అయన. బయలుదేరి పోవటం. ప్రయాణం. ఇది జీవితంలో చేసేదికాదు. అవసానంలో అంటే మరణమని అర్థం. Departure from the world.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రారబ్ధ ()
Telugu original

ప్రారబ్ధ : ప్రారంభించబడినది. త్రివిధ కర్మలలో ఒకటి. పూర్వజన్మలలో చేసినది వ్యక్తమై మనకీ వర్తమాన జన్మనిస్తే అలాటి కర్మకు ప్రారబ్ధమని పేరు. సంచితం నుంచి తయారవుతుంది కాబట్టి దీనికీ పేరు వచ్చింది. జీవన్ముక్తులను కూడా వదలిపెట్టదిది. 'ప్రారబ్ధం భోగతోనశ్యేత్‌' అనుభవంతో సమాప్తం కావలసినదే. వాడు పామరుడైనా పండితుడైనా అనుభవించిగాని దాని బాకీ తీర్చుకొనలేడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రాసంగిక ()
Telugu original

ప్రాసంగిక : ప్రసంగం అంటే సందర్భానికి తగినది ప్రాసంగికం. అంతేకాదు ప్రస్తుత విషయానికి అనుబంధంగా చెప్పుకునేది కూడా Accidental. Supplementary.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రేక్షా ()
Telugu original

ప్రేక్షా : దృష్టి. ఆత్మజ్ఞానం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రేక్షావత్‌ ()
Telugu original

ప్రేక్షావత్‌: అలాంటి దృష్టి కలవాడు. మేధావి. ముఖ్యంగా ఆత్మజ్ఞాని అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రేత ()
Telugu original

ప్రేత : ప్రయాణమై పోయినవాడు. Departed Soul. మరణించిన జీవి. ఇహంలో కాకున్నా పరంలో ఎక్కడో తప్పకుండా ఉంటాడని కర్మఫలశేషం అనుభవించటం కోసం మరలా జన్మించి తీరుతాడని ధర్మపురుషార్థం మనకు చెప్పే రహస్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రేత్య ()
Telugu original

ప్రేత్య : దేహాత్మాభిమానం వదలుకొని దానిలోనుంచి బయటికి రావటం. జీవన్ముక్తి అంటే ఇదే. దేహం లేకపోవటం కాదు. ఉన్నా దానిని నేను అని అభిమానించక పోవటమే. 'ప్రేత్య అస్మాత్‌లోకాత్‌అమృతా భవంతి.' లోకమంటే ఇక్కడ దేహమని అర్థం. దీనిలో నుంచి బయటపడ్డవాడు అమృతుడౌతాడని ఉపనిషత్తు ఘంటాపథంగా చెబుతున్న మాట. ప్రేత్య అంటే ఇక్కడ బయటపడి అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రేప్సా ()
Telugu original

ప్రేప్సా : 'ప్రాప్తు మిచ్ఛా.' ఒకటి పొందాలనే కోరిక. దీనికే కామమని ఆస్థ అని గర్థి అని పేరు పెట్టారు. అవిద్యవల్ల తనకు భిన్నమైన జగత్తు కనిపిస్తే కామం దాన్ని పొందే ప్రయత్నం మనచేత చేయిస్తుంది. ఇదే కర్మకు దారితీసి సంసారబంధం ఏర్పడింది జీవుడికి.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రేయస్‌ ()
Telugu original

ప్రేయస్‌: ప్రియ Positive. ప్రేయస్‌ Comparative ప్రియమైన దానికన్నా చాలా ప్రియమైనది అని అర్థం. ప్రాపంచికమని లాక్షణికార్థం. ఈ ప్రపంచ విషయాలు మనకు ప్రియమైనవే కాని హితమైనవి కావు. మొదట మేలుగా కనిపించి తరువాత కీడు చేసేది ప్రియం. మొదట కీడుగా కనిపించి పోనుపోను మేలు చేసేది హితం. ప్రియమే ప్రేయస్సు. పోతే దీనికి భిన్నంగా హితమైనదేదో అది శ్రేయస్సని పేర్కొన్నారు. ప్రేయస్సు ప్రాపంచికమైతే శ్రేయస్సు పారమార్థికం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రేరణ ()
Telugu original

ప్రేరణ : చోదన. పురికొల్పటం. పురమాయించటం. శాస్త్రం చెప్పిన విధులన్నీ ప్రేరణలే. ముందుకు త్రోయటమని కూడా అర్థముంది. ఏదో ఒక మహాశక్తి లోపల కూర్చుని మనస్సు మొదలైన వాటన్నిటిని ప్రేరణ చేస్తే అవి వాటివాటి విషయాల మీద పోయి వాలుతున్నాయని చెబుతున్నది శాస్త్రం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రోక్త ()
Telugu original

ప్రోక్త : ప్రవచనం చేయబడినది. Taught. బోధించబడినది. Instructed.

Vedānta Paribhāṣā Vivaraṇa
పారిప్లవ ()
Telugu original

పారిప్లవ : పైపైన తేలిపోవటం అని శబ్దార్థం. కాగా కర్మచ్ఛిద్రాలని కొన్ని ఉన్నాయి. యజ్ఞయాగాదులలో ఒక కర్మ చేస్తున్నప్పుడు ఏర్పడే విరామానికి ఛిద్రమని Gap. Interval. పేరు. అలాంటప్పుడు ధార్మికమైన ఆధ్యాత్మికమైన బోధలెవరైనా చేస్తుంటే వినటం ఒక అలవాటు. అది ఆయా కథల రూపంగా చెప్పినా శ్రవణం చేసినా వాటికి పారిప్లవాలని శాస్త్రం పెట్టిన సంజ్ఞ. అసలు విషయాని కదనంగా పైపైన చెప్పుకొనే ఉదంతం కాబట్టి దీనికీ పేరు సార్థకంగా ఏర్పడింది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రశ్నోపనిషత్తు ()
Telugu original

ప్రశ్నోపనిషత్తు : పది ఉపనిషత్తులలో ఇది నాలుగవది. ఇందులో ఆరు ప్రశ్నలు వస్తాయి. ఆరుగురు మహర్షులు వేస్తారు. పిప్పలాదుడనే బ్రహ్మవేత్త ఆరింటికీ ఆరు సమాధానాలిస్తాడు. ఆరవది బ్రహ్మానుభవానికి సూటిగా దారిదీసే ప్రశ్న. దానికి ఆయన ఇచ్చినది కూడా అంత సూటియైన సమాధానమే. షోడశకళ పురుష తత్త్వాన్ని నెపంగా చేసుకొని నడుస్తుందీ ప్రశ్నోత్తర సరణి. ఇలాంటి ప్రశ్నల మూలంగా తత్త్వనిర్ణయం జరిగింది కాబట్టి దీనికి ప్రశ్నోపనిషత్తని నామధేయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
పాంచభౌతిక ()
Telugu original

పాంచభౌతిక : పంచభూతాలకు చెందినది. వాటితో తయారైనది.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఫల ()
Telugu original

ఫల : ఒక కర్మకుగాని జ్ఞానానికి గాని కలిగే ప్రయోజనం Result. ఫలితం. Consequence కర్మ ఫలమంటారు. లేదా జ్ఞానఫలమంటారు. కర్మఫలం స్వర్గాదిలోక ప్రాప్తి అయితే, జ్ఞానఫలం సాక్షాత్తూ మోక్షమే. భాష్యకారులు దీనికొక చమత్కారమైన అర్థం కూడా చెప్పారు. 'ఫల్గుతయా లీయతే ఇతి ఫలం.' ఫ అంటే ఫల్గు అని ల అంటే లయమని అర్థమట. ఫల్గు అంటే నిరుపయోగమై, లయమంటే నశించిపోయేది. అంటే ఒక జీవన్ముక్తుడు లౌకికంగా ప్రారబ్దం కొద్దీ ఏ కార్యం చేసినా అది నిరుపయోగమే. ఎప్పటికప్పుడు నశించేదే. అతనికి బంధాన్ని ఇవ్వదు. వాడి విషయంలో అది నిష్ఫలమని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఫల్గు ()
Telugu original

ఫల్గు : ముందు చెప్పినట్టుగా ఫల్గు అంటే వ్యర్థం. నిష్ప్రయోజనం Effectless. Useless.

Vedānta Paribhāṣā Vivaraṇa
ఫణితి ()
Telugu original

ఫణితి : మాట. శబ్దం. చెప్పటం. చెప్పే బాణి. Expression. Style.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రతిపాదన ()
Telugu original

ప్రతిపాదన : ఒక విషయాన్ని చక్కగా వర్ణించి చెప్పటం. సహేతుకంగా నిరూపించటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ప్రణాళీ/ప్రణాళికా ()
Telugu original

ప్రణాళీ/ప్రణాళికా : ఒక గొట్టం లాంటిది. లాక్షణికంగా చెబితే ఉపాధి. ద్వారమని అర్థం. శుద్ధ చైతన్యానికి నామరూపాలే ప్రణాళిక.

Vedānta Paribhāṣā Vivaraṇa
బర్హణ ()
Telugu original

బర్హణ : నలగగొట్టటం. లయం చేయటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
బల/బాల/బాల్య ()
Telugu original

బల/బాల/బాల్య : బలమంటే వీర్యం. సామర్థ్యం. ఇది వేదాంతంలో ఒక విశేషార్థంలో ప్రయోగిస్తారు. బాల్యం పాండిత్యం నిర్విద్య అనే చోట బలం కలవాడే బాలుడు. బాలుడి భావమే బాల్యం. బలమంటే అనాత్మ భావాన్ని లేకుండా చేసుకునే సామర్థ్యం. అది కలవాడే బాలుడు. అంతేగాని కుర్రవాడని కాదు అర్థం. జ్ఞానబలమే బలమని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
బహిః/బాహ్య/బహిర్ముఖ ()
Telugu original

బహిః/బాహ్య/బహిర్ముఖ : అంతర్‌అనే మాటకు వ్యతిరిక్తమైన మాట బహిః వెలపల, బయట అని అర్థం. శరీరానికి వెలపల ఉన్నదంతానని అర్థం చెబుతారు. వాస్తవంలో శరీరానికే కాదు. శరీరం లోపల కూడా మనస్సులో కనిపించే భావాలన్నీ బాహ్యమే. కాబట్టి బహిర్ముఖ అనే మాట మన జ్ఞానానికి నామరూపాలను గమనించటమని అర్థం. అది మనసులోనైనా బహిర్ముఖమే. శరీరం వెలపల అయినా బహిర్ముఖమే. అధిష్ఠాన దృష్టే అంతర్ముఖం. ఆరోపిత దృష్టే బహిర్ముఖం. దృష్టి నంతర్ముఖం చేసుకోవటమే సాధన అన్నారు శాస్త్రంలో. దీని భావమేమిటి. మనస్సు లోపల శరీరం వెలపల మనకు భిన్నంగా తోచేదంతా మన స్వరూపమేనని దానిని మన స్వరూపంలోనే స్వరూపంగానే చూడటానికే అంతర్ముఖ దృష్టి అని అర్థం చెప్పుకోవలసి ఉంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
బహుధా ()
Telugu original

బహుధా : అనేక రూపాలుగా ఏకధా బహుధా చైవ దృశ్యతే. జలచంద్రవత్‌తరంగాలలో చంద్రబింబం లాగా పరమాత్మ ఒకే ఒక తత్త్వమైనా ఆయా ఉపాధులలో బహుధా ప్రకాశిస్తున్నాడట.

Vedānta Paribhāṣā Vivaraṇa
బాధ/బాధక/బాధిత ()
Telugu original

బాధ/బాధక/బాధిత : క్లేశం. కష్టమని కాదు అర్థం. శాస్త్రంలో బాధ అంటే ఒకటి కొట్టుబడి పోవడం. Contradiction. వస్తువెప్పుడూ బాధితం కాదు. దాని ఆభాసే అలా బాధితమై పోయేది. రజ్జువు వస్తువు కాబట్టి అది అబాధితం. పోతే దానిమీద కల్పితమైన సర్పం వస్తువుకాదు. ఆభాసే గనుక దానికి బాధ తప్పదు. అలాగే ఆత్మ అనేది ఎప్పుడూ అబాధితమే. దానికి బాధకం మరేదీ లేదు. మరేదైనా అని చెప్పామంటే అది అనాత్మ జగత్తేకదా. అది ఆత్మ తాలూకు ఆభాసే. కనుక ఆభాస వస్తువుకు బాధకం కాదు. మీదు మిక్కిలి వస్తువే ఆభాసను బాధించి దానికి బాధకమవుతుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
బీజనిద్రా ()
Telugu original

బీజనిద్రా : బీజమంటే విత్తనం. Seed. మూలమని కూడా అర్థమే. Source. అజ్ఞానమే మూలం సంసారానికి. కనుక అదే బీజం. దీనివల్ల ఏర్పడిందే సంసారవృక్షం. కనుక ఇది నిజంగా బీజమేనన్నా చెల్లే విషయమే. బీజ నిద్ర అంటే ఈ అజ్ఞానం వదలకుండా ఎన్నో జన్మలనుంచి నిద్రపోతున్నాడీ జీవుడు. 'బీజనిద్రా యుతః ప్రాజ్ఞః' కారణ శరీరమే ఈ నిద్ర. కారణ శరీరమేదో కాదు అజ్ఞానమే. కనుక అవిద్య, అజ్ఞానం, బీజ, నిద్ర, ఇవన్నీ ఒకదాని కొకటి పర్యాయాలే.

Vedānta Paribhāṣā Vivaraṇa
బుద్ధి/బుధ/బుద్ధ ()
Telugu original

బుద్ధి/బుధ/బుద్ధ : నిశ్చయాత్మకమైన అంతఃకరణం బుద్ధి. అది చేసే ఆలోచన జ్ఞానం కూడా బుద్ధే. అలాటి జ్ఞానం కలవాడు బుధుడు. అజ్ఞాన నిద్ర వదలి మెళకువ తెచ్చుకున్నవాడు కనుక అతడే బుద్ధుడు. బుద్ధి ఒక్కటే ఆత్మతత్త్వాన్ని గ్రహించటానికి ఏకైక సాధనం. బుద్ధిగుహలోనే పరమాత్మ చైతన్యం వచ్చి ప్రవేశించిందని శాస్త్రం చెబుతున్నది. అంటే అర్థం బుద్ధిలో కలిగే పరమాత్మ తాలూకు ఆలోచనే దాన్నిచేర్చే సాధనమని, దాన్ని ఆలంబనం చేసుకోమని, అదే గమ్యాన్ని చేరుస్తుందని తాత్పర్యం. 'దృశ్యతే త్వగ్య్రయా బుద్ధ్యా' అని కఠోపనిషత్తు స్పష్టం చేస్తున్నది ఈ విషయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
బోధ ()
Telugu original

బోధ : మెళకువ. జ్ఞానోదయం. Awakening. ఇలాంటి బోధ కలవాడే బుధుడు లేక బుద్ధుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
బృహదారణ్యక ()
Telugu original

బృహదారణ్యక : ఇది చాలా పెద్ద ఉపనిషత్తు. 'అహం బ్రహ్మాస్మి' అనే ఆఖరి మహావాక్య మిందులోనిదే. జనక యాజ్ఞవల్క్య సంవాదమనే మిషతో బ్రహ్మవిద్యా బ్రహ్మానుభవమూ బ్రహ్మాండంగా వర్ణించిందీ ఉపనిషత్తు. సిద్ధాంత సాధనానుభవాలు మూడూ పరిపూర్ణంగా లభిస్తాయి ఇందులో.

Vedānta Paribhāṣā Vivaraṇa
భగవాన్‌ ()
Telugu original

భగవాన్‌: జ్ఞాన ఐశ్వర్య బల వీర్య తేజశ్శక్తులు. ఈ ఆరింటికీ షాడ్గుణ్యమని, భగమనీ పేరు. ఇవి సంపూర్ణంగా ఉన్న చైతన్యం భగవానుడు. ఆయనకీ ఆరుగుణాలూ సహజం.

Vedānta Paribhāṣā Vivaraṇa
భాగవత ()
Telugu original

భాగవత : ఆ భగవత్తత్త్వానికి చెందినది. దానిని భజించే భక్తుడు భాగవతుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
భాగ/భాగ్య/భాగధేయ ()
Telugu original

భాగ/భాగ్య/భాగధేయ : వాటా. భాగం. దైవం వారివారికి పంచిపెట్టిన కర్మఫలం Providence. అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
భాగీ ()
Telugu original

భాగీ : వాటా కలవాడు ఒక పక్షంలో చేరినవాడు. దాని ఫలంలో స్వామ్యమున్న వాడు. Partner.

Vedānta Paribhāṣā Vivaraṇa
భాగత్యాగ ()
Telugu original

భాగత్యాగ : తత్త్వమసి లాంటి మహావాక్యానికి అర్థం చెప్పేటప్పుడు పదార్థ జ్ఞానం అంతకుముందుగా చెప్పుకోవలసి ఉంటుంది. తత్త్వం పదార్థాలలో ఒక భాగాన్ని త్యాగం చేసి ఒక భాగాన్ని మాత్రం పట్టుకోవాలట. త్యాగం చేయవలసింది ఉపాధి వర్గం. దగ్గర ఉంచుకోవలసింది కేవల చైతన్యం. అప్పుడే జీవబ్రహ్మైక్యం సిద్ధిస్తుంది. జహదజహల్లక్షణ అన్నా ఇదే.

Vedānta Paribhāṣā Vivaraṇa
బ్రహ్మా ()
Telugu original

బ్రహ్మా : చతుర్ముఖ బ్రహ్మ. హిరణ్యగర్భుడు. సగుణమైన బ్రహ్మతత్త్వం. దీనికే ఈశ్వరుడని కూడా నామాంతరం.

Vedānta Paribhāṣā Vivaraṇa
బ్రహ్మ ()
Telugu original

బ్రహ్మ : బృహత్తు - పెద్దది. బృంహణం - అన్నిటినీ ఇముడ్చుకొనేది. బర్హణం తనలో కలుపుకొనేది ఏదో అది. పరమాత్మ నిర్గుణమైన శుద్ధ చైతన్యం. The ultimate reality. మాయాశక్తి ఇందులో ఓతప్రోతమై నిష్క్రియమై ఉంటుంది. అదే సక్రియమైతే బయటికి వచ్చి నిర్గుణమైన బ్రహ్మం సగుణంగా మారుతుంది. అప్పుడది బ్రహ్మకాదు బ్రహ్మా.

Vedānta Paribhāṣā Vivaraṇa
బ్రహ్మాండ ()
Telugu original

బ్రహ్మాండ : ఆకాశం. బ్రహ్మతత్త్వం నుంచి మొట్టమొదట బయటపడ్డ భూతం. అండాకారంగా పెద్దదిగా వ్యాపించి కనిపిస్తుంది గనుక దీనికి బ్రహ్మాండమని పేరు. Macrocosm. దీనిలో చేరినదే అండాండం. అంటే సూర్యచంద్రాది గోళాలు. అందులో సంచరించేవి పిండాండం. అంటే జరాయుజాది శరీరాలు.

Vedānta Paribhāṣā Vivaraṇa
బ్రహ్మపురం ()
Telugu original

బ్రహ్మపురం : మానవశరీరం. పిండాండం. బ్రహ్మచైతన్యం వచ్చి నివసించిన పట్టణం. బ్రహ్మంచేత పూరించబడినది. మరలా దీని నాలంబన చేసుకొనే బ్రహ్మాన్ని చేరవలసి ఉంటుంది జీవుడు. కనుక ఇది పడగొట్టటానికి, పైకి లేపటానికి కూడా సాధనమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
బ్రహ్మలోక ()
Telugu original

బ్రహ్మలోక : బ్రహ్మదేవుడి లోకం. సత్యలోకం. కేవల పరమాత్మ అని అర్థం చెప్పుకుంటే అలాంటి తత్త్వాన్ని ఎక్కడ ఆలోచిస్తామో అనగా దర్శిస్తామో అది బ్రహ్మలోకం. లోకంగాని లోకం ఇది. బ్రహ్మచైతన్య ప్రకాశమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
బ్రహ్మభావం ()
Telugu original

బ్రహ్మభావం : బ్రహ్మసాయుజ్యమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
బ్రహ్మదండం ()
Telugu original

బ్రహ్మదండం : మేరు దండం. వెన్నెముక Spinal cord.

Vedānta Paribhāṣā Vivaraṇa
బ్రహ్మభూయం ()
Telugu original

బ్రహ్మభూయం : బ్రహ్మసాయుజ్యమనే అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
బ్రహ్మాత్మభావ ()
Telugu original

బ్రహ్మాత్మభావ : జీవాత్మ బ్రహ్మంగా మారిపోవటం. కేవల మాత్మ అయితే దేహమాత్ర పరిచ్ఛిన్నమైన చైతన్యమని భ్రమపడవచ్చు. కేవల బ్రహ్మమైతే పరోక్షమైనా కావచ్చు. బ్రహ్మాత్మమంటే రెండు దోషాలూ తొలగిపోయి అపరిచ్ఛిన్న అపరోక్షమైన అద్వైతానుభవం సిద్ధిస్తుంది. దాన్ని సూచింటానికే రెండూ కలిపి బ్రహ్మాత్మ అని చెబుతున్నది శాస్త్రం. బ్రహ్మమే ఆత్మ. ఆత్మే బ్రహ్మం అని అర్థం. బ్రహ్మమే ఆత్మ అన్నప్పుడు పరోక్షం అపరోక్షమవుతుంది. ఆత్మే బ్రహ్మ మన్నప్పుడు పరిచ్ఛిన్నం అపరిచ్ఛిన్నమవుతుంది. ఇలాంటిదే అద్వైతుల బ్రహ్మానుభవం.

Vedānta Paribhāṣā Vivaraṇa
బ్రహ్మానుభవం ()
Telugu original

బ్రహ్మానుభవం : ముందు చెప్పినట్టు జీవాత్మను బ్రహ్మదృష్టితో చూచి మరలా బ్రహ్మాన్ని తన ఆత్మరూపంగా అనుభవానికి తెచ్చుకోవటమే అసలైన బ్రహ్మానుభవం.

Vedānta Paribhāṣā Vivaraṇa
బ్రహ్మనిర్వాణం ()
Telugu original

బ్రహ్మనిర్వాణం : నిర్వాణమంటే ఆరిపోవటం. దీపమారి పోయినట్టు జీవ చైతన్యం ఆరిపోయిందని చెబితే అది బౌద్ధుల శూన్యవాద మవుతుంది. అద్వైతం శూన్యవాదం కాదు. అది పూర్ణవాదం. కనుక కేవల నిర్వాణం కాక బ్రహ్మనిర్వాణ మనే మాట పేర్కొన్నారు. అంటే జీవచైతన్యం సాధన చేసి బ్రహ్మచైతన్యంలో ఏకమై పోవాలి. ఇక్కడ నిర్వాణమంటే ఆరిపోవటం కాదు. చేరిపోవటం. మోక్షమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
బ్రహ్మాకార వృత్తి ()
Telugu original

బ్రహ్మాకార వృత్తి : మనస్సుకు కలిగే ఒక వృత్తి విశేషం. వృత్తులకు నిలయమే మనస్సు. అందులో సవికల్ప వృత్తులు ఉదయిస్తాయి. నిర్వికల్ప వృత్తీ ఉదయిస్తుంది. సవికల్పమనేక మయితే నిర్వికల్పం ఏకైకం. బ్రహ్మమేకమే గనుక దానికి సంబంధించి ఏర్పడే చిత్తవృత్తి కూడా తదాకారంగానే ఏకమై ఉదయిస్తుంది. కేవలం సచ్చిదాకారంగా ప్రపంచాన్ని దర్శిస్తూ పోతే అదే నిర్వికల్పమైన సామాన్య రూపమైన బ్రహ్మాకార వృత్తి. ఇదే బ్రహ్మ సాయుజ్యానికి గొప్పసాధన.

Vedānta Paribhāṣā Vivaraṇa
బ్రహ్మవాదీ/బ్రహ్మవాదినీ ()
Telugu original

బ్రహ్మవాదీ/బ్రహ్మవాదినీ : బ్రహ్మతత్త్వాన్ని గూర్చి ఉపన్యసించే స్త్రీ పురుషులు. కేవలం వర్ణించటమేగాక తాము నమ్మినదీ వర్ణించినదీ మనసా ధ్యానించి అదే తామైపోయిన వ్యక్తులు. అప్పుడే వారి వాదానికి ప్రామాణ్యమేర్పడుతుంది. లేకుంటే అది వాచా వేదాంతమే. ఇలాంటి బ్రహ్మవాది యాజ్ఞవల్క్యుడైతే బ్రహ్మవాదిని గార్గి లాంటిది.

Vedānta Paribhāṣā Vivaraṇa
భక్తి/భక్త ()
Telugu original

భక్తి/భక్త : భక్తి అంటే భగవంతుని భజించటమని అర్థం. భజించటం అంటే అంటి పట్టుకోవటం. విభజించటానికి ఇది వ్యతిరేకం. భగవంతుని నుండి దూరమై పోవటం. విభజన. Separation. దగ్గర పడటం భజన. Union. ఈ భజన చేసేవాడు భక్తుడు. అతడు సగుణ భక్తుడు కావచ్చు. నిర్గుణ భక్తుడు కావచ్చు. సగుణమైతే భగవంతుని తనకు అన్యంగా భావిస్తాడు. నిర్గుణమైతే తన స్వరూపంగా భావిస్తాడు. స్వరూపంగా భావించే భక్తిని ఇలా వర్ణించారు భగవత్పాదులు. 'యః పశ్యతి యత్‌శృణోతి, స్పృశతి, వా తత్‌సర్వం వాసుదేవ ఏవ.' ఏదేది చూస్తామో వింటామో ముట్టుకుంటామో అదంతా సచ్చిద్రూపమైన ఆత్మతత్త్వమేనని 'ఏవం గ్రహావిష్టః.' ఒక దయ్యంలాగా ఆవేశించినవాడు భక్తుడట. ఇదే అనన్యభక్తి.

Vedānta Paribhāṣā Vivaraṇa
భక్తి/భాక్త ()
Telugu original

భక్తి/భాక్త : భక్తి అంటే ఇక్కడ లక్షణ Secondary Sense. Metaphorical. అని అర్థం. గౌణమైన అర్థం. లక్ష్యార్థం. సింహోదేవదత్తః అన్నప్పుడు సింహగుణాలు దేవదత్తుడిలో కనిపించడం. దీనికే భక్తి అని భాక్తమని గుణమని గౌణమని వ్యవహారం. భక్తికి చెందింది భాక్తం. గుణానికి చెందినది గౌణం Metaphorical Sense అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
భంగ ()
Telugu original

భంగ : నశించిపోవటం. నివృత్తి. ఆవరణ భంగమంటే ఉపాధి తొలగిపోవటం. ముఖ్యంగా అవిద్య అనే మొదటి ఉపాధి. అది తొలగిపోతే మిగతావన్నీ వాటిపాటికవే భంగమై పోతాయి.

Vedānta Paribhāṣā Vivaraṇa
భద్ర ()
Telugu original

భద్ర : క్షేమం. కుశలం. శుభం. శ్రేయస్సు. మోక్షం. అన్నింటికీ వాచకమే. చివరకు బ్రహ్మతత్త్వమే అన్నిటికన్నా భద్రమైనది. కనుకనే 'భద్రం కర్ణేభిః శృణుయామ' అని మహర్షులు చాటిచెప్పారు. భద్రం పరమాత్మ అయితే క్షుద్రమీ ప్రపంచం. కనుకనే అసతోమా సద్గమయ అని వాపోవటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
భయ ()
Telugu original

భయ : Fear. అసుర గుణాలలో ఒకటి. సంసార భయం. 'ద్వితీయాద్వైభయం భవతి.' రెండవ దున్నప్పుడే మనకు భయం ఏర్పడుతుంది. అశాంతి తాపత్రయం కలుగుతాయి. అద్వితీయమైన తత్త్వాన్ని పట్టుకుంటే ఏ భయమూ లేదు. అభయమే. అభయమే మోక్షం.

Vedānta Paribhāṣā Vivaraṇa
భవితవ్యతా ()
Telugu original

భవితవ్యతా : ఏది జరగలవలసి ఉందో అది భవితవ్యం. దాని భావమే భవితవ్యత. Destiny. అనివార్యమైన పరిస్థితి.

Vedānta Paribhāṣā Vivaraṇa
భాతి ()
Telugu original

భాతి : భాసించడం. Appearance దీనికి జతమాట అస్తి. Existance. అస్తి అంటే సత్యమని, భాతి అంటే విజ్ఞానమని అర్థం. ఏది ఉందో ఏది నిత్యమూ తనపాటికి తాను ప్రకాశిస్తున్నదో అది బ్రహ్మం. ఇవి రెండే పరమాత్మకున్న లక్షణాలు. వీటిద్వారానే దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి.

Vedānta Paribhāṣā Vivaraṇa
భావ ()
Telugu original

భావ : ఒక ఆలోచన. మనసులో కలిగే ఒక వృత్తి. Idea. ఒక పదార్థమని కూడా పేర్కొనవచ్చు. Substance or category. భావమంటే ఉండటం. అయిపోవటం కూడా. Being or becoming.

Vedānta Paribhāṣā Vivaraṇa
భవ ()
Telugu original

భవ : ఉండటం. సత్త్వం. జన్మ. సంసారం.

Vedānta Paribhāṣā Vivaraṇa
భవబంధ/భవరోగ ()
Telugu original

భవబంధ/భవరోగ : జన్మే ఒక బంధం. అదే ఒక వ్యాధి అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
భవనాశ ()
Telugu original

భవనాశ : జన్మబంధ నివృత్తి Liberation from the cycle of birth and death.

Vedānta Paribhāṣā Vivaraṇa
భావనా ()
Telugu original

భావనా : ఒకదాన్ని నిత్యమూ ఆలోచిస్తూ ఉండడం. భావించటం. ఒకదాని గుణం మరొకదానికి పట్టించటం కూడా భావనే. బ్రహ్మభావన అంటే బ్రహ్మతత్త్వాన్ని ఆలోచించటం. బ్రహ్మంగా మారిపోవటం. బ్రహ్మగుణాన్ని తనలో నింపుకోవటం. వైద్య పరిభాషలో ఇది ప్రసిద్ధమైన మాట. భావన జీరకం, భావన అల్లం అంటే ఆ రెండు పదార్థాలకూ ఆరోగ్యాన్ని ప్రసాదించే గుణాన్ని మిగతా మూలికల ద్వారా సంక్రమింప జేయటమని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
భావివృత్తి ()
Telugu original

భావివృత్తి : జరగబోయే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వర్ణించటం. ఉదా. 'ఓదనం పచతి.' అన్నం వండుతున్నాడు. అన్నమిప్పుడు లేదు. ఇప్పుడున్నది బియ్యం. అది వండితే అన్నమవుతుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
బ్రహ్మభావనా ()
Telugu original

బ్రహ్మభావనా : ముందు చెప్పినట్టు బ్రహ్మమే నేనని భావన చేస్తూ పోతే బ్రహ్మమే కాగలడు జీవుడు. 'సదా తద్భావ భావితః' అని గీత చెబుతున్నది. భ్రమర కీట న్యాయంగా నిరంతర భావన చేసే జీవుడు బ్రహ్మసాయుజ్యం పొందటంలో ఆశ్చర్యంలేదు. అద్వైతంలో అనుష్ఠానం లేదు. ఆలోచనే అనుష్ఠానం. కనుక భావన వల్లనే బంధం అయితే భావన వల్లనే తుదకు మోక్షం కూడా ఫలిస్తుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
భర/భార ()
Telugu original

భర/భార : బరువు. తూకం. Weight. Pressure. ఒకదానిపై భరోసా పడటం. భారం మోపటం. నొక్కి చెప్పటం Emphasis అని కూడా అర్థమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
భూః ()
Telugu original

భూః : భూమి అని ఒక అర్థం. పుట్టటమని మరియొక అర్థం. ఉన్నదని ఇంకొక అర్థం. స్వయంభూః అంటే తనపాటికి తాను ఉన్నది అని. ఒకరిమీద ఆధారపడకుండా స్వతస్సిద్ధమైనదని భావం. Self existent. పరమాత్మ.

Vedānta Paribhāṣā Vivaraṇa
భూత ()
Telugu original

భూత : పుట్టిన. ఏర్పడిన. స్వయంభూః అయిన ఆత్మనుండి జన్మించినవి పంచభూతాలు. Elements. శక్తిగా ఉంటే అది దేవత. Energy. వ్యక్తమై బయటపడితే అది భూతం. Matter. భూతమంటే కడచిపోయిన విషయం కావచ్చు. కాలమూ కావచ్చు.

Vedānta Paribhāṣā Vivaraṇa
భూతవృత్తి ()
Telugu original

భూతవృత్తి : ఇంతకు ముందరి విషయాన్ని పరామర్శిస్తూ చెప్పే సందర్భం. ఉదా. బ్రాహ్మణ పరివ్రాజక. ఈ పరివ్రాజకుడింతకు పూర్వం బ్రాహ్మణుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
భూతి ()
Telugu original

భూతి : ఐశ్వర్యం. విభూతి. అనేక విధాలుగా ఉండటం. పరమాత్మ విభూతి ఇలాంటిదే. అదే ఆత్మగానూ అనాత్మగానూ రెండు విధాలుగా భాసిస్తున్నది. ఇందులో ఆత్మగా ఉండటం దాని స్వరూపమైతే అనాత్మగా భాసించటం విభూతి.

Vedānta Paribhāṣā Vivaraṇa
భూమా ()
Telugu original

భూమా : అన్నిటికన్నా ఉత్కృష్టమైన పదార్థం. చాలా పెద్దదని అర్థం. Summum Bonum. Supreme Reality. అద్వితీయమైన తత్త్వం. పరిపూర్ణమైన చైతన్యమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
భూయస్త్వ/బాహుళ్య ()
Telugu original

భూయస్త్వ/బాహుళ్య : చాలా ఎక్కువగా ఉండటం. Multiplicity. Majority.

Vedānta Paribhāṣā Vivaraṇa
భోక్తా/భోగ్య/భోజ్య/భోగ ()
Telugu original

భోక్తా/భోగ్య/భోజ్య/భోగ : భోగమంటే అనుభవం. Experience. అది కర్మఫలమైనా కావచ్చు. జ్ఞానఫలమైనా కావచ్చు. మొత్తం మీద అనుభవించటమే భోగం. అలా అనుభవించే జీవుడు భోక్త. The experiencer. అనుభవానికి వచ్చే సుఖదుఃఖాదులు భోగ్యం లేదా భోజ్యం. ఈ ప్రపంచమంతా భోగ్యమైతే జీవుడు దీనికి భోక్త. దీనినే అన్నమని అన్నాదుడని చమత్కారంగా వర్ణించాయి ఉపనిషత్తులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
భౌమ ()
Telugu original

భౌమ : భూమికి సంబంధించినది. Earthly. ప్రాపంచికమైనది. దీనికి వ్యతిరిక్తమైనది అభౌమ లేదా దివ్య. Celestial.

Vedānta Paribhāṣā Vivaraṇa
భూమికా ()
Telugu original

భూమికా : క్షేత్రం. నిలయం. దశ. Stage. అవస్థ. అంతస్తు. Storey. ఆధారం. Base.

Vedānta Paribhāṣā Vivaraṇa
భౌతిక ()
Telugu original

భౌతిక : భూతములకు చెందినది. భూతములు Elements అయితే భౌతికం Compound. భూతములన్నీ పోగై ఏర్పడిన చరాచర పదార్థాలన్నీ భౌతికమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
భ్రంశ / భ్రష్ట ()
Telugu original

భ్రంశ/భ్రష్ట : జారటం. పడటం. తొలగటం. Depart or separate చ్యుతి. Fall. ఎవడు అలా జారిపడతాడో వాడు భ్రష్ట. సంసారంలో పడిన జీవుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
భ్రమ / భ్రాంతి ()
Telugu original

భ్రమ/భ్రాంతి : ప్రమకు వ్యతిరిక్తమైన పదం. ప్రమ అంటే సరైన జ్ఞానం. Right knowledge. ఉన్నదున్నట్టు గుర్తించటం. అలాకాక ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు గుర్తించటానికి భ్రమ అని పేరు. రజ్జు జ్ఞానం ప్రమ అయితే సర్పజ్ఞానం భ్రమ. ప్రస్తుత మీ ప్రపంచం రజ్జురూపంగా చూస్తే అది పరమాత్మే. దానినే సర్పరూపంగా చూస్తే అది ప్రపంచం. భ్రాంతి అన్నా ఇదే.

Vedānta Paribhāṣā Vivaraṇa
బుభుత్సా ()
Telugu original

బుభుత్సా : బోద్ధుమిచ్ఛా. ఒక సత్యాన్ని తెలుసుకోవాలనే కాంక్ష. జిజ్ఞాస అని అర్థం Desire to know. Enquiry.

Vedānta Paribhāṣā Vivaraṇa
బుభుత్సు ()
Telugu original

బుభుత్సు : జిజ్ఞాసు అని అర్థం. తెలుసుకోవాలనే కోరిక కలవాడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
బ్రహ్మచారీ ()
Telugu original

బ్రహ్మచారీ : బ్రహ్మమంటే ఇక్కడ వేదమని అర్థం. అది చరించటమంటే అభ్యసించటమని అర్థం. అప్పటికి బ్రహ్మచారి అంటే వేదాభ్యాసం చేసేవాడు. వాడికి చెందిన ఆశ్రమం బ్రహ్మచర్యం. వేదాధ్యయనం చేస్తున్నంతవరకూ వివాహం అనేది ఉండదు గనుక బ్రహ్మచారి అంటే అవివాహితుడని కూడా అర్థం ఏర్పడింది. అంతేకాదు. బ్రహ్మతత్త్వంలో నిత్యమూ చరించే జ్ఞాని అని కూడా చెప్పవచ్చు ఒక అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
బ్రాహ్మణ ()
Telugu original

బ్రాహ్మణ : బ్రహ్మ బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ వర్ణానికి చెందినవాడు. వీడికి జాతి బ్రాహ్మణుడని పేరు. వర్ణమేగాక వర్ణానికి తగిన కర్మ జ్ఞానాలు కూడా అబ్బితే వాడు ముఖ్య బ్రాహ్మణుడు. బ్రహ్మజ్ఞాని అని అర్థం. 'బ్రహ్మజ్ఞానాద్ధి బ్రహ్మణః.'

Vedānta Paribhāṣā Vivaraṇa
బ్రహ్మబంధు ()
Telugu original

బ్రహ్మబంధు : బ్రాహ్మణోచితమైన గుణంగాని వృత్తంగాని లేక కేవలం బ్రాహ్మణజాతి మావారనీ, మా బంధువులనీ చెప్పుకుని బ్రతికేవాడు. ద్విజ బంధువని కూడా పేరు వీడికి.

Vedānta Paribhāṣā Vivaraṇa
బ్రహ్మవిద్యా/బ్రహ్మజ్ఞాన ()
Telugu original

బ్రహ్మవిద్యా/బ్రహ్మజ్ఞాన : బ్రహ్మతత్త్వానికి చెందిన విద్య, జ్ఞానం Philosophy, తత్త్వజ్ఞానం Spiritual Science, ఆత్మజ్ఞానం Self Knowledge కూడా ఇదే. ఆత్మ అన్నా బ్రహ్మమన్నా ఒకటే అద్వైతంలో. నిరుపాధికమైన ఆత్మ బ్రహ్మమే. అపరోక్షమైన బ్రహ్మమాత్మే.

Vedānta Paribhāṣā Vivaraṇa
బ్రాహ్మీస్థితి ()
Telugu original

బ్రాహ్మీస్థితి : బ్రహ్మజ్ఞానంలో నిష్ఠ గలిగి ఉండటం. Stability in the spiritual knowledge.

Vedānta Paribhāṣā Vivaraṇa
భా/భాన ()
Telugu original

భా/భాన : కాంతి. దీప్తి. ప్రకాశం. జ్ఞానప్రకాశం అని అర్థం. ఆత్మజ్ఞానమే అసలైన ప్రకాశం. 'తమేవ భాంతం అనుభాతి సర్వం. తస్య భాసా సర్వమిదం విభాతి.' అసలైన ప్రకాశం ఆత్మదే. మిగతా అనాత్మ ప్రకాశమంతా దాని సొంతం కాదు. ఆత్మప్రకాశమే. అనాత్మ రూపంగా కూడా ప్రకాశిస్తున్నదని అంటారు అద్వైతులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
భాష్య ()
Telugu original

భాష్య : ఆక్షిప్య భాషణా ద్భాష్యం. ఒక సూత్రంలో గాని శ్లోకంలోగాని సంగ్రహంగా చెప్పిన భావాన్ని పట్టుకొని బయటికి లాగి హేతు దృష్టాంతాలతో దాన్ని విపులంగా ప్రతిపాదించే వ్యాఖ్యానానికి భాష్యమని పేరు. పూర్వపక్ష సిద్ధాంత రూపంగా సాగిపోతుంటుందిది. ఇలాంటిదే శంకరుల వారి ప్రస్థానత్రయ భాష్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
బంధ ()
Telugu original

బంధ : కట్టుపడటం. జీవుడు సంసారంలో వచ్చి ఇందులో పడిపోవటం. అజ్ఞానమే దీనికి కారణం. ఆత్మజ్ఞాన మబ్బితేనే దీనినుంచి మోక్షం. బంధానికి వ్యతిరిక్తమైనది మోక్షమే. బంధం Bondage. మోక్షం Liberation.

Vedānta Paribhāṣā Vivaraṇa
మతి/మత/మనః/మను ()
Telugu original

మతి/మత/మనః/మను : మతి అన్నా మనస్సన్నా ఒకటే. మననం లేదా ఆలోచించే సాధనమేదో అది. Thinking Faculty. మననం చేసేది గనుక మనస్సయింది. సృష్టిలో ఇది ఒక్కటే మానవుడి విశిష్టత. వాసనా జ్ఞానాన్ని Instinct మించిన వివేచనా జ్ఞానమిది. Reason. అలా మొదట ఆలోచించినవాడు మనువు. The first thinker of human race. ఆయన సంతతి కనుక మనమంతా మనుజులం. మనుష్యులం. మానవుల మయ్యాము. ఇలాంటి ఈ మనస్సుతో ఏది ఆలోచిస్తామో అది మతం. Thought. మతం కానిది అమతం. అదే ఆత్మ. దాన్ని మాత్రం మనస్సు ఆలోచించలేదు. కారణం అది మనస్సుకు కూడా సాక్షి.

Vedānta Paribhāṣā Vivaraṇa
మద ()
Telugu original

మద : గర్వం మత్తు. అరిషడ్వర్గంలో ఇది ఒక అ. మనపాలిటికి. కామ క్రోధ లోభాలు ముదిరితే మద మోహ మాత్సర్యాలుగా మారుతాయి.

Vedānta Paribhāṣā Vivaraṇa
మదామద ()
Telugu original

మదామద : మదించినది. మదించనిది. ప్రవృత్తి నివృత్తులు రెండూ కలిగినది. ఆత్మస్వరూపమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
మథన ()
Telugu original

మథన : మథించటం. బాధించటం. బాగా మథించేదేదో అది ప్రమథ. ప్రమథ గణమంటే మనస్సులో కలిగే ఆలోచనలు. వీటిద్వారా మనలను వేధిస్తుంది గనుక మనస్సు ప్రమాథి అని చాటింది గీత.

Vedānta Paribhāṣā Vivaraṇa
మధువిద్యా/మధుబ్రాహ్మణ ()
Telugu original

మధువిద్యా/మధుబ్రాహ్మణ : మధు అంటే తియ్యనిది. తేనె. మధ్వద అంటే అలాంటి తేనెను తినేదని అర్థం. లాక్షణికంగా చెబితే తీయని తేనె ఏదోగాదు జీవుణ్ణి నిత్యమూ ఆకర్షించే ఈ జగత్తే ఆ మధువు. మధువును అదనం చేసి మధ్వదు డనిపించుకోక ఈ జీవుడు దానిని సూదనం చేసి అనగా నిర్మూలించి మధుసూదనుడు కావలసి ఉంది. మధువంటే సారభూతమైన పదార్థమని కూడా అర్థమే. Essence. ప్రపంచం జీవుడికి ఉపకరిస్తుంది గనుక మధువు. ప్రపంచానికి జీవుడూ తోడ్పడుతాడు గనుక వీడూ దానికి మధువే. ఇలా పరస్పరం ఉపకార్యోపకారక సంబంధం రెంటికీ అనాది సిద్ధం. ఇలాంటి సంబంధాన్ని చెప్పే విద్యకే మధు విద్య అని మధు బ్రాహ్మణమని పేరు వచ్చింది. ఇది బ్రహ్మవిద్యకు ఆలంబనం. ఎలాగంటే జీవ జగత్తులు రెండూ ఒకదానికొకటి సాపేక్షం. Relative. కనుక నిరపేక్షమైన Absolute తత్త్వమొకటి వీటి కాధారభూతమైనది ఉండి తీరాలి. అదే బ్రహ్మం. ఇది దానికి ద్యోతకం Indication మాత్రమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
మాధ్వమత ()
Telugu original

మాధ్వమత : మధ్వాచారులు ప్రతిపాదించిన దర్శనం. ఇది ద్వైత దర్శనం. జీవజగదీశ్వరులకు ముగ్గురికీ పరస్పర భేదం చెబుతుందిది. భేదమే వీరికి వాస్తవం. పంచ సత్యాలని వీరి సిద్ధాంతం. జీవజగత్తులకు భేదం. జీవజీవులకు భేదం. జగజ్జగత్తులకు భేదం. జగదీశ్వరులకు భేదం. జీవేశ్వరులకు భేదం. ఈ ఐదు భేదాలూ వీరి దృష్టిలో ఐదు సత్యాలే. అభేదవాదమైన అద్వైతానికి వీరు బద్ధ శత్రువులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
మాధ్యమిక ()
Telugu original

మాధ్యమిక : బౌద్ధులలో ఇది ఒక తెగ. శూన్యవాదులని వీరికి మరొక పేరు. వీరి దృష్టిలో జీవుడు లేడు. దేవుడు లేడు. జగత్తు కూడా లేదు. చివరకు అంతా కలిసి శూన్యమే. Nihilism.

Vedānta Paribhāṣā Vivaraṇa
మనీషా ()
Telugu original

మనీషా : మనస్సును శాసించటం. దానికి అతీతమైన నిర్వికల్పమైన స్థితి. అలాంటి స్థితిని పొందినవాడు మనీషి. The Transcendentalist.

Vedānta Paribhāṣā Vivaraṇa
మను/మంత్ర ()
Telugu original

మను/మంత్ర : మనువన్నా మంత్రమన్నా అర్థమొకటే. మనసులో ఆవృత్తి చేసే శబ్దం. అది నోటవస్తే జపమవుతుంది. 'మననాత్‌త్రాయతే ఇతి మంత్ర.' ఏది మననం చేస్తే మానవుణ్ణి అనర్థం నుంచి తప్పిస్తుందో అది మంత్రమని దానికి వ్యుత్పత్తి. మననం చేసేది గనుక మనువని కూడా దానికి వ్యుత్పత్తి చెప్పారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
మంద/మధ్యమ/ఉత్తమ ()
Telugu original

మంద/మధ్యమ/ఉత్తమ : ఆత్మ జ్ఞానానికి అందరూ అధికారులే. అయితే అందులో కర్మవాసనలు వదలనివారు మందులు. ఉపాసనా వాసన వదలనివారు మధ్యములు. జిజ్ఞాస బాగా ఉన్నవారు ఉత్తములు. అధికారి భేదాన్ని బట్టి చేసిన విభాగమిది. గౌడపాదులు బ్రహ్మచర్యాది ఆశ్రమాలు చెప్పక ఈ మూడు అధికారాలనే మూడు ఆశ్రమాలుగా భావించారు. అలాగే వర్ణించి చెప్పారు. మంద మధ్యమోత్కృష్టదృష్టులు మూడే మూడాశ్రమాలని అయన చేసిన విభాగం.

Vedānta Paribhāṣā Vivaraṇa
మమకార ()
Telugu original

మమకార : అహం మమలని రెండే ఉన్నాయి. అవి ఆత్మజ్ఞానానికి విరోధులు. ఒకటి ఈ దేహమే నేననే అభిమానం. మరొకటి దీనికి బాహ్యమైన పుత్రమిత్ర కళత్ర వస్తువాహనాదులు నావి అనే అనురాగం. ఈ రెండవదే మమకారం. అహంకారం మీద ఆధారపడ్డదీ మమకారం. అహం మిథ్యాత్మ అని, మమ గౌణాత్మ అని పేర్కొంటారు అద్వైతులు. ఈ రెండింటివల్లనే సంసార బంధం. అసలైన ఆత్మ జ్ఞానంతోగాని ఇవి తొలగిపోవు. దానికే ముఖ్యాత్మ సదాత్మ లేదా బ్రహ్మాత్మ అనిపేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
మరణ/మృతి ()
Telugu original

మరణ/మృతి : మర్త్య మరణించటం. చావు. శరీరం నుంచి జీవుడు తొలగిపోవటం. అందుకే వీడు మర్త్యుడయ్యాడు. Mortal. చావటమంటే అభావం కాదు బయటికి వెళ్ళిపోడం Departure. స్థూలం పోయినా సూక్ష్మమొకటి ఉంటుంది. దాని మూలంగా మరలా జన్మ తప్పదంటారు ఎందుకని. అజ్ఞానమనే కారణ శరీరం కూడా ఒకటుంది కనుక అది ఉన్నంతవరకు రాకపోకలు తప్పవు. అందుకే మరణానికి ప్రయాణమని, యాత్ర అని పేరు పెట్టింది గీత. 'జాతస్యహి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ.' మరలా జీవుడు జన్మించవలసిందే అని చెబుతున్నది శాస్త్రం. దీనిని బట్టి జీవుడు చేసేది ప్రయాణమేగాని మరణంకాదు. మరణం సాకారమైన శరీరానికే. 'జీవాపేతం వావ కిలేదం మ్రియతే న జీవో మ్రియతే' అని ఉపనిషత్తు ఘంటాపథంగా చాటుతున్నది.

Vedānta Paribhāṣā Vivaraṇa
మర్యాదా ()
Telugu original

మర్యాదా : ఒక హద్దు. అంతం. limit.

Vedānta Paribhāṣā Vivaraṇa
మరీచి/మరుమరీచి ()
Telugu original

మరీచి/మరుమరీచి : సూర్యరశ్మి. ఆ రశ్మే దూరానికి జలంలాగా భాసిస్తే దానికి మరుమరీచి అని పేరు. Mirage. ఎండమావులు. మరుభూమిలో కనిపించేది కనుక మరుమరీచిక అయింది. ఇది అద్వైతి చెప్పే ఆభాసలలో ఒకటి.

Vedānta Paribhāṣā Vivaraṇa
మంత్ర ()
Telugu original

మంత్ర : అక్షరాల సంపుటి. ఏదో ఒక దేవతకు సంబంధించి ఉంటుంది ఈ సంపుటి. ఆ దేవతాశక్తి దానిలో గుప్తమై ఉంటుంది. దానికి అనుగుణంగానే సంపుటీకరించిన అక్షరాలవి. 'మననాత్‌త్రాయతే.' మననం చేస్తే కాపాడేది గనుక దీనికి మంత్రమని పేరు వచ్చింది. పంచాక్షరీ, అష్టాక్షరీ ఇలాంటివన్నీ మంత్రం క్రిందికే వస్తాయి. మంత్రజపం వల్ల దేవత సాక్షాత్కరిస్తుందని, సాధకుడి కోరికలన్నీ సఫలం చేస్తుందని పెద్దల విశ్వాసం.

Vedānta Paribhāṣā Vivaraṇa
మర్శ ()
Telugu original

మర్శ : స్పృశించటం, తాకటం, తడవి చూడడం, బాగా పరామర్శించడం. ఆ ముందు చేరిస్తే ఆమర్శ. వి ముందు చేరిస్తే విమర్శ. పరా చేరిస్తే పరామర్శ. అన్నీ ఒక దానికొకటి పర్యాయాలే. విమర్శ అనేది క్రియాశక్తి. దీనిచేత విమర్శిస్తూ పోతే శివస్వరూపం ప్రకాశమవుతుంది. అది జ్ఞానశక్తి. ప్రకాశ విమర్శలు రెండూ శైవుల పరిభాష.

Vedānta Paribhāṣā Vivaraṇa
మల/మలిన ()
Telugu original

మల/మలిన : మాలిన్యం. కాలుష్యం. అశుద్ధి. చిత్తానికి పట్టిన ఆవరణ దోషం. తమోగుణం. మలవిక్షేపాలంటే ఆవరణ విక్షేపాలే. Contraction and distraction మొదటిది మన స్వరూపాన్ని కప్పిపుచ్చేది. రెండవది దాన్ని నామరూపాత్మకంగా రెచ్చగొట్టేది. ఇలాంటి మలంతో నిండిన మనస్సుకు మలినమని పేరు. Impure.

Vedānta Paribhāṣā Vivaraṇa
మహత్‌ ()
Telugu original

మహత్‌: సాంఖ్యుల పంచవింశతి తత్వాలలో ఒకటి. అవ్యక్తమైన ప్రధానం నుంచి వచ్చిన రెండవ భూమిక. Premordial Matter. అద్వైతుల భాషలో ఇది అవ్యాకృత సూక్ష్మప్రపంచం. దానికి అధిపతి అయిన జీవుడు హిరణ్యగర్భుడు. అంటే సమష్టి బుద్ధి. Cosmic mind.

Vedānta Paribhāṣā Vivaraṇa
మహిమా ()
Telugu original

మహిమా : అష్టసిద్ధులలో ఇది ఒక సిద్ధి. అణిమ తరువాత రెండవది మహిమ. ఉన్నట్టుండి పెరిగి పెద్దదై పోవటం. Magnifcation. అంతేగాక ఈశ్వరుడికున్న మహత్త్వం కూడా మహిమే. జ్ఞానవిస్తారమని అర్థం. 'స్వ మహిమ్ని ప్రతిష్ఠితః' అని ఉపనిషత్తు వర్ణించింది. పరమాత్మ ఎక్కడున్నాడని ప్రశ్న వస్తే తన మహిమలోనే అంటే తన విస్తారంలోనే ఉన్నాడని అర్థం. దీనికే ఐశ్వర్యమని, విభూతి అని మరి ఒక పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
మా/మాన/మాత్రా ()
Telugu original

మా/మాన/మాత్రా : కొలవటం. తూకం వేయటం. ప్రమాణం. Measure. విషయ ప్రపంచాన్ని ఇదమిత్థమని కొలుస్తుంది మన ఇంద్రియం, మనస్సు. కనుక అవి మానం లేదా ప్రమాణం. మాత్ర అన్నా ప్రమాణమే. 'మాత్రాస్పర్శాస్తు కౌంతేయ' అని గీత. ఓంకారంలో మూడు మాత్రలు. అవి ఆత్మలో ఉన్న మూడు పాదాలను కొలుస్తాయి. కనుక మాత్రలని పేర్కొన్నారు. అలా కొలిచే వరకూ ఆత్మ సోపాధికం. Limited. నిరుపాధికమైతే Absolute కొలిచేది లేదు. కొలవబడేది లేదు. అమాత్రం అపాదమన్నారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
మాయా ()
Telugu original

మాయా : 'మీయతే అనయా ఇతి మాయా.' దేనిచేత కొలవబడుతుందో అది మాయ. పరమాత్మ శక్తి. Cosmic power. దేశకాల వస్తువులన్నింటినీ కొలిచి ఇవి ఇంతేనని చూపుతుంది. కనుక అది మాయ అయితే ఇవి మేయమవుతున్నాయి. Measured. ఇది అలా కొలవలేనిది ఒక్కటే. అది పరమాత్మ తత్త్వం. కనుక అమేయు డయ్యాడు ఆయన.

Vedānta Paribhāṣā Vivaraṇa
మాండూక్య ()
Telugu original

మాండూక్య : దశోపనిషత్తులలో చాలా ముఖ్యమైనది. 'మాండూక్య మేకమేవానలమ్‌' అని ఒక నానుడి. ఓంకారం మీద నెపంపెట్టి చక్కగా నిరూపించింది. గౌడపాదకారికలూ, భగవత్పాదుల భాష్యమూ దీనికి పరిపూర్ణతను చేకూర్చాయి. 'అయమాత్మా బ్రహ్మ' అనే మహావాక్యమిందులోదే.

Vedānta Paribhāṣā Vivaraṇa
మాయావాద ()
Telugu original

మాయావాద : అద్వైత వాదానికి నామాంతరం. పరమాత్మ మాత్రమే వస్తువు. దానికి భిన్నమైనదంతా వస్తువు కాదు. ఆభాస. కారణం ఈశ్వర శక్తే అజ్ఞానవశాత్తూ ఇలా వ్యక్తమై భాసిస్తున్నదంటారు వేదాంతులు. దీనికే వివర్తవాదమని పేరు. ఇది ఆరంభం కాదు. పరిణామం కాదు. ఆరంభ పరిణామాలు రెండు వస్తువులను చెబుతాయి. ఇది వస్తువు ఒక్కటే మిగతాదంతా మాయామయమే నని చాటుతుంది. కనుకనే అద్వైతానికి మాయావాదమని మరొక పేరు వచ్చింది.

Vedānta Paribhāṣā Vivaraṇa
మితి/మిత ()
Telugu original

మితి/మిత : మాయచేత కొలవటం మితి. కొలవబడినది మితం Limited. పరిమితమని అర్థం. నామరూపాలన్నీ పరిమితమే Dimensioned. అమితమేదీ కాదు. అమితం పరమాత్మే.

Vedānta Paribhāṣā Vivaraṇa
మహాత్మా/మాహాత్మ్య ()
Telugu original

మహాత్మా/మాహాత్మ్య : గొప్ప ఆత్మకలవాడు. అంటే దేహాత్మా, జీవాత్మా కాక ప్రత్యగాత్మ తత్త్వం తెలిసినవాడని అర్థం. వాడి లక్షణమే మాహాత్మ్యం. అలాంటివారు నూటికి కోటికి ఒక్కడు. 'స మహాత్మా సుదుర్లభః' అని గీతా వచనం.

Vedānta Paribhāṣā Vivaraṇa
మిథస్‌ ()
Telugu original

మిథస్‌: అన్యోన్యం Mutual అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
మిథ్యా ()
Telugu original

మిథ్యా : Myth అసత్యం. వట్టిది. అసత్‌అంటే అసలే లేనిదని కాదు. దానిపాటికది అసత్యమైనా దాని అధిష్ఠానంతో పోలిస్తే మరలా సత్యమే. 'యథాః ఘటః ఘట రూపేణ అసన్‌మృద్రూపేణ తు సన్నేవ. The pot is unreal as the form, But it is real as the clay. దీనికే మిథ్య అని పేరు. కాబట్టి అద్వైతుల మాయావాదం బౌద్ధుల శూన్యవాదం కాదు. బౌద్ధులది అసద్వాదం. అద్వైతులది సద్వాదం. అంటే పరమాత్మ కాక తదాభాస అయిన ప్రపంచం కూడా సత్తేనంటారు. పరమాత్మ రూపంగా ఇది సత్యమే. తద్వ్యతిరిక్తంగా చూస్తేనే అసత్యం లేదా మిథ్య. అప్పటికి ఆ చూపే మిథ్యగాని అక్కడ పదార్థం కాదు. అది వస్తుతః సత్యమే. 'యథా రజ్జుః సర్ప రూపేణ దృశ్యమానాపి వస్తుతః.' రజ్జువేగాని అరజ్జువుకాదు గదా. ఇలాంటిదే మిథ్యా అనే మాట కర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
మిథ్యాత్మా ()
Telugu original

మిథ్యాత్మా : ఆత్మ మూడు విధాలు. అసలైన ఆత్మకు ముఖ్యాత్మ అని, సదాత్మ అని, బ్రహ్మాత్మ అని పేరు. ఇదే నిజమైన ఆత్మ. ఆ మాటకు వస్తే మిగతా ఆత్మలు రెండూ లేవు. అయినా మానవుడు అజ్ఞానం వదలక ఈ ముఖ్యాత్మను చూడక అనాత్మను కూడా ఆత్మ అని భావిస్తున్నాడు. కాబట్టి మరి రెండు చెప్పవలసి వచ్చింది. అందులో మిథ్యాత్మ అంటే శరీరమే నేను అని భావించే జీవచైతన్యం. గౌణాత్మ అంటే ఆ జీవుడి దృష్టికి గోచరించే బాహ్యప్రపంచం.

Vedānta Paribhāṣā Vivaraṇa
మీమాంసా ()
Telugu original

మీమాంసా : మాతుమిచ్ఛా. వేదానికి తాత్పర్యమేమిటనే చర్చ. The import of the scripture. కర్మ మీమాంసకులు ధర్మమేనంటే, బ్రహ్మ మీమాంసకులు మోక్షమంటారు. మొదటిది పూర్వమని, రెండవది ఉత్తరమని మీమాంస రెండు భాగాలుగా విభక్తమైంది. మొదటిది పూర్వపక్షమైతే, రెండవది సిద్ధాంతమని అద్వైతుల పరిష్కారం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ముక్తి/ముక్త ()
Telugu original

ముక్తి/ముక్త : మోక్షమని అర్థం. Freedom. సంసార బంధంలో నుంచి బయటపడటం. అలా పడ్డవాడు ముక్తుడు. ఇది శరీరముండగానే జరిగితే జీవన్ముక్తి. పోయిన తరువాతనైతే విదేహముక్తి.

Vedānta Paribhāṣā Vivaraṇa
ముఖ్యప్రాణ ()
Telugu original

ముఖ్యప్రాణ : ముఖ్యమైన ప్రాణం. ఇంద్రియాలన్నింటికీ ప్రాణాలనే పేరు పెట్టింది శాస్త్రం. అందులో అసలైన ప్రాణాన్ Vital energy. ముఖ్యప్రాణమని విశేషించి పేర్కొనవలసి వచ్చింది. పంచప్రాణాలు ముఖ్యప్రాణాల కిందకే వస్తాయి.

Vedānta Paribhāṣā Vivaraṇa
ముఖ్యాత్మా ()
Telugu original

ముఖ్యాత్మా : జగత్తు అనేది గౌణాత్మ అయితే జీవుడు మిథ్యాత్మ. అయితే రెంటికీ విలక్షణమైనది ప్రత్యగాత్మ. The inner most self ముఖ్యాత్మ. ఇదే అసలైన ఆత్మ. కారణం ఇది సాక్షిరూపం. మిగతావి రెండూ కార్యరూపాలు.

Vedānta Paribhāṣā Vivaraṇa
ముద్రా ()
Telugu original

ముద్రా : మూసివేయటం. మూత. అసలు విషయమేదో కనపడకుండా కప్పిపుచ్చటం. ఒక సత్యాన్ని సూచించే సంకేతానికి ముద్ర అని పేరు. చిన్ముద్ర అంటే చైతన్యం. ఫలానా ఇలా ఉంటుందని చూపే అంగుష్ఠ తర్జనీ సంయోగం అంటే బొటనవ్రేలు, చూపుడువ్రేలు రెండూ కలిసి ఉండటం. మౌనముద్ర అంటే మౌనం ద్వారా నిశ్చలమైన సర్వవ్యాపకమైన తత్త్వం ఇలాగే ఉంటుందని చూపటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
ముని / మౌన ()
Telugu original

ముని/మౌన : ఊరక ఉండటం. శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా నిలిచి పోవటం. Silence. మాటలోనే కాదు మనస్సులో కూడా ఉండాలి నిశ్చలత్వం. అలా ఉన్నవాడే ముని. వాడున్న దశే మౌనం. స్థిత ప్రజ్ఞుడని అర్థం. మౌనం మూడు విధాలంటారు. ఒకటి కాయ మౌనం. శరీరం నిశ్చలంగా ఉండటం. మరిఒకటి వాఙ్మౌనం. నోటితో ఏదీ ఉచ్చరించక పోవటం. ఇంకొకటి మనోమౌనం. మనస్సులో ఏ ఆలోచనా లేక ఖాళీ అయిపోవటం. మొదటి రెండూ అంత ముఖ్యంకావు. మూడవదే ప్రధానం. మూడవది అదుపులో ఉంటే మిగతా రెండూ అప్రయత్నంగా ఏర్పడతాయి కనుకనే అలాంటి మనోమౌనం సాధించిన వాడే అసలైన మౌని. వాడే స్థిత ప్రజ్ఞుడని చాటింది భగవద్గీత.

Vedānta Paribhāṣā Vivaraṇa
ముండక ()
Telugu original

ముండక : దశోపనిషత్తులలో నొకటి. శిరోముండనం చేసుకొని చీర్ణవ్రతులైన ముండకులు అంటే సన్న్యాసులు శ్రవణం చేయవలసినది. బ్రహ్మస్వరూపాన్నీ దాన్ని సాధించే మార్గాన్ని విపులంగా బోధించిన ఉపనిషత్తు.

Vedānta Paribhāṣā Vivaraṇa
మోక్ష/ముముక్షా/ముముక్షు ()
Telugu original

మోక్ష/ముముక్షా/ముముక్షు : ముక్తి అని అర్థం. బంధం నుంచి వైదొలగటం. దానికోసం కాంక్షించేవాడు ముముక్షువు. 'మోక్తు మిచ్ఛా ముముక్షా.' సంసారాన్ని త్రోసి పుచ్చాలనే కోరిక. అద్వైతులు చెప్పే సాధన చతుష్టయంలో ముముక్షుత్వం అనేది ఆఖరిది.

Vedānta Paribhāṣā Vivaraṇa
మూఢ / ముగ్ధ ()
Telugu original

మూఢ/ముగ్ధ : మోహం చెందిన వాడు. ఆత్మజ్ఞానం లేనివాడు. అజ్ఞాని. Ignorant of his own real nature.

Vedānta Paribhāṣā Vivaraṇa
మూర్ఛా ()
Telugu original

మూర్ఛా : అవస్థాత్రయమే కాక స్వప్న జాగ్రత్తులకు మధ్యలో వచ్చే మరొక దశ. సంథ్యస్థానమని దీనికి పేరు పెట్టింది శాస్త్రం. వ్యాప్తి అనికూడా దీనికొక అర్థముంది. మూర్ఛన అంటే వ్యాప్తి. సంగీతంలో రాగం వ్యాపించటానికి మూర్ఛమనే పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
మూర్తి / మూర్త ()
Telugu original

మూర్తి/మూర్త : మూర్తి అంటే రూపం. ఆకృతి. Shape, form. విగ్రహం కూడా Shrine. ఘనీభవించి ఇంద్రియ గోచరమైన పదార్థమైతే అది మూర్తం. Tangible. అమూర్తమంటే Intangible ఇంద్రియ గోచరం కానిది. నిరాకారమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
మూల ()
Telugu original

మూల : Source. అన్నిటికీ కారణమైనది. ఆది. అది ఏదోకాదు. అవిద్య. మూలకారణమిదే ఈ ప్రపంచ సృష్టికంతా. మూలమంటే ప్రమాణమని కూడా ఒక అర్థముంది. Proof. దీనికేమిటి మూలమని అడుగుతాము. అక్కడ దీనికి ప్రమాణ మేమిటని అర్థం. Authority.

Vedānta Paribhāṣā Vivaraṇa
మూలావిద్యా ()
Telugu original

మూలావిద్యా : అజ్ఞానం. ఇది మొదట ఆవరణ రూపంగా ఉంటుంది. అప్పుడది మూలావిద్యా. తరువాత విక్షేప రూపంగా మారుతుంది. అప్పుడు తులావిద్య.

Vedānta Paribhāṣā Vivaraṇa
మృగ్య ()
Telugu original

మృగ్య : వెతకవలసింది. ఇంకా ఆలోచించవలసింది. To be sought.

Vedānta Paribhāṣā Vivaraṇa
మేధా ()
Telugu original

మేధా : మనసుకుండే ధారణాశక్తి. Retention. తెలివితేటలు కూడా. 'న మేథయా న బహునా శ్రుతేన' అని ఉపనిషత్తు. ఎంత మేధాశక్తి ఉన్నా ఆత్మజ్ఞానానికి అది ఉపకరించదని చాటుతున్నది.

Vedānta Paribhāṣā Vivaraṇa
మేధ / మేధ్య ()
Telugu original

మేధ/మేధ్య : కలయిక. మేళనం. అశ్వమేథ అంటే అశ్వంతో మైథునం. గృహ మేథ అంటే కళత్రంతో మైథునం. వధించటం కూడా. అశ్వమేథంలో అశ్వాన్ని చివరకు వధిస్తారు హోమకుండంలో. శుద్ధి అని కూడా అర్థమే. పవిత్రమని కూడా అర్థం. మేథ్యమంటే శుద్ధమైనది. అమేథ్యమంటే అపరిశుద్ధం.

Vedānta Paribhāṣā Vivaraṇa
మేహ/మేహన ()
Telugu original

మేహ/మేహన : వర్షించటం. వర్షించేది గనుక మేఘమని పేరు వచ్చింది.

Vedānta Paribhāṣā Vivaraṇa
మోఘ ()
Telugu original

మోఘ : Futile వ్యర్థం. నిష్ఫలం. 'మోఘాశా మోఘ కర్మాణః.' వాడి కోరికలూ, వాడి పనులూ రెండూ నిష్ఫలమే అని గీత చెబుతున్నది. ఆత్మజ్ఞానానికి సమాజ శ్రేయస్సుకు ప్రయత్నించని మానవుడి జీవితం మోఘమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
మోహ ()
Telugu original

మోహ : షడూర్ములలో కారణ శరీరానికి సంబంధించిన జంటలో ఒకటి. శోకమోహాలని పేరు. మోహంవల్ల శోకమేర్పడుతుంది. మోహమంటే అజ్ఞానం. ఆత్మజ్ఞానం లేకపోవటం. Cosmic nescience. తెలివితప్పటం అని కూడా ఒక అర్థముంది Un-conscious state

Vedānta Paribhāṣā Vivaraṇa
మోక ()
Telugu original

మోక : మోక్షమనే అర్థం. వదలిపోవటం. నిర్మోకమంటే పాము విడిచిన కుబుసం. దిగ్విమోకమంటే దిగ్బంధం విడిపోవడం.

Vedānta Paribhāṣā Vivaraṇa
మోద ()
Telugu original

మోద : ఆనంద భూమికలలో ఇది ఒకటి. ఆనంద విశేషం.

Vedānta Paribhāṣā Vivaraṇa
మంగళ ()
Telugu original

మంగళ : శుభం. మంచి సత్ఫలితం. 'మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని చ శాస్త్రాణి ప్రధంతే' అని పెద్దల మాట. మంగళంతో ఆరంభమై దానితోనే అంతం కావాలట ఏ శాస్త్రమైనా. మంగళకరమైన శబ్దాలు రెండే వారి దృష్టిలో. ఒకటి ఓంకారం. రెండు అధ. కనుకనే అధ యోగానుశాసనం, అధాతో బ్రహ్మజిజ్ఞాసా అని శాస్త్రజ్ఞులు ప్రారంభిస్తారు తమ శాస్త్రాన్ని. హరిః ఓం అని ముందు ఓంకారంతో ప్రారంభమై చివరకు ఓం తత్‌సత్‌అని అంతమవటం కూడా కనిపిస్తుటుంది తరచూ.

Vedānta Paribhāṣā Vivaraṇa
యాథాతథ్య ()
Telugu original

యాథాతథ్య : ఏది ఎలా ఉండాలో అది అలాగే ఉండడం. యథార్థ స్థితి. వాస్తవమైన స్వరూపం.

Vedānta Paribhāṣā Vivaraṇa
యాథాత్మ్యం ()
Telugu original

యాథాత్మ్యం : వస్తు స్వరూపం. స్వభావం The real nature. తత్వమనే మాటకిది పర్యాయపదం.

Vedānta Paribhāṣā Vivaraṇa
యదృచ్ఛా/యాదృచ్ఛిక ()
Telugu original

యదృచ్ఛా/యాదృచ్ఛిక : Accident. అప్రయత్నంగా ఏర్పడటం. అలా ఏర్పడింది యాదృచ్ఛికం. Accidental. 'యదృచ్ఛా లాభ సంతుష్టః' అని గీత. ఏది దొరికితే దానితో సంతృప్తి చెందాలట సాధకుడు. అలాగే 'యతిర్యా దృచ్ఛికో భవేత్‌' అన్నారు గౌడపాదులు. మోక్షసాధకుడయినవాడు యాదృచ్ఛికుడై జీవితం గడపాలట. అంటే దేని కోసమూ అదే పనిగా ప్రయత్నించకూడదు. అప్రయత్నంగా లభించినదే తన సొమ్మని ఆనందంగా అనుభవిస్తూ పోవాలి.

Vedānta Paribhāṣā Vivaraṇa
యంత్ర ()
Telugu original

యంత్ర : యంత్రణ. యమించేది. నియమించబడింది. ఆంతరమైన భావాన్ని బాహ్యమైన ఒక ఉపాధిలో బంధించి చూపటం. A device. diagram. standing for a truth outward. శ్రీచక్రం మొదలైనవన్నీ ఇలాంటి యంత్రాలే. పోతే ఒక విషయం మేరకు పరిమితం చేయటానికి Restrained యంత్రణమని పేరు. నియంత్రణమని కూడా పేర్కొనవచ్చు.

Vedānta Paribhāṣā Vivaraṇa
యత్న ()
Telugu original

యత్న : ప్రయత్నమని అర్థం. అభ్యాస వైరాగ్యాలే మోక్షసాధన. అదే అద్వైతులు చెప్పే యత్నం.

Vedānta Paribhāṣā Vivaraṇa
యతి ()
Telugu original

యతి : యతనం చేసేవాడు. యతనమంటే యత్నం. మోక్షసాధన. ఇంద్రియాలను యమించేవాడు కూడా.

Vedānta Paribhāṣā Vivaraṇa
యమ ()
Telugu original

యమ : అష్టాంగాలలో మొదటిది. ఇంద్రియ నిగ్రహం. కాలమనీ యముడనీ అర్థమే. అదికూడా జీవులను నిగ్రహించేదేగదా.

Vedānta Paribhāṣā Vivaraṇa
యక్ష ()
Telugu original

యక్ష : దేవత లేదా దయ్యం. 'యక్షానురూపో బలిః.' దేని స్థాయిని బట్టి దానికి తగిన ఆహుతి పెట్టడం అని సామెత. పూజింపదగిన గొప్ప పదార్థమని కూడా అర్థమే. 'కిమేత ద్యక్ష మితి' అని దేవతలందరూ భయపడ్డారట. కేనోపనిషత్తు చెబుతున్నది ఒక కథ. దేవలోకంలో దేవేంద్రుడు సభ చేసి ఉండగా కొంత దూరాన ఒక అద్భుతమైన పదార్థం ప్రత్యక్షమైంది. ఏమిటా ఆ యక్షం అని పరిపరివిధాల భావించారట వారు. అక్కడ యక్షమంటే పూజనీయమైన గొప్ప పదార్థమని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
యాగ ()
Telugu original

యాగ : యజనం చేసే క్రియ. యజ్ఞం. Sacrifice.

Vedānta Paribhāṣā Vivaraṇa
యాత్రా ()
Telugu original

యాత్రా : ప్రయాణం. మరణమని మరొక అర్థం. దేహాన్ని వదలి వెళ్ళిపోవటం. గడపటం కూడా దేహయాత్రా. జీవయాత్రా. Passage of time.

Vedānta Paribhāṣā Vivaraṇa
యాతయామ ()
Telugu original

యాతయామ : రాత్రిపక్వమైన ఆహారం అప్పుడే భుజింపక మరుసటి దినానికి దాచిపెట్టడం. అలాంటి ఆహారం సేవించటం తామస గుణమని భగవద్గీత చెబుతున్నది. ఇలాంటి ఆహారానికే యాతయామం అని పేరు. అంటే కొన్ని జాములు గడిచినదని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
యోగ ()
Telugu original

యోగ : కలయిక. Union. యోగక్షేమాలలో యోగానికి అర్థం 'అలబ్ధస్య లాభః' అని చెప్పారు భాష్యకారులు. మధ్యలో కొత్తగా వచ్చి చేరినదేదో అది యోగం. ఉపాయమని మరియొక అర్థం. సాధనమని ఇంకొక అర్థం. Means. కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం అనేవన్నీ ఇలాంటివే. అవి సాధకుడు ఆశించిన ఆయా ఫలితాలను అతనికి అందజేసే సాధనాలే. పతంజలి యోగశబ్దానికి మరొక అర్థం సెలవిచ్చారు. 'యోగః చిత్తవృత్తి నిరోధః' యోగమంటే మనసులో కలిగే ఆలోచనల నన్నింటినీ నిరోధించడం. అనగా త్రోసిపుచ్చడం. పోతే వేదాంతులు చెప్పే అర్థం వేరు. ఈశ్వర సాయుజ్యమే యోగమని పేర్కొంటారు వారు. అది కూడా సాధించవలసిందంటారు ద్వైతులు. సిద్ధమైన దాన్నే గుర్తించటమంటారు అద్వైతులు. 'జ్ఞానయోగ వ్యవస్థితిః' అని గీతలో ఒక వాక్యమున్నది. అక్కడ యోగమంటే అపరోక్షానుభవమని అర్థం చెప్పారు భగవత్పాదులు. జ్ఞానం పరోక్షమైతే యోగమపరోక్షం. అంటే శాస్త్రజన్యమైన జ్ఞానాన్ని స్వానుభవానికి తెచ్చుకోవటమే యోగమనే మాటకు అర్థం. ఇది చాలా విశిష్టమైన అర్థంగా కనిపిస్తుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
యోగీ యుక్త ()
Telugu original

యోగీ యుక్త : యోగం సాధించిన వాడు యోగి. The accomplished. యుక్తుడని కూడా అతడికే మరొక పేరు. 'స యుక్తః కృత్స్నకర్మ కృత్‌' అన్ని పనులూ చేయకున్నా యోగం సాధిస్తే చాలు చేసిన వాడేనట. 'యోగీ యుంజీత సతతం.' యోగసిద్ధి కోసం నిత్యమూ అభ్యాసం సాగించవలసిందే యోగి అయినవాడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
యోగీశ్వర ()
Telugu original

యోగీశ్వర : యోగులందరిలో చాలా దూరం యోగ సాధన చేసి దానిలో పరిపూర్ణత పొందినవాడు. ప్రయత్నంతో మానవుడు యోగీశ్వరుడైతే నిత్యముక్తుడైన పరమేశ్వరుడు యోగీశ్వరేశ్వరుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
యోగ్యతా ()
Telugu original

యోగ్యతా : యోగానికి అర్హత. అంతేకాదు ఒక కార్యం సాధించటానికి తగిన అర్హత, అధికార సంపత్తి. వాక్యంలో మూడు లక్షణాలు అవశ్యంగా ఉండి తీరాలి. మొదటిది ఆకాంక్ష. రెండవది యోగ్యత. మూడవది ఆసత్తి అని వైయాకరణులమాట.

Vedānta Paribhāṣā Vivaraṇa
యోజనా ()
Telugu original

యోజనా : కూర్చటం. కుదర్చటం. సమన్వయించటం. Combination, Coordination అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
యోగయుక్త ()
Telugu original

యోగయుక్త : యోగంతో కూడినవాడు. యోగి.

Vedānta Paribhāṣā Vivaraṇa
యోగాచార ()
Telugu original

యోగాచార : బౌద్ధులలో ఒక తెగ. విజ్ఞానవాదులని కూడా పేరు వీరికి. బాహ్యప్రపంచం శూన్యమైనా దానికి సాక్షివిజ్ఞానం మాత్రమలా శూన్యం కాదు. కాని క్షణికమని వాదిస్తారు వీరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
యౌగపద్య ()
Telugu original

యౌగపద్య : ఒకే మారు ఏర్పడటం. Simultanity.

Vedānta Paribhāṣā Vivaraṇa
యజన/యజ్ఞ/యజమాన ()
Telugu original

యజన/యజ్ఞ/యజమాన : అర్చించటం. భజించటం. పూజించటం. Worship యజనం చేసే క్రియ యజ్ఞం. Sacrifice. అనుష్ఠానం. యజనం చేసేవాడు కర్మిష్ఠుడైన గృహస్థుడు. వాడే యజమానుడు. కర్త. అతడు చేసే యజ్ఞం నాలుగు విధాలు. విధి, జప, ఉపాంశు, మానస. మొదటిది కాయికం. రెండు మూడు వాచికం. నాలుగు మానసికం. మొదటి మూడు బహిర్యాగమైతే నాలుగవది అంతర్యాగం. అదే జ్ఞానయజ్ఞం Spiritual sacrifice. యజ్ఞమంటే ఈశ్వరుడని కూడా అర్థం. 'యజ్ఞార్థాత్కర్మణోన్యత్ర' ప్రతికర్మా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలని భావం. ఇవిగాక మామూలుగా గృహస్థుడైన వాడు చేసే యజ్ఞాలు అయిదు ఉన్నాయి. దేవయజ్ఞం. దేవతల కోసం యజ్ఞయాగాదులు, పితృదేవతల కోసం శ్రాద్ధతర్పణాదులు. ఋషులకోసం వేదాధ్యయనాదులు. మనుష్యులకోసం అతిథి సంతర్పణాదులు. భూతములకోసం ధాన్య కణాదులు చల్లటం మొదలగునవి. ఇవి నిత్యమూ చేస్తూ పోవాలి ప్రతిగృహస్థుడు అని ధర్మశాస్త్ర శాసనం. ఇంతేగాక మనోవాక్కాయలతో ప్రతిక్షణమూ మనం సాగించే కర్మకలాపమంతా యజ్ఞమేనని ఒకమాట ఉంది. దీనికి నిలయం మన శరీరమే. ఇది నిత్యమూ చేస్తున్న జీవుడే ఇందులో యజమానుడు. ఇది సక్రమంగా సాగిస్తే సత్ఫలితం. అక్రమంగానైతే దుష్ఫలితం చవిచూడవలసి ఉంటుంది. ఇహంలో తప్పినా పరంలో తప్పదు అలాంటి అనుభవం.

Vedānta Paribhāṣā Vivaraṇa
రంజన / రాగ ()
Telugu original

రంజన/రాగ : రంజనం చేసేది రాగం. రంజనమంటే బుద్ధిని అంటిపట్టుకుని కలుషితం చేసేది. అభిమానమే అది. అదే రాగం. Attachment. ప్రపంచ వాసనలు ఒక రంగు అద్దినట్టుగా మనస్సుకు పట్టి పోతాయి కాబట్టి రాగమన్నారు. రాగద్వేషాలనే ద్వంద్వంలో మొదటిది.

Vedānta Paribhāṣā Vivaraṇa
రతి / రత ()
Telugu original

రతి/రత : అభిలాష. ఆసక్తి. తాదాత్మ్యం చెందటం. Indulgence. అలాంటి గుణమున్నవాడు రతుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
రాధన ()
Telugu original

రాధన : ఆరాధనమనే అర్థం. Worship. ఆరాధించే జీవులందరికీ రాధకులని పేరు. పరమాత్మ తప్ప మరెవ్వరూ పూర్ణత్వమున్నవారు కాదు గనుక పురుషు లనిపించుకోరు. స్త్రీ ప్రాయ మితరం జగత్‌అన్నారు. కనుక రాధా అంటే స్త్రీ పురుష భేదం లేకుండా ఆరాధన చేసేవారందరూ రాధలే.

Vedānta Paribhāṣā Vivaraṇa
రమణ / రామా ()
Telugu original

రమణ/రామా : రమించటం. విహరించటం. మానవ హృదయంలో పరమాత్మ రమిస్తున్నాడు గనుక రమణుడు, రాముడు. అలాగే ఒక సిద్ధపురుషుడు తనలోనే తాను రమిస్తుంటాడు. అలాంటివాడికి ఆత్మా రాముడని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
రమణీయ చరణా ()
Telugu original

రమణీయ చరణా : పుణ్యకర్మలు చేసినవారు. అలాంటి వారు ఉత్తమ గతులు పొందుతారు. కపూయ చరణకు ఇది వ్యతిరేక పదం.

Vedānta Paribhāṣā Vivaraṇa
రస ()
Telugu original

రస : ఎక్కువ అభిలాష. ఆస్వాదించటం. వృత్తి వాసనగా మారటం. Impression. రసవర్జం. 'రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే.' ఇక్కడ రసమంటే వాసన అనే అర్థం. ఆనంద స్వరూపమైన పరమాత్మకు కూడా రసమనే పేరు. 'రసోవైసః' ఆయన ఆడే జగన్నాటకమంతా రాసక్రీడ క్రిందికి వస్తుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
రహస్య ()
Telugu original

రహస్య : రహస్సుకు సంబంధించినది. Secret. తనకు మాత్రం తెలిసి మరొకరికి అంతుపట్టని అనుభవమని అర్థం. ప్రతి రహస్యమూ స్వానుభవైక వేద్యమే. ఇతరుల కందించేది కాదు. ఆత్మస్వరూపం ఇలాంటిది. దాని జ్ఞానం ఎవడు సంపాదిస్తే వాడిదే. జిజ్ఞాసువైన వాడు శుశ్రూష చేసి వాడివల్ల పొందినా అది కూడా వాడివరకే గనుక మరలా రహస్యమే. రాజవిద్యా రాజగుహ్యమని గీతలో చెప్పిన గుహ్యమనే మాట ఈ రహస్యమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
రై/రాతి ()
Telugu original

రై/రాతి : ధనమని అర్థం. 'రాతిః దాతుః పరాయణం.' ఆత్మానుభవం పొందిన వాడికీ ప్రపంచమంతా తన ధనమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
రుచి ()
Telugu original

రుచి : పంచభూతాలలో జలానికున్న గుణం. రసమనిగూడా దీనికి నామాంతరం. అభిలాష ఆసక్తి అని కూడా అర్థమే. కాంతి అని ఇంకొక అర్థం కూడా ఉంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
రూప ()
Telugu original

రూప : నామరూపాలలో రెండవది. Thing corresponding to Idia. నామం Idia. రూపం Thing. ఒకటి లోపల కలిగే వృత్తి. వేరొకటి దానికి గోచరించే బాహ్యమైన విషయం. పంచభూతాలలో తేజస్సుకు గుణం రూపం. రూపమంటే ఆకృతి Form అని కూడా అర్థమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
రూపక ()
Telugu original

రూపక : Metaphor. Allegory. మనస్సులో కలిగే భావానికి బాహ్యమైన కల్పన. 'అజా మేకాం లోహిత శుక్లకృష్ణాం' అని శ్వేతాశ్వతరంలో ఒక మేకను వర్ణించింది ఉపనిషత్తు. ఆ మేకలలో ఒకటి జీవుడు. మరొకటి ఈశ్వరుడు. లోహిత శుక్లకృష్ణ వర్ణాలు కలిగిన ఆడుమేక ఏదో కాదు. ప్రకృతి. ఇలా ఆధ్యాత్మకమైన భావం మనకు బాగా మనస్సుకు పట్టాలంటే ఆధిభౌతికమైన రూపకల్పన చేసినప్పుడే ఏర్పడుతుందని మహర్షులు ఎప్పుడో గుర్తించారు. కనుకనే ఇలాంటి భావానికి అనుగుణంగా ఎన్నో కల్పనలు శాస్త్రంలో చేస్తూ వచ్చారు. దీనికే రూపకమని సార్థకమైన పేరుపెట్టారు భాష్యకారులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
రూఢి/రూఢ ()
Telugu original

రూఢి/రూఢ : ప్రసిద్ధమైనదని చెప్పటం. ఒక శబ్దానికి వాచ్యార్థం. లోకంలో అందరూ అనుస్యూతంగా వాడుక చేస్తూ వచ్చిన అర్థానికి రూఢమని పేరు. కుడ్యమంటే గోడ. ఇది రూఢార్థం. దీనికే ముఖ్యార్థమని, వాచ్యార్థమని మారుపేరు. దీనిని మరొక అర్థంలో ప్రయోగిస్తే అది రూఢం కాదు. గౌణం లేదా యౌగికం. లక్ష్యార్థమని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
రోచన ()
Telugu original

రోచన : రుచి లేదా ఆసక్తి కల్పించటం. ప్రరోచనమని కూడా పేర్కొంటారు. సాహిత్యంలో కథలన్నీ ఇలాంటివే. ఉపనిషత్తులలాంటి శాస్త్రంలో కూడా ఇలాంటివెన్నో దొర్లుతుంటాయి. కల్పనలైనా, అకల్పితమైన సత్యాన్ని మనకు సూచిస్తాయి ఇవి.

Vedānta Paribhāṣā Vivaraṇa
రుద్ర/రౌద్ర ()
Telugu original

రుద్ర/రౌద్ర : శివుడు. 'రోదనాత్‌రుద్రః' అని దీనికి వ్యుత్పత్తి చెప్పారు. రోదనమంటే ఒక ఘాెష. శరీరంలో మనకెప్పుడూ అది అనాహతంగా ఉండనే ఉంటుంది. గుండెచప్పుడు ఈ రోదనమే. ప్రాణశక్తికే రుద్ర అని లాక్షణికంగా చెప్పుకునే మాట. ప్రాణం కూడా శబ్దం చేస్తూనే ఉంటుంది. వసురుద్ర ఆదిత్యులని పెద్దలు చెప్పే దేవతలెవరో కారు. ఆధ్యాత్మికమైన భాషలో చెబితే వసువు శరీరం. రుద్ర ప్రాణం. ఆదిత్య సూర్యునిలాగా వెలిగిపోయే మన మనస్సే. రౌద్ర అంటే రుద్రుడికి సంబంధించినది. భయంకరమైనదని ఒక అర్థం. అలాంటి దశకూ భావానికి కూడా అదే పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
రాజవిద్యా ()
Telugu original

రాజవిద్యా : విద్యలన్నింటిలో రాజిల్లే విద్య. బ్రహ్మజ్ఞానం.

Vedānta Paribhāṣā Vivaraṇa
రాజగుహ్య ()
Telugu original

రాజగుహ్య : అలాంటి జ్ఞానం చాలా రహస్యమైనది. అందుకే రాజగుహ్యం. రహస్యాలలో రహస్యం. అపరోక్షం గనుక ఒకరికి తెలిస్తే మరొకరికి తెలిసేది కాదది. సామూహికమైన వ్యవహారం కాదు బ్రహ్మజ్ఞానం. ఎవరికి వారికి స్వానుభవ సిద్ధం. అనుభవమెప్పుడూ రహస్యమే గదా.

Vedānta Paribhāṣā Vivaraṇa
రజస్‌ ()
Telugu original

రజస్‌: గుణత్రయంలో మొదటిది. సృష్టికి మూలమిది. ప్రకృతి గుణాలలో చేరుతుంది. రజస్సు వల్ల సృష్టి, సత్త్వం వల్ల స్థితి, తమస్సు వల్ల లయం. సంసారమంతా దీనితోనే నిండిపోయింది. ధూళి, మాలిన్యం అని కూడా ఒక అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
లఘు/లాఘవ ()
Telugu original

లఘు/లాఘవ : తేలిక. సులభమైన మార్గమని అర్థం. ఒక సూత్రం వర్తింప చేసేటప్పుడు ప్రక్రియా లాఘవాన్ని పాటించాలని పెద్దల నిర్ణయం. అలా కాకుంటే గౌరవమనిపించుకుంటుంది. ఇక్కడ లాఘవమంటే సులువుగా చెప్పటం, సంగ్రహంగా చెప్పటం. గౌరవమంటే డొంక తిరుగుడుగా దూరదూరంగా చెబుతూ పోవటం. గౌరవం కంటే లాఘవాన్నే శాస్త్రజ్ఞులు ఎక్కువగా పాటిస్తారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
లాభ ()
Telugu original

లాభ : మనకేదైనా కావలసినది ప్రాప్తించటం. అది ద్వైతంలో అయితే క్రొత్తగా వచ్చి చేరవలసినది. భౌతికంగా ఏర్పడేది. అద్వైతంలో లాభమంటే అలాంటిది కాదు. ఆత్మజ్ఞానం ఇక్కడ లాభం. క్రొత్తగా ప్రాప్తించేది కాదు ఆత్మ. ముందు నుంచి ఉన్నది. మహా అయితే మరచిపోయిన దాని స్వరూపాన్ని సాధకుడు గుర్తు చేసుకోవడమే జరుగుతుంది. ఆ మాటకు వస్తే ప్రాపంచికమైన మిగతా లాభాలేవీ అసలు లాభాలే కావు. ఎలా వచ్చాయో అలా తొలగిపోయే ప్రమాదముంది. ఆత్మలాభం అలాగ తొలగిపోయేది కాదు. కనుకనే గీతలో 'యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః' అని స్పష్టంగా చాటి చెప్పారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
లింగ ()
Telugu original

లింగ : గుర్తు. చిహ్నం Sign. Token. శివతత్త్వాన్ని సూచించే సంకేతం కనుక శివలింగమని పేరు వచ్చింది లోకంలో. 'లీనం గమయతీతి లింగం.' గుప్తమైన రహస్యాన్ని బయటపెట్టేది కనుక లింగమని పేరు సార్థకమయింది. మనస్సు ప్రాణం ఇలాంటివే. పరిపూర్ణమైన జ్ఞానక్రియా శక్తులకు ఇవి అపరిపూర్ణమైన సంకేతాలు. కనుకనే లింగ శరీరమన్నారు వీటిని వేదాంతులు. వీటికి తోడు పంచప్రాణాలు పంచతన్మాత్రలు పంచేంద్రియాలు కలిస్తే మొత్తం 17. సప్తదశకం లింగం అని శాస్త్రజ్ఞుల మాట. 17 సూక్ష్మమైన అంశాలతో కూడిన శరీరం కనుక లింగ శరీరమని సూక్ష్మశరీరమని దీనికి పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
లయ ()
Telugu original

లయ : కరగిపోవటం. Melt. చైతన్యం ఘనీభవించి కనిపించటం సృష్టి అయితే అది ద్రవీభవించి శక్తిగా మారటం లయం. అది అప్రయత్నంగా జరిగితే ప్రాకృతం. సాధకుడు ప్రయత్నంతో జరిపితే ఆత్యంతికం. దీనినే మోక్షమని పేర్కొంటారు అద్వైతులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
లీలా ()
Telugu original

లీలా : క్రీడ. విలాసం. వినోదం. ఆత్మ అనాత్మగా భాసించటం దానికొక క్రీడ. ప్రయత్నం లేదు ప్రయోజనం లేదు. స్వభావికం దానికి. 'స్వభావస్తు ప్రవర్తతే' అని గీతావచనం.

Vedānta Paribhāṣā Vivaraṇa
లేప / లిప్త ()
Telugu original

లేప/లిప్త : పూయటం అంటటం అని శబ్దార్థం. సాంసారికమైన భావాలన్నీ ఇలాంటివే. అవన్నీ జీవచైతన్యానికి సహజం కాకపోయినా మధ్యలో వచ్చి అంటి పట్టుకొన్నాయి. దీని నిమిత్తంగానే దేహాత్మభావ మొకటి జగదాత్మభావ మొకటి ఏర్పడింది జీవుడికి. దీనితో లిప్తుడయ్యాడు కనుకనే జీవభావం వదలటంలేదు. రాకపోకలు చేయక తప్పటంలేదు. ఆత్మజ్ఞానమే ఎప్పటికైనా జీవభావాన్ని వదిలించి అతనికి స్వస్వభావాన్ని ప్రసాదించేది. కర్మఫలం అంటటానికి కూడా లేపమనే పేరు. అది అంటినవాడు జీవుడైతే అంటనివాడు ఈశ్వరుడు. ఇతడు లిప్తుడు. అతడు నిర్లిప్తుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
లోక / లౌకిక ()
Telugu original

లోక/లౌకిక : లోకమంటే స్థానం. కర్మఫల మనుభవించే స్థానం. 'లోక్యతే ఉపలభ్యతే ఇతి లోకః' అని వ్యుత్పత్తి. లోకమంటే మరియొక అర్థం తేజస్సు. తేజస్సులో చేసే దర్శనం కూడా లోకమే. ఆత్మలోకమంటే ఆత్మను దర్శించే దశ. ఆత్మప్రకాశమని అర్థం. లోకానికి చెందినదేదో అది లౌకికం. లోకమంటే లోకులు లేక మానవులని కూడా అర్థమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
లోకాలోక ()
Telugu original

లోకాలోక : లోకమంటే తేజస్సు. ఆలోకమంటే తమస్సు. వెలుగునీడలు రెండింటీ కలయిక. ఇక్కడ వెలుగంటే జ్ఞానం. నీడ అజ్ఞానం. ఈ రెండూ మానవుడికి సహజమైన లక్షణాలు. వీటిలో అజ్ఞానం ఎంతెంత తగ్గుతూ పోతే అంతంత జ్ఞానానికి నోచుకొని ప్రగతిని సాధించగలడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
లోకాయత ()
Telugu original

లోకాయత : లోకమంతా వ్యాపించిన అని అర్థం. ఒకానొకప్పుడు బృహస్పతి అని ఒక భౌతికవాది స్థాపించిన మతం. అతని మతంలో దేవుడికి, పుణ్యపాపాలకు, లోకాంతర జన్మాంతరాలకు ప్రవేశంలేదు. మరణంతో సమస్తం తీరిపోయేదే. ఇది చాలా ఆకర్షకంగా ఉండటం వల్ల అదే చక్కగా నలుగురికి బోధిస్తూ వచ్చేవారట. కనుక ఇతని అనుయాయులందరకూ చార్వాకులని పేరు వచ్చింది. చార్వాక దర్శనమని కూడా దీనికి నామాంతరం. నాస్తిక దర్శనాలలో ఇది అగ్రగణ్యమైనది.

Vedānta Paribhāṣā Vivaraṇa
లోప ()
Telugu original

లోప : లోపించటం, జారిపోవటం, కనపడకపోవటం. లోపించిన దానికి లుప్తమని పేరు. జీవుడి జ్ఞానం ఎప్పటికప్పుడు లుప్తమౌతూ పోతే ఈశ్వరజ్ఞానం అలా లుప్తంకాక అలుప్తంగా నిలిచిపోతుందని వేదాంతుల హామీ.

Vedānta Paribhāṣā Vivaraṇa
లక్షణ/లక్ష్య ()
Telugu original

లక్షణ/లక్ష్య : లక్షించేది. సూచన చేసేది. ఫలానా అని పట్టి ఇచ్చేది. That which indicates or signifies. లక్షణమంటే లక్ష్యం తాలూకు స్వరూపమంతా వర్ణించి చెప్పేది Definition. చెప్పేటప్పుడు అవ్యాప్తి అతివ్యాప్తి అసంభవమనే మూడు దోషాలు దొర్లకూడదు. లక్షణం తటస్థమని స్వరూపమని రెండు విధాలు. బ్రహ్మానికి స్వరూపం సత్యజ్ఞానానంతాలు. తటస్థం సృష్టి స్థితి లయాలు. వీటిద్వారా లక్షితమైన బ్రహ్మమేదో అది లక్ష్యం. లక్ష్యమంటే లక్షణంచేత వర్ణించబడేది. తర్కంలో లక్షణమంటే నిర్వచనమనే అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వర ()
Telugu original

వర : శ్రేష్ఠమైన. వర కానిది అవర. నికృష్టమని అర్థం. 'ప్రాప్య వరాన్‌నిబోధత.' బ్రహ్మజ్ఞానం వరులైన అంటే ఉత్తములైన ఆచార్యుల వద్ద అభ్యసించాలట. అంతేగాని 'న నరేణ అవరేణ ప్రోక్త.' అవరుడైన అనధికారియైన ఆచార్యుడు ప్రవచనానికి పనికిరాడన్నది శాస్త్రం. వరమంటే వరించేది, కోరేదని కూడా అర్థమే. 'యమే వైషవృణుతే తేన లభ్యః' ఎవడు తత్త్వాన్ని వరిస్తాడో, కోరుకుంటాడో వాడికే అది లభ్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వర్ణ ()
Telugu original

వర్ణ : బ్రహ్మక్షత్రాది జాతులు రంగు రూపమని కూడా అర్థమే. బహుశా ఒకానొకప్పుడు ఈ రూపాన్ని బట్టే వర్ణవిభాగ మేర్పడి ఉండవచ్చు. అంతేకాదు వరణమే వర్ణం. వరణమంటే ఆవరించటం. వాటి ఉపాధిని ఆవరించిన లక్షణాలు గుణాలు. వీటిని బట్టి కూడా ఏర్పడవచ్చు. 'గుణకర్మ విభాగశః' అని శాస్త్రమే చాటుతున్నది.

Vedānta Paribhāṣā Vivaraṇa
వర్గ ()
Telugu original

వర్గ : కలయిక, గుంపు, ముఠా. ధర్మార్థ కామాలు మూడు కలసి ఒకటి. త్రివర్గమని పేరు దానికి. త్రిగుణాలతో సంపర్కం మూడింటికి ఉంది. పోతే నాల్గవదైన మోక్షమే అపవర్గం. ఏ ముఠాలోనూ చేరదని అర్థం. కారణం అది గుణాతీతమైన తత్త్వం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వర్చస్‌ ()
Telugu original

వర్చస్‌: దీప్తి-కాంతి lustre. వేదాధ్యయనం వల్ల కలిగితే అది బ్రహ్మ వర్చస్సు అన్నారు. బ్రహ్మమంటే ఇక్కడ వేదమని అర్థం. బ్రహ్మజ్ఞానంవల్ల కలిగినా అది బ్రహ్మవర్చస్సు. అది మరీ గొప్పది. వర్చస్కం అని మరియొక మాట ఉన్నది. దానికి అన్నం తాలూకు స్థూలమైన రూపం. పురీషమని అర్థం చెప్పారు శాస్త్రంలో.

Vedānta Paribhāṣā Vivaraṇa
వృత్తి ()
Telugu original

వృత్తి : తిరగటం. Turn. చుట్టుకోవటమని. Volve. దాత్వర్థం. బ్రాహ్మణాది వర్ణాలకు విధించిన ధర్మాలు వారివారి వృత్తులు Duty conduct. అది కాక మనస్సులో కలిగే ఆలోచనలన్నీ వృత్తులే. Ideas function of the mind. చిత్తవృత్తులని పేరు వీటికి. ఇవి ప్రాపంచికమైతే సవికల్పం. బంధానికే దారితీస్తాయి. పారమార్థికమైతే నిర్వికల్పం. మోక్షానికి తోడ్పడతాయి. ఆత్మాకార లేదా బ్రహ్మాకార వృత్తి అంటారు దీనినే. వృత్తి అంటే జీవనమని కూడా Livelihood మరియొక అర్థం. వ్యవహారమని Behaviour ఇంకో అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వృత్త , వృతి ()
Telugu original

వృత్త : Conduct ప్రవర్తన. ఆంతరమైతే గుణం character. బాహ్యమైతే చేష్ట. మండలమని కూడా అర్థమే Circle. గతం, అతీతం అనే అర్థంలో కూడా ప్రయోగిస్తారీమాట That which is past. వృతి : ఆవరించటం - కప్పటం. అలా కప్పకపోతే నిర్వృతి మోక్షమని భావం. వృతి ఏదో కాదు ఆవిద్యే. ఇది అనాదినుంచి మన చైతన్యాన్ని ఆవరిస్తూ వచ్చింది. ఆవరణమని కూడా దీనికే పేరు. ఆత్మజ్ఞానంతో కాని ఆవరణ భంగమై మోక్షాన్ని పొందలేడు మానవుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
వర్తమాన ()
Telugu original

వర్తమాన : ప్రస్తుతం. ఉంటున్నది Present. ఎప్పుడూ ఉంటున్నది కూడా Everpresent. బ్రహ్మస్వరూపం సదా వర్తమానమన్నారు భాష్యకారులు. సచ్చిత్తులు సచ్చిద్రూపంగా ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది కాదు. కనుక భూతభవిష్యత్తులనే స్పర్శ లేదు దానికి. దానికి గోచరించే జ్ఞేయ ప్రపంచమే మారుతుంది గాని దానిని గమనించే జ్ఞానం మారదు. కనుక అది వర్తమాన స్వభావం. దీనినిబట్టి రేపు మరణానంతరం కూడా అది స్థిరంగా ఉంటుందని పెద్దలిచ్చిన హామీ.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్రత ()
Telugu original

వ్రత : ఒక నియమం. Principle scruple. ధర్మపురుషార్ధానికే కాదు బ్రహ్మసాధనలో కూడా వ్రతమనేది ఆవశ్యకం. దృఢవ్రత అని సాధకుడికి పేరు. శ్రవణ మననాదులు నియమ నిష్ఠలతో చేసినప్పుడే ఫలసిద్ధి అతడికైనా.

Vedānta Paribhāṣā Vivaraṇa
వసు ()
Telugu original

వసు : ధనం - బంగారం. ఉత్తమం, శ్రేష్ఠమని కూడా అర్థమే. వసుమతి, వసుంధర అంటే రత్నగర్భ, భూమి. వసు మనస్సు అంటే మంచి మనస్సు. వసించేది కూడా వసువే. వాసుదేవ అంటే 'వసతి దీవ్యతి అస్తి భాతి.' పరమాత్మ అని అర్థం. వసు రుద్ర ఆదిత్యులలో మొదటిది వసువనే దేవత. అది ఏదో కాదు భూదేవతే.

Vedānta Paribhāṣā Vivaraṇa
వసిష్ఠ ()
Telugu original

వసిష్ఠ : 'వసు వసీయస్‌వసిష్ఠ.' వసువనే విశేషణానికి తరతమ భావం చెప్పేటప్పుడు చివరి రూపం వసిష్ఠ The best అని అర్థం. అలాంటి వ్యక్తికి వసిష్ఠుడని పేరు. వశిష్ఠుడని అంటారు చాలా మంది. అది శబ్దస్వరూప జ్ఞానం అంతగా ఒంట బట్టక అనే మాట.

Vedānta Paribhāṣā Vivaraṇa
వశ/వశిత్వ ()
Telugu original

వశ/వశిత్వ : వశపడటం-అధీనం కావటం. యోగసిద్ధులలో వశిత్వమనేది ఒక సిద్ధి. సమస్త పదార్థాలనూ తన వశంలో ఉంచుకొనే శక్తి ఇది. ఆణిమాది అష్టసిద్ధులలో ఇది ఒక సిద్ధి అని అద్వైతులు కూడా అంగీకరించారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
వస్తు / వస్తువత్‌ ()
Telugu original

వస్తు/వస్తువత్‌: 'వసతీతి వస్తు.' ఏది ఉందో అది Present. సత్‌సత్యమని కూడా పేర్కొంటారు. వస్తువెప్పుడూ మరొక నిమిత్తం మీద ఆధారపడదు. దానికి స్వతసిద్ధంగా ఉండే స్వభావం ఉంటుంది. ఇలాటిది కేవలం ఆత్మస్వరూపమే. అది స్వతఃప్రమాణం. దాని అస్తిత్వానికి వేరే ప్రమాణమక్కరలేదు. కనుక అసలైన వస్తు వాత్మ స్వరూపమే. లోకంలో పదార్థాలన్నింటిని మామూలుగా మనం వస్తువులనే పేర్కొంటాము. ఈ దృష్టితో చూస్తే అవి వస్తువులు కాదు. వస్తువు తాలూకు ఆభాసలే అని అర్థం చేసుకోవాలి.

Vedānta Paribhāṣā Vivaraṇa
వాస్తవ ()
Telugu original

వాస్తవ : వస్తువుకు సంబంధించిన లక్షణం అంటే నిజంగా ఉన్నదని భావం. Actual.

Vedānta Paribhāṣā Vivaraṇa
వాక్‌ ()
Telugu original

వాక్‌: మాట శబ్దం. word sound. చెప్పేది బయట పెట్టేది. శబ్దం చెబితే అర్థం బయట పడుతుంది. ప్రపంచమంతా ఒక వాక్కు చెబుతుంది. దేన్ని? పరమాత్మను ప్రపంచం ద్వారా పరమాత్మను గుర్తిస్తాము కాబట్టి ఇది వాక్కు అది అర్థం. పరమమైన వాక్కు పరావాక్కు. The greatest word. పరమమైన అర్థం పరమార్థం. The greatest meaning.

Vedānta Paribhāṣā Vivaraṇa
వాక్య / వాక్యార్థ ()
Telugu original

వాక్య / వాక్యార్థ : పదాల సముదాయం. యోగ్యతా ఆకాంక్ష ఆసత్తి అనిమూడు షరతులుండాలి దీనకి. ఆ షరతులను పాటించే శబ్ద సమూహానికే వాక్యమని పేరు. Sentence or Statement శాస్త్రంలో వాక్యాలంటే రెండే రెండు ఒకటి అవాంతర వాక్యం. దీనికే పదార్థ జ్ఞానమని పేరు. మరొకటి మహావాక్యం. దీనికే వాక్యార్థ జ్ఞానమని పేరు. మొదటిది రెండవదానికి దారితీస్తే రెండవది మూడవదైన అవాక్యార్థానికి దారి చూపుతుంది. అది ఏదో కాదు అఖండమైన ఆత్మానుభవమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
వాకోవాక్య ()
Telugu original

వాకోవాక్య : మాటకు మాట అని అర్థం. వాది ప్రతివాదులు ఒకరితో ఒకరు చర్చచేయటం ప్రశ్నోత్తర రూపంగా నడిచే ఈ వ్యవహారానికే వాకోవాక్యమని పేరు వచ్చింది. తర్కశాస్త్రమని అర్థం చెప్పారు వేదాంతులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
వాచోయుక్తి ()
Telugu original

వాచోయుక్తి : మాట పొందిక, మాట నేర్పు, మాటల గారడీ. క్రొత్తగా చెప్పే విషయమేమీ లేదని, కేవలం శబ్దాడంబరమేనని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వాచ్యార్థ ()
Telugu original

వాచ్యార్థ : బాహ్యార్థ Primary meaning. గోడ అంటే ఇటుక సున్నంతో కట్టిన గోడ అనే అర్థం. రూఢి అంటారు. దీనినే ముఖ్యార్థమని, అభిధేయమని కూడా అంటారు. అలా కాక వాడొక గోడ అన్నామంటే అది వాచ్యం కాదు. లక్ష్యం. వట్టి జడుడు, ముగ్ధుడని అర్థం. తత్త్వమసిలో జీవుడు ఈశ్వరుడని చెబితే వాచ్యార్థం. అలాకాక రెండూ శుద్ధచైతన్యమని చెబితే లక్ష్యార్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వానప్రస్థ ()
Telugu original

వానప్రస్థ : వనాలకు ప్రయాణం చేసేవాడని శబ్దార్థం. నాలుగు ఆశ్రమాలలో మూడవది. గార్హస్థ్యం గడచి సన్యాసం తీసుకొనే మధ్యలో చెప్పిన ఆశ్రమం. ఆ రోజులలో భార్యాభర్తలు అరణ్యాలకు వెళ్ళారేమో గాని ఇప్పుడక్కరలేదు. పిల్లలకు కుటుంబ భార మప్పచెప్పి ముసలివాళ్ళిద్దరూ సత్సంగంతో జీవిత శేషం చక్కగా గడప గలిగితే చాలు. అదే వానప్రస్థం. అలా గడుపుతూ ఇద్దరిలో ఒకరు కాలం దీరిపోతే అదే సన్యాసం. కుచేలుడు అలాగే చేసి తరించాడు భాగవతంలో.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్రాత్య ()
Telugu original

వ్రాత్య : సంస్కారహీనుడికి వ్రాత్యుడని పేరు. అలాంటి వాడికి ఉత్తమగతులు లేవని శాస్త్రం చెబుతున్నది. కాని ఉపనిషత్తులో అగ్ని దేవుడిని వ్రాత్యుడని సంబోధించారు దేవతలు. అక్కడ వ్రాత్యుడంటే సహజంగానే పరిశుద్ధుడని వేరే సంస్కార మతనికి అక్కరలేదని భావమట.

Vedānta Paribhāṣā Vivaraṇa
వాద ()
Telugu original

వాద : వాదించటం. ఒక సత్యాన్ని నిలబెట్టడానికి చేసే చర్చ. Debate or discussion. ప్రతివాదిని ఖండించటమే ధ్యేయం కాదు. సత్యాన్ని ప్రతిపాదించటం. 'అర్థ నిర్ణయ హేతుః వాదః' అని భాష్యకారుల సుభాషితం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వామనీ-భామనీ ()
Telugu original

వామనీ-భామనీ : అక్షి పురుష విద్యకు విశేష కోణాలు. అది అన్ని కోరికలనూ సాధకుడికి అందిస్తుంది కాబట్టి వామని - అన్ని తేజస్సులనూ వ్యాపించి వెలుగుతుంది గనుక భామని.

Vedānta Paribhāṣā Vivaraṇa
వామకేశ్వరి ()
Telugu original

వామకేశ్వరి : వమనాత్‌వామా. విశ్వాన్నంతా వమనం చేసేది వ్రెళ్ళగక్కేది వామ. పరమేశ్వరుని మాయాశక్తి. ఆవిడే ఈశ్వరి. వామకేశ్వరి. క్రియాశక్తి. ఆయన దక్షిణామూర్తి జ్ఞాన స్వరూపుడైతే, ఆమె వామ క్రియా స్వరూపిణి.

Vedānta Paribhāṣā Vivaraṇa
వాక్య ()
Telugu original

వాక్య : ఒక సంపూర్ణమైన అర్థమిచ్చే పద సమూహం. ఇది లౌకికమని అలౌకికమని రెండు విధాలు. లౌకికం ఆయా రచయితల గ్రంథాలలో లోకుల వ్యవహారంలో కనిపించేది. ఇది పౌరుషేయ మంటారు. అలౌకికం వేద శాస్త్రాలలో కనిపించేది. అది పారమార్థికమైన సత్యాన్ని చెప్పేది కనుక అలౌకికం అపౌరుషేయం. తత్త్వమసి మొదలైన మహావాక్యాలు ఇలాంటివి.

Vedānta Paribhāṣā Vivaraṇa
వాసనా ()
Telugu original

వాసనా : చిత్తవృత్తులే మనస్సులో బాగా పేరుకొనిపోతే వాటికి వాసనలని పేరు Impressions. సంస్కారాలని కూడా పేర్కొంటారు. ఇవే బహు జన్మలనుంచి ప్రోగు చేసుకున్న సంచిత కర్మ. వర్తమాన జన్మలో వృత్తులుగా పరిణమించాయి. ఇవి మరలా బలం పుంజుకొని వాసనలౌతాయి. వృత్తి సంస్కార చక్రమన్నారు యోగ శాస్త్రజ్ఞులు. ఇది ఒక విషవలయం. సంసారానికిదే మూలం గనుక కారణ శరీరమని దీనికి పేరు వచ్చింది. దీనికి జవాబు ఈశ్వర వాసన ఒక్కటే. 'ఈశా వాస్య మిదమ్‌సర్వం.' ఈశ్వర వాసన అనే శుభవాసన ఈ ప్రాపంచకమైన అశుభ వాసన లన్నింటికీ ప్రహాణకం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వికల్ప/వికార ()
Telugu original

వికల్ప/వికార : ఒక వస్తువు అనేక విధాలుగా భాసిస్తే అవి దాని వికల్పాలు లేదా వికారాలు The forms of a substance or changes.

Vedānta Paribhāṣā Vivaraṇa
విశేష ()
Telugu original

విశేష : విశేషాలన్నా వికల్పాలే. వికారాలే. అన్నీ ఒకదానికొకటి పర్యాయాలు. సామాన్యానికి Universal అని, విశేషానికి Particular అని భాషాంతరం. నామరూప క్రియలన్నీ విశేషాలే. సామాన్య రూపమైన సచ్చిత్తులే నామరూపాది విశేషాలుగా భాసిస్తున్నవి. వీటిద్వారా గోచరిస్తున్నది ఆ సామాన్యమే. ఇవి దానికి కేవలం ఉపాధులు Media.

Vedānta Paribhāṣā Vivaraṇa
వికల ()
Telugu original

వికల : సకలానికి వ్యతిరేకి. కళలంటే భాగాలు. అంశలు. ఎక్కడికక్కడ అవి విడిపోతే అలాంటి పదార్థం వికలం Deformed ఖండమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వికృత ()
Telugu original

వికృత : Changed మారిపోయినది. రూపాంతరం చెందినది. ప్రపంచమంతా చైతన్యవికారమే. దాని వికృతమైన రూపమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
విక్రియా ()
Telugu original

విక్రియా : వికారమనే మాటకు పర్యాయమే Synonym.

Vedānta Paribhāṣā Vivaraṇa
వికాస ()
Telugu original

వికాస : విస్తరించటం Expansion. చైతన్య వికాసమే సృష్టి. విలాసమన్నా అర్థమిదే.

Vedānta Paribhāṣā Vivaraṇa
విక్షేప ()
Telugu original

విక్షేప : సంక్షేపానికి వ్యతిరిక్తం. చెదరిపోవటం Distraction మాయాశక్తికి రెండు ముఖాలు. ఒకటి ఆవరణం. అది చైతన్యాన్ని కప్పి సంకుచితం చేసి చూపుతుంది. ఇదే జీవభావం. రెండవది విక్షేపం. ఇది రెచ్చగొట్టి ప్రపంచాన్ని బయట పెడుతుంది. ఇదే జగద్భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
విగ్రహ ()
Telugu original

విగ్రహ : సంగ్రహానికి ప్రతిగా చెప్పేమాట. విడిపోవటమని అర్థం. వేరై పోవటం. ఆకారం, మూర్తి, శరీరం, ఉపాధి అని కూడా అర్థమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
విగాన ()
Telugu original

విగాన : సంగానానికి వ్యతిరేకి. సంగానమంటే కుదురుబాటు. చెల్లుబాటు. సరిపడటం. Concordance. విగానమంటే సరిపడక పోవటం Disconcordance.

Vedānta Paribhāṣā Vivaraṇa
విచక్షణ ()
Telugu original

విచక్షణ : చక్షణమంటే చూడటం. విశేషంగా విమర్శించి చూస్తే విచక్షణం, మంచి చెడ్డలను వివేచన చేయటం Discrimination. నిఘాబెట్టి అసలైన తత్త్వాన్ని దర్శించటం కూడా Right vision.

Vedānta Paribhāṣā Vivaraṇa
విచార ()
Telugu original

విచార : విశేషంగా వివిధరూపాలుగా చరించటం. అన్ని కోణాలనుంచి బాగా పరిశీలించటం, పరిశోధన Enquiry. Investigation. ఆత్మవిచారం, బ్రహ్మవిచారం అంటే ఆ రెండింటి స్వరూపాన్ని చక్కగా ప్రామాణికంగా అర్థం చేసుకోవడమని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
విచికిత్సా ()
Telugu original

విచికిత్సా : సందేహం. ఏదీ తేల్చుకోలేక పోవటం. సత్యమేదో పట్టుకోవటానికి చర్చ చేయటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
విచిత్ర ()
Telugu original

విచిత్ర : వైచిత్రి Varied. Multiple. పలువిధములైన పలురకాలు. ప్రపంచ మంతా విచిత్రమని అనంతమని వర్ణిస్తారు శాస్త్రజ్ఞులు. ఇవి రెండే దాని లక్షణాలు. అనేక విధాలుగా భాసించటం విచిత్రమైతే ఆ అనేక లక్షణాలు అలాగే ఎడతెగకుండా సాగిపోవటం అనంతం.

Vedānta Paribhāṣā Vivaraṇa
విచ్ఛేద ()
Telugu original

విచ్ఛేద : ఎక్కడికక్కడ తెగిపోవటం. ఆగిపోవటం. Break. Gap. నశించి పోవటమని అర్థం. ఇది ప్రపంచ స్వభావమే. విచిత్రమన్నప్పుడు ఎక్కడికక్కడ రంగులు మారవలసినదే కదా.

Vedānta Paribhāṣā Vivaraṇa
విజాతీయ ()
Telugu original

విజాతీయ : సజాతీయం కానిది hitero genous. ఒకే జాతికి చెందక వేరు వేరు జాతులకు చెందినది. ఒకదానికొకటి విలక్షణమైనది. ప్రపంచ లక్షణాలు మూడు. సజాతీయ, విజాతీయ, స్వగత. ఇవి మూడు లేనిది పరమాత్మ. జీవుడిలాగా సజాతీయం కాడు. జగత్తు లాగా విజాతీయం కాడు. నిర్గుణం కాదు గనుక స్వగత భేదం లేదు. మూడింటినీ కలుపుకొన్న అఖండ చైతన్యమని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
విజ్ఞాన ()
Telugu original

విజ్ఞాన : విశేష జ్ఞానం. ఇదే జీవభావం. బంధానికి హేతువు. అలా కాక జ్ఞానంలో విశేషమూ విజ్ఞానమే. జ్ఞానం పరోక్షమైతే విజ్ఞానం అపరోక్షం అంటే అనుభవం. 'జ్ఞానవిజ్ఞాన తృప్తాత్మా' అని గీత చాటుతున్నది. విజ్ఞానమంటే స్వానుభవ కరణమని అర్థం చెప్పారు భాష్యకారులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
విలయ ()
Telugu original

విలయ : బాగా లయమై పోవటం. కరిగి కనపడకుండా పోవటం. జ్ఞానికి ప్రపంచం అలా కరిగిపోయి స్వరూపంతో ఏకమౌతుంది. దీనికే ఆత్యంతికమని పేరు. అలా కాక దానిపాటికది జరిగితే ప్రాకృతికం.

Vedānta Paribhāṣā Vivaraṇa
విహార ()
Telugu original

విహార : ఆహార విహారా అన్నారు. విహారమంటే అక్కడ ప్రవర్తన అని అర్థం. ఇంద్రియ వ్యాపారమన్నమాట.

Vedānta Paribhāṣā Vivaraṇa
విధి/విధాన ()
Telugu original

విధి/విధాన : ఒకటి తప్పక చేయాలని శాసనం. శాసించి చెప్పినది కూడా విధే. అలా చెప్పే శాస్త్రానికి విధానమని పేరు. Scripture.

Vedānta Paribhāṣā Vivaraṇa
విద్యా/విద్వాన్‌ ()
Telugu original

విద్యా/విద్వాన్‌: 'వేత్తి అనయా ఇతి విద్యా.' దేని మూలంగా ఒక సత్యాన్ని గ్రహిస్తామో అది విద్య. అది రెండు విధాలు. పర అపర. ఋగ్వేదాది వాఙ్మయమంతా అపర. పోతే అక్షరమైన అద్వైత తత్త్వాన్ని బోధించేదొక్కటే, పర. అది కేవలం బ్రహ్మజ్ఞానమే. ఇలాంటి విద్యనందుకొన్నవాడు విద్వాన్‌. అంటే బ్రహ్మజ్ఞాని అని అర్థం. The realized person. విద్య అంటే బ్రహ్మవిద్యే కాక ఉపాసనకు కూడా పేరుంది. మధువిద్య, పర్యంక విద్య, పంచాగ్ని విద్య అని ఇలాంటివెన్నో విద్యలు ఉపనిషత్తులలో కనపడతాయి. ఆ సందర్భంలో వాటికి ఉపాసన అనే అర్థం చెప్పాలి కాని బ్రహ్మజ్ఞానమని చెప్పరాదు. ఈశావాస్యంలో 'అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృత మశ్నుతే' అనేచోట విద్య అవిద్య అని రెండు మాటలు దొర్లాయి. ఇవి జ్ఞానం, అజ్ఞానమని బోల్తాపడే ప్రమాదముంది. అందుకే అవిద్య అంటే విద్యకానిది కర్మ అని, విద్య అంటే కర్మకంటే హెచ్చుస్థాయిలో ఉన్న ఉపాసన అని అంటే దేవతాజ్ఞానమని అర్థం చెప్పారు భగవత్పాదులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
వితండా ()
Telugu original

వితండా : తన పక్షమేదో స్థాపించకుండా పరపక్షాన్ని ఖండించటమే ప్రధానంగా పెట్టుకున్న వాదం. నిర్హేతుకమైన నిష్ప్రయోజనమైన తర్కం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వేద/వేదనా ()
Telugu original

వేద/వేదనా : తెలుసుకోవటం, తెలివి, జ్ఞానం. జ్ఞాన బోధకమైన వాఙ్మయం. ఆముష్మికమైన జ్ఞానాన్ని అందించే శాస్త్రం ఋగ్వేదాదులు. ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలు రెండింటికీ అతీతమైన ధర్మతత్త్వాన్ని, బ్రహ్మతత్త్వాన్ని చెప్పటానికే వచ్చింది వేదవాఙ్మయం. కనుక ఇది వాటి రెండింటికన్నా ప్రబలమైన ప్రమాణంగా భావిస్తారు మీమాంసకులు, వేదాంతులు ఇద్దరూ కూడా.

Vedānta Paribhāṣā Vivaraṇa
విత్త ()
Telugu original

విత్త : తెలియబడినది. పొందబడినది. జ్ఞానం కావచ్చు. ధనం కావచ్చు.

Vedānta Paribhāṣā Vivaraṇa
విదిత ()
Telugu original

విదిత : తెలుసుకోబడినది Attained.

Vedānta Paribhāṣā Vivaraṇa
వేత్తా/వివేదీ ()
Telugu original

వేత్తా/వివేదీ : బ్రహ్మతత్త్వాన్ని బాగా శ్రవణ మననాదులు చేసి ఉన్నదున్నట్టు గ్రహించిన మేధావి.

Vedānta Paribhāṣā Vivaraṇa
వితర్క ()
Telugu original

వితర్క : ఊహించటం. సందేహించటం. పరిపరివిధాల ఆలోచించటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
విదేహ ()
Telugu original

విదేహ : దేహం కానిది దేహం లేనిది. ఆత్మస్వరూపం. నిరుపాధికమని అర్థం. రెండు విధాలైన ముక్తిలో రెండవది. ప్రారబ్ధం తీరిపోయిన తరువాత మరలా దేహమనేది రాకపోతే దానికి విదేహముక్తి అని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
విదుర ()
Telugu original

విదుర : అన్ని తెలిసినవాడు All rounder.

Vedānta Paribhāṣā Vivaraṇa
విధుర ()
Telugu original

విధుర : భార్యలేనివాడు. వీడు ధర్మకార్యాలకు అర్హుడు కాడని పూర్వ మీమాంసకులు, ధర్మానికి కాకపోయినా మోక్షపురుషార్థానికి అర్హత ఉన్నవాడేనని వేదాంతులు అంటారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
విరోధ / విరుద్ధ ()
Telugu original

విరోధ/విరుద్ధ : Conflict. Contradiction. ఒకదానికొకటి సరిపడక పోవటం. అలా సరిపడని దానికి విరుద్ధమని పేరు. ద్వైతమతాలన్ని పరస్పర విరుద్ధాలైతే అద్వైతం అన్నింటినీ సమన్వయించుకొనేది కాబట్టి అవిరుద్ధమని చాటుతారు వేదాంతులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
విధేయ ()
Telugu original

విధేయ : విధింపవలసినది. ఒక వాక్యంలో దేనిని గూర్చి చెబుతావో అది ఉద్దేశ్యం. Subject. ఏది చెబుతావో అది విధేయం. Predicate. ఉత్పలం నీలం కలువ న్లలగా ఉన్నది అన్నప్పుడు కలువ ఉద్దేశ్యం నల్లగా ఉండటమనేది విధేయం. మహావాక్యాలకు అర్థం చెప్పేటప్పుడు ఈ బాణీనే మనం అనుసరించవలసి ఉంటుంది. తత్త్వమసి అనే వాక్యంలో త్వంపదార్థం ఉద్దేశ్యమైతే తత్పదార్థం దాన్ని గురించి చెప్పే విధేయం. అంటే ఈ జీవుడు బ్రహ్మమే అని బ్రహ్మత్వాన్ని జీవుడికి విధిస్తున్నదీ మాట. దీనివల్ల జీవభావం తొలగిపోయి బ్రహ్మభావం ఏర్పడుతుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
వినయ ()
Telugu original

వినయ : శిక్షణ Discipline. 'విద్యావినయ సంపన్నే' అని గీత. బౌద్ధవాఙ్మయంలో ఇది చాలా ముఖ్యంగా అలవరచుకోవలసిన లక్షణం. వినయ పిటకమని ఒక ధర్మ సూత్ర గ్రంథమే ఉన్నది.

Vedānta Paribhāṣā Vivaraṇa
వినాశ ()
Telugu original

వినాశ : అభావం. లేకుండా పోవటం. అంతేకాదు కనపడకుండా పోవటం. పనికిరాక పోవటమని కూడా అర్థమే. 'బుద్ధినాశాత్‌వినశ్యతి' అని గీత. షద్భావ వికారాలలో ఇది ఆరవది.

Vedānta Paribhāṣā Vivaraṇa
వినియోగ ()
Telugu original

వినియోగ : ఒక సూత్రం ప్రవర్తించే చోటు. ఒక కర్మ ఆచరించిన తరువాత దానికి పర్యవసానం. 'జపే వినియోగః సాయుజ్యే వినియోగః.' జపంలోనే దానికి ప్రయోజనం. సాయుజ్యంలోనే ఉపయోగమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
విపశ్చిత్‌ ()
Telugu original

విపశ్చిత్‌: బాగా దర్శించి అనుభవానికి తెచ్చుకొనే పండితుడు. The seer. వివేచన చేసి గ్రహించగలవాడని కూడా అర్థమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
విపక్ష ()
Telugu original

విపక్ష : సపక్షం కానిది. ప్రతిపక్షం Opposite. విజాతీయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
విపరిణామ ()
Telugu original

విపరిణామ : విశేషంగా మారిపోవటం. Mutation. Change. షడ్భావ వికారాలలో నాల్గవది.

Vedānta Paribhāṣā Vivaraṇa
విపర్యయ ()
Telugu original

విపర్యయ : తలక్రిందులు. ఒకదానికొకటి కనపడటం. జ్ఞానప్రతిబంధాలు మూడింటిలో మూడవది. మొదటిది అజ్ఞానం. సర్వమూ ఆత్మేనని తెలియకపోవటం. దానికి మందు శ్రవణం. రెండవది అనాత్మ కూడా ఆత్మే అని ఎలా తెలుసుకోవటమని సంశయం. దానికి మందు మననం. మూడవది ఆత్మేనని గ్రహించినా వ్యవహారంలో అది మరలా అనాత్మ రూపంగా దర్శనమివ్వటం. ఇదే విపర్యయం. దీనికి చికిత్స నిదిధ్యాసనం.

Vedānta Paribhāṣā Vivaraṇa
విపాక ()
Telugu original

విపాక : కర్మపరిపాకం Ripe or mature. పూర్వం చేసుకొన్న కర్మ ఫలితమిచ్చే దశ.

Vedānta Paribhāṣā Vivaraṇa
విభు / విభూతి ()
Telugu original

విభు/విభూతి : 'విశేషేణ భవతి వివిధ రూపేణ భవతి ఇతి.' అనేక విధాలుగా మారిపోయే సామర్థ్యం. అలాంటి సామర్థ్యమున్నవాడు విభు. ఈశ్వరుడు. ఆయన తాలూకు సామర్థ్యమే విభూతి. దీనికే ఐశ్వర్యమని మరొక పేరు. అష్టసిద్ధులకు కూడా విభూతి అని పేరున్నది.

Vedānta Paribhāṣā Vivaraṇa
విప్రకర్ష ()
Telugu original

విప్రకర్ష : దూరమై పోవటం. Distance. పదార్థాల మధ్య ఏర్పడే అంతరం. దీనికి వ్యతిరిక్తం సన్నికర్ష. సామీప్యమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
విప్రతిపత్తి ()
Telugu original

విప్రతిపత్తి : ఒక విషయాన్ని దానికి ప్రతిలోమంగా పట్టుకోవటం. Misapprehension. పరిపరివిధాల భావించటం. మతభేదం Difference of opinion. Disagreement. పరస్పరం అంగీకారం కుదరకపోవటం. దీనికి భిన్నంగా సంప్రతిపత్తి అంటే ఐకమత్యమని అర్థం. Agreement.

Vedānta Paribhāṣā Vivaraṇa
విప్రతిషేధ ()
Telugu original

విప్రతిషేధ : Contradiction. సరిపడక పోవటం. విసంవాదమని కూడా పేర్కొంటారు దీన్ని.

Vedānta Paribhāṣā Vivaraṇa
విప్ర ()
Telugu original

విప్ర : విశేషంగా దర్శించేవాడు. దేశకాల అవధులను దాటి సత్యాన్ని చూడగలవాడు. Visionary. 'దర్శనా ద్యా తి విప్రత్వమ్‌' అని శాస్త్రకారుల మాట. 'ఏకం సత్‌విప్రా బహుధా వదంతి.' ఒకే ఒక సత్యాన్ని చూచినా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా భావిస్తున్నారట.

Vedānta Paribhāṣā Vivaraṇa
విభాగ / విభక్త ()
Telugu original

విభాగ/విభక్త : వేరుపడటం. Separation. అలా వేరుపడిన పదార్థం విభక్తం. Separate. Divided. ఇదే త్రిపుటికి మూలం. బ్రహ్మం విభక్తం కావటంవల్లనే అది జీవ జగదీశ్వరులుగా భాసిస్తున్నది. ఈ విభాగానికి కారణం ఏదో కాదు. అనాది సిద్ధమైన అజ్ఞానమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
విభావనా / విభావిత ()
Telugu original

విభావనా/విభావిత : నిఘా పెట్టి చూడటం. నిరీక్షణం. Keen observation. బాగా లోతుకు దిగి పరామర్శించటం. ప్రస్తుతం ప్రపంచమంతా సత్తేగాక చిత్తుకూడా. లోపల వెలపలా వ్యాపించే ఉన్నది. అయినా సత్తు కనపడ్డంత స్పష్టంగా చిత్తు గోచరించటంలేదు. అది అవిభావిత మయిందంటారు వేదాంతులు. కొంత ప్రయత్నించి చూస్తే స్ఫురణ రూపంగా అదికూడా బయటపడే అవకాశముందని వారు మనకిచ్చే సలహా.

Vedānta Paribhāṣā Vivaraṇa
విభ్రమ ()
Telugu original

విభ్రమ : విశేషంగా కలిగే భ్రమ. తత్త్వాన్ని యథాతధంగా చూడక తలక్రిందులు చేసి చూడటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
విమర్శ ()
Telugu original

విమర్శ : మర్శ అంటే స్పర్శ. విశేష రూపంగా మర్శ అంటే పట్టుకోవటమే విమర్శ. సామాన్య రూపమైన తత్త్వాన్ని విశేషరూపంగా భావించటం. ఇదే సంసారానికి దారి తీస్తున్నది. మరలా విశేషాన్ని సామాన్యంగా పట్టుకోవటం కూడా విమర్శే. అది సాయుజ్యానికి దారిచూపే విధానం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వియోగ ()
Telugu original

వియోగ : యోగం కానిది. యోగమంటే కలయిక. కలయిక లేకుండా విడిపోవటం. వేరై పోవటం వియోగం. తాపత్రయం. తొలగిపోవటం కూడా వియోగమే. దీనికి వ్యతిరేకి సంయోగం. దుఃఖ సంయోగం సంసారమైతే దుఃఖ సంయోగ వియోగమే మోక్షమని చెబుతున్నది శాస్త్రం.

Vedānta Paribhāṣā Vivaraṇa
విరాగ ()
Telugu original

విరాగ : రాగం లేనిది. రాగమంటే Attachment ఒకదానితో తాదాత్మ్యం. Identity. అది లేక నిర్లిప్తంగా ఉండిపోతే అది విరాగం. Detachment.

Vedānta Paribhāṣā Vivaraṇa
విరతి ()
Telugu original

విరతి : తొలగటం. వెనక్కు మళ్లటం. Withdrawl. ఉపరతి అని కూడా పేరు దీనికి. విషయ జాతం నుంచి మనస్సు వైదొలగటమని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
విలక్షణ ()
Telugu original

విలక్షణ : ఒకదాని లక్షణాలకు విరుద్ధమైన లక్షణం. సంసార లక్షణాలకు విరుద్ధమైన లక్షణాలు ఉన్నది బ్రహ్మం. దానికి నామరూపాలు లక్షణమైతే ఇది సచ్చి ల్లక్షణం. నామరూపాలు విలక్షణం కనుకనే తాము తొలగిపోతూ తమకు విలక్షణమైన బ్రహ్మతత్త్వాన్ని చూపటానికి సమర్థమవుతున్నాయి. ఇది వేదాంత సాధనలో చాలా ఆశ్చర్యకరమైన విషయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వివక్షా / వివక్షిత ()
Telugu original

వివక్షా/వివక్షిత : 'వక్తు మిచ్ఛా.' ఒక విషయం చెప్పాలనే కోరిక. Intention or Aim ఏది చెప్పదలిచావో అది వివక్షితం. Intent.

Vedānta Paribhāṣā Vivaraṇa
వివరణ / వివృత ()
Telugu original

వివరణ/వివృత : వివరించటం, బయటపెట్టటం, ప్రకటించటం. అలా వివరించబడినది వివృతం. ఆత్మను దర్శించటానికి దానినే సాధకుడు వరించాలట. అప్పుడు ఆ ఆత్మ తనపాటికి తానే తన స్వరూపాన్ని అతని బుద్ధికి వివరిస్తుందట. అలాంటి స్ఫురణ కలుగుతుందని భావం Revelation.

Vedānta Paribhāṣā Vivaraṇa
వివిదిషా ()
Telugu original

వివిదిషా : 'వేదితుమిచ్ఛా వివిదిషా' ఒక జ్ఞానం సంపాదించాలనే తీవ్రమైన కాంక్షకు పేరు. సన్యాసం రెండు విధాలు. ఒకటి వివిదిషా సన్యాసం. రెండవది విద్వత్స న్యాసం. మొదటిది ఆత్మజ్ఞాన సంపాదన కోసమైతే, రెండవది సంపాదించిన తరువాత సన్యసించటం. మొదటి దానికి ఆశ్రమ సన్యాసమని, రెండవ దానికి పరమార్థ సన్యాసమని పేరు పెట్టారు అద్వైతులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
వివర్త ()
Telugu original

వివర్త : ఒక పదార్థం తన స్వరూపానికి నష్టం లేకుండా మరొక రూపంగా మారి కనపడడం Manifestation appearance. మృత్తిక తన స్వరూపాన్ని వదలకుండానే ఘట శరావాది కార్యరూపంగా కూడా భాసిస్తున్నది. అద్వైతులు చెప్పే సృష్టి రహస్యమిదే. వారిది ఆరంభవాదం కాదు. పరిణామ వాదం కాదు. వివర్తవాదం. లేనిది వచ్చిందని చెబితే తార్కికుల ఆరంభవాదం. ఉన్నది మారుతుందని చెబితే సాంఖ్యుల పరిణామం. ఉన్నదే రాకుండా మారకుండా మరో రూపంగా భాసిస్తున్నదని చెబితే అద్వైతుల వివర్తం. మృద్ఘటాదులు దృష్టాంతాలైతే బ్రహ్మచైతన్యం చరాచర జగద్రూపంగా కనపడటం దార్ష్టాంతికం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వివాద ()
Telugu original

వివాద : విసంవాద. ఒకదానికొకటి సరిపడక పోవటం. Disagreement. దీనికి వ్యతిరేకి సంవాదం, సరిపడడం. Agreement.

Vedānta Paribhāṣā Vivaraṇa
వివేక/వివిక్త ()
Telugu original

వివేక/వివిక్త : రెండు పదార్థాలు కలిసిపోయి ఉంటే వాటిని వేరు చేయటం. అది మంచి చెడ్డలు కావచ్చు. నిత్యానిత్యాలు కావచ్చు. అలా వేరుపడిన పదార్థాలకు వివిక్తమని పేరు Distinguished. ఆత్మానాత్మలను వేరు చేయటమే అద్వైతులు చెప్పే వివేకం. ఆత్మలక్షణాలు మనస్సుకు తెచ్చుకొని ఆ దృష్టితో అనాత్మను చూచినప్పుడు ఆత్మ వేరై అనాత్మ అసలు లేకుండాపోయి అదికూడా ఆత్మగానే దర్శనమిస్తున్నది. కాబట్టి ఆత్మానాత్మ వివేకంవల్ల ఆత్మైకత్వమే చివరకు సిద్ధిస్తున్నది. ఆ రెండింటి ఐక్యం చివరకు కలిగే ఫలితమైతే ఆ ఫలితానికి దారి తీసేది మొదటి ఈ వివేకమే. సాధన చతుష్టయంలో మొట్టమొదటి సారిగా మొదటి అంశంగా చెప్పినది ఆత్మానాత్మ వివేకమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
విశద/వైశద్య ()
Telugu original

విశద/వైశద్య : స్పష్టమైన, ప్రకటమైన Clear. అలా స్పష్టంగా ఉండే లక్షణం వైశద్యం. Clarity.

Vedānta Paribhāṣā Vivaraṇa
విశారద/వైశారద్య ()
Telugu original

విశారద/వైశారద్య : ఈ రెండింటికీ కూడా పైన చెప్పిన అర్థమే చెప్పుకోవలసి ఉంటుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
విశ్వ ()
Telugu original

విశ్వ : ప్రపంచమని అర్థం. పరమాత్మ చైతన్యం సద్రూపంగా ఇందులో ప్రవేశించింది కనుక దీనికి ఈ పేరు వచ్చింది. అంతేకాక అవస్థాత్రయంలో మొదటిదైన జాగ్రదవస్థకు చెందిన జీవ చైతన్యానికి విశ్వుడని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
విష్ణు ()
Telugu original

విష్ణు : 'విశతి, విష్ణోతి.' అన్నింటిలో ప్రవేశించింది, అన్నిటినీ వ్యాపించేది ఏదో అది విష్ణు. All pervasive and all inclusive. త్రిమూర్తులలో ఒకరనే గాక అసలీ మాటకు వేదాంతులు పరమాత్మ అని అర్థం చెప్పారు. 'తద్విష్ణోః పరమం పదం' అంటే పరమాత్మ తత్త్వమని అర్థం. అది సచ్చిద్రూపం కనుక సచ్చిద్విశేషాలైన జీవజగత్తులను వ్యాపించగలదు. సామాన్యమెప్పుడూ విశేషాలన్నింటిలో వ్యాపించి నప్పుడే దానికి ఆ పేరు సార్థకం.

Vedānta Paribhāṣā Vivaraṇa
విపత్తి ()
Telugu original

విపత్తి : సంపత్తి అనే మాటకు వ్యతిరిక్తమిది. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అది సంపత్తి. అలాకాక మరో రూపంగా, మరో విధంగా జరిగితే దానికి విపత్తి అని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
వితథ/వైతథ్య ()
Telugu original

వితథ/వైతథ్య : తథా అంటే అలాగ. వితథ అలాకాక మరోలా ఉండేది. అంటే సత్యం గానిదని అర్థం. దీని భావమే వైతథ్యం Futility. మాండూక్య కారికలలో రెండవ ప్రకరణానికి పేరు. ప్రపంచమంతా వితథమే. ఆత్మకు భిన్నంగా దానికి అస్తిత్వం లేదు అని ప్రపంచ వైతథ్యాన్ని చక్కగా నిరూపించారు గౌడపాదులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
విశయ ()
Telugu original

విశయ : సంశయమనే మాటకు పర్యాయపదం. Doubt. వ్యాఖ్యానానికుండే ఐదు అంశాలలో మొదటిది విషయమైతే Subject matter రెండవది విశయం అని పేర్కొన్నారు. విశయమున్నప్పుడే దాని మీద చర్చ జరుగుతుంది. అసలు సంశయమే లేకపోతే విచారణ లేదు. పరిష్కారమూ లేదు.

Vedānta Paribhāṣā Vivaraṇa
విశసన ()
Telugu original

విశసన : కోసి వేయటం. పశువిశసనం. అంటే పశువును వధించటం. కొన్ని యజ్ఞాలలో మేథ్యమైన పశువును అలాగే వధించి హోమం చేస్తారు. అలా కోతబడిన పశువుకు విశస్తమని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
విశుద్ధ ()
Telugu original

విశుద్ధ : బాగా శుద్ధమైన, నిర్మలమైన, మాలిన్యంలేని పదార్థమని భావం. అలాంటిదేదో కాదు, ఆత్మచైతన్యమే. నామరూపాదులే మాలిన్యం. వాటి స్పర్శ కూడా లేని జ్ఞాన స్వరూపం గనుక అది ఎప్పుడూ విశుద్ధమే. Pure awareness.

Vedānta Paribhāṣā Vivaraṇa
విశేషణ/విశేష్య ()
Telugu original

విశేషణ/విశేష్య : విశేషమంటే అధికం, అదనం, అతిరిక్తం. ఒక గుణాన్ని చెప్పే మాట. Attribute. గుణమని అర్థం. Quality. అలాంటి గుణంతో కూడిన ద్రవ్యం విశేష్యం లేదా విశిష్టం. That which is qualified. ద్రవ్యం విశేష్యమైతే దాని గుణం విశేషణం. ద్రవ్యానికి, గుణానికి ఉండే సంబంధమిది. రెండూ వేర్వేరు భావాలంటారు ద్వైతులు. ద్రవ్యమే ఉంది. అదే వాస్తవం. దాని విశేషం లేదా గుణం దానికి భిన్నంకాదు. అదే ఆ రూపంలో భాసిస్తుందంటారు అద్వైతులు. ఆత్మానాత్మల వ్యవహారం ఇదే. సంబంధం అని చెప్పవలసి వస్తే అది తాదాత్మ్య Identity సంబంధమని వర్ణిస్తారు వారు. అంటే వస్తువుకు ఆభాసకు ఉండే సంబంధం. నిజంలో అది సంబంధమే కాదు. ఎదుటివారిని తృప్తి పరచడానికి చెప్పే మాటది.

Vedānta Paribhāṣā Vivaraṇa
వైశేషిక ()
Telugu original

వైశేషిక : విశేషాలే సృష్టికి మూలమని వాదించే మతం. కణాదుడు స్థాపించిన మతమిది. పృథివ్యాది తన్మాత్రలకు పరమాణువులని పేరు. Atoms. అవి దేనిపాటికవి విలక్షణం. Distinct. విశేషం. అలాంటి విశేష లక్షణమైన అణువులే సృష్టికి కారణం. ఇదే వారి సిద్ధాంతం. దీనికి Atomic theory of creation అని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
వైభాషిక ()
Telugu original

వైభాషిక : బౌద్ధమతంలో ఒక శాఖ. ఆంతరమైన విజ్ఞానమే కాదు. దానికి స్ఫూర్తినిచ్చే బాహ్యజగత్తు కూడా సత్యమేనని అభిప్రాయపడతారు వీరు. కాని విజ్ఞానంలాగా ఇదీ క్షణభంగురమైతే కావచ్చునంటారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
విషమ/వైషమ్య ()
Telugu original

విషమ/వైషమ్య : సమం కానిది విషమం. సరిపోనిది. ఒక దృష్టాంతం ప్రస్తుతాంశానికి చక్కగా అన్వయించకపోతే దానికి విషమ దృష్టాంతమని పేరు. రెంటికీ ఉన్న భేదం వైషమ్యం. Controversion. అంతేగాక సృష్టిలో ఉన్న హెచ్చుతగ్గులు. మంచి చెడ్డలు ఇవికూడా వైషమ్యం క్రిందికే Disparity వస్తాయి. దీనిమీద చాలా చర్చ జరిగింది. ఇది వాస్తవం కాదు కనుక అసలు సృష్టే జరగలేదు గనుక ఈ ప్రశ్న ఉదయించదని అద్వైతులు సమాధానమిచ్చారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
విష్టంభ/విష్ఠిత ()
Telugu original

విష్టంభ/విష్ఠిత : గట్టిగా పట్టుకుని ఉండటం విష్టంభం. 'విష్టభ్యాహ మిదం కృత్స్నం' అని గీతలో మాట. పరమాత్మ ఈ ప్రపంచాన్నంతా గట్టిగా పట్టుకుని నిలిపి ఉన్నాడట. పోతే 'హృది సర్వస్య విష్ఠితః' ప్రతి ఒక్కప్రాణి హృదయంలో తిష్ఠ వేసుకుని కూచున్నానని ఆయనే చెప్పాడు. విష్ఠిత అంటే అలా నిశ్చలంగా వచ్చి కూచున్నవాడని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వంశ ()
Telugu original

వంశ : కులం గోత్రం అన్వయం. సంప్రదాయం కూడా. Tradition. గురుశిష్య పరంపరకు వంశమని పేరు. బ్రహ్మజ్ఞానం ఒకరివల్ల ఒకరికి సంక్రమించటం వల్ల వంశమన్నారు. ఒకే ఒక్క జ్ఞానధనం దానివాళ్ళ కందరికీ సంక్రమించటం లేదా అన్వయించటం. 'సర్వాస్యాపి బ్రహ్మవంశ్యత్వాత్‌' అని భగవత్పాదుల సూక్తి. మానవులందరూ బ్రహ్మవంశానికి చెందిన వారేనట. అంటే ఒకే ఒక బ్రహ్మతత్త్వం ప్రతివాడి మనస్సులో వాడు గుర్తించినా గుర్తించకున్నా చోటు చేసుకొనే ఉంది. కనుక ప్రతివాడు దానికి వారసుడే.

Vedānta Paribhāṣā Vivaraṇa
విసర్గ ()
Telugu original

విసర్గ : విడిచిపెట్టడం. విసర్జించటం, వదిలేయటం. అంతేకాక ప్రపంచ సృష్టికి కూడా సర్గమని, విసర్గమని పేరు పెట్టారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
విహార ()
Telugu original

విహార : విహరించటం. ప్రవర్తన. ఆహార విహారాలలో రెండవది. లోపలికి తీసుకోవటం ఆహారమైతే, బయటకు సాగిపోవటం విహారం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వీక్షా/వీక్షణ ()
Telugu original

వీక్షా/వీక్షణ : చూపు. ఆలోచన. విచారణ కూడా Discourse.

Vedānta Paribhāṣā Vivaraṇa
వీప్సా ()
Telugu original

వీప్సా : వ్యాప్తుమిచ్ఛా. అన్నింటినీ వ్యాపించే స్వభావం. 'గ్రామోగ్రామో రమణీయః.' ప్రతి గ్రామమూ రమణీయమే. రమణీయత అనేది అన్ని గ్రామాలకు వర్తిస్తుంది. అలాగే నేతి నేతి అని ఉపనిషత్తు చాటిచెప్పింది. అంటే జ్ఞానాని కేదేది గోచరిస్తుంటుందో అదంతా దానికి వేరుగా లేదని అర్థం చేసుకోవాలి. ఆ లేకపోవటమనేది అన్ని విషయాలకు వర్తిస్తుంది గనుక దీనికి వీప్పా అని పేరు. అలాంటప్పుడు జ్ఞానం తప్ప మరేదీ లేదని నిష్కర్షగా మనకు బోధ పడుతుంది. వీప్సా అనే సూత్రం పాటించకపోతే కొన్నింటికి మాత్రమే ఆ నేతి అనే సూత్రం వర్తించి, ఇంకా కొన్నింటికి వర్తించదేమో అనే అనుమానం కలగవచ్చు. అది ఉన్నంత వరకూ సాధన చేయలేడు మానవుడు. కనుక ఆత్మకు భిన్నమైనదంతా ఆత్మలో లయంచేసి పరిశుద్ధమైన ఆత్మమీదికే మన దృష్టి మళ్ళించాలంటే ఈ వీప్స అనేదేచక్కగా తోడుపడుతుంది. అప్పుడిక ఆకాంక్ష అనేది లేదు. అదే పరిపూర్ణమైన అనుభవం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వీర్య ()
Telugu original

వీర్య : బలం. సామర్థ్యం. తేజస్సు. ఆత్మను పట్టుకునే స్తోమత. 'ఆత్మనావిందతే వీర్యం.'

Vedānta Paribhāṣā Vivaraṇa
వేద / వేద్య ()
Telugu original

వేద/వేద్య : జ్ఞానాన్ని మనకు అందించే శాస్త్రం. అది అర్థకామాలకు చెందిన జ్ఞానం కాదు. అది లోకమే మనకు చెబుతుంది. పోతే లోకోత్తరమైన ధర్మాన్ని, బ్రహ్మాన్ని గూర్చి మనం గ్రహించాలంటే దానికి వేదమే ప్రమాణం. దీనికే శాస్త్ర ప్రమాణమని, శబ్ద ప్రమాణమని పేరు. వేదమంటే అలాంటి ధర్మబ్రహ్మాలకు రెండింటికి సంబంధించిన జ్ఞానమని అర్థం. దీనిచేత మనం గ్రహించే ఆ ధర్మమో బ్రహ్మమో దానికి వేద్యమని పేరు. వేదం సాధనమైతే, వేద్యం సాధ్యం. వేదమంటే కేవలం వేదశాస్త్రమే గాక జ్ఞానమని కూడా ఒక అర్థముంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
వేత్తా / వేదీ ()
Telugu original

వేత్తా/వేదీ : ఒక విషయం చక్కగా తెలుసుకొన్నవాడని అర్థం. ముఖ్యంగా శాస్త్రం చెప్పే రహస్యాలు రెండింటిని గుర్తించినవాడు. బ్రహ్మవేత్త అంటే బ్రహ్మతత్త్వాన్ని అనుభవానికి తెచ్చుకున్న వాడని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వేదాంత ()
Telugu original

వేదాంత : వేదంలో రెండు భాగాలు. పూర్వభాగమంతా కర్మోపాసనలకు సంబంధించిన విషయాన్ని చెబుతుంది. దానికి వేదమని పేరు. పోతే చివరిభాగం కేవలం బ్రహ్మజ్ఞానాన్ని మాత్రమే మనకు బోధిస్తుంది. ఇదే వేదాంతం. వేదమెక్కడ అంతమౌతుందో అది వేదాంతం. ఉపనిషత్తులని దీనికి మరొకపేరు. వేదమంటే జ్ఞానమని కూడా ఇంతకు ముందు చెప్పి ఉన్నాము. అది ఏ జ్ఞానమైనా సరే. మానవుడికి దీని తర్వాత ఏమిటనే ఆకాంక్ష ఉంటూనే ఉంటుంది. అలాంటి ఆకాంక్షను పూర్తిగా తొలగించి ఇక తెలుసుకోవలసింది ఏదీ లేదని, ఎక్కడ మానవ విజ్ఞానానికి పరి సమాప్తి ఏర్పడుతుందో అదే అసలైన వేదాంతం. Culmination of all human thought.

Vedānta Paribhāṣā Vivaraṇa
వేశ ()
Telugu original

వేశ : ప్రవేశించటమని అర్థం. ప్రవేశించి అంతా నిండిపోతే దానికి ఆవేశమని పేరు. గ్రహావేశం. భూతావేశం, బ్రహ్మావేశం. ఒక భూతంలాగా ఆపరమాత్మ తత్త్వం మనసులో నిండిపోయి మొత్తం మనిషి పరమాత్మగా మారిపోవటమే అసలైన బ్రహ్మావేశం.

Vedānta Paribhāṣā Vivaraṇa
విగుణ, వైగుణ్య ()
Telugu original

విగుణ, వైగుణ్య : విగుణమంటే ఏదో ఒక గుణం లోపించటం. కర్మానుష్ఠానం చేసేటప్పుడు అన్ని గుణాలు సక్రమంగా అందులో ఉండి తీరాలి. ఏది లోపించినా ఫలితం ఏర్పడకపోగా దుష్ఫలితానికి దారితీయవచ్చు. కనుక ఇలాంటి విగుణాల తాలూకు భావమే వైగుణ్యం. లోపమని అర్థం. దీనికి వ్యతిరిక్తమైనది సాద్గుణ్యం Completion. Perfection.

Vedānta Paribhāṣā Vivaraṇa
వికల్ప / వైకల్పిక ()
Telugu original

వికల్ప/వైకల్పిక : వికల్పమంటే విడిపోవటం. రెండు పక్షాలుగా ఏర్పడటం. మనస్సులో కలిగే భావాలు అన్నీ ఇలాంటివే. ఒకదాని తర్వాత ఒకటి విభక్తమై కలుగుతుంటాయి. ఇదే సంసారానికి దారి తీస్తుంది. ఇలాంటి వికల్పంతో కూడిన మనస్సే వైకల్పికం. సంకల్పానికి ఇది విరుద్ధమైనది. వికల్పమంటే వాదంలో రెండు పక్షాలు చేసి రెండింటికీ సమాధానమేమిటని అడగటం కూడా. అంతేకాక నియమంగా ఒకటి పాటించనక్కరలేదు. ఇందులో ఏదైనా సరే పాటించవచ్చునని అనుజ్ఞ ఇవ్వడానికి కూడా వికల్పమనే పేరు. Option, No Compulsion.

Vedānta Paribhāṣā Vivaraṇa
విరాగ / వైరాగ్య ()
Telugu original

విరాగ/వైరాగ్య : రాగం లేనిది విరాగం. ఏ అభిమానమూ లేనిదని అర్థం. దాని భావమే వైరాగ్యం. Detachment. అనాసక్తి అని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యక్తి ()
Telugu original

వ్యక్తి : ఒక జాతికి చెందినది. వ్యష్టి అని కూడా పేర్కొనవచ్చు. Individual, Particular విశేషమని అర్థం. గుప్తమైనది ప్రకటం కావడం కూడా వ్యక్తే.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యక్త ()
Telugu original

వ్యక్త : అలా ప్రకటమైన బయటపడిన పదార్థం. మూలకారణమైన మాయాశక్తే వ్యక్తమై ప్రపంచంగా భాసిస్తున్నది. ఈ ప్రపంచమే వ్యక్తమైన పదార్థం. Manifest.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యగ్ర ()
Telugu original

వ్యగ్ర : వి+అగ్ర. ఒక లక్ష్యం మీద దృష్టి నిలుపుతున్నప్పుడు అది చెదరిపోతే దానికి వ్యగ్రమని పేరు. చెదరకుండా నిలిస్తే ఏకాగ్రం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యష్టి ()
Telugu original

వ్యష్టి : వ్యక్తి అనే అర్థం. Particular దీనికి జతమాట సమష్టి. అంటే సమూహం. Whole. వ్యష్టి అంటే అవయవం. Part. జాతికి సమష్టి అని వ్యష్టికి వ్యక్తి అని మారు పేర్లు.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యతిహార ()
Telugu original

వ్యతిహార : ఇటునుంచి అటు అటునుంచి ఇటు చూపుతూ రెండూ ఒకటేనని ఏకంచేసి చెప్పటానికి వ్యతిహారమని పేరు. Reciprocity. 'త్వంవా అహ మస్మి భగవో దేవతే అహం వా త్వమసి భగవో దేవతే' అని జాబాల ఋషులు చాటిన రహస్యం. నీవే నేను. నేనే నీవు అని దేవతను సంబోధించి చెప్పారు వారు. ఇది పరిపూర్ణమైన అద్వైత భావం. ఆ మాటకు వస్తే అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యాలు కూడా ఇలాంటివే. నేను బ్రహ్మమని ఇటువైపు నుంచి జీవుడికి బ్రహ్మత్వం చెబుతున్నది. మరలా బ్రహ్మమే నేనని బ్రహ్మానికి ఆత్మత్వం చెబుతున్నది వాక్యం. దీనిని బట్టి కేవలం బ్రహ్మమూ కాదు, కేవల జీవుడూ కాదు. రెండూ కలిసి బ్రహ్మాత్మగా మారినప్పుడే అది పరిపూర్ణత అని తేటపడుతున్నది. దీనికే వ్యతిహారమని పరిభాష.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యయ ()
Telugu original

వ్యయ : ఖర్చు, మార్పు. ప్రపంచమంతా సృష్టి స్థితి లయాత్మకం కనుక వ్యయమే. పోతే నిర్గుణమైన శుద్ధ చైతన్య రూపమైన పరమాత్మ మార్పులేనిది గనుక అది ఒక్కటే అవ్యయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యాజ ()
Telugu original

వ్యాజ : ఒక నెపం. మిష. Pretext వి+ఆజ. ఏదీ అంటనిది అని శబ్దార్థం. అంటితే అది సమాజ. Association. వ్యాజమంటే అప్పటికి నిర్లిప్తమైనదని కూడా అర్థం చెప్పవచ్చు. Dissociation.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యంజన ()
Telugu original

వ్యంజన : వ్యంగ్య. ప్రసిద్ధమైన. అర్థంకాక ఏదో ఒక విలక్షణమైన అర్థాన్ని సూచించటం వ్యంజనం. Suggestion. బయటపెట్టడం. ధ్వనింపచేయటం. అలా ధ్వనించే అర్థానికి వ్యంగ్యమని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యతికర ()
Telugu original

వ్యతికర : కలయిక. కలిసిపోవటం. వృత్తాంతమని కూడా అర్థమే. Incident or Event.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యతిరేక/వ్యతిరిక్త ()
Telugu original

వ్యతిరేక/వ్యతిరిక్త : ఒకదానికి విరుద్ధమైనది లేదా భిన్నమైనది అని అర్థం. అధికమైనదని కూడా అర్థమే. కార్యానికి, కారణానికి రెండింటికీ వ్యతిరేకం లేదని కారణం కంటే కార్యం అవ్యతిరిక్తమని Not different అద్వైతుల సిద్ధాంతం. అప్పటికి వ్యతిరేకం అంటే Difference. రెంటికీ భేదమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యభిచార ()
Telugu original

వ్యభిచార : కదలిపోవటం. చలించటం. మార్గం తప్పటం. అతిక్రమించటం. Continuation. స్వభావానికి దూరమై పోవటం. అశ్వలక్షణం మహిషానికి లేదు. అక్కడ వ్యభిచారం. కాని మృత్తిక లక్షణం ఘటానికి ఉంది. కనుక అది వ్యభిచారం కాదు. అవ్యభిచార మంటారు. అంటే అనువృత్తి Continuation. నామరూపాలు ఎక్కడికక్కడ వ్యభిచరిస్తాయి. Discontinue. కాని వాటన్నింటినీ వ్యాపించిన అస్తి భాతి అనేవి రెండూ అలాగా వ్యభిచరించక అనుసరించిపోతాయి. కనుక అవ్యభిచారి.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యవచ్ఛేద ()
Telugu original

వ్యవచ్ఛేద : అక్కడికి తెగిపోవటం. అది అంతేనని నిష్కర్ష చేయటం. Determination. Fixation.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యవహార ()
Telugu original

వ్యవహార : లోకంలో చలామణి. Transition. పరమార్థం కానిది. తాత్కాలికమని అర్థం. సత్యం వ్యావహారికమని, పారమార్థికమని రెండు విధాలు. పారమార్థికం ఎప్పటికీ ఉండేది. త్రికాలాలలో దానికి మార్పులేదు. వ్యావహారికం అలాంటిది కాదు. తాత్కాలికంగా వర్తమానంలో మాత్రం కనిపిస్తూ ఆద్యంతాలలో లేనిది. వర్తమానంలో కూడా ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ మారుతూ పోయేది. దీనికే పరిణామ సత్యమని పేరు పెట్టారు వేదాంతులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యాహార/వ్యాహృతి ()
Telugu original

వ్యాహార/వ్యాహృతి : ఉచ్చరించటమని అర్థం Pronunciation, Expression. 'ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్‌' అంటే ఓం అనే మాటతో బ్రహ్మతత్వాన్ని నోట ఉచ్చరించటం. దీనికే వ్యాహృతి అని కూడా పేరు. భూః భువః సువః ఇలాగా ఏడు వ్యాహృతులు కనిపిస్తాయి. సంధ్యావందనాదులలో ఈ ఏడింటిని ఉచ్చరించవలసి ఉంటుంది. ఒకానొకప్పుడు పరమాత్మ ఒక్కొక్క శబ్దాన్నే ఉచ్చరిస్తూ సృష్టి చేశాడట. కనుక వీటికి వ్యాహృతులని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యవసాయ ()
Telugu original

వ్యవసాయ : అధ్యవసాయం నిశ్చయం. Decision. శ్రవణ మననాంతరం ఇది మూడవ భూమిక. దీనిని చేరినప్పుడే బుద్ధి నిశ్చలమై ఏకైకమైన బ్రహ్మాకార వృత్తితో నిండిపోగలదు. 'వ్యవసాయాత్మికా బుద్ధిః' అని గీతావచనం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యవధాన ()
Telugu original

వ్యవధాన : అంతరం. అడ్డం. మధ్యలో అడ్డుపడటం. రెండు పదార్థాలకు ఏర్పడే దూరం. అలా ఏర్పడితే అది వ్యవహితం. ఆత్మకు నామరూపాలవల్ల వ్యవధానం వాస్తవంలో లేదు. కాని ఉన్నట్టు బుద్ధికి తోస్తున్నది. బుద్ధితంత్రమే కాని, వస్తుతంత్రం కాదని అద్వైతుల మాట. సత్య మవ్యవహిత మంటారు వారు. అంటే అపరోక్షమని భావం. Immediate. Direct.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యవస్థా ()
Telugu original

వ్యవస్థా : ఒక కట్టుబాటు. ఒక నిలకడ. ఒక నియమం. System. Stability. అలా నిలకడ చెందిన విషయానికి వ్యవస్థితమని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యసన ()
Telugu original

వ్యసన : జారిపడటం. దుఃఖం. దూరంగా తోసివేయటం. దురభ్యాసం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యాకృత ()
Telugu original

వ్యాకృత : వి+ఆ కృత. బాగా వివరించబబడినది. విస్తరించబడినది. ప్రపంచం. 'నామరూపాభ్యాం వ్యాకృతం.' అవ్యాకృతమైన సూక్ష్మభూతాలే వ్యాకృతమై ప్రపంచంగా కనిపిస్తున్నవి. అలాకాక గుప్తంగా ఉండిపోతే అది అవ్యాకృతమే. అవ్యక్తమని కూడా అంటారు. వ్యక్తమైతే వ్యాకృతం. నామరూపే వ్యాకరవాణి. జీవరూపంగా దేహంలో ప్రవేశించి నామరూపాలను వ్యాఖ్యానిస్తూ కూచున్నాడట పరమాత్మ.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యాన ()
Telugu original

వ్యాన : పంచ ప్రాణాలలో మూడవది. హృదయం దక్షిణ ద్వారం నుంచి బయటకు వచ్చి రక్తాన్ని సర్వత్రా ప్రసరింపచేసే శక్తి. ఒక బరువైన పదార్థాన్ని ఎత్తవలసినప్పుడు ఈ వ్యానవాయువే మనకు తోడ్పడుతున్నది.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యాప్తి ()
Telugu original

వ్యాప్తి : విశేషంగా లేక వివిధ రూపాలుగా అన్నింటినీ ఆక్రమించటం. Expansion. అలాంటి లక్షణం నామరూపాలకు లేదు. అవి విశేషాలు. విశేషాలు ఎప్పుడూ అన్యోన్య వ్యావృత్తం. Mutually exclusive. అనువృత్తం కావు. Not inclusive. అనువృత్తమైతేనే అది వ్యాప్తి. సచ్చిత్తులు ఇలాంటివి. వ్యాప్తి అనేది మూడు విధాలు. అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి. అప్పుడు సజాతీయాది భేదత్రయం లేకుండా పోయి అంతా ఆత్మస్వరూపంగా భాసిస్తుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యాకుల ()
Telugu original

వ్యాకుల : అన్నీ కలిసి ఏకమై పోవటం. గందరగోళం. Confusion. శాస్త్రంలో ఇలాంటి వ్యాకులత్వం పనికిరాదు. దానివల్ల సత్యం ఫలానా అని నిర్ధారణ చేయలేము. కనుకనే భాష్యకారులు పనిగట్టుకుని ఉపనిషత్తులు మొదలగు గ్రంథాలన్నింటికీ పూర్వాపరాలను సమన్వయిస్తూ భాష్యం రచించవలసి వచ్చింది. ప్రతివాదుల వల్ల ఏర్పడిన వ్యాకులత్వం దీని వెలుగులో పూర్తిగా తొలగిపోయి నిరాకులంగా, స్పష్టంగా శాస్త్రార్థం బోధపడి సాధనకెంతైనా చేయూత నిస్తుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యాఖ్యాన ()
Telugu original

వ్యాఖ్యాన : విశేషంగా లేదా వివరంగా వర్ణించి చెప్పటం. అర్థాన్ని విశ్లేషించి చేసే బోధ. Explanation. Exposition. విషయమని, విశయమని, సంగతి అని, ఆక్షేపమని, సమాధానమని అయిదు అంశాలు ఉండాలి వ్యాఖ్యానంలో.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యాఘాత/వ్యాహత ()
Telugu original

వ్యాఘాత/వ్యాహత : ఎదురుదెబ్బ తగలటం. చెల్లకపోవటం. ప్రతిబంధం. అలాంటి భావానికి వ్యాహతమని పేరు. Contradicted.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యాపార ()
Telugu original

వ్యాపార : పని. చేష్ట. జుబీశిరిళిదీ. Action. Operation. ఒక సూత్రం దాని విషయంలో పనిచేయటం. వర్తించటం. ఇంద్రియ వ్యాపారమన్నప్పుడు ఇంద్రియాలు వాటివాటి విషయాలలో ప్రవర్తించటం అని అర్థం. ప్రవర్తిస్తే అవి వ్యాపృతమని పేర్కొంటారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యావృత్తి/వ్యావృత్త ()
Telugu original

వ్యావృత్తి/వ్యావృత్త : తొలగిపోవటం. నిలవకపోవటం. ఎక్కడికక్కడ తెగిపోవటం. Discontinue. Break. అనువృత్తి అనే మాటకు ఇది వ్యతిరిక్త పదం. నామరూపాలన్నీ విశేషాలు. విశేషాలన్నీ వ్యావృత్తాలే. అంటే దేనిపాటికదే. మరొకదాన్ని వ్యాపించలేదు. వ్యాపిస్తే అది అనువృత్తే అవుతుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యుత్థాన ()
Telugu original

వ్యుత్థాన : విశేషంగా పైకి లేవటం. దార పుత్త్ర విత్తైషణల నుంచి తొలగటం సన్న్యాసమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యూహ ()
Telugu original

వ్యూహ : పోగుచేయటమైనా కావచ్చు లేదా విడదీయటమూ కావచ్చు. వ్యూహ మంటే సంఘాతం. Collection. Assemblage. 'వ్యూహరశ్మీన్‌సమూహ' అని ఈశావాస్యం చెబుతున్నది. ఉపాసకుడు సూర్యమండలాన్ని భేదించుకొని వెళ్ళేటప్పుడు ఆయన కిరణాలు అడ్డం రాకుండా ప్రక్కకు తొలగించమని చేసే ప్రార్థన.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యామిశ్ర ()
Telugu original

వ్యామిశ్ర : Admixture. కలగాపులగం. Confusion. 'వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే' అని వాపోతాడు అర్జునుడు. నీవు నాకు చెబుతూ ఉన్న మాట ఏ మాత్రమూ బోధపడటం లేదు. అంతేగాక మనస్సుకు వ్యాకులత్వం కలిగిస్తున్నది అని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యాసంగ ()
Telugu original

వ్యాసంగ : Deviation. Digress. ప్రస్తుతాంశం మీద నిలవక దానికి దూరమై పోవటం. 'ప్రకృత వ్యాసంగో మాభూ దితి విరమ్యతే' అంటారు అక్కడక్కడ భాష్య కారులు. ఒక విషయం చర్చించేటప్పుడు మరొక అంశం చెప్పవలసి ఉన్నా అక్కడ సందర్భం కాదు కనుక దానిని చెప్పకుండా వాయిదా వేయటం అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యాస ()
Telugu original

వ్యాస : సమాసానికి వ్యతిరిక్తం. సమాసమంటే సంగ్రహించటం. క్లుప్తంగా చెప్పటం. దీనికి భిన్నంగా వ్యాసమంటే విస్తరించి చెప్పటం. వివరించటం. మొదటిది Synthesis అయితే, రెండవది Analysis అని పేర్కొనవచ్చు సూత్రవాఙ్మయమంతా సమాసం క్రిందికి వస్తే దానిమీద వచ్చే వ్యాఖ్యానాలన్నీ వ్యాసం క్రిందికి వస్తాయి. మొదటిది సంగ్రహంగా చెప్పిన విషయమైతే రెండవది దానిని వివరించి చెప్పటం గనుక సమాస వ్యాసరూపంగా శాస్త్రం నడుస్తున్నది. అప్పుడే పాఠకుడికి సుఖంగా విషయం బోధపడుతుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
వ్యాధి ()
Telugu original

వ్యాధి : విరుద్ధంగా ఉండిపోవటం. ఉండవలసిన చోట లేకపోవటం అని అర్థం. ill placement. అస్వస్థత. దీనికి వ్యతిరేకి సమాధి. Well placement. ఉండవలసిన చోట ఉండటం. స్వస్థత. మనస్సు సామాన్యరూపమైన ఆత్మలో నిలకడ చెందితే సమాధి. అనాత్మలో చేరిపోతే వ్యాధి.

Vedānta Paribhāṣā Vivaraṇa
విషయ/విషయి ()
Telugu original

విషయ/విషయి : Object and Subject. జ్ఞానానికి గోచరించేది విషయం. జ్ఞానమే అయితే అది విషయి. విషయి అంటే నేననే భావం. ఆత్మచైతన్యరూపమైనది అది. పోతే దానికి గోచరించే సమస్తమూ విషయి కాదు. అది విషయం. ఆత్మా నాత్మలని ఈ రెండింటికీ మారుపేరు. ఒకటి గమనించేది, మరొకటి గమనించబడేది. ప్రమాత ప్రమేయం. Knower and Known అన్నా ఇవే. జ్ఞాతా జ్ఞేయం అని కూడా వీటికే నామాంతరం. ప్రపంచమంతా ఈ రెండు విధాలుగానే విభక్తమై ఉన్నది. ఇందులో రెండూ వాస్తవమే నంటారు మతాచార్యులందరూ. ఒక అద్వైతి మాత్రమే రెండూ లేవు, రెండవదైన విషయం కేవలం విషయి రూపమే. అదే మరో రూపంలో భాసిస్తున్నదని సిద్ధాంతం చేస్తారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
శబ్ద ()
Telugu original

శబ్ద : ధ్వని Sound. పదం Word. శాస్త్రంకూడా శబ్దమే. Verbal evidence వేదమని అర్థం. ప్రమాణాలలో ఇది ఒక ప్రమాణం. అపౌరుషేయం కనుక ప్రత్యక్షానుమానాల కంటే ప్రబలమైనదంటారు. శబ్దార్థాలే నామరూపాలు. చెప్పేది శబ్దం. చెప్పబడేది అర్థం. Expression. అది మానసికమైన వృత్తి కావచ్చు. వాగ్వ్యాపారమూ కావచ్చు. ప్రపంచమంతా శబ్దమే. అది చెప్పే అర్థం పరమాత్మే ! ఇది పరావాక్కయితే The Supreme word అది పరమార్థం. The supreme meaning.

Vedānta Paribhāṣā Vivaraṇa
శమ ()
Telugu original

శమ : ఉపశమించటం. తగ్గిపోవటం. స్తిమితం. అంతరింద్రియ నిగ్రహం Control of mind శమాది షట్కంలో మొదటిది.

Vedānta Paribhāṣā Vivaraṇa
శబల ()
Telugu original

శబల : రంగురంగుల. సగుణంగా మారిన పరమాత్మ. ఈశ్వరుడని అర్థం. శబల బ్రహ్మమని పేర్కొంటారు దీన్ని. కార్యబ్రహ్మమని కూడా దీనికే మరొకపేరు. కారణ రూపమైతే అది బ్రహ్మం లేదా పరమాత్మ. కార్యరూపమైతే అదే శబలం, కార్యం లేదా సగుణం. అదే ఈశ్వరుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
శరీర ()
Telugu original

శరీర : దేహం శీర్యతే ఇతి శరీరం. శీర్ణమై పోయేది గనుక దీనికీ పేరు ఏర్పడింది. ఏది సడలి జీర్ణమై పోతుందో అది. ఆవరించేది. కప్పివేసేది అని కూడా అర్థమే. Cover, Sheath. చైతన్యాన్ని కప్పే ఉపాధులన్నీ శరీరాలే. Medium. అవిద్యా కామకర్మలు మూడూ మూడు శరీరాల కిందికే వస్తాయి. అవిద్య కామం నిరాకారమైనా అవి మన ఆత్మను కప్పివేస్తున్నాయి కనుక ఒకటి కారణ శరీరం, మరొకటి సూక్ష్మశరీరం అని పిలవబడుతున్నాయి. కర్మ స్థూలమైన శరీరంగా, సాకారంగా కనిపిస్తూ ఉన్నది. అన్నీ చేస్తూ ఉన్న పని ఒక్కటే. అది మన స్వరూపాన్ని సంపూర్ణంగా మనకు చూపక మరుగుపుచ్చటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
శరణ ()
Telugu original

శరణ : Refuge. Shelter. ఇల్లని, ఆశ్రయమని అర్థం. అంతేగాక ఒక ప్రయోజనం కోసం ఒకరికొకరు అధీనమై పోవటం. అన్నింటికన్నా అతీతమైనది ఈశ్వరతత్వం కనుక దానికి ప్రతి ఒక్క జీవుడూ అధీనమైతే శాశ్వతమైన మోక్షప్రయోజనాన్నే పొందగలడు. 'మామేకం శరణం వ్రజ' అని భగవద్గీతే చాటుతున్నది. దీనికే ప్రపత్తి అని నామాంతరం.

Vedānta Paribhāṣā Vivaraṇa
శ్రద్ధా ()
Telugu original

శ్రద్ధా : విశ్వాసం. ఒక దానిమీద అచంచలమైన దృష్టి. నమ్మకం. Faith. సాధన మార్గంలో ఇది చాలా ప్రధానమైనది. విషయం తెలిసిన తరువాత ఏర్పడే లక్షణం కాదు. విషయ జ్ఞానం కోసం ముందుగానే ఉండవలసిన లక్షణమని మన పెద్దలమాట. 'శ్రద్ధావాన్‌లభతే జ్ఞానం' అని గీతావచనం. అతిసూక్ష్మమైన రహస్యాన్ని శ్రద్ధ ఉంటేగాని గ్రహించలేము. కాబట్టి గ్రహించిన తరువాత శ్రద్ధ ఏర్పడటం కాదు. శ్రద్ధ ఉంటే మనస్సు విషయం మీద ఏకాగ్రత కలిగి ఉంటుంది. దానివల్ల చెదిరిపోక ఒకే విషయాన్ని గుర్తించే సామర్థ్యం ఏర్పడుతుంది. అప్పుడే విషయజ్ఞానం మనకు లభిస్తుంది. ఇదీ క్రమం.

Vedānta Paribhāṣā Vivaraṇa
శాంతి ()
Telugu original

శాంతి : శమమనే అర్థం. శాంతి మూడు విధాలు. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధి దైవికాలు. మూడు తాపాలకు మూడు శాంతులు. అంటే ఉపశమించే మార్గాలు. Sedatives.

Vedānta Paribhāṣā Vivaraṇa
శాండిల్య ()
Telugu original

శాండిల్య : ఒక మహర్షి. మత ప్రవర్తకుడు. పాంచరాత్రమనే వైష్ణవ సిద్ధాంతాన్ని లోకానికి బోధించినవాడు. నాలుగువేదాలు చదివికూడా తృప్తిలేక, శాంతిలేక అయిదు రాత్రులలో భగవదారాధన చేసి సాధించిన విద్య కనుక దీనికి పాంచరాత్రమనిపేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
శాసన / శాస్త్ర ()
Telugu original

శాసన/శాస్త్ర : శాసించి చెప్పటం శాసనమైతే అలా శాసించి బోధించే గ్రంథం శాస్త్రం Scripture. శబ్దప్రమాణమైన వేదమని అర్థం. సహేతుకంగా నిరూపించే గ్రంథమే శాస్త్రం. హేతు దృష్టాంతాలు రెండింటి ద్వారా విషయాన్ని బోధిస్తుంది ఏ శాస్త్రమైనా. ఇందులో హేతువు అనుమాన ప్రమాణం. దృష్టాంతం ప్రత్యక్ష ప్రమాణం. మొదటిది పండితులకు, రెండవది పామరులకు ఎక్కువ ఆకర్షకమైనవి. కనుక పండిత పామరుల నిద్దరినీ సన్మార్గంలో పెట్టడానికి శాస్త్రమే ఎప్పటికైనా తోడ్పడుతుంది. ప్రత్యక్షాదులకు అతీతమైన సత్యాన్ని బయటపెట్టడానికే వచ్చింది శాస్త్రం. ఇది భౌతికం కాదు. భౌతికమైన శాస్త్రాలు పురుషబుద్ధి జన్యాలు. బుద్ధికి పరిపూర్ణత లేదు. గనుక ఈ శాస్త్రాలన్నీ పరిపూర్ణమైన సత్యాన్ని మనకు చెప్పలేవు. పోతే మనస్సు కతీతమైన సమాధి దశలో కూచుని మహర్షులు దర్శించిన సత్యాలే గ్రంథస్థమైనవి కాబట్టి వేదమనే శాస్త్రమే అపౌరుషేయం. అది పరిపూర్ణం కనుక జీవిత సమస్యను పరిష్కరించటానికి అదే సమర్థం కనుక సాధకుడు అచంచలమైన విశ్వాసంతో వేదశాస్త్ర వాఙ్మయం చేసిన బోధనాలకించి అటు ధర్మమో, ఇటు బ్రహ్మమో దేనినో ఒకదానిని సాధించటంవల్లనే జీవితగమ్యాన్ని అందుకోగలడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
శాస్తా / శిష్య ()
Telugu original

శాస్తా/శిష్య : శాసించి చెప్పే గురువు ఆచార్యుడు. శాస్త అయితే అతనివల్ల శిక్షణ పొందే వ్యక్తి శిష్యుడు. Desciple. శాసింపదగినవాడని అర్థం. శాసించటమన్నా, శిక్షణ అన్నా దండించటం కాదు. సత్యాన్ని నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్టు బోధించటమని అర్థం. Instruction.

Vedānta Paribhāṣā Vivaraṇa
శిక్షా / శిక్షణ ()
Telugu original

శిక్షా/శిక్షణ : శిక్షించటమంటే దండించడమైనా కావచ్చు Punishment ఇదమిత్థమని ఒక సత్యాన్ని ఉపదేశించటమైనా కావచ్చు. శిక్షణ ఇవ్వటమంటే వినయ సంపత్తిని కలిగించటమని అర్థం. Training.

Vedānta Paribhāṣā Vivaraṇa
శిష్ట ()
Telugu original

శిష్ట : చక్కగా శిక్షింపబడిన, శిక్షణ పొందిన వ్యక్తి. Well Trained. వినీతుడని కూడా పేరు. సంస్కారవంతుడైన మానవుడు. శ్రుతి, స్మృతి వీటి రెండింటి తర్వాత శిష్టాచారమే ధర్మజ్ఞానానికి ప్రమాణమని ధర్మశాస్త్రజ్ఞులమాట. 'మహాజనో యేన గతః స పంథాః' అని ఒకనానుడి ఉన్నది. పెద్దలందరూ ఏ మార్గంలో పయనించారో ఆ మార్గం పట్టుకునే మనమూ సాగిపోవటం శ్రేయోదాయకం. పెద్దలు ప్రమాణమెలా అయ్యారు అని అడిగితే శ్రుతి, స్మృతి జ్ఞానం వారికి సంపూర్ణంగా ఉండటమే దానికి కారణం. అలాంటి వారెప్పుడూ మార్గం తప్పరు. ఆ నమ్మకం మీదనే మనమూ ఆ మార్గంలో పయనించి సత్ఫలితం పొందగలం.

Vedānta Paribhāṣā Vivaraṇa
శివ / శివా ()
Telugu original

శివ/శివా : మంచి. మేలు. శ్రేయస్సు. ఎప్పటికీ నిలిచిఉన్న తత్వం కూడా శివమే. చతుర్థం శివమద్వైతమని మాండూక్యోపనిషత్తు తురీయావస్థను వర్ణించింది. శివమంటే పరమాత్మ అనే భావం. శివం కానిదంతా అశివం. శివం చిద్రూపమైన పరమాత్మ అయితే శివా సద్రూపమైన ఆయన మాయాశక్తి. సచ్చిత్తులు రెండూ ఒకే ఒక తత్త్వం గనుక తేడా లేదని వేదాంతుల సిద్ధాంతం.

Vedānta Paribhāṣā Vivaraṇa
శీల ()
Telugu original

శీల : స్వభావం. Characterstic feature. Nature. క్రియాశీలం ప్రపంచం. ప్రపంచమంటే అనుక్షణం చలించే స్వభావం కలదని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
శ్రీ ()
Telugu original

శ్రీ : ధనం. లక్ష్మి. ఐశ్వర్యం. పరమాత్మ నాశ్రయంచి ఉన్న ఆయన మాయాశక్తి. 'శ్రయతీతి శ్రీః' ఆశ్రయించేదని అక్షరార్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
శుక్తికా ()
Telugu original

శుక్తికా : ముత్యపుచిప్ప. Oyster. శుక్తికే దూరానికి సూర్యరశ్మిలో వెండి రేకులాగా తళతళ మెరుస్తుంటుంది. వాస్తవం కాదా రజతం. ఆభాస. శుక్తికా రజత న్యాయమంటే ఇదే.

Vedānta Paribhāṣā Vivaraṇa
శుక్ల/శుచి/శుభ్ర ()
Telugu original

శుక్ల/శుచి/శుభ్ర : తెల్లని స్వచ్ఛమైన. వెలుగుబాట. ఉపాసనాకాండలో జ్యోతిర్మార్గం. దేవయానం. దేవలోకాలు చేర్చేది. శుచిత్వమనేది అంతశ్శుద్ధి, బాహ్య శుద్ధి రెండూ కూడా. ఇవి రెండూ శుద్ధి చెందితే దైవసంపదలో అది ఒక సంపద.

Vedānta Paribhāṣā Vivaraṇa
శుద్ధ ()
Telugu original

శుద్ధ : శుచి, శుద్ధ అంటే నిర్మలం. నిష్కల్మషం. చిత్తానికి పట్టిన వాసనలు క్షాళితమై పోవటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
శుభవాసనా ()
Telugu original

శుభవాసనా : మంచి దైవసంపద. మంచి భావాలు వాటి తాలూకు సంస్కారాలు మనస్సులో నిలిచిపోవటం. ఇది అశుభ వాసనకు జవాబు చెప్పి సాధన మార్గానికి ఎంతైనా తోడ్పడుతుంది. జ్ఞానోదయమైతే ఈ శుభవాసనలు కూడా ఒక ప్రతిబంధకమే. అవి కూడా ఈశ్వర వాసనగా మారిపోవలసి ఉంటుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
శుశ్రూషా ()
Telugu original

శుశ్రూషా : శ్రోతుమిచ్ఛా. Desire to hear. వినాలనే కోరిక. వేదాంత శ్రవణాభిలాష. దీనికోసం గురుకులంలో చేసే పరిచర్య కూడా శుశ్రూషే. Service to the teacher. కనీసం శుశ్రూష అయినా లేకపోతే జ్ఞానం అలవడదు. ఇది శ్రవణానికి దారితీస్తే, అది మననానికి తర్వాత ధ్యానానికి తోడ్పడగలవు.

Vedānta Paribhāṣā Vivaraṇa
శూద్ర ()
Telugu original

శూద్ర : చాతుర్వర్ణ్యంలో నాలుగవ వర్ణం. సంస్కారంలేని వ్యక్తి అని అర్థం. ఆ మాటకు వస్తే ప్రతి ఒక్క మానవుడూ 'జన్మనా జాయతే శూద్రః' అని పేర్కొన్నారు. జన్మతః ప్రతివాడూ శూద్రుడే. తరువాత విద్యావినయ సంపన్నుడైతేనే సంస్కార వంతుడవుతున్నాడు. దానికి ద్విజత్వమని పేరు. ద్విజ అనగా రెండుమారులు జన్మించిన వాడని అర్థం. మొదటి జన్మ భౌతికమైతే, రెండవది వైజ్ఞానికం. జానశ్రుతి అనే క్షత్రియుడు బ్రహ్మవిద్య నేర్చుకోవటానికి రైక్వుడనే యోగీశ్వరుడి దగ్గరికి వచ్చాడట. అప్పుడతడు శూద్ర అని అతణ్ణి సంబోధించాడు. క్షత్రియుడు శూద్రుడెలా అవుతాడు అని ప్రశ్న వచ్చింది. దానికి భాష్యం వ్రాస్తూ భగవత్పాదులిలా అన్నారు. 'శుచా ద్రవతీ ఇతి శూద్రః' శుక్‌అంటే శోకం. సంసార తాపత్రయం. దాన్ని భరించలేక ద్రవతి పరుగెత్తి వచ్చాడట ఆ జానశ్రుతి. కనుక ఇక్కడ శూద్ర అనేమాట వర్ణాన్ని చెప్పటంలేదు. మానవుడి జిజ్ఞాసను సూచిస్తున్నది. జిజ్ఞాస ఉన్నంతవరకూ మనలో ఉండేది శూద్రత్వమే. దానికి తగిన చికిత్స ఆధ్యాత్మికంగా చేసుకొన్నప్పుడే మనమందరమూ బ్రాహ్మణుల మవుతాము. అంటే బ్రహ్మవంశానికి చెందుతామని తాత్పర్యం. 'సర్వస్యాపి బ్రహ్మవంశ్యత్వాత్‌' అని భగవత్పాదులు చెప్పిన మాట అప్పుడే అక్షరాలా సార్థకమవుతుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
శుంగ ()
Telugu original

శుంగ : శుంగమంటే అంకురమని అర్థం. అంకురం బీజం నుంచి ఏర్పడుతుంది. బీజం దానికి కారణం. అంకురం దానికి కార్యం. దీన్నిబట్టి శుంగమంటే లాక్షణికంగా కార్యమని అర్థం వచ్చింది. Effect తేజస్సుకు జలమూ, జలానికి పృథివీ శుంగం. మరలా వీనికి వ్యతిరిక్తంగా పృథివిని బట్టి జలం, జలాన్ని బట్టి తేజస్సునూ, తేజస్సును బట్టి దానికి మూలమైన సత్పదార్థాన్ని వెతుకుతూ పోవాలట సాధకుడు. అప్పుడే ఈశ్వరసాయుజ్యం. అందుకే ఉపనిషత్తులో 'అన్నేన శుంగేన ఆపోమూల మన్విచ్ఛ అద్భిః సోమ్య శుంగేన తేజోమూల మన్విచ్ఛ. తేజసా సోమ్య శుంగేన సన్మూల మన్విచ్ఛ' అని స్పష్టంగా చాటిచెప్పారు. అంటే పృథివీ, జలమూ, తేజస్సూ అంచెలవారీగా దాటిపోయి చివరకు సత్పదార్థాన్నే అందుకొని ముక్తుడై పోవాలి మానవుడు. దీనికి ఆధారం ఈ భూతాలే కాబట్టి ఇవి ఒకదాని కొకటి శుంగం. అంటే కార్యం. కార్యాన్నిబట్టే కారణాన్ని అన్వేషించటం మోక్షానికి సాధనం.

Vedānta Paribhāṣā Vivaraṇa
శేముషీ ()
Telugu original

శేముషీ : పాండిత్యమని అర్థం. బ్రహ్మాండమైన మేధాశక్తి. అది ప్రాపంచికం కారాదు. దాన్ని పారమార్థికంగా త్రిప్పగలిగితేనే శాశ్వత ఫలదాయకం.

Vedānta Paribhāṣā Vivaraṇa
శేవధి ()
Telugu original

శేవధి : నిధి లేక నిక్షేపమని అర్థం. Treasure. ఇది భౌతికమైనా కావచ్చు. ఆధ్యాత్మికమైనా కావచ్చు. భౌతికమైతే ధనం, ఆధ్యాత్మికమైతే జ్ఞాన ధనం. అది పరమాత్మ స్వరూపమే. అదే ఎప్పటికైనా మనం ఆర్జించవలసిన నిధి.

Vedānta Paribhāṣā Vivaraṇa
శేష/శిష్ట ()
Telugu original

శేష/శిష్ట : మిగులు Residue. నామరూపాలన్నీ నేతినేతి అని కొట్టుబడిపోతే చివరకు మిగిలేది శిష్టం లేదా అవశిష్టం. అదే బ్రహ్మతత్త్వం.

Vedānta Paribhāṣā Vivaraṇa
శోధన ()
Telugu original

శోధన : పనికిరాని దాన్ని త్రోసిపుచ్చటం. శుద్ధిచేయటం. తత్వమసి అనే వాక్యంలో తత్పదార్థ త్వంపదార్థాలకున్న మాలిన్యం పరోక్షత్వ మొకదానికి పరిచ్ఛిన్నత్వ మొకదానికి. అవి రెండూ త్రోసిపుచ్చితే మిగిలిన చైతన్యం రెంటికీ ఒక్కటే. చైతన్యరూపంగా వాటికి అఖండత్వం ఏర్పడితే దాన్ని వాక్యార్థం అంటారు. Synthesis. ఇలాంటి వాక్యార్థాన్ని అందుకోవాలంటే పదార్థాలు రెండూ శుద్ధి అవ్వాలి. అంటే మాలిన్యాన్ని కడిగివేయాలి. నామరూపాలే మాలిన్యం. వాటిని కడిగివేయడమే పదార్థ శోధనం.

Vedānta Paribhāṣā Vivaraṇa
శోక ()
Telugu original

శోక : వేడెక్కడమని శబ్దార్థం. లాక్షణికంగా దుఃఖం. విషాదం. షడూర్ములలో మనస్సుకున్న రెండు దోషాలూ ఒకటి మోహం, అజ్ఞానం. రెండు శోకం. దానివల్ల కలిగే తాపం. శోకమోహాలని ఇవి రెండూ కారణశరీర లక్షణాలు.

Vedānta Paribhāṣā Vivaraṇa
శ్రద్ధా ()
Telugu original

శ్రద్ధా : తత్త్వజిజ్ఞాసువులకు కావలసిన అతిముఖ్యమైన గుణం. 'శ్రద్ధా మాతేవ పాతి' అని పతంజలి మాట. ఒక తల్లిలాగా శ్రద్ధ సాధకుని సిద్ధి పొందేవరకూ కాపాడుతూ పోతుందట. అందుకే శ్రద్ధావాన్‌లభతే జ్ఞానమన్నారు. శ్రద్ధ అంటే విశ్వాసం. దానివల్ల కలిగే ఏకాగ్రత. ఒక విషయాన్ని ఎలాగైనా సరే అందుకోవాలనే పట్టుదలకే Perseverence శ్రద్ధ అని పేరు. Utmost faith. శమాది షట్కంలో ఐదవదిది. దీని అనంతరం ఆరవది సమాధి.

Vedānta Paribhāṣā Vivaraṇa
శ్రవణ / శ్రుతి ()
Telugu original

శ్రవణ/శ్రుతి : వినటం. వేదాంత శాస్త్ర బోధ ఆలకించటం. దీనివల్ల అజ్ఞానమనే వ్యాధి తొలగిపోతుంది. ఫలితంగా ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. శ్రుతి అంటే వేదమని కూడా అర్థమే. ఇది అన్నిటికన్నా ప్రబలమైన ప్రమాణం. వేదాంత శ్రవణం చేసేవారికి మొదటి ప్రస్థానం శ్రుతి ప్రస్థానం. రెండవది సూత్ర ప్రస్థానం. మూడవది స్మృతి ప్రస్థానం. మొదటిదానివల్ల అజ్ఞానం నశిస్తే, రెండవదాని వల్ల సంశయ నివృత్తి జరిగితే మూడవదాని మూలంగా విపర్యయమనే దోషం నశించి సద్యోముక్తి లభిస్తుందని అద్వైతుల హామీ.

Vedānta Paribhāṣā Vivaraṇa
శ్రౌత ()
Telugu original

శ్రౌత : శ్రుతికి సంబంధించినదని అర్థం. ముఖ్యంగా కర్మకాండ. దీనికి తోడు స్మార్త అని ఒక మాట ఉన్నది. వేదచోదితమైన యజ్ఞ యాగాదులు శ్రౌతమైతే స్మృతికారులు బోధించిన షోడశకర్మలు స్మార్తం క్రిందికి వస్తాయి.

Vedānta Paribhāṣā Vivaraṇa
శ్రోత్రియ ()
Telugu original

శ్రోత్రియ : శ్రుతిని చక్కగా అభ్యసించినవాడు. The vedic Scholar. శ్రుతి జ్ఞానమున్నవాడని అర్థం. వైదిక ఛాందస శ్రోత్రియ ఈ మూడూ పర్యాయపదాలే. పోతే శ్రోత్రియ అనే మాట కేవలం వేదపండితుడనే కాక, వేదాంత పండితుడని కూడా చెబుతుంది. శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం అన్నప్పుడు వేదాంత జ్ఞానం బాగా పుష్కలంగా ఉండి, బ్రహ్మతత్త్వంలో నిష్ఠ కలిగిన వాడెవడో అలాంటి సద్గురువును సేవించమని చాటుతున్నది. కనుక ఈ శబ్దం వేదవేదాంత జ్ఞానమున్న ఇద్దరికీ వాచకమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
శ్రేయస్‌ ()
Telugu original

శ్రేయస్‌: శ్రేయస్సుకానిది ప్రియమైనది ప్రేయస్సు. హితమైనది శ్రేయస్సు. ఒకటి ధర్మపురుషార్థం. మరొకటి బ్రహ్మ పురుషార్థం. జీవిత పరమార్థమైన మోక్షమే శ్రేయస్సు. నిశ్శ్రేయసమని కూడా దీన్ని పేర్కొంటారు. జ్ఞానంవల్లనే సిద్ధిస్తుందిది. అలాకాక అజ్ఞానమింకా వదలక అర్థకామాలే లేదా అభ్యుదయదాయకమైన ధర్మమే గమ్యమని భావిస్తే అదికూడా ప్రేయస్సు క్రిందికే Prosperity వస్తుంది. మోక్షం కాదు Salvation.

Vedānta Paribhāṣā Vivaraṇa
శ్లోక ()
Telugu original

శ్లోక : పద్యం. Verse. ఆ రూపంలో ఉన్న మంత్రవర్ణం. సంహితమని కూడా పేర్కొంటారు దీన్ని. ఋగ్వేదమంతా చాలావరకు శ్లోకరూపంగా నడుస్తున్నది. మంత్రాలన్నీ పద్యభాగాలే. గద్యం మనకు యజుర్వేదంలోనే ఎక్కువగా కనిపిస్తుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
శ్లేష/శ్లిష్ట ()
Telugu original

శ్లేష/శ్లిష్ట : అతకటం. సరిపోవటం. ఒకదానికొకటి Tally సంవదించటం. అలా సరిపడకపోతే అది శ్లిష్టంకాదు. అశ్లిష్టం అని పేర్కొంటారు శాస్త్రంలో. సందర్భానికి అతికినట్లుండాలి ఏది చెప్పినా. అప్పుడే అది సుశ్లిష్టం.

Vedānta Paribhāṣā Vivaraṇa
శక్తి / శక్య ()
Telugu original

శక్తి/శక్య : పరమాత్మ తాలూకు మాయాశక్తి. మాయ. ప్రకృతి. శక్తి. ఐశ్వర్యం. అవ్యక్తం. అవ్యాకృతం. అక్షరం అని చాలా పేర్లున్నాయి దీనికి. ఇది సాంఖ్యుల ప్రధానం లాంటిది కాదు. ప్రధానం స్వతంత్రమైతే ఇది పరతంత్రం. అంటే పరమాత్మ నాశ్రయించి ఉండేది. పరాస్యశక్తిః. ఆత్మచిద్రూపమైతే ఇది సద్రూపం. దీనిద్వారానే ఆయన సృష్టి స్థితి లయాదులను చేయగలుగుతాడు. జ్ఞానమే పరమాత్మ. ఇచ్ఛాక్రియా రూపంగా ప్రసరించే ఆయన ప్రసరణే శక్తి. పరా పశ్యంతి మధ్యమా వైఖరీ అని నాలుగు భూమికలలో ప్రసరిస్తుందది. ప్రసరించకపోతే పరారూపంగా అది నిర్గుణం. నిశ్చలం. ప్రసరిస్తే సగుణం. చలనాత్మకం. శక్తి, శక్తిమంతులు రెండూ వేరుగావు. ఏకమే మరలా. కారణం రెండూ నిరాకారమే గనుక.

Vedānta Paribhāṣā Vivaraṇa
షడ్వర్గ ()
Telugu original

షడ్వర్గ : అరిషడ్వర్గమని కూడా పేర్కొంటారు దీన్ని. ఆరు దోషాలతో కూడిన వర్గమిది. అవి మనకు గర్భశత్రువులు. ఒకటి కామం, రెండు క్రోధం, మూడు లోభం, నాలుగు మదం, అయిదు మోహం, ఆరు మాత్సర్యం. మొదటి మూడే అసలు ఉన్న దోషాలు. తర్వాత చెప్పిన మూడూ, ఈ మూడే ముదురుపాకాన పడితే కనిపించే లక్షణాలు. ఇందులో దేవతలకు కామం, మానవులకు లోభం, దానవులకు క్రోధం నైజగుణాలని వర్ణించింది శాస్త్రం. ఎక్కడో లేరు దేవదానవులు. కామమూ, క్రోధమూ కూడా మానవులలో చోటు చేసుకున్న దోషాలు. కనుక ఆ రెండు జాతులమీద నెపంపెట్టి పూర్వమెప్పుడో పితామహుడు చేసిన మహోపదేశమిది.

Vedānta Paribhāṣā Vivaraṇa
షడధ్వ ()
Telugu original

షడధ్వ : ఆరు మార్గాలని అర్థం. ఇది తంత్ర గ్రంథాలలో ఇలా వర్ణించారు. పదం, మంత్రం, వర్ణం, భువనం, తత్వం, కళ. ఇవి ఆరూ షడథ్వాలట. ఇందులో మొదటి మూడు విమర్శాత్మకమైతే, మిగతా మూడు ప్రకాశాత్మకం. వీటిద్వారా వాటిని గ్రహించాలని తాత్పర్యం. అద్వైతంలో షడధ్వాలు షడూర్ములే. వాటిని క్రమంగా అతిక్రమించి పోగలిగితే ఈశ్వర సాయుజ్యం అప్రయత్నంగా సిద్ధిస్తుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
షట్చక్ర ()
Telugu original

షట్చక్ర : ఆరు చక్రాలు. మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ. ఇవి ఆరూ మన శరీరంలోనే నాభిస్థానం నుంచి భ్రూమధ్యం వరకు ఆరోహణ క్రమంలో వ్యాపించి ఉన్నాయి. మొదటి అయిదూ పంచభూతాలకు సంకేతాలు. ఆరవది మాయాశక్తి స్థానం. పోతే దాన్నికూడా దాటి ఆరోహించిన వాడికి దర్శనమిచ్చే చక్రం ఏడవది సహస్రారం. అక్కడ శివశక్తి సాయుజ్యాన్ని అనుభవానికి తెచ్చుకోగలడట ఉపాసకుడు. ఇది ఉపాసనామార్గం. యోగమార్గం. అద్వైతజ్ఞానమార్గం కాదు. అద్వైతంలో ఇలాంటి ఆరోహణ లేదు. వారు చెప్పే ఆరోహణ కార్యం నుంచి కారణానికి చేసే ప్రయాణం. అదికూడా ప్రతి ఒక్క కార్యాన్నీ దాని పైకారణలో లయం చేసుకుంటూ చివరకు కార్యకారణ పరంపరనంతటినీ అకార్యమైన, మూలకారణమైన పరమాత్మ చైతన్యంలో కలుపుకోవటమే సాధనమార్గం.

Vedānta Paribhāṣā Vivaraṇa
షడూర్మి ()
Telugu original

షడూర్మి : ఊర్మి అంటే తరంగం. ఇలాంటి తరంగాలు ఆరింటిని చెప్పారు పెద్దలు. సముద్రంలో తరంగాల లాగే సంసార సాగరంలో ఇవి పైకి పొంగిన దోషాలు. ఇందులో మొదటి రెండూ జరామరణాలు. అవి స్థూల శరీర ధర్మాలు. రెండవ జత క్షుత్‌పిపాసలు. సూక్ష్మశరీర లక్షణాలు. మూడవ జంట శోకమోహాలు. కారణ శరీర గుణాలు. మొత్తంమీద శరీర మనః ప్రాణాలనే ఉపాధులకు చెందినవేగాని ఇవి తద్విలక్షణమైన ఆత్మ తత్త్వానికి సంబంధించినవి కావు.

Vedānta Paribhāṣā Vivaraṇa
షడ్దర్శన ()
Telugu original

షడ్దర్శన : ఆరు దర్శనాలని అర్థం. పూర్వం మహర్షులు అతిమానస దశలో కూచుని సమస్త సృష్టినీ గాలించి, అందులో దాగి ఉన్న రహస్యాలను తమకు తోచినట్టు దర్శించి, వాటిని మరలా గ్రంథ రూపంగా వెలువరించారు. అవి ఆరు. ఒకటి న్యాయం, రెండు వైశేషికం. మూడు సాంఖ్యం. నాలుగు యోగం. అయిదు పూర్వమీమాంస. ఆరు ఉత్తరమీమాంస. ఇందులో మొదటి రెండూ ఆరంభవాదాన్ని, మధ్యలో రెండూ పరిణామ వాదాన్ని బలపరుస్తాయి. పోతే మీమాంస శబ్ద నిత్యత్య వాదాన్ని ప్రతిపాదిస్తుంది. ఉత్తరమీమాంస అయిన వేదాంతం ఆ అన్నింటినీ కొట్టివేసి వివర్త వాదాన్ని మాత్రమే సిద్ధాంతం చేసింది.

Vedānta Paribhāṣā Vivaraṇa
షడంగ ()
Telugu original

షడంగ : నాలుగు వేదాలకూ ఆరు అంగాలు పేర్కొన్నారు పెద్దలు. శిక్షా, వ్యాకరణం, నిరుక్తం, జ్యౌతిషం, కల్పం, ఛందస్సు. ఈ ఆరింటి సహకారంతో వేదాన్ని అభ్యసించినప్పుడే దాని తాత్పర్యమేదో చక్కగా గ్రహించగలడట సాధకుడు. వేదవేదాంగాలని లోకంలో కూడా వ్యవహారం. ఋగ్వేదాదులు వేదాలైతే. వేదాంగా లంటే ఈ శిక్షాదులు. మొత్తం పది. ఈ పదింటికీ మరలా పురాణం, ధర్మశాస్త్రం, మీమాంస, న్యాయవిస్తరం అని మరి నాలుగు తోడైతే మొత్తం చతుర్దశ విద్యలవుతాయి.

Vedānta Paribhāṣā Vivaraṇa
షడ్భావ వికార ()
Telugu original

షడ్భావ వికార : లోకంలో ఏ పదార్థానికైనా ఏర్పడే మార్పులు ఆరే ఆరు. వికారమంటే మార్పనే అర్థం. 'జాయతే అస్తి వర్థతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి.' పుడుతుంది, ఉంటుంది, పెరుగుతుంది, మారుతుంది. కృశిస్తుంది. నశిస్తుంది. మొదట జన్మ, చివర మరణం, మధ్యలో నాలుగు స్థితి. ఒకవిధంగా సృష్టి స్థితి లయాలే. అందులోనే ఆరూ చేరిపోతాయి. ఈ వికారాలు లేని పదార్థమే లేదు సృష్టిలో. నిర్వికారమైన పదార్థం ఒక్కటే అది ఆత్మస్వరూపం.

Vedānta Paribhāṣā Vivaraṇa
షణ్మత ()
Telugu original

షణ్మత : ఆరు మతాలు. శైవం, వైష్ణవం, కౌమారం, శాక్తేయం, సౌరం, గాణపత్యం. వీటి ఆరింటికి షణ్మతాలని పేరు. భగవానుడిలో ఉన్న షడ్గుణాలకు ఇవి సంకేతాలు. వీటిని దేనిపాటికది వేరుగా చూడటం తప్పు. అన్నింటినీ ఏకైకమైన భగవత్తత్వానికి ముడిపెట్టి చూడమని అద్వైతుల సలహా. షడ్దర్శనాలను కూడా షణ్మతాలని పేర్కొనవచ్చు. సాంఖ్యాది దర్శనాలు ప్రతి ఒక్కదానిలో ఒక దోషముంది. అది సవరించగలిగితే అన్నీ కలిసి అద్వైత దృష్టికి తోడ్పడతాయని వేదాంతుల మాట. శంకరులవారు షణ్మత స్థాపన చేశారంటే శైవాది మతాలు, సాంఖ్యాది దర్శనాలను కూడా పరిష్కరించారని అర్థం చెప్పుకోవచ్చు.

Vedānta Paribhāṣā Vivaraṇa
షోడశకల పురుష ()
Telugu original

షోడశకల పురుష : ప్రాణం మొదలు నామం వరకు చెప్పిన పదహారింటికీ షోడశ కళలని పేరు. కళ అంటే భాగం. శకలం. విశేషం. విశేషాలన్నీ సామాన్య రూపమైన పరమాత్మ చైతన్యంలో నుంచే వచ్చాయని అధ్యారోపం చేసి మరలా వాటిని ఆ పరమాత్మ చైతన్యంలోనే అపవాదం లేదా ప్రవిలాపనం Merger చేయటమే షోడశకల పురుష విద్య. పురుష అంటే పూర్ణ స్వరూపమైన ఆత్మచైతన్యమే. కళలన్నీ అందులో నుంచి వచ్చినప్పుడు అది సకలం. అందులోనే మరలా కలిసిపోతే నిష్కలం. సకలం సంసార బంధమైతే నిష్కలం బంధ మోచనం. ప్రశ్నోపనిషత్తులోని ఆరవ ప్రశ్నకు సమాధానంగా చెప్పిన విద్య ఇది.

Vedānta Paribhāṣā Vivaraṇa
షోడశీ ()
Telugu original

షోడశీ : మంత్రశాస్త్రంలో షోడశీ అనేది అమ్మవారి నామం. నిత్యాషోడశికా అని లలితా సహస్ర నామాలలో కనిపిస్తుంది. షోడశీ అంటే పదహారవది. మొదటి పదిహేనింటికి పంచదశి అని పేరు. అది హ్రీంకారంతో కూడినది. సంసారానికే దారి తీస్తుందది. పోతే మోక్షానికి తోడ్పడేది ఈ పదహారవదైన వర్ణమే. ఏదో కాదది. శ్రీం అనే వర్ణం. షోడశీ అంటే కర్మానుష్ఠానంలో ఉపయోగించే ఒకపాత్ర. పదహారంచులుంటాయి ఆ పాత్రకు. కనుక దానికి షోడశి అని పేరు పెట్టారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
షట్క ()
Telugu original

షట్క : ఆరు అంశాల సముదాయం. శమాది షట్కమన్నప్పుడు శమ, దమ, ఉపరతి, తితిక్షా, శ్రద్ధా, సమాధానమని ఆరు అంగాలున్నాయి అందులో. అలాగే గీతలో ప్రథమ షట్కం ఆరు అధ్యాయాలు. ద్వితీయ షట్కం ఆరు. తృతీయ షట్కం మరొక ఆరు. అన్నీ కలిసి 18 అధ్యాయాలు. ఆరుగా విభజించటంలో ఆ ఆరింటిలో ఒకే ఒక విషయం వర్ణించబడుతున్నదని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంకర/సంకీర్ణ ()
Telugu original

సంకర/సంకీర్ణ : Mixture. కలయిక. తిలతండుల న్యాయంగా రెండు పదార్థాలు ఒకదానితో ఒకటి కలిసిపోవటం. సాంకర్యమన్నా ఇదే అర్థం. వర్ణ సంకరమంటే చాతుర్వర్ణ్యం తేడా లేకుండా ఏకం కావటం. సంకరం చెందినది సంకీర్ణం. Mixed.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంకల్ప ()
Telugu original

సంకల్ప : వికల్పం కానిది. Combination. Synthesis. వికల్పమంటే వేర్వేరుగా మారటం. Division or analysis. అప్పటికి సంకల్పమంటే నిర్వికల్పం అని అర్థం. మనసులో కలిగే ఆలోచన కూడా కావచ్చు. Idia. 'సంకల్ప వికల్పాత్మకం మనః. ఏకం కావటం, అనేకం కావటం మనసుకున్న లక్షణం. ఒకే ఒక భావముంటే అది సంకల్పం. చెదరిపోయి అనేక భావాలు ఏర్పడితే అది వికల్పం. కర్మానుష్ఠానంలో సంకల్పం చెప్పుకోమని ఒక మాట ఉంది. అంటే నీవే ప్రయోజనం కోసం ఈ కర్మ ఆచరిస్తున్నావో దాన్ని గుర్తు చేసుకోమని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంకీర్తన ()
Telugu original

సంకీర్తన : చెప్పటం. బోధించటం. ప్రచారం చేయటం. Propagation. శ్రవణ, మనన, నిది, ధ్యాసనల వరకూ నాకు సంబంధించినదైతే, నా అనుభవాన్నే పదిమంది జిజ్ఞాసువులకు పంచిపెడితే అది సంకీర్తనం. మొదటిది విచారమని, రెండవది ప్రచారమని Vision and mission పేర్కొంటారు పెద్దలు. నామసంకీర్తనమని ఒకమాట ఉంది. భక్తి మార్గంలో తన ఇష్టదైవతానికి చెందిన నామాన్ని అనుక్షణమూ ఉచ్చరిస్తూ పోవటమని అక్కడ భావం. ఏదైనా ఏకాగ్రతతో భావించటంగానీ, పలకటంగానీ, ప్రచారం చేయటంగానీ సంకీర్తనమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంకేత ()
Telugu original

సంకేత : చిహ్నం. గుర్తు, Sign, Symbal. ఒక సత్యాన్ని సూచించేది. నామ రూపాత్మకమైన ప్రపంచమంతా ఇలాంటి ఒక సంకేతమే. ఇది నామరూప రహితమైన తత్త్వాన్ని బయట పెడుతున్నది. సంకేతమెప్పుడూ తనపాటికి తాను అసత్యమే. కానీ అది సూచించేది మాత్రం సత్యం. సత్యాన్ని సూచించే లక్షణముంది కాబట్టి తద్రూపేణా అది కూడా సత్యమే అని భావించవచ్చు. సత్యాన్ని చేరేంతవరకూ దీన్ని నిమిత్తంగా చేసుకుని చేరిన తరువాత అందులోనే దీన్నికూడా కలుపుకొని చూడాలంటారు అద్వైత వేదాంతులు. అంటే నామరూపాలు పరమాత్మను చేరేవరకూ మన కాలంబనాలు. వీటిద్వారానే దాన్ని దర్శించాలి. ఎంతెంత దాన్ని దర్శిస్తూ పోతే అంతంత ఇవి తమ అస్తిత్వాన్ని కోల్పోయి, చివరకు పరమాత్మ రూపంగానే మనకు సాక్షాత్కరిస్తాయి. అప్పుడు ఈ సంకేతం కూడా అసత్యం కాదు. సత్యమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంఖ్యాన/సాంఖ్య ()
Telugu original

సంఖ్యాన/సాంఖ్య : లెక్కించటం. లెక్క. ఇన్ని అని లెక్కపెట్టి చెప్పటం. Enumeration. ఇరవై నాలుగు తత్త్వాలని పరిగణించి చెప్పింది గనుక కపిలుడి దర్శనానికి సాంఖ్యమని పేరు వచ్చింది. సంఖ్యానమంటే ధ్యానించటమని కూడా అర్థమే. Meditation. సాంఖ్యమంటే జ్ఞానమని కూడా ఒక అర్థముంది. భగవద్గీతలో సాంఖ్య యోగమనే మాటకు జ్ఞానయోగమనే అర్థం. యోగమని, సాంఖ్యమని రెండు మాటలు వస్తాయి గీతలో. యోగమంటే సమాధికాదు, సాంఖ్యమంటే కపిలుని సాంఖ్యమూ కాదు. యోగానికి అర్థం కర్మ. సాంఖ్యానికి అర్థం ఆత్మజ్ఞానం అని వాటి తత్త్వాన్ని బయటపెట్టారు భాష్యకారులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంక్రమణ/సంక్రాంతి ()
Telugu original

సంక్రమణ/సంక్రాంతి : సంక్రమించటం. ప్రవేశించటం. అన్నమయాది కోశాలలో మొదట ప్రవేశించింది ఆత్మచైతన్యం. అదే మరలా ఒక్కొక్క కోశాన్ని దాటి దాని పైకోశంలో ప్రవేశిస్తూ పోవటానికి సంక్రమణమని పేరు. ఇది వాస్తవం కాదు. భావన. అసలు రాలేదు, పోలేదు ఆత్మ. అది అచ్యుతం. కూటస్థం. ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో అక్కడ అలాగే ఉంది. అది వచ్చి దీనిలో బందీ అయినట్టు మన భ్రమ. ఆ భ్రమే వాస్తవమని చూచాము గనుక సంసార బంధమేర్పడింది. మరలా ఇది భ్రమేకాని ప్రమ కాదని గుర్తిస్తూ పోవటమే అన్నమయం నుంచి ఆనందమయం వరకూ ఆత్మచేయాలని చెప్పే సంక్రమణం. అనాత్మ అంతా ఆత్మేనని గుర్తిస్తూ పోవటమే సంక్రమణ శబ్దార్థమని చాటిచెప్పారు భాష్యకారులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంగ్రహ/సంక్షేప ()
Telugu original

సంగ్రహ/సంక్షేప : రెండింటికీ ఒకటే అర్థం. ఒక చోటికి పోగుచేయటం. క్లుప్తంగా ఒక విషయాన్ని బోధించటం. Brevity. 'సంక్షేప విస్తరాభ్యాం' అని భగవత్పాదులు చెబుతుంటారు. ఆత్మవిషయం నిరూపించేటప్పుడు ఎంత విస్తరించి చెప్పాలో మరలా మనకు విసుగు జన్మించకుండా అంత సంగ్రహించి చెప్పటం మంచిదంటారు ఆయన. సూత్రం సంక్షేపమైతే భాష్యం విస్తరం అని కూడా అన్నారు. సంక్షేపానికి వ్యతిరిక్తమైన పదం విక్షేపం. సంగ్రహానికి వ్యతిరిక్తమైనది విగ్రహం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంగతి ()
Telugu original

సంగతి : పూర్వోత్తరాంశాల కొకదానితో ఒక దానికి పొందిక. సాంగత్యం, సమన్వయ, Coherence, Connection మని అర్థం. అయిదు విధములైన వ్యాఖ్యానంలో సంగతి అనేది ఒకటి. అధికరణంలో కూడా ఇది ఒక అంశం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంగాన ()
Telugu original

సంగాన : Concordance. పరస్పర మైకమత్యం. తేడా లేకుండా సరిపడటం. కుదరటం. కుదురుబాటు. పొందిక, Agreement. దీనికి వ్యతిరిక్తమైనది విగానం. Disagreement.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంచయ/సంచిత ()
Telugu original

సంచయ/సంచిత : సంచయమంటే పోగు చేసుకోవటం. Gathering. అలా పోగైన కర్మకు సంచితమని పేరు. త్రివిధములైన కర్మలలో మొదటిది సంచితం. అనేక జన్మల నుంచి పోగు చేసుకుంటూ వచ్చిన పుణ్యపాపాది కర్మరాశి. అది గతానికి సంబంధించినదైతే అందులో నుంచి కొంత జారీ అయి వర్తమానానికి వస్తుంది. దానికే ప్రారబ్ధమని పేరు. ఇప్పుడు మరలా చేసుకునేది భవిష్యత్తుకు తయారై ఉంటుంది. దానికి ఆగామి అని నామకరణం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంజ్ఞా ()
Telugu original

సంజ్ఞా : పేరు. గుర్తు. చిహ్నం. కనుసైగ. అంతేగాక తెలివి, స్పృహ అని కూడా అర్థమే. Consciousness. Sense. విసజ్ఞ అంటే తెలివి తప్పినవాడని అర్థం. లబ్ధ సంజ్ఞ అంటే మరలా తెలివి వచ్చినవాడని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంఘాత/సంహత ()
Telugu original

సంఘాత/సంహత : కూర్పు. Collection. ఒకచోట పోగవటం. మూర్తీభవించటం. Formation. అలా మూర్తీభవించిన పదార్థానికే సంహతమని పేరు. ప్రపంచమంతా ఇలాంటిదే. ప్రతి ఒక్క పదార్థమూ పోగైన పదార్థమే. బాహ్యంగా కనిపించే వస్తు వాహనాలు మాత్రమే కాదు. మన శరీరం, ప్రాణం, ఇంద్రియాలు, మనస్సు కూడా అనేక భాగాలతో కూడి తయారైన పదార్థమే. కనుక ఇది అంతా సంహతమే. Moulded or Constituted. సంహతమెప్పుడూ తనపాటికి తాను స్వతంత్రంగా ఉండదు. దాని ప్రయోజనం అసంహతమైన Unformed తత్త్వాన్ని మనకు గుర్తు చేయటమే. దానిని మనకందివ్వటమే. కనుకనే అసతోమా సద్గమయ అని చాటింది శాస్త్రం. ఈ సంహతం ద్వారా అసంహతమైన ఆత్మతత్వాన్ని అందుకోవలసి ఉంటుంది మనం. అదే సమస్యకు పరిష్కారం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంహితా ()
Telugu original

సంహితా : వేదంలో ఒక భాగం. మంత్రభాగం. మంత్రం శ్లోకరూపం. అవన్నీ కలిసి ఒక సముదాయంగా ఏర్పడితే దానికి సంహిత అవి నామకరణం చేశారు మనపెద్దలు. Compilation.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంతాన/సంతత ()
Telugu original

సంతాన/సంతత : ఒక భావాన్ని పొడిగించటం. Prolongation. సప్తసంతానాలని పేర్కొంటారు మనవారు. ఏడు విధములైన సంతానాలట. పుత్రులు మాత్రమే కాదు సంతానం. తటాక ప్రతిష్ఠ కావచ్చు. ఆరామ ప్రతిష్ఠ కావచ్చు. ఒక కావ్యాన్ని రచించటమైనా కావచ్చు. ఏదైనా ఇందులో సంతానమే. అంటే అది నిర్మించిన వాడి పేరు ప్రతిష్ఠలు అలా పొడిగిస్తూ చిరస్థాయిగా ఉంచేదే. పుత్రుడైనా అలాంటి వాడే గనుక సంతానమని పేరు వచ్చింది. పోతే అద్వైతంలో సంతానకరణ మని ఒక మాట ఉంది. భగవత్పాదులు తరచుగా వాడుతుంటారు. మనకు కలిగిన ఆత్మజ్ఞానాన్ని అలాగే నిలుపుకోవటమని తాత్పర్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సత్‌/సత్య/సత్తా ()
Telugu original

సత్‌/సత్య/సత్తా : సత్‌అన్నా సత్యమన్నా ఉన్నది అని అర్థం. Extent. కలిగిన ఆత్మజ్ఞానాన్ని అలాగే నిలుపుకొంటూ పోవడం. సత్తా అంటే ఉనికని అర్థం. ఎప్పటికీ మారకుండా నిలిచి ఉన్నదేదో అది సత్‌లేదా సత్యం. అది సాకారం కాదు కేవల జ్ఞానరూపం. కనుకనే సత్తా అన్నా అదే. అంటే అస్తిత్వమన్నమాట. Mere existance. విష్ణునామాలలో సత్తా అని ఒక నామం ఉంది. అంటే విష్ణువు సాకారంగా ఎక్కడో ఉన్నాడని కాదు. నిరాకారమైన భావమే లేదా అస్తిత్వమే విష్ణువు అనే మాటకు అర్థం. అంటే పరమాత్మ స్వరూపం. 'సదేవ సోమ్య ఇద మగ్ర ఆసీత్‌' అని ఉపనిషత్తు. ఈ ప్రపంచమంతా సృష్టికి పూర్వం సద్రూపంగానే ఉందట. అప్పటికి ఆత్మా, అనాత్మా అనే తేడా లేక అంతా సద్రూపమే. అయితే అది స్వతఃప్రమాణం కనుక చిద్రూపం కూడా అదే. సచ్చిత్తులే పరమాత్మ అంటే.

Vedānta Paribhāṣā Vivaraṇa
సద్భావ ()
Telugu original

సద్భావ : మంచిభావమనే గాదు ఉండటం. ఉనికి Existance అనికూడా అర్థమే. అస్తిత్వమనే మాటకిది పర్యాయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సదాఖ్యా ()
Telugu original

సదాఖ్యా : సత్‌అనే పేరు గల దేవత. అది నామరూపాత్మకం కాదు. సర్వ సామాన్యమైన అస్తిత్వం, చైతన్యం. దానికి దేవత అని ఉపనిషత్తులో నామకరణం చేశారు. ప్రపంచానికంతా ఇదే మూలం. ప్రపంచ స్వరూపం కూడా ఇదే.

Vedānta Paribhāṣā Vivaraṇa
సకృత్‌ ()
Telugu original

సకృత్‌: అంటే ఒకసారి అని అర్థం. Once. ఒకసారి ఏ రూపంలో ఉన్నదో ఆ రూపం మారకుండా ఉండటం కూడా సకృత్తే. Constant. 'సకృత్‌విభాతం' అని చైతన్యానికి ఒకపేరు. ఎప్పుడూ అలాగే ప్రకాశిస్తూ ఉండేదని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంగ/సక్తి ()
Telugu original

సంగ/సక్తి : తగులుకోవటం, లగ్నమైపోవటం. Estanglement. సంసారంతో జీవుడు తన్మయత్వం చెందటం. కర్మఫలంమీద దృష్టి ఉండటం కూడా సంగమే, సక్తే. Attachment. అదే జీవిత సమస్యకు మూలకారణం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సగుణ ()
Telugu original

సగుణ : గుణాలతో కూడినదని అర్థం. సత్వరజస్‌తమోగుణాలే గుణాలిక్కడ. అవే నామరూపక్రియలు. తద్రూపంగా ఆత్మచైతన్యం భాసిస్తే అది సగుణం. Qualified. అలాకాక తనపాటికి తాను ఉండిపోతే అది నిర్గుణం. Unqualified.

Vedānta Paribhāṣā Vivaraṇa
సందర్భ ()
Telugu original

సందర్భ : కూర్పు. Compilation అని అర్థం. గ్రంథం కూడా ఇలాంటిదే. గ్రథనమంటే కూర్పు. కనుకనే అది గ్రంథమైనది. సందర్భమంటే గ్రంథమనే అర్థం. కానీ లాక్షణికంగా ప్రస్తావన అని, ప్రకరణమని అర్థమేర్పడింది.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంశయ ()
Telugu original

సంశయ : సందేహమని అర్థం. విశయం అని కూడా ఒక మాట ఉంది. మూడింటికి అర్థమొక్కటే.

Vedānta Paribhāṣā Vivaraṇa
సందేహ ()
Telugu original

సందేహ : సంశయమనే అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సద్యోముక్తి ()
Telugu original

సద్యోముక్తి : జీవించి ఉండగానే కలిగే ముక్తి. జ్ఞానోదయమైన వెంటనే కలుగుతుంది గనుక దీనికి సద్యోముక్తి అని పేరు వచ్చింది. ముక్తి అనేది ఒక అనుష్ఠానం ద్వారాగానీ, యోగాభ్యాసం ద్వారాగానీ కలిగేది కాదని అద్వైతుల సిద్ధాంతం. దానికి కారణం కేవలం ఆత్మజ్ఞానమే. కనుక జ్ఞానమెప్పుడు ఉదయిస్తే అప్పుడే ముక్తి కలిగి తీరాలి. దీనికే సద్యోముక్తి అని పేరు Immediate Emancipation. అలాకాక సగుణోపాసన ద్వారా అభ్యసిస్తూ పోతే అది వెంటనే కలగదు. మరణానంతరం సత్యలోకానికి వెళ్ళి అక్కడ మరలా నిర్గుణాభ్యాసం చేసి పొందవలసి ఉంటుంది. దానికి క్రమముక్తి అని పేరు పెట్టారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
సత్సంగ ()
Telugu original

సత్సంగ : సత్పదార్థమైన పరమాత్మతో సంబంధం. అలాటి ఆత్మజ్ఞులతో సంబంధం కూడా సత్సంగమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంధ్యం ()
Telugu original

సంధ్యం : సంధిలో వచ్చేది. జాగ్రత్తుకు, సుషుప్తికి మధ్యలో ఏర్పడేది. స్వప్నావస్థ అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంధి / సంధా ()
Telugu original

సంధి/సంధా : రెండింటి కలయిక. సంధానమని కూడా రూపాంతరం. అభిసంధి అంటే ఉద్దేశించటమని అర్థం. సత్యాభిసంధి, అనృతాభిసంధి అనే మాటలు పూర్వమే వచ్చాయి. సత్యమైన పరమాత్మ నుద్దేశించి పయనించేవాడు సత్యాభిసంధి. అనృతమైన సంసార వాసనలతో వెళ్లేవాడు అనృతాభిసంధి.

Vedānta Paribhāṣā Vivaraṇa
సజాతీయ ()
Telugu original

సజాతీయ : ఒకే జాతికి సంబంధించిన. జీవుడు ఈశ్వరుడు సజాతీయులు. అంటే చైతన్యరూపంగా ఇద్దరూ ఒక్కటే. సజాతీయ భేదం లేదు. లోకంలోనైతే ఇలాంటి భేదం అనివార్యంగా ఉండి తీరుతుంది. ఒక వృక్షానికి సజాతీయం మిగతా వృక్షాలు. ఒక మానవుడికి మిగతా మానవులు. పరమాత్మ విషయంలో మరొక ఆత్మ అనే ప్రశ్న లేదు గనుక సజాతీయ భేదం అక్కడ తొలగిపోతుంది. అంతా ఏకజాతీయమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
సనాతన ()
Telugu original

సనాతన : మొదటి నుంచి ఉన్నది. ఎప్పటికీ నిలిచేది. Eternal. పరమాత్మే గాదు జీవాత్మకూడా సనాతనుడేనని శాస్త్రం చాటుతున్నది. 'జీవభూతః సనాతనః' అని భగవద్గీత.

Vedānta Paribhāṣā Vivaraṇa
సన్నికర్ష/సామీప్యం ()
Telugu original

సన్నికర్ష/సామీప్యం : Nearness, Close contact. సన్నిహిత సంబంధం అని అర్థం. ఇంద్రియాలకు వాటి విషయాలకు ఇలాంటి సన్నికర్ష ఏర్పడినప్పుడే ప్రత్యక్షజ్ఞానం ఉదయిస్తుందంటారు. దీనికి వ్యతిరిక్తమైన మాట విప్రకర్ష. Distance.

Vedānta Paribhāṣā Vivaraṇa
సన్న్యాస ()
Telugu original

సన్న్యాస : Renunciation. త్యాగం అని అర్థం. వదలుకోవటం. అంతేకాదు బాగా ఉంచడమని కూడా అర్థమే. Well place. అనాత్మభావాన్ని వదలుకుంటూ మనస్సును ఆత్మస్వరూపంలో నిలిపి ఉంచటమని భావం. అప్పటికి రెండర్థాలు సరిపోతాయి. ఇది జిజ్ఞాసువుకైతే ఆశ్రమ సన్న్యాసం. జ్ఞానికైతే పరమహంస పారివ్రాజ్యం. దీనికే పరమార్థ సన్న్యాసమని పేరు. ఇది కేవలం మానసికం. బాహ్యమైన వేష భాషలతో నిమిత్తం లేదు. కాషాయ కమండల్వాదులు కూడా అక్కరలేదు. అది వైకల్పికం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సపక్ష ()
Telugu original

సపక్ష : అనులోమమైన పక్షం. ప్రతిలోమమైతే విపక్షం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంపత్తి ()
Telugu original

సంపత్తి : ఒక పదార్థం ఉన్నదున్నట్టు కాక మన భావన కనుగుణంగా దాన్ని భావన చేస్తూ పోతే కొంతకాలానికి అది మనకు ఆ రూపంలోనే దర్శనమిస్తుంది. ఉపాసకులు ఆత్మస్వరూపాన్ని అలాగే భావన చేస్తారు. అది వాస్తవం కాదు. వారి మానసికమైన కల్పన. దీనికే సంపత్తి అని పేరు. దీనికి భిన్నంగా ఆత్మతత్వాన్ని ఉన్నదున్నట్టు దర్శించటానికి ఆపత్తి అని పేరు పెట్టారు వేదాంతులు. ఏదీ కొరత లేకుడా అన్నీ సంపూర్ణంగా ఉండటం, కలిసిరావటం కూడా సంపత్తి అనే అంటారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంప్రత్తి ()
Telugu original

సంప్రత్తి : గృహస్థుడు ధ్యానాభ్యాసానికి కాని, జ్ఞానాభ్యాసానికి గాని కృషి చేయటం కోసం తన గృహస్థాశ్రమాన్ని వదులుకొనే సందర్భంలో తనకు సంబంధించిన దంతా తన పుత్రులకు అప్పజెప్పటానికి సంప్రత్తి అని పేరు. The Handover. To entrust.

Vedānta Paribhāṣā Vivaraṇa
సప్రతిపక్ష ()
Telugu original

సప్రతిపక్ష : ప్రతిపక్షంతో కూడినది. ద్వంద్వాలని కూడా అర్థం. సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, పుణ్యపాపాలు ఇవన్నీ ఒకదానికొకటి సప్రతి పక్షాలు Opposites.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంప్రతిపత్తి / సంప్రత్యయ ()
Telugu original

సంప్రతిపత్తి : ప్రతిపత్తి అంటే ఒకదాన్ని గురించిన జ్ఞానం, అవగాహన. అందరికీ ఒకే అవగాహన ఏర్పడితే సంప్రతిపత్తి అని పేరు. Agreement. అలా కాకుంటే దానికి విప్రతిపత్తి అని పేరు. Disagreement. యోగులు చెప్పే ధ్యానమనేది వేదాంతులకు సంప్రతిపత్తే. కాని వారు చెప్పే జీవేశ్వర భేదం వీరికి సంప్రతిపత్తి కాదు. సంప్రత్యయ : బాగా పట్టుకోవటం. నమ్మకం. చక్కగా గ్రహించటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంప్రసాద ()
Telugu original

సంప్రసాద : బాగా తేరుకోవటం. మాలిన్యం తొలగిపోయి శుద్ధి చెందటం. విశేష వృత్తులే మనస్సుకు పట్టిన మాలిన్యం. సుషుప్తిలో అవి తొలగిపోతాయి. కనుక జాగ్రత్స్వప్న దృష్ట్యా చూచి సుషుప్తిని సంప్రసాదమని పేర్కొన్నారు. అక్కడా కొంత వాసనలు అంటిపట్టుకుని ఉంటాయి. ఆత్మజ్ఞానంతోగాని అవిపోవు. కాబట్టి నిజమైన సంప్రసాదం ఆత్మస్వరూపమే. దాని అనుభవమే అని వేదాంతులు స్పష్టంగా చాటిచెప్పారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంప్రదాయ ()
Telugu original

సంప్రదాయ : ప్రదానం. ప్రదాయమంటే ఒకరికివ్వటం. సంప్రదాయమంటే బాగా అందజేయటం. Initiation. గురువు తన జ్ఞానాన్ని శిష్యుడికి అందజేస్తాడు. అతడు మరొక శిష్యుడికి. ఇలా సాగిపోతే అది గురు శిష్య సంప్రదాయం. పరంపర Tradition అని కూడా మరొకపేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంపరాయ ()
Telugu original

సంపరాయ : పరలోకం. ఇహం కానిది. A other world. 'న సంపరాయః ప్రతిభాతి బాలం' అని ఉపనిషత్తు చాటుతున్నది. బాలుడంటే కేవలం లౌకికంగా బ్రతికే మానవుడు. వాడికి ఇహం తప్ప పరమనేది స్ఫురించదు. వాడి దృష్టిలో అది లేనేలేదు అని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంబంధ ()
Telugu original

సంబంధ : కలయిక. Relation. రెండు పదార్థాల కేర్పడేది. అది రెండే విధాలంటారు శాస్త్రజ్ఞులు. సంయోగం, సమవాయం. రెండూ పదార్థాలైతే గదా అందులో ఒకటే వాస్తవం. రెండవది ఆభాస. కనుక సంబంధం కాని సంబంధం. అది సంయోగం కాదు, సమవాయమూ కాదు. కేవలం తాదాత్మ్యమే అని పేర్కొంటారు అద్వైతులు. సంబంధమనే మాట సాధన చతుష్టయంలో కూడా ఒకటి ఉంది. అక్కడ సంబంధమంటే అధికారికి, ప్రయోజనానికి ఉన్న సంబంధం. అంటే వేదాంత శ్రవణం చేసే వ్యక్తికి ఏమిటి కలిగే ప్రయోజనం అని అడిగితే అది మోక్షమేనని జవాబు. ఈ రెండింటికీ ఉన్న సంబంధమేదో అది సాధన మాత్రమే. కనుక సంబంధమంటే సాధన అని అర్థం చేసుకోవచ్చు.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంబాధ ()
Telugu original

సంబాధ : క్రిక్కిరిసి ఉండటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంభేద ()
Telugu original

సంభేద : కలయిక. దుఃఖ సంభేదం ఉన్న సుఖం సుఖం కాదని వేదాంతుల మాట. అసంభిన్న మైనప్పుడే అది శాశ్వతమైన, అసలైన సుఖానుభవం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంభవ/సంభూతి ()
Telugu original

సంభవ/సంభూతి : పుట్టటమని ఒక అర్థం. అంతేగాక కలయిక అని మరొక అర్థముంది. కుమార సంభవమంటే కుమార జన్మకోసం పార్వతీ పరమేశ్వరులు కలుసుకోవటమని అర్థం చెప్పారు. వేదాంతంలో సంభవమన్నా, సంభూతి అన్నా మూల ప్రకృతి వ్యక్తమైన దశ. Nature Manifest.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంభోగ ()
Telugu original

సంభోగ : భోగమనే అర్థం. అంటే అనుభవం. Experience సుఖదుఃఖాది ద్వంద్వాల అనుభవానికి పేరు. ఇదే సంసారం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సమ్మత ()
Telugu original

సమ్మత : ఒప్పుదల అయినది Approved. Accepted. ఇష్టమైనది. విరుద్ధం కానిది.

Vedānta Paribhāṣā Vivaraṇa
సమ/సమాన/సామన్య ()
Telugu original

సమ/సమాన/సామన్య : అన్ని చరాచర పదార్థాలలో ఒకే రూపంలో ఉన్నది. బ్రహ్మతత్వం. 'నిర్దోషం హి సమం బ్రహ్మ.' సమానంగా తేడా లేకుండా వ్యాపించినది. దాని భావమే సామాన్యం. ఎక్కడికక్కడ తెగిపోతే విశేషం. తెగకుండా వాటన్నింటినీ వ్యాపిస్తే సామాన్యం. ఆభరణాలు విశేషాలైతే సువర్ణం సామాన్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సమంజస ()
Telugu original

సమంజస : యుక్తియుక్తం. సహేతుకం Proper. Appropriate

Vedānta Paribhāṣā Vivaraṇa
సమన్వయ ()
Telugu original

సమన్వయ : కలిసిరావటం. ఒకదానికొకటి సరిపడటం. పొందిక Co-ordination. కర్మోపాసనా జ్ఞానాలు మూడింటినీ సమన్వయించుకున్నప్పుడే పరిపూర్ణమైన అనుభవమని పెద్దల మాట. ఇందులో కర్మోపాసనలు జ్ఞానసాధనాలైతే జ్ఞానం మోక్షసాధనమని పరిష్కారం. ఇదే అద్వైతులు చేసే గొప్ప సమన్వయం. Grand synthesis.

Vedānta Paribhāṣā Vivaraṇa
సబ్రహ్మచారి ()
Telugu original

సబ్రహ్మచారి : Co-student సతీర్థ్య అని కూడా దీనికి నామాంతరం. ఒకే గురువు దగ్గర చదువుకునే విద్యార్థులు ఒకరికొకరు సబ్రహ్మచారులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
సమయ ()
Telugu original

సమయ : కాలం. Time. దర్శనం. School of thought. శాస్త్రం. Science ఆగమం, Occult science. తర్క సమయమంటారు. అంటే తర్కశాస్త్రమని అర్థం. సమయాచారమంటారు. అంటే తంత్ర గ్రంథాలు చెప్పే మాట కనుగుణంగా ఆచరించటం. సమయమంటే ప్రతిజ్ఞ అని కూడా అర్థమే. కలయిక అని కూడా ఒక అర్థముంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
సమర్థ ()
Telugu original

సమర్థ : యోగ్యమైన, తగినంత సామగ్రి కలిగిన. అధికారమనే Competency దానిలో రెండు భాగాలున్నాయి. ఒకటి సామర్థ్యం. Equipment. రెండవది అర్థిత్వం Inquisitiveness. అప్పటికీ సామర్థ్యమంటే శరీర బలం, శక్తి, స్తోమత అని కాదు అర్థం. పారిభాషికమైన అర్థం ఉంది దీనికి. అది ఏదో కాదు. యోగ్యత లేదా అర్హత. బ్రహ్మజ్ఞానార్జనానికి అలాంటి అర్హత ఉన్నవాడే సమర్థుడు. మానవ శరీర నిర్మాణమే అది.

Vedānta Paribhāṣā Vivaraṇa
సమవాయ ()
Telugu original

సమవాయ : Inseparable contact. రెండు పదార్థాలకు విడరాని సంబంధం. ద్రవ్యానికి, దాని గుణానికీ కనిపించేది. విడిపోయేదైతే సంయోగం. Separable. తార్కికులు చెప్పే సప్త పదార్థాలలో సమవాయమనేది ఒక పదార్థం. Category.

Vedānta Paribhāṣā Vivaraṇa
సమష్టి/సమస్త/సమాస ()
Telugu original

సమష్టి/సమస్త/సమాస : సమూహమని అర్థం. Collection. Totality. ఒక చోటకి పోగు చేయటం. సమాసం. లేదా సంహారం. అలా పోగైన మొత్తానికి సమస్తమని పేరు. దీనికి భిన్నమైనది వ్యాసం. వ్యస్తం, వ్యష్టి. సమష్టి అంటే Whole. వ్యష్టి అంటే Part.

Vedānta Paribhāṣā Vivaraṇa
సమాచార ()
Telugu original

సమాచార : వార్త కబురు అని కాదు అర్థం. ఆచారమని అర్థం. అంటే నడవడి. Conduct. Behaviour. ప్రవర్తన. అమలు చేయటంకూడా Implimentation.

Vedānta Paribhāṣā Vivaraṇa
సముచ్చయ ()
Telugu original

సముచ్చయ : జ్ఞానమూ, కర్మా రెండూ కలిపి పట్టుకోవటం. ఇది పనికి రాదంటారు అద్వైతులు. జ్ఞానమంటే ఆత్మను గుర్తించటం గదా. సర్వమూ ఆత్మేనని గ్రహించినప్పుడిక కర్మ కవకాశమే లేదు. ఎందుకంటే కర్త, క్రియ, కారకం మూడూ ఆత్మస్వరూపమే అతని దృష్టిలో. కాబట్టి జ్ఞానంతో కర్మను సముచ్చయం చేయరాదు. పోతే జ్ఞానమనేది మరొకటున్నది. అది దేవతా జ్ఞానం. ఉపాసనా రూపమైనది. అలాంటి దానికి మాత్రం కర్మతో సముచ్ఛయం చేయవచ్చు. చేస్తే అది ఇంకా ఎక్కువ ఫలితమిస్తుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
సమాధి/సమాధాన ()
Telugu original

సమాధి/సమాధాన : చక్కగా నిలపటం. పెట్టటం. Well placement అని శబ్దార్థం. మనస్సును ఆత్మస్వరూపంతో ఏకం చేసి అందులోనే నిలిపి ఉంచటం. Concentration. ఏకాగ్రత. ఇది యోగులు ద్వైత రూపంగా సాగిస్తే అద్వైతులు అభేద రూపంగా భావిస్తారు. సమాధి కానిది వ్యాధి Illplacement. అనేకాగ్రత లేదా వ్యగ్రత.

Vedānta Paribhāṣā Vivaraṇa
సమాపత్తి ()
Telugu original

సమాపత్తి : ఒకటిగా అయిపోవటం. ఏకమై పోటం. బ్రహ్మచైతన్యంగా జీవ చైతన్యం ఏకం కావటం. విశేష జ్ఞానం సామాన్య జ్ఞానంతో కలిసి పోవటం. సాయుజ్యం. శైవాగమాలలో సమాపత్తి అని సమావేశమని పేర్కొంటారు. శివజీవైక్యం అని వారి భావం. వైష్ణవాగమాలలో దీనినే సమాశ్రయణమని వ్యవహరిస్తారు. Total surrender to the almighty.

Vedānta Paribhāṣā Vivaraṇa
సమామ్నాయ ()
Telugu original

సమామ్నాయ : Mention. ఉదాహరించటం. నిర్దేశించటం. పేర్కొనటం. వర్ణ సమామ్నాయ మంటారు. అంటే అకారం దగ్గరనుంచి క్షకారం వరకు అన్ని అక్షరాలను క్రమంగా చెబుతూ పోవటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సమావేశ ()
Telugu original

సమావేశ : సమాపత్తి అనే అర్థం. తాదాత్మ్యం. జీవుడిలో ఈశ్వరభావం పూర్తిగా ప్రవేశించటం. బాగా ఆవేశించటమని అర్థం. Conpletely possessed by the ultimate reality.

Vedānta Paribhāṣā Vivaraṇa
సమానాధికరణ/సామానాధికరణ్య ()
Telugu original

సమానాధికరణ/సామానాధికరణ్య : రెండు భావాలు ఒకే అధికరణం లేదా ప్రదేశంలో ఉండటం. విశేషణ విశేష్య రూపంగా ఉంటే అది విశిష్టాద్వైత దృష్టి. నీలోత్పలం నీలమనే గుణం ఉత్పలమనే పుష్పం ఒకే పదార్థంలో ఉన్నాయి. The bluness and the flowerness. అలాకాక రజ్జు సర్ప మన్నప్పుడు రజ్జువు కంటే సర్పం వేరుగా లేక ఊరక ఉన్నట్టు భాసిస్తున్నది. దీనికి లక్ష్యలక్షణ సామానాధికరణ్య మని పేరు. వస్తువుకు దాని ఆభాసకు ఉండే సంబంధం. ఇదీ అద్వైతుల దృష్టి. ఆభాస వస్తువునే లక్షిస్తుంది. అంటే సూచిస్తుంది. కనుక అది లక్షణం. వస్తువు దానిచేత లక్షితమవుతుంది గనుక లక్ష్యం. సచ్చిత్తులు నామరూపాలు ఇలాగే కలిసి ఉన్నాయి. నామరూపాలు లేవు వాస్తవంలో. అయినా ఉన్నట్టు భాసిస్తున్నాయి. ఈ ఆభాస ఆ సచ్చిత్తులనే మనకు పట్టి ఇస్తున్నాయి. పట్టుకొంటే ఇవి అందులోనే కలిసి వస్తాయి. దీనికే అపవాద సామనాధికరణ్యమని, బాధ సామానాధికరణ్యమని రెండు పేర్లు పెట్టారు వేదాంతులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
సమాశ్వాస ()
Telugu original

సమాశ్వాస : ఊరట. తృప్తి.

Vedānta Paribhāṣā Vivaraṇa
సమాహార ()
Telugu original

సమాహార : అన్నీ కలిపి పోగుచేయటం లేదా లోపలికి తీసుకోవటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సమీచీన ()
Telugu original

సమీచీన : మంచిది. చక్కగా ఉన్నది. దోషం లేనిది. Right. Perfect.

Vedānta Paribhāṣā Vivaraṇa
సముదయ / సముదాయ ()
Telugu original

సముదయ / సముదాయ : Total. మొత్తం. Whole. సమష్టి. దీనిలో ఏక దేశానికి అవయవమని Part పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
సమృద్ధి ()
Telugu original

సమృద్ధి : Completon. సంపూర్ణం Abund అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సమ్రాట్‌/సామ్రాజ్య ()
Telugu original

సమ్రాట్‌/సామ్రాజ్య : అన్నిటి మీదా ఆధిపత్యం కలవాడు. వాడికున్న ఆధిపత్యమే సామ్రాజ్యం. అది ఉన్నప్పుడే ప్రసరిస్తాడు అన్నివైపులా. దానికి వైరాజ్యమని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
సమ్మాన/సమ్మిత ()
Telugu original

సమ్మాన/సమ్మిత : పట్టటం, ఇమడటం. ఇమిడి పోవటం. ఒకదానిలో ఇమిడి పోయేదైతే అది సమ్మితం. Limited to a medium. Contained. దేహం మేరకే ఉంటుంది ఆత్మ అని జైనుల వాదం. అది ప్రారబ్ధం తీరి వెళ్ళిపోయి మరలా వచ్చి ప్రవేశిస్తే చీమ మొదలు బ్రహ్మవరకూ ఎక్కడికక్కడ ఆయా ఉపాధులలో సమ్మిత మవుతుందని వారి సిద్ధాంతం. అలా అయితే అది శరీరంతోపాటు నశించపోవలసిందే నని వేదాంతుల ఆక్షేపణ.

Vedānta Paribhāṣā Vivaraṇa
సమ్మోహ ()
Telugu original

సమ్మోహ : మోహమనే అర్థం. పూర్తిగా తెలివితప్పటం. Out of wits. అర్థంకాక తికమక పడటం కూడా సమ్మోహమే. మనస్సు పని చేయకపోవటం. 'బుద్ధిం మోహయసీవ మే' అని వాపోతాడు అర్జునుడు. ఏమీ నాకు బోధపడటం లేదని అతని ఆవేదన. 'స్థితోస్మి గత సందేహః' అని చివరకు తన తృప్తిని కూడా చాటి చెబుతాడు. 'గత సందేహః' అన్నాడంటే అజ్ఞానం పూర్తిగా తొలగిపోయిందని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సరూప ()
Telugu original

సరూప : ఒకదానిని పోలిన మరియొకటి. Similar ఆ రెండింటికి ఉన్న ధర్మమే సారూప్యం. Similarity.

Vedānta Paribhāṣā Vivaraṇa
సర్వజ్ఞ ()
Telugu original

సర్వజ్ఞ : 'సర్వం జానాతి ఇతి.' అన్నీ తెలిసిన వాడని అర్థం. ఈశ్వరుడు Omniscient. 'సర్వంచ తత్‌జ్ఞంచ.' అదే సర్వమూ. అదే జ్ఞానమూ అని చెప్పినా చెప్పవచ్చు. అలా చెపితే అది ఈశ్వరుడు కాదు. నిర్గుణమైన పరమాత్మ.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంయమ/సంయమి ()
Telugu original

సంయమ/సంయమి : ఇంద్రియ మనోనిగ్రహం. వాటిని వశం చేసుకోవటం. 'త్రయమేకత్ర సంయమః.' ధారణా ధ్యాన సమాధులు మూడింటికీ సంయమమని పేరు. ఇది పతంజలి లాంటి యోగులు చేసిన నిర్వచనం. సంయమనం కలవాడు సంయమి.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంయోగ ()
Telugu original

సంయోగ : కలయిక. అంటటం. సంబంధం. రెండు ద్రవ్యాలకుండే సంబంధం సంయోగం Separable contact. ద్రవ్యానికీ దాని గుణానికీ ఉండేది సంయోగం కాదు సమవాయం అని అంటారు తార్కికులు. Inseparable contact. కానీ ఇవి రెండూ వాస్తవం కావు. ఉన్నదొక్క ఆత్మపదార్థమే గనుక మిగతా అనాత్మ అంతా దాని ఆభాసే గనుక రెంటికీ ఉన్న సంబంధం సంబంధంకాని సంబంధం. అదే అధ్యాస అంటారు అద్వైతులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
సహకారి ()
Telugu original

సహకారి : త్రివిధ కారణాలలో ఒకటి. కార్యోత్పత్తికి తోడ్పడే సామగ్రి. Material. ఘటానికి సారె దండం చక్రం ఇలాంటివి.

Vedānta Paribhāṣā Vivaraṇa
సః ()
Telugu original

సః : వాడు అని శబ్దార్థం. పరమాత్మ. అహం అంటే నేననే జీవాత్మ. ఇవి రెండూ వేరుగావు ఒక్కటేనని బోధిస్తున్నది సోహం అనే మంత్రం. సః అహం వాడే నేను. లేదా అహం సః. నేనేవాడు. ఇలా చెప్పటం మూలాన ఇద్దరిలో ఉన్న దోషం తొలగిపోయి చైతన్యమనే ఒకే ఒక గుణం మిగిలిపోతుంది. అదే వాంఛనీయం సాధకుడికి. సోహం అనే మంత్రంలోనే సకార హకారాలు లోపిస్తే ఓం అనే మంత్రం ఏర్పడిందంటారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంవాద ()
Telugu original

సంవాద : రెండూ కలిసి ఒక మాటమీద నిలబడటం. Agreement. సరిపోవటం. సరిపోలటం కూడా Match. Tally. దీనికి భిన్నమైతే విసంవాదం లేదా వివాదం. సంవాదమంటే సంభాషణమని కూడా అర్థమే. Conversation.

Vedānta Paribhāṣā Vivaraṇa
సవికల్ప ()
Telugu original

సవికల్ప : అనేకంగా మారినది. Diverse. సగుణమైన పరమాత్మ. మనస్సు కూడా ప్రాపంచికమైన వృత్తులతో నిండిపోతే అది సవికల్పం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సవితృ ()
Telugu original

సవితృ : ప్రసవించేవాడు. వెలుగును, వర్షాన్ని రెండింటిని సృష్టించేవాడు. సూర్యభగవానుడు. బుద్ధి అని కూడా లాక్షణికమైన అర్థం. అదీ ప్రకాశిస్తుంటుంది. వృత్తులనే కిరణాలను బయట పెడుతుంటుంది. పరమాత్మ అని కూడా అర్థమే. నామరూపాలను ప్రసరింపజేస్తున్నాడు గనుక.

Vedānta Paribhāṣā Vivaraṇa
సాంసిద్ధిక ()
Telugu original

సాంసిద్ధిక : స్వాభావికమని అర్థం. Natural. Inherent.

Vedānta Paribhāṣā Vivaraṇa
సాకూత ()
Telugu original

సాకూత : ఏదో ఒక అభిప్రాయం లోపల పెట్టుకుని ఉండటం. 'సాకూతం వచనమ్‌.' Suggestive statement మనస్సులో ఉన్న అభిప్రాయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సాక్షాత్‌ ()
Telugu original

సాక్షాత్‌: నేరుగా. తిన్నగా. సూటిగా. ప్రత్యక్షంగా Straight. Direct. సాక్షాత్‌బ్రహ్మ. బ్రహ్మం మనకు సూటిగా దర్శనమిస్తున్నది.

Vedānta Paribhāṣā Vivaraṇa
సాక్షి/సాక్ష్య ()
Telugu original

సాక్షి/సాక్ష్య : Spectator. Witness. అంటి ముట్టక ఒక విషయం గమనిస్తున్నవాడు. పరమాత్మ. అతని చేత గమనింపబడుతున్న అనాత్మ ప్రపంచమంతా సాక్ష్యం Witnessed.

Vedānta Paribhāṣā Vivaraṇa
సాక్షాత్కార ()
Telugu original

సాక్షాత్కార : అలాంటివాడి దర్శనం సాక్షాత్కారం. అదే నేననే అనుభవం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంహార ()
Telugu original

సంహార : ఒకచోటికి పోగుకావటం. Collection. వధించటమని కూడా అర్థమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంవృత ()
Telugu original

సంవృత : కప్పబడిన. ముడుచుకుపోయిన. Contracted. సంకుచితం. వివృతం కానిది సంవృతం. విశేషమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంవృత్త ()
Telugu original

సంవృత్త : తయారైనది. నిష్ఫన్నం. ఏర్పడినది. Finished. Completed.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంవిద్‌/సంవిత్తి/సంవేదనా ()
Telugu original

సంవిద్‌/సంవిత్తి/సంవేదనా : జ్ఞానం. చైతన్యం. Awareness. అనుభవాత్మకమైన జ్ఞానం. Experience. Feeling. సంవేదనాత్మకం చిత్తమంటే Centre of feeling అని అర్థం. ఆత్మ సంవేద్యతాం ఆపన్నం. పరమత్మ కూడా నీ మనస్సుకు సంవేద్యం అయినప్పుడే అది అనుభవం. You should fell his presence.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంస్థాన/సంస్థిత ()
Telugu original

సంస్థాన/సంస్థిత: Constitution.Mould.Formation. అమూర్తమైన భావం మూర్తీభవించటం లేదా ఒక రూపంలో తయారై కనపడటమని అర్థం. అది స్వరూపాన్ని విడవకుండానే రూపాంతరం చెందుతుంది. అలాంటప్పుడే దానికి సంస్థితమని పేరు. A substance in a different from or phase. జలం తరంగ రూపేణా, మృత్తిక ఘటరూపేణా కనిపిస్తున్నాయంటే అలాంటి దానికి సంస్థితమని పేరు. ప్రస్తుతం మనకీ ప్రపంచం కనిపిస్తున్నదంటే ఈ చరాచర పదార్థాలుగా సంస్థితమైనది ఆత్మచైతన్యమే అని అద్వైతుల దృష్టి.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంసర్గ/సంసృష్టి ()
Telugu original

సంసర్గ/సంసృష్టి : మేళనం. కలిసిపోవటం. సంపర్కమని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంసార/సంసృతి ()
Telugu original

సంసార/సంసృతి : 'సమ్యక్‌అవిచ్ఛేదేన సరతి ఇతి.' ఎడతెగకుండా సాగిపోయేది అని అర్థం. Ever moving like a current. ప్రపంచం. అనాత్మ. ఇదే మారిపోవటం. మారిపోవటమే మరణం. మరణమే సమస్య. అందుకే సంసారమే సమస్య అని పెద్దలు పేర్కొనటం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సంస్కార/సంస్కృతి ()
Telugu original

సంస్కార/సంస్కృతి : చతుర్విధ కర్మలలో ఇది ఒకటి. శుద్ధి అని అర్థం. దోషాపనయనమూ, గుణాధానమూ ఈ రెండింటివల్లనే దేనికైనా శుద్ధి ఏర్పడుతుంది. అదే సంస్కారం. సంఘ సంస్కరణ. మతసంస్కరణ. చిత్త సంస్కరణ. అంటే అందులో ఇమిడి ఉన్న ఆంతర్యమిదే.

Vedānta Paribhāṣā Vivaraṇa
సవన ()
Telugu original

సవన : కాలమని, యజ్ఞమని అర్థం. సోమలత ఎక్కడ యాజ్ఞికులు పిండి ఆ రసాన్ని హోమం చేస్తారో దానికి సవనమని మొదట పేరు వచ్చింది. ఈ క్రియ మూడుమార్లు జరుగుతుంది. ఒకటి ప్రాతస్సవనం. రెండు మాధ్యందిన సవనం. మూడు సాయం సవనం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సార ()
Telugu original

సార : అతిముఖ్యమైన భావం. సర్‌ అంటే ప్రసరించేది. ఒక విషయం నుంచి ముఖ్యంగా బయటికి వచ్చేదేదో అది దాని సారం. Essence. రసమే వర్ణవ్యత్యయ మేర్పడి సారమైందని కూడా పెద్దలు పేర్కొంటారు. సారమంటే ప్రమాణమని కూడా Proof ఒక అర్థం చెబుతారు భాష్యకారులు. ఆత్మప్రత్యయ సారమనే చోట ఆత్మ తాలూకు భావనే దాన్ని పట్టుకునే ప్రమాణమన్నారు.

Vedānta Paribhāṣā Vivaraṇa
సామ్య ()
Telugu original

సామ్య : సమ అనే దాని భావం. మనస్సులో సత్వరజస్తమో గుణాలు మూడూ తేడాగా ఉంటే అది వైషమ్యం. అదే సృష్టికి మూలం. అలాకాక ప్రకృతి గుణాలైన ఆ మూడూ కలిసి ఏకరూపంగా ఉండగలిగితే అది సామ్యావస్థ. అప్పుడు సృష్టిలేదు. లయమే. అంతేగాక మనసు త్రిగుణాలను తేడాలేకుండా ఒకటిగా మార్చుకుని శుద్ధ సత్త్వ గుణంతో నిలిచిపోతే దానికీ సామ్యమనే పేరు. 'ఇహైవ తైః జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః.' ఎవరి మనస్సు ఎప్పుడూ సామ్యంలో Equipoise ఉంటుందో వారీ సృష్టి రహస్యాన్ని తప్పక భేదించగలరు అని గీత ఇచ్చిన హామీ. సమమంటే పరమాత్మ అని కూడా అర్థమే. ఆయన ఉన్న దశ సామ్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సాధ్యసమ ()
Telugu original

సాధ్యసమ : సాధించవలసిన దానితో సమానం. ఇంకా సిద్ధం కానిది. హేతువు చూపి నిరూపించవలసినది. బీజాంకుర దృష్టాంతం అలాంటిది. అక్కడ ఒకదాని కొకటి సాపేక్షమై కూచుంది. కనుక నిష్కర్ష లేదు. సాపేక్షాని కెప్పుడూ నిరపేక్షమే పరిష్కారం. అంతవరకూ దానికి సిద్ధి లేదు. సాధ్యసమమే అది. ఇంకా సాధించ వలసినదే నని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సాధ్యసాధన ()
Telugu original

సాధ్యసాధన : సాధించవలసిన పదార్థం సాధ్యం. End. దాన్ని సాధించే మార్గం సాధనం. Means.

Vedānta Paribhāṣā Vivaraṇa
సాద్గుణ్య ()
Telugu original

సాద్గుణ్య : యజ్ఞయాగాది కర్మలలో అన్ని గుణాలూ సమగ్రంగా ఉండటం. Fullness. Prefection.

Vedānta Paribhāṣā Vivaraṇa
సాదృశ్య ()
Telugu original

సాదృశ్య : సదృశమంటే ఒక దానిని పోలిన మరియొకటి. రెండింటికీ మధ్య ఉన్న ఆ సంబంధమే సాదృశ్యం. SimilarIty.

Vedānta Paribhāṣā Vivaraṇa
సామీప్య/సారూప్య/సాయుజ్య ()
Telugu original

సామీప్య/సారూప్య/సాయుజ్య : జీవాత్మకు పరమాత్మతో సంబంధం సామీప్యంగా చెబుతారు ద్వైతులు. జీవుడు ముక్తుడైనా వైకుంఠంలో ఈశ్వరుడి సమీపంలో ఉండ వలసిందే. అదే సారూప్యమని పేర్కొంటారు విశిష్టాద్వైతులు. ఈశ్వరుడి రూపం కూడా జీవుడికి సంక్రమిస్తుందంటారు వారు. పోతే రూపమే కాదు. ఈశ్వరుడితో ఏకమే అయిపోతాడని సాయుజ్యాన్ని వర్ణిస్తారు అద్వైతులు. ఇదే అన్నిటికన్నా ప్రామాణికమైన సిద్ధాంతం.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్వరూప ()
Telugu original

స్వరూప : తనయొక్క రూపమని అర్థం. ఆత్మ ఎలా ఉందో అలాంటి లక్షణానికే స్వరూపమని స్వభావమని పేరు. అసలు ఆత్మ అంటేనే స్వరూపమన్నారు Our very nature భగవత్పాదులు. స్వరూపమన్నా, ఆత్మ అన్నా ఒకటే.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్వక/స్వకీయ ()
Telugu original

స్వక/స్వకీయ : తనది అని అర్థం. స్వ అనేది స్వరూపమైతే ఇవి రెండూ విభూతి క్రిందికి వస్తాయి. అది అహం. ఇది మమ.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్వభావ ()
Telugu original

స్వభావ : తనయొక్క భావం. లేదా అస్తిత్వం Existence అని అర్థం. ప్రకృతి అన్నా ఇదే. Nature. అవిద్య. అజ్ఞానమని కూడా అర్థమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్వగత ()
Telugu original

స్వగత : తనలోనే ఉన్నదని అర్థం. పరాశక్తి పరమాత్మకు అంతర్గతంగానే ఉంటే అది స్వగతం. అప్పుడది అవ్యక్త దశ. అదే ఆయన సంకల్పంతో బయటపడితే అప్పుడు వ్యక్తమై భాసిస్తుంది. స్వగతమంటే స్వగత భేదం కూడా కావచ్చు. ఒక వృక్షం పైకి ఒకటిగానే కనిపిస్తున్నా అందులో బోద అని, వేరని, కొమ్మలని, రెమ్మలని అనేక భాగాలు ఉండటం సహజమే. ఇలాంటి దానికే స్వగత భేదం అని పేరు. A whole with its parts. ఇలాంటి భేదం లేనిదేదో అది ఆత్మ స్వరూపం.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్వతః/స్వయం ()
Telugu original

స్వతః/స్వయం : తాను తనపాటికి తాను. తానుతప్ప మరేదీ లేదని భావం. 'స్వతః ప్రమాణం స్వతఃసిద్ధం.' తనకు తానే ప్రమాణం. మరొకటి ఏదీ అక్కరలేదని అర్థం. పరమాత్మ ఏ ప్రమాణాన్నీ కోరదు. కారణం అదే ప్రమాణాలన్నిటికీ ఆశ్రయం. దానివల్లనే ప్రమాణమనేది ఏర్పడుతున్నది. కనుక స్వతః ప్రమాణమన్నారు. Self evident అలాంటప్పుడే అది స్వతఃసిద్ధమనిపించుకుంటుంది. అంటే తనపాటికి తాను ఉండగలుగుతుంది. Self existent.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్వరస/స్వారస్య ()
Telugu original

స్వరస/స్వారస్య : రసమంటే ఇక్కడ భావమని అర్థం. తన భావమేదో అది అంటే విజాతీయమైన భావం లేనిది. అలాంటి వ్యవహారానికే స్వారస్యమని పేరు. పరమాత్మ ఎప్పుడూ స్వరసమే. Homogenous.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్వతంత్ర/పరతంత్ర ()
Telugu original

స్వతంత్ర/పరతంత్ర : తంత్రమంటే ఆధారపడటం. తనమీద తాను ఆధారపడితే స్వతంత్రం. అది పరమాత్మ. Self dependent. అలాకాక మరొక దానిమీద ఆధారపడితే అది పరతంత్రం. Dependent. అది ప్రపంచం.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్వధా ()
Telugu original

స్వధా : సు+అధా. బాగా ఉంచటం. పితృదేవతలకు తర్పణం చేసేటప్పుడు స్వధానః తర్పయామి అని పేర్కొంటారు. ఇది పితృలోకంలో ఉన్న దేవతలకు తప్పక చెందుగాక అని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్వాహా ()
Telugu original

స్వాహా : సు+ఆహా. బాగా హోమం చేయటం. దేవతలను ఉద్దేశించి అగ్ని హోత్రంలో హవిస్సును వేసేటప్పుడు ఉచ్చరించే మాట. ఇది బాగా హోమమగుగాక అని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్వమహిమా ()
Telugu original

స్వమహిమా : తన మహిమ అని అర్థం. స్వ అంటే ఇక్కడ ఆత్మ స్వరూపం. దాని మహిమ దాని విస్తారం లేదా విభూతి. Expansion. అది ఎప్పుడూ 'స్వమహిమ్ని ప్రతిష్ఠితః.' తన మహిమలోనే తాను నిలిచి ఉంటుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్వరత ()
Telugu original

స్వరత : తనలోతాను రమించేవాడు. Self contained. ఆత్మారాముడని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్వస్థ ()
Telugu original

స్వస్థ : 'స్వస్మిన్‌తిష్ఠతి ఇతి.' తనలోతాను ఉండిపోయేవాడు. ఉన్నదంతా తన స్వరూపంగా చూస్తుంటాడు కాబట్టి ఆత్మజ్ఞాని అనాత్మలో కాక ఆత్మలోనే నిలిచిపోతాడు. కనుక స్వస్థుడంటే ఆత్మజ్ఞాని అని అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్వరాట్‌ ()
Telugu original

స్వరాట్‌: 'స్వయం రాజతే ఇతి.' ఎవడైతే తనపాటికి తానే రాజిల్లుతూ లేదా ప్రకాశిస్తూ ఉంటాడో వాడు. ప్రకాశమంటే ఇక్కడ జ్ఞానమే. అలాంటి జ్ఞానం తప్ప మరేదీ లేదతనికి. అదే జ్ఞానమూ. అదే జ్ఞేయమూ కనుక స్వరాట్‌అంటే జ్ఞాని.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్వస్తి ()
Telugu original

స్వస్తి : సు+అస్తి. Well being. చక్కగా ఉండటం. శుభం. శ్రేయస్సు. మంచి. స్వస్త్యయనం అంటే కూడా క్షేమమనే అర్థం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సర్గ ()
Telugu original

సర్గ : సృష్టి అని అర్థం. ప్రతిసర్గ అంటే ప్రళయమని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సత్త్వ/సాత్త్వత ()
Telugu original

సత్త్వ/సాత్త్వత : త్రిగుణాలలో ఇది రెండవది. రజస్సువల్ల సృష్టి అయితే తమస్సు వల్ల లయమైతే సత్త్వం వల్లనే స్థితి అనేది సాగిపోతున్నది. సత్త్వమంటే ఆవరణ విక్షేప మాలిన్యం ఏ మాత్రమూ లేని సిమితమైన మనస్తత్త్వం. సత్త్వం అంటే అంతఃకరణమని కూడా అర్థమే. సాత్త్వత అంటే సత్త్వగుణం పుష్కలంగా ఉన్న మానవుడు. భగవత్‌భక్తుడని అర్థం. భాగవతంలో సాత్త్వతులంటే అలాంటి భక్తులే. సాత్త్వత పురాణమని కూడా భాగవతానికి మరొక పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
సత్త్వశుద్ధి ()
Telugu original

సత్త్వశుద్ధి : సత్త్వమంటే అంతఃకరణమని పేర్కొన్నాము. అందులో రజోమాలిన్యం, తమో మాలిన్యం రెండూ తొలగిపోతే అప్పుడు సత్త్వం శుద్ధి అవుతుంది. సత్త్వశుద్ధివల్లనే ఆత్మజ్ఞానం కోసం శ్రవణమననాదులు చేసి క్రమంగా సిద్ధి పొందగలడు మానవుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్వప్న/స్వాప ()
Telugu original

స్వప్న/స్వాప : స్వాపమంటే నిద్ర. అందులో వచ్చే మరొక దశ స్వప్నం. Dream. జాగ్రత్తు సుషుప్తుల మధ్య ఏర్పడే దశ ఇది. దీనికే సంధ్య స్థానమని కూడా పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్వాప్యయ ()
Telugu original

స్వాప్యయ : స్వ+అప్యయ. అప్యయమంటే లయమై పోవటం. స్వ అంటే తనలో. మనస్సు తన చైతన్యంలోనే లయమైన దశకు పేరు. సుషుప్తి అని అర్థం. కాని ఎందులో లయమైనదో మనస్సు దాన్ని గుర్తించలేడు జీవుడు. గుర్తించగలిగితే అది అసలైన స్వాప్యయమే. అంటే స్వ అనే మాటకిక్కడ ఆత్మచైతన్యం. అది గుర్తిస్తూ దానితో ఏకమవుతాడు కాబట్టి ఇది సుషుప్తి కాదు. సమాధి.

Vedānta Paribhāṣā Vivaraṇa
సుషుప్తి ()
Telugu original

సుషుప్తి : సుప్తి అంటే నిద్ర. దానికి ముందు సు చేరితే మంచి నిద్ర అని అర్థం. అంటే గాఢ నిద్ర. స్వప్నం అనే వాసన కూడా లేని ఒక జడస్థితి. ఇది అవస్థాత్రయంలో మూడవది. ఇందులో జీవుడికి తాను ఈశ్వరుడని జ్ఞానం లేకున్నా బ్రహ్మసాయుజ్యం అప్రయత్నంగానే కలుగుతుందంటారు వేదాంతులు. దానికి తార్కాణం అతనికి ఆ దశలో కలిగే బ్రహ్మానందమే.

Vedānta Paribhāṣā Vivaraṇa
సుఖ/దుఃఖ ()
Telugu original

సుఖ/దుఃఖ : ఖం అంటే ఇంద్రియం. అది సుష్ఠు. అనుకూలంగా పనిచేస్తే సుఖం. ప్రతికూలంగా చేస్తే దుఃఖం. సుఖదుఃఖాలనేవి రెండూ ద్వంద్వాలు. ద్వంద్వాత్మకమే సంసారం. ఇవి మానవుడి ధర్మాధర్మ ఆచరణవల్ల కలుగుతాయని శాస్త్రం చెప్పే రహస్యం. సుఖమనే మాటకు సులభమని కూడా అర్థమే. Easy. దీనికి ప్రతిగా దుఃఖమనే మాటకు కష్టసాధ్యమని అర్థం. Difficult.

Vedānta Paribhāṣā Vivaraṇa
సుర/అసుర ()
Telugu original

సుర/అసుర : 'సుష్ఠు రాజతే ఇతి సురః.' బాగా రాజిల్లేవాడని అర్థం. దేవతలని పేర్కొంటారు. కానీ అది ఆత్మ దేవతే. ఆత్మజ్ఞాన ఆర్జన చేసే సాధకుడు కూడా సురుడే. అలా కాని అజ్ఞాని అసురుడు. అసుర అంటే 'అసుషు రమతే ఇతి' తన ప్రాణధారణ కోసమే ప్రాకులాడే వాడని అర్థం. ప్రాణం తప్ప దాన్ని దాటి జ్ఞానానికి నోచుకోని వాడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్వారాజ్య ()
Telugu original

స్వారాజ్య : స్వయంగా రాజిల్లేవాడు స్వరాట్‌. వాడి లక్షణం స్వారాజ్యం. తన పాటికి తానే ఎవరిమీదా ఆధారపడకుండా మహానందంగా ఉండగల వ్యక్తి స్వరాట్‌అయితే వాడి ఆనందమయమైన జీవితం స్వారాజ్యం. ఎవడో కాదు వాడు. ఆత్మే. అదే పరమాత్మ కూడా.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్పష్ట ()
Telugu original

స్పష్ట : చూడబడినది అని అసలైన అర్థం. Spectrum అనే లాటిన్‌మాటకు ఇది సంస్కృత శబ్దం. చూడబడిన దెప్పుడూ విన్నదానికంటే స్ఫుటంగా మనసుకు వస్తుంది కాబట్టి స్పష్టమంటే నిస్సందేహంగా తెలిసిపోయినదనే అర్థమేర్పడింది. అలాంటి స్పష్టమయిన పదార్థం మన స్వరూపమే. నేననే స్ఫురణే. అది నాపాటికి నాకే తెలిసిపోతున్నది. దానికి భిన్నంగా ఇక ఏది చెప్పినా స్పష్టమని పేరేగాని అందులో కొంత స్పష్టమైతే కొంత ఎప్పటికీ అస్పష్టంగానే మిగిలి పోతుంటుంది.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్ఫోట ()
Telugu original

స్ఫోట : పగిలిపోవటమని అర్థం. మనసులోని ఆలోచన ఏర్పడక ముందు కేవలం నిరాకారమైన జ్ఞానమే ఉంటుంది. అదే ఆలోచనగా ఎప్పుడు పైకి వచ్చిందో అప్పుడే అది విరిగి ఆలోచన అయింది. ఈ విరగటానికే Break స్ఫోటమని పేరు. అది మరలా స్వరపేటిక ద్వారా శబ్దరూపంగా భగ్నమై బయటపడితే అది మరలా ఒక స్ఫోట. మొదటిది అనాహత రూపమైన శబ్దమైతే రెండవది ఆహతరూపం. Audible. అనాహతమే శబ్ద బ్రహ్మమని పేర్కొంటారు వైయాకరణులు. మీమాంసకులు. ఆ శబ్ద పరిధిని కూడా దాటి నిశ్శబ్దమైన చైతన్యస్వరూపమేది ఉందో అదే బ్రహ్మమని పేర్కొంటారు వేదాంతులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్తోభ ()
Telugu original

స్తోభ : వ్యర్థమైన మాట. ఇలాంటి మాటలు సూత్రంలోకాని మంత్రంలో కాని దొరలకూడదు. మంత్రమైతే అది వైదికం కాబట్టి దోషం చూపరాదు. సూత్రం పౌరుషేయం గనుక ప్రయత్నపూర్వకంగా స్తోభాక్షరాలు రాకుండా నివారించుకొన వలసి ఉంటుంది. 'అస్తోభమనవద్యంచ సూత్రం సూత్రవిదో విదుః' అని పెద్దల శాసనం.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్థిర/స్థావర ()
Telugu original

స్థిర/స్థావర : గట్టిగా నిలబడేది. చలనం లేనిది. బాహ్యంగానే కాదు. ఆంతర్యంలో మన మనస్సుకూడా పరిపరివిధాల చెదిరిపోకుండా నిలకడగా ఉండాలి. అప్పుడే అది ఒక లక్ష్యాన్ని గట్టిగా పట్టుకోగలదు. స్థిరానికి వ్యతిరిక్తం చరం. అలాగే స్థావరమన్నా స్థిరంగా ఒకచోట కలదకుండా ఉండేదని అర్థం. చెట్లు చేమలు ఇలాంటివే. దీనికి భిన్నమైనది జంగమం. ఎప్పుడూ కదులుతూ పోయేదని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్థితప్రజ్ఞ ()
Telugu original

స్థితప్రజ్ఞ : స్థితప్రజ్ఞుడంటే ఆత్మజ్ఞాని. జీవన్ముక్తుడు. అలాంటివాడి ప్రజ్ఞ అంటే జ్ఞానం ఎప్పుడూ స్థితంగానే ఉంటుంది. అంటే చలించకుండా నిలిచి ఉంటుంది. చలనానికి కారణం అనాత్మ ప్రపంచమే. అది అతని కెప్పుడూ దర్శనమివ్వదు కాబట్టి అతడు గత ప్రజ్ఞుడు కాడు. స్థితప్రజ్ఞుడే.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్థితిస్థాపన ()
Telugu original

స్థితిస్థాపన : ఒక కొమ్మను వంచి మరలా వదిలేస్తే అది మొదట ఎక్కడ ఉందో కొంతసేపటికి అక్కడికే పోయి చేరుతుంది. స్థితమైన చోటనే మరలా దానిని స్థాపించినట్టు అవుతుంది. కొమ్మలాంటిదే మానవుడి మనస్సు కూడా. ఇది చైతన్య రూపంగా మొదటి నుంచి ఉన్నప్పటికీ మధ్యలో ఇటూ అటూ చెదరిపోతుంది. దీనికే విక్షేపమని పేరు. మరలా సాధన బలంతో దాన్ని అసలైన ఆత్మ చైతన్యంలోకే అదిమివేసి అక్కడే నిలపవలసి ఉంటుంది సాధకుడు. 'ఆత్మ సంస్థం మనః కృత్వా' అని గీతోపదేశం.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్థూల శరీర ()
Telugu original

స్థూల శరీర : మన ఇంద్రియాలకు ప్రత్యక్షంగా గోచరించే ఈ కరచరణాది అవయవాలతో కూడిన శరీరానికి స్థూల శరీరమని Gross body పేరు. ఇది బాహ్య ప్రపంచంతో జీవుడు వ్యవహరించటానికి ఏర్పడిన అధిష్ఠానం. Support. కర్మ అనే మూడవ పాపానికి ఇది ఆశ్రయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సూక్ష్మశరీర ()
Telugu original

సూక్ష్మశరీర : లింగ శరీరమని కూడా దీనికే నామాంతరం. Subtle body. మనస్సు ప్రాణం. ఈ రెండూ చలనాత్మకమైనా బాహ్యంగా మనకు మన ఇంద్రియాలకు ప్రత్యక్షమయ్యేవి కావు. పరోక్షమే. కనుకనే వీటికి సూక్ష్మశరీరమని పేరు వచ్చింది. లీనం గమయతి. గుప్తమైన ఆత్మతత్త్వాన్ని ఇవి ప్రకటన చేసి చూపుతాయి కాబట్టి లింగ శరీరమని పేరు వచ్చింది. కామమనే రెండవ పాపానికి ఇది నిలయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సౌమ్య/సోమ్య ()
Telugu original

సౌమ్య/సోమ్య : మంచివాడని అర్థం. గురువు శిష్యుణ్ణి సంబోధించేటప్పుడు శాస్త్రంలో సోమ్య అని సంబోధించటం తరచుగా చూస్తుంటాము. వత్సా అని అర్థం. My dear lad.

Vedānta Paribhāṣā Vivaraṇa
సుకర/సౌకర్య ()
Telugu original

సుకర/సౌకర్య : 'సుఖేన కర్తుం శక్యతే ఇతి.' ఏది సులభంగా చేయగలమో అది సుకరం. దాని భావం. సౌకర్యం. Facillity. ప్రతిపత్తి సౌకర్యమని ఒక మాట ఉంది శాస్త్రంలో శాస్త్రం ఒక రహస్యాన్ని బోధించినప్పుడు అది సూటిగా మన మనస్సు పట్టుకోలేదు. ఇలాంటి ఇబ్బంది కనిపెట్టి పెద్దలు కథలు, గాథలు వీటిమీద నెపం పెట్టి వాటిద్వారా మనకాసత్యాన్ని బోధిస్తారు. దీనికి ప్రతిపత్తి సౌకర్యమని పేరు. అంటే అర్థం చేసుకోవటంలో సౌలభ్యమని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సూత్ర ()
Telugu original

సూత్ర : సూత్రమంటే గ్రుచ్చటానికి తోడ్పడే దారమని అర్థం. కొన్ని భావాలను కలిపి సంగ్రహంగా చెప్పే వాక్యానికి సూత్రమని పేరు. ధర్మసూత్రాలు బ్రహ్మసూత్రాలు ఇలాంటివే. ఇది అల్పాక్షరం. అసందిగ్ధం. సారవంతం. సర్వతో ముఖం. సార్థకం. నిర్దోషం అయి ఉండాలి. అప్పుడే మనస్సుకు బాగా పడుతుంది. సూత్రమంటే అవ్యక్తమైన మాయాశక్తి అని కూడా అర్థం చెబుతారు వేదాంతులు. సూత్రాన్ని మించినది అక్షరం. అది పరమాత్మ స్వరూపమే. సూత్రాత్మ అంటే అవ్యాకృతమైన ప్రపంచానికి అధిపతియైన హిరణ్యగర్భుడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
సుహృత్‌భూత్వా ()
Telugu original

సుహృత్‌భూత్వా : అద్వైతంలో ఇది ఒక పారిభాషిక పదం. భాష్యకారులు అక్కడక్కడ ప్రయోగిస్తుంటారు. సుహృత్‌అంటే ఆప్తుడు. Well wisher అని అర్థం. భూత్వా అంటే అలాంటివాడయి అని అర్థం. సూత్రకారుడైన బాదరాయణ మహర్షి సిద్ధాంతం చేసి సాధనకు మనం కష్టపడుఉంటే అందులోని రహస్యం మనకు దగ్గరగా వచ్చి బోధించే సందర్భంలో ఇలాంటి మాట వస్తుంది. సాధకులకు మాత్రమే సహాయం చేయటానికి సిద్ధాంతం నూటికి నూరుపాళ్ళు పాటించనక్కర లేకుండా ఆచరణాత్మకంగా దాన్ని మార్చుకోవచ్చునని అందులోని సౌలభ్యాన్ని మనకు విప్పి చెబుతాడు సూత్రకారుడు. మనమీద అలాంటి సౌజన్యం ఉండటంవల్లనే మనకు ఆ మార్గంలో సహాయ పడతాడని భాష్యకారుల మాట.

Vedānta Paribhāṣā Vivaraṇa
సిద్ధాంత/సాధన/సిద్ధి ()
Telugu original

సిద్ధాంత/సాధన/సిద్ధి : ఏ శాస్త్రమైనా ఈ మూడు నియమాలు పాటించి తీరవలసిందే. ఇందులో సిద్ధాంతమంటే అది ప్రతిపాదించే విషయం. అందులో ఎలాంటి చచ్చు ఉండకూడదు. నూటికి నూరుపాళ్ళు మనకు నిశ్చయం ఏర్పడాలి. తరువాత దానిని ఆచరణలో పెట్టే మార్గమేదో అది కూడా శాస్త్రం బయటపెట్టాలి. దానికే సాధనమని Process. Practice పేరు. అమలు పరచటమని అర్థం. అలా సాధిస్తూ పోతే చివరకు మనకు లభించే ఫలితమేమిటని ప్రశ్న వస్తుంది. అలాంటి ఫలప్రాప్తికే సిద్ధి అని The result. The consequence పేరు. వేదాంతంలో సిద్ధాంతమనేది ఏకాత్మభావం. The subjective unity of all the creation. సాధనం దానికి సంబంధించిన అఖండాకార వృత్తి. ఇది మానసికమే గాని బాహ్యం కాదు అద్వైతంలో. ఇలాంటి వృత్తిని నిరంతరం ఆవృత్తి చేయటమే అద్వైత సాధన. చివరకు అది పరిపాకానికి వచ్చి ఫలరూపమైన మోక్షమే సాధకుడు పొందగలిగితే అది సిద్ధి.

Vedānta Paribhāṣā Vivaraṇa
సృష్టి/ప్రతిసృష్టి ()
Telugu original

సృష్టి/ప్రతిసృష్టి : సర్గ, ప్రతిసర్గలన్న మాటలకు ఇవి పర్యాయపదాలు.

Vedānta Paribhāṣā Vivaraṇa
సత్కార్యవాద ()
Telugu original

సత్కార్యవాద : ప్రపంచ సృష్టిని గురించి వర్ణించేటపుడు ముగ్గురు మూడు వాదాలు లేవదీశారు. మొదటిది అసత్కార్యవాదం. దీనికే ఆరంభవాదమని కూడా పేరు. ఈ ప్రపంచం సృష్టికి పూర్వం అసత్‌లేదు. తరువాతనే ఇది ఏర్పడింది అంటారు. పోతే రెండవవారు సత్కార్యవాదులు. ఇంతకుముందు లేనిది కాదీ కార్యప్రపంచం. అప్పుడూ ఉన్నదే. కార్యరూపంగా కాకపోయినా కారణరూపంగా ఉండనే ఉంది. అదే కార్యరూపంగా బయటపడి కనిపిస్తున్నది అంటారు వీరు. దీనికే సత్కార్యవాదమని పేరు. పరిణామ వాదమని కూడా దీనికి నామాంతరం. ఇది కూడా కాదు వివర్త వాదమని వర్ణిస్తారు మూడవవారు. వారే అద్వైత వేదాంతులు. సత్కార్య వాదమనేది కాదని చెప్పరు. కానీ దాని పరిణామాన్ని మాత్రం త్రోసిపుచ్చుతారు. కారణం ఎలాంటి పరిణామమూ చెందకుండానే మరో మలుపు తిరిగి కార్యరూపంగా భాసిస్తున్నదని వీరి వాదం.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్యాద్వాద ()
Telugu original

స్యాద్వాద : స్యాత్‌అంటే అలా ఉండనీ. ఒకవేళ మీరు చెప్పినది సరేనని ఒప్పుకున్నప్పటికీ అది చెల్లదనే సందర్భంలో పేర్కొనే మాట ఇది.

Vedānta Paribhāṣā Vivaraṇa
సమరస/సామరస్య ()
Telugu original

సమరస/సామరస్య : రసమంటే భావం. ఒకేభావం రెండింటికీ కనిపిస్తే వాటికి సమరసమని పేరు. Similar quality. వాటికి సంబంధించిన భావానికి సామరస్యమని పేరు. Homogeneity. శివశక్తులకు సామరస్యం స్వభావ సిద్ధమని పేర్కొంటారు తాంత్రికులు. అంటే అవి ఒకదానిని విడిచి మరొకటి ఉండదని భావం. శబ్దార్ధాలకున్న సంబంధం ఇలాంటిదే. చివరకు శబ్దం విమర్శ రూపిణి అయిన శక్తి అయితే అర్థం ప్రకాశ రూపమైన శివతత్త్వమే. రెండింటికీ ఉన్న అవినాభావ సంబంధమే సామరస్యం.

Vedānta Paribhāṣā Vivaraṇa
స్వయంభూః ()
Telugu original

స్వయంభూః : స్వయం భవతి. తనపాటికి తాను స్వతంత్రంగా ఉన్న పదార్థం. ఆత్మతత్త్వం. ఆత్మ భూః అని కూడా దీనికి పర్యాయపదం.

Vedānta Paribhāṣā Vivaraṇa
సౌత్రాంత్రిక ()
Telugu original

సౌత్రాంత్రిక : బౌద్ధమతంలో మరి ఒక శాఖ ఇది. వైభాషికులతో వీరు చాలావరకు ఏకీభవిస్తారు. అయితే వారు పదార్థాలన్నీ ప్రత్యక్ష ప్రమాణం చేతనే సిద్ధమయి ఉన్నాయంటే వీరలా కాక అవి అనుమాన ప్రమాణ సిద్ధమని వాదిస్తారు. ఇదే వీరిరువురికీ ఉన్న తేడా.

Vedānta Paribhāṣā Vivaraṇa
సహోపలంభ ()
Telugu original

సహోపలంభ : రెండింటినీ కలిపి పట్టుకోవటం. జ్ఞేయంతో పాటు దాని జ్ఞానం జ్ఞానంతో పాటు దాని జ్ఞేయం రెండూ ఏకకాలంలో అనుభవానికి రావాలనే అభిప్రాయం.

Vedānta Paribhāṣā Vivaraṇa
హాన/ఉపాదాన ()
Telugu original

హాన/ఉపాదాన : వదిలేయటమని, పట్టుకోవటమని అర్థం వీటికి. ప్రపంచంలో వదిలేయ వలసినది అనర్థం. దానికి ప్రతిగా పట్టుకునేది ఉపాదానం. సుఖాన్ని పట్టుకుంటూ దుఃఖాన్ని వదిలేస్తాడు మానవుడు. హానోపాదానాలు అంటే ఇవే.

Vedānta Paribhāṣā Vivaraṇa
హేయ/ఉపాదేయ ()
Telugu original

హేయ/ఉపాదేయ : కాని ఆత్మవిషయంలో ఇలాంటి హానోపాదానాల కవకాశం లేదు. ఎందుచేతనంటే సర్వవ్యాపకం కాబట్టి అది ఉపాదేయం కాదు. దగ్గరకు తీసుకునేది కాదని అర్థం. మన స్వరూపమే కాబట్టి హేయం కాదు. త్రోసిపుచ్చేది కాదని భావం. కనుకనే ఆత్మ అంటే అహేయం. అనుపాదేయం అని వర్ణిస్తారు వేదాంతులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
హేతు ()
Telugu original

హేతు : కారణమని అర్థం Cause. హేతువాదమంటే కార్యకారణ సంబంధం చూపుతూ ప్రతివాదితో వాదించటం. Argumentation. అప్పుడే ఒక సత్యాన్ని నిరూపించగలం.

Vedānta Paribhāṣā Vivaraṇa
హేత్వాభాస ()
Telugu original

హేత్వాభాస : హేతువులాగ పైకి కనపడేది. లోతుకు దిగిచూస్తే ప్రతివాది చూపిన హేతువు తేలిపోతుంది. ఇలాంటి దానికి హేత్వాభాస False reasoning అని పేరు.

Vedānta Paribhāṣā Vivaraṇa
హేతు/హేతుమత్‌ ()
Telugu original

హేతు/హేతుమత్‌: హేతువు. అలాంటి హేతువు కలిగిన దానికీ ఉండే పరస్పర సంబంధం. కార్యకారణ సంబంధం అనే మాటకిది పర్యాయపదం. Cause and effect relationship.

Vedānta Paribhāṣā Vivaraṇa
హోమ ()
Telugu original

హోమ : అగ్నిహోత్రంలో ఆహుతి చేయటం. దేవతలను మంత్ర పూర్వకంగా ఆహ్వానించటమని అసలైన అర్థం. కనుకనే ఆహుతి, ఆహావ అనే రూపాలు ఏర్పడ్డాయి. ఆహుతి అంటే ఆహూతి అనే దాని రూపాంతరమే. హ కారమే స కారంగా మారటం మూలాన హోమమనే దానికి సోమమనే మరొక పర్యాయ పదం కనిపిస్తుంది. స కార హ కారాల విపరిణామమిది.

Vedānta Paribhāṣā Vivaraṇa
హరణ/హృత ()
Telugu original

హరణ/హృత : తీసుకుపోవటం. ప్రక్కకు తప్పించటం. అలా తప్పింపబడినది హృతం. అజ్ఞానమనేది ఆత్మస్వరూపాన్ని అలాగే హరించింది. దానిచేత మన స్వరూపం హృతమైంది కనుకనే ఉన్నదున్నట్టు పట్టుకోలేకపోతున్నాడు మానవుడు. అజ్ఞానేన అపహృతం జ్ఞానం అని శాస్త్రం చాటిచెపుతున్నది. హరించేది కనుకనే మాయాశక్తికి హ్రీ అనే పేరు పెట్టారు పెద్దలు. దానికి మారుగా శ్రీ అని మరొక నామం కూడా ఉంది మాయాశక్తికి. ఆత్మను శ్రయించేది అంటే అంటి పట్టుకునేది కనుక శ్రీ. మొదటిది అవిద్యారూపమైతే రెండవది విద్యారూపం.

Vedānta Paribhāṣā Vivaraṇa
హృత్‌/హృదయ ()
Telugu original

హృత్‌/హృదయ : రెండింటికీ హృదయమనే Heart అర్థం. శరీరంలో ఎడమవైపు పుండరీక ఆకారంగా ఉన్న భాగం. కానీ హృదయానికీ బుద్ధికీ తేడా లేకుండా రెండింటినీ ఏకంచేసి పేర్కొంటారు వేదాంతులు. దానికి కారణం రెండింటినీ కలుపుతూ ఒకే ఒక సిర కపాలం వరకూ ప్రసరిస్తూ ఉండటమే. తద్ద్వారా రక్తం పైకి వెళ్ళిపోయి దాని బలంతో బుద్ధి పనిచేస్తుంది. కనుక రెండింటికి ఉన్న ఈ అవినాభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఏకంగా వర్ణించటం జరిగింది. హృది అయం అని చమత్కారంగా మరొక అర్థాన్ని చెప్పాయి ఉపనిషత్తులు. హృది అంటే హృదయంలో అయం అంటే ఆ పరమాత్మ జీవరూపంగా వచ్చి కూచున్నాడు. అందుకే హృదయం అనే పేరు సార్థకమయిందని చెబుతారు ఉపనిషదృషులు.

Vedānta Paribhāṣā Vivaraṇa
హిరణ్యగర్భ ()
Telugu original

హిరణ్యగర్భ : హిరణ్యమంటే బంగారమని వాచ్యార్థం. బంగారమంటే ఇక్కడ భౌతికమైన లోహమని కాదు. లాక్షణికంగా చెబితే బంగారం జ్ఞానప్రకాశమే. అది గర్భంలో గుప్తం చేసుకున్న వ్యక్తి ఎవడో అతడు హిరణ్యగర్భుడు. కార్యబ్రహ్మమని అర్థం. అంటే పరమాత్మే సగుణ రూపంగా హిరణ్యగర్భుడయ్యాడు. గుణాలు ఆవరించినా అందులో హిరణ్యం అంటే బంగారులాగా ప్రకాశించే చైతన్యం తొంగి చూస్తూనే ఉంది. కనుకనే హిరణ్యగర్భుడనే పేరు వచ్చింది.

Vedānta Paribhāṣā Vivaraṇa
హవన ()
Telugu original

హవన : అగ్నిహోత్రంలో హోమం చేయటానికి పేరు. ఇది భౌతికం కావచ్చు. ఆధ్యాత్మికమూ కావచ్చు. మొదటిది బహిర్యాగమైతే రెండవది అంతర్యాగం. Spiritual sacrifice. అగ్నిహోత్ర మిక్కడ ఆత్మచైతన్యమే. హవనం చేయవలసినది ఆజ్యమూ దధి ఇలాంటివి కావు. మానసికమైన వాసనలు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః అని గీతా శ్లోకం.

Vedānta Paribhāṣā Vivaraṇa
క్షేమ ()
Telugu original

క్షేమ : యోగక్షేమాలని జంట పదాలు. 'అలబ్ధస్య లాభః యోగః.' మనకు లేనిది ప్రాప్తించటం యోగం. 'లబ్ధస్య పాలనం క్షేమం.' అలా ప్రాప్తించినది మరలా తొలగిపోకుండా నిలిచి ఉండటం క్షేమం. ఇవే మానవుడు కోరే పదార్థాలు. మనం కోరినా లభించక పోవచ్చు. నిరంతరం అనన్య భక్తితో పరమాత్మను సేవిస్తే 'యోగక్షేమం వహామ్యహం' అని ఆయనే మనకు హామీ ఇవ్వగలడు. ఇదే గీత మనకిచ్చే గొప్ప సలహా.

Vedānta Paribhāṣā Vivaraṇa
క్షేప ()
Telugu original

క్షేప : త్రోసిపుచ్చటం. కాలం గడపటం. Passing time. ప్రారబ్ధం తీరే వరకు ఉపాధి నిలిచి ఉండడానికి క్షేపమని పేరుపెట్టారు. అంతవరకే దానికి అవధి. Limit అని అర్థం. 'తస్య తావదేవ చిరం' అనేచోట చిరమంటే క్షేపమని అర్థం వ్రాశారు భాష్యకారులు. అంటే ప్రారబ్ధం తీరేవరకు అని భావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
క్షోభ ()
Telugu original

క్షోభ : కలతపడటం. చెదరిపోవటం. త్రిగుణాలు సామ్యావస్థలో ఉంటే సృష్టి జరగదు. అవే క్షోభ చెందితే గుణవైషమ్యమేర్పడి సృష్టి జరుగుతుంది. ఈ మాట సాంఖ్యులు చెబితే వైశేషికులు క్షోభకు మరొక అర్థం చెబుతారు. వీరు త్రిగుణాలంటే వారు పరమాణువులు అలా క్షోభ చెందుతాయని వర్ణిస్తారు. Upheaval.

Vedānta Paribhāṣā Vivaraṇa
క్షుద్ర ()
Telugu original

క్షుద్ర : నీచమని గాక అల్పమని కూడా అర్థమే. క్షుద్ర బ్రహ్మాండమంటే బ్రహ్మాండం తాలూకు స్వల్పమైన ప్రపంచం. Micro cosm. పిండాండమని అర్థం. జరాయుజాది శరీరాలు.

Vedānta Paribhāṣā Vivaraṇa
క్షమా/క్షాంతి ()
Telugu original

క్షమా/క్షాంతి : సహనమని అర్థం. దైవగుణాలలో ఇది కూడా చేరుతుంది. తితిక్ష అని దీనికి మరొక పేరుకూడా పెట్టవచ్చు Endurance.

Vedānta Paribhāṣā Vivaraṇa
క్షయ ()
Telugu original

క్షయ : నశించటం. తగ్గిపోవటం. దీనికి భిన్నంగా ఎప్పటికీ నశించనిదైతే అది అక్షయం. క్షయం ప్రపంచ స్వభావమైతే అక్షయం ఆత్మ స్వభావం.

Vedānta Paribhāṣā Vivaraṇa
క్షురధానీ ()
Telugu original

క్షురధానీ : క్షురమనగా కత్తులు కటారులు. అవి ఎందులో ఉంచుతారో అది క్షురధానీ. మంగలి పొది. ఆత్మస్వరూపాన్ని దీనితో పోల్చింది బృహదారణ్యకం. అనాత్మ సామగ్రి అంతా ఆత్మలోనే తలదాచుకుంటున్నది. దాని సరిహద్దు మించి పోలేదు. అది ఎలాగంటే ఒక క్షురధానిలో క్షురమూ మొదలైన పరికరాలు ఎలా గుప్తంగా ఉంటాయో అలాగేనని వర్ణన.

Vedānta Paribhāṣā Vivaraṇa
క్షురస్య ధారా ()
Telugu original

క్షురస్య ధారా : క్షురమంటే పైన చెప్పినట్టు మంగలి కత్తి. దాని పదును లేదా అంచుకు ధార అని పేరు. సాధనమార్గం అలాంటిదట. కత్తి వాదరమీద నడవటం ఎంత కష్టమో అంత కష్టసాధ్యమని అర్థం. సాధారణంగా నూటికి 99 మందికి అసాధ్యమైతే కావచ్చు కానీ అలంటి అసాధ్యమైన దాని సూక్ష్మం తెలిసినవానికి ఎప్పుడూ సాధ్యమే. 'దృశ్యతే త్వగ్య్రయా బుద్ధ్యా సూక్ష్మయా' అన్నది కఠోపనిషత్తు. బుద్ధికి బాగా పదునుపెట్టే కొద్దీ సూక్ష్మాతి సూక్ష్మమై ప్రకాశిస్తుంది. అలాంటి బుద్ధి బలంతో ఎంత విషయమైనా అసాధ్యమైనా మోక్షసాధన మార్గంలో పయనించగలడు సాధకుడు. పొందగలడు అభీష్టమైన మోక్షఫలం.

Vedānta Paribhāṣā Vivaraṇa
క్షేత్ర ()
Telugu original

క్షేత్ర : పొలం. Farm. Field. పొలం లాంటిదే మన శరీరం కూడా. ఇక్కడా కర్మ జ్ఞాన బీజాలు నాటుతాము. వాటి ఫలం మరలా ఇక్కడే అనుభవిస్తాము. కనుక అసలైన క్షేత్రమీ మానవ శరీరమే నన్నారు వేదాంతులు Human body.

Vedānta Paribhāṣā Vivaraṇa
క్షేత్రజ్ఞ ()
Telugu original

క్షేత్రజ్ఞ : క్షేత్రం జానాతీతి. స్వాభావికమైన ఔపదేశికమైన జ్ఞానంతో ఈ శరీరమనే క్షేత్రాన్ని ఎవడు తనకు విషయంగా Object చూస్తుంటాడో వాడు క్షేత్రజ్ఞుడు. The knower of the body. జీవుడని అర్థం. జీవన్ముక్తుడు కూడా చూస్తాడు దీన్ని. అయితే జీవుడి లాగా కాదు. జీవుడు తానేనని, తనదేనని చూస్తే, జీవన్ముక్తుడు పాము తన కుబుసాన్ని చూచినట్టు తనకు దూరంగా చూస్తాడు.

Vedānta Paribhāṣā Vivaraṇa
క్షత/క్షత్త్ర ()
Telugu original

క్షత/క్షత్త్ర : క్షతమంటే దెబ్బ. కష్టమని కూడా అర్థం. అలాంటి అనర్ధాన్నుంచి ఏది కాపాడుతుందో అది క్షత్త్ర. క్షత్త్రియ జాతి అని అర్థం. ప్రజలను ఆపదల నుండి కాపాడుతున్న వాడు గనుకనే క్షత్ర అని క్షత్రియుడని పేరు వచ్చింది. 'క్షతాత్‌త్రాయతే ఇతి.' వేదాంతంలో క్షత్ర శబ్దాన్ని పారిభాషికంగా ప్రయోగించటం కూడా చూస్తాము. 'యస్య బ్రహ్మచ క్షత్రంచ ఉభే భవత ఓదనః' ఎవరికైతే బ్రాహ్మణుడు క్షత్రియుడు ఇద్దరూ ఓదనం అంటే ఆహారం అవుతారో అలాంటి ఆత్మ అని అర్థ మీవాక్యానికి. ఆత్మకు ఆ ఇద్దరూ ఆహారం కావటమేమిటి. బాహ్యార్థం చెబితే చెల్లదు. అంతరార్థమే చెప్పాలి. ఇక్కడ బ్రాహ్మణుడంటే మనస్సు. క్షత్రియుడంటే ప్రాణం. ఇవి రెండూ జీవుడి ఉపాధులు. ఈ ఉపాధులు లయమయితే అదే ఆత్మ స్వరూపం. క్షత్ర అనే మాటకిక్కడ ప్రాణమనే అర్థం చెప్పుకోవలసి ఉంటుంది. అది కూడా శరీరానికి దెబ్బ తగలకుండా కాపాడుతూనే ఉంటుంది. సుషుప్తిలో ఇది మనకు చక్కగా తార్కాణమవుతుంది. అప్పుడు ఈ శరీరం పడిపోకుండా దెబ్బ తినకుండా ఉచ్ఛ్వాస నిశ్శ్వాస రూపంగా రాకపోకలు చేస్తూ కాపలా కాస్తున్నది ప్రాణమేగదా.

Vedānta Paribhāṣā Vivaraṇa
🔊